పాకిస్తాన్ క్రికెట్ జట్టు గత రెండేళ్లగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుంది. టీ20 వరల్డ్‌కప్-2022లో రన్నరప్‌గా నిలిచిన తర్వాత పాక్ జట్టు చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోతుంది. గతేడాది జరిగిన ఆసియాకప్, వన్డే ప్రపంచకప్‌లో దారుణ ప్రదర్శన కనబరిచి లీగ్ స్టేజిలోనే ఇంటిముఖం పట్టింది.
దీంతో పాక్ క్రికెట్ టీమ్ కోచింగ్ స్టాప్‌ను మొత్తాన్ని పీసీబీ ప్రక్షాళన చేసింది. పాక్ వైట్‌బాల్ హెడ్‌కోచ్‌గా దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్‌గా గ్యారీ కిర్‌స్టెన్ బాధ్యతలు చేపట్టగా.. రెడ్‌బాల్ కోచ్‌గా ఆసీస్ దిగ్గజం గిల్లెస్పీ నియమితుడయ్యాడు. అయితే కోచ్‌లు మారినప్పటకి పాక్ క్రికెట్ తలరాత మాత్రం ఏ మాత్రం మారలేదు. టీ20 వరల్డ్‌కప్-2024లోనూ పేలవ ఆటతీరుతో గ్రూపు స్టేజిలోనే టోర్నీ నుంచి నిష్కమ్రించింది.
దీంతో హెడ్‌కోచ్ గ్యారీ కిర్‌స్టెన్‌పై కూడా పీసీబీ వేటు వేస్తుందని ఆ మధ్య కాలంలో వార్తలు వినిపించాయి. కానీ పాక్ క్రికెట్ బోర్డు ఇప్పటివరకు అయితే ఈ విషయంపై ఎటువంటి ఆధికారిక ప్రకటన చేయలేదు. తాజాగా ఇదే విషయంపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ బాసిత్ అలీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 తర్వాత కిర్‌స్టెన్‌ను పాక్ హెడ్ కోచ్ పదవి నుంచి తప్పిస్తారని అలీ తెలిపాడు.
"గ్యారీ కిర్‌స్టన్‌కు అభినందనలు. ఛాంపియన్స్ ట్రోఫీ వరకు పాక్ జట్టు హెడ్‌కోచ్‌గా అతడు కొనసాగుతాడు. అయితే ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత అతడిని తప్పించనున్నారు. అందుకే ఇప్పుడే గ్యారీకి టాటా, బై బై చెప్పాలనకుంటున్నాను. ఈ మెగా టోర్నీలో పాక్ మొదటి నాలుగు స్థానాల్లో నిలిస్తే చాలు అదే పెద్ద విజయంగా భావిస్తాము.
పాక్ క్రికెట్‌లో రాజకీయాలు కూడా ఎంట్రీ ఇచ్చాయి. క్రికెట్‌లో రాజకీయ నాయకులు జోక్యం చేసుకోవడం అంతమంచిది కాదు అంటూ" బసిత్ అలీ తన యూట్యాబ్ ఛానల్‌లో పేర్కొన్నాడు. కాగా పాక్ క్రికెట్ జట్టు ఆక్టోబర్ 7 నుంచి ఇంగ్లండ్‌తో మూడు టెస్టుల సిరీస్‌లో తలపడనుంది.
Comments
Please login to add a commentAdd a comment