ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్ బౌలర్ జాసన్ గిల్లెస్పీ పాకిస్తాన్ టెస్టు జట్టు హెడ్‌కోచ్‌గా ఆదివారం బాధ్యతలు చేపట్టాడు. ఈ క్రమంలో లహోర్‌లోని హైఫెర్మమెన్స్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన మీడియాలో సమవేశంలో గిల్లెస్పీ పాల్గోనున్నాడు.
ఈ సందర్భంగా గిల్లెస్సీ మాట్లాడుతూ.. పాకిస్తాన్‌ను రెడ్‌బాల్ క్రికెట్‌లో నెం1 జట్టుగా తీర్చేందుకు ప్రయత్నిస్తాని చెప్పుకొచ్చాడు. వచ్చే నెలలో పాకిస్తాన్ క్రికెట్ జట్టు స్వదేశంలో బంగ్లాదేశ్‌తో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తలపడనుంది. ఈ సిరీస్‌తోనే పాక్ టెస్టు జట్టు హెడ్‌కోచ్‌గా గిల్లెస్పీ ప్రయాణం మొదలు కానుంది. ఆ తర్వాత పాక్ స్వదేశంలోనే ఇంగ్లండ్‌తో కూడా టెస్టు సిరీస్ ఆడనుంది.
"పాకిస్తాన్ జట్టులో అద్బుతమైన ఆటగాళ్లు ఉన్నారు. నిజంగా ఈ జట్టు చాలా టాలెంటడ్. కానీ జట్టు ప్రదర్శనలో నిలకడలేదు. ఒక మ్యాచ్ బాగా ఆడితే మరో మ్యాచ్‌లో డీలా పడడం పరిపాటిగా మారింది. వారిని తిరిగి గాడిలో పెట్టడమే నా పని.
అందుకు తగ్గట్టుగానే నేను పనిచేస్తాను. ప్రస్తుత ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ సైకిల్‌లో పాకిస్థాన్ ఐదవ స్దానంలో ఉంది. రాబోయో సిరీస్‌లలో విజయం సాధించి మా ర్యాంక్‌ను మెరుగుపరుచుకునేందుకు ప్రయత్నిస్తాము.
మేము మా తదుపరి సిరీస్‌లో బంగ్లాదేశ్‌తో ఆడనున్నాం. ప్రస్తుతం నా దృష్టి అంతా ఈ సిరీస్‌పైనే ఉంది. ఫ్యూచర్ కోసం ఇప్పటినుంచి నేను ఆలోచించను. ముఖ్యంగా పాక్ జట్టులో కొన్ని విషయాలను గమనించాను.
పాక్ తొలుత అద్భుతంగా రాణించి ఆఖరిలో బోల్తా పడటం చాలా మ్యాచ్‌ల్లో చూశాను. బంగ్లాదేశ్ సిరీస్ తర్వాత ఇంగ్లండ్‌తో ఆడనున్నాం. కచ్చితంగా ఇంగ్లండ్ నుంచి మాకు తీవ్ర పోటీ ఎదురుకానుంది. నిజంగా మాకు అదొక ఛాలెంజ్. అందుకు తగ్గట్టు మేము కూడా సిద్దంగా ఉన్నాము. ఆఖరిగా పాక్‌ను నెం1 జట్టుగా నిలపడమే నా లక్ష్యమని" గిల్లెస్పీ విలేకరుల సమావేశంలో పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment