Taijul Islam
-
పదిహేనేళ్ల కరువు తీరింది: వెస్టిండీస్‌కు ఊహించని షాక్.. పట్టికలోనూ తారుమారు
వెస్టిండీస్‌తో రెండో టెస్టులో బంగ్లాదేశ్ చారిత్రాత్మక విజయం సాధించింది. ఆతిథ్య విండీస్‌ను ఏకంగా 101 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. తద్వారా కరేబియన్ గడ్డపై పదిహేనేళ్లలో తొలి టెస్టు గెలుపు నమోదు చేసింది. అంతేకాదు.. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) 2023-25 పాయింట్ల పట్టికలో వెస్టిండీస్‌ను వెనక్కినెట్టింది.కరేబియన్ పర్యటనలో బంగ్లాదేశ్కాగా రెండు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడేందుకు బంగ్లాదేశ్ కరేబియన్ పర్యటనకు వెళ్లింది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య ఆంటిగ్వా వేదికగా తొలి టెస్టు జరగగా.. ఆతిథ్య వెస్టిండీస్ 201 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. దీంతో సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది.జమైకాలో రెండో టెస్టుఅయితే, రెండో టెస్టులో మాత్రం బంగ్లాదేశ్ వెస్టిండీస్‌కు ఊహించని షాకిచ్చింది. జాకర్ అలీ బ్యాట్‌తో, తైజుల్ ఇస్లాం బాల్‌తో చెలరేగడంతో బ్రాత్‌వైట్ బృందాన్ని మట్టికరిపించింది. జమైకా వేదికగా శనివారం నుంచి మంగళవారం (నవంబరు 30- డిసెంబరు 3) వరకు జరిగిన ఈ మ్యాచ్‌లో.. టాస్ గెలిచిన బంగ్లా తొలుత బ్యాటింగ్ చేసింది.బ్యాటర్లంతా నామమాత్రపు స్కోర్లకే పరిమితం కావడంతో తొలి ఇన్నింగ్స్‌లో 164 పరుగులకే ఆలౌట్ అయింది. ఓపెనర్ షాద్మన్ ఇస్లాం(64), కెప్టెన్ మెహదీ హసన్ మిరాజ్(36) రాణించడంతో ఈ మేర స్కోరు సాధించింది. నహీద్ రాణా ఐదు వికెట్లతో చెలరేగడంతోఇందుకు బదులిచ్చేందుకు రంగంలోకి దిగిన విండీస్ జట్టు.. 146 పరుగులకే కుప్పకూలింది. బంగ్లా యువ పేసర్ నహీద్ రాణా ఐదు వికెట్లతో చెలరేగి వెస్టిండీస్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు.ఈ క్రమంలో.. 18 పరుగుల స్వల్ప ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన బంగ్లాదేశ్.. 268 పరుగులు సాధించింది. కెప్టెన్ మెహదీ హసన్ మిరాజ్ 42 పరుగులతో రాణించగా.. వికెట్ కీపర్ బ్యాటర్ జాకర్ అలీ 91 పరుగులతో దుమ్ములేపాడు. ఈ నేపథ్యంలో పర్యాటక బంగ్లాదేశ్ విండీస్ ముందు 287 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.ఈసారి ఐదేసిన తైజుల్ ఇస్లాంఅయితే, టార్గెట్‌ను ఛేదించే క్రమంలో వెస్టిండీస్‌ను ఆరంభం నుంచే బంగ్లా బౌలర్లు తిప్పలు పెట్టారు. ముఖ్యంగా స్పిన్నర్ తైజుల్ ఇస్లాం ఓపెనర్లలో మైకైల్ లాయీస్(6)తో పాటు.. కెప్టెన్ బ్రాత్‌వైట్(43)లను అవుట్ చేసి వికెట్ల పతనానికి నాంది పలకగా.. పేసర్లు టస్కిన్ అహ్మద్, హసన్ మహమూద్, నహీద్ రాణా అతడికి సహకారం అందించారు.సిరీస్ సమం.. ఇక విండీస్ బ్యాటర్లలో కేవం హోడ్జ్(55) అర్ధ శతకంతో కాసేపు పోరాడే ప్రయత్నం చేయగా.. తైజుల్ ఇస్లాం అతడిని పెవిలియన్‌కు పంపి మరోసారి దెబ్బ కొట్టాడు. ఇక నహీద్ రాణా షమార్ జోసెఫ్(8)ను పదో వికెట్‌గా వెనక్కి పంపడంతో విండీస్ కథ ముగిసిపోయింది. 185 పరుగులకే వెస్టిండీస్ ఆలౌట్ కాగా.. బంగ్లా 101 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. తద్వారా సిరీస్‌ను 1-1తో సమం చేసింది. ఇక బంగ్లా బౌలర్లలో ప్లేయర్ ‘ఆఫ్ ది మ్యాచ్’ తైజుల్ ఇస్లాం ఏకంగా ఐదు వికెట్లు దక్కించుకోగా.. టస్కిన్ అహ్మద్, హసన్ మహమూద్ తలా రెండు, నహీద్ రాణా ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.పాయింట్ల పట్టికలోనూ తారుమారుఇక విండీస్‌పై విజయంతో బంగ్లాదేశ్ డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానానికి చేరగా.. వెస్టిండీస్ తొమ్మిదో స్థానానికి పడిపోయింది. టీమిండియా అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, శ్రీలంక, న్యూజిలాండ్ టాప్-5లో ఉన్నాయి.చదవండి: వినోద్ కాంబ్లీని కలిసిన సచిన్.. చేయి వదలకుండా బిగించడంతో.. ఆఖరికి -
ఐదేసిన తైజుల్ ఇస్లాం.. సౌతాఫ్రికా భారీ స్కోర్
చట్టోగ్రామ్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో సౌతాఫ్రికా భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తున్న ప్రొటీస్ రెండో రోజు లంచ్ విరామం సమయానికి 5 వికెట్ల నష్టానికి 413 పరుగులు చేసింది. టోనీ డి జోర్జీ (177), ట్రిస్టన్ స్టబ్స్ (106) సెంచరీలతో కదంతొక్కగా.. డేవిడ్ బెడింగ్హమ్ (59) అర్ద సెంచరీతో రాణించాడు. టోనీ, ట్రిస్టన్‌కు టెస్ట్‌ల్లో ఇవి తొలి శతకాలు. ర్యాన్ రికెల్టన్ (11), వియాన్ ముల్దర్ (12) క్రీజ్‌లో ఉన్నారు.ఐదేసిన తైజుల్ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా కోల్పోయిన ఐదు వికెట్లు బంగ్లా స్పిన్నర్ తైజుల్ ఇస్లాం ఖాతాలోకే వెళ్లాయి. తైజుల్ కెరీర్లో ఇది 14వ ఐదు వికెట్ల ఘనత. కాగా, రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం సౌతాఫ్రికా బంగ్లాదేశ్‌లో పర్యటిస్తుంది. ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో సౌతాఫ్రికా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.తొలి టెస్ట్‌లో బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 106 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 307 పరుగులు చేయగా.. సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 308, ఛేదనలో 106 పరుగులు చేసి విజయం సాధించింది. సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో కైల్ వెర్రిన్ (114) మెరుపు సెంచరీతో కదంతొక్కాడు. రబాడ రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి తొమ్మిది వికెట్లు తీసి బంగ్లాదేశ్‌ను దెబ్బకొట్టాడు. -
సౌతాఫ్రికాతో టెస్ట్ మ్యాచ్.. ఐదు వికెట్లు తీసిన బంగ్లా బౌలర్.. అరుదైన క్లబ్లో చేరిక
ఢాకా వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ స్పిన్నర్ తైజుల్ ఇస్లాం ఐదు వికెట్ల ప్రదర్శనతో మెరిశాడు. ఈ మ్యాచ్‌లో తైజుల్ 13 ఓవర్లలో 47 పరుగులిచ్చి ఐదు వికెట్లు తీశాడు. ఈ ప్రదర్శనతో తైజుల్ అరుదైన 200 వికెట్ల క్లబ్లో చేరాడు. తైజుల్ 85 ఇన్నింగ్స్‌ల్లో 201 వికెట్లు పడగొట్టాడు. బంగ్లా తరఫున 200 వికెట్ల క్లబ్లో చేరిన రెండో బౌలర్ తైజుల్. తైజుల్‌కు ముందు షకీబ్ అల్ హసన్ (121 ఇన్నింగ్స్‌ల్లో 246 వికెట్లు) ఈ ఘనత సాధించాడు.బంగ్లాదేశ్ తరఫున టెస్ట్‌ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు..షకీబ్ అల్ హసన్-121 ఇన్నింగ్స్‌ల్లో 246 వికెట్లుతైజుల్ ఇస్లాం- 85 ఇన్నింగ్స్‌ల్లో 201 వికెట్లుమెహిది హసన్ మిరాజ్- 83 ఇన్నింగ్స్‌ల్లో 183 వికెట్లుమొహమ్మద్ రఫీక్- 48 ఇన్నింగ్స్‌ల్లో 100 వికెట్లుముషరఫే మొర్తజా- 51 ఇన్నింగ్స్‌ల్లో 78 వికెట్లుషహాదత్ హొసేన్- 60 ఇన్నింగ్స్‌ల్లో 72 వికెట్లుమ్యాచ్ విషయానికొస్తే.. ఇవాళే మొదలైన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 106 పరుగులకే కుప్పకూలింది. కగిసో రబాడ (3/26), వియాన్ ముల్దర్(3/22), కేశవ్ మహారాజ్ (3/34), డేన్ పీడెట్ (1/19) బంగ్లా పతనాన్ని శాశించారు. బంగ్లా ఇన్నింగ్స్‌లో మహ్మదుల్ హసన్ జాయ్ (30), తైజుల్ ఇస్లాం (16), మెహిది హసన్ మిరాజ్ (13), ముష్ఫికర్ రహీం (11) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు.అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌతాఫ్రికా 40 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 140 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. బంగ్లా బౌలర్లలో తైజుల్ ఐదు, హసన్ మహమూద్ ఓ వికెట్ పడగొట్టారు. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో మార్క్రమ్ (6), టోనీ డి జోర్జీ (30), ట్రిస్టన్ స్టబ్స్ (23), డేవిడ్ బెడింగ్హమ్ (11), ర్యాన్ రికెల్టన్ (27), మాథ్యూ బ్రీట్జ్కీ (0) ఔట్ కాగా.. కైల్ వెర్రిన్ (18), వియాన్ ముల్దర్ (17) క్రీజ్‌లో ఉన్నారు. ప్రస్తుతం సౌతాఫ్రికా 34 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. చదవండి: రెచ్చిపోయిన లంక బ్యాటర్లు.. విండీస్ ఖాతాలో మరో పరాజయం -
న్యూజిలాండ్‌కు భారీ షాక్.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. భారీ విజయంతో..
Bangladesh vs New Zealand, 1st Test: పటిష్ట న్యూజిలాండ్ జట్టుకు బంగ్లాదేశ్ ఊహించని షాకిచ్చింది. సొంతగడ్డపై ఆకాశమే హద్దుగా చెలరేగి కివీస్‌పై భారీ విజయం సాధించింది. తొలి టెస్టులో టిమ్ సౌథీ బృందాన్ని ఏకంగా 150 పరుగుల తేడాతో చిత్తు చేసి చరిత్ర సృష్టించింది. కాగా రెండు టెస్టులు ఆడే నిమిత్తం న్యూజిలాండ్ జట్టు బంగ్లాదేశ్‌లో పర్యటిస్తోంది. ఈ క్రమంలో మంగళవారం(నవంబరు 28) ఇరు జట్ల మధ్య సిల్హెట్ వేదికగా తొలి టెస్టు ఆరంభమైంది. ఇందులో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో తొలి ఇన్నింగ్స్‌లో ఆతిథ్య బంగ్లా 310 పరుగులకు ఆలౌట్ కాగా.. న్యూజిలాండ్ 317 పరుగులు చేసి స్వల్ప ఆధిక్యంలో నిలిచింది. ఇక రెండో ఇన్నింగ్స్‌ను బంగ్లాదేశ్ 338 పరుగుల వద్ద ముగించగా.. కివీస్ 181 పరుగులకే చాపచుట్టేసింది. బంగ్లాదేశ్ వెటరన్ స్పిన్నర్, తైజుల్ ఇస్లాం ఆరు వికెట్లతో చెలరేగి కివీస్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు. డెవాన్ కాన్వే, కేన్ విలియమ్సన్, టామ్ బ్లండెల్ రూపంలో కీలక వికెట్లు తీసిన తైజుల్.. కైలీ జెమీషన్, ఇష్ సోధి, టిమ్ సౌథీలను కూడా అవుట్ చేసి శనివారం నాటి ఐదోరోజు తొలి సెషన్లోనే మ్యాచ్‌ను ముగించాడు. టెస్టుల్లో షాంటో బృందం సరికొత్త చరిత్ర ఇలా బంగ్లా విజయంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. కాగా సొంతగడ్డపై న్యూజిలాండ్‌పై బంగ్లాదేశ్‌కు ఇదే తొలి టెస్టు గెలుపు. ఈ క్రమంలో బంగ్లాదేశ్ టెస్టు జట్టుకు తొలిసారి సారథిగా వ్యవహరించిన నజ్ముల్ షాంటో ఈ మేరకు చారిత్రాత్మక విజయం అందుకోవడం విశేషం. ఇక గత 18 టెస్టుల్లోనూ బంగ్లాదేశ్‌కు ఇదే రెండో విజయం కావడం గమనార్హం. నాలుగో రోజు ఆట ముగిసిందిలా కాగా.. 332 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ మ్యాచ్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి తమ రెండో ఇన్నింగ్స్‌లో 113 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. డరైల్ మిచెల్ (44 నాటౌట్) మినహా ఇతర బ్యాటర్లంతా విఫలమయ్యారు. లెఫ్టార్మ్ స్పిన్నర్ తైజుల్ ఇస్లామ్ (4/24) నాలుగు వికెట్లతో ప్రత్యర్థిని దెబ్బ తీశాడు. అంతకు ముందు ఓవర్‌నైట్ స్కోరు 212/3తో శుక్రవారం ఆట కొనసాగించిన బంగ్లాదేశ్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 338 పరుగులకు ఆలౌటైంది. ముష్ఫికర్ రహీమ్ (67), మెహదీ హసన్ మిరాజ్ (50 నాటౌట్) అర్ధసెంచరీలు చేశారు. ఇక ఐదో రోజు ఆటలో భాగంగా విజయానికి కివీస్ మరో 219 పరుగులు చేయాల్సి ఉండగా.. స్పిన్నర్ నయీం హసన్ తొలి వికెట్ తీయగా.. తైజుల్ మరో రెండు వికెట్లు తీసి న్యూజిలాండ్ ఓటమిని ఖరారు చేశాడు. చదవండి: అదొక్కటే కలిసి రాలేదు.. అతడిని ఒత్తిడిలోకి నెట్టడం ఇష్టం: సూర్య టీమిండియా హెడ్‌కోచ్ అయితేనేం! కుమారుల కోసం అలా.. -
టాపార్డర్ విఫలం.. మెరిసిన పంత్, అయ్యర్.. భారత్ స్కోరెంతంటే!
Ind vs Ban- 2nd Test- Day 2- Rishabh Pant- Shreyas Iyer: బంగ్లాదేశ్‌తో రెండో టెస్టులో రిషభ్ పంత్, శ్రేయస్ అయ్యర్ అద్భుత ప్రదర్శనతో రెండో రోజు ఆట ముగిసే సరికి టీమిండియా 80 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ఈ మిడిలార్డర్ బ్యాటర్లు 159 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో మెరుగైన స్కోరు చేయగలిగింది. టాపార్డర్ చేతులెత్తేసిన వేళ పంత్, అయ్యర్ తమ ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకున్నారు. ఆదిలోనే వికెట్లు.. దెబ్బకొట్టిన తైజుల్ 19 పరుగుల వద్ద రెండో రోజు ఆటను మొదలుపెట్టిన టీమిండియాను ఆదిలోనే దెబ్బకొట్టాడు బంగ్లా స్పిన్నర్ తైజుల్ అస్లాం. కెప్టెన్ కేఎల్ రాహుల్(10) సహా మరో ఓపెనర్ శుబ్‌మన్ గిల్(20)ను ఎల్బీడబ్ల్యూ చేసి భారత్‌కు షాకిచ్చాడు. తర్వాత పుజారా(24) వికెట్ కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలో ఐదో స్థానంలో వచ్చిన రిషభ్ పంత్.. విరాట్ కోహ్లికి సహకారం అందించాడు. అయితే, మెహదీ హసన్ మిరాజ్ బౌలింగ్‌లో కోహ్లి 24 పరుగుల వద్ద నిష్క్రమించాడు. దీంతో పంత్‌పై బాధ్యత పెరిగింది. పంత్, అయ్యర్ అర్ధ శతకాలు అందుకు తగ్గట్టుగానే మరో ఎండ్ నుంచి సహకారం అందడంతో పంత్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 49 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్న అతడు.. మొత్తంగా 105 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 93 పరుగులు చేశాడు. సెంచరీ చేజారినప్పటికీ కీలక ఇన్నింగ్స్‌తో మెరిశాడు. మరోవైపు.. శ్రేయస్ అయ్యర్ 105 బంతుల్లో 87 పరుగులు సాధించాడు. ఆ తర్వాత టీమిండియా త్వరత్వరగా వికెట్లు కోల్పోయింది. అయ్యర్ సహా అక్షర్ పటేల్(4), అశ్విన్(12), సిరాజ్ (7 ) వికెట్లను బంగ్లా కెప్టెన్ షకీబ్ అల్ హసన్ తన ఖాతాలో వేసుకున్నాడు. స్పిన్నర్లు హిట్ ఉమేశ్ యాదవ్(14)ను తైజుల్ అస్లాం పెవిలియన్‌కు పంపగా.. ఉనాద్కట్ 14 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఈ క్రమంలో 314 పరుగులకు టీమిండియా ఆలౌట్ అయింది. స్పిన్‌కు అనుకూలించిన పిచ్‌పై షకీబ్, తైజుల్ నాలుగేసి వికెట్లు తీయగా.. పేసర్ టస్కిన్ అహ్మద్ 1, స్పిన్ ఆల్‌రౌండర్ మెహదీ హసన్ మిరాజ్ ఒక వికెట్ పడగొట్టారు. ఇక మిర్పూర్ టెస్టులో రెండో రోజు ఆట ముగిసే సమయానికి బంగ్లా వికెట్ నష్టపోకుండా 7 పరుగులు చేసింది. దీంతో భారత్‌కు 80 పరుగుల ఆధిక్యం లభించింది. చదవండి: Ben Stokes: చెన్నై తదుపరి కెప్టెన్‌గా స్టోక్స్!? ఏకంగా 16 కోట్లకు..! ఛాన్స్ మిస్ చేశారంటున్న ఆరెంజ్ ఆర్మీ! Kohli- Pant: పంత్‌పై గుడ్లురిమిన కోహ్లి! కానీ.. ఈసారి కింగ్ ‘మాట వినకపోవడమే’ మంచిదైంది! లేదంటే.. -
క్యాచ్ పడతానని ఊహించి ఉండడు.. అందుకే ఆ రియాక్షన్
శ్రీలంక, బంగ్లాదేశ్ మధ్య తొలి టెస్టులో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. లంక రెండో ఇన్నింగ్స్ సందర్భంగా ఆ జట్టు సీనియర్ బ్యాటర్ మాథ్యూస్ 14 బంతులెదుర్కొని ఒక్క పరుగు చేయకుండానే డకౌట్ అయ్యాడు. తైజూల్ ఇస్లామ్ బౌలింగ్‌లో మాథ్యూస్ కాట్ అండ్ బౌల్డ్‌గా ఔటయ్యాడు. తైజూల్ వేసిన బంతిని స్ట్రెయిట్ డ్రైవ్ ఆడే ప్రయత్నంలో బంతి ఫుల్‌టాస్ అయి బ్యాడ్ ఎడ్జ్‌ను తాకి వేగంగా వచ్చింది. క్యాచ్ కాష్టతరంగానే అనిపించినప్పటికి తైజూల్ ఎలాంటి పొరపాటు చేయకుండా క్యాచ్‌ను అందుకున్నాడు. ఆ తర్వాత అతనిచ్చిన రియాక్షన్ వైరల్‌గా మారింది. క్యాచ్ పడతానని తైజూల్ ఊహించి ఉండడు.. అందుకే అలాంటి రియాక్షన్ ఇచ్చాడంటూ క్రికెట్ ఫ్యాన్స్ కామెంట్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో మాథ్యూస్ తొలి ఇన్నింగ్స్‌లో 199 పరుగుల మారథాన్ ఇన్నింగ్స్ ఆడిన సంగతి తెలిసిందే. 397 బంతులెదుర్కొని 19 ఫోర్లు, సిక్సర్ సాయంతో 199 పరుగులు చేశాడు. అయితే 199 పరుగుల వద్ద ఔటైన మాథ్యూస్ ఒక చెత్త రికార్డును నమోదు చేశాడు. టెస్టు క్రికెట్ చరిత్రలో 99, 199 వ్యక్తిగత స్కోరు వద్ద ఔటైన తొలి బ్యాట్స్‌మన్‌గా మాథ్యూస్ నిలిచాడు. ఇరుజట్ల మధ్య జరిగిన తొలి టెస్టు డ్రాగా ముగిసింది. ఐదో రోజు ఆట ముగిసే సమయానికి లంక 6 వికెట్ల నష్టానికి 260 పరుగులు చేసింది. నిరోషన్ డిక్వెల్లా 61 నాటౌట్ టాప్ స్కోరర్ కాగా.. కరుణరత్నే 52, దినేష్ చండిమల్ 39, ధనుంజయ డిసిల్వా 33,కుషాల్ మెండిస్ 48 పరుగులు చేశారు. అంతకముందు లంక తొలి ఇన్నింగ్స్‌లో 397 పరుగులకు ఆలౌట్ కాగా.. బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 465 పరుగులకు ఆలౌటైంది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా మాథ్యూస్ నిలిచాడు. చదవండి: KKR VS LSG: కెమెరాకు చిక్కిన మిస్టరీ గర్ల్.. తన అందంతో కట్టిపడేసింది 🇧🇩v🇱🇰 Kya pakde ho!🤩 Two absolute stunners! Safe to say the Tigers were alert and ready to pounce! Speaking of catches, catch all the action from the @BCBtigers vs @OfficialSLC Test match, LIVE on #FanCode! 👉 https://t.co/UBuoElYSnG#BANvSL #TaijulIslam #MominulHaque pic.twitter.com/SPVBFiB83H — FanCode (@FanCode) May 19, 2022 -
పాకిస్తాన్‌కు చుక్కలు చూపించిన బంగ్లాదేశ్ బౌలర్.. ఏకంగా 7 వికెట్లు...
చిట్టగాంగ్: బంగ్లాదేశ్, పాకిస్తాన్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు ఆసక్తికరంగా సాగుతోంది. ఆట మూడో రోజు బౌలర్లు చెలరేగడంతో ఆదివారం ఏకంగా 14 వికెట్లు నేలకూలాయి. దాంతో ఇరు జట్లను గెలుపు ఊరిస్తోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 19 ఓవర్లలో 4 వికెట్లకు 39 పరుగులు చేసింది. ముష్ఫికర్ రహీమ్ (12 బ్యాటింగ్; 1 ఫోర్), యాసిర్ అలీ (8 బ్యాటింగ్; 1 ఫోర్) క్రీజులో ఉన్నారు. పాక్ బౌలర్ షాహీన్ అఫ్రిది మూడు వికెట్లు తీశాడు. ప్రస్తుతం బంగ్లాదేశ్ 83 పరుగుల ఆధిక్యంలో ఉంది. మరో రెండు రోజుల ఆట మిగిలి ఉంది. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 145/0తో ఆటను ఆరంభించిన పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో 115.4 ఓవర్లలో 286 పరుగులకు ఆలౌటైంది. పాక్‌ను తైజుల్ ఇస్లామ్ (7/116) దెబ్బ తీశాడు. మూడో రోజు తొలి ఓవర్లోనే అతడు అబ్దుల్లా షఫీక్ (52; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), అజహర్ అలీ (0) వికెట్లను తీశాడు. ఓవర్‌నైట్ బ్యాటర్ ఆబిద్ అలీ (133; 12 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీని పూర్తి చేశాడు. ఆబిద్ అలీని కూడా తైజుల్ అవుట్ చేయడంతో పాకిస్తాన్ పతనం ఆరంభమైంది. చదవండి: IND Vs NZ 1st Test: విజయం ఊరిస్తోంది!