
బెంగళూరు: ఐపీఎల్ ఫ్రాంచైజీ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) కోచ్‌గా గ్యారీ కిర్‌స్టెన్‌ను నియమించారు. హెడ్ కోచ్‌గా వ్యవహరించిన డానియెల్ వెటోరి స్థానంలో కిర్‌స్టెన్‌కు బాధ్యతలు అప్పగించారు. ప్లేయర్‌గా 2014లో జట్టులోకి వచ్చిన వెటోరి తదనంతరం హెడ్ కోచ్‌గా ఈ సీజన్ వరకు పని చేశారు.
వెటోరి కోచ్‌గా ఉన్న సమయంలో ఆర్‌సీబీ పెద్దగా ప్రభావం చూపలేకపోగా, ఒక్కసారి కూడా టైటిల్ సాధించలేకపోయింది. గ్యారీ శిక్షణలోనే భారత్ 2011లో వన్డే ప్రపంచకప్ గెలిచిన సంగతి తెలిసిందే. అయితే ఐపీఎల్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ కోచ్‌గా ఆయన పెద్దగా ప్రభావం చూపలేకపోయారు.
Comments
Please login to add a commentAdd a comment