లండన్: గత ఏడాది యూకే ధనవంతుల జాబితాలో తొలిసారిగా చోటుదక్కించుకున్న బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్, అక్షతా మూర్తి దంపతుల సంపద ఈ ఏడాది కొంత తగ్గిపోయింది. ఏడాది వ్యవధిలో వారు 201 మిలియన్ పౌండ్ల సంపద కోల్పోయినట్లు శుక్రవారం విడుదలైన ‘ద సండే టైమ్స్ రిచ్ లిస్ట్–2023’ను బట్టి తేటతెల్లమవుతోంది. ఇన్ఫోసిస్ కంపెనీలో అక్షతా మూర్తి షేర్ల విలువ పడిపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది.
2022 నాటి సంపన్నుల జాబితాలో రిషి సునాక్ దంపతులు 222వ స్థానంలో నిలిచారు. ఈ ఏడాది జాబితాలో వారి ర్యాంక్ 275కు చేరింది. ప్రస్తుతం వారి సంపద 529 మిలియన్ పౌండ్లని (రూ.5,461 కోట్లు) అంచనా. సునాక్ దంపతుల సంపదలో సింహభాగం ఇన్ఫోసిస్ షేర్ల రూపంలోనే ఉంది. ఇక 35 బిలియన్ పౌండ్లతో (రూ.3.61 లక్షల కోట్లు) బ్రిటన్ సంపన్నుల జాబితాలో ఈ ఏడాది కూడా తొలి స్థానాన్ని భారత సంతతికి చెందిన హిందుజా కుటుంబమే దక్కించుకుంది.
Comments
Please login to add a commentAdd a comment