ఐపీఎల్-2022లో రెండు కొత్త జట్లు రానున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్ కొత్త ప్రాంఛైజీగా అవతరించిన అహ్మదాబాద్ కోచ్‌గా దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు గ్యారీ కిర్‌స్టెన్ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. ఈ మేరకు ఆ ఫ్రాంచైజీ ప్రతినిధులు ఇప్పటికే కిర్‌స్టెన్ తో సమావేశమైనట్టు సమాచారం. కాగా 2011 వన్డే ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు కిర్‌స్టెన్ కోచ్‌గా బాధ్యతలు నిర్వహించాడు. 2011 ప్రపంచకప్ అనంతరం టీమిండియా హెడ్ కోచ్ బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత అతడు దక్షిణాఫ్రికా కోచ్ గా నియమితుడయ్యాడు.
అయితే ఐపీఎల్‌లో కోచ్‌గా అతడికి ఇదేం తొలిసారి కాదు. అంతకుముందు ఆర్సీబీ జట్టుకు హెడ్ కోచ్ గా కిర్‌స్టెన్ పనిచేశాడు. అదే విధంగా జట్టు బౌలింగ్ కోచ్‌గా భారత మాజీ బౌలర్ ఆశిష్ నెహ్రాతో అహ్మదాబాద్ ప్రతినిధులు సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ జట్టు బౌలింగ్ కోచ్‌గా గతంలో ఆశిష్ నెహ్రా వ్యవహరించాడు. కాగా అంతకుముందు భారత మాజీ కోచ్ రవిశాస్త్రి అహ్మదాబాద్ కోచ్‌గా రానున్నడని వార్తలు వినిపించాయి.
చదవండి: 'పుష్ప' ట్రాన్స్‌లో టీమిండియా ఆల్‌రౌండర్.. 'తగ్గేదే లే'
Comments
Please login to add a commentAdd a comment