ఢాకా వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ స్పిన్నర్ తైజుల్ ఇస్లాం ఐదు వికెట్ల ప్రదర్శనతో మెరిశాడు. ఈ మ్యాచ్‌లో తైజుల్ 13 ఓవర్లలో 47 పరుగులిచ్చి ఐదు వికెట్లు తీశాడు. ఈ ప్రదర్శనతో తైజుల్ అరుదైన 200 వికెట్ల క్లబ్‌లో చేరాడు. తైజుల్ 85 ఇన్నింగ్స్‌ల్లో 201 వికెట్లు పడగొట్టాడు. బంగ్లా తరఫున 200 వికెట్ల క్లబ్‌లో చేరిన రెండో బౌలర్ తైజుల్. తైజుల్‌కు ముందు షకీబ్ అల్ హసన్ (121 ఇన్నింగ్స్‌ల్లో 246 వికెట్లు) ఈ ఘనత సాధించాడు.
బంగ్లాదేశ్ తరఫున టెస్ట్‌ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు..
షకీబ్ అల్ హసన్-121 ఇన్నింగ్స్‌ల్లో 246 వికెట్లు
తైజుల్ ఇస్లాం- 85 ఇన్నింగ్స్‌ల్లో 201 వికెట్లు
మెహిది హసన్ మిరాజ్- 83 ఇన్నింగ్స్‌ల్లో 183 వికెట్లు
మొహమ్మద్ రఫీక్- 48 ఇన్నింగ్స్‌ల్లో 100 వికెట్లు
ముషరఫే మొర్తజా- 51 ఇన్నింగ్స్‌ల్లో 78 వికెట్లు
షహాదత్ హొసేన్- 60 ఇన్నింగ్స్‌ల్లో 72 వికెట్లు
మ్యాచ్ విషయానికొస్తే.. ఇవాళే మొదలైన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 106 పరుగులకే కుప్పకూలింది. కగిసో రబాడ (3/26), వియాన్ ముల్దర్(3/22), కేశవ్ మహారాజ్ (3/34), డేన్ పీడెట్ (1/19) బంగ్లా పతనాన్ని శాశించారు. బంగ్లా ఇన్నింగ్స్‌లో మహ్మదుల్ హసన్ జాయ్ (30), తైజుల్ ఇస్లాం (16), మెహిది హసన్ మిరాజ్ (13), ముష్ఫికర్ రహీం (11) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు.
అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌతాఫ్రికా 40 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 140 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. బంగ్లా బౌలర్లలో తైజుల్ ఐదు, హసన్ మహమూద్ ఓ వికెట్ పడగొట్టారు. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో మార్క్రమ్ (6), టోనీ డి జోర్జీ (30), ట్రిస్టన్ స్టబ్స్ (23), డేవిడ్ బెడింగ్హమ్ (11), ర్యాన్ రికెల్టన్ (27), మాథ్యూ బ్రీట్జ్కీ (0) ఔట్ కాగా.. కైల్ వెర్రిన్ (18), వియాన్ ముల్దర్ (17) క్రీజ్‌లో ఉన్నారు. ప్రస్తుతం సౌతాఫ్రికా 34 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది.
చదవండి: రెచ్చిపోయిన లంక బ్యాటర్లు.. విండీస్ ఖాతాలో మరో పరాజయం
Comments
Please login to add a commentAdd a comment