
విజృంభించిన బంగ్లా బౌలర్లు
చిట్టగాంగ్: మొదటి టెస్టులో దక్షిణాఫ్రికాను తక్కువ స్కోరుకే బంగ్లాదేశ్ కట్టడి చేసింది. తొలి ఇన్నింగ్స్ లో సఫారీ టీమ్ ను 248 పరుగులకే ఆలౌట్ చేసింది. బంగ్లా బౌలర్లు బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో దక్షిణాఫ్రికా స్వల్ప స్కోరుకే పరిమితమైంది.
బవుమా 54, ప్లెసిస్ 48, ఎల్గార్ 47, వాన్ జిల్ 34, ఫిలాండర్ 24, ఆమ్లా 13 పరుగులు చేశారు. డుమిని, డీకాక్ డకౌటయ్యారు. బంగ్లాదేశ్ బౌలర్లలో ముష్ఫికర్ 4, జుబైర్ హుస్సేన్ 3 వికెట్లు పడగొట్టారు. మొదటి ఇన్నింగ్స్ ఆరంభించిన బంగ్లాదేశ్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 7 పరుగులు చేసింది.