test cricket match
-
కివీస్‌తో రెండో టెస్ట్.. నెట్స్‌లో చెమటోడుస్తున్న టీమిండియా క్రికెటర్లు (ఫొటోలు)
-
IND Vs NZ 1st Test: చరిత్ర సృష్టించిన న్యూజిలాండ్.. 36 ఏళ్ల నిరీక్షణకు తెర
న్యూజిలాండ్ క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. 36 ఏళ్ల తర్వాత భారత గడ్డపై తొలి టెస్టు విజయాన్ని కివీస్ నమోదు చేసింది. బెంగళూరు వేదికగా టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకున్న న్యూజిలాండ్ తమ సుదీర్ఘ నిరీక్షణకు తెరదించింది.కివీస్ చివరగా 1988లో వాంఖడే వేదికగా జరిగిన భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో గెలుపొందింది. మళ్లీ ఇప్పుడు చారిత్రత్మక విజయాన్ని నమోదు చేసింది. మొత్తంగా భారత్‌లో కివీస్‌కు ఇది కేవలం మూడు టెస్టు విజయం మాత్రమే.కివీస్ ఆల్‌రౌండ్ షో..ఇక ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ అద్బుతమైన ప్రదర్శన కబనరిచింది. అటు బౌలింగ్‌లోనూ, ఇటు బ్యాటింగ్‌లోనూ దుమ్ములేపింది. 107 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని బ్లాక్ క్యాప్స్ కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. కివీ బ్యాటర్లు విల్ యంగ్(48), రచిన్ రవీంద్ర (39) ఆజేయంగా నిలిచి మ్యాచ్‌ను ఫినిష్ చేశారు. అంతకుముందు న్యూజిలాండ్ బౌలర్లు భారత్‌ను తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 46 పరుగులకే కుప్పకూల్చారు. కివీ బౌలర్లలో మాట్ హెన్రీ 5 వికెట్లు పడగొట్టగా, యువ పేసర్ ఓ రూర్క్ 4 వికెట్లతో మెరిశాడు. అయితే సెకెండ్ ఇన్నింగ్స్‌లో మాత్రం భారత బ్యాటర్లు అద్బుతమైన కమ్ బ్యాక్ ఇచ్చారు. సర్ఫరాజ్ ఖాన్(150) సెంచరీతో చెలరేగగా, పంత్(99) అదరగొట్టాడు. దీంతో టీమిండియా 462 పరుగుల భారీ స్కోర్ చేసింది. అయితే 356 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ఆడటంతో భారత్ ప్రత్యర్ధి ముందు కేవలం 107 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే ఉంచగల్గింది. కివీస్ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 402 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో రచిన్ రవీంద్ర(134) సెంచరీతో మెరిశాడు. రెండో ఇన్నింగ్స్‌లోనూ రవీంద్ర(39 నాటౌట్) అదరగొట్టాడు. -
టాలెంట్‌కు కొదవ లేదు.. పాక్‌ను నెం1 జట్టుగా నిలుపుతా: జాసన్ గిల్లెస్పీ
ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్ బౌలర్ జాసన్ గిల్లెస్పీ పాకిస్తాన్ టెస్టు జట్టు హెడ్‌కోచ్‌గా ఆదివారం బాధ్యతలు చేపట్టాడు. ఈ క్రమంలో లహోర్‌లోని హైఫెర్మమెన్స్ సెంటర్లో ఏర్పాటు చేసిన మీడియాలో సమవేశంలో గిల్లెస్పీ పాల్గోనున్నాడు.ఈ సందర్భంగా గిల్లెస్సీ మాట్లాడుతూ.. పాకిస్తాన్‌ను రెడ్‌బాల్ క్రికెట్లో నెం1 జట్టుగా తీర్చేందుకు ప్రయత్నిస్తాని చెప్పుకొచ్చాడు. వచ్చే నెలలో పాకిస్తాన్ క్రికెట్ జట్టు స్వదేశంలో బంగ్లాదేశ్‌తో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తలపడనుంది. ఈ సిరీస్‌తోనే పాక్ టెస్టు జట్టు హెడ్‌కోచ్‌గా గిల్లెస్పీ ప్రయాణం మొదలు కానుంది. ఆ తర్వాత పాక్ స్వదేశంలోనే ఇంగ్లండ్‌తో కూడా టెస్టు సిరీస్ ఆడనుంది."పాకిస్తాన్ జట్టులో అద్బుతమైన ఆటగాళ్లు ఉన్నారు. నిజంగా ఈ జట్టు చాలా టాలెంటడ్. కానీ జట్టు ప్రదర్శనలో నిలకడలేదు. ఒక మ్యాచ్ బాగా ఆడితే మరో మ్యాచ్‌లో డీలా పడడం పరిపాటిగా మారింది. వారిని తిరిగి గాడిలో పెట్టడమే నా పని. అందుకు తగ్గట్టుగానే నేను పనిచేస్తాను. ప్రస్తుత ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ సైకిల్లో పాకిస్థాన్ ఐదవ స్దానంలో ఉంది. రాబోయో సిరీస్‌లలో విజయం సాధించి మా ర్యాంక్‌ను మెరుగుపరుచుకునేందుకు ప్రయత్నిస్తాము. మేము మా తదుపరి సిరీస్‌లో బంగ్లాదేశ్‌తో ఆడనున్నాం. ప్రస్తుతం నా దృష్టి అంతా ఈ సిరీస్‌పైనే ఉంది. ఫ్యూచర్ కోసం ఇప్పటినుంచి నేను ఆలోచించను. ముఖ్యంగా పాక్ జట్టులో కొన్ని విషయాలను గమనించాను. పాక్ తొలుత అద్భుతంగా రాణించి ఆఖరిలో బోల్తా పడటం చాలా మ్యాచ్‌ల్లో చూశాను. బంగ్లాదేశ్ సిరీస్ తర్వాత ఇంగ్లండ్‌తో ఆడనున్నాం. కచ్చితంగా ఇంగ్లండ్ నుంచి మాకు తీవ్ర పోటీ ఎదురుకానుంది. నిజంగా మాకు అదొక ఛాలెంజ్. అందుకు తగ్గట్టు మేము కూడా సిద్దంగా ఉన్నాము. ఆఖరిగా పాక్‌ను నెం1 జట్టుగా నిలపడమే నా లక్ష్యమని" గిల్లెస్పీ విలేకరుల సమావేశంలో పేర్కొన్నాడు. -
భారత మహిళా క్రికెటర్లా మజాకా!..జూలు విదిల్చిన శివంగులు (ఫొటోలు)
-
50 ఏళ్ల తర్వాత ఓవల్‌లో అద్భుత విజయం సాధించిన టీమ్ఇండియా
-
వీరాభిమాని నం.1
గాలే: ‘మరి కొద్ది రోజుల్లో కరోనా ముగిసిపోతుంది... వచ్చే నెల రోజుల్లో అంతా సర్దుకుంటుంది... ఇంగ్లండ్ జట్టు వచ్చి సిరీస్ ఆడుతుంది...’ ఇలా ఆశపడుతూనే అతను ఏకంగా పది నెలలు శ్రీలంకలోనే గడిపేశాడు. ఎట్టకేలకు ఆ వీరాభిమాని కోరిక తీరింది. ఆ అభిమాని పేరు రాబ్ లూయిస్. ఇంగ్లండ్ క్రికెట్ జట్టంటే పడి చస్తాడు. ఇదే ఉత్సాహంతో అతను గత ఏడాది మార్చిలో శ్రీలంకలో జరిగే ఇంగ్లండ్ సిరీస్‌ను ప్రత్యక్షంగా చూడాలనుకొని సిద్ధమైపోయాడు. ఆటగాళ్లు వెళ్లక ముందే అక్కడికి చేరుకొని ఎపుడెపుడా అని ఆట కోసం ఎదురు చూడసాగాడు. ఇంతలో కరోనా వచ్చేసింది... ప్రపంచమంతా మారిపోయింది. ఇంగ్లండ్ పర్యటన కూడా వాయిదా పడింది. ఇటు శ్రీలంక నుంచి బయటకు వెళ్లేందుకు ఆంక్షలు, అటు ఇంగ్లండ్‌లో పరిస్థితి తీవ్రం. దాంతో 37 ఏళ్ల లూయిస్ లంకలోనే ఆగిపోవాలని నిర్ణయించుకున్నాడు. అయితే పరిస్థితి రోజురోజుకూ దిగజారుతుందని అతను ఊహించలేదు. త్వరలోనే సిరీస్ జరుగుతుందనే లూయిస్ కూడా ఆశిస్తూ వచ్చాడు. వృత్తిరీత్యా వెబ్ డిజైనర్ అయిన అతను ఆన్లైన్లోనే కొంత మొత్తం సంపాదించడం, లంక కరెన్సీ విలువ చాలా తక్కువ కావడంతో అదృష్టవశాత్తూ అతనికి ఆర్థికపరంగా ఇబ్బంది ఎదురు కాలేదు. చివరకు గురువారం ఇంగ్లండ్–శ్రీలంక మధ్య తొలి టెస్టు ప్రారంభం కావడంతో అతని కోరిక నెరవేరింది. అయితే ఇదీ అంత సులువుగా దక్కలేదు. బయో బబుల్ కారణంగా ప్రేక్షకులకు అనుమతి లేకపోవడంతో గాలే స్టేడియం చుట్టుపక్కల నుంచి ఎక్కడ అవకాశం ఉన్నా అక్కడి నుంచే చూసేందుకు ప్రయత్నించాడు. చివరకు మైదానం పక్కనే ఉన్న ప్రఖ్యాత ‘డచ్ ఫోర్ట్’ ఎక్కి అతను వీక్షించాడు. అన్నింటికి మించి శనివారం డబుల్ సెంచరీ పూర్తి చేసిన అనంతరం రూట్ ప్రత్యేకంగా రాబ్ లూయిస్ వైపు తిరిగి తన బ్యాట్ చూపించడంతో అతని ఇన్నాళ్ల బాధ ఒక్కసారిగా దూరమైంది! తన గురించి తెలుసుకొని ఇంగ్లండ్ క్రికెటర్లు ఫోన్లో మాట్లాడారని చెప్పిన లూయిస్ ... సిరీస్ ముగిసిన తర్వాత వారితో కలిసి బీర్ తాగాలని కోరుకుంటున్నాడు! -
ప్రేక్షకులు లేకుండా తొలిసారిగా క్రికెట్ టెస్ట్
-
తొలి టెస్టులో భారత్ ఘన విజయం
-
భారత్ ఫటాఫట్...
ఐసీసీ టెస్టు హోదానిచ్చింది. ఐపీఎల్ ఎక్కడలేని ఆత్మ విశ్వాసాన్నిచ్చింది. దీంతో ఇంకేముందిలే అనుకుంది అఫ్గానిస్తాన్. చారిత్రక టెస్టుకు ఉత్సాహంగా సిద్ధమైంది. ఉపఖండం స్పిన్ పిచ్‌లపై మా వాళ్లు తిప్పేస్తారని కొండంత ఆశలు పెట్టుకుంది. తీరా... బరిలోకి దిగితే గానీ అసలు ‘టెస్టు’ అర్థమైంది. పరిమిత ఓవర్ల క్రికెట్‌కు... సంప్రదాయ టెస్టులకు చాంతాడంత వ్యత్యాసముందని ప్రాక్టికల్‌గా తెలుసుకుంది. ఐదు రోజుల ఆట రెండు రోజుల్లో ముగియడంతో క్రికెట్ కథకమామిషు... మనకి తెలిసింది గోరంతని ఇంకా తెలుసుకోవాల్సింది కొండంతని అఫ్గాన్‌కు బోధపడింది. బెంగళూరు: చారిత్రక టెస్టులో ఒక ఇన్నింగ్స్‌లో రెండు సెంచరీలు నమోదైతే... మరో జట్టు మొత్తం ఇన్నింగ్స్ అంతా కలిపి సెంచరీకి మించింది అంతే. ధావన్, మురళీ విజయ్ సెంచరీలకు ఇంచుమించుగా సమంగా ఉండే రెండు ఇన్నింగ్స్‌లు అఫ్గానిస్తాన్ ఆడింది. కాకతాళీయమో... యాదృచ్ఛికమో కానీ తొలిరోజు రెండు, రెండో రోజు రెండు ‘వంద’లు దాటాయి. రెండో రోజే ముగిసిన ఈ టెస్టులో టీమిండియా అద్వితీయ ప్రదర్శనతో చరిత్ర పుటలకెక్కింది. ఈ రెండు రోజులు ప్రత్యర్థి జట్టు బ్యాటింగ్, బౌలింగ్ చేయలేక గజగజ వణికింది. తొలిరోజు ధావన్ ‘సెషన్’ సెంచరీ రికార్డయితే... రెండో రోజు టెస్టు చరిత్రలో ఒకే రోజు 20 వికెట్లు తీసిన జట్టుగా భారత్ రికార్డులకెక్కింది. ఫలితంగా అఫ్గానిస్తాన్‌తో జరిగిన ఏకైక టెస్టులో రహానే సేన ఇన్నింగ్స్ 262 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. భారత బౌలర్లు పూర్తిగా శ్రమించకుండానే అఫ్గానిస్తాన్ రెండు సార్లు ఆలౌటైంది. రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి జడేజా 6, అశ్విన్ 5 వికెట్లు తీయగా, పేసర్లు ఉమేశ్, ఇషాంత్ శర్మ చెరో 4 వికెట్లు తీశారు. దీంతో అఫ్గానిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌ను 109 పరుగుల వద్ద, ఫాలోఆన్‌లో రెండో ఇన్నింగ్స్‌ను 103 పరుగుల వద్ద ముగించింది. శిఖర్ ధావన్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. పాండ్యా ఫిఫ్టీ... ఓవర్‌నైట్ స్కోరు 347/6తో శుక్రవారం ఆట కొనసాగించిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 104.5 ఓవర్లలో 474 పరుగుల వద్ద ఆలౌటైంది. హార్దిక్ పాండ్యా (94 బంతుల్లో 71; 10 ఫోర్లు) టెయిలెండర్ల సాయంతో భారత్ స్కోరును పెంచాడు. అశ్విన్ (18) ఆట మొదలైన కాసేపటికే నిష్క్రమించగా, జడేజా (20; 1 ఫోర్, 1 సిక్స్) అండతో జట్టు స్కోరును 400 పరుగులకు చేర్చాడు. ఈ క్రమంలో పాండ్యా 83 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆఖరి బ్యాట్స్‌మన్‌గా క్రీజులోకి వచ్చిన ఉమేశ్ (21 బంతుల్లో 26 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) విరుచుకుపడటంతో స్కోరు బోర్డు వేగం పుంజుకుంది. ఇషాంత్‌ను రషీద్ ఔట్ చేయడంతో భారత్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. అఫ్గాన్ ఆలౌట్... ఆలౌట్... తొలిరోజు ఫీల్డింగ్‌ను ఎలా మొహరించాలో తెలియక తల్లడిల్లిన అఫ్గానిస్తాన్ రెండో రోజు బ్యాటింగ్ చేసేందుకూ విలవిల్లాడింది. దీంతో లంచ్‌లోపే తొలి ఇన్నింగ్స్ ముగిసింది. భారత బౌలర్లలో ఏ ఒక్కరు కనీసం పదో ఓవర్ అయిన వేయక ముందే... అఫ్గాన్ 27.5 ఓవర్లలో 109 పరుగులకే కుప్పకూలింది. మొహమ్మద్ నబీ (24) టాప్ స్కోరర్ కాగా... భారత బౌలర్లు వేసిన మొత్తం ఓవర్లకంటే కూడా నబీ స్కోరు తక్కువే. అశ్విన్ (4/27), ఇషాంత్ (2/28), జడేజా (2/18) ఇంకెవరికీ నబీని చేరే ఛాన్స్ ఇవ్వలేదు. దీంతో భారత్‌కు 365 పరుగుల ఆధిక్యం లభించింది. అఫ్గాన్ ఫాలోఆన్ ఆడింది. వంద దాటగానే... మళ్లీ ఫాలోఆన్ ఆడిన అఫ్గానిస్తాన్ రెండో ఇన్నింగ్స్‌లోనూ చేతులెత్తేసింది. ఇద్దరు మినహా, మిగతావారంతా టెస్టుకు కావాల్సిన ఓపికను, సహనాన్ని ఏ దశలోనూ కనబర్చలేకపోయారు. మిడిలార్డర్లో షాహిది (88 బంతుల్లో 36 నాటౌట్; 6 ఫోర్లు), అస్గర్ స్తానిక్‌జై (58 బంతుల్లో 25; 4 ఫోర్లు, 1 సిక్స్) ఉన్నంత సేపు అఫ్గానిస్తాన్ టెస్టు ఆడుతున్నట్లు కనిపించింది. కానీ ఇంకెవరూ టెస్టులకు సరితూగే ఆటను ఆడలేకపోయారు. జడేజా (4/17), ఉమేశ్ (3/26), ఇషాంత్ (2/17)ల బౌలింగ్‌కు తేలిగ్గానే తలవంచారు. రహానే క్రీడాస్ఫూర్తి... చారిత్రక టెస్టును ఫటాఫట్‌గా ముగించిన భారత జట్టు ప్రత్యర్థిని గౌరవించి క్రీడాస్ఫూర్తిలోనూ గెలిచింది. రహానే ట్రోఫీని అందుకున్న తర్వాత టీమిండియా సహచరులతో కలిసి ఫొటోకు ఫోజిచ్చాడు. తర్వాత ప్రత్యర్థి ఆటగాళ్లను సాదరంగా ఆహ్వానించి ట్రోఫీతో ఉమ్మడిగా ఫొటో దిగారు. -
నేటి నుండి భారత్-ఆఫ్ఘాన్ మధ్య టెస్ట్ మ్యాచ్
-
ఇంగ్లండ్ బౌలర్ అరుదైన రికార్డు
హెడింగ్లే: పాకిస్తాన్‌తో జరుగుతోన్న రెండో టెస్టులో ఇంగ్లండ్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. అత్యధిక టెస్ట్ వికెట్లు పడగొట్టిన బౌలర్ల జాబితాలో పాక్ మాజీ బౌలర్ వసీం అక్రమ్ (414)ను అధిగమించాడు. పాక్ రెండో ఇన్నింగ్స్‌లో అసాద్ షఫిక్ వికెట్ పడగొట్టిన బ్రాడ్ 415 వికెట్లతో శ్రీలంక బౌలర్ రంగనా హెరాత్‌తో సమంగా నిలిచాడు. ఇక ఈ జాబితాలో 800 వికెట్లతో శ్రీలంక దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరణ్ తొలి స్థానంలో ఉండగా.. షేన్ వార్న్(708), అనిల్ కుంబ్లే(619), మెక్ గ్రాత్(563)లు తరువాతి స్థానంలో ఉన్నారు. ఇంగ్లండ్ నుంచి జేమ్స్ అండర్సన్ (540) తరువాత ఈ జాబితాలో స్టువర్ట్ బ్రాడే ఉన్నాడు. ఓటమి దిశగా పాక్.. తొలి ఇన్నింగ్స్‌లో 174 పరుగులకే కుప్పకూలిన పాకిస్తాన్.. రెండో ఇన్నింగ్స్‌లో సైతం తడబాటుకు గురైంది. ఆ జట్టు ప్రధాన బ్యాట్స్‌మన్ విఫలమవడంతో రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 104 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 363 పరుగులకు ఆలౌటవ్వడంతో ఆ జట్టుకు 189 పరుగుల ఆధిక్యం లభించింది. ఇంకా పాక్ 84 పరుగుల వెనుకంజలో ఉంది. -
ఇంగ్లండ్ 302/7
హెడింగ్లే: పాకిస్తాన్‌తో జరుగుతోన్న రెండో టెస్టులో ఇంగ్లండ్ భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. శనివారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆతిథ్య జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 96 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 302 పరుగులు చేసింది. చేతిలో మరో 3 వికెట్లు ఉన్న ఆ జట్టు ప్రస్తుతం 128 పరుగుల ఆధిక్యంలో ఉంది. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 106/2తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్ కెప్టెన్ రూట్ (45; 6 ఫోర్లు) వికెట్ త్వరగానే కోల్పోయింది. బెస్ (49; 7 ఫోర్లు), మలాన్ (28), బెయిర్‌స్టో (21), వోక్స్ (17) తలా కొన్ని పరుగులు చేయడంతో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించింది. ప్రస్తుతం బట్లర్ (34 బ్యాటింగ్; 4 ఫోర్లు), కరన్ (16 బ్యాటింగ్; 3 ఫోర్లు) క్రీజులో ఉన్నారు. -
పుజారా... ఓ అరుదైన రికార్డ్
సాక్షి, స్పోర్ట్స్ : టీమిండియా (న్యూ) మిస్టర్ డిపెండబుల్ ఛటేశ్వర పుజారా అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఒక టెస్ట్‌లో ఐదురోజులపాటు బ్యాటింగ్ చేసిన క్రీడాకారుల జాబితాలో చేరిపోయాడు. శ్రీలంకతో ఈడెన్ గార్డెన్స్‌లో జరుగుతున్న టెస్ట్‌లో పుజారా ఈ ఘనత సాధించాడు. మొత్తం ఐదు రోజులపాటు పుజారా క్రీజులో బంతులను ఎదుర్కున్నాడు. తద్వారా ఈ రికార్డు సాధించిన 9వ ఆటగాడిగా పుజారా రికార్డు సృష్టించాడు. భారత్ తరపున ఈ ఘనత సాధించిన మూడో ఆటగాడు అయ్యాడు. అంతకు ముందు జయసింహా, రవిశాస్త్రి ఇలా ఐదురోజులపాటు బ్యాటింగ్ చేశారు. 1960లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో చివరి ఆటగాడిగా బరిలోకి దిగిన హైదరాబాదీ ఆటగాడు ఎంఎల్ జయసింహా ఆపద సమయంలో భారత్‌ను ఆదుకుని మ్యాచ్‌ను డ్రాగా ముగించాడు. ఇక రవిశాస్త్రి 1984లో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఐదు రోజులపాటు ఆడాడు. అయితే ఇక్కడ మరో ప్రత్యేకత ఏంటంటే... ఈ ముగ్గురు కూడా ఈడెన్ గార్డెన్స్‌లోనే ఈ ఫీట్ సాధించటం. ఈ ఘనత సాధించిన మరికొందరు ఆటగాళ్లు... జే బాయ్‌కాట్(ఇంగ్లాండ్), కేజే హ్యూస్(ఆస్ట్రేలియా), అలన్ లాంబ్(ఇంగ్లాండ్), ఏఎఫ్జీ గ్రిఫ్ఫిత్(వెస్టిండీస్), ఆండ్రూ ఫ్లింటాఫ్(ఇంగ్లాడ్), ఏఎన్ పీటర్సన్(సౌతాఫ్రికా) Cheteshwar Pujara becomes the third Indian cricketer, after Ravi Shastri and ML Jaisimha to have batted on all 5 days of a Test match. pic.twitter.com/1ERgsi6p9r — BCCI (@BCCI) November 20, 2017 -
దక్షిణాఫ్రికాపై బంగ్లాదేశ్ పైచేయి
చిట్టగాంగ్: మొదటి టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో దక్షిణాఫ్రికాపై బంగ్లాదేశ్ పైచేయి సాధించింది. తొలి ఇన్నింగ్స్ లో బంగ్లాదేశ్ 326 పరుగులకు ఆలౌటైంది. దీంతో బంగ్లాకు 78 పరుగుల ఆధిక్యం దక్కింది. ఏ జట్టుపై అయినా బంగ్లాదేశ్ కు ఇదే అత్యధిక తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కావడం విశేషం. 179/4 ఓవర్ నైట్ స్కోరుతో మూడో రోజు ఆట ప్రారంభించిన బంగ్లాదేశ్ 147 పరుగులు జతచేసి 6 వికెట్లు కోల్పోయింది. తమీమ్ ఇక్బాల్(57), మహ్మదుల్లా(67), లిటన్ దాస్(50) అర్థసెంచరీలతో రాణించారు. దక్షిణాఫ్రికాపై ముగ్గురు బంగ్లా బ్యాట్స్ మన్ అర్థసెంచరీలు చేయడం ఇదే మొదటిసారి. అంతేకాదు దక్షిణాఫ్రికాపై 116.1 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేయడం బంగ్లాకు ఇదే తొలిసారి. రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన దక్షిణాఫ్రికా మూడో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 61 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్సలో సఫారీ టీమ్ 248 పరుగులకు ఆలౌటైంది. -
విజృంభించిన బంగ్లా బౌలర్లు
చిట్టగాంగ్: మొదటి టెస్టులో దక్షిణాఫ్రికాను తక్కువ స్కోరుకే బంగ్లాదేశ్ కట్టడి చేసింది. తొలి ఇన్నింగ్స్ లో సఫారీ టీమ్ ను 248 పరుగులకే ఆలౌట్ చేసింది. బంగ్లా బౌలర్లు బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో దక్షిణాఫ్రికా స్వల్ప స్కోరుకే పరిమితమైంది. బవుమా 54, ప్లెసిస్ 48, ఎల్గార్ 47, వాన్ జిల్ 34, ఫిలాండర్ 24, ఆమ్లా 13 పరుగులు చేశారు. డుమిని, డీకాక్ డకౌటయ్యారు. బంగ్లాదేశ్ బౌలర్లలో ముష్ఫికర్ 4, జుబైర్ హుస్సేన్ 3 వికెట్లు పడగొట్టారు. మొదటి ఇన్నింగ్స్ ఆరంభించిన బంగ్లాదేశ్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 7 పరుగులు చేసింది. -
కుప్పకూలిన వెస్టిండీస్
రోసీయూ: ఆస్ట్రేలియాతో బుధవారం ప్రారంభమైన తొలి టెస్టులో వెస్టిండీస్ 148 ఆలౌటైంది. షై హోప్ (36) ఒక్కడే రాణించాడు. బ్రాత్‌వైట్ (10), డారెన్ బ్రేవో (19), శామ్యూల్స్ (7), బ్లాక్‌వుడ్ (2), రామ్‌దిన్ (19), హోల్డర్(21), డౌరిచ్(15) టేలర్(6), గాబ్రియెల్(2) విఫలమయ్యారు. 85 పరుగులకు విండీస్ చివరి 9 వికెట్లు చేజార్చుకోవడం విశేషం. ఆసీస్ బౌలర్లలో హాజల్‌వుడ్‌కు 3 , జాన్సన్ 3 వికెట్లు పడగొట్టారు. స్టార్క్ 2 వికెట్లు దక్కించుకున్నాడు. లియాన్, స్మిత్ ఒక్కో వికెట్ తీశారు. తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన ఆస్ట్రేలియా మొదటిరోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్లు కోల్పోయి 85 పరుగులు చేసింది. వార్నర్(8), మార్ష్(19), క్లార్క్(18) అవుటయ్యారు. స్మిత్ 17, వోగ్స్ 20 పరుగులతో క్రీజ్ లో ఉన్నారు.