ఢాకా వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో పర్యాటక సౌతాఫ్రికా ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 106, రెండో ఇన్నింగ్స్‌లో 307 పరుగులు చేయగా.. సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 308, ఛేదనలో 3 వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసి విజయతీరాలకు చేరింది. సౌతాఫ్రికా పేసర్ రబాడ మ్యాచ్ మొత్తంలొ తొమ్మిది వికెట్లు తీసి బంగ్లా ఓటమికి ప్రధాన కారకుడయ్యాడు. కైల్ వెర్రిన్ తొలి ఇన్నింగ్స్‌లో సూపర్ సెంచరీ (114) తమ జట్టు గెలుపుకు పునాది వేశాడు.
కుప్పకూలిన బంగ్లాదేశ్
తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 106 పరుగులకు ఆలౌటైంది. రబాడ, వియాన్ ముల్దర్, కేశవ్ మహారాజ్ తలో మూడు వికెట్లు, డీన్ పైడిట్ ఓ వికెట్ తీసి బంగ్లా ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చారు. బంగ్లా ఇన్నింగ్స్‌లో మహ్మదుల్ హసన్ (30), తైజుల్ ఇస్లాం (16), మెహిది హసన్ మిరాజ్ (13), ముష్ఫికర్ రహీం (11) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు.
వెర్రిన్ సూపర్ సెంచరీ
అనంతరం సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 308 పరుగులకు ఆలౌటైంది. కైల్ వెర్రిన్ సూపర్ సెంచరీతో (114) తన జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. ముల్దర్ హాఫ్ సెంచరీతో (54) రాణించాడు. బంగ్లా బౌలర్లలో తైజుల్ ఇస్లాం ఐదు వికెట్లు పడగొట్టగా.. హసన్ మహమూద్ 3, మెహిది హసన్ మిరాజ్ 2 వికెట్లు దక్కించుకున్నారు.
సెంచరీ చేజార్చుకున్న మిరాజ్
202 పరుగులు వెనుకపడి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్ ఈ ఇన్నింగ్స్‌లో 307 పరుగులకు ఆలౌటైంది. తద్వారా సౌతాఫ్రికా ముందు 106 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది. బంగ్లా బ్యాటర్ మెహిది హసన్ మిరాజ్ (97) తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. రబాడ ఆరు వికెట్లు తీసి బంగ్లా పతనాన్ని శాశించాడు. కేశవ్ మహారాజ్ 3, ముల్దర్ ఓ వికెట్ పడగొట్టారు.
చదవండి: IND vs NZ 2nd Test: అశ్విన్ మ్యాజిక్.. కెప్టెన్ ఔట్
Comments
Please login to add a commentAdd a comment