ఐదేసిన తైజుల్‌ ఇస్లాం.. సౌతాఫ్రికా భారీ స్కోర్‌ | Taijul Islam Scalps Fifer In Second Test Vs South Africa | Sakshi
Sakshi News home page

ఐదేసిన తైజుల్‌ ఇస్లాం.. సౌతాఫ్రికా భారీ స్కోర్‌

Published Wed, Oct 30 2024 12:23 PM | Last Updated on Wed, Oct 30 2024 12:23 PM

Taijul Islam Scalps Fifer In Second Test Vs South Africa

చట్టోగ్రామ్‌ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో సౌతాఫ్రికా భారీ స్కోర్‌ దిశగా దూసుకెళ్తుంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేస్తున్న ప్రొటీస్‌ రెండో రోజు లంచ్‌ విరామం సమయానికి 5 వికెట్ల నష్టానికి 413 పరుగులు చేసింది. టోనీ డి జోర్జీ (177), ట్రిస్టన్‌ స్టబ్స్‌ (106) సెంచరీలతో కదంతొక్కగా.. డేవిడ్‌ బెడింగ్హమ్‌ (59) అర్ద సెంచరీతో రాణించాడు. టోనీ, ట్రిస్టన్‌కు టెస్ట్‌ల్లో ఇవి తొలి శతకాలు. ర్యాన్‌ రికెల్టన్‌ (11), వియాన్‌ ముల్దర్‌ (12) క్రీజ్‌లో ఉన్నారు.

ఐదేసిన తైజుల్‌
ఈ మ్యాచ​్‌లో సౌతాఫ్రికా కోల్పోయిన ఐదు వికెట్లు బంగ్లా స్పిన్నర్‌ తైజుల్‌ ఇస్లాం ఖాతాలోకే వెళ్లాయి. తైజుల్‌ కెరీర్‌లో ఇది 14వ ఐదు వికెట్ల ఘనత. కాగా, రెండు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ కోసం సౌతాఫ్రికా బంగ్లాదేశ్‌లో పర్యటిస్తుంది. ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో సౌతాఫ్రికా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

తొలి టెస్ట్‌లో బంగ్లాదేశ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 106 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 307 పరుగులు చేయగా.. సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 308, ఛేదనలో  106 పరుగులు చేసి విజయం సాధించింది. సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో కైల్‌ వెర్రిన్‌ (114) మెరుపు సెంచరీతో కదంతొక్కాడు. రబాడ రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి తొమ్మిది వికెట్లు తీసి బంగ్లాదేశ్‌ను దెబ్బకొట్టాడు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement