PC: IPL Twitter
2022 సీన్ ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లోనూ రిపీట్ కాబోతుందా అంటే..? కొన్ని గణాంకాలు ఆ ఫలితాన్నే సూచిస్తున్నాయి. గత సీజన్‌లో ఛాంపియన్‌గా అవతరించిన గుజరాత్, ఏరకంగా అయితే తమ ప్రస్థానాన్ని ప్రారంభించిందో (తొలి మ్యాచ్‌లో విజయం), ప్రస్తుత సీజన్‌లోనూ అలాగే మక్కీ టు మక్కీ సీన్ రిపీట్ చేస్తోంది. గత సీజన్‌లో 14 గ్రూప్ స్టేజీ మ్యాచ్‌లు ఆడిన గుజరాత్.. ప్రస్తుత సీజన్‌లోనూ అన్నే మ్యాచ్‌లు ఆడి గత సీజన్‌లోలాగే 10 విజయాలు, 4 అపజయాలను ఎదుర్కొని పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది.
ఈ గణాంకాలు చూడటానికి చాలా సింపుల్‌గా కనిపిస్తున్నప్పటికీ, గుజరాత్ మాత్రం కాపీ పేస్ట్ అన్న తరహాలోనే తమ జైత్రయాత్ర కొనసాగిస్తుంది. ఇక్కడ గుజరాత్ ఐపీఎల్‌లో ఇప్పటివరకు ఏ జట్టుకు సాధ్యం కాని ఓ రికార్డును కూడా తమ ఖాతాలో వేసుకుంది. గ్రూప్ స్టేజీ మ్యాచ్‌ల్లో వరుస సీజన్లలో 5 కంటే తక్కువ మ్యాచ్‌లు ఓడిన తొలి జట్టుగా హార్ధిక్ సేన చరిత్ర సృష్టించింది.
ఇదిలా ఉంటే, ఐపీఎల్-2023లో జోరు కొనసాగిస్తున్న డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్.. తమ ఆఖరి గ్రూప్ మ్యాచ్‌లో ఆర్సీబీని మట్టికరిపించి, ముంబైని ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించేలా చేసింది. నిన్నటి మ్యాచ్‌లో ఆర్సీబీ ఓటమిపాలవ్వడంతో ప్లే ఆఫ్స్‌కు చేరిన నాలుగో జట్టుగా ముంబై నిలిచింది. గుజరాత్ ఓపెనర్ శుభ్‌మర్ గిల్ సుడిగాలి శతకంతో ఆర్సీబీ ప్లే ఆఫ్స్ అవకాశాలపై నీళ్లు చల్లాడు. రేపు (మే 23) జరుగబోయే క్వాలిఫయర్ 1 మ్యాచ్‌లో గుజరాత్-సీఎస్‌కే.. మే 24న జరిగే ఎలిమినేటర్ మ్యాచ్‌లో లక్నో-ముంబై.. మే 26న జరిగే క్వాలిఫయర్ 2లో క్వాలిఫయర్ 1లో ఓడిన జట్టు-ఎలిమినేటర్‌లో గెలిచిన జట్టు.. మే 28న జరిగే ఫైనల్లో క్వాలిఫయర్ 1 విన్నర్-క్వాలిఫయర్ 2 విన్నర్లు తలపడతాయి.
చదవండి: IPL 2023: ధోనితో విభేదాలు.. మధ్యలో రవీంద్ర జడేజా భార్య..!
Comments
Please login to add a commentAdd a comment