PC: IPL.COM
ఐపీఎల్‌లో టీమిండియా మాజీ పేసర్, గుజరాత్ టైటాన్స్ హెడ్ కోచ్ ఆశిష్ నెహ్రా సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ టైటిల్ గెలుచుకున్న తొలి భారత హెడ్ కోచ్‌గా ఆశిష్ నెహ్రా నిలిచాడు. ఐపీఎల్-2022లో గుజరాత్ టైటాన్స్ హెడ్ కోచ్‌గా నెహ్రా బాధ్యతలు నిర్వహించాడు. ఆదివారం అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఫైనల్లో రాజస్తాన్‌ను ఓడించి గుజరాత్ ఈ ఏడాది టైటిల్ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక హెడ్ కోచ్‌గా గుజరాత్ విజయంలో నెహ్రా కీలక పాత్ర పోషించాడు.
ఇక ఇప్పటి వరకు షేన్ వార్న్, డారెన్ లెమాన్, రికీ పాంటింగ్, ట్రెవర్ బేలిస్, టామ్ మూడీ, స్టీఫెన్ ఫ్లెమింగ్, జాన్ రైట్,జయవర్ధనే వంటి విదేశీ హెడ్‌కోచ్‌ల నేతృత్వంలో ఆయా జట్లు ఐపీఎల్ టైటిల్ గెలుచుకున్నాయి. కాగా అత్యధిక ఐపీఎల్ టైటిల్స్ గెలుచుకున్న హెడ్ కోచ్‌ల జాబితాలో స్టీఫెన్ ఫ్లెమింగ్ తొలి స్థానంలో ఉన్నాడు. ఆయన కోచింగ్‌లో సీఎస్‌కే నాలుగు సార్లు ఐపీఎల్ విజేతగా నిలిచింది. ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్ మహేల జయవర్ధనే మూడు టైటిల్స్‌తో రెండవ స్థానంలో ఉన్నాడు.
చదవండి: IPL GT Mentor Gary Kirsten: గుజరాత్ టైటాన్స్ విజయంలో అజ్ఞాతవ్యక్తి; మాటల్లేవు.. అంతా చేతల్లోనే
Comments
Please login to add a commentAdd a comment