Netizens Congratulate Ashish Nehra Instead Of UK PM Rishi Sunak, Funny Memes Goes Viral - Sakshi
Sakshi News home page

కుంభమేళాలో విడిపోయిన అన్నదమ్ముల్లా ఉన్నారు.. ఆశిష్ నెహ్రా, రిషి సునాక్‌పై మీమ్స్ వైరల్

Published Tue, Oct 25 2022 12:54 PM | Last Updated on Tue, Oct 25 2022 1:49 PM

Netizens Congratulate Ashish Nehra Instead Of UK PM Rishi Sunak - Sakshi

రిషి సునాక్ బ్రిటన్ ప్రధాని అయి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ఈ పదవి చేపట్టిన తొలి భారత సంతతి వ్యక్తిగా ఆయన అరుదైన ఘనత సాధించారు. అయితే సోషల్ మీడియాలో నెటిజన్లు మాత్రం రిషి సునాక్‌కు బదులు భారత మాజీ క్రికెటర్ ఆశిష్ నెహ్రాకు శుభాకంక్షాలు చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన మీమ్స్ సామాజిక మాధ్యమాల్లో తెగవైరల్ అవుతున్నాయి.

రిషి సునాక్, ఆశిష్ నెహ్రా చూడటానికి ఒకేలా కన్పించడంతో నెటిజన్లు క్రేజీగా మీమ్స్ క్రియేట్ చేశారు. ఆశిష్ నెహ్రా ఫోటో పెట్టి రిషి సునాక్‌కు విషెస్ చెబుతూ నవ్వులు పూయిస్తున్నారు. అంతేకాదు కొన్ని ఫోటోలను మార్ఫింగ్ కూడా చేశారు. ప్రధాని మోదీతో ఆశిష్‌ నెహ్రా మాట్లాడుతున్నట్లు ఫోటో పెట్టి.. బ్రిటన్‌ నుంచి కోహినూర్ డైమండ్‌ను ఎలా వెనక్కి తీసుకురావాలో మోదీ, రిషి సునాక్ ఆలోచిస్తున్నారని క్యాప్షన్ పెట్టారు. ఈ ఫోటోను నెటిజన్లు తెగ షేర్ చేస్తున్నారు.

నెహ్రా, రిషి సునాక్‌లపై మరిన్ని మీమ్స్ చూద్దాం..
ఆశిష్ నెహ్రాతో విరాట్ కోహ్లీ చిన్ననాటి ఫోటోను షేర్ చేసి.. రిషి సునాక్‌తో విరాట్ కోహ్లీ.. అని ట్వీట్ చేశారు.

రిషి సునాక్, ఆశిష్ నెహ్రాను చూస్తుంటే.. చిన్నప్పుడు కుంభమేళాలో విడిపోయిన బ్రదర్స్‌లా ఉన్నారు. అని ఓ నెటిజన్ ట్విట్టర్లో పేర్కొన్నాడు.

ఎట్టకేలకు బ్రిటన్ భారత సంతతి వ్యక్తిని ప్రధానిగా ఎన్నుకుంది. అది కూడా మంచి ఎకానమీ రేట్‌తో.. అంటు మరో నెటిజన్ ట్వీట్ చేశాడు.

బ్రిటన్ ప్రధాని అయినందుకు అభినందనలు ఆశిష్ నెహ్రా.. కోహినూర్‌ డైమండ్‌ను వెనక్కి తీసుకురా.. అని ఓ నెటిజన్ నవ్వులు పూయించాడు.

చదవండి: పాక్‌పై చారిత్రక ఇన్నింగ్స్.. కోహ్లి నేర్పిన 'పంచ సూత్రాలు'

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement