హార్దిక్‌ పూర్తిగా మారిపోయాడు.. ఈ మార్పునకు కారణం అతడే: మాజీ పేసర్‌ | Ashish Nehra: With Agastya Arrival Hardik Become More Calm Focused On Work | Sakshi
Sakshi News home page

Hardik Pandya: హార్దిక్‌ పూర్తిగా మారిపోయాడు.. ఈ మార్పునకు కారణం అతడే: మాజీ పేసర్‌

Published Wed, Aug 31 2022 11:50 AM | Last Updated on Wed, Aug 31 2022 12:07 PM

Ashish Nehra: With Agastya Arrival Hardik Become More Calm Focused On Work - Sakshi

హార్దిక్‌ పాండ్యా (PC: BCCI)

Asia Cup 2022- Hardik Pandya: ‘‘కాలం.. అనుభవం మనిషికి అన్ని విషయాలు నేర్పిస్తాయి. ఇందుకు పాండ్యా కూడా అతీతుడు కాడు. వ్యక్తిగా.. ఆటగాడిగా తనలో వచ్చిన మార్పులను నేను స్పష్టంగా చూశాను’’ అని టీమిండియా మాజీ పేసర్‌ ఆశిష్‌ నెహ్రా అన్నాడు. భారత జట్టు స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యాను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశాడు. తండ్రిగా మారిన తర్వాత హార్దిక్‌ పరిణితి చెందాడని.. ఆటపై మరింత దృష్టి సారించాడని పేర్కొన్నాడు.

చేదు అనుభవాలు ఎదుర్కొని..
కాగా గడ్డు పరిస్థితులను దాటుకుని ఐపీఎల్‌-2022లో గుజరాత్‌ టైటాన్స్‌ ఫ్రాంఛైజీ ఇచ్చిన అవకాశంతో మరోసాని తానేంటో నిరూపించుకున్నాడు హార్దిక్‌ పాండ్యా. అదే జోష్‌లో రెట్టించిన ఉత్సాహంతో కెరీర్‌లో ముందుకు సాగున్నాడు. అరంగేట్ర సీజన్‌లోనే గుజరాత్‌ను టైటిల్‌ విజేతగా నిలిపిన కెప్టెన్‌గా ఘనత వహించి.. టీమిండియాలో పునరగామనం చేశాడు. 

రెగ్యులర్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ గైర్హాజరీ టీ20 ఫార్మాట్‌లో ఏకంగా టీమిండియా పగ్గాలు చేపట్టి వరుస విజయాలు నమోదు చేశాడు. అంతేకాదు.. ఆసియాకప్‌-2022లో భాగంగా పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో భారత్‌ గెలుపులో కీలక పాత్ర పోషించి తన విలువ చాటుకున్నాడు. అయితే, గతంలో మాదిరి మరీ దూకుడుగా కాకుండా.. వివాదాల జోలికి పోకుండా.. కాస్త కామ్‌గా ఉంటూనే తన పనిని తాను చక్కబెట్టుకుంటున్నాడు.


ఆశిష్‌ నెహ్రా, హార్దిక్‌ పాండ్యా(PC: IPL/BCCI)

ఒకేలా ఉంటానంటే కుదరదు!
ఈ నేపథ్యంలో.. గుజరాత్‌ టైటాన్స్‌ కోచ్‌గా హార్దిక్‌కు మరింత సన్నిహితంగా మెలిగిన ఆశిష్‌ నెహ్రా.. తమ కెప్టెన్‌ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కొడుకు అగస్త్య రాకతో హార్దిక్‌ పూర్తిగా మారిపోయాడన్నాడు. ఐసీసీ వీడియోలో మాట్లాడుతూ.. ‘‘మనిషికి మార్పు అవసరం. అన్ని పరిస్థితుల్లోనూ ఒకేలా ఉంటానంటే కుదరదు. పాండ్యా విషయంలోనూ అదే జరిగింది. 

అగస్త్య వచ్చాకే!
అనుభం తనకు చాలా నేర్పిందన్న విషయాన్ని అతడే స్వయంగా పలు సందర్భాల్లో చెప్పాడు కూడా! తను ఇప్పుడు వివాహితుడు.. ఓ బిడ్డకు తండ్రి.. అలాగే పరిణితి కలిగిన వ్యక్తి. నిజంగా అగస్త్య రాకతో తను చాలా మారిపోయాడు. తన పని ఏమిటో తాను చూసుకుంటూ.. కెరీర్‌పై మరింత దృష్టి సారించాడు. ఈ విషయాలను నేను దగ్గరగా గమనించాను’’ అని హార్దిక్‌ పాండ్యా గురించి నెహ్రా చెప్పుకొచ్చాడు. 


భార్య నటాషా, కొడుకు అగస్త్యతో పాండ్యా(PC: Natasa instagram )

ఇక పాండ్యా వయసు​ ఇంకా 28 ఏళ్లేనన్న నెహ్రా.. ఆటను ఇలాగే కొనసాగిస్తే.. కెరీర్‌ మరింత ఉజ్వలంగా సాగుతుందన్నాడు. కఠిన శ్రమకు ఓర్వడంతో పాటుగా నైపుణ్యాలకు ఎప్పటికప్పుడు మెరుగులు దిద్దుకునే తత్వం గలవాడని హార్దిక్‌ను కొనియాడాడు. కాగా హార్దిక్‌ పాండ్యా సెర్బియన్‌ మోడల్‌ నటాషాను పెళ్లాడాడు. వీరికి కొడుకు అగస్త్య సంతానం. ఇక హార్దిక్‌కు తన కొడుకంటే పంచప్రాణాలు. ఆట నుంచి విరామం దొరికితే కుటుంబానికే మొత్తం సమయం కేటాయిస్తాడు పాండ్యా.


భార్య నటాషా, కొడుకు అగస్త్యతో పాండ్యా(PC: Natasa instagram )

చదవండి: Nazibulla Zardan: ఆరు సిక్సర్లతో ప్రపంచ రికార్డు సాధించిన అఫ్గన్‌ బ్యాటర్‌
Asia Cup 2022: శ్రీలంకతో మ్యాచ్‌! మాకు చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement