Jason Gillespie
-
అవన్నీ రూమర్సే.. మా హెడ్‌కోచ్ అతడే: పాక్ క్రికెట్ బోర్డు
పాకిస్తాన్ టెస్టు టీమ్ పదవినుంచి జాసన్ గిలెస్పీని తొలగిస్తున్నట్లుగా వచ్చిన వార్తలను పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తీవ్రంగా ఖండించింది. ఆ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని, పూర్తిగా అర్థరహితమని స్పష్టం చేసింది. ‘గిలెస్పీని తొలగిస్తున్నట్లు వచ్చిన వార్తలు అన్నీ అబద్ధం.గతంలోనే ప్రకటించిన విధంగా స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగే రెండు టెస్టు సిరీస్‌ల వరకు కూడా గిలెస్పీని కోచ్‌గా కొనసాగుతాడు’ అని పీసీబీ పేర్కొంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా గడ్డపై వన్డే, టి20 సిరీస్‌లు ఆడిన పాక్ జట్టుకు గిలెస్పీ తాత్కాలిక కోచ్‌గా కూడా వ్యవహరించాడు. అయితే ఈ రెండు ఫార్మాట్లతో పాటు టెస్టుల్లో కూడా అతని స్థానంలో పాక్ మాజీ పేసర్, ప్రస్తుత సెలక్షన్ కమిటీ కనీ్వనర్ ఆకిబ్ జావేద్‌ను కోచ్‌గా ఎంపిక చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. గిలెస్పీ కోచ్‌గా ఉన్న సమయంలో బంగ్లాదేశ్ చేతిలో 0–2తో ఓడిన పాక్...ఆ తర్వాత ఇంగ్లండ్‌పై 2–1తో విజయం సాధించింది. ఆసీస్ సిరీస్ తర్వాత పాక్ జట్టు నేరుగా జింబాబ్వేకు వెళుతుంది.చదవండి: రోహిత్ వచ్చినా అతడినే కెప్టెన్‌గా కొనసాగించండి: హర్భజన్ -
ఐదుగురిని సంప్రదించా.. త్వరలోనే కొత్త కోచ్ ఎంపిక: పీసీబీ చీఫ్
దక్షిణాఫ్రికా దిగ్గజం గ్యారీ కిర్‌స్టెన్ కోచ్ పదవి నుంచి తప్పుకోవడంపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) చీఫ్ మొహ్సిన్ నక్వీ స్పందించాడు. కిర్‌స్టెన్ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించాడని.. ఈ క్రమంలోనే అతడితో తమ బంధం ముగిసిందని పేర్కొన్నాడు. త్వరలోనే పాక్ పరిమిత ఓవర్ల జట్టుకు కొత్త కోచ్‌ను నియమిస్తామని తెలిపాడు.అందుకే రాజీనామా!కాగా పాకిస్తాన్ వన్డే, టీ20 జట్లకు హెడ్ కోచ్‌గా ఉన్న గ్యారీ కిర్‌స్టెన్ తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తన బాధ్యతల నుంచి తక్షణమే తప్పుకుంటున్నట్లు అతడు సోమవారం ప్రకటించాడు. రెండేళ్ల కాంట్రాక్ట్ వ్యవధితో ఈ ఏడాది ఏప్రిల్‌లో కిర్‌స్టెన్‌ను ప్రధాన కోచ్‌గా పీసీబీ నియమించింది. కానీ.. కనీసం ఆరు నెలలు కూడా అతడు కోచ్‌గా పని చేయలేదు. ఆస్ట్రేలియా పర్యటనకు పాక్ వెళ్లనున్న నేపథ్యంలో కిర్‌స్టెన్ తన పదవి నుంచి తప్పుకోవడం గమనార్హం. అయితే, జట్టు ఎంపిక విషయంలో తనకు ఉన్న అధికారాలను తప్పించడం పట్ల కలత చెందిన కిర్‌స్టెన్ రాజీనామా చేసినట్లు సమాచారం. పరిమిత ఓవర్ల జట్లకు కెప్టెన్లను ఎంపిక చేసే విషయంలో తన సూచనలను కనీసం పరిగణనలోకి తీసుకోకపోగా... తాను దేశంలోనే లేని సమయంలో జట్టును ప్రకటించడంపై పీసీబీ అధికారులతో కిర్‌స్టెన్ వాదనకు దిగినట్లు తెలిసింది.కాగా ఇటీవల సొంతగడ్డపై ఇంగ్లండ్ చేతిలో పాకిస్తాన్ తొలి టెస్టులో చిత్తయిన తర్వాత పీసీబీ కొత్త సెలక్షన్ కమిటీని నియమించిన విషయం విదితమే. ఈ విషయంలోనూ జోక్యం చేసుకోవద్దని కిర్‌స్టెన్‌కు పీసీబీ సూచించడం గమనార్హం. ఇక కిర్‌స్టెన్‌తో టెస్టు టీమ్ హెడ్ కోచ్‌గా ఉన్న జాసన్ గిలెస్పీ కూడా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నా... ఇంగ్లండ్‌తో తర్వాతి రెండు టెస్టుల్లో ఘన విజయం సాధించి పాక్ సిరీస్ గెలుచుకోవడంతో ఈ అంశం కాస్త వెనక్కి వెళ్లింది. ఒక్క వన్డే ఆడకుండా... ఇదిలా ఉంటే.. కిర్‌స్టెన్ కోచ్‌గా బాధ్యతలు తీసుకున్న తర్వాత పాకిస్తాన్ టీ20 ప్రపంచ కప్‌లో బరిలోకి దిగింది. గ్రూప్ దశలో భారత్, అమెరికా చేతుల్లో పరాజయంతో సూపర్–8 దశకు కూడా చేరకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించింది. అయితే, 28 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత టీమిండియాను వన్డే వరల్డ్ చాంపియన్‌గా నిలిపిన రికార్డు ఉన్న కిర్‌స్టెన్‌ను ఎంపిక చేసినప్పుడు ప్రధానంగా తమ వన్డే టీమ్‌ను తీర్చిదిద్దే విషయంపైనే బాధ్యతలు అప్పగించారు.అంతేకాదు.. 2025లో పాకిస్తాన్ వేదికగా జరిగే చాంపియన్స్ ట్రోఫీలో తమ టీమ్‌ను విజేతగా నిలపాలని...అందు కోసం ఆయన ఆలోచనల ప్రకారం జట్టును మలిచే అధికారాన్ని పీసీబీ ఇచ్చింది. అయితే ఈ ఆరు నెలల వ్యవధిలో పాక్ ఒక్క వన్డే కూడా ఆడకపోవడం విశేషం!గిలెస్పీకి వన్డే, టీ20 కోచ్‌గా తాత్కాలిక బాధ్యతలుమరోవైపు ప్రస్తుతం టెస్టు కోచ్‌గా ఉన్న ఆసీస్ మాజీ పేస్ బౌలర్ గిలెస్పీకి వన్డే, టీ20 కోచ్‌గా తాత్కాలిక బాధ్యతలు అప్పగించినట్లు పీసీబీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో పీసీబీ చీఫ్ మొహ్సిన్ నక్వీ మాట్లాడుతూ.. ‘‘కిర్‌స్టెన్ పీసీబీతో ఒప్పందాన్ని రద్దు చేసుకున్నాడు. అంతేకాదు.. బోర్డు నిబంధనల్లో కొన్నిటిని ఉల్లంఘించాడు. మాతో కాంట్రాక్టును అతడే ముగించుకున్నాడు’’ అని తెలిపాడు.ఐదుగురిని సంప్రదించాఇక జింబాబ్వే పర్యటన సందర్భంగా తమ వన్డే, టీ20 జట్లకు కొత్త కోచ్ వస్తాడని నక్వీ ఈ సందర్భంగా వెల్లడించాడు. ఆస్ట్రేలియా గడ్డపై పాక్ ఆడే మూడు వన్డేలు, మూడు టీ20 వరకు మాత్రమే తాను కోచ్‌గా పని చేస్తానని గిల్లెస్పీ చెప్పాడని పేర్కొన్నాడు. అతడికి పూర్తి స్థాయిలో బాధ్యతలు తీసుకునే ఉద్దేశం లేదని తెలిపిన నక్వీ.. కొత్త కోచ్ అన్వేషణలో భాగంగా ఇప్పటికే తాను ఐదుగురిని సంప్రదించానని పేర్కొన్నాడు. చదవండి: IPL 2025: అత్యంత ఖరీదైన ఆటగాడు అతడే.. పది జట్ల రిటెన్షన్ లిస్టు ఇదే! -
పాకిస్తాన్ ఆల్ ఫార్మాట్ కోచ్‌గా జేసన్ గిల్లెస్పీ
పాకిస్తాన్ ఆల్ ఫార్మాట్ హెడ్ కోచ్‌గా జేసన్ గిల్లెస్పీ నియమితుడయ్యాడు. పరిమిత ఓవర్ల హెడ్ కోచ్ పదవికి గ్యారీ కిర్‌స్టన్ రాజీనామా చేసిన నేపథ్యంలో గిల్లెస్పీ ఎంపిక జరిగింది. ఆల్ ఫార్మాట్ కోచ్‌గా ఎంపిక కాకముందు గిల్లెస్పీ కేవలం టెస్ట్‌లకు మాత్రమే కోచ్‌గా వ్యవహరించే వాడు. గిల్లెస్పీ త్వరలో ఆస్ట్రేలియాలో పర్యటించబోయే పాక్ జట్టుకు హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తాడు. ఆటగాళ్లతో, క్రికెట్ బోర్డుతో విభేదాల కారణంగా కిర్‌స్టన్ హెడ్ కోచ్ పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తుంది. హై పెర్ఫార్మెన్ కోచ్‌గా డేవిడ్ రీడ్‌ను నియమించాలని కిర్‌స్టన్ కోరగా.. పాక్ క్రికెట్ బోర్డు అందుకు నిరాకరించినట్లు సమాచారం.కాగా, ఇటీవలికాలంలో పాక్ క్రికెట్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. మూడు నెలల కాలంలో మూడు సార్లు సెలక్షన్ ప్యానెల్లో మార్పులు చేసిన పీసీబీ.. తాజాగా గ్యారీ కిర్‌స్టన్ హెడ్ పదవి నుంచి తప్పుకునేలా చేసింది. ఇటీవలే బాబర్ ఆజమ్ పాక్ పరిమిత ఓవర్ల కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. దీంతో నిన్ననే బాబర్ స్థానంలో పాక్ పరిమిత ఓవర్ల కెప్టెన్‌గా మహ్మద్ రిజ్వాన్‌ను నియమించారు. స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో చివరి రెండు టెస్ట్‌లకు బాబర్ ఆజమ్, షాహీన్ అఫ్రిది, నసీం షాలను తప్పించారు. ఈ అంశం అప్పట్లో పాక్ క్రికెట్‌ను కుదిపేసింది. అయితే ఈ ముగ్గురు స్టార్లు లేకపోయినా పాక్ ఇంగ్లండ్‌పై టెస్ట్ సిరీస్‌లో గెలవడం కొసమెరుపు. -
Pak vs Eng: ‘అలాంటి పిచ్ కావాలి.. నోరు మూయండి’
పాకిస్తాన్ సొంతగడ్డపై మరో టెస్టు సిరీస్‌కు సిద్ధమవుతోంది. ఇంగ్లండ్‌తో అక్టోబరు 7 నుంచి మూడు టెస్టులు ఆడనుంది. కాగా గత కొన్నాళ్లుగా టెస్టుల్లో పాకిస్తాన్‌కు విజయమన్నదే కరువైంది. ఇటీవల స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల సిరీస్‌లోనూ ఘోర పరాభవం పాలైంది.షాన్ మసూద్ బృందంపై విమర్శలుతొలిసారిగా బంగ్లా చేతిలో టెస్టులో ఓడటమే గాకుండా సిరీస్‌లో 0-2తో వైట్‌వాష్‌కు గురైంది. దీంతో షాన్ మసూద్ బృందంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. అంతేకాదు.. ఈ సిరీస్‌తో పాక్ టెస్టు జట్టు కోచ్‌గా బాధ్యతలు స్వీకరించిన ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ జేసన్ గిల్లెస్పికి కూడా చేదు అనుభవం ఎదురైంది.ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌తో తాజా సిరీస్ జట్టుతో పాటు గిల్లెస్పికి కూడా ప్రతిష్టాత్మకంగా మారింది. ఈ క్రమంలో అతడు కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి సిద్ధమైనట్లు సమాచారం. ముఖ్యంగా.. సులువుగా పరుగులు రాబట్టడానికి వీలుగా ఉండే ఫ్లాట్ పిచ్ కావాలని కోరిన పాక్ బ్యాటర్ల అభ్యర్థనను నిరభ్యంతరంగా కొట్టిపారేసినట్లు తెలుస్తోంది.అలాంటి పిచ్ కావాలి.. నోరు మూయండిపాకిస్తాన్ మాజీ క్రికెటర్ బసిత్ అలీ ఈ విషయాన్ని బయటపెట్టాడు. ‘‘పాక్ టెస్టు జట్టు లోపల ఏం జరిగిందో చెప్తాను. ఫ్లాట్ పిచ్ కావాలని కోరిన పాకిస్తాన్ ఆటగాళ్ల నోళ్లను అతడు మూయించేశాడు. గ్రౌండ్స్‌మెన్ తయారు చేసిన పిచ్‌ను అచ్చంగా అలాగే కొనసాగించాలని నిర్ణయించాడు.ఎక్కువ కష్టపడకుండా సులువుగా పరుగులు రాబట్టాలనే వారి రిక్వెస్ట్‌ను కొట్టిపారేశాడు. పిచ్ క్యూరేటర్, గిల్లెస్పి ఆట రసవత్తరంగా సాగేలా పిచ్‌ను తయారు చేసేందుకే మొగ్గుచూపారు. గ్రాసీ పిచ్‌పై మ్యాచ్ జరిగి మా బౌలర్లు వికెట్లు తీస్తే అంతకంటే సంతోషం మరొకటి ఉండదు’’ బసిత్ అలీ తన యూట్యూబ్ చానెల్ వేదికగా పేర్కొన్నాడు.అప్పుడు 3-0తో చిత్తుకాగా అక్టోబరు 7న పాకిస్తాన్ -ఇంగ్లంఢ్ మధ్య ముల్తాన్ క్రికెట్ స్టేడియంలో తొలి టెస్టు మొదలుకానుంది. ఇరుజట్ల మధ్య 2022లో పాకిస్తాన్ వేదికగా జరిగిన సిరీస్‌లో ఇంగ్లండ్ 3-0తో ఆతిథ్య జట్టును మట్టికరిపించింది. మరోసారి క్లీన్‌స్వీపే లక్ష్యంగా పాక్ గడ్డపై అడుగుపెట్టింది. చదవండి: IPL 2025: రోహిత్, కిషన్‌కు నో ఛాన్స్.. ముంబై రిటెన్షన్ లిస్ట్ ఇదే! -
బాబర్ ఆజం రిటైర్మెంట్..? క్లారిటీ ఇచ్చిన హెడ్ కోచ్
పాకిస్తాన్ స్టార్ క్రికెటర్ బాబర్ ఆజం తన పేలవ ఫామ్‌ను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ఆజం నిరాశపరిచాడు. తొలి టెస్టులో దారుణ ప్రదర్శన కనబరిచిన బాబర్.. రెండో టెస్టులోనూ అదే ఆటతీరును కనబరిచాడు.తొలి ఇన్నింగ్స్‌లో 31 పరుగులు చేసిన ఆజం, రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 11 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరాడు. టెస్టు క్రికెట్లో అయితే బాబర్ హాఫ్ సెంచరీ సాధించి 20 నెలలపైనే అయింది. అతడు చివరగా టెస్టుల్లో డిసెంబర్ 2022లో న్యూజిలాండ్‌పై ఫిఫ్టీ స్కోర్లు సాధించాడు. ఈ క్రమంలో బాబర్ ఆజంపై తీవ్ర విమర్శల వర్షం కురుస్తోంది. అయితే వరుసగా విఫలమవుతుండడంతో టెస్టు క్రికెట్‌కు బాబర్ వీడ్కోలు పలకాలని నిర్ణయించుకున్నట్లు ఓ రిటైర్మెంట్ నోట్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. బాబర్‌కు ఇదే చివరి టెస్టు అని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తలను పాకిస్తాన్ హెడ్‌కోచ్ జాసన్ గిల్లెస్పీ ఖండించాడు. బాబర్‌కు సపోర్ట్‌గా గిల్లెస్పీ నిలిచాడు."బాబర్ ఒక అద్భుతమైన ఆటగాడు. అతడొక వరల్డ్‌క్లాస్ ప్లేయర్. బాబర్ తన ఫామ్‌ను తిరిగి అందుకుంటాడని భావిస్తున్నాను. త్వరలోనే అతడి నుంచి మనం ఓ భారీ ఇన్నింగ్స్ చూస్తాము. నాకు ఆ నమ్మకం ఉంది. అతడు తన లభించిన ఆరంభాలను భారీ స్కోర్లగా మలుచుకోవడంలో విఫలమయ్యాడు అని" 4వ రోజు ఆట అనంతరం గిల్లెస్పీ విలేకరుల సమావేశంలో పేర్కొన్నాడు.చదవండి: Pak vs Ban: ఆలస్యమైతే అవుటే!.. భయంతో పాక్ క్రికెటర్ పరుగులు -
పాక్ హెడ్‌కోచ్‌గా అంటే కత్తి మీద సాము లాంటిదే: డేవ్ వాట్మోర్
వన్డే వరల్డ్‌కప్-2023లో ఘోర పరాభావం తర్వాత పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తమ కోచింగ్ స్టాప్ మొత్తాన్ని ప్రక్షాళన చేసిన సంగతి తెలిసిందే. పాక్ జట్టు పరిమిత ఓవర్ల హెడ్‌కోచ్‌గా దక్షిణాఫ్రికా క్రికెట్ దిగ్గజం గ్యారీ కిర్‌స్టెన్ బాధ్యతలు చేపట్టగా.. టెస్టు జట్టు ప్రధాన కోచ్‌గా ఆసీస్ ఫాస్ట్ బౌలింగ్ లెజెండ్ జాసన్ గిల్లెస్పీ ఎంపికయ్యాడు.గ్యారీ కిర్‌స్టెన్ ఇప్పటికే తన ప్రయణాన్ని ప్రారంభించగా.. వచ్చే నెలలో స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరిగే టెస్టు సిరీస్‌తో గిల్లెస్పీ ప్రస్ధానం మొదలు కానుంది. అయితే కోచ్‌లు మారినప్పటకి పాక్ తల రాత ఏమాత్రం మారలేదు. కిర్‌స్టెన్ నేతృత్వంలోని పాక్ జట్టు టీ20 వరల్డ్‌కప్-2024లో దారుణ ప్రదర్శన కనబరిచింది. గ్రూపు స్టేజిలోనే పాక్ ఇంటిముఖం పట్టింది. ఈ క్రమంలో పాక్ జట్టుతో పాటు పీసీబీపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. తాజాగా పాకిస్థాన్ మాజీ ప్రధాన కోచ్ డేవ్ వాట్మోర్ కొత్త హెడ్‌కోచ్‌లు గ్యారీ కిర్‌స్టెన్, జాసన్ గిల్లెస్పీలకు కీలక సూచనలు చేశాడు. పాక్ జట్టును విజయం పథంలో నడిపించడం అంత ఈజీ కాదని వాట్మోర్ అభిప్రాయపడ్డాడు."ఇప్పటికే పాక్ సెలక్షన్ కమిటీ చాలా మార్పుల చోటు చేసుకున్నాయి. ఈ మార్పులు వల్ల పాక్ క్రికెట్‌కు ఎంత నష్టం జరుగుతుంతో వేచి చూడాలి. నావరకు నేను ఆదృష్టవంతుడిని. ఎందుకంటే పాక్ జట్టు హెడ్‌కోచ్‌గా నా పదవీకాలాన్ని మొత్తాన్ని పూర్తి చేసే అవకాశం దక్కింది. ఈ మధ్య కాలంలో పాక్‌కు కోచ్‌లు మారుతునే ఉన్నారు. కొత్త కోచ్‌లకు నేను ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నాను. ప్రశాంతంగా ఉండి తమ పని తాము చేసుకుపోవాలి. ఏదేమైనప్పటకి పాక్ జట్టు హెడ్ కోచ్‌గా పనిచేయడం అంత సులభం కాదు" అని ఓ స్పోర్ట్స్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వాట్మోర్ పేర్కొన్నాడు. కాగా 2012లో పాక్ జట్టుహెడ్ కోచ్‌గా వాట్మోర్ పనిచేశాడు. -
టాలెంట్‌కు కొదవ లేదు.. పాక్‌ను నెం1 జట్టుగా నిలుపుతా: జాసన్ గిల్లెస్పీ
ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్ బౌలర్ జాసన్ గిల్లెస్పీ పాకిస్తాన్ టెస్టు జట్టు హెడ్‌కోచ్‌గా ఆదివారం బాధ్యతలు చేపట్టాడు. ఈ క్రమంలో లహోర్‌లోని హైఫెర్మమెన్స్ సెంటర్లో ఏర్పాటు చేసిన మీడియాలో సమవేశంలో గిల్లెస్పీ పాల్గోనున్నాడు.ఈ సందర్భంగా గిల్లెస్సీ మాట్లాడుతూ.. పాకిస్తాన్‌ను రెడ్‌బాల్ క్రికెట్లో నెం1 జట్టుగా తీర్చేందుకు ప్రయత్నిస్తాని చెప్పుకొచ్చాడు. వచ్చే నెలలో పాకిస్తాన్ క్రికెట్ జట్టు స్వదేశంలో బంగ్లాదేశ్‌తో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తలపడనుంది. ఈ సిరీస్‌తోనే పాక్ టెస్టు జట్టు హెడ్‌కోచ్‌గా గిల్లెస్పీ ప్రయాణం మొదలు కానుంది. ఆ తర్వాత పాక్ స్వదేశంలోనే ఇంగ్లండ్‌తో కూడా టెస్టు సిరీస్ ఆడనుంది."పాకిస్తాన్ జట్టులో అద్బుతమైన ఆటగాళ్లు ఉన్నారు. నిజంగా ఈ జట్టు చాలా టాలెంటడ్. కానీ జట్టు ప్రదర్శనలో నిలకడలేదు. ఒక మ్యాచ్ బాగా ఆడితే మరో మ్యాచ్‌లో డీలా పడడం పరిపాటిగా మారింది. వారిని తిరిగి గాడిలో పెట్టడమే నా పని. అందుకు తగ్గట్టుగానే నేను పనిచేస్తాను. ప్రస్తుత ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ సైకిల్లో పాకిస్థాన్ ఐదవ స్దానంలో ఉంది. రాబోయో సిరీస్‌లలో విజయం సాధించి మా ర్యాంక్‌ను మెరుగుపరుచుకునేందుకు ప్రయత్నిస్తాము. మేము మా తదుపరి సిరీస్‌లో బంగ్లాదేశ్‌తో ఆడనున్నాం. ప్రస్తుతం నా దృష్టి అంతా ఈ సిరీస్‌పైనే ఉంది. ఫ్యూచర్ కోసం ఇప్పటినుంచి నేను ఆలోచించను. ముఖ్యంగా పాక్ జట్టులో కొన్ని విషయాలను గమనించాను. పాక్ తొలుత అద్భుతంగా రాణించి ఆఖరిలో బోల్తా పడటం చాలా మ్యాచ్‌ల్లో చూశాను. బంగ్లాదేశ్ సిరీస్ తర్వాత ఇంగ్లండ్‌తో ఆడనున్నాం. కచ్చితంగా ఇంగ్లండ్ నుంచి మాకు తీవ్ర పోటీ ఎదురుకానుంది. నిజంగా మాకు అదొక ఛాలెంజ్. అందుకు తగ్గట్టు మేము కూడా సిద్దంగా ఉన్నాము. ఆఖరిగా పాక్‌ను నెం1 జట్టుగా నిలపడమే నా లక్ష్యమని" గిల్లెస్పీ విలేకరుల సమావేశంలో పేర్కొన్నాడు. -
పాక్ పరిమిత ఓవర్ల క్రికెట్ జట్టు హెడ్ కోచ్‌గా సౌతాఫ్రికా దిగ్గజం
పాకిస్తాన్ పరిమిత ఓవర్ల (వన్డే, టీ20) క్రికెట్ జట్టు హెడ్ కోచ్‌గా సౌతాఫ్రికా దిగ్గజ ఆటగాడు గ్యారీ కిర్‌స్టెన్ ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని పాక్ క్రికెట్ బోర్డు అధికారికంగా వెల్లడించింది. పాక్ టెస్ట్ జట్టుకు ఆసీస్ మాజీ స్పీడ్‌స్టర్ జేసన్ గిలెస్పీ హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తాడని పీసీబీ ప్రకటించింది. మూడు ఫార్మాట్లలో అసిస్టెంట్ కోచ్‌గా మాజీ ఆల్‌రౌండర్ (పాక్) ఉంటాడని పేర్కొంది. మే 22 నుంచి ప్రారంభమయ్యే ఇంగ్లండ్ టీ20 సిరీస్‌తో కిర్‌స్టెన్ పాక్ కోచింగ్ బాధ్యతలు చేపడతాడని తెలుస్తుంది. ఇంగ్లండ్ సిరీస్‌లో పాక్ నాలుగు టీ20లు ఆడుతుంది. అక్కడి నుంచి పాక్ జట్టు నేరుగా వరల్డ్‌కప్ వేదిక అయిన యూఎస్ఏకు బయల్దేరుతుంది. pic.twitter.com/nGMEvkPW70— Pakistan Cricket (@TheRealPCB) April 28, 2024 కాగా, 2023 వన్డే వరల్డ్‌కప్ తర్వాతి నుంచి పాక్ జట్టుకు రెగ్యులర్ హెడ్ కోచ్ లేడు. ఆ వరల్డ్‌కప్‌లో పాక్ జట్టు పేలవ ప్రదర్శన నేపథ్యంలో పీసీబీ అప్పటి ప్రధాన కోచ్ గ్రాంట్ బ్రాడ్‌బర్న్, టీమ్ డైరెక్టర్ మిక్కీ ఆర్థర్, బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్, బ్యాటింగ్ కోచ్ ఆండ్రూ పుట్టిక్లను తొలగించింది. ఈ మెగా ఈవెంట్ తర్వాత పాక్ ప్రీమియర్ బ్యాటర్ బాబర్ అజామ్ కూడా కెప్టెన్సీ నుండి తొలగించబడ్డాడు. వైట్ బాల్ కెప్టెన్‌గా షాహీన్ షా ఆఫ్రిది, టెస్ట్ జట్టు కెప్టెన్‌గా షాన్ మసూద్ ఎంపికయ్యారు. అయితే ఇటీవలి పరిణామాల నేపథ్యంలో పీసీబీ తిరిగి బాబర్ ఆజమ్‌ను పరిమిత ఓవర్ల జట్టు కెప్టెన్‌గా నియమించింది.కిర్‌స్టెన్ విషయానికొస్తే.. రిటైర్మెంట్ అనంతరం ఫుల్‌టైమ్ కోచ్‌గా సెటిల్ అయిన కిర్‌స్టెన్ దేశ విదేశాల్లో చాలా జట్లకు కోచ్‌గా పని చేశాడు. కిర్‌స్టెన్ టీమిండియా 2011 వన్డే వరల్డ్‌కప్ గెలిచినప్పుడు హెడ్ కోచ్‌గా ఉన్నాడు. ఈ సౌతాఫ్రికా మాజీ ఆల్‌రౌండర్ ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ హెడ్ కోచ్‌గా పని చేస్తున్నాడు. 56 ఏళ్ల కిర్‌స్టెన్ సౌతాఫ్రికా తరఫున101 టెస్ట్‌లు, 185 వన్డేలు ఆడి 14000 పైచిలుకు పరుగులు చేశాడు. కిర్‌స్టెన్ గతంలో సొంత జట్టుకు కూడా కోచ్‌గా పని చేశాడు. -
గుర్తుండిపోయే ‘నైట్ వాచ్‌మ్యాన్’ ఇన్నింగ్స్
మెల్బోర్న్: ఆస్ట్రేలియా మాజీ బౌలర్ జాసన్ గిలెస్పీకి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 1996-2006 మధ్య కాలంలో ఆస్ట్రేలియా క్రికెట్ పేస్ దళంలో కీలక పాత్ర పోషించాడు. ఆసీస్ తరపున గిలెస్పీ 71 టెస్టులు, 97 వన్డేలు ఆడాడు. టెస్టుల్లో 259 వికెట్లు, వన్డేల్లో 142 వికెట్లను గిలెస్పీ సాధించాడు. ఇక బిగ్‌బాష్ లీగ్‌లో అడిలైడ్ స్టైకర్స్‌కు చీఫ్ కోచ్‌గా గిలెస్పీ చేశాడు. అయితే గిలెస్పీ పేరిట అరుదైన రికార్డు ఉంది. కేవలం బౌలర్‌గా మాత్రమే తెలిసిన గిలెస్పీ ఒక బ్యాటింగ్ రికార్డును కూడా సాధించాడు. అది కూడా డబుల్ సెంచరీ రికార్డు. ఒక నైట్‌వాచ్ మ్యాన్‌గా దిగి అత్యధిక స్కోరు సాధించిన రికార్డు ఇప్పటికీ గిలెస్పీ పేరిటే ఉంది. అది జరిగి నేటికి సరిగ్గా 14 ఏళ్లు అయ్యింది. (రోహిత్ క్రికెటర్ కాదన్న పఠాన్.. సమర్థించిన షమీ) 2006, ఏప్రిల్ 19 వ తేదీన గిలెస్పీ ఈ ఫీట్ నమోదు చేశాడు. బంగ్లాదేశ్‌తో చిట్టగాంగ్‌లో జరిగిన టెస్టు మ్యాచ్‌లో మూడో రోజు ఆట కాసేపట్లో ముగుస్తుందనగా మాథ్యూ హేడెన్ ఔటయ్యాడు. దాంతో నైట్‌వాచ్ మ్యాన్ పాత్రలో గిలెస్పీని పంపించారు. ఆరోజు మరో వికెట్ ఇవ్వకుండా ఉండటం కోసం గిలెస్పీని ఆసీస్ పంపితే, అతను ఆ ఆ తదుపరి రోజంతా క్రీజ్‌లో ఉండి డబుల్ సెంచరీతో మెరిశాడు. 425 బంతుల్ని ఎదుర్కొన్న గిలెస్పీ 26 ఫోర్లు, 2 సిక్స్‌లతో అజేయంగా 201 పరుగులు చేసి ఆసీస్‌ను పటిష్ట స్థితిలో నిలిపాడు. అతనికి జతగా మైక్ హస్సీ(182) కూడా రాణించడంతో ఆసీస్ 581 పరుగుల వద్ద తమ తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. దాంతో ఆసీస్‌కు 384 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. ఆపై బంగ్లాదేశ్ తన రెండో ఇన్నింగ్స్‌లో 304 పరుగులకు ఆలౌట్ కావడంతో ఆసీస్ ఇన్నింగ్స్ తేడాతో విజయం సాధించింది. ఆసీస్ ఇన్నింగ్స్ విజయం సాధించడానికి గిలెస్పీ విశేషంగా రాణించడమే ఒక కారణంగా కాగా, అతని కెరీర్ చివరి టెస్టులో ఈ రికార్డు సాధించడం మరో విశేషం.(అప్పుడు రైనాకే ధోని ఓటేశాడు: యువీ) -
ద్రవిడ్ స్థానంలో గిలెస్పీ?
న్యూఢిల్లీ: ప్రస్తుతం భారత అండర్-19 క్రికెట్ జట్టుతో పాటు భారత-ఎ జట్టుకు దిగ్గజ ఆటగాడు రాహుల్ ద్రవిడ్ కోచ్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ద్రవిడ్ ను మరో రెండేళ్ల పాటు కోచ్ గా నియమిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. అయితే గతంలో మాదిరి కాకుండా పూర్తిస్థాయి కోచింగ్ బాధ్యతలను ద్రవిడ్ కు అప్పగించారు. దాంతో ఇక ఏ లీగ్ కు ద్రవిడ్ కోచ్ గా వ్యవహరించకూడదు. ఆ నేపథ్యంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) లో ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టుకు కోచ్ పదవికి ద్రవిడ్ రాజీనామా చేశాడు. ఈ క్రమంలోనే వచ్చే ఐపీఎల్ సీజన్ లో ద్రవిడ్ స్థానాన్ని సరైన వ్యక్తితో భర్తీ చేయాలనే యోచనలో ఉంది డేర్ డెవిల్స్ యాజమాన్యం. దానిలో భాగంగా జాసన్ గిలెస్పీన్ని ఢిల్లీ యాజమాన్యం ఇప్పటికే సంప్రదించినట్లు తెలుస్తోంది. ఆస్ట్రేలియాకు చెందిన గిలెస్పీ.. బిగ్‌బాష్ లీగ్ లో అడిలైడ్ స్ట్రైకర్స్ కు చీఫ్ కోచ్ గా ఉన్నాడు. మరొకవైపు ఇంగ్లిష్ కౌంటీ యార్క్‌షైర్ గిలెస్పీని మరోసారి కోచ్ గా తీసుకునేందుకు మొగ్గుచూపుతోంది. అతని పర్యవేక్షణలోని ఆ జట్టు రెండుసార్టు కౌంటీ చాంపియన్‌షిప్ ను గెలిచింది. ఆసీస్ తరపున గిలెస్పీ 71 టెస్టులు, 97 వన్డేలు ఆడాడు. టెస్టుల్లో 259 వికెట్లు సాధించగా, వన్డేల్లో 142 వికెట్లను ఖాతాలో వేసుకున్నాడు. -
'మ్యాక్స్ వెల్ ను వేసుకోండి'
సిడ్నీ: భారత్‌లో పర్యటిస్తున్న ఆస్ట్రేలియా జట్టులో స్టార్ ఆటగాడు మ్యాక్ప్ వెల్ ఉంటే తమ జట్టు ఇంకా బలంగా ఉంటుందని మాజీ బౌలర్ జాసన్ గిలెస్పీ పేర్కొన్నాడు. ఇంకా మూడు టెస్టు మ్యాచ్ లు ఆడాల్సిన తరుణంలో మ్యాక్స్ వెల్ ను జట్టులో వేసుకోవాలని సెలక్టర్లకు సూచించాడు. భారత్ స్పిన్ ను వారి దేశంలో ధైర్యంగా ఎదుర్కోవాలంటే మ్యాక్స్ వెల్ ఒక్కడే ప్రత్యామ్నాయంగా గిలెస్పీ తెలిపాడు. 'ఒకవేళ ఆస్ట్రేలియా జట్టు ఏమైనా మార్పులతో మిగతా టెస్టు మ్యాచ్ లకు సిద్దమవ్వాలనుకుంటే మాత్రం మ్యాక్స్ వెల్ ను తుది జట్టులో వేసుకోండి. మ్యాక్సీ ని జట్టులో వేసుకుంటే ఆసీస్ ఇంకా బలపడుతుంది. భారత్ లో స్పిన్ ను ధైర్యంగా ఎదుర్కొనే ఆటగాడు మ్యాక్స్ వెల్. స్పిన్ ను అటాక్ చేసే ఆసీస్ ఆటగాళ్లలో మ్యాక్సీ ఒకడు. మిచెల్ మార్ష్ స్థానంలో అతన్ని వేసుకుంటే మంచిది. ఆసీస్ మరింత సమర్ధవంతంగా సిరీస్ లో ముందుకెళుతుంది' అని గిలెస్పీ సూచించాడు. -
'సెలక్టర్ గా చేయాలని ఉంది'
సిడ్నీ:ఆస్ట్రేలియా మాజీ బౌలర్ జాసన్ గిలెస్పీ ఆ దేశ క్రికెట్ బోర్డులో కొత్త ఇన్నింగ్స్ ను ఆరంభించేందుకు ఆసక్తి కనబరుస్తున్నాడు. తనకు ఆస్ట్రేలియా జాతీయ క్రికెట్ జట్టుకు సెలక్టర్ గా చేయాలని ఉందంటూ మనసులోని బయటపెట్టాడు. దాదాపు ఐదు సంవత్సరాల పాటు ఇంగ్లండ్ కౌంటీల్లో భాగంగా యార్క్‌షైర్‌కు సెలక్షన్ బాధ్యతలను చూసిన గిలెస్పీ.. ప్రస్తుతం క్రికెట్ ఆస్ట్రేలియాలో సెలక్షర్ పదవిపై మక్కువగా ఉన్నాడు. ఇప్పటికే వచ్చే బిగ్ బాష్ లీగ్‌లో అడిలైడ్ స్టైకర్కు కోచ్ గా వ్యవహరించనున్న గిలెస్పీ.. ఇక ఇంగ్లండ్ వెళ్లే ఉద్దేశం లేదని స్ఫష్టం చేశాడు. ఈ క్రమంలోనే ఆసీస్ కు సెలక్షన్ బాధ్యతలు చూడాలని ఉన్నట్లు తెలిపాడు. 'యార్క్‌షైర్ నుంచి తప్పుకోవడం చాలా కఠినతో కూడిన నిర్ణయం. ప్రస్తుత కుటుంబ పరిస్థితులు, నా కెరీర్‌ను దృష్టిలో పెట్టుకునే ఆస్ట్రేలియాకు తిరిగి వచ్చేశాను. ఆసీస్ చీఫ్ సెలక్టర్ రాడ్ మార్ష్‌తో కలిసి పని చేయాలని ఉంది' అని తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. వచ్చే సంవత్సరం జరిగే సెలక్టర్ల నియామకాల్లో తన పేరును బోర్డుకు సూచిస్తానని గిలెస్పీ పేర్కొన్నాడు. -
హమ్మయ్యా.. నన్ను కోచ్‌ను చేయలేదు!
సిడ్నీ: ఏ జట్టుకైనా కోచ్‌గా నియమించబడటం అంటే అది అరుదైన గౌరవం. అంతటి హై ప్రొఫైల్ జాబ్‌ను ఏ మాజీ ఆటగాడు కూడా వదులుకోడు. ఒక జట్టు కోచింగ్ పదవులు ఇచ్చే క్రమంలో తీవ్రమైన పోటీ కూడా ఉంటుంది. అయితే తనకు కోచింగ్ పదవి ఇవ్వకపోవడంపై ఆస్ట్రేలియా మాజీ పేసర్ జాసన్ గిలెస్పీ భిన్నంగా స్పందించాడు. గతంలో ఇంగ్లండ్ ప్రధాన కోచ్ పదవికి గిలెస్పీ పేరు ప్రధానంగా ప్రస్తావనకు వచ్చింది. అయితే చివరి నిమిషంలో ఆ పదవి గిలెస్పీని వరించలేదు. ఆ కీలకమైప పదవిని ఆస్ట్రేలియాకే చెందిన ట్రెవర్ బాలిస్ అప్పగించారు. అప్పట్లో ఈ విషయంపై గిలెస్పీ ఎలా స్పందించాడు అనేది అప్రస్తుతమైతే.. ఇప్పుడు మాత్రం ఆ పదవి తనకు ఇవ్వకుండా మంచి పని చేశారని అంటున్నాడు. ఇలా ఇంగ్లండ్ క్రికెట్ తన పేరును పక్కకు పెట్టడంతో కావాల్సినంత విశ్రాంతి దొరికిందని స్పష్టం చేశాడు. 'ప్రపంచ క్రికెట్ లో కోచ్ పదవి అనేది ఒక ఉత్తమైన జాబ్. ఇంగ్లండ్ కోచ్ పదవి అన్వేషణలో నా పేరు వినిపించింది. ఒకవేళ వారు కాల్ చేసి ఉంటే సమాధానం చెప్పడానికి ఇబ్బంది పడేవాన్ని. ఆ పదవి నాకు ఇవ్వకుండా మంచి పని చేశారు. అలా జరగడం వల్ల కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయించే ఆస్కారం దొరికింది' అని గిలెస్పీ తెలిపాడు. గతేడాది వెస్టిండీస్ తో జరిగిన టెస్టు సిరీస్‌ను ఇంగ్లండ్ డ్రా చేసుకోవడమే కాకుండా, ఈ ఏడాది టీ 20 వరల్డ్ కప్ ఫైనల్లో విండీస్ చేతిలో ఇంగ్లండ్ ఓటమి పాలైంది. దీంతో ఇంగ్లండ్ జట్టు మార్పులు చేపట్టింది. తమ జట్టు కోచ్ పదవి నుంచి పీటర్స్ మూర్స్ ను తప్పించింది. ఆ క్రమంలోనే గిలెస్పీ పేరు ఎక్కువగా వార్తల్లో నిలిచినా, చివరకు ట్రెవర్ బాలిస్ కు కట్టబెట్టడం జరిగిపోయింది.