చిట్టగాంగ్: మొదటి టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో దక్షిణాఫ్రికాపై బంగ్లాదేశ్ పైచేయి సాధించింది. తొలి ఇన్నింగ్స్ లో బంగ్లాదేశ్ 326 పరుగులకు ఆలౌటైంది. దీంతో బంగ్లాకు 78 పరుగుల ఆధిక్యం దక్కింది. ఏ జట్టుపై అయినా బంగ్లాదేశ్ కు ఇదే అత్యధిక తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కావడం విశేషం.
179/4 ఓవర్ నైట్ స్కోరుతో మూడో రోజు ఆట ప్రారంభించిన బంగ్లాదేశ్ 147 పరుగులు జతచేసి 6 వికెట్లు కోల్పోయింది. తమీమ్ ఇక్బాల్(57), మహ్మదుల్లా(67), లిటన్ దాస్(50) అర్థసెంచరీలతో రాణించారు. దక్షిణాఫ్రికాపై ముగ్గురు బంగ్లా బ్యాట్స్ మన్ అర్థసెంచరీలు చేయడం ఇదే మొదటిసారి. అంతేకాదు దక్షిణాఫ్రికాపై 116.1 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేయడం బంగ్లాకు ఇదే తొలిసారి.
రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన దక్షిణాఫ్రికా మూడో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 61 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్సలో సఫారీ టీమ్ 248 పరుగులకు ఆలౌటైంది.
దక్షిణాఫ్రికాపై బంగ్లాదేశ్ పైచేయి
Published Thu, Jul 23 2015 5:15 PM | Last Updated on Sun, Sep 3 2017 6:02 AM