న్యూజిలాండ్ క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. 36 ఏళ్ల తర్వాత భారత గడ్డపై తొలి టెస్టు విజయాన్ని కివీస్ నమోదు చేసింది. బెంగళూరు వేదికగా టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకున్న న్యూజిలాండ్ తమ సుదీర్ఘ నిరీక్షణకు తెరదించింది.
కివీస్ చివరగా 1988లో వాంఖడే వేదికగా జరిగిన భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో గెలుపొందింది. మళ్లీ ఇప్పుడు చారిత్రత్మక విజయాన్ని నమోదు చేసింది. మొత్తంగా భారత్‌లో కివీస్‌కు ఇది కేవలం మూడు టెస్టు విజయం మాత్రమే.
కివీస్ ఆల్‌రౌండ్ షో..
ఇక ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ అద్బుతమైన ప్రదర్శన కబనరిచింది. అటు బౌలింగ్‌లోనూ, ఇటు బ్యాటింగ్‌లోనూ దుమ్ములేపింది. 107 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని బ్లాక్ క్యాప్స్ కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. కివీ బ్యాటర్లు విల్ యంగ్(48), రచిన్ రవీంద్ర (39) ఆజేయంగా నిలిచి మ్యాచ్‌ను ఫినిష్ చేశారు. అంతకుముందు న్యూజిలాండ్ బౌలర్లు భారత్‌ను తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 46 పరుగులకే కుప్పకూల్చారు.
కివీ బౌలర్లలో మాట్ హెన్రీ 5 వికెట్లు పడగొట్టగా, యువ పేసర్ ఓ రూర్క్ 4 వికెట్లతో మెరిశాడు. అయితే సెకెండ్ ఇన్నింగ్స్‌లో మాత్రం భారత బ్యాటర్లు అద్బుతమైన కమ్ బ్యాక్ ఇచ్చారు. సర్ఫరాజ్ ఖాన్(150) సెంచరీతో చెలరేగగా, పంత్(99) అదరగొట్టాడు. దీంతో టీమిండియా 462 పరుగుల భారీ స్కోర్ చేసింది.
అయితే 356 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ఆడటంతో భారత్ ప్రత్యర్ధి ముందు కేవలం 107 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే ఉంచగల్గింది. కివీస్ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 402 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో రచిన్ రవీంద్ర(134) సెంచరీతో మెరిశాడు. రెండో ఇన్నింగ్స్‌లోనూ రవీంద్ర(39 నాటౌట్) అదరగొట్టాడు.
Comments
Please login to add a commentAdd a comment