Asish Nehra
-
టీమిండియా హెడ్ కోచ్‌గా ద్రవిడ్ వద్దు.. వారిద్దరే సరైనోళ్లు! సెహ్వాగ్ అయితే?
ఆసియాకప్, టీ20 ప్రపంచకప్-2022లో ఘోర పరాభావం తర్వాత భారత జట్టు హెడ్ కోచ్ పదవి నుంచి రాహుల్ ద్రవిడ్ తప్పించాలన్న డిమాండ్లు వినిపించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా టీ20లకు హెడ్‌కోచ్‌గా భారత మాజీ పేసర్ ఆశిష్ నెహ్రాను నియమించాలంటూ పలువురు మాజీ క్రికెటర్లు సూచించారు. ఎందుకంటే గతేడాది ఐపీఎల్ సీజన్లో గుజరాత్ టైటాన్స్‌కు హెడ్ కోచ్‌గా వ్యవహరించిన నెహ్రా.. తమ జట్టుకు అరంగేట్ర సీజన్లోనే టైటిల్‌ను అందించాడు. తన వ్యూహాలతో జట్టును విజయ పథంలో నడిపించాడు. ఇక ఇది ఇలా ఉండగా.. ఈ ఏడాది నవంబర్‌తో హెడ్ కోచ్‌గా ద్రవిడ్ రెండేళ్ల పదవీ కాలం ముగియనుంది. వన్డే ప్రపంచకప్-2023 ముగిసిన అనంతరం ద్రవిడ్ స్థానంలో కొత్త కోచ్‌ను బీసీసీఐ నియమించే అవకాశం ఉంది. ఇక ఇదే విషయంపై టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ తన అభిప్రాయాలను వెల్లడించాడు. టీ20లకు కోచ్‌గా ద్రవిడ్ సెట్ కాడని, పొట్టి ఫార్మాట్‌ను అర్ధం చేసుకునే మైండ్‌సెట్ ఉన్న వారు కోచ్‌గా రావాలని భజ్జీ అభిప్రాయపడ్డాడు. టీ20ల్లో భారత్ హెడ్ కోచ్‌గా వీరేంద్ర సెహ్వాగ్ లేదా ఆశిష్ నెహ్రాలో ఎవరినైనా నియమించాలని హర్భజన్ సూచించాడు. "భారత జట్టుకు ఇద్దరు కెప్టెన్లు ఉన్నప్పుడు, ఇద్దరు కోచ్‌లు ఉంటే తప్పు ఏమి ఉంది. ఎవరి ప్రణాళికలు వారివి. ఊదాహరణకు ఇంగ్లండ్ జట్టును చూస్తే మనకు అర్ధమవుతుంది. బ్రెండన్ మెకల్లమ్ తన ఆలోచనలతో టెస్టు క్రికెట్ స్వరూపాన్నే మార్చేశాడు. కాబట్టి అదే దూకుడు మైండ్ కలిగిన వీరేంద్ర సెహ్వాగ్ లేదా ఆశిష్ నెహ్రాను భారత టీ20 జట్టుకు హెడ్ కోచ్‌గా నియమించిండి. ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ హెడ్‌కోచ్‌గా ఆశిష్ ఏ విధంగా రాణించాడో మనం చూశం. హార్దిక్ పాండ్యాతో కలిసి తమ జట్టుకు తొలి టైటిల్‌ను అందించాడు. నా వరకు అయితే టీ20 ఫార్మాట్‌ను అర్ధం చేసుకునేవారిని కోచ్‌గా నియమిస్తే బాగుంటుంది. ద్రవిడ్‌ను టెస్టులు, వన్డేల్లో కోచ్‌గా కొనసాగించాలి. ద్రవిడ్ మైండ్ సెట్ వన్డే, టెస్టు ఫార్మాట్లకు సెట్ అవుతుంది" అని ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హర్భజన్ సింగ్ పేర్కొన్నాడు. 2024 టీ20 ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో బీసీసీఐ ఇప్పటి నుంచే మంచి జట్టుని తయారు చేయడంపై దృష్టిసారించింది. సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలను టీ20లకు ఎంపిక చేయకుండా.. హార్దిక్ పాండ్యా కు నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తోంది. చదవండి: NZ Vs Eng: జాక్ లీచ్ మాయాజాలం.. దెబ్బకు బౌల్డ్.. బిత్తరపోయిన బ్యాటర్! వీడియో వైరల్ -
ఐపీఎల్ కోసం గుజరాత్ టైటాన్స్ మాస్టర్ ప్లాన్.. ఇప్పటి నుంచే?
ఐపీఎల్-2023 కోసం ఇప్పటి నుంచే డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ తమ ప్రాక్టీస్‌ను మొదలు పెట్టింది. ఆదివారం (ఫిబ్రవరి 5) పలువురు గుజరాత్ టైటాన్స్ ఆటగాళ్లు తమ హోం గ్రౌండ్ నరేంద్ర మోడీ స్టేడియంలో సమావేశమయ్యారు. గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాతో పాటు శుభ్‌మన్ గిల్, మహ్మద్ షమీ వంటి స్టార్ ఆటగాళ్లు ఆసీస్‌తో వన్డే సిరీస్ అనంతరం తమ జట్టుతో కలవనున్నారు. ఇక ప్రస్తుతం ప్రాక్టీస్ సెషన్స్‌లో పాల్గొన్న ఆటగాళ్లలో రాహుల్ తెవాటియా, అభినవ్ మనోహర్, సాయి సుదర్శన్, విజయ్ శంకర్, మోహిత్ శర్మ, వంటి వారు ఉన్నారు. వీరిందరూ గుజరాత్ హెడ్‌కోచ్ ఆశిష్ నెహ్రా నేతృత్వంలో సాధన చేస్తున్నారు. ముఖ్యంగా యువ ఆటగాళ్లను సిద్దం చేసే పనిలో నెహ్రా బీజీబీజీగా ఉన్నాడు. గతేడాది సీజన్లో మనోహర్, సాయి సుదర్శన్ వంటి యువ ఆటగాళ్లు అదరగొట్టిన సంగతి తెసిందే. ఈ ఏడాది సీజన్లో కూడా తమ జట్టు అద్భుతంగా రాణించేలా నెహ్రా ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తోన్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా అరేంట్ర సీజన్లోనే హార్దిక్ పాండ్యా సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్ టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. శివమ్ మావికి భారీ ధర.. ఐపీఎల్-2023 మినీవేలంలో భారత యువ పేసర్ శివమ్ మావిని రూ. 6కోట్ల భారీ ధరకు గుజరాత్ కొనుగోలు చేసింది. అదే విధంగా ఐర్లాండ్ స్టార్ పేసర్ జాషువా లిటిల్ను రూ.4.4 కోట్లు వెచ్చించి టైటాన్స్ సొంతం చేసుకుంది. న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌ను కూడా రూ.2 కోట్లకు గుజరాత్ దక్కించుకుంది. The Titans are back, and raring to go 🔥😍 Naya season, #AavaDe 💪#TATAIPL [🎵: The Score - Legend] pic.twitter.com/Mxno9VYAwT — Gujarat Titans (@gujarat_titans) February 5, 2023 ఐపీఎల్-2023కు గుజరాత్ టైటాన్స్ జట్టు.. హార్దిక్ పాండ్యా (కెప్టెన్), శుభమాన్ గిల్, డేవిడ్ మిల్లర్, అభినవ్ మనోహర్, సాయి సుదర్శన్, వృద్ధిమాన్ సాహా, మాథ్యూ వేడ్, రషీద్ ఖాన్, రాహుల్ తెవాటియా, విజయ్ శంకర్, మహమ్మద్ షమీ, అల్జారీ జోసెఫ్, యష్ దయాల్, ప్రదీప్ సాంగ్వాన్ , దర్శన్ నల్కండే, జయంత్ యాదవ్, ఆర్ సాయి కిషోర్, నూర్ అహ్మద్, మోహిత్ శర్మ ,జాషువా లిటిల్, ఉర్విల్ పటేల్, శివమ్ మావి, కెఎస్ భరత్, ఓడియన్ స్మిత్, కేన్ విలియమ్సన్ చదవండి: IND vs AUS: ఆస్ట్రేలియాతో తొలి టెస్టు.. ఆంధ్ర ఆటగాడు అరంగేట్రం! కిషన్‌కు నో ఛాన్స్ -
ద్రవిడ్, రోహిత్ కాదు! నా కెప్టెన్సీ సక్సెస్‌కు కారణం అతడే: హార్దిక్ పాండ్యా
టీమిండియా తాత్కాలిక టీ20 కెప్టెన్‌గా వ్యవహారిస్తున్న హార్దిక్ పాండ్యా విజయపథంలో దూసుకుపోతున్నాడు. తాజాగా శ్రీలంకతో టీ20 సిరీస్‌కు భారత కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించిన హార్దిక్.. తన జట్టుకు 2-1తేడాతో మరో టైటిల్‌ను అందించాడు. కాగా రోహిత్ వారసుడిగా భావిస్తున్న హార్ధిక్ పాండ్యాకు టీ20 కెప్టెన్‌గా స్వదేశంలో ఇదే తొలి సిరీస్ విజయం. ఇక మూడో టీ20 మ్యాచ్ అనంతరం మాట్లాడిన హార్దిక్.. తన కెప్టెన్సీ సక్సెస్‌కు గల కారణాన్ని వెల్లడించాడు. టీమిండియా మాజీ బౌలర్, గుజరాత్ టైటాన్స్ హెడ్ కోచ్ ఆశిష్ నెహ్రా సూచనల వల్లే నేను కెప్టెన్‌గా విజయవంతమయ్యాను అని హార్ది్క్ తెలిపాడు. కాగా ఐపీఎల్-2022లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా వ్యవహరించిన హార్దిక్.. అరంగేట్ర సీజన్లోనే తన జట్టుకు టైటిల్‌ను అందించాడు. అదే విధంగా కోచ్‌గా నెహ్రా కూడా జట్టును ముందుండి నడిపించాడు. ఇక పోస్ట్ మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో హార్దిక్ మాట్లాడుతూ.."ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా విజయవంతం కావడానికి కోచ్ ఆశిష్ నెహ్రానే కారణం. ఇప్పుడు అతడు సూచనల వల్లే మరింత మెరుగ్గా రాణించగల్గుతున్నాను. నెహ్రా వంటి కోచ్‌తో పని చేయడం నా అదృష్టం. అతడు నా జీవితంలో నేను ఊహించని మార్పులను తీసుకొచ్చాడు. మేమిద్దరం ఒకే విధంగా ఆలోచిస్తాం. అతడితో కలిసి పని చేయడం వల్ల నా కెప్టెన్సీకి విలువ పెరిగింది. అతడు కెప్టెన్‌గా పనిచేయకపోయనప్పటకీ.. పలు విషయాలు ఆశిష్ దగ్గర నేర్చుకున్నాను. అదే విధంగా కెప్టెన్సీ పరంగా కూడా గతంలో నాకు పెద్దగా అనుభవం లేదు. కేవలం అండర్ -16 జట్టులో ఉన్నప్పుడు బరోడాకు సారథిగా ఉన్నాను. ఆ తర్వాత కేవలం నా ఆట మీదే దృష్టి పెట్టాను అని అతడు పేర్కొన్నాడు. కాగా హార్దిక్ తన వాఖ్యలలో ఎక్కడ కూడా ప్రస్తుత టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ పేరులను ప్రస్తావించకపోవడం గమనార్హం. కాగా హార్దిక్ భారత జట్టుతో పాటు ఐపీఎల్లో కూడా రోహిత్ సారథ్యంలో చాలా సీజన్ల పాటు ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహించిన సంగతి తెలిసిందే. -
అసలేం చేస్తున్నారు.. టీమిండియాను భ్రష్టు పట్టించకండి: నెహ్రా ఘాటు వ్యాఖ్యలు! కోచ్‌గా..
India tour of New Zealand, 2022 : న్యూజిలాండ్‌తో రెండో వన్డేలో భారత జట్టు కూర్పుపై టీమిండియా మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా విస్మయం వ్యక్తం చేశాడు. మేనేజ్మెంట్ అసలేం ఆలోచిస్తుందో అర్థం కావడం లేదని.. ఒక్క మ్యాచ్‌లో విఫలమైనంత మాత్రాన ఆటగాళ్లను పక్కనపెట్టడం సరికాదని విమర్శించాడు. తప్పుడు నిర్ణయాలతో జట్టును భ్రష్టు పట్టించవద్దని ఘాటు విమర్శలు చేశాడు. దీపక్ బౌలింగ్ ఆప్షన్ కాదు! కాగా కివీస్‌తో మొదటి వన్డేలో చోటు దక్కించుకున్న బ్యాటర్ సంజూ శాంసన్, బౌలర్ శార్దూల్ ఠాకూర్లను ఆదివారం నాటి రెండో మ్యాచ్‌లో పక్కనపెట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సంజూ స్థానంలో దీపక్ హుడా, శార్దూల్ స్థానంలో దీపక్ చహర్ తుది జట్టులో చోటు దక్కించుకున్నారు. ఈ క్రమంలో మ్యాచ్ బ్రాడ్‌కాస్టర్ అమెజాన్ ప్రైమ్ వీడియో చర్చలో పాల్గొన్న ఆశిష్ నెహ్రా కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఈ మ్యాచ్‌లో టీమిండియా రెండు మార్పులతో బరిలోకి దిగడం మనం చూశాం. దీపక్ హుడాను బౌలింగ్ ఆప్షన్‌గా తీసుకున్నారని నేనైతే అనుకోవడం లేదు. నిజానికి అతడు వరల్డ్‌కప్ టోర్నీలో వికెట్లు తీసి ఉండవచ్చు. అయితే, ఇప్పుడు జట్టులో వాషింగ్టన్ సుందర్ ఉన్నాడు కదా! నిజానికి వాళ్లకు దీపక్ హుడా ఆరో బౌలింగ్ ఆప్షన్ కావొచ్చు. కానీ మరీ అంత గొప్ప ఆల్‌రౌండర్ ఏమీ కాదు. చహర్ బెటర్.. అయినా శార్దూల్ ఠాకూర్ గత మ్యాచ్‌లో బాగా ఆడలేదని కాదు.. అయితే తనకంటే దీపక్ చహర్ బెటర్. అయినా మొదటి మ్యాచ్‌లో చహర్‌ను కాదని ఠాకూర్‌ను ఆడించారు. కానీ.. ఆ మరుసటి మ్యాచ్‌కే ఠాకూర్‌ను తప్పించారు. ఇది సరికాదు’’ అని నెహ్రా అభిప్రాయపడ్డాడు. ఇక సంజూ శాంసన్ గురించి స్పందిస్తూ.. ‘‘ఒకవేళ నేను సెలక్టర్‌గా ఉంటే.. సంజూను కాదని హుడానే ఆడించేవాడిని. హుడా కోసం సంజూను బలి చేయాలా? అయితే, ఆరో బౌలింగ్ ఆప్షన్‌గా మాత్రం కాదు’’ అంటూ హుడాకు మద్దతుగా నిలవడం గమనార్హం. అయితే, చర్చలో భాగంగా ఇందుకు స్పందించిన మరో మాజీ క్రికెటర్ మురళీ కార్తిక్.. ‘‘ఆశిష్ అన్నట్లు హుడాను బ్యాటర్‌గా ఎంపిక చేయడం వరకు ఒకే! బౌలింగ్ ఆప్షన్‌గా కూడా వాడుకోవడం మంచి విషయమే. హుడా తుది జట్టులోకి రావడం కోసం మరొకరిని పక్కన పెట్టడం సరికాదు. నిజానికి, సంజూ శాంసన్ గత కొంతకాలంగా మెరుగైన ప్రదర్శన కనబరస్తున్నప్పటికీ అతడికి పెద్దగా అవకాశాలు రావడం లేదు. ఇప్పుడేమో ఇలా ఒక్క మ్యాచ్ తర్వాత మళ్లీ పక్కన పెట్టారు’’ అని సంజూకు అండగా నిలబడ్డాడు. అయితే, తాత్కాలిక కోచ్ వీవీఎస్ లక్ష్మణ్ అన్నీ ఆలోచించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకుని ఉంటాడని కార్తిక్ అభిప్రాయపడ్డాడు. కావాలనే చేశారు! అదేం కాదు.. మొదటి వన్డేలో ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన సంజూ శాంసన్ 36 పరుగులతో రాణించాడు. అయితే, గత కొంతకాలంగా విఫలమవుతున్న మరో వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ మాత్రం మరోసారి తక్కువ స్కోరు(15)కే పెవిలియన్ చేరాడు. దీంతో సంజూను వివక్షపూరితంగానే పక్కన పెట్టారంటూ అతడి ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున బీసీసీఐని ట్రోల్ చేశారు. ఇక ఈ మ్యాచ్ వర్షార్పణమైన తర్వాత కెప్టెన్ శిఖర్ ధావన్ మాట్లాడుతూ.. ఆరో బౌలర్ అవసరమైనందు వల్లే సంజూకు బదులు హుడాను తీసుకున్నామని తెలిపాడు. అదే విధంగా పిచ్ స్వింగ్‌కు అనుకూలంగా ఉంటుందని భావించి ఠాకూర్‌ను తప్పించి చహర్‌కు ఛాన్స్ ఇచ్చినట్లు వెల్లడించాడు. ఈ నేపథ్యంలో ఆశిష్ నెహ్రా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మరోవైపు.. సంజూ అభిమానులు మాత్రం స్పిన్ బౌలింగ్ చేయగల హుడాను తీసుకున్నప్పటికీ.. వికెట్ కీపర్‌గా పంత్‌ను కాదని శాంసన్‌కు అవకాశం ఇవ్వొచ్చు కదా అని కామెంట్ చేస్తున్నారు. చదవండి: గిన్నిస్ రికార్డుల్లోకెక్కిన ఐపీఎల్ 2022 ఫైనల్.. ఎందుకంటే..? IPL 2023: పెద్దగా పరిచయం లేని ఆటగాళ్లకు భారీ ధర.. అసలు ఎలా ఎంపిక చేస్తారు? -
‘కోహినూర్ వజ్రం కోసం ఇలా ట్రై చేస్తే’.. హర్ష గోయెంకా ట్వీట్‌కి నవ్వకుండా ఉండలేరు!
రిషి సునాక్(Rishi Sunak).. గత రెండు రోజులుగా ఈ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతోంది. బ్రిటన్ ప్రధాని పీఠంపై చిన్న వయసులో..అది కూడా తొలి శ్వేతజాతీయేతరుడిగా రిషి సునాక్ పగ్గాలు అందుకుని సంచలనం సృష్టించారు. ఆయన భారత మూలాలు ఉన్న వ్యక్తి కావడం, పైగా మన దేశపు అల్లుడు కావడంతో భారత్‌లోనూ హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదిలా ఉండగా, మరోవైపు రిషి సునాక్‌పై మీమ్స్ వడ్డన కూడా మామూలుగా లేదు. తాజాగా ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష్ గోయెంకా చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. బ్రిటన్ ప్రధానమంత్రిగా భారతీయ సంతతికి చెందిన రిషి సునాక్ ఎన్నికైన సంగతి తెలిసిందే . ఇక అప్పటి నుంచి కోహినూర్ వజ్రం అంశం మరోసారి చర్చనీయాంశమైంది. దీనిపై నెట్టింట చర్చలు కూడా మొదలయ్యాయి. తాజాగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే వ్యాపారవేత్త హర్ష్ గోయెంకా సైతం ఈ అంశంపై ఫన్నీగా స్పందించారు. బ్రిటన్ నుంచి కోహినూర్ వజ్రాన్ని తిరిగి తీసుకురావాలనే ఇలా ట్రై చేయండంటూ ట్వీట్ ద్వారా తెలిపారు. ఆ ట్వీట్లో ఏముందంటే.. 'కోహినూర్‌ను తిరిగి పొందాలంటే నా స్నేహితుడి ఆలోచన ఇదే... రిషి సునాక్‌ను భారతదేశానికి ఆహ్వానించండి. ఆయన అత్తమామల ఇంటికి వెళ్లేటప్పుడు బెంగళూరు ట్రాఫిక్‌లో చిక్కుకున్న సమయంలో కిడ్నాప్ చేయండి. రిషి సునాక్ స్థానంలో ఆశిష్ నెహ్రాను యూకే ప్రధానమంత్రిగా పంపండి, అలా చేసినా ఎవరూ గుర్తుపట్టరు. వెంటనే కోహినూర్‌ను తిరిగి ఇచ్చే బిల్‌ను నెహ్రా పాస్ చేయిస్తాడని’ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌పై నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. ప్రసుత్త ఇది నెట్టింట హల్ చేస్తోంది. కాగా రిషి సునాక్, ఆశిష్ నెహ్రా చూడటానికి ఒకేలా కన్పించడంతో నెటిజన్లు క్రేజీగా మీమ్స్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. My friend’s idea to get back #Kohinoor: 1. Invite #RishiSunak to India 2. Kidnap him when he is stuck in Bangalore traffic to visit his in-laws 3. Send instead Ashish Nehra as UK PM. No one will realise it. 4. Nehra will be told to pass the bill to return Kohinoor 💎 in 🇮🇳! 😀😀 — Harsh Goenka (@hvgoenka) October 25, 2022 చదవండి: Rishi Sunak: అక్కడ మొదలైన రిషి- అక్షత ప్రేమకథ.. మామగారి గురించి బ్రిటన్ ప్రధాని ఏమన్నారంటే! -
రిషి సునాక్‌కు బదులు ఆశిష్ నెహ్రాకు విషెస్.. మీమ్స్ వైరల్..
రిషి సునాక్ బ్రిటన్ ప్రధాని అయి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ఈ పదవి చేపట్టిన తొలి భారత సంతతి వ్యక్తిగా ఆయన అరుదైన ఘనత సాధించారు. అయితే సోషల్ మీడియాలో నెటిజన్లు మాత్రం రిషి సునాక్‌కు బదులు భారత మాజీ క్రికెటర్ ఆశిష్ నెహ్రాకు శుభాకంక్షాలు చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన మీమ్స్ సామాజిక మాధ్యమాల్లో తెగవైరల్ అవుతున్నాయి. రిషి సునాక్, ఆశిష్ నెహ్రా చూడటానికి ఒకేలా కన్పించడంతో నెటిజన్లు క్రేజీగా మీమ్స్ క్రియేట్ చేశారు. ఆశిష్ నెహ్రా ఫోటో పెట్టి రిషి సునాక్‌కు విషెస్ చెబుతూ నవ్వులు పూయిస్తున్నారు. అంతేకాదు కొన్ని ఫోటోలను మార్ఫింగ్ కూడా చేశారు. ప్రధాని మోదీతో ఆశిష్ నెహ్రా మాట్లాడుతున్నట్లు ఫోటో పెట్టి.. బ్రిటన్ నుంచి కోహినూర్ డైమండ్‌ను ఎలా వెనక్కి తీసుకురావాలో మోదీ, రిషి సునాక్ ఆలోచిస్తున్నారని క్యాప్షన్ పెట్టారు. ఈ ఫోటోను నెటిజన్లు తెగ షేర్ చేస్తున్నారు. నెహ్రా, రిషి సునాక్‌లపై మరిన్ని మీమ్స్ చూద్దాం.. ఆశిష్ నెహ్రాతో విరాట్ కోహ్లీ చిన్ననాటి ఫోటోను షేర్ చేసి.. రిషి సునాక్‌తో విరాట్ కోహ్లీ.. అని ట్వీట్ చేశారు. రిషి సునాక్, ఆశిష్ నెహ్రాను చూస్తుంటే.. చిన్నప్పుడు కుంభమేళాలో విడిపోయిన బ్రదర్స్‌లా ఉన్నారు. అని ఓ నెటిజన్ ట్విట్టర్లో పేర్కొన్నాడు. ఎట్టకేలకు బ్రిటన్ భారత సంతతి వ్యక్తిని ప్రధానిగా ఎన్నుకుంది. అది కూడా మంచి ఎకానమీ రేట్‌తో.. అంటు మరో నెటిజన్ ట్వీట్ చేశాడు. బ్రిటన్ ప్రధాని అయినందుకు అభినందనలు ఆశిష్ నెహ్రా.. కోహినూర్ డైమండ్‌ను వెనక్కి తీసుకురా.. అని ఓ నెటిజన్ నవ్వులు పూయించాడు. చదవండి: పాక్‌పై చారిత్రక ఇన్నింగ్స్.. కోహ్లి నేర్పిన 'పంచ సూత్రాలు' -
టీ20 ప్రపంచకప్‌కు భారత జట్టు.. దీపక్ చాహర్‌కు నో ఛాన్స్!
టీ20 ప్రపంచకప్-2022 ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న సంగతి తెలిసిందే. ఈ పొట్టి ప్రపంచకప్ కోసం ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా వంటి ఆగ్రశేణి టీంలు ఇప్పటికే తమ జట్టులను ప్రకటించాయి. ఇక మెగా ఈవెంట్ కోసం భారత జట్టును బీసీసీఐ సెప్టెంబర్ 16న ప్రకటించే అవకాశం ఉంది. అయితే ఈ మెగా టోర్నీ ముందు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా గాయాల బారిన పడటం భారత అభిమానులను ఆందోళన కలిగిస్తోంది. ఇక ఇది ఇలా ఉండగా.. టీ20 ప్రపంచకప్‌లో పాల్గోనే భారత జట్టును మాజీలు, క్రికెట్ నిపుణులు ముందుగానే అంచనా వేస్తున్నారు. తాజాగా ఈ జాబితాలోకి భారత మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా చేరాడు. ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్-2022కు 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును అంచనావేశాడు. బ్యాటర్ల కోటాలో కెప్టెన్ రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్. దినేష్ కార్తీక్‌ను ఎంపిక చేశాడు. అదే విధంగా ఆల్‌రౌండర్ల విభాగంలో హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, దీపక్ హుడాకు నెహ్రా చోటిచ్చాడు. ఇక తన జట్టులో స్పెషలిస్టు స్సిన్నర్లగా యుజవేంద్ర చాహల్, అశ్విన్‌ను మాత్రమే ఎంపిక చేశాడు. అదే విధంగా ఫాస్ట్ బౌలర్ల కోటాలో జస్ప్రీత్ బుమ్రా, హర్షల్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, భువనేశ్వర్ కుమార్ అవకాశమిచ్చాడు. కాగా నెహ్రా తన ఎంపిక చేసిన జట్టులో సీనియర్ పేసర్ మహ్మద్ షమీ, యువ బౌలర్ దీపక్ చాహర్‌కు చోటు దక్కక పోవడం గమనార్హం. టీ20 ప్రపంచకప్‌కు ఆశిష్ నెహ్రా ఎంచుకున్న భారత జట్టు: రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లి, రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, యుజ్వేంద్ర చాహల్, రవిచంద్రన్ అశ్విన్, దినేష్ కార్తీక్, జస్ప్రీత్ బుమ్రా, హర్షల్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, భువనేశ్వర్ కుమార్, దీపక్ హుడా చదవండి: Asia Cup 2022: కోహ్లి, రోహిత్ కాదు.. టీమిండియా వైఫల్యానికి ప్రధాన కారణం ఇదే! -
పాక్ కామెంటేటర్ పైత్యం.. అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన సెహ్వాగ్! నెహ్రా ఇప్పుడు...
“Ashish Nehra is right now preparing for UK Prime Minister Elections”: టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ సోషల్ మీడియాలో ఎంత చలాకీగా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విషయం ఏదైనా తనదైన శైలిలో కౌంటర్లు వేస్తూ నెటిజన్లను ఆకర్షిస్తాడు. తాజాగా మరోసారి వీరూ భాయ్.. పాకిస్తాన్ పొలిటికల్ కామెంటేటర్ జైద్ హమీద్‌ను దిమ్మతిరిగే సమాధానం ఇచ్చి వార్తల్లో నిలిచాడు. క్రీడాకారుల పేర్లు వాడుకుని విద్వేష విషం చిమ్మాలనుకున్న హమీద్‌కు అదిరిపోయే రీతిలో కౌంటర్ ఇచ్చాడు. కనీస అవగాహన లేని అతడి విషయపరిజ్ఞానాన్ని ఎండగడుతూ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. ఇంతకీ విషయమేమింటే.. టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు స్వర్ణ పతకం అందించిన జావెలిన్ స్టార్ నీరజ్ చోప్రా గాయం కారణంగా కామన్వెల్త్ గేమ్స్-2022కు దూరమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పాకిస్తాన్ అథ్లెట్ అర్షద్ నదీమ్ ఈ విభాగంలో పసిడి పతకం సాధించాడు. అంతకు ముందు జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో నీరజ్ రతజం సాధించగా.. నదీం నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు. తాజాగా కామన్వెల్త్ క్రీడల్లో నీరజ్ గైర్హాజరీలో అతడు ఏకంగా పసిడి పతకం సాధించాడు. ఈ నేపథ్యంలో జైద్ హమీద్ ట్విటర్ వేదికగా తన పైత్యాన్ని ప్రదర్శించాడు. ‘‘ఈ విజయం మరింత మధురమైనదిగా ఎందుకు మారిందంటే.. ఈ పాకిస్తానీ అథ్లెట్ ఇండియన్ జావెలిన్ త్రో హీరో ఆశిష్ నెహ్రాను ఓడించాడు. గతంలో ఆశిష్.. అర్షద్ నదీమ్‌ను ఓడించిన సంగతి తెలిసిందే కదా! మరి ఇప్పుడు అతడు ప్రతీకారం తీర్చుకున్నాడు’’ అని ట్వీట్ చేశాడు. నీరజ్ చోప్రా బదులు మాజీ క్రికెటర్ ఆశిష్ నెహ్రా పేరు వాడాడు. అంతేకాదు కామన్వెల్త్ గేమ్స్‌లో నీరజ్ పాల్గొనకపోయినా అతడిని పాక్ అథ్లెట్ ఓడించాడంటూ ప్రగల్భాలు పలికాడు. ఈ ట్వీట్ వీరేంద్ర సెహ్వాగ్ కంటపడింది. ‘‘చిచ్చా.. ఆశిష్ నెహ్రా ఇప్పుడు.. ఇంకేముంది! వీరూ భాయ్ తనదైన స్టైల్లో హమీద్‌కు చురకలు అంటించాడు. ‘‘చిచ్చా.. ఆశిష్ నెహ్రా ఇప్పుడు యూకే ప్రధాన మంత్రి ఎన్నికలకు సన్నద్ధమవుతున్నాడు. నువ్వు కాస్త చిల్ అవ్వు’’ అంటూ సెటైర్ వేశాడు. అయితే, చాలా మంది నెటిజన్లు ఇందుకు సానుకూలంగా స్పందిస్తుండగా.. మరికొంత మంది మాత్రం మనకు ఇవన్నీ అవసరమా అంటూ పెదవి విరుస్తున్నారు. తప్పులు అందరూ చేస్తారంటూ సెహ్వాగ్ ఇటీవల హిమదాస్‌కు శుభాకాంక్షలు చెప్పిన ట్వీట్ స్క్రీన్‌షాట్‌ను రీషేర్ చేస్తున్నారు. అదే విధంగా నీరజ్ చోప్రా, నదీమ్ సోదరభావంతో పరస్పరం ఒకరినొకరు అభినందించుకుంటూ ముందుకు సాగుతున్నారని.. హమీద్ లాంటి వాళ్లు మాత్రం విషం చిమ్మాలని చూస్తున్నారంటూ అతడిని విమర్శిస్తున్నారు. చదవండి: Rishabh Pant-Uravasi Rautela: బాలీవుడ్ హీరోయిన్‌కు పంత్ దిమ్మతిరిగే కౌంటర్ Chicha, Ashish Nehra is right now preparing for UK Prime Minister Elections. So Chill 🤣 pic.twitter.com/yaiUKxlB1Z — Virender Sehwag (@virendersehwag) August 11, 2022 -
అక్కడ ఉంది నేను కాదు.. డీకే కదా.. హార్దిక్ సింగిల్ తీయాల్సింది!
ఢిల్లీ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో భారత్ 5 వికెట్ల తేడాతో ఓటమి చెందిన సంగతి తెలిసిందే. టీమిండియా ఇన్నింగ్స్ అఖరి ఓవర్లో హార్ధిక్ పాండ్యా తీరు కాస్త విడ్డూరంగా అనిపించింది. సింగిల్ తీయడానికి వీలున్నప్పటికీ దినేష్ కార్తీక్‌కు స్ట్రైక్ ఇవ్వకుండా హార్ధిక్ తిరష్కరించాడు. ఈ క్రమంలో హార్ధిక్ తీరుపై నెటిజన్లు విమర్శలు కురిపిస్తున్నారు. కాగా తాజాగా ఈ ఘటనపై భారత మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా స్పందించాడు. అఖరి ఓవర్లో ఐదో బంతికి సింగిల్ తీసి పాండ్యా దినేష్ కార్తీక్‌కు స్ట్రైక్ ఇచ్చి ఉండాల్సిందని భారత మాజీ బౌలర్ ఆశిష్ నెహ్రా పేర్కొన్నాడు. "చివరి ఓవర్లో పాండ్యా సింగిల్ తీసి ఉండాల్సింది. మరో ఎండ్‌లో దినేష్ కార్తీక్ ఉన్నాడు. అక్కడ ఉన్నది నేను కాదు కదా" అని ఆశిష్ నెహ్రా చమత్కరించాడు ఏం జరిగిదంటే.. భారత ఇన్నింగ్స్ అఖరి ఓవర్ వేసిన నార్జే బౌలింగ్‌లో తొలి బంతికే కెప్టెన్ రిషబ్ పంత్ పెవిలియన్‌కు చేరాడు. అనంతరం దినేష్ కార్తీక్ క్రీజులోకి వచ్చాడు. కార్తీక్ ఆడిన తొలి బంతికి ఎటువంటి పరుగు రాలేదు. ఇక మూడో బంతికి సింగిల్ తీసి హార్ధిక్‌కు స్ట్రైక్ ఇచ్చాడు. నాలుగో బంతికి లాంగ్ ఆఫ్ దిశగా పాండ్యా భారీ సిక్స్ బాదాడు. అయితే ఐదో బంతికి సింగిల్ వచ్చే అవకాశం ఉన్నప్పటికీ దాన్ని హార్ధిక్ తిరష్కరించాడు. ఇక ఇరో బంతికి భారీ షాట్ ఆడటానికి ప్రయత్నించిన హార్ధిక్.. కేవలం రెండు పరుగులు మాత్రమే చేయగలిగాడు.. ఐపీఎల్-2022లో ఆర్సీబీ బెస్ట్ ఫినిషర్ ఈ ఏడాది సీజన్లో ఆర్సీబీకు కార్తీక్ అత్యుత్తమ ఫినిషర్‌గా మారాడు. చాలా మ్యాచ్‌ల్లో తన అద్భుత ఇన్నింగ్స్‌లతో జట్టును విజయ తీరాలకు చేర్చాడు. 16 మ్యాచ్‌లు ఆడిన కార్తీక్ 330 పరుగులు సాధించాడు. చదవండి: Hari Nishaanth: ఘనంగా యువ క్రికెటర్ పెళ్లి.. ‘సూపర్ కపుల్’ అంటూ సీఎస్కే విషెస్! pic.twitter.com/kzuyHH5Gpq — RohitKohliDhoni (@RohitKohliDhoni) June 9, 2022 -
ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన ఆశిష్ నెహ్రా.. తొలి ‘భారత’ హెడ్ కోచ్‌గా..!
ఐపీఎల్లో టీమిండియా మాజీ పేసర్, గుజరాత్ టైటాన్స్ హెడ్ కోచ్ ఆశిష్ నెహ్రా సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ టైటిల్ గెలుచుకున్న తొలి భారత హెడ్ కోచ్‌గా ఆశిష్ నెహ్రా నిలిచాడు. ఐపీఎల్-2022లో గుజరాత్ టైటాన్స్ హెడ్ కోచ్‌గా నెహ్రా బాధ్యతలు నిర్వహించాడు. ఆదివారం అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఫైనల్లో రాజస్తాన్‌ను ఓడించి గుజరాత్ ఈ ఏడాది టైటిల్ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక హెడ్ కోచ్‌గా గుజరాత్ విజయంలో నెహ్రా కీలక పాత్ర పోషించాడు. ఇక ఇప్పటి వరకు షేన్ వార్న్, డారెన్ లెమాన్, రికీ పాంటింగ్, ట్రెవర్ బేలిస్, టామ్ మూడీ, స్టీఫెన్ ఫ్లెమింగ్, జాన్ రైట్,జయవర్ధనే వంటి విదేశీ హెడ్‌కోచ్‌ల నేతృత్వంలో ఆయా జట్లు ఐపీఎల్ టైటిల్ గెలుచుకున్నాయి. కాగా అత్యధిక ఐపీఎల్ టైటిల్స్ గెలుచుకున్న హెడ్ కోచ్‌ల జాబితాలో స్టీఫెన్ ఫ్లెమింగ్ తొలి స్థానంలో ఉన్నాడు. ఆయన కోచింగ్‌లో సీఎస్కే నాలుగు సార్లు ఐపీఎల్ విజేతగా నిలిచింది. ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్ మహేల జయవర్ధనే మూడు టైటిల్స్‌తో రెండవ స్థానంలో ఉన్నాడు. చదవండి: IPL GT Mentor Gary Kirsten: గుజరాత్ టైటాన్స్ విజయంలో అజ్ఞాతవ్యక్తి; మాటల్లేవు.. అంతా చేతల్లోనే -
Ind Vs Sa Test Series: "ఫామ్‌లో లేడని కోహ్లిని తప్పిస్తారా..’’
టీమిండియా క్రికెటర్ అజింక్య రహానే గత కొద్ది కాలంగా పేలవ ప్రదర్శన కొనసాగిస్తున్నాడు. ఈ ఏడాది టెస్టు క్రికెట్లో 19.57 సగటుతో 411 పరుగులు మాత్రమే సాధించాడు. అయితే అతడికి విదేశీ పిచ్‌లపై ఉన్న రికార్డల దృష్ట్యా దక్షిణాఫ్రికా పర్యటనకు అతడిని సెలెక్టర్లు ఎంపిక చేశారు. కాగా ఆరంగేట్ర మ్యాచ్‌లోనే సెంచరీ సాధించిన శ్రేయాస్ అయ్యర్ రూపంలో రహానే స్ధానానికి గట్టి పోటీ నెలకొంది. అంతే కాకుండా హనుమ విహారి రూపంలో ఐదోస్ధానానికి పోటీ ఏర్పడింది. ఈ క్రమంలో భారత మాజీ బౌలర్ ఆశిష్ నెహ్రా ఆసక్తికర వాఖ్యలు చేశాడు. సెంచూరియాన్ వేదికగా జరిగే తొలి టెస్ట్‌లో రహానేకి చోటు దక్కడం కష్టమని అతడు అభిప్రాయపడ్డాడు. "జట్టులో ఐదో స్ధానానికి తీవ్రమైన పోటీ నెలకొంది. ఈ స్ధానంలో ఎవరని ఎంపిక చేయాలో అన్నది కష్టంగా మారింది. కేవలం గణంకాల ఆధారంగా మాత్రమే జట్టును ఎంపిక చేస్తే, కోహ్లి కూడా గత ఏడాదిగా ఫామ్‌లో లేడు. అయితే ఇప్పుడు కోహ్లి ఫామ్‌లో లేడని జట్టు నుంచి తప్పిస్తారా? పూజారా కూడా గత కొంత కాలంగా ఫామ్‌లో లేడు. అతడి గురించి ఎవరూ మాట్లాడరు. పూజారాకి జట్టులో కచ్చితంగా చోటు దక్కుతుంది. కానీ చివరకు మిగిలినది రహానే మాత్రమే. అతడు రానున్న రోజుల్లో జట్టులో చోటు కోల్పోయే ప్రమాదం ఉంది. స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో తొలి టెస్ట్‌కు రహానే సారథ్యం వహించాడు. ఇక రెండో టెస్ట్‌కు విరాట్ కోహ్లి జట్టులోకి రావడంతో రహానే ఏకంగా జట్టులో స్ధానాన్నే కోల్పోయాడు. దక్షిణాఫ్రికాతో జరిగే తొలి టెస్ట్‌కు టీమిండియా 5లేదా 6గురు బ్యాటర్లతో బరిలోకి దిగాలని భావిస్తే రహానేకి చోటు దక్కడం కష్టం. కోహ్లికి లేదా పుజారాకు ఇదేమి కొత్త కాదు. కోహ్లి సవాళ్లను అవకాశాలుగా మార్చుకుంటాడు. 2018 పర్యటనలో జోహన్స్‌బర్గ్, కేప్‌టౌన్ పిచ్‌లపై భారత ఆటగాళ్లు ఆడటానికి ఇబ్బంది పడ్డారు. అయితే కోహ్లి మాత్రం 150 పరుగులు సాధించి అధ్బుతంగాగ రాణించాడు. ఈసారి కూడా కోహ్లి రాణిస్తాడని నేను ఆశిస్తున్నాను. ఇక రహానే స్ధానంలో శ్రేయాస్ అయ్యర్ లేదా హనుమా విహారికు చోటు దక్క వచ్చు" అని ఆశిష్ నెహ్రా పేర్కొన్నాడు. చదవండి: దక్షిణాఫ్రికాపై భారత్ గెలవడం చాలా కష్టం.. సిరీస్ వాళ్లదే: టీమిండియా మాజీ క్రికెటర్ -
అహ్మదాబాద్ హెడ్ కోచ్‌గా గ్యారీ కిర్‌స్టెన్.. బౌలింగ్ కోచ్‌గా ఆశిష్ నెహ్రా!
ఐపీఎల్-2022లో రెండు కొత్త జట్లు రానున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్ కొత్త ప్రాంఛైజీగా అవతరించిన అహ్మదాబాద్ కోచ్‌గా దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు గ్యారీ కిర్‌స్టెన్ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. ఈ మేరకు ఆ ఫ్రాంచైజీ ప్రతినిధులు ఇప్పటికే కిర్‌స్టెన్ తో సమావేశమైనట్టు సమాచారం. కాగా 2011 వన్డే ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు కిర్‌స్టెన్ కోచ్‌గా బాధ్యతలు నిర్వహించాడు. 2011 ప్రపంచకప్ అనంతరం టీమిండియా హెడ్ కోచ్ బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత అతడు దక్షిణాఫ్రికా కోచ్ గా నియమితుడయ్యాడు. అయితే ఐపీఎల్లో కోచ్‌గా అతడికి ఇదేం తొలిసారి కాదు. అంతకుముందు ఆర్సీబీ జట్టుకు హెడ్ కోచ్ గా కిర్‌స్టెన్ పనిచేశాడు. అదే విధంగా జట్టు బౌలింగ్ కోచ్‌గా భారత మాజీ బౌలర్ ఆశిష్ నెహ్రాతో అహ్మదాబాద్ ప్రతినిధులు సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. ఐపీఎల్లో సన్‌రైజర్స్ జట్టు బౌలింగ్ కోచ్‌గా గతంలో ఆశిష్ నెహ్రా వ్యవహరించాడు. కాగా అంతకుముందు భారత మాజీ కోచ్ రవిశాస్త్రి అహ్మదాబాద్ కోచ్‌గా రానున్నడని వార్తలు వినిపించాయి. చదవండి: 'పుష్ప' ట్రాన్స్‌లో టీమిండియా ఆల్‌రౌండర్.. 'తగ్గేదే లే' -
IND VS PAK: రిజ్వాన్, బాబర్ చాలా బాగా బ్యాటింగ్ చేశారు.. అయితే..
Ashish Nehra Comments on Pakistan 10 Wickets Win Against India: టీ20 ప్రపంచ కప్‌లో భారత్‌పై అద్భుత విజయం సాధించి యావత్ క్రికెట్ ప్రపంచం ముందు పాకిస్తాన్ సత్తా చాటిందని టీమిండియా మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా అన్నాడు. "సెమీ ఫైనల్‌కు చేరుకోవడానికి ఆర్హతలేని జట్టుగా పాకిస్తాన్‌ను అందరూ తక్కువ అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం వారి గ్రూప్‌లో న్యూజిలాండ్, ఇండియా వంటి బలమైన జట్లు వున్నాయి. కానీ టీ 20ల్లో ఎవరైనా ఎవరినైనా ఓడించవచ్చు. ఆదేమి పెద్ద విశేషం కాదు. అయితే పాకిస్తాన్ గెలిచిన తీరు అందరనీ ఆశ్చర్యపరుస్తుంది. ఇక ఆటలో మంచు ప్రభావం గురించి నెహ్రా మాట్లాడుతూ, "మంచు కారణంగా బంతి కూడా కొద్దిగా తడిసిపోయింది. పిచ్ బ్యాటింగ్ చేయడానికి మెరుగ్గా ఉండటంతో, వారు దానిని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నారు. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆడిన విధానాన్ని అందరూ ప్రశంసించవలసి ఉంటుంది. పాకిస్తాన్ ఇన్నింగ్స్ ప్రారంభించిన విధానం.. వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. రిజ్వాన్, బాబర్ చాలా బాగా బ్యాటింగ్ చేశారు. ఈ మ్యాచ్‌లో వారిద్దరూ ఎటువంటి రిస్క్ తీసుకోకుండా ఆడారు" అని క్రిక్‌బజ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నెహ్రా పేర్కొన్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ ఓడి బ్యాటింగ్‌కు భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి.. 151 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనకు దిగిన పాకిస్తాన్ ఓపెనర్లు మహ్మద్ రిజ్వాన్, బాబర్ ఆజం చెలరేగడంతో అలవోకగా 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తద్వారా ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌పై టీమిండియా జైత్రయాత్రకు బ్రేక్ పడినట్లయింది. చదవండి: Ind Vs Pak: ‘చెత్త అంపైరింగ్.. అసలు రాహుల్ అవుట్ కాలేదు.. అది నో బాల్.. కావాలంటే చూడండి’ -
ఒత్తిడిలో ఎలా ఆడాలో పాండేకు తెలియడం లేదు: నెహ్రా
చెన్నై: ఐపీఎల్ 14వ సీజన్లో ఎస్ఆర్హెచ్ వరుసగా రెండో పరాజయాన్ని మూటగట్టుకుంది. బుధవారం ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో 150 పరుగుల సాధారణ లక్ష్యాన్ని చేధించే క్రమంలో 27 పరుగుల వ్యవధిలో ఏడు వికెట్లు కోల్పోయి పరాజయాన్ని మూటగట్టుకుంది. అయితే ఈ మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ ఓటమికి మనీష్ పాండే బ్యాటింగ్ ఒక కారణమని టీమిండియా మాజీ ఆటగాడు ఆశిష్ నెహ్రా పేర్కొన్నాడు. ''అతను టీమిండియా జట్టులోకి రావడం.. పోవడం వంటివి జరగడానికి కారణం అతని బ్యాటింగ్‌లో అనుకూలత, స్థిరత్వం లేకపోవడమే ప్రధాన కారణం. అందుకే అతనితో పాటు జట్టులోకి వచ్చిన హార్థిక్ సహా ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్‌లు తమ ఇన్నింగ్స్‌లతో ఆకట్టుకుంటే.. పాండే మాత్రం స్థిరత్వం లేని బ్యాటింగ్‌తో టీమిండియాలో రెగ్యులర్ సభ్యుడు కాలేకపోయాడు. ఒత్తిడిలో ఉన్నప్పుడు ఎలా ఆడాలో పాండేకు ఇప్పటికి తెలియడం లేదు. అందుకు ఉదాహరణ.. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో వార్నర్ ఉన్నంతసేపు అతనితో మంచి భాగస్వామ్యం నమోదు చేసిన పాండే.. అతను అవుట్ కాగానే అదే టెంపోను చూపించలేకపోయాడు. వార్నర్, బెయిర్ స్టోలు అవుటైనప్పటికి ఎస్ఆర్హెచ్ తాము సాధించాల్సిన పరుగులు తక్కువే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే 39 బంతుల్లో 38 పరుగులు చేసిన పాండే చివరి ఆరు ఓవర్లలో ఒక్క బౌండరీ కొట్టలేకపోయాడు. అంతేగాక బాధ్యతాయుతంగా ఆడాల్సిన చోట అనవసర షాట్ ఆడి వికెట్ సమర్పించుకొని మ్యాచ్ ఓటమికి పరోక్షంగా కారణమయ్యాడు. కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ ఇదే నిరూపితమైంది.'' అంటూ చెప్పుకొచ్చాడు. కాగా ఎస్ఆర్హెచ్ తన తర్వాతి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ను ఎదుర్కోనుంది. చదవండి: బాధిస్తోంది.. మాకు కూడా అదే జరిగింది: వార్నర్ ఇది వార్నర్ తప్పిదం కాదా? -
విదేశీ బౌలర్లకు అంత ఇచ్చి.. అతనికి ఇంత తక్కువ
చెన్నై: ఐపీఎల్ 2021 మినీ వేలంలో టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఉమేశ్ యాదవ్ కనీస ధరకే అమ్ముడుపోవడంపై భారత మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా పెదవి విరిచాడు. చెన్నై వేదికగా జరిగిన వేలంలో రూ.కోటితో ఉమేశ్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకుంది. భారత అగ్రశ్రేణి బౌలర్లలో ఒకడిగా కొనసాగుతున్న ఉమేశ్ యాదవ్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ మినహాయిస్తే మిగతా ఫ్రాంఛైజీలు అసక్తి కనబరచకపోవడం ఆశ్చర్యం కలిగించిందని నెహ్రా చెప్పుకొచ్చాడు. ‘తప్పుగా అనుకోమంటే ఒక మాట చెప్పాలని ఉంది. పేరు లేని బౌలర్లకు అంత వెచ్చించి .. ఎంతో అనుభవం ఉన్న ఉమేశ్‌ను అంత తక్కువ ధర ఇవ్వడం బాగాలేదు. వాస్తవానికి జై రిచర్డ్సన్, కైల్ జేమిసన్ ఇంకా నిరూపించుకునే దశలో ఉన్నారు. టెస్టుల పరంగా జేమిసన్ నిలకడగా రాణిస్తున్నాడు. రిచర్డ్సన్ పెర్త్‌లో ఫర్వాలేదనిపించాడు. కానీ ఫాస్ట్ బౌలర్ ఉమేశ్ యాదవ్ ఇప్పటికే తానేంటో నిరూపించుకున్నాడు. ఉమేశ్ యాదవ్‌తో పోలిస్తే.. జేమిసన్, రిచర్డ్సన్ అనుభవం ఎంత..? వేలంలో ఎక్కువ ధరకి ఎలా అమ్ముడుపోయారనేది అర్థం కావడం లేదు. ఉమేశ్ వేలంలో తక్కువ ధరకు అమ్ముడయ్యాడన్న బాధ కన్నా పేరులేని బౌలర్లకు అంత పెట్టినందుకు ఆశ్చర్యం కలిగింది. మిచెల్ స్టార్క్, లసిత్ మలింగ లాంటి బౌలర్లు భారీ ధరకి అమ్ముడుపోయారంటే అర్థం ఉంది.ఎందుకంటే ఇప్పటికే వారు తమ సత్తాను ప్రపంచానికి నిరూపించారు.' అని చెప్పుకొచ్చాడు. కాగా ఉమేశ్‌ను కనీస మద్దతు ధరకే ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకోవడంపై మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ కూడా తప్పుబట్టాడు. కాగా దక్షిణాఫ్రికాకు చెందిన క్రిస్ మోరిస్‌కు వేలంలో రూ.16.25 కోట్లకి అమ్ముడుపోగా.. న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ కైల్ జేమిసన్ కోసం రూ.15 కోట్లకు ఆర్సీబీ కొనుగోలు చేయగా.. ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ జై రిచర్డ్సన్కు రూ.14 కోట్లు వెచ్చించి పంజాబ్ కింగ్స్ దక్కించుకుంది. చదవండి: ఇన్నాళ్ల నిరీక్షణ ముగిసింది.. కంగ్రాట్స్ 'అంత తక్కువ ధర.. ఐపీఎల్ ఆడకపోవచ్చు' -
నెహ్రా.. నా జాకెట్ తీసుకున్నాడు!
యువరాజ్ సింగ్ ఎక్కడుంటే అక్కడ అంతా సందడిగా కనిపిస్తుంది. మొన్నటికి మొన్న పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో తుపాను ఇన్నింగ్స్ ఆడి 32 బంతుల్లో 53 పరుగులు సాధించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన యువీ.. డ్రసింగ్ రూంలో కూడా జట్టు సభ్యులు అందరితో సరదాగా గడిపేస్తాడు. అంతేకాదు.. ఖాళీ దొరికినప్పుడల్లా తన ఫోన్ తీసుకుని ఏదో ఒకటి చేస్తూ కనిపిస్తాడు. తాజాగా అలాగే ఎప్పటిదో పాత కాలం నాటి ముచ్చట ఒకటి గుర్తుచేసుకుంటూ ఇన్‌స్టాగ్రాంలో ఒక ఫొటో పోస్ట్ చేశాడు ఈ స్టైలిష్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మన్. బాగా కుర్రాళ్లుగా ఉన్నప్పటి రోజుల్లో తాను, ఆశిష్ నెహ్రా కలిసి ఒక స్నేహితుడితో తీయించుకున్న ఫొటో పెట్టాడు. అయితే.. ఫొటో కంటే దానికి యువీ జోడించిన క్యాప్షనే బాగా సెన్సేషనల్ అయ్యింది. 'సీరియస్ త్రోబ్యాక్! నెహ్రా నా జాకెట్ వేసుకున్నాడు' అని దానికి కామెంట్ రాశాడు. దాంతో ఇది ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఏకంగా 1.27 లక్షలకు పైగా లైకులు దీనికి వచ్చాయి. పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో యువరాజ్ ఆడిన ఇన్నింగ్స్ చూసి కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫిదా అయిపోయాడు. యువీ నిజంగా గేమ్ చేంజింగ్ ఇన్నింగ్స్ ఆడాడని, దానివల్ల తనకు బోలెడంత ఆత్మవిశ్వాసం వచ్చిందని చెప్పాడు. ఆ తర్వాతే తాము కూడా బాగా ఆడగలిగామని, తాను హాఫ్ సెంచరీ చేసిన తర్వాత కూడా ఫ్రీగా ఆడలేకపోయాననని, ఆ సమయంలో యువీ వచ్చి తన మీద ఉన్న ఒత్తిడి అంతటినీ అలా చేత్తో తీసి పారేశాడని కోహ్లీ ప్రశంసల్లో ముంచెత్తాడు. లో, ఫుల్ టాస్‌లతో పాటు చివరకు యార్కర్లను కూడా ఫోర్లు, సిక్సులుగా మలిచిన ఘనత యువీకే దక్కుతుందన్నాడు.