gary kirsten
-
ఐదుగురిని సంప్రదించా.. త్వరలోనే కొత్త కోచ్ ఎంపిక: పీసీబీ చీఫ్
దక్షిణాఫ్రికా దిగ్గజం గ్యారీ కిర్‌స్టెన్ కోచ్ పదవి నుంచి తప్పుకోవడంపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) చీఫ్ మొహ్సిన్ నక్వీ స్పందించాడు. కిర్‌స్టెన్ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించాడని.. ఈ క్రమంలోనే అతడితో తమ బంధం ముగిసిందని పేర్కొన్నాడు. త్వరలోనే పాక్ పరిమిత ఓవర్ల జట్టుకు కొత్త కోచ్‌ను నియమిస్తామని తెలిపాడు.అందుకే రాజీనామా!కాగా పాకిస్తాన్ వన్డే, టీ20 జట్లకు హెడ్ కోచ్‌గా ఉన్న గ్యారీ కిర్‌స్టెన్ తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తన బాధ్యతల నుంచి తక్షణమే తప్పుకుంటున్నట్లు అతడు సోమవారం ప్రకటించాడు. రెండేళ్ల కాంట్రాక్ట్ వ్యవధితో ఈ ఏడాది ఏప్రిల్‌లో కిర్‌స్టెన్‌ను ప్రధాన కోచ్‌గా పీసీబీ నియమించింది. కానీ.. కనీసం ఆరు నెలలు కూడా అతడు కోచ్‌గా పని చేయలేదు. ఆస్ట్రేలియా పర్యటనకు పాక్ వెళ్లనున్న నేపథ్యంలో కిర్‌స్టెన్ తన పదవి నుంచి తప్పుకోవడం గమనార్హం. అయితే, జట్టు ఎంపిక విషయంలో తనకు ఉన్న అధికారాలను తప్పించడం పట్ల కలత చెందిన కిర్‌స్టెన్ రాజీనామా చేసినట్లు సమాచారం. పరిమిత ఓవర్ల జట్లకు కెప్టెన్లను ఎంపిక చేసే విషయంలో తన సూచనలను కనీసం పరిగణనలోకి తీసుకోకపోగా... తాను దేశంలోనే లేని సమయంలో జట్టును ప్రకటించడంపై పీసీబీ అధికారులతో కిర్‌స్టెన్ వాదనకు దిగినట్లు తెలిసింది.కాగా ఇటీవల సొంతగడ్డపై ఇంగ్లండ్ చేతిలో పాకిస్తాన్ తొలి టెస్టులో చిత్తయిన తర్వాత పీసీబీ కొత్త సెలక్షన్ కమిటీని నియమించిన విషయం విదితమే. ఈ విషయంలోనూ జోక్యం చేసుకోవద్దని కిర్‌స్టెన్‌కు పీసీబీ సూచించడం గమనార్హం. ఇక కిర్‌స్టెన్‌తో టెస్టు టీమ్ హెడ్ కోచ్‌గా ఉన్న జాసన్ గిలెస్పీ కూడా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నా... ఇంగ్లండ్‌తో తర్వాతి రెండు టెస్టుల్లో ఘన విజయం సాధించి పాక్ సిరీస్ గెలుచుకోవడంతో ఈ అంశం కాస్త వెనక్కి వెళ్లింది. ఒక్క వన్డే ఆడకుండా... ఇదిలా ఉంటే.. కిర్‌స్టెన్ కోచ్‌గా బాధ్యతలు తీసుకున్న తర్వాత పాకిస్తాన్ టీ20 ప్రపంచ కప్‌లో బరిలోకి దిగింది. గ్రూప్ దశలో భారత్, అమెరికా చేతుల్లో పరాజయంతో సూపర్–8 దశకు కూడా చేరకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించింది. అయితే, 28 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత టీమిండియాను వన్డే వరల్డ్ చాంపియన్‌గా నిలిపిన రికార్డు ఉన్న కిర్‌స్టెన్‌ను ఎంపిక చేసినప్పుడు ప్రధానంగా తమ వన్డే టీమ్‌ను తీర్చిదిద్దే విషయంపైనే బాధ్యతలు అప్పగించారు.అంతేకాదు.. 2025లో పాకిస్తాన్ వేదికగా జరిగే చాంపియన్స్ ట్రోఫీలో తమ టీమ్‌ను విజేతగా నిలపాలని...అందు కోసం ఆయన ఆలోచనల ప్రకారం జట్టును మలిచే అధికారాన్ని పీసీబీ ఇచ్చింది. అయితే ఈ ఆరు నెలల వ్యవధిలో పాక్ ఒక్క వన్డే కూడా ఆడకపోవడం విశేషం!గిలెస్పీకి వన్డే, టీ20 కోచ్‌గా తాత్కాలిక బాధ్యతలుమరోవైపు ప్రస్తుతం టెస్టు కోచ్‌గా ఉన్న ఆసీస్ మాజీ పేస్ బౌలర్ గిలెస్పీకి వన్డే, టీ20 కోచ్‌గా తాత్కాలిక బాధ్యతలు అప్పగించినట్లు పీసీబీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో పీసీబీ చీఫ్ మొహ్సిన్ నక్వీ మాట్లాడుతూ.. ‘‘కిర్‌స్టెన్ పీసీబీతో ఒప్పందాన్ని రద్దు చేసుకున్నాడు. అంతేకాదు.. బోర్డు నిబంధనల్లో కొన్నిటిని ఉల్లంఘించాడు. మాతో కాంట్రాక్టును అతడే ముగించుకున్నాడు’’ అని తెలిపాడు.ఐదుగురిని సంప్రదించాఇక జింబాబ్వే పర్యటన సందర్భంగా తమ వన్డే, టీ20 జట్లకు కొత్త కోచ్ వస్తాడని నక్వీ ఈ సందర్భంగా వెల్లడించాడు. ఆస్ట్రేలియా గడ్డపై పాక్ ఆడే మూడు వన్డేలు, మూడు టీ20 వరకు మాత్రమే తాను కోచ్‌గా పని చేస్తానని గిల్లెస్పీ చెప్పాడని పేర్కొన్నాడు. అతడికి పూర్తి స్థాయిలో బాధ్యతలు తీసుకునే ఉద్దేశం లేదని తెలిపిన నక్వీ.. కొత్త కోచ్ అన్వేషణలో భాగంగా ఇప్పటికే తాను ఐదుగురిని సంప్రదించానని పేర్కొన్నాడు. చదవండి: IPL 2025: అత్యంత ఖరీదైన ఆటగాడు అతడే.. పది జట్ల రిటెన్షన్ లిస్టు ఇదే! -
పాకిస్తాన్ ఆల్ ఫార్మాట్ కోచ్‌గా జేసన్ గిల్లెస్పీ
పాకిస్తాన్ ఆల్ ఫార్మాట్ హెడ్ కోచ్‌గా జేసన్ గిల్లెస్పీ నియమితుడయ్యాడు. పరిమిత ఓవర్ల హెడ్ కోచ్ పదవికి గ్యారీ కిర్‌స్టన్ రాజీనామా చేసిన నేపథ్యంలో గిల్లెస్పీ ఎంపిక జరిగింది. ఆల్ ఫార్మాట్ కోచ్‌గా ఎంపిక కాకముందు గిల్లెస్పీ కేవలం టెస్ట్‌లకు మాత్రమే కోచ్‌గా వ్యవహరించే వాడు. గిల్లెస్పీ త్వరలో ఆస్ట్రేలియాలో పర్యటించబోయే పాక్ జట్టుకు హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తాడు. ఆటగాళ్లతో, క్రికెట్ బోర్డుతో విభేదాల కారణంగా కిర్‌స్టన్ హెడ్ కోచ్ పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తుంది. హై పెర్ఫార్మెన్ కోచ్‌గా డేవిడ్ రీడ్‌ను నియమించాలని కిర్‌స్టన్ కోరగా.. పాక్ క్రికెట్ బోర్డు అందుకు నిరాకరించినట్లు సమాచారం.కాగా, ఇటీవలికాలంలో పాక్ క్రికెట్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. మూడు నెలల కాలంలో మూడు సార్లు సెలక్షన్ ప్యానెల్లో మార్పులు చేసిన పీసీబీ.. తాజాగా గ్యారీ కిర్‌స్టన్ హెడ్ పదవి నుంచి తప్పుకునేలా చేసింది. ఇటీవలే బాబర్ ఆజమ్ పాక్ పరిమిత ఓవర్ల కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. దీంతో నిన్ననే బాబర్ స్థానంలో పాక్ పరిమిత ఓవర్ల కెప్టెన్‌గా మహ్మద్ రిజ్వాన్‌ను నియమించారు. స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో చివరి రెండు టెస్ట్‌లకు బాబర్ ఆజమ్, షాహీన్ అఫ్రిది, నసీం షాలను తప్పించారు. ఈ అంశం అప్పట్లో పాక్ క్రికెట్‌ను కుదిపేసింది. అయితే ఈ ముగ్గురు స్టార్లు లేకపోయినా పాక్ ఇంగ్లండ్‌పై టెస్ట్ సిరీస్‌లో గెలవడం కొసమెరుపు. -
ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు పాక్‌కు ఊహించని షాక్..!
ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు పాకిస్తాన్ జట్టుకు ఊహించని షాక్ తగలనున్నట్లు తెలుస్తుంది. ఆ జట్టు హెడ్ కోచ్ పదవి(పరిమిత ఓవర్లు) నుంచి గ్యారీ కిర్‌స్టన్ తప్పుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయమై ఎలాంటి అధికారిక ప్రకటన లేనప్పటికీ.. ఈ వార్త సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతుంది. త్వరలో పాక్ పరిమిత ఓవర్ల జట్లు ఆస్ట్రేలియా, జింబాబ్వే పర్యటనలకు వెళ్లనుండగా.. కిర్‌స్టన్ జట్లతో పాటు ఆయా దేశాలకు వెళ్లడం లేదని తెలుస్తుంది. కిర్‌స్టన్ పాక్ హెడ్ కోచ్ పదవి నుంచి వైదొలగడానికి ఆటగాళ్లతో ఏర్పడిన విభేదాలు కారణమని సమాచారం. మరోవైపు కిర్‌స్టన్ పాక్ హై పెర్ఫార్మెన్ కోచ్‌గా డేవిడ్ రీడ్‌ను నియమించాలని పాక్ క్రికెట్ బోర్డును కోరగా, అందుకు పీసీబీ ఒప్పుకోలేదని తెలుస్తుంది. కిర్‌స్టన్ వైదొలగడానికి ఇదీ ఒక కారణమని సమాచారం. కిర్‌స్టన్ పాక్ పరిమిత ఓవర్ల హెడ్ కోచ్‌గా ఎంపికై కేవలం నాలుగు నెలలే అవుతుంది. ఈ లోపే అతనికి బోర్డుకు మధ్య భేదాభిప్రాయాలు ఏర్పడినట్లు తెలుస్తుంది. మరో నాలుగు నెలల్లో పాక్‌లోనే ఛాంపియన్స్ ట్రోఫీ జరుగనుంది. ఈ లోపు కిర్‌స్టన్ నిజంగా హెడ్ కోచ్ పదవి నుంచి వైదొలిగితే అది పాక్ జట్టుకు నష్టం వాటిల్లేలా చేస్తుంది. ఒకవేళ కిర్‌స్టన్ పాక్ హెడ్ కోచ్ పదవి నుంచి వైదొలిగితే అతని స్థానాన్ని టెస్ట్ జట్టు హెడ్ కోచ్ జేసన్ గిల్లెస్సీ లేదా జతీయ సెలెక్టర్ ఆకిబ్ జావిద్ భర్తీ చేసే అవకాశం ఉంది.కాగా, త్వరలో ఆస్ట్రేలియా, జింబాబ్వేలతో జరుగనున్న పరిమిత ఓవర్ల సిరీస్‌ల కోసం పాక్ జట్లను నిన్న ప్రకటించారు. పాక్ క్రికెట్ బోర్డు తమ పరిమిత ఓవర్ల జట్ల కెప్టెన్‌గా మహ్మద్ రిజ్వాన్‌ను నియమించింది. పాక్ పరిమిత ఓవర్ల కెప్టెన్సీ నుంచి బాబార్ ఆజమ్ ఇటీవలే తప్పుకున్నాడు. -
బాబర్ రాజీనామాకు కారణం అతడే!
పాకిస్తాన్ పరిమిత ఓవర్ల క్రికెట్ జట్టు కెప్టెన్సీకి బాబర్ ఆజం రాజీనామా వెనుక హెడ్‌కోచ్ గ్యారీ కిర్‌స్టన్ హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. తన పట్ల కోచ్ వ్యవహరించిన తీరుకు నొచ్చుకున్న అతడు.. బాధ్యతల నుంచి తప్పుకొన్నట్లు సమాచారం. జట్టు వైఫల్యాలకు తనొక్కడినే బాధ్యుడిని చేస్తూ.. తప్పంతా తన మీదకు వచ్చేలా కిర్‌స్టన్ నివేదిక రూపొందించడం పట్ల అతడు మనస్తాపం చెందినట్లు తెలుస్తోంది.కాగా పాక్ క్రికెట్ జట్టుకు వన్డే, టీ20 ఫార్మాట్లలో కెప్టెన్సీ నుంచి బాబర్ ఆజం వైదొలిగిన విషయం తెలిసిందే. తాను సారథ్య బాధ్యతలకు రాజీనామా చేస్తున్నట్లు బుధవారం ప్రకటించాడు. బ్యాటింగ్‌పై ఎక్కువగా దృష్టి పెట్టేందుకే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడు. ఈ విషయంపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)కి, టీమ్ మేనేజ్మెంట్కు గతంలోనే సమాచారం అందించినట్లు బాబర్ చెప్పాడు.ఈ రాజీనామా తర్వాత‘పాకిస్తాన్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించడం నాకు దక్కిన గొప్ప గౌరవం. అయితే అసలు బాధ్యత బ్యాటింగ్‌పై మరింత దృష్టి పెట్టాల్సి ఉంది. నాయకత్వం కారణంగా నాపై అదనపు భారం పడుతోంది. నా ఆటను మరింతగా ఆస్వాదిస్తూ అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడంతో పాటు కుటుంబానికి తగినంత సమయం కేటాయించడం కూడా అవసరం.ఈ రాజీనామా తర్వాత నా శక్తియుక్తులన్నీ బ్యాటింగ్‌పైనే కేంద్రీకరించగలను. నాకు అండగా నిలిచిన అందరికీ కృతజ్ఞతలు. జట్టుకు ఒక ఆటగాడిగా అన్ని విధాలా ఉపయోగపడేందుకు నేను సిద్ధం’ అని బాబర్ ఆజమ్ ఒక ప్రకటన విడుదల చేశాడు. కాగా వన్డే వరల్డ్‌కప్-2023లో పాక్ సెమీస్ కూడా చేరకపోవడంతో బాబర్ నైతిక బాధ్యత వహిస్తూ.. ఆ టోర్నీ తర్వాత మూడు ఫార్మాట్ల కెప్టెన్సీ వదలుకున్నాడు. అయితే, టీ20 ప్రపంచకప్-2024కు ముందు అతడినే సారథిగా నియమించింది పీసీబీ. ఈసారి మరీఘోరమైన ప్రదర్శనతో బాబర్ బృందం విమర్శలు మూటగట్టుకుంది. పసికూన అమెరికా జట్టు చేతిలో ఓడి.. సూపర్-8కు కూడా అర్హత సాధించలేకపోయింది.అందుకే ఈ నిర్ణయంఈ నేపథ్యంలో కోచ్ కిర్‌స్టన్ పీసీబీకి ఇచ్చిన నివేదికలో బాబర్ ఆజంనే కారకుడిగా పేర్కొన్నట్లు బోర్డు సన్నిహిత వర్గాలు తాజాగా వెల్లడించాయి. అసిస్టెంట్ కోచ్ అజర్ మహ్మూద్ సైతం బాబర్‌కు వ్యతిరేకంగా మాట్లాడటంతో.. ఇక తాను కెప్టెన్‌గా ఉండకూడదని బాబర్ నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నాయి. ఇక బాబర్ ఆజం రాజీనామాను ఆమోదించిన పీసీబీ త్వరలోనే కొత్త కెప్టెన్‌ను నియమించనుంది. ఈ నేపథ్యంలో మహ్మద్ రిజ్వాన్, షాహిన్ ఆఫ్రిది పేర్లు వన్డే, టీ20 కెప్టెన్సీ రేసులో వినిపించగా.. బోర్డు అనూహ్యంగా సౌద్ షకీల్ వైపు మొగ్గుచూపినట్లు తెలుస్తోంది.రేసులోకి కొత్త పేరుఇక అక్టోబరులో పాకిస్తాన్ క్రికెట్ జట్టు 3 వన్డేలు, 3 టీ20ల కోసం ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. ఆలోగా కెప్టెన్ ఎంపిక పూర్తవుతుంది. ఇదిలా ఉంటే.. సొంతగడ్డపై ఈ నెల 7 నుంచి ఇంగ్లండ్‌తో జరిగే టెస్టు సిరీస్‌లో పాకిస్తాన్ తలపడుతుంది. పాక్ టెస్టు జట్టుకు షాన్ మసూద్ కెప్టెన్‌గా ఉన్న విషయం తెలిసిందే. బాబర్ స్థానంలో పగ్గాలు చేపట్టిన అతడి సారథ్యంలో పాక్ ఇంత వరకు ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. చదవండి: కూతురితో షమీ వీడియో.. హసీన్ జహాన్ ఘాటు వ్యాఖ్యలు -
'టాటా, బై బై.. నీ పని అయిపోయింది'.. పాక్ హెడ్ కోచ్‌పై సంచలన వ్యాఖ్యలు
పాకిస్తాన్ క్రికెట్ జట్టు గత రెండేళ్లగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుంది. టీ20 వరల్డ్‌కప్-2022లో రన్నరప్‌గా నిలిచిన తర్వాత పాక్ జట్టు చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోతుంది. గతేడాది జరిగిన ఆసియాకప్, వన్డే ప్రపంచకప్‌లో దారుణ ప్రదర్శన కనబరిచి లీగ్ స్టేజిలోనే ఇంటిముఖం పట్టింది.దీంతో పాక్ క్రికెట్ టీమ్ కోచింగ్ స్టాప్‌ను మొత్తాన్ని పీసీబీ ప్రక్షాళన చేసింది. పాక్ వైట్‌బాల్ హెడ్‌కోచ్‌గా దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్‌గా గ్యారీ కిర్‌స్టెన్ బాధ్యతలు చేపట్టగా.. రెడ్‌బాల్ కోచ్‌గా ఆసీస్ దిగ్గజం గిల్లెస్పీ నియమితుడయ్యాడు. అయితే కోచ్‌లు మారినప్పటకి పాక్ క్రికెట్ తలరాత మాత్రం ఏ మాత్రం మారలేదు. టీ20 వరల్డ్‌కప్-2024లోనూ పేలవ ఆటతీరుతో గ్రూపు స్టేజిలోనే టోర్నీ నుంచి నిష్కమ్రించింది.దీంతో హెడ్‌కోచ్ గ్యారీ కిర్‌స్టెన్‌పై కూడా పీసీబీ వేటు వేస్తుందని ఆ మధ్య కాలంలో వార్తలు వినిపించాయి. కానీ పాక్ క్రికెట్ బోర్డు ఇప్పటివరకు అయితే ఈ విషయంపై ఎటువంటి ఆధికారిక ప్రకటన చేయలేదు. తాజాగా ఇదే విషయంపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ బాసిత్ అలీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 తర్వాత కిర్‌స్టెన్‌ను పాక్ హెడ్ కోచ్ పదవి నుంచి తప్పిస్తారని అలీ తెలిపాడు."గ్యారీ కిర్‌స్టన్‌కు అభినందనలు. ఛాంపియన్స్ ట్రోఫీ వరకు పాక్ జట్టు హెడ్‌కోచ్‌గా అతడు కొనసాగుతాడు. అయితే ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత అతడిని తప్పించనున్నారు. అందుకే ఇప్పుడే గ్యారీకి టాటా, బై బై చెప్పాలనకుంటున్నాను. ఈ మెగా టోర్నీలో పాక్ మొదటి నాలుగు స్థానాల్లో నిలిస్తే చాలు అదే పెద్ద విజయంగా భావిస్తాము. పాక్ క్రికెట్లో రాజకీయాలు కూడా ఎంట్రీ ఇచ్చాయి. క్రికెట్లో రాజకీయ నాయకులు జోక్యం చేసుకోవడం అంతమంచిది కాదు అంటూ" బసిత్ అలీ తన యూట్యాబ్ ఛానల్లో పేర్కొన్నాడు. కాగా పాక్ క్రికెట్ జట్టు ఆక్టోబర్ 7 నుంచి ఇంగ్లండ్‌తో మూడు టెస్టుల సిరీస్‌లో తలపడనుంది. -
పాక్ హెడ్‌కోచ్‌గా అంటే కత్తి మీద సాము లాంటిదే: డేవ్ వాట్మోర్
వన్డే వరల్డ్‌కప్-2023లో ఘోర పరాభావం తర్వాత పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తమ కోచింగ్ స్టాప్ మొత్తాన్ని ప్రక్షాళన చేసిన సంగతి తెలిసిందే. పాక్ జట్టు పరిమిత ఓవర్ల హెడ్‌కోచ్‌గా దక్షిణాఫ్రికా క్రికెట్ దిగ్గజం గ్యారీ కిర్‌స్టెన్ బాధ్యతలు చేపట్టగా.. టెస్టు జట్టు ప్రధాన కోచ్‌గా ఆసీస్ ఫాస్ట్ బౌలింగ్ లెజెండ్ జాసన్ గిల్లెస్పీ ఎంపికయ్యాడు.గ్యారీ కిర్‌స్టెన్ ఇప్పటికే తన ప్రయణాన్ని ప్రారంభించగా.. వచ్చే నెలలో స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరిగే టెస్టు సిరీస్‌తో గిల్లెస్పీ ప్రస్ధానం మొదలు కానుంది. అయితే కోచ్‌లు మారినప్పటకి పాక్ తల రాత ఏమాత్రం మారలేదు. కిర్‌స్టెన్ నేతృత్వంలోని పాక్ జట్టు టీ20 వరల్డ్‌కప్-2024లో దారుణ ప్రదర్శన కనబరిచింది. గ్రూపు స్టేజిలోనే పాక్ ఇంటిముఖం పట్టింది. ఈ క్రమంలో పాక్ జట్టుతో పాటు పీసీబీపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. తాజాగా పాకిస్థాన్ మాజీ ప్రధాన కోచ్ డేవ్ వాట్మోర్ కొత్త హెడ్‌కోచ్‌లు గ్యారీ కిర్‌స్టెన్, జాసన్ గిల్లెస్పీలకు కీలక సూచనలు చేశాడు. పాక్ జట్టును విజయం పథంలో నడిపించడం అంత ఈజీ కాదని వాట్మోర్ అభిప్రాయపడ్డాడు."ఇప్పటికే పాక్ సెలక్షన్ కమిటీ చాలా మార్పుల చోటు చేసుకున్నాయి. ఈ మార్పులు వల్ల పాక్ క్రికెట్‌కు ఎంత నష్టం జరుగుతుంతో వేచి చూడాలి. నావరకు నేను ఆదృష్టవంతుడిని. ఎందుకంటే పాక్ జట్టు హెడ్‌కోచ్‌గా నా పదవీకాలాన్ని మొత్తాన్ని పూర్తి చేసే అవకాశం దక్కింది. ఈ మధ్య కాలంలో పాక్‌కు కోచ్‌లు మారుతునే ఉన్నారు. కొత్త కోచ్‌లకు నేను ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నాను. ప్రశాంతంగా ఉండి తమ పని తాము చేసుకుపోవాలి. ఏదేమైనప్పటకి పాక్ జట్టు హెడ్ కోచ్‌గా పనిచేయడం అంత సులభం కాదు" అని ఓ స్పోర్ట్స్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వాట్మోర్ పేర్కొన్నాడు. కాగా 2012లో పాక్ జట్టుహెడ్ కోచ్‌గా వాట్మోర్ పనిచేశాడు. -
బాబర్ ఆజంపై వేటు?.. పీసీబీ కీలక నిర్ణయం!
వరుస పరాభవాలతో డీలా పడ్డ పాకిస్తాన్ క్రికెట్‌కు పూర్వ వైభవం తీసుకురావాలని బోర్డు పట్టుదలగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే టెస్టు జట్టు హెడ్ కోచ్‌గా జాసెన్ గిల్లెస్పీకి బాధ్యతలు అప్పగించిన పాక్ క్రికెట్ బోర్డు(పీసీబీ).. పరిమిత ఓవర్ల క్రికెట్ ప్రక్షాళనపైనా దృష్టి సారించినట్లు సమాచారం.బాబర్ ఆజంపై వేటు?ఇందులో భాగంగా వన్డే, టీ20 జట్ల కెప్టెన్‌గా ఉన్న బాబర్ ఆజంపై వేటు వేయనున్నట్లు తెలుస్తోంది. సారథిగా అతడిని తప్పించేందుకు బోర్డు మొగ్గుచూపుతున్నట్లు పాక్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.కాగా వన్డే వరల్డ్‌కప్-2023లో పాకిస్తాన్ కనీసం సెమీస్ కూడా చేరకుండానే నిష్క్రమించిన నేపథ్యంలో బాబర్ ఆజం మూడు ఫార్మాట్ల కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో టెస్టు పగ్గాలను షాన్ మసూద్‌కు అప్పగించిన పీసీబీ.. టీ20 సారథిగా షాహిన్ ఆఫ్రిదిని నియమించింది.ఈసారి కూడా చేదు అనుభవమేఅయితే, షాహిన్ కెప్టెన్‌గా ఆకట్టుకోకపోవడంతో టీ20 ప్రపంచకప్-2024 ఆరంభానికి ముందే బాబర్ ఆజంకు తిరిగి వన్డే, టీ20 నాయకుడిగా బాధ్యతలు అప్పగించింది. కానీ.. ఈసారి కూడా అతడికి చేదు అనుభవమే ఎదురైంది.గత టీ20 ప్రపంచకప్‌లో జట్టును ఫైనల్ వరకు చేర్చిన బాబర్ ఆజం.. ఈసారి మాత్రం ఘోరంగా విఫలమయ్యాడు. కనీసం గ్రూప్ దశ దాటకుండానే పాకిస్తాన్ ఇంటిబాట పట్టింది. ఈ నేపథ్యంలో బాబర్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించాలంటూ పాక్ మాజీ క్రికెటర్లు పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు.అదే విధంగా.. బంధుప్రీతికి తావు లేకుండా జట్టును ఎంపిక చేయాలంటూ ఆజం ఖాన్ వంటి వాళ్లపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ నేపథ్యంలో ప్రక్షాళన చర్యలు చేపట్టిన పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ.. కీలక ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.ఆటగాళ్ల ఫిట్నెస్, క్రమశిక్షణ తదితర అంశాలకు సంబంధించి ప్రధాన కోచ్ గ్యారీ కిర్‌స్టెన్, ఛీఫ్ సెలక్టర్ వహాబ్ రియాజ్‌లను నివేదిక సమర్పించాల్సిందిగా ఆదేశించినట్లు తెలుస్తోంది. కిర్‌స్టన్ నిర్ణయం మేరకేఅదే విధంగా.. పరిమిత ఓవర్ల క్రికెట్ కెప్టెన్ విషయంలో కిర్‌స్టన్ నిర్ణయం మేరకే ముందుకు వెళ్లాలని నఖ్వీ భావిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో బాబర్ ఆజంపై వేటు వేయడం ఖాయంగా కనిపిస్తోందని పాక్ మీడియా ప్రచారం చేస్తోంది. మరోవైపు.. దేశవాళీ క్రికెట్ స్వరూపం గురించి మాజీ క్రికెటర్లతో చర్చించి రూట్‌మ్యాప్ తయారు చేయాలని పీసీబీ నిర్ణయించినట్లు సమాచారం. పీసీబీ చైర్మన్‌ను కలిసిఈ నేపథ్యంలో.. పాకిస్తాన్ క్రికెట్ బాగు కోరే 30- 35 మంది అంతర్జాతీయ క్రికెటర్లు పీసీబీ చైర్మన్‌ను సోమవారం కలిసి తమ సలహాలు, సూచనలు అందించేందుకు సిద్ధమైనట్లు జియో న్యూస్ వెల్లడించింది. కాగా పాకిస్తాన్ తదుపరి తమ పరిమిత ఓవర్ల సిరీస్‌లో ఆస్ట్రేలియాను ఢీకొట్టనుంది. ఇదిలా ఉంటే.. టీ20 ప్రపంచకప్-2024 విజేతగా టీమిండియా అవతరించిన విషయం తెలిసిందే.చదవండి: BCCI: ద్రవిడ్‌కు రూ. 5 కోట్లు.. రోహిత్, కోహ్లి సహా వారందరికీ ఎంతంటే? -
పాకిస్తాన్‌ను వీడి.. ఇండియా హెడ్‌కోచ్‌గా వచ్చెయ్: భజ్జీ
పాకిస్తాన్ క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన గ్యారీ కిర్‌స్టన్‌కు తొలి మెగా టోర్నీలోనే చేదు అనుభవం ఎదురైంది. టీ20 ప్రపంచకప్-2024లో పాక్ లీగ్ దశలోనే నిష్క్రమించింది.ఆతిథ్య అమెరికా, చిరకాల ప్రత్యర్థి టీమిండియా చేతిలో ఓడి పరాభవాన్ని మూటగట్టుకుంది. గ్రూప్-ఏలో మిగిలిన కెనడా, ఐర్లాండ్‌లపై గెలిచినా సూపర్-8 రేసులో అమెరికాతో పోటీ పడలేక ఇంటిబాట పట్టింది.గత టీ20 వరల్డ్‌కప్‌లో రన్నరప్‌గా నిలిచిన బాబర్ ఆజం ఈసారి ఇలా పూర్తిగా విఫలం కావడంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాబర్- షాహిన్ ఆఫ్రిది మధ్య విభేదాలతో జట్టు రెండుగా చీలిందనే ఆరోపణలు వస్తున్నాయి.ఈ నేపథ్యంలో గ్యారీ కిర్‌స్టన్ సైతం జట్టులో ఐక్యత లోపించినందు వల్లే ఇలాంటి చెత్త ఫలితాలు వచ్చాయని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. తాను ఎన్నో జట్లకు మార్గదర్శనం చేశానని.. అయితే, ఇంత చెత్త జట్టును చూడలేదని గ్యారీ మండిపడినట్లు తెలుస్తోంది.టీమిండియా కోచ్‌గా వచ్చెయ్ఈ క్రమంలో టీమిండియా స్పిన్ దిగ్గజం హర్భజన్ సింగ్ ఆసక్తికర ట్వీట్ చేశాడు. పాక్‌ను వదిలేసి కిర్‌స్టన్ ఇండియా హెడ్ కోచ్‌గా రావాలని ఆకాంక్షించాడు. ఈ మేరకు.. ‘‘అనవసరంగా నీ సమయాన్ని అక్కడ వృథా చేసుకోకు గ్యారీ.టీమిండియా కోచ్‌గా వచ్చెయ్. గ్యారీ కిర్‌స్టెన్.. అరుదైన వజ్రం, గొప్ప కోచ్‌లలో ఒకడు. మెంటార్, నిజాయితీ గల వ్యక్తి.. అంతేకాదు 2011 వరల్డ్‌కప్ గెలిపించిన కోచ్.2011 నాటి జట్టులో అందరికీ ప్రియమైన స్నేహితుడు కూడా! గ్యారీ ప్రత్యేకమైన వ్యక్తి’’ అని భజ్జీ ఎక్స్ వేదికగా తన మనసులోని భావాలు పంచుకున్నాడు. ఇందుకు సంబంధించిన ట్వీట్ వైరల్ కాగా.. నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.గౌతం గంభీర్ పేరు ఖరారు!ఇప్పటికే రాహుల్ ద్రవిడ్ స్థానంలో టీమిండియా హెడ్‌కోచ్‌గా గౌతం గంభీర్ పేరు ఖరారు కాగా.. భజ్జీ ఇలా పోస్ట్ పెట్టడంలో అర్థమేంటని ప్రశ్నిస్తున్నారు. గంభీర్‌ను వ్యతిరేకిస్తూ.. విదేశీ కోచ్ వైపే మొగ్గుచూపాలని బీసీసీఐకి సంకేతాలు ఇస్తున్నాడా అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.కాగా సౌతాఫ్రికా మాజీ బ్యాటర్ గ్యారీ కిర్‌స్టన్ గతంలో టీమిండియా ప్రధాన కోచ్‌గా పనిచేశాడు. మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలో 2011లో భారత్ వన్డే వరల్డ్‌కప్ గెలిచినపుడు అతడే కోచ్‌గా ఉన్నాడు. ఇక భజ్జీతో పాటు గంభీర్ కూడా ఈ జట్టులో సభ్యుడన్న విషయం తెలిసిందే.ఇదిలా ఉంటే.. వరల్డ్‌కప్-2024లో భారత జట్టు సూపర్-8కు చేరింది. ఇందులో భాగంగా అఫ్గనిస్తాన్‌తో గురువారం తమ తొలి మ్యాచ్ఆడనుంది.చదవండి: Suryakumar Yadav: వరల్డ్ నంబర్ వన్‌గా ఉన్నా.. సూర్య కీలక వ్యాఖ్యలు Don’t waste ur time there Gary .. Come back to Coach Team INDIA .. Gary Kirsten One of the rare 💎.. A Great Coach ,Mentor, Honest nd very dear friend to all in the our 2011 Team .. our winning coach of 2011 worldcup . Special man Gary ❤️ @Gary_Kirsten https://t.co/q2vAZQbWC4— Harbhajan Turbanator (@harbhajan_singh) June 17, 2024 -
పాకిస్తాన్ అస్సలు జట్టే కాదు.. గ్రూపులుగా విడిపోయారు: గ్యారీ కిర్‌స్టన్
టీ20 వరల్డ్‌కప్-2024లో మాజీ ఛాంపియన్స్ పాకిస్తాన్ దారుణ ప్రదర్శన కనబరిచింది. టైటిల్ ఫేవరేట్‌గా బరిలోకి దిగిన పాకిస్తాన్ అందరి అంచనాలను తలకిందలు చేస్తూ ఈ మెగా టోర్నీ లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టింది.టీ20 వరల్డ్‌కప్ చరిత్రలో పాకిస్తాన్ గ్రూపు స్టేజిలోనే నిష్క్రమించడం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో పాక్ జట్టుపై మాజీ ఆటగాళ్లు విమర్శలు వర్షం కురిపిస్తున్నారు. తాజాగా ఈ జాబితాలో పాక్ ప్రస్తుత హెడ్ కోచ్ గ్యారీ కిర్‌స్టెన్ చేరాడు. ప్రస్తుత పాక్ జట్టులో కొంచెం కూడా ఐక్యత లేదని కిర్‌స్టెన్ మండిపడ్డాడు. కాగా 2023 వన్డే వరల్డ్‌కప్ తర్వాత పాక్‌క్రికెట్ బోర్డు తమ కోచింగ్ బృందాన్ని మొత్తం మార్చేసింది. ఈ క్రమంలోనే ఈ ఏడాది ఏప్రిల్‌లో పాక్ జట్టు పరిమిత ఓవర్ల హెడ్‌కోచ్‌గా కిర్‌స్టెన్ బాధ్యతలు చేపట్టాడు.అయితే భారత్‌కు వన్డే వరల్డ్‌కప్‌ను అందించిన కిర్‌స్టెన్.. పాక్ జట్టుతో సైతం అద్భుతాలు సృష్టిస్తాడని అందరూ భావించారు. కానీ పాక్ జట్టు మాత్రం చెత్త ప్రదర్శన కనబరిచి తొలిరౌండ్లోనే ఇంటిముఖం పట్టింది."పాకిస్తాన్ క్రికెట్ టీమ్ అస్సలు జట్టే కాదు. పాక్ జట్టులో ఐక్యత లేదు. ఒకరికొకరు సపోర్ట్‌గా లేరు. ఎవరికి వారు నచ్చిన విధంగా ఉన్నారు. గ్రూపులుగా విడిపోయారు. నేను నా కెరీర్లో చాలా జట్లతో కలిసి పనిచేశాను. కానీ ఏ జట్టులో కూడా ఇటువంటి పరిస్థితులు నేను చూడలేదు. అదేవిధంగా పాక్ ఆటగాళ్ల ఫిట్నెస్ లెవల్స్ కూడా అంతంతమాత్రమే అని గ్యారీ కిర్‌స్టన్ అన్నట్లు" పాక్ మీడియా కథనాలు పేర్కొన్నాయి. -
పాక్ పరిమిత ఓవర్ల క్రికెట్ జట్టు హెడ్ కోచ్‌గా సౌతాఫ్రికా దిగ్గజం
పాకిస్తాన్ పరిమిత ఓవర్ల (వన్డే, టీ20) క్రికెట్ జట్టు హెడ్ కోచ్‌గా సౌతాఫ్రికా దిగ్గజ ఆటగాడు గ్యారీ కిర్‌స్టెన్ ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని పాక్ క్రికెట్ బోర్డు అధికారికంగా వెల్లడించింది. పాక్ టెస్ట్ జట్టుకు ఆసీస్ మాజీ స్పీడ్‌స్టర్ జేసన్ గిలెస్పీ హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తాడని పీసీబీ ప్రకటించింది. మూడు ఫార్మాట్లలో అసిస్టెంట్ కోచ్‌గా మాజీ ఆల్‌రౌండర్ (పాక్) ఉంటాడని పేర్కొంది. మే 22 నుంచి ప్రారంభమయ్యే ఇంగ్లండ్ టీ20 సిరీస్‌తో కిర్‌స్టెన్ పాక్ కోచింగ్ బాధ్యతలు చేపడతాడని తెలుస్తుంది. ఇంగ్లండ్ సిరీస్‌లో పాక్ నాలుగు టీ20లు ఆడుతుంది. అక్కడి నుంచి పాక్ జట్టు నేరుగా వరల్డ్‌కప్ వేదిక అయిన యూఎస్ఏకు బయల్దేరుతుంది. pic.twitter.com/nGMEvkPW70— Pakistan Cricket (@TheRealPCB) April 28, 2024 కాగా, 2023 వన్డే వరల్డ్‌కప్ తర్వాతి నుంచి పాక్ జట్టుకు రెగ్యులర్ హెడ్ కోచ్ లేడు. ఆ వరల్డ్‌కప్‌లో పాక్ జట్టు పేలవ ప్రదర్శన నేపథ్యంలో పీసీబీ అప్పటి ప్రధాన కోచ్ గ్రాంట్ బ్రాడ్‌బర్న్, టీమ్ డైరెక్టర్ మిక్కీ ఆర్థర్, బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్, బ్యాటింగ్ కోచ్ ఆండ్రూ పుట్టిక్లను తొలగించింది. ఈ మెగా ఈవెంట్ తర్వాత పాక్ ప్రీమియర్ బ్యాటర్ బాబర్ అజామ్ కూడా కెప్టెన్సీ నుండి తొలగించబడ్డాడు. వైట్ బాల్ కెప్టెన్‌గా షాహీన్ షా ఆఫ్రిది, టెస్ట్ జట్టు కెప్టెన్‌గా షాన్ మసూద్ ఎంపికయ్యారు. అయితే ఇటీవలి పరిణామాల నేపథ్యంలో పీసీబీ తిరిగి బాబర్ ఆజమ్‌ను పరిమిత ఓవర్ల జట్టు కెప్టెన్‌గా నియమించింది.కిర్‌స్టెన్ విషయానికొస్తే.. రిటైర్మెంట్ అనంతరం ఫుల్‌టైమ్ కోచ్‌గా సెటిల్ అయిన కిర్‌స్టెన్ దేశ విదేశాల్లో చాలా జట్లకు కోచ్‌గా పని చేశాడు. కిర్‌స్టెన్ టీమిండియా 2011 వన్డే వరల్డ్‌కప్ గెలిచినప్పుడు హెడ్ కోచ్‌గా ఉన్నాడు. ఈ సౌతాఫ్రికా మాజీ ఆల్‌రౌండర్ ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ హెడ్ కోచ్‌గా పని చేస్తున్నాడు. 56 ఏళ్ల కిర్‌స్టెన్ సౌతాఫ్రికా తరఫున101 టెస్ట్‌లు, 185 వన్డేలు ఆడి 14000 పైచిలుకు పరుగులు చేశాడు. కిర్‌స్టెన్ గతంలో సొంత జట్టుకు కూడా కోచ్‌గా పని చేశాడు. -
నెదర్లాండ్ జట్టు సలహాదారుడిగా టీమిండియా మాజీ కోచ్
టీ20 ప్రపంచకప్-2022కు ముందు నెదర్లాండ్ క్రికెట్ కీలక నిర్ణయం తీసుకుంది. తమ జట్టు సలహాదారులుగా టీమిండియా మాజీ కోచ్, దక్షిణాఫ్రికా దిగ్గజం గ్యారీ కిర్‌స్టన్, ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ డేన్ క్రిస్టియన్‌ను నెదర్లాండ్ క్రికెట్ నియమించింది. కాగా నెదర్లాండ్స్ ఆటగాళ్ళు ఆస్ట్రేలియాకు వెళ్లేముందు కేప్ టౌన్‌లోని గ్యారీ కిర్‌స్టన్ క్రికెట్ అకాడమీలో శిక్షణ పొందారు. ఈ క్రమంలో మళ్లీ అతడు జట్టుతో సలహారుడిగా జతకట్టనున్నాడు. అదే విధంగా ఆడిలైడ్‌లో నెదార్లాండ్ ట్రైనింగ్ క్యాంప్‌లో జట్టుతో క్రిస్టియన్ కలవనున్నాడు. వీరిద్దరూ నెదర్లాండ్ హెడ్ కోచ్ ర్యాన్ కూక్‌తో కలిసి పనిచేయనున్నారు. "టీ20 ప్రపంచకప్ కోసం మా జట్టు కోచింగ్ స్టాప్‌లో గ్యారీ కిర్‌స్టన్, డాన్ క్రిస్టియన్ చేరడం మాకు చాలా సంతోషంగా ఉంది. వారి అనుభవంతో జట్టును విజయ పథంలో నడిపిస్తారని ఆశిస్తున్నాను" అని నెదర్లాండ్ క్రికెట్ బోర్డు హై పెర్ఫార్మెన్స్ మేనేజర్ రోలాండ్ లెఫెబ్రే పేర్కొన్నారు. కాగా కిర్‌స్టన్ 2011లో వన్డే వరల్డ్‌కప్ సొంతం చేసుకున్న భారత జట్టు హెడ్ కోచ్‌గా కిర్‌స్టన్ పనిచేశాడు. ఇక నెదర్లాండ్ ఈ మెగా ఈవెంట్లో తొలుత క్వాలిఫియర్ మ్యాచ్‌లు ఆడనుంది. డచ్ జట్టు తమ తొలి మ్యాచ్‌లో ఆక్టోబర్16న యూఏఈతో తలపడనుంది. చదవండి: R Ashwin Vs Ramiz Raja: పీసీబీ చైర్మన్ రమీజ్ రాజాకు అశ్విన్ దిమ్మతిరిగే కౌంటర్ -
IPL 2022: ఐపీఎల్ అత్యుత్తమ కోచ్‌లలో తనూ ఒకడు! ఎందుకంటే!
IPL 2022- Gujarat Titans: ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంఛైజీ గుజరాత్ టైటాన్స్ హెడ్‌కోచ్ ఆశిష్ నెహ్రాపై ఆ జట్టు మెంటార్ గ్యారీ కిర్‌స్టన్ ప్రశంసల జల్లు కురిపించాడు. అతడు ఏ పనిచేసినా మనసు పెట్టి అంకితభావంతో పూర్తి చేస్తాడని కితాబిచ్చాడు. నెహ్రాతో తన అనుబంధాన్ని గుర్తుచేసుకున్న కిర్‌స్టన్.. ఐపీఎల్‌లోని బెస్ట్ కోచ్‌లలో అతడూ ఒకడంటూ ఆకాశానికెత్తాడు. ఆశిష్ నెహ్రా మార్గదర్శనంలోని కొత్త ఫ్రాంఛైజీ గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్-2022లో అదరగొట్టిన సంగతి తెలిసిందే. అరంగేట్ర సీజన్లోనే లీగ్ దశలో టాపర్‌గా నిలిచి.. ఆపై రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన ఫైనల్లోనూ సత్తా చాటింది. క్యాష్ రిచ్ లీగ్‌లో ఎంట్రీ ఇచ్చిన తొలి ఎడిషన్‌లోనే ట్రోఫీని ముద్దాడి మధుర జ్ఞాపకంగా మిగుల్చుకుంది. గుజరాత్ టైటిల్ గెలవడంలో గ్యారీ కిర్‌స్టన్, నెహ్రాదే కీలక పాత్ర అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఐసీసీ వరల్డ్‌కప్-2011 సమయంలో టీమిండియా కోచ్‌గా ఉన్న కిర్‌స్టన్, అప్పటి భారత జట్టులో సభ్యుడైన ఆశిష్ నెహ్రా 2018లో ఆర్సీబీ కోచింగ్ సిబ్బందిలో భాగమయ్యారు. ఆ తర్వాత ఐపీఎల్-2022లో గుజరాత్ టైటాన్స్ హెడ్‌కోచ్‌గా నెహ్రా బాధ్యతలు స్వీకరిస్తే.. మెంటార్‌గా కిర్‌స్టన్ సేవలు అందించాడు. ఈ నేపథ్యంలో గ్యారీ కిర్‌స్టన్ క్రిక్‌బజ్‌తో మాట్లాడుతూ.. ‘‘ఆశిష్ నాకు ప్రాణ స్నేహితుడు. మా ఇద్దరిది సుదీర్ఘ ప్రయాణం. ఆటను అర్థం చేసుకోవడంలో.. అత్యంత ప్రొఫెషనల్‌గా వ్యవహరించడంలో తనకు తానే సాటి. తను మనసు పెట్టి పని చేస్తాడు. కోచ్‌గా కూడా అంతే! ఎల్లప్పుడూ తన జట్టులోని ఆటగాళ్ల గురించి, వాళ్లకు మెలకువలు నేర్పడం గురించే ఆలోచిస్తూ ఉంటాడు. తను ఎప్పుడూ లో ప్రొఫైల్‌లోనే ఉంటాడు. అందరి దృష్టిలో పడాలనుకోవడం తనకు పెద్దగా ఇష్టం ఉండదు. అత్యంత నేర్పరులుగా వ్యవహరించే ఐపీఎల్ అత్యుత్తమ కోచ్‌లలో ఆశిష్ నెహ్రా కూడా ఒకడు’’ అని నెహ్రాపై ప్రశంసల వర్షం కురిపించాడు. చదవండి 👇 IPL 2023: ఏడు కోట్లా! అంత సీన్ లేదు! సిరాజ్‌ను వదిలేస్తే.. చీప్‌గానే కొనుక్కోవచ్చు! వైభవంగా టీమిండియా క్రికెటర్ పెళ్లి.. ఫోటోలు వైరల్ Kal ki yeh yaadgar shaam, aap ke pyaar aur support ke naam 🥰😁 Jald lautenge, tab tak khayal rakhna Amdavad 💙#SeasonOfFirsts #AavaDe pic.twitter.com/IMgH0izYAL — Gujarat Titans (@gujarat_titans) May 31, 2022 -
గుజరాత్ టైటాన్స్ విజయంలో అజ్ఞాతవ్యక్తి; మాటల్లేవు.. అంతా చేతల్లోనే
క్రికెట్లో ఒక జట్టు మేజర్ కప్ గెలిచిదంటే ముందుగా పేరొచ్చేది జట్టు కెప్టెన్‌కే. ఎందుకంటే కెప్టెన్ ప్రత్యక్షంగా కనిపిస్తాడు కాబట్టి. ఒక కెప్టెన్‌గా కర్త, కర్మ, క్రియ అన్నీ తానై జట్టును ముందుండి నడిపించి చాంపియన్‌గా నిలపడం అతని లక్ష్యం. కానీ కెప్టెన్ పేరు ప్రత్యక్షంగా కనిపిస్తే.. తెరవెనుక కనిపించని హీరో మరొకరు ఉంటారు. అతనే టీమ్ కోచ్. జట్టులో ఎవరు సరిగా ఆడుతున్నారు.. ఎవరు బలహీనంగా ఉన్నారు.. బాధ్యతగా ఎవరు ఆడుతున్నారు.. ఒక ఆటగాడి వల్ల జట్టుకు ఎంత ఉపయోగం అనేది కోచ్ దగ్గరుండి పర్యవేక్షిస్తాడు. ప్రత్యక్షంగా కెప్టెన్‌కు ఎంత పేరు వస్తుందో.. కోచ్‌కు కూడా అంతే ఉంటుంది. అయితే అది తెర వెనుక మాత్రమే అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. తాజాగా ఐపీఎల్ 2022 సీజన్లో గుజరాత్ టైటాన్స్ చాంపియన్‌గా నిలిచింది. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా అన్నీ తానై నడిపించిన హార్దిక్ పాండ్యాను మెచ్చుకోవడానికి ముందు మరొక అజ్ఞాతవ్యక్తిని తప్పక పొగడాల్సిందే. గుజరాత్ టైటాన్స్ మెంటార్స్‌గా టీమిండియా మాజీ బౌలర్ ఆశిష్ నెహ్రా, దక్షిణాఫ్రికా దిగ్గజం గ్యారీ కిర్‌స్టెన్ ఉన్న సంగతి తెలిసిందే. ఆశిష్ నెహ్రా గురించి పక్కనబెడితే కిర్‌స్టెన్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిందే. PC: IPL Twitter ఎప్పుడైతే గ్యారీ కిర్‌స్టెన్ గుజరాత్ టైటాన్స్‌కు మెంటార్‌గా వచ్చాడో.. ఆ జట్టు అప్పుడే సగం విజయం సాధించినట్లయింది. ఎందుకంటే కిర్‌స్టెన్ ఎంత గొప్ప కోచ్ అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 2011 వన్డే వరల్డ్‌కప్ టీమిండియా గెలవడంలో కోచ్ కిర్‌స్టెన్ పాత్ర కీలకం. నాయకుడిగా ధోని జట్టును ముందుండి నడిపిస్తే.. తెరవెనుక కోచ్ పాత్రలో కిర్‌స్టెన్ విలువైన సలహాలు ఇచ్చి టీమిండియాను 28 ఏళ్ల తర్వాత జగజ్జేతగా నిలిపాడు. అలాంటి వ్యక్తి.. గుజరాత్ టైటాన్స్‌కు మెంటార్‌గా రావడం.. అతని సలహాలు కెప్టెన్ పాండ్యా తప్పకుండా పాటించడం జట్టుకు మేలు చేశాయి. PC: IPL Twitter ఐపీఎల్ 2022లో ''మ్యాచ్ కిల్లర్''గా మారినడేవిడ్ మిల్లర్ ఆరంభ మ్యాచ్‌ల్లో పెద్దగా రాణించింది లేదు. అయినప్పటికి హార్దిక్ అతన్ని జట్టులో కొనసాగించడంపై మాస్టర్ ప్లాన్ కిర్స్టెన్దే. కట్‌చేస్తే మిల్లర్ ఫైనల్లోనూ చెలరేగి గుజరాత్ టైటాన్స్‌కు కప్ అందించాడు. అంతేకాదు లీగ్ ఆరంభానికి ముందు పాండ్యాపై తీవ్ర విమర్శలు ఉన్నాయి. అంతకముందు జరిగిన టి20 ప్రపంచకప్‌లో దారుణ ప్రదర్శనతో జట్టుకు దూరమయ్యాడు. ఆ సమయంలో గుజరాత్‌కు కెప్టెన్‌గా రావడం.. ఆ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించేలా కిర్‌స్టెన్ పాండ్యాను ప్రోత్సహించడం జరిగిపోయాయి. మాటలు ఎక్కువగా మాట్లాడకుండా ఎక్కువ చేతల్లోనే పనిని చూపించే వ్యక్తి కిర్‌స్టెన్.. ఒక రకంగా గుజరాత్ టైటాన్స్ విజయం సాధించడంలో తన పాత్ర కూడా ఉంటుంది. చదవండి: 'అవమానాలు తట్టుకుని నా భర్త విజయం సాధించాడు.. అందుకే' Hardik Pandya-Ravi Shastri: ఇద్దరి బంధం ఎంతో ప్రత్యేకం.. అపూర్వ కలయిక -
గుజరాత్ టైటాన్స్‌కు భారీ షాక్.. కోచ్ పదవి నుంచి తప్పుకోనున్న కిర్‌స్టన్..!
Gary Kirsten To Step Down As Gujarat Titans Coach: ఐపీఎల్ 2022 సీజన్ ద్వారా క్యాష్ రిచ్ లీగ్‌లోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్ లీగ్ మొదటి దశ మ్యాచ్‌లు ముగిసే సమయానికి వరుస విజయాలతో (7 మ్యాచ్‌ల్లో 6 విజయాలు) దూసుకుపోతూ, పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. ఏమాత్రం అంచనాలు లేకుండా సీజన్ బరిలోకి దిగిన ఆ జట్టును బ్యాటింగ్ కోచ్, మెంటార్ గ్యారీ కిర్‌స్టన్ అద్భుతమైన వ్యూహా రచనలతో సక్సెస్‌ఫుల్‌గా నడిపిస్తున్నాడు. కెప్టెన్ హార్ధిక్ పాండ్యా, ఇతర ఆటగాళ్లను సమన్వయం చేసుకుని గుజరాత్ టైటాన్స్‌ను టైటిల్ వేటలో ముందువరుసలో ఉంచాడు. కాగా, తాజాగా మారిన సమీకరణల కారణంగా అతను గుజరాత్ టైటాన్స్‌ను షాకివ్వనున్నాడని తెలుస్తోంది. అతనికి ఇంగ్లండ్ ప్రధాన కోచ్ పదవి ఆఫర్ రావడంతో త్వరలోనే గుజరాత్ టైటాన్స్ కోచింగ్, మెంటార్ బాధ్యతలకు గుడ్‌బై చెప్పనున్నాడని సమాచారం. ఐపీఎల్ 2022 సీజన్‌తో అతను గుజరాత్‌తో బంధం తెంచుకోనున్నాడని వార్తలు వస్తున్నాయి. ఇంగ్లండ్ హెడ్ కోచ్‌గా అతని పేరు అధికారికంగా వెలువడితే కిర్‌స్టన్ ఆ జట్టుతో కలవాల్సి ఉంటుంది. ఇంగ్లండ్ క్రికెట్ బోర్డుతో ఒప్పందం మేరకు అతడు ఇంగ్లండ్ కోచ్‌గా ఉండగా మరే జట్టుకు పనిచేసే అవకాశం ఉండదు. దీంతో కిర్‌స్టన్ త్వరలోనే ఐపీఎల్‌ను వీడతాడన్న ప్రచారం జోరుగా సాగుతుంది. ఈసీబీ కిర్‌స్టన్‌ను హెడ్ కోచ్‌గా అధికారికంగా ప్రకటించినప్పటికీ, అతను ఐపీఎల్ తర్వాతే ఆ జట్టుతో కలుస్తాడు. ఎందుకంటే, ఐపీఎల్ 2022 సీజన్ మే 29తో ముగియనుండగా, ఇంగ్లండ్ జట్టు జూన్ 2 నుంచి స్వదేశంలో న్యూజిలాండ్‌తో టెస్ట్ సిరీస్ ఆడనుంది. కాగా, కిర్‌స్టన్ మార్గదర్శకత్వంలోనే టీమిండియా 2011 వన్డే ప్రపంచకప్ గెలిచిన విషయం తెలిసిందే. చదవండి: ఆ మ్యాచ్ చూస్తూ రిమోట్లు, బాటిళ్లు పగులగొట్టా: రికీ పాంటింగ్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4141448520.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్‌గా అతడే.. హెడ్‌కోచ్‌గా గ్యారీ కిర్‌స్టన్!
Ben Stokes: వరుస పరాజయాల నేపథ్యంలో విమర్శలు వెల్లువెత్తిన తరుణంలో ఇంగ్లండ్ కెప్టెన్సీకి జో రూట్ వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియాతో ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ మొదలు వెస్టిండీస్ పర్యటనలో ఓటమి అనంతరం అతడిపై వేటు వేయాలని డిమాండ్లు వినిపించాయి. ఈ క్రమంలో అతడు స్వయంగా తానే కెప్టెన్సీ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు. ఈ క్రమంలో స్టార్ ఆల్‌రౌండర్, వైస్ కెప్టెన్ బెన్‌స్టోక్స్ ఈ బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు నూతన మేనేజింగ్ డైరెక్టర్ రాబ్ కీతో సమావేశం అనంతరం టెస్టు కెప్టెన్సీ తీసుకునేందుకు స్టోక్స్ అంగీకరించినట్లు సమాచారం. ఇక ఈ నియామకానికి సంబంధించి పేపర్ వర్క్ పూర్తైన అనంతరం అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు తెలుస్తోంది. టెలిగ్రాఫ్ కథనం ప్రకారం.. రాబ్ కీ గురువారం మీడియా సమావేశం నిర్వహించి ఈ విషయాన్ని వెల్లడించనున్నాడు. ఇదిలా ఉండగా.. దక్షిణాఫ్రికా దిగ్గజం గ్యారీ కిర్‌స్టన్‌ను లేదంటే ఆస్ట్రేలియా మాజీ కోచ్ సైమన్ కటిచ్‌ను ఇంగ్లండ్ హెడ్‌కోచ్‌గా నియమించే యోచనలో రాబ్ కీ ఉన్నట్లు తెలుస్తోంది. కాగా మానసిక ఆందోళనల కారణంగా కొన్నాళ్లపాటు జట్టుకు దూరమైన విషయం తెలిసిందే. యాషెస్ సిరీస్ ద్వారా రీఎంట్రీ ఇచ్చిన అతడు.. వెస్టిండీస్‌తో సిరీస్‌లో అదరగొట్టాడు. విండీస్‌తో రెండో టెస్టు సందర్భంగా.. టెస్టుల్లో 5 వేల పరుగులు పూర్తి చేసుకోవడంతో పాటుగా 150కి పైగా వికెట్లు పడగొట్టిన ఐదో ఆల్‌రౌండర్‌గా చరిత్రకెక్కాడు. చదవండి👉🏾Sanju Samson: సంజూ బాగానే ఆడుతున్నాడు.. కానీ టీమిండియాలో చోటు దక్కడం కష్టమే! -
IPL 2022: అహ్మదాబాద్ హెడ్ కోచ్‌గా టీమిండియా మాజీ పేసర్..!
Ashish Nehra: ఐపీఎల్ 2022 ద్వారా క్యాష్ రిచ్ లీగ్‌లోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్న అహ్మదాబాద్ ఫ్రాంఛైజీ.. జట్టు హెడ్ కోచ్, సహాయక సిబ్బంది విషయంలో ఓ క్లారిటీకి వచ్చినట్లు తెలుస్తోంది. జట్టు హెడ్ కోచ్‌గా టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్ ఆశిష్ నెహ్రాని, మెంటార్‌గా దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు, టీమిండియా మాజీ కోచ్ గ్యారీ కిర్‌స్టన్‌ను ఎంచుకున్నట్టు సమాచారం. ఈ ఇద్దరి ఎంపిక లాంఛనమేనని ఫ్రాంఛైజీ వర్గాలు ద్వారా తెలుస్తోంది. మరోవైపు కోచ్, సహాయక సిబ్బందిని ఎంచుకునే విషయంలో మరో అరంగేట్రం జట్టు లక్నో ఓ రెండు అడుగులు ముందే ఉంది. ఆ జట్టు తమ ఫ్రాంఛైజీ హెడ్ కోచ్‌గా జింబాబ్వే మాజీ ఆటగాడు ఆండీ ఫ్లవర్‌ను, మెంటర్‌గా టీమిండియా మాజీ ఓపెనర్, ప్రస్తుతం ఢిల్లీ ఎంపీ గౌతమ్ గంభీర్‌ను ఎంపిక చేసుకుంది. కాగా, లక్నో జట్టును ఆర్పీఎస్జీ గోయెంకా గ్రూప్ గ్రూప్ రూ.7090 కోట్లకు కొనుగోలు చేస్తే, అహ్మదాబాద్ ఫ్రాంఛైజీని సీవీసీ క్యాపిటల్ రూ.5625 కోట్లకు దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది ఐపీఎల్లో ఈ రెండు జట్లు చేరడంతో మొత్తం ఐపీఎల్ జట్ల సంఖ్య 8కి చేరింది. చదవండి: కుంబ్లే సరసన శార్దూల్.. అరుదైన ఘనత సాధించిన బౌలర్‌గా రికార్డు -
ఇంగ్లండ్ కోచ్‌గా గ్యారీ కిర్‌స్టన్!
యాషెస్ సిరీస్‌లో ఇంగ్లండ్ ఘోరమైన ప్రదర్శన కనబరుస్తుంది. ఇప్పటికే వరుసగా మూడు టెస్ట్‌ల్లో ఓడిపోయి సిరీస్‌ను కోల్పోయింది. ఈ క్రమంలో ఇంగ్లండ్ జట్టు కోచ్ సిల్వర్ వుడ్, కెప్టెన్ జో రూట్‌పైన తీవ్రస్ధాయిలో విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఈ ఓటమికు బాధ్యతగా వారి పదవులకు రాజీనామా చేయాలని ఇంగ్లండ్ అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ గ్యారీ కిర్‌స్టన్ ఇంగ్లండ్ టెస్ట్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టేందుకు ఆసక్తిని కనబరుస్తున్నట్లు తెలుస్తోంది. 2011 వన్డే ప్రపంచకప్ గెలచిన భారత జట్టుకు కిర్‌స్టన్ కోచ్‌గా వ్యవహరించాడు. తర్వాత టీమిండియా కోచ్ బాధ్యతలు నుంచి తప్పుకున్నకిర్‌స్టన్.. 2011 నుంచి 2013 వరకు దక్షిణాఫ్రికా జట్టుకు కోచ్‌గా ఉన్నాడు. కాగా కోచ్‌గా కిర్‌స్టన్ అద్భుతమైన రికార్డులను కలిగిఉన్నాడు. "ఇంగ్లండ్ టెస్ట్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించేందుకు నేను ఎల్లప్పుడూ సిద్దంగా ఉంటాను. ఎందుకంటే ఇది గొప్ప గౌరవం. అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పటికే నేను రెండు సార్లు ఈ బాధ్యతలను చేపట్టాను. అయితే ప్రస్తుతం అన్ని ఫార్మాట్ల్లో కోచ్‌గా పని చేయాలని నేను అనుకోవడం లేదు. అన్ని ఫార్మాట్‌లుకు ఒకే కోచ్ కాకుండా, వేర్వేరుగా ఉండేటట్లు అంతర్జాతీయ క్రికెట్ బోర్డులు నిర్ణయం తీసుకుంటున్నాయి. ఇంగ్లండ్ జట్టుకు వన్డే, టెస్ట్ ఫార్మాట్ల్లో కోచ్‌గా పని చేయాలి అని ఉంది. కానీ ఇప్పటికే వన్డేల్లో ఇంగ్లండ్ అధ్బుతంగా రాణిస్తుంది. వన్డేల్లో ఇంగ్లండ్ అత్యత్తుమైన జట్టు. ఇంగ్లండ్ వన్డే కోచింగ్ స్టాఫ్ అద్భుతమైనది. ఒకే వేళ కోచ్‌గా బాధ్యతలు అవకాశం వస్తే గొప్ప గౌరవంగా భావిస్తాను" అని కిర్‌స్టన్ పేర్కొన్నాడు. చదవండి: IND Vs SA: భారత్‌తో ఓటమి.. దక్షిణాఫ్రికా స్టార్ క్రికెటర్ సంచలన నిర్ణయం! -
అహ్మదాబాద్ హెడ్ కోచ్‌గా గ్యారీ కిర్‌స్టెన్.. బౌలింగ్ కోచ్‌గా ఆశిష్ నెహ్రా!
ఐపీఎల్-2022లో రెండు కొత్త జట్లు రానున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్ కొత్త ప్రాంఛైజీగా అవతరించిన అహ్మదాబాద్ కోచ్‌గా దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు గ్యారీ కిర్‌స్టెన్ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. ఈ మేరకు ఆ ఫ్రాంచైజీ ప్రతినిధులు ఇప్పటికే కిర్‌స్టెన్ తో సమావేశమైనట్టు సమాచారం. కాగా 2011 వన్డే ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు కిర్‌స్టెన్ కోచ్‌గా బాధ్యతలు నిర్వహించాడు. 2011 ప్రపంచకప్ అనంతరం టీమిండియా హెడ్ కోచ్ బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత అతడు దక్షిణాఫ్రికా కోచ్ గా నియమితుడయ్యాడు. అయితే ఐపీఎల్లో కోచ్‌గా అతడికి ఇదేం తొలిసారి కాదు. అంతకుముందు ఆర్సీబీ జట్టుకు హెడ్ కోచ్ గా కిర్‌స్టెన్ పనిచేశాడు. అదే విధంగా జట్టు బౌలింగ్ కోచ్‌గా భారత మాజీ బౌలర్ ఆశిష్ నెహ్రాతో అహ్మదాబాద్ ప్రతినిధులు సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. ఐపీఎల్లో సన్‌రైజర్స్ జట్టు బౌలింగ్ కోచ్‌గా గతంలో ఆశిష్ నెహ్రా వ్యవహరించాడు. కాగా అంతకుముందు భారత మాజీ కోచ్ రవిశాస్త్రి అహ్మదాబాద్ కోచ్‌గా రానున్నడని వార్తలు వినిపించాయి. చదవండి: 'పుష్ప' ట్రాన్స్‌లో టీమిండియా ఆల్‌రౌండర్.. 'తగ్గేదే లే' -
Gary Kirsten: పాకిస్తాన్ హెడ్ కోచ్‌గా.. టీమిండియా మాజీ కోచ్!
This Former Cricketer To Replace Misbah-ul-Haq: టీ20 వరల్డ్‌కప్-2021 టోర్నీలో పాకిస్తాన్ జట్టు అదరగొడుతోంది. టీమిండియా, న్యూజిలాండ్ వంటి మేటి జట్లపై వరుస విజయాలు సాధించి సెమీస్‌కు చేరువవుతోంది. తద్వారా క్రీడా విశ్లేషకులు ప్రశంసలు అందుకుంటోంది. అయితే, ఈ ఈవెంట్ ఆరంభానికి ముందు పాకిస్తాన్ క్రికెట్లో భారీ మార్పులు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. హెడ్ కోచ్ మిస్బా ఉల్ హక్ సహా బౌలింగ్ కోచ్ వకార్ యూనిస్ తమ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. మెగా ఈవెంట్ ఆరంభానికి ముందు ఈ మేరకు నిర్ణయం తీసుకోవడంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సందిగ్దంలో పడింది. సక్లెయిన్ ముస్తాక్‌ను తాత్కాలిక హెడ్‌కోచ్‌గా నియమించింది. అయితే... విదేశీ కోచ్‌కు ఈ బాధ్యతలు అప్పజెప్పాలని పీసీబీ చైర్మన్ రమీజ్ రాజా భావిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్, టీమిండియాకు హెడ్ కోచ్‌గా సేవలు అందించిన గ్యారీ కిర్‌స్టన్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. మిస్బా స్థానాన్ని కిర్‌స్టన్‌తో భర్తీ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇక అతడితో పాటు సైమన్ కటిచ్(ఆస్ట్రేలియా), పీటర్ మూర్స్(ఇంగ్లండ్) పేర్లు కూడా తెరమీదకు వచ్చాయి. మూడేళ్లపాటు గ్యారీ కిర్‌స్టన్ 2008-2011 మధ్య కాలంలో టీమిండియా ప్రధాన శిక్షకుడిగా వ్యవహరించాడు. అతడి నిర్దేశనంలో.. ఎంఎస్ ధోని సారథ్యంలో భారత జట్టు 2011 వన్డే వరల్డ్‌కప్ గెలిచింది. మూడు దశాబ్దాల నిరీక్షణ తర్వాత జగజ్జేతగా నిలిచింది. ఇక కిర్‌స్టన్ కోచ్‌గా ఉన్నపుడే టీమిండియా టెస్టు ఫార్మాట్లోనూ నంబర్ 1 ర్యాంకుకు చేరుకుంది. క్రికెటర్‌గా కిర్‌స్టన్ గణాంకాలు దక్షిణాఫ్రికా తరఫున గ్యారీ కిర్‌స్టన్.. 185 వన్డేలు, 101 టెస్టులు ఆడాడు. టెస్టుల్లో 7289, వన్డేల్లో 6798 పరుగులు చేశాడు. 2004లో ప్రొటిస్ జట్టు తరఫున చివరి మ్యాచ్ ఆడాడు. చదవండి: T20 World Cup 2021: నెట్స్‌లో శ్రమిస్తున్న పాండ్యా.. శార్దూల్, భువీతో కలిసి బౌలింగ్ చేస్తూ.. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1971406958.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); T20 World Cup 2021: అలా అయితేనే టీమిండియా సెమీస్‌కు.. లేదంటే.. -
కొడితే సిక్సే.. సింగిల్స్ అసలు తీయరేమో
వాషింగ్టన్: జెంటిల్మెన్ గేమ్ క్రికెట్లో సింగిల్స్‌ను తిరస్కరించే రోజులు మరెంతో దూరంలో లేవని టీమిండియా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ వ్యాఖ్యానించారు. కొడితే సిక్సే కొట్టాలని బ్యాట్స్మెన్లు ఫిక్స్ అయ్యే రోజులు వస్తాయని, సింగిల్స్‌కు కాలం చెల్లే రోజులు దగ్గరలో ఉన్నాయని అభిప్రాయపడ్డారు. బ్యాట్‌కు బంతికి మధ్య జరిగే పోటీని గణాంకాలు నడిపించనున్నాయని జోస్యం చెప్పాడు. ఆటగాళ్ల ఎంపిక, వ్యూహరచనలను గణాంకాలు ఎంతగానో ప్రభావితం చేస్తాయని, బేస్‌బాల్ తరహాలో క్రికెట్లో సైతం గణాంకాలే కీలమని ఆయన పేర్కొన్నాడు. క్రికెట్లో గణాంకాలపై నిర్వహించిన సదస్సులో ద్రవిడ్‌తో పాటు దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ గ్యారీ కిర్‌స్టన్, ఇంగ్లండ్ మహిళల జట్టు మాజీ క్రీడాకారిణి ఇషా గుహ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ద్రవిడ్ మాట్లాడుతూ.. ఆటగాళ్ల సాధన దగ్గర నుండి ఫిట్నెస్, బౌండరీలు, సిక్సర్లు లాంటి మరెన్నో అంశాల్లో డేటా చాలా ఉపయోగపడుతుందని వివరించాడు. బాస్కెట్ బాల్లోని 3 పాయింట్ రెవల్యూషన్ తరహాలోనే క్రికెట్లో కూడా డేటా ప్రయోజనాలుంటాయని స్పష్టం చేశారు. టీ20ల్లో ప్రతి బంతికీ ప్రాముఖ్యత ఉంటుందని, కొత్త కుర్రాళ్లు మెరుగైన సాంకేతికతను వినియోగించుకొని ప్రత్యర్థి బలాబలాలను విశ్లేషించుకొని మరీ ప్రతిదాడి చేస్తున్నారని, ఇందుకు వారు డేటాను బాగా వినియోగించుకుంటున్నారని ఇషా గుహ తెలిపారు. క్రీడల్లో సందిగ్ధం నెలకొనప్పుడు డేటా ఎలా ఉపయోగపడుతోందో అన్న అంశాన్ని గ్యారీ కిర్‌స్టెన్ వివరించారు. చదవండి: ద్రవిడ్‌ను ఇంత కోపంగా ఎప్పుడూ చూడలేదు.. -
‘ధోనితో కలిసి పనిచేయడం గొప్ప గౌరవం’
న్యూఢిల్లీ: భారత మాజీ కెప్టెన్ ఎమ్మెస్ ధోని అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన సందర్భంగా అతని సహచరులు, మిత్రులు, శ్రేయాభిలాషుల నుంచి అభినందనలు, ఉద్వేగపూరిత సందేశాలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. తాజాగా భారత మాజీ కోచ్ గ్యారీ కిర్‌స్టెన్ మిస్టర్ కూల్‌తో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు. తను పని చేసిన గొప్ప నాయకుల్లో ధోని ఒకడని కిర్‌స్టెన్ కితాబిచ్చాడు. గ్యారీ హెడ్ కోచ్‌గా ఉన్న సమయంలోనే భారత్ 28 ఏళ్ల తర్వాత 2011లో మరోసారి ప్రపంచకప్‌ను గెలుపొందింది. ధోనితో కలిసి పని చేయడం తనకు దక్కిన గొప్ప గౌరవమని కిర్‌స్టెన్ వ్యాఖ్యానించాడు. ‘ ధోని నా వైపు ఉంటే నేను యుద్ధానికి కూడా సిద్ధం అని గతంలో ఎప్పుడూ అనేవాడిని. ఇది అతనిపై నాకున్న నమ్మకాన్ని తెలియజేస్తుంది. అతనో గొప్ప నాయకుడు. భారత క్రికెట్ జట్టుతో నాకు మధుర స్మృతుల్ని అందించిన ధోని నీకు ధన్యవాదాలు’ అని కిర్‌స్టెన్ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నాడు. 52 ఏళ్ల కిర్‌స్టెన్ 2008–2011 మధ్య కాలంలో భారత్‌కు హెడ్ కోచ్‌గా వ్యవహరించాడు. -
‘2007లోనే రిటైర్మెంట్కు సచిన్ ప్లాన్’
ముంబై : మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ 2013లో రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రపంచకప్ కలను సాకారం చేసుకొని, వంద సెంచరీలతో పాటు మరెన్నో రికార్డులను, ఘనతలను తన ఖాతాలో వేసుకొని సగర్వంగా ఆట నుంచి తప్పుకున్నాడు. అయితే ప్రపంచకప్ కల, పలు ఘనతలు అందుకోకముందే 2007లోనే సచిన్ రిటైర్మెంట్ తీసుకోవాలని భావించాడట. ఈ విషయాన్ని భారత క్రికెట్ జట్టుకు విజయవంతమైన కోచ్‌గా సేవలందించిన గ్యారీ కిర్‌స్టన్ వెల్లడించాడు. (టెండూల్కర్ డ్రైవ్... కోహ్లి క్రెసెంట్) ‘నేను టీమిండియా కోచ్‌గా బాధ్యతలు చేపట్టే సమయానికి సచిన్ రిటైర్మెంట్ ఆలోచనల్లో ఉన్నారు. నచ్చని స్థానాల్లో బ్యాటింగ్‌కు దిగడంపై అతడు చాలా అసంతృప్తి, అసహనం వ్యక్తం చేసేవానే. అయితే సచిన్‌తో పాటు ద్రవిడ్, లక్ష్మణ్‌లు కూడా ఎవరు ఏ స్థానంలో బ్యాటింగ్‌కు దిగుతారో క్రీజులోకి వెళ్లేవరకు తెలియదు. ముఖ్యంగా ఆ సమయంలో సచిన్ ఆటను ఎంజాయ్ చేయలేకపోయాడు. దీంతో ఆటను వదిలేయాలనుకున్నాడు. (ఏడు నిమిషాల్లోనే పూర్తయింది...) అయితే నేను కోచ్‌గా బాధ్యతలు చేపట్టాక అతను ఏ స్థానంలో బ్యాటింగ్ చేయాలనుకున్నాడో ఆ స్థానంలోనే ఆడే ఆవకాశం ఇచ్చాను. ఆటగాళ్లకు పూర్తి స్వేచ్చనిచ్చాను. నేను కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన మూడేళ్ల వ్యవధిలోనే సచిన్ ఏకంగా 18 శతకాలు సాధించాడు. అయితే నేను గొప్ప కోచింగ్ ఇచ్చానని అనడం లేదు. ఆటగాళ్లకు పూర్తి స్వేచ్చా వాతవరణాన్ని కల్పించా’ అని కిర్‌స్టన్ పేర్కొన్నాడు. ఇక కిర్‌స్టన్ కోచింగ్‌లోనే టీమిండియా టెస్టుల్లో నంబర్ వన్ స్థానాన్ని, వన్డే ప్రపంచకప్-2011ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. -
ఏడు నిమిషాల్లోనే...
న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టు పురోగతిలో కోచ్‌గా గ్యారీ కిర్‌స్టెన్ పోషించిన పాత్ర ఎంతో ప్రత్యేకం. టెస్టుల్లో టీమిండియా నంబర్‌వన్ స్థానానికి చేరుకోవడంతో పాటు 2011 వన్డే ప్రపంచకప్ చాంపియన్‌గా నిలవడం కిర్‌స్టెన్ హయాంలోనే జరిగింది. తాను కోచ్‌గా ఎంపిక కావడానికి సంబంధించి ఒక ఆసక్తికర అంశాన్ని అతను ఇటీవల పంచుకున్నాడు. కోచింగ్‌పై తనకు ఆసక్తి గానీ, అనుభవం గానీ లేవని... అసలు తనంతట తానుగా ఆ పదవి కోసం దరఖాస్తు కూడా చేసుకోలేదని కిర్‌స్టెన్ అన్నాడు. ‘భారత జట్టుకు శిక్షణ ఇవ్వగలవా అంటూ కోచింగ్ సెలక్షన్ కమిటీ సభ్యుడైన సునీల్ గావస్కర్‌నుంచి నాకు మెయిల్ వచ్చింది. ఏదో ఆకాశరామన్న ఉత్తరం అనుకొని పట్టించుకోలేదు. ఇంటర్వ్యూకు హాజరు కాగలవా అంటూ మళ్లీ అలాంటి మెయిల్ వస్తే నా భార్యకు చూపించాను. ఆమె కూడా నమ్మలేదు. పొరపాటున నాకు వచ్చిందేమోనని భావించింది. ఎందుకంటే నాకు అప్పటికీ ఎలాంటి కోచింగ్ అనుభవం లేదు’ అని కిర్‌స్టెన్ చెప్పాడు. చివరకు నిజమని నిర్ధారించుకొని ఇంటర్వ్యూకు వెళ్లాక జట్టు కెప్టెన్ అనిల్ కుంబ్లే కలిశాడని... తాను కోచ్ ఇంటర్వ్యూ కోసం వచ్చానని చెబితే కుంబ్లే పగలబడి నవ్వాడని గ్యారీ గుర్తు చేసుకున్నాడు. మొత్తంగా 7 నిమిషాల్లోనే తన ఇంటర్వ్యూ పూర్తయిందని, అప్పటికప్పుడు కోచ్ అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చినట్లు ఈ దక్షిణాఫ్రికా మాజీ ఓపెనర్ వెల్లడించాడు. ‘ఇంటర్వ్యూ ప్యానెల్లో ఉన్న రవిశాస్త్రి కఠినమైన ప్రశ్న అడిగాడు. భారత జట్టును ఓడించేందుకు మీ దక్షిణాఫ్రికా జట్టు ఏం చేసేదని అతను ప్రశ్నించాడు. నాకు తెలుసు అది చెప్పడం అంత సులువు కాదని. అయితే పూర్తిగా వ్యూహాల గురించి మాట్లాడకుండా మూడు నిమిషాల్లో దానిని వారికి అర్థమయ్యేలా వివరించగలిగాను. భారత జట్టు భవిష్యత్తు గురించి మీ వద్ద ఏదైనా ప్రణాళిక ఉందా అని బోర్డు కార్యదర్శి ప్రశ్నించగా...నన్ను ఎవరూ అడగలేదని, సిద్ధమై రాలేదని చెప్పాను. అయినా సరే ఎంపిక కాగలిగాను’ అని కిర్‌స్టెన్ వివరించాడు. చాపెల్ పేరుతో కాంట్రాక్ట్... ఈ సమయంలో మరో ఆసక్తికర అంశం చోటు చేసుకుంది. తనను ఎంపిక చేస్తూ కాంట్రాక్ట్ ఇచ్చాక కోచ్ స్థానంలో పేరు చూసుకుంటే గ్యారీ కిర్‌స్టెన్‌కు బదులుగా గ్రెగ్ చాపెల్ (అంతకు ముందు కోచ్) పేరు రాసి ఉంది. దాంతో మీరు తప్పు లెటర్ ఇచ్చారంటూ కార్యదర్శికే వెనక్కి ఇచ్చేశాను. ఆయన పెన్‌తో చాపెల్ పేరు కొట్టేసి తన పేరు రాసిచ్చారని కిర్‌స్టెన్ నవ్వుతూ చెప్పాడు. -
ధోనికి ఆ హక్కు ఉంది
న్యూఢిల్లీ: గత రెండు రోజులుగా సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేసిన అంశం మహేంద్రసింగ్ ధోని రిటైర్మెంట్. అయితే ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించిన ధోనికి ఎప్పుడు రిటైర్ కావాలో ఒకరు చెప్పాల్సిన పని లేదని భారత మాజీ కోచ్ గ్యారీ కిర్‌స్టెన్ ఘాటుగా వ్యాఖ్యానించాడు. ‘ఆటకు తాను అనుకున్నప్పుడే రిటైర్మెంట్ ఇచ్చే హక్కు ధోనికి ఉంది. అతను సాధించిన ఘనతలతో ఆ స్థాయికి చేరుకున్నాడు రిటైరయ్యే సమయం వచ్చిందంటూ అతనికి ఎవరూ చెప్పాల్సిన పని లేదు. అతనో అద్భుతమైన క్రికెటర్. ధోని మేధస్సు, శాంతం, శక్తి, అథ్లెటిక్స్ నైపుణ్యం, వేగం అతన్ని అందరిలో ప్రత్యేకంగా నిలుపుతాయి. ఆధునిక యుగం దిగ్గజ క్రీడాకారుల్లో ధోని ఒకరు’ అని కిర్‌స్టెన్ ధోనికి కితాబిచ్చాడు. -
గ్యారీ కిర్‌స్టన్‌కు మళ్లీ నిరాశే
లండన్: ఇటీవల భారత క్రికెట్ ప్రధాన కోచ్ పదవికి దరఖాస్తు చేసుకుని భంగపడ్డ మాజీ కోచ్, దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ గ్యారీ కిర్‌స్టన్‌కు మరోసారి నిరాశే ఎదురైంది. ఇంగ్లండ్ క్రికెట్ ప్రధాన కోచ్ పదవి కోసం కిర్‌స్టన్ దరఖాస్తు చేసుకున్నప్పటికీ అక్కడ కూడా చుక్కెదురైంది. తాజాగా ఇంగ్లండ్ క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా క్రిస్ సిల్వర్‌వుడ్‌ను నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇంగ్లండ్ తుది జాబితాలో కిర్‌స్టన్ పేరున్నప్పటికీ సిల్వర్‌వుడ్‌ను నియమించడానికి ఈసీబీ మొగ్గుచూపింది. ఇంటర్యూలో కిర్‌స్టన్ కంటే సిల్వర్‌వుడ్ చెప్పిన సమాధానాలకే అధిక ప్రాముఖ్యత ఇచ్చిన ఈసీబీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. భారత్, దక్షిణాఫ్రికా జట్లకు హెడ్ కోచ్‌గా పనిచేసిన అనుభవం ఉన్న కిర్‌స్టన్.. ఈసీబీ రేసులో ముందందజలో నిలిచినా చివరకు మాత్రం ప్రతికూల ఫలితమే వచ్చింది. స్వదేశీ క్రికెటర్ కావడమే సిల్వర్‌వుడ్‌కు నియమాకానికి ప్రధాన కారణం. ఇప్పటివరకూ ఇంగ్లండ్‌కు కోచ్‌గా పని చేసిన ట్రావెర్ బెయిలీస్ పదవీ కాలం ఇటీవల ముగిసిన నేపథ్యంలో ఈసీబీ.. కోచ్‌ల కోసం దరఖాస్తులు ఆహ్వానించింది. ఈ క్రమంలోనే కిర్‌స్టన్ కూడా దరఖాస్తు చేసుకున్నాడు. పలువురు ఇంగ్లండ్ మాజీ కెప్టెన్లు కిర్‌స్టన్ నియమానికే ఓటేసినా, ఆ దేశ క్రికెట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సమక్షంలోనే ఈసీబీ సెలక్షన్ ప్యానల్ మాత్రం సిల్వర్‌వుడ్ పేరును ఖరారు చేసింది. 2017-18 సీజన్లో భాగంగా యాషెస్ సిరీస్‌కు 44 ఏళ్ల సిల్వర్‌వుడ్ ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా సేవలందించడం కూడా అతని నియమానికి దోహదం చేసింది. ఇంగ్లండ్ ప్రధాన కోచ్‌కు దరఖాస్తు చేసుకున్న వారిలో కిర్‌స్టన్‌తో పాటు అలెక్ స్టువార్ట్, గ్రాహమ్ ఫోర్డ్‌లు ఉన్నారు.