చట్టోగ్రామ్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో సౌతాఫ్రికా భారీ స్కోర్ దిశగా సాగుతోంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు 2 వికెట్ల నష్టానికి 307 పరుగులు చేసింది. టోనీ డి జోర్జీ (141 నాటౌట్), ట్రిస్టన్ స్టబ్స్ (106) సెంచరీలతో కదంతొక్కారు. వీరిద్దరికీ టెస్ట్‌ల్లో ఇవి తొలి శతకాలు. ఎయిడెన్ మార్క్రమ్ (33) శుభారంభం లభించినప్పటికీ భారీ స్కోర్‌గా మలచలేకపోయాడు.
టోనీ డి జోర్జీతో పాటు డేవిడ్ బెడింగ్హమ్ (18) క్రీజ్‌లో ఉన్నాడు. సౌతాఫ్రికా కోల్పోయిన రెండు వికెట్లు తైజుల్ ఇస్లాంకు దక్కాయి. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. కాగా, రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం సౌతాఫ్రికా బంగ్లాదేశ్‌లో పర్యటిస్తుంది. ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో సౌతాఫ్రికా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 106 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 307 పరుగులు చేయగా.. సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 308, ఛేదనలో 106 పరుగులు చేసి విజయం సాధించింది. సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో కైల్ వెర్రిన్ (114) మెరుపు సెంచరీతో కదంతొక్కాడు. రబాడ రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి తొమ్మిది వికెట్లు తీసి బంగ్లాదేశ్‌ను దెబ్బకొట్టాడు.
Comments
Please login to add a commentAdd a comment