పాకిస్తాన్ పరిమిత ఓవర్ల (వన్డే, టీ20) క్రికెట్ జట్టు హెడ్ కోచ్‌గా సౌతాఫ్రికా దిగ్గజ ఆటగాడు గ్యారీ కిర్‌స్టెన్ ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని పాక్ క్రికెట్ బోర్డు అధికారికంగా వెల్లడించింది. పాక్ టెస్ట్ జట్టుకు ఆసీస్ మాజీ స్పీడ్‌స్టర్ జేసన్ గిలెస్పీ హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తాడని పీసీబీ ప్రకటించింది.
మూడు ఫార్మాట్లలో అసిస్టెంట్ కోచ్‌గా మాజీ ఆల్‌రౌండర్ (పాక్) ఉంటాడని పేర్కొంది. మే 22 నుంచి ప్రారంభమయ్యే ఇంగ్లండ్ టీ20 సిరీస్‌తో కిర్‌స్టెన్ పాక్ కోచింగ్ బాధ్యతలు చేపడతాడని తెలుస్తుంది. ఇంగ్లండ్ సిరీస్‌లో పాక్ నాలుగు టీ20లు ఆడుతుంది. అక్కడి నుంచి పాక్ జట్టు నేరుగా వరల్డ్‌కప్ వేదిక అయిన యూఎస్‌ఏకు బయల్దేరుతుంది.
— Pakistan Cricket (@TheRealPCB) April 28, 2024
కాగా, 2023 వన్డే వరల్డ్‌కప్ తర్వాతి నుంచి పాక్ జట్టుకు రెగ్యులర్ హెడ్ కోచ్ లేడు. ఆ వరల్డ్‌కప్‌లో పాక్ జట్టు పేలవ ప్రదర్శన నేపథ్యంలో పీసీబీ అప్పటి ప్రధాన కోచ్ గ్రాంట్ బ్రాడ్‌బర్న్, టీమ్ డైరెక్టర్ మిక్కీ ఆర్థర్, బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్, బ్యాటింగ్ కోచ్ ఆండ్రూ పుట్టిక్‌లను తొలగించింది.
ఈ మెగా ఈవెంట్ తర్వాత పాక్ ప్రీమియర్ బ్యాటర్ బాబర్ అజామ్ కూడా కెప్టెన్సీ నుండి తొలగించబడ్డాడు. వైట్ బాల్ కెప్టెన్‌గా షాహీన్ షా ఆఫ్రిది, టెస్ట్ జట్టు కెప్టెన్‌గా షాన్ మసూద్ ఎంపికయ్యారు. అయితే ఇటీవలి పరిణామాల నేపథ్యంలో పీసీబీ తిరిగి బాబర్ ఆజమ్‌ను పరిమిత ఓవర్ల జట్టు కెప్టెన్‌గా నియమించింది.
కిర్‌స్టెన్ విషయానికొస్తే.. రిటైర్మెంట్ అనంతరం ఫుల్‌టైమ్ కోచ్‌గా సెటిల్ అయిన కిర్‌స్టెన్ దేశ విదేశాల్లో చాలా జట్లకు కోచ్‌గా పని చేశాడు. కిర్‌స్టెన్ టీమిండియా 2011 వన్డే వరల్డ్‌కప్ గెలిచినప్పుడు హెడ్ కోచ్‌గా ఉన్నాడు. ఈ సౌతాఫ్రికా మాజీ ఆల్‌రౌండర్ ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్ హెడ్ కోచ్‌గా పని చేస్తున్నాడు. 56 ఏళ్ల కిర్‌స్టెన్ సౌతాఫ్రికా తరఫున101 టెస్ట్‌లు, 185 వన్డేలు ఆడి 14000 పైచిలుకు పరుగులు చేశాడు. కిర్‌స్టెన్ గతంలో సొంత జట్టుకు కూడా కోచ్‌గా పని చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment