asset
-
బంగారమంటే అంత నమ్మకం!
ధగధగమంటూ కాంతులీనే బంగారం అంటే ఎవరికి ఇష్టముండదు?.. ప్రతిఒక్కరికీ పసిడిపైన మక్కువే. మరి ఆ బంగారాన్ని ఎవరు, ఎలా చూస్తున్నారన్నదే ఆసక్తికరం. ఇదే అంశంపైనే ఓ సంస్థ ఇటీవల సర్వే నిర్వహించింది. ఆ విశేషాలను ఈ కథనంలో మీకందిస్తున్నాం..మనీవ్యూ సర్వే ప్రకారం, 3,000 మంది ప్రతివాదులలో 85 శాతం మంది బంగారాన్ని సంపద పరిరక్షణకు విలువైన ఆస్తిగా పరిగణిస్తున్నారు. అద్భుతంగా పెరుగుతన్న దాని విలువ, చారిత్రికంగా ఉన్న విశిష్టత వినియోగదారుల్లో విశ్వాసాన్ని కొనసాగిస్తున్నాయి.ముఖ్యంగా 25-40 ఏళ్ల వయస్సున్నవారు పదవీ విరమణ, ఇతర దీర్ఘకాలిక లక్ష్యాల కోసం సంపదను నిర్మించడానికి వారి సాధారణ ఆర్థిక వ్యూహంలో భాగంగా భౌతిక, డిజిటల్ మార్గాల ద్వారా బంగారంలో పెట్టుబడి పెడుతున్నారని సర్వే పేర్కొంది.70 శాతం మంది భారతీయులు అంటే 10 మందిలో ఏడుగురు బంగారాన్ని సురక్షితమైన ఆస్తిగా భావించడం వారి పొదుపు అలవాట్లను సానుకూలంగా ప్రభావితం చేస్తుందని భావిస్తున్నారు. డిజిటల్ యుగంలో బంగారంపై ఉన్న ఆసక్తి డిజిటల్ గోల్డ్ వైపు ఎక్కువగా నడిపిస్తోంది.ఇదీ చదవండి: బంగారు ఆభరణాలే ఎక్కువ..సర్వే డేటా ప్రకారం.. 35 ఏళ్లలోపు వారిలో 75 శాతం మంది భౌతిక బంగారం కంటే కూడా డిజిటల్ బంగారాన్ని ఇష్టపడుతున్నారు. దానికి లిక్విడిటీ, సౌలభ్యం ప్రధాన కారకాలుగా ఉన్నాయి. సర్వేలో పాల్గొన్నవారిలో 50 శాతానికి పైగా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా పాక్షిక మొత్తాలలో బంగారాన్ని కొనుగోలు చేయగల సామర్థ్యం తమ పెట్టుబడి అలవాట్లను మార్చుకునే దిశగా అత్యంత లాభదాయకమైన లక్షణాలలో ఒకటి అని నమ్ముతున్నారు. -
ఏసీఆర్‌ఈ సీఈవో నీతా ముఖర్జీ రాజీనామా!
ప్రముఖ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ అసెట్స్ కేర్ & రీకన్స్ట్రక్షన్ ఎంటర్ప్రైజ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నీతా ముఖర్జీ రాజీనామా చేసినట్లుగా సమాచారం. కంపెనీ హోల్ టైమ్ డైరెక్టర్, సీఈవోగా ఉన్న ఆమె కంపెనీ నుంచి వైదొలిగినట్లు ఎకనమిక్ టైమ్స్ నుంచి ఓ కథనం వెలువడింది. గ్లోబల్ ఫండ్ ఆరెస్ ఎస్ఎస్జీ క్యాపిటల్ మద్దతుతో 2020 నవంబర్‌లో అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ అయిన ఏసీఆర్ఈలో సీఈగా చేరారు. ఆమె ఐదు సంవత్సరాల కాలానికి నియమితులయ్యారు. నీతా ముఖర్జీ ప్రీమియర్ ఫైనాన్షియల్ సంస్థలలో 30 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న సీనియర్ బ్యాంకర్. ఏసీఆర్ఈలో చేరడానికి ముందు ఆమె ఆర్బీఎల్ బ్యాంక్‌లో చీఫ్ క్రెడిట్ ఆఫీసర్‌గా పని చేశారు. దానికి ముందు అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీస్ ఆఫ్ ఇండియా (ఆర్సిల్) అధ్యక్షురాలిగా ఉన్నారు. ఐసీఐసీఐ బ్యాంక్తోనూ పనిచేశారు. “ముఖర్జీ తన ప్రణాళికల గురించి తెలియజేయలేదు. బోర్డు ఆమె తదుపరివారిని గుర్తించే ప్రక్రియలో ఉంది ” అని కంపెనీకి చెందిన ఒక సీనియర్ అధికారి చెప్పినట్లుగా ఎకనమిక్ టైమ్స్ పేర్కొంది. -
సల్మాన్ ఖాన్@ 220 కోట్లు..
సల్మాన్ ఖాన్ నటనా నైపుణ్యంతో ప్రేక్షకులను ఆకర్షించడమే కాకుండా, తన సంపదను వివిధ వ్యాపారాల్లో పెట్టుబడిపెట్టి కోట్లు ఆర్జిస్తున్నారు. సినిమాల ద్వారా వచ్చే డబ్బును విభిన్న మార్గాల్లో మదుపు చేసి ఏటా దాదాపు రూ.220 కోట్లు సంపాదిస్తున్నట్లు జీక్యూ ఇండియా సర్వే తెలిపింది. సల్మాన్ ఖాన్ కలిగి ఉన్న తొమ్మిది ఆదాయ మార్గాల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం. 1. బాక్సాఫీస్: అక్షయ్ కుమార్, షారుఖ్ ఖాన్ వంటి అనేక ఇతర బాలీవుడ్ నటుల మాదిరిగానే సినిమా ప్రారంభించడానికి ముందే సల్మాన్‌ఖాన్ రెమ్మునరేషన్ తీసుకుంటారు. కొన్ని సినిమాలకు ప్రాఫిట్-షేరింగ్ ఒప్పందాల ప్రకారం వాటికి వచ్చే ఆదాయంలో దాదాపు 50శాతం వాటాను తనకు ఇవ్వాల్సి ఉంటుంది. 2. ప్రొడక్షన్ హౌస్: 2011లో సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్ అనే ప్రొడక్షన్ బ్యానర్‌ను ఏర్పాటు చేశారు. దాని ఆధ్వర్యంలో చిల్లర్ పార్టీ జాతీయ అవార్డు చిత్రంతోపాటు బజరంగీ భాయిజాన్ వంటి విజయవంతమైన సినిమాలు నిర్మించారు. ఇతర సినిమాలు సైతం ఈ బ్యానర్ ఆధ్వర్యంలో రూపొందిస్తున్నారు. 3. స్టార్టప్‌లలో పెట్టుబడి: యాత్రా.కామ్ అనే ట్రావెల్ కంపెనీలో సల్మాన్‌ఖాన్‌కు దాదాపు 5శాతం వాటా ఉన్నట్లు కొన్ని మీడియా సంస్థల నివేదిక ప్రకారం తెలిసింది. ఆన్‌మొబైల్ గ్లోబల్ లిమిటెడ్ కంపెనీ నేతృత్వంలోని చిన్న వీడియో ప్లాట్‌ఫారమ్ అయిన ‘చింగారి’లో ఆయన పెట్టుబడి పెట్టారు. ఈ స్టార్టప్‌లో బ్రాండ్ అంబాసిడర్‌గా చేరారు. 4. క్లాతింగ్ కంపెనీ: 2012లో స్థాపించిన బీయింగ్ హ్యూమన్ క్లాతింగ్ కంపెనీ ద్వారా సల్మాన్ ఖాన్ ఫౌండేషన్ సేవలందిస్తోంది. దీని ద్వారా పేదలకు ఆరోగ్య సంరక్షణ, విద్యను అందిస్తున్నారు. ఈ కంపెనీ యూరప్, మిడిల్ఈస్ట్ దేశాల్లోనూ దాని కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ప్రస్తుతం ఈ కంపెనీ దేశంలో 90 కంటే ఎక్కువ స్టోర్లను కలిగి ఉంది. 5. ఫిట్నెస్ పరికరాలు, జిమ్: సినీ పరిశ్రమలోని ఫిట్నెస్ నటుల్లో ఒకరిగా ప్రశంసలు అందుకున్న సల్మాన్ ఖాన్ 2019లో బీయింగ్ స్ట్రాంగ్ కంపెనీను ప్రారంభించారు. ఫిట్నెస్ పట్ల తనకున్న అభిరుచిని లాభదాయకమైన వ్యాపార సంస్థగా మార్చుకున్నారు. ముంబై , నోయిడా, ఇందోర్, కోల్‌కతా, బెంగుళూరు వంటి ప్రధాన నగరాల్లో జిమ్‌లను ప్రారంభించారు. 6. రియల్ ఎస్టేట్: సల్మాన్ ఖాన్ ముంబయిలో ఇళ్లు, వాణిజ్య స్థలాలను కొనుగోలు చేశారు. ముంబయి శాంటాక్రూజ్‌లోని తన నాలుగు అంతస్తుల భవనాన్ని అద్దెకు ఇచ్చి నెలకు దాదాపు రూ.1 కోటి సంపాదిస్తున్నట్లు అంచనా. 25,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ స్థలాన్ని ఖాన్ 2012లో రూ.120 కోట్లకు కొనుగోలు చేశారు. గతంలో ఈ స్థలాన్ని ఫ్యూచర్ గ్రూప్‌నకు చెందిన ఫుడ్హాల్కు నెలకు రూ.90లక్షల చొప్పున అద్దెకు ఇచ్చారు. ఇదీ చదవండి: వందల ఉద్యోగులను తొలగించిన అమెజాన్ అలెక్సా 7. టీవీ షోలు: 2010-11 సీజన్ నుంచి ప్రముఖ రియాలిటీ షో అయిన బిగ్ బాస్‌కు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. అందుకోసం వారానికి రూ.12 కోట్లు వసూలు చేస్తున్నారని కొన్ని మీడియా కథనాల్లో ప్రచురించారు. బిగ్ బాస్ సీజన్ 17 ముగిసే సమయానికి దాదాపు రూ.200 కోట్లను సంపాదించవచ్చని అంచనా. బిగ్ బాస్ కంటే ముందు ఆయన 10కా దమ్ అనే రియాలిటీ గేమ్ షోకు వ్యాఖ్యాతగా పనిచేశారు. 8. బ్రాండ్ యాడ్లు: హీరో హోండా, బ్రిటానియా టైగర్ బిస్కెట్, రియల్మీ, రిలాక్సో, డిక్సీ స్కాట్ వంటి ప్రముఖ బ్రాండ్లకు సల్మాన్ ఖాన్ ప్రచారకర్తగా ఉన్నారు. ఇందుకోసం ఒక్కో కంపెనీ ద్వారా ఏటా దాదాపు రూ.6 కోట్ల నుంచి రూ.7 కోట్ల వరకు వసూలు చేస్తారని అంచనా. 9. ఎన్ఎఫ్టీ: 2021లో సల్మాన్ ఖాన్, అమితాబ్ బచ్చన్ , కమల్ హాసన్, రజనీకాంత్, సన్నీ లియోన్‌తోపాటు ఇతర నటులు నాన్-ఫంగిబుల్ టోకెన్లలో పెట్టుబడి పెట్టారు. దానివల్ల వారి అభిమానులు నటుడికి సంబంధించిన ప్రత్యేకమైన ఆర్ట్‌లు, మ్యూజిక్, వీడియోలు, ఫొటోలు వంటివి డిజిటల్ రూపంలో కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ఇదీ చదవండి: క్రికెట్ మ్యాచ్‌తో డబ్బు సంపాదన! ఎలాగంటే.. పైన తెలిపిన అన్ని మార్గాల ద్వారా సల్మాన్ ఖాన్ వార్షిక ఆదాయం రూ.220 కోట్లుగా తేలింది. అంటే నెలకు దాదాపు రూ.16 కోట్లు. దేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటుల్లో ఒకరైన ఖాన్ ఆస్తుల నికర విలువ సుమారు 350 యూఎస్ మిలియన్ డాలర్లు (సుమారు రూ.2,907 కోట్లు)గా ఉన్నట్లు కొన్ని కథనాలు వల్ల తెలుస్తుంది. -
స్కూల్ నిర్మించడం కోసం ఆ రైతు ఏం చేశాడంటే..
ఓ సాధారణ రైతు పాఠశాల నిర్మించడానికి తన ఆస్తిలో కొంత భాగాన్ని దానంగా ఇచ్చి ఆదర్శంగా నిలిచాడు. ఈ ఘటన బిహార్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..బిహార్‌లోని భాగల్పూర్ జిల్లా బీహ్పూర్ బ్లాక్‌లో కహర్పూర్ గ్రామానికి చెందిన సుబోధ్ యాదవ్ అనే రైతు స్కూల్ నిర్మించేందుకు తన భూమిని దానంగా ఇవ్వాలనుకుంటున్నట్లు తెలిపారు. 2020లో కోసి నది నీటి మట్టం పెరగడంతో పాఠశాల మునిగిపోయింది. దీంతో విద్యార్థులు వేరే ప్రాంతానికి వెళ్లి చదువుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఆ గ్రామంలో ఉన్న ఏకైక పాఠశాల అదే. దీంతో బిహార్ ప్రభుత్వం పాఠశాల పూర్తిగా దెబ్బతినడంతో కొత్త పాఠశాల నిర్మించడం కోసం స్థలం వెతకడం ప్రారంభించింది. ఈ విషయం తెలుసుకున్న యాదవ్ తల్లి చడికా దేవి తన కూమారుడిని ఆస్తిలో కొంత ప్రభుత్వానికి దానంగా ఇవ్వమని కోరింది. దీంతో పక్కా పత్రాలతో రిజిస్ట్రేషన్ చేసి తన 15 సెంట్ల భూమిని ఆ పాఠశాల నిర్మాణం కోసం దానంగా ఇచ్చాడు. ఆ భూమి విలువ సుమారు రూ. 8 లక్షల వరకు ఉంటుందని అంచనా. ఈ మేరకు భాగల్పూర్ డీఈవో మాట్లాడుతూ..పాఠశాల కోసం భూమిని దానంగా ఇచ్చిన వ్యక్తి పేరు పెట్టాలని అనుకున్నామని, కానీ అతడు తన తల్లి పేరు పెట్టాలని అభ్యర్థించినట్లు తెలిపారు. సదరు రైతు యాదవ్ కూడా ఈ పాఠశాలలో చదువుకుంటున్న పిల్లలు ఈ పాఠశాల కోసం భూమిని దానంగా ఇచ్చిన వ్యక్తిగా తన తల్లి సదా గుర్తించుకుంటారని ఆనందంగా చెబుతున్నాడు. (చదవండి: ఓ వృద్ధుడు బతికుండగానే.. తన అంత్యక్రియలు తానే..) -
సునాక్ దంపతుల సంపద తగ్గింది
లండన్: గత ఏడాది యూకే ధనవంతుల జాబితాలో తొలిసారిగా చోటుదక్కించుకున్న బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్, అక్షతా మూర్తి దంపతుల సంపద ఈ ఏడాది కొంత తగ్గిపోయింది. ఏడాది వ్యవధిలో వారు 201 మిలియన్ పౌండ్ల సంపద కోల్పోయినట్లు శుక్రవారం విడుదలైన ‘ద సండే టైమ్స్ రిచ్ లిస్ట్–2023’ను బట్టి తేటతెల్లమవుతోంది. ఇన్ఫోసిస్ కంపెనీలో అక్షతా మూర్తి షేర్ల విలువ పడిపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. 2022 నాటి సంపన్నుల జాబితాలో రిషి సునాక్ దంపతులు 222వ స్థానంలో నిలిచారు. ఈ ఏడాది జాబితాలో వారి ర్యాంక్ 275కు చేరింది. ప్రస్తుతం వారి సంపద 529 మిలియన్ పౌండ్లని (రూ.5,461 కోట్లు) అంచనా. సునాక్ దంపతుల సంపదలో సింహభాగం ఇన్ఫోసిస్ షేర్ల రూపంలోనే ఉంది. ఇక 35 బిలియన్ పౌండ్లతో (రూ.3.61 లక్షల కోట్లు) బ్రిటన్ సంపన్నుల జాబితాలో ఈ ఏడాది కూడా తొలి స్థానాన్ని భారత సంతతికి చెందిన హిందుజా కుటుంబమే దక్కించుకుంది. -
మొండి రుణాలపై బ్యాడ్ బ్యాంక్ దృష్టి
కేంద్ర ప్రభుత్వం ప్రమోట్ చేసిన జాతీయ ఆస్తుల పునర్నిర్మాణ కంపెనీ(ఎన్ఏఆర్సీఎల్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24)లో మరిన్ని మొండి రుణాల కొనుగోలుకి ప్రణాళికలు వేస్తోంది. ఇందుకు సుమారు 300 కంపెనీల నుంచి రూ. 3 లక్షల కోట్ల రుణాల జాబితా సిద్ధంగా ఉన్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. బ్యాడ్ బ్యాంక్‌గా పిలిచే ఎన్ఏఆర్సీఎల్ గతేడాది(2022–23) రూ. 50,000 కోట్ల మొండి రుణాలను సొంతం చేసుకోవాలనే లక్ష్యం విధించుకున్నప్పటికీ రూ. 10,378 కోట్ల రుణాలను మాత్రమే కొనుగోలు చేయగలిగింది. వివరాలు చూద్దాం.. ముంబై: గత ఆర్థిక సంవత్సరంలో బ్యాడ్ బ్యాంక్ తొలుత పెట్టుకున్న భారీ లక్ష్య సాధనలో విఫలమైనప్పటికీ ఈ ఏడాది మరింత వేగంగా ముందుకు సాగాలని భావిస్తోంది. కొన్ని ప్రాథమిక అవాంతారాలు లక్ష్య సాధనలో అడ్డు తగిలినట్లు తెలుస్తోంది. దీంతో ఈ ఏడాది మరింత పటిష్టంగా రుణ కొనుగోలు చేపట్టాలని చూస్తోంది. నిజానికి 300 కంపెనీల నుంచి మొత్తం రూ. 3 లక్షల కోట్ల మొండి రుణాలు నమోదైనట్లు బ్యాంకింగ్ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే ముందుగా విక్రయించాల్సిన మొండి ఖాతాలను గుర్తించమంటూ ఈ నెల మొదట్లో ఆర్థిక శాఖ ప్రభుత్వ రంగ బ్యాంకులను ఆదేశించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పీఎస్‌యూ బ్యాంకులు ఎన్ఏఆర్సీఎల్కు పలు మొండి ఖాతాలను ఆఫర్ చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయి. వీటి ప్రకారం విక్రయానికి సిద్ధమైన జాబితా నుంచి 20–25 శాతం ఖాతాలను బ్యాడ్ బ్యాంక్ కొనుగోలు చేయనుంది. జాబితా పెద్దదే.. ఈ ఏడాది విక్రయానికి సిద్ధంకానున్న మొండి ఖాతాల జాబితాలో వీడియోకాన్ ఇండస్ట్రీస్, ఫ్యూచర్ రిటైల్, ఫ్యూచర్ ఎంటర్ప్రైజెస్, జీటీఎల్, వీసా స్టీల్, క్వాలిటీ, గాయత్రి ప్రాజెక్ట్స్, ఎరా ఇన్ఫ్రా, రీడ్ అండ్ టేలర్ ఇండియా, కోస్టల్ ఎనర్జెన్ తదితరాలున్నాయి. కాగా.. ఇటీవల విదర్భ ఇండస్ట్రీస్(రూ. 1,150 కోట్లు), రోల్టా(రూ. 600 కోట్లు), వీవోవీఎల్(రూ. 1,100 కోట్లు) ఖాతాలను ప్రభుత్వ బ్యాంకులు బ్యాడ్ బ్యాంకుకు ఆఫర్ చేశాయి. ఈ బాటలో ధరణి షుగర్స్ ఖాతా(రూ. 619 కోట్లు)ను దాదాపు రూ. 223 కోట్లకు కొనుగోలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇదేవిధంగా రెయిన్బో పేపర్స్ రూ. 1,136 కోట్ల రుణాలకుగాను ఎన్ఏఆర్సీఎల్ రూ. 87 కోట్ల యాంకర్ ఆఫర్ చేసినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. గతేడాది ఇలా.. 2022–23లో జేపీ ఇన్ఫ్రాటెక్, ఎస్ఎస్ఏ ఇంటర్నేషనల్, హీలియోస్ ఫొటో వోల్టాయిక్కు చెందిన మొత్తం రూ. 10,378 కోట్ల రుణాలను ఎన్ఏఆర్సీఎల్ చేజిక్కించుకుంది. ఇందుకు నగదు, సెక్యూరిటీల జారీ ద్వారా రూ. 3,636 కోట్లు ఆఫర్ చేసింది. కాగా.. కొన్ని రుణాల విషయంలో ఎన్ఏఆర్సీఎల్ ఆఫర్లను రుణదాతలు తిరస్కరిస్తున్నాయి. మరికొన్ని కేసుల్లో మరింత మెరుగైన ఆఫర్లు లభిస్తున్నట్లు బ్యాంకింగ్ వర్గాలు వివరించాయి. జీటీఎల్‌కు బ్యాడ్ బ్యాంకు ప్రతిపాదిత రూ. 360 కోట్ల ఆఫర్ అంచనాలను చేరకపోవడంతో తిరస్కరణకు గురైంది. రుణదాతలు రూ. 550 కోట్లు ఆశించడం గమనార్హం! ఇక మెక్నల్లీ భారత్ విషయంలో నాల్వా స్టీల్ రూ. 424 కోట్లకుపైగా ఆఫర్ చేసింది. ఇదేవిధంగా మిట్టల్ కార్ప్‌నకు ఎన్ఏఆర్సీఎల్ రూ. 228 కోట్లు ఆఫర్ చేయగా.. రూ. 405 కోట్ల బిడ్‌తో ఖాతాను ఫీనిక్స్ ఏఆర్సీ గెలుచుకుంది. కాగా.. బ్యాడ్ బ్యాంక్ మొండి రుణాల కొనుగో లుని 15–85 నిష్పత్తిలో ఆఫర్ చేస్తుంది. అంటే 15 శాతం ముందస్తు చెల్లింపు, మిగిలిన 85% బకాయిల నుంచి రికవరీ ద్వారా చెల్లిస్తుంది. -
ఓ ఎమ్మెల్యే.. ఆస్తి విలువ 70,000
రాజకీయాల్లోకి వచ్చిన అనతికాలంలోనే రూ. కోట్లకు పడగలెత్తి రాజప్రాసాదాల్లాంటి ఇళ్లు కట్టుకున్న ఎందరో ప్రజాప్రతినిధులను ఇప్పటిదాకా మనం చూశాం.. కానీ మూడంతస్తుల అధికారిక నివాసాన్ని కేటాయించినందుకే కృతజ్ఞతతో ఓ ఎమ్మెల్యే కన్నీటిపర్యంతం కావడం మీరెప్పుడైనా చూశారా?!! బిహార్‌లో ఎమ్మెల్యే (అలౌలీ నియోజకవర్గం నుంచి ఆర్జేడీ తరఫున)గా గెలిచిన రామ్‌వృక్ష్ సదా తాజాగా తన అధికారిక ఇంటి తాళాలను అందుకుంటూ కంటతడి పెడుతున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. బిహార్‌లోని అత్యంత పేద ఎమ్మెల్యే అయిన రామ్‌వృక్ష్ ఇప్పటివరకు తన ఐదుగురు కుమారులు, కుమార్తెతో కలసి ఇందిరా ఆవాస్ యోజనలో భాగంగా కట్టిన ఇంట్లో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో బిహార్ ప్రభుత్వం ప్రజాప్రతినిధుల కోసం రాజధాని పట్నాలో నిర్మించిన అధికారిక గృహ సముదాయంలో ఆయనకు సైతం ఇంటిని కేటాయించింది. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ చేతుల మీదుగా ఇంటి తాళాలు అందుకున్న ఆయన ఈ క్రమంలో భావోద్వేగాన్ని ఆపుకోలేకపోయారు. కంటతడి పెట్టారు. ‘పేదవాడు ఏదైనా పొందడం అంటే అది అతనికి దీపావళి పండుగ లాంటిదే.. నేను కలలో కూడా ఊహించలేదు. ఇలాంటి ఇంట్లో ఉంటానని.. ఇది నాకు దీపావళే’ అని ఎమ్మెల్యే రామ్‌వృక్ష్ పేర్కొన్నారు. ఇటుకల బట్టీలో కూలీగా పనిచేసే ఈయన 1995లో ఆర్జేడీలో చేరారు. 2000లో ఆర్జేడీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2020లో జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచారు. ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్ ప్రకారం ఆయన స్థిరాస్తుల విలువ రూ. 70 వేలు!!. "हम मुसहर समाज से आते हैं! मा० @laluprasadrjd जी ने हमें नेता बनाया, MLA बनाया, देश से जोड़ा, आज उसका फल है.... अलौली के जनता मालिक को प्रणाम करते हैं!" - सुसज्जित सरकारी आवास पाकर मा० MLA श्री रामवृक्ष सदा भावुक हुए। लालू जी ने ग़रीबों को आवाज़ दी, @yadavtejashwi जी ताकत देंगे! pic.twitter.com/7PUoZR7dfi — Rashtriya Janata Dal (@RJDforIndia) October 27, 2022 (చదవండి: ఫోన్ ట్యాపింగ్‌పై భారీగా ఫిర్యాదులు?) -
నెలాఖరులోగా మొండి పద్దుల విక్రయం పూర్తి
ముంబై: దాదాపు రూ. 48,000 కోట్ల మొండి పద్దులను అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ (ఏఆర్సీ) జేసీ ఫ్లవర్స్‌కు విక్రయించే ప్రక్రియ నవంబర్ నెలాఖరుకి పూర్తి కాగలదని భావిస్తున్నట్లు యస్ బ్యాంక్ సీఈవో ప్రశాంత్ కుమార్ తెలిపారు. దీనితో స్థూల నిరర్ధక ఆస్తుల (ఎన్పీఏ) నిష్పత్తి 12.89 శాతం నుంచి 2 శాతం లోపునకు దిగి రానుంది. మొత్తం పద్దులకు గాను రూ. 11,183 కోట్లు యస్ బ్యాంక్‌కు జేసీ ఫ్లవర్స్ చెల్లించనుంది. ఇది సుమారు 23 శాతం రికవరీకి సమానం. మరోవైపు, డీల్ ప్రకారం ఏఆర్‌సీలో యస్ బ్యాంక్ 9.9 శాతం వాటాలు తీసుకోనున్నట్లు, ఆర్బీఐ అనుమతితో దీన్ని తదుపరి 20 శాతానికి పెంచుకోనున్నట్లు ఎఫ్‌ఐబీఏసీ 2022 కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా కుమార్ వివరించారు. భారతీయ పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ, భారతీయ బ్యాంకుల అసోసియేషన్ (ఐబీఏ) కలిసి దీన్ని సంయుక్తంగా నిర్వహిస్తాయి. -
మిరే అస్సెట్ తక్కువ వడ్డీకే స్టాక్ ఫండింగ్
ముంబై: మిరే అస్సెట్‌కు చెందిన ఎం.స్టాక్ ‘మార్జిన్ ట్రేడ్ ఫెసిలిటీ’ (ఎంటీఎఫ్)ను ఆరంభించింది. 7.99 శాతం వడ్డీకే రుణ సదుపాయం కల్పిస్తున్నట్టు తెలిపింది. పరిశ్రమలోనే ఇది కనిష్ట వడ్డీ రేటుగా పేర్కొంది. ఈక్విటీలకు సంబంధించి ట్రేడర్లు, ఇన్వెస్టర్లు తక్షణమే నిధుల సదుపాయం పొందొచ్చని తెలిపింది. 700 స్టాక్స్‌కు సంబంధించి 80 శాతం మార్జిన్‌ను పొందొచ్చని వివరించింది. మార్జిన్ ఫండింగ్ (రుణం)తో కొనుగోలు చేసిన షేర్లను ఎంత కాలం పాటు అయినా కొనసాగించుకోవచ్చని తెలిపింది. ట్రేడర్లు రూపాయి బ్రోకరేజీ లేకుండా అపరిమిత డ్రేడ్స్ చేసుకోవచ్చని ఈ సంస్థ ప్రకటించింది. రూ.10 లక్షల వరకు ఫండింగ్పై 9.49 శాతం రేటు, రూ.10–25 లక్షల మధ్య తీసుకుంటే రూ.8.99 శాతం రేటు, రూ.25 లక్షలకు పైగా ఫండింగ్ తీసుకున్న వారికి 7.99 శాతం రేటును వసూలు చేస్తున్నట్టు తెలిపింది. షేర్ల ప్లెడ్జ్ (ఫండింగ్ కోసం), అన్ ప్లెడ్జ్ లావాదేవీపై కేవలం రూ.12 వసూలు చేస్తున్నట్టు పేర్కొంది. -
దేశంలోనే అత్యంత ధనిక ఆలయం.. కానీ సరిగ్గా మూడేళ్ల క్రితం..
భువనేశ్వర్: దేశంలోనే అత్యంత ధనిక ఆలయంగా పేరొందిన పూరీ జగన్నాథుని మందిరం సొత్తు భద్రతపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జగన్నాథునికి ఉన్న వజ్ర, వైఢూర్య, బంగారు, వెండి, నవరత్నాల ఆభరణాలు, నగల సొత్తు అపారమైనది. ఈ సంపదని శ్రీమందిరం అంతరాలయంలోని ప్రత్యేక భాండాగారంలో భద్రపరిచారు. సరిగ్గా మూడేళ్ల క్రితం ఈ భాండాగారం తాళం చెవి గల్లంతైనట్లు వార్త బయటకు పొక్కింది. దీంతో స్వామి నిధి భద్రతపై భక్తుల్లో అభద్రతాభావం బలంగా నాటుకుపోయింది. ఈ క్రమంలో ఉలికిపాటుకు గురైన దేవస్థానం, రాష్ట్ర ప్రభుత్వం, పూరీ జిల్లా అధికార యంత్రాంగం స్వామి సంపద భద్రతపై భక్తుల్లో విశ్వాసం సన్నగిల్లకుండా ఉండేందుకు చర్యలు చేపట్టాయి. రత్నభాండాగారం సంపద సందర్శన నిమిత్తం 17 మంది ప్రముఖులతో కూడిన ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేశారు. అప్పట్లో అట్టహాసంగా ఈ కమిటీ రత్నభాండాగారం తెరిచి, పరిశీలించినట్లు.. సొత్తు అంతా భద్రమేనని ఓ ప్రకటన వెలువరించింది. రెండంతస్తుల రత్నభాండాగారంలో బాహ్య అంతస్తు నుంచి లోపలి అంతస్తుని స్పష్టంగా చూసినట్లు కమిటీ స్పష్టం చేసింది. ఈ సమాచారం స్వామి భక్తులకు కాస్త ఊరటని కలిగించింది. ఈ నెల 18న అసలు విషయం.. అయితే తాజాగా సమాచార హక్కు చట్టం ద్వారా లభ్యమైన కొత్త సమాచారంతో మళ్లీ స్వామి సొత్తుపై భక్తుల్లో విశ్వాసం నీరుగారింది. 1970 నుంచే జగన్నాథుని రత్నభాండాగారం తాళం చెవి కనబడడం లేదని సమాచార హక్కు చట్టం కింద లభించిన సమాచారం బహిర్గతం చేసింది. కొమాకొంతియా గ్రామానికి చెందిన దిలీప్‌కుమార్ బొరాల్ సమాచార హక్కు చట్టం ద్వారా ఈ సమాచారం సేకరించారు. రత్నభాండాగారం అసలు తాళం చెవి, నకిలీ తాళం చెవి వాస్తవ సమాచారం తెలియజేయాలని ఆయన జిల్లా ట్రెజరీ కార్యాలయానికి దరఖాస్తు చేసుకోవడంతో దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఈ నెల 18వ తేదీన పూరీ కలెక్టరేట్ ద్వారా ఆయనకు అందినట్లు సమాచారం. ఇదే విషయాన్ని జగన్నాథ ఆలయం ప్రధాన పాలన అధికారికి 2018 ఏప్రిల్ 4వ తేదీన లేఖ ద్వారా తెలియజేసినట్లు సమాచారం ద్వారా తెలిసింది. ఈ నేపథ్యంలో అప్పట్లో తాళం చెవి గల్లంతు ఘటనపై విచారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు ఆదేశాల మేరకు ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ ఇచ్చిన సమాచారం పట్ల సర్వత్రా పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అసలు స్వామి నిధిపై రహస్యం పాటించడమేంటని ప్రశ్నిస్తున్నారు. అప్పట్లో ఏర్పాటు చేసిన కమిటీలో శ్రీమందిరం ప్రధాన పాలన అధికారి(సీఏఓ), జిల్లా కలెక్టరు, పోలీస్ సూపరింటెండెంట్, భారతీయ పురావస్తు శాఖ కోర్ కమిటీ సభ్యులు, శ్రీమందిరం పాలక మండలి సభ్యులు ఉన్నారు. ప్రస్తుతం సమాచార హక్కు చట్టం ద్వారా లభించిన సమాచారం.. అప్పుడు కమిటీ సభ్యుల ప్రకటనకు పొంతన లేకుండా పోవడం పలు అనుమానాలకు తావునిస్తోంది. తాళం మాయంపై కలెక్టర్‌కు లేఖ.. సమాచారం చట్టం ప్రకారం రత్నభాండాగారం తాళం చెవి వివరాలపై 2018 ఏప్రిల్ 3వ తేదీన పూరీ జిల్లా అప్పటి కలెక్టరు(అరవింద అగర్వాల్) జిల్లా కోశాధికారికి లేఖ రాశారు. రత్నభాండాగారం తాళం చెవి కనబడడం లేదని శ్రీమందిరం అప్పటి ప్రధాన పాలన అధికారి(సీఏఓ) (ప్రదీప్ కుమార్ జెనా)కు 2018 ఏప్రిల్ 4న జిల్లా కలెక్టరు లేఖ ద్వారా తెలియజేశారు. 1970 నుంచి రత్నభాండాగారం తాళం చెవి వివరాలు కానరానట్లు ఆ లేఖలో వివరించారు. ఇప్పుడు భాండాగారం తాళం చెవి వివరాల కోసం అర్జీ పెట్టుకున్న దిలీప్‌కుమార్ బొరాల్కు ఇదే సమాచారం జారీ చేశారు. ఈ క్రమంలో అప్పట్లో హైకోర్టు ఆదేశాల మేరకు దర్యాప్తు నిర్వహించిన ఉన్నత స్థాయి కమిటీ సమాచారంపై సర్వత్రా అనుమానాలు రేకెత్తుతున్నాయి. కొన్ని దశాబ్దాలుగా జగన్నాథుని రత్నభాండాగారం తాళం చెవి కానరాకుంటే ప్రముఖుల కమిటీ పరిశీలన ఎలా సాధ్యమైందనే దిశగా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. చివరికి ఈ తాళం చెవి గల్లంతు విషయం ఎటువైపు ఎలా మలుపు తిరుగుతుందో వేచి చూడాల్సిందే. చదవండి: సోషల్ మీడియాలో మాజీ సీఎం భార్య రచ్చ.. ‘ఆ డ్రెస్ ఏంటి’ -
ఏఆర్‌సీల క్రమబద్ధీకరణకు ఆర్బీఐ కమిటీ సిఫార్సులు
ముంబై: అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీల (ఏఆర్సీ) పనితీరును క్రమబద్ధీకరించే దిశగా రిజర్వ్ బ్యాంక్ కమిటీ పలు సిఫార్సులు చేసింది. మొండి అసెట్స్‌ను విక్రయించేందుకు ఆన్లైన్ ప్లాట్‌ఫాం ఏర్పాటు చేయడం, దివాలా కోడ్ ప్రక్రియలో పరిష్కార నిపుణులుగా వ్యవహరించేందుకు ఏఆర్‌సీలను కూడా అనుమతించడం తదితర అంశాలు ఇందులో ఉన్నాయి. అలాగే రూ. 500 కోట్లు పైబడిన ఖాతాల విషయంలో వాటిని విక్రయిస్తే వచ్చే విలువ, సముచిత మార్కెట్ ధరను బ్యాంకులు ఆమోదించిన ఇద్దరు వేల్యుయర్లతో లెక్క గట్టించాలని కమిటీ సూచించింది. రూ. 100 కోట్లు –500 కోట్ల మధ్య అకౌంట్లకు ఒక్క వేల్యుయర్‌ను నియమించవచ్చని పేర్కొంది. రుణాన్ని రైటాఫ్ చేయగలిగే అధికారాలు ఉన్న అత్యున్నత స్థాయి కమిటికే.. రిజర్వ్ ధరపై తుది నిర్ణయాధికారం ఉండాలని తెలిపింది. సంబంధిత వర్గాలు డిసెంబర్ 15లోగా ఆర్బీఐకి తమ అభిప్రాయాలు పంపాల్సి ఉంటుంది. ఇటు బాకీల రికవరీ, అటు వ్యాపారాలను పునరుద్ధరణ అంశాల్లో ఏఆర్‌సీల పనితీరు అంత ఆశావహంగా లేకపోతున్న నేపథ్యంలో వాటి పనితీరును మెరుగుపర్చేందుకు తీసుకోతగిన చర్యలపై ఆర్బీఐ మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుదర్శన్ సేన్ సారథ్యంలో కమిటీ ఏర్పడింది. -
అంబానీ కీలక నిర్ణయం: షేరు జంప్
సాక్షి, ముంబై: అప్పుల సంక్షోభంలో ఇరుక్కున్న అనిల్ అంబానీ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన నేతృత్వంలోని రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రధాన ఆస్తిని విక్రయించారు. ప్రయివేటు రంగ బ్యాంకు యస్ బ్యాంకు అప్పు తీర్చే పనిలో భాగంగా తన వేలకోట్ల ఆస్తిని అంబానీ విక్రయించారు. బ్యాంక్‌కి బకాయి పడిన కోట్ల రూపాయల అప్పుని తీర్చేందుకు ముంబైలోని రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ముంబై ప్రధాన కార్యాలయం ‘రిలయన్స్ సెంటర్‌ను ’ను విక్రయించారు.ఈ పరిణామంతో స్టాక్ మార్కెట్లో రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ షేరు దాదాపు 9.50శాతం ఎగియడం విశేషం. రిలయన్స్ ఇన్ఫ్రా మార్కెట్ సమాచారంలో ఈ విషయాన్ని వెల్లడించింది. యస్ బ్యాంకు రుణాన్ని తిరిగి చెల్లించేందుకు ఉద్దేశించిన ఈ లావాదేవీ విలువ రూ .1200 కోట్లు అని తెలిపింది. ఈ అమ్మకంతో బ్యాంక్ ఇదే ఆఫీస్‌ని తన కార్పోరేట్ హెడ్‌క్వార్డర్స్‌గా మార్చుకోనుంది. కాగా 2021 జనవరిలోనే రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం 3 ఆస్తులను విక్రయించింది. ఢిల్లీ ఆగ్రా టోల్ రోడ్ (3,600 కోట్ల రూపాయలకు) పర్బతి కోల్డామ్ ట్రాన్స్మిషన్ (900 కోట్ల రూపాయల) అమ్మిన సంగతి తెలిసిందే. (పెరుగుతున్న ఇళ్ల ధరలు, ఇంకా పెరగొచ్చు!) చదవండి : కేంద్రం యూటర్న్ : ఏప్రిల్ ఫూల్ జోకా? -
గంటా ఆస్తుల వేలం..
సాక్షి, విశాఖపట్నం: ఇండియన్ బ్యాంకుకు రుణం ఎగవేత వ్యవహారంలో టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పేరు మరోసారి తెరపైకి వచ్చింది. ఒకప్పటి ఆయన మానసపుత్రిక ప్రత్యూష కంపెనీ కోసం తీసుకున్న రుణం వడ్డీ సహా రూ.248.03 కోట్లు అయ్యింది. దీన్ని చెల్లించడానికి ప్రత్యూష డైరెక్టర్లు ముఖం చాటేయడంతో బ్యాంకు యాజమాన్యం బకాయిలను రాబట్టే చర్యలకు ఉపక్రమించింది. విశాఖ నగరంతో పాటు పలు ప్రాంతాల్లో బ్యాంకు గ్యారెంటీగా పెట్టిన ఆస్తులను ఈనెల 25న వేలం వేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఇందుకు సంబంధించిన ఇ–ఆక్షన్ సేల్ నోటీసును హైదరాబాద్‌లోని ఇండియన్ బ్యాంకు సామ్(ఎస్ఏఎం) బ్రాంచ్ జారీ చేసింది. (గడువులోగా పోలవరం పూర్తి కావాల్సిందే) పదవి నుంచి తప్పుకున్నా సరే.. ప్రత్యూష రిసోర్సెస్ అండ్ ఇన్ఫ్రా సంస్థ గతంలో తీసుకున్న రుణానికి సంబంధించి రూ.141.68 కోట్లు మేర బకాయి పడింది. దీన్ని చెల్లించాలని ఇండియన్ బ్యాంకు 2016, అక్టోబరు 4వ తేదీన తొలుత నోటీసులు పంపించింది. కానీ రుణ చెల్లింపుల్లో కంపెనీ చేతులెత్తేసింది. తదుపరి వడ్డీ సహా ఆ బకాయి రూ.248.03 కోట్లకు (రూ.248,03,85,547) చేరింది. దీంతో రుణం కోసం కుదువ పెట్టిన ప్రత్యూష గ్రూప్ ఆస్తులను వేలం వేయాలని బ్యాంకు నిర్ణయించింది. రుణాల చెల్లింపునకు బాధ్యులుగా గంటా శ్రీనివాసరావుతో పాటు పీవీ ప్రభాకరరావు, పీవీ భాస్కరరావు, నార్ని అమూల్య, పి.రాజారావు, కేబీ సుబ్రహ్మణ్యం, ప్రత్యూష రిసోర్సెస్ అండ్ ఇన్ఫ్రా, ప్రత్యూష గ్లోబల్ ట్రేడ్ లిమిటెడ్ సంస్థలను ఇండియన్ బ్యాంకు తన నోటీసులో పేర్కొంది. తాను సంస్థ డైరెక్టర్ పదవి నుంచి 2011 సంవత్సరంలోనే తప్పుకున్నానని, ఆ సంస్థ ఆర్థిక లావాదేవీలతో తనకు సంబంధం లేదని గంటా శ్రీనివాసరావు గతంలో ప్రకటించారు. వేలం వేయనున్న ఆస్తుల జాబితాలో ఆయనకు చెందిన ఆస్తులు కూడా ఉన్నాయి. (బెయిల్ ఇప్పించి నిరసనలా?) వేలం వేయనున్న ఆస్తులివే.. ►నగరంలోని గంగులవారి వీధిలో ప్రత్యూష అసోసియేట్స్ పేరుతో ఉన్న వాణిజ్య భవనం (దీని రిజర్వు విలువ రూ.154.72 లక్షలు) ►గంటా శ్రీనివాసరావు పేరుతో విశాఖలోని బాలయ్యశాస్త్రి లేఅవుట్లో త్రివేణి టవర్స్‌లోనున్న ఫ్లాట్, అదేచోట పి.రాజారావు పేరుతో ఉన్న 444 చదరపు గజాల విస్తీర్ణంలోనున్న మరో ఫ్లాట్ (వీటి విలువ రూ.150.75 లక్షలు) ►ఎండాడ రెవెన్యూ గ్రామ పరిధిలో రుషికొండ గ్రామం వద్ద కేబీ సుబ్రహ్మణ్యం పేరుతో ఉన్న 503.53 చదరపు గజాల స్థలం (దీని రిజర్వు విలువ రూ.171.21 లక్షలు) ►ప్రత్యూష అసోసియేట్స్ పేరుతో ద్వారకానగర్ మొదటి లైన్‌లోని శ్రీశాంతా కాంప్లెక్స్‌లో ఉన్న ఆస్తి (రిజర్వు విలువ రూ.94.19 లక్షలు) ►పీవీ భాస్కరరావు పేరుతో తమిళనాడులోని కాంచీపురం జిల్లాలో షోలింగ నల్లూరులో 6వేల చదరపు గజాల భూమి (రూ.240 లక్షలు) ►ప్రత్యూష అసోసియేట్స్ షిప్పింగ్ సంస్థకు తూర్పు గోదావరి జిల్లా కాకినాడ నగరంలోని సాంబమూర్తినగర్‌లో ఉన్న 1101 చదరపు అడుగుల విస్తీర్ణంలోనున్న ఆస్తి (రూ.308.46 లక్షలు), అదే సంస్థకు అక్కడే ఉన్న మరో 333.33 చదరపు గజాల విస్తీర్ణంలోని ఆస్తి (రూ.66.67 లక్షలు) ►ఆనందపురం మండలం వేములవలసలో పీవీ భాస్కరరావు పేరుతో ఉన్న 4.61 ఎకరాల భూమి (రూ.2103.07 లక్షలు) ►ప్రత్యూష రిసోర్సెస్ అండ్ ఇన్ఫ్రా సంస్థకు హైదరాబాద్‌లోని మణికొండలోని ల్యాంకో హిల్స్‌లో ఉన్న ఫ్లాట్ (రూ.247.69 లక్షలు) -
ఆస్తుల నమోదుకు వెబ్సైట్..
సాక్షి, హైదరాబాద్: యజమానులే స్వయంగా వ్యవసాయేతర ఆస్తులు నమోదు చేసుకునేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక వెబ్సైట్ (www.npb.telangana.gov.in) ను అందుబాటులోకి తెచ్చింది. జీహెచ్ఎంసీ సహా రాష్ట్రంలోని ఇతర పురపాలికల్లోని వ్యవసాయేతర ఆస్తులను ఈ వెబ్సైట్లో యజమానులే నమోదు చేసుకోవచ్చని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ శనివారం రాత్రి ఓ ప్రకటనలో తెలిపారు. మీ–సేవ ద్వారా కూడా ఉచితంగా నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు. మీ–సేవ కేంద్రాలకు చెల్లించాల్సిన చార్జీలను జీహెచ్ఎంసీ/పురపాలికలే చెల్లిస్తాయని చెప్పారు. నకిలీ లావాదేవీలను నిర్మూలించేందుకు ఆధార్ నంబర్, యాజమాన్య హక్కులకు సంబంధించిన లావాదేవీలపై అప్రమత్తం చేసేందుకు మొబైల్ ఫోన్ నంబర్, ఆస్తులపై కుటుంబసభ్యుల హక్కులను పరిరక్షించేందుకు వారి వివరాలను, మెరూన్ రంగు పాసుబుక్‌పై ముద్రించేందుకు యజమాని ఫొటో, స్థలం విస్తీర్ణం/ నిర్మిత ప్రాంతం వివరాలను యజమాని పొందుపర్చాల్సి ఉంటుందని వివరించారు. ప్రవాస భారతీయులు(ఎన్ఆర్ఐ), ఓసీలకు సంబంధించిన ఆస్తుల నమోదుకు త్వరలో ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేస్తామన్నారు. శనివారం నాటికి 75.74 లక్షల ఆస్తుల నమోదు పూర్తవుతుందని పేర్కొన్నారు. ఆస్తుల హక్కులను పరిరక్షించేందుకు ప్రభుత్వం ధరణి ప్రాజెక్టు తీసుకొస్తోందని, ఆస్తుల క్రయవిక్రయాలు జరిగిన వెంటనే మ్యూటేషన్లు జరిగేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందన్నారు.ఆస్తుల యజమానుల వివరాలను రహస్య (ఇన్‌క్రిప్టెడ్) కోడ్ భాషలో రాష్ట్ర ప్రభుత్వ సర్వర్లలో నిల్వ చేస్తామన్నారు. ఈ సమాచారాన్ని ధరణి అవసరాలకు మాత్రమే వినియోగిస్తామని వివరించారు. 25న ‘ధరణి’ ప్రారంభం: ఈ నెల 25న ధరణి పోర్టల్‌ను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు లాంఛనంగా ప్రారంభిస్తారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ తెలిపారు. ఆ రోజు నుంచి తహసీళ్లలో సాగు భూముల రిజిస్ట్రేషన్ కార్యకలాపాలు మొదలవుతాయని వెల్లడించారు. జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, తహసీల్దార్లు, నాయబ్ తహసీల్దార్లతో శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎస్, ధరణి నిర్వహణ, సన్నద్ధతపై దిశానిర్దేశం చేశారు. -
రెండో సీసా
అస్తి హత్యలు చేయిస్తుంది. ఒక్కోసారి అపరాధులు ఎవరో నిరపరాధులు ఎవరో తెలియని కన్ఫ్యూజన్లో కూడా పడేస్తుంది.మహబూబాబాద్ జిల్లా. తొర్రూర్.2014, అక్టోబరు 4. రాత్రి 8 గంటలు.నిజానికి అందరూ భోజనాలు ముగించి నిద్రకు ఉపక్రమించే టైమ్ అది. కానీ ఊరు కంగాళీగా ఉంది. సగం ఊరు ఆ ఇంటి ముందు భోజనం సంగతి మరిచి గుమికూడి ఉంది. ఆ ఇంటి ముందున్న కరెంట్ పోల్కి లైట్ వెలుగుతూ ఆరుతూ చికాకు పెడుతోంది.పడీ పడని వెలుతురులో ఆ ఇంటి వసారాలో పడి ఉన్న రెండు మృతదేహాలు భయం గొలిపేలా ఉన్నాయి. రెండూ పురుషులవి. కాసేపటి క్రితం ప్రాణాలతో ఉండి ఇప్పుడు చలనం లేని దేహాలు.ఇంటామె అప్పుడే షాక్ నుంచి బయట పడ్డట్టుంది... జరిగిన దారుణానికి కడుపు తరుక్కుపోయే లా శోకాలు పెడుతోంది. ‘ఓరి నా మొగుడో... అయ్యో నా తమ్ముడో’కాని గుంపుకు జాలి కలగడం లేదు.జవాబుగా గుంపు గుసగుసలు పోతూ ఉంది.‘చేసిందంతా చేసి ఎలా ఏడుస్తోందో చూడు.’‘కొడుకుతో కలిసే ఈ పని చేసి ఉంటుంది’ ‘ఎన్నాళ్ల నుంచి చూస్తున్నాం ఈ గొడవలు..’‘అంత మాత్రానికే ఇంత పని చేస్తారా?!’సడన్‌గా గ్రామస్తులకు కోపం పెరిగింది. ‘వీళ్లకు తగిన శాస్తి చేస్తే గాని బుద్ధి రాదు...’ముందుకు కదిలారు నలుగురు వ్యక్తులు ఆమె జుట్టు పట్టుకోవడానికి. తోడు ఇంకొందరు కదిలారు. ఇది గమనించిన ఇంటామె అక్కడే చేష్టలిడిగి నిలుచుని ఉన్న ఆమె కొడుకుతో పరిగెత్తుకెళ్లి తలుపులేసుకుంది. ఆ తలుపులు విరిగిపడతాయేమో అన్నంతగా ‘దఢేల్ దఢేల్..’మని కొడుతున్నారు గుంపులోని వాళ్లు. పోలీసులు అడ్డురాకపోతే ఆ ఊరి వాళ్ల కోపానికి ఆ ఇంటి సభ్యుల ప్రాణాలు గాల్లో కలిసేవే! కాస్తలో తప్పింది. ఆ ఇద్దరి మీద ఆ ఊరివాళ్లకు ఎందుకంత కోపం వచ్చింది? ఆ కింద పడి ఉన్న ఆ ఇద్దరిని ఎందుకు చంపి ఉంటారు?ఎవరూ చెప్పడం లేదు. ఊరి జనాన్ని కంట్రోల్ చేసే పనిలో పడ్డారు పోలీసులు.అంబులెన్స్ సిబ్బంది కిందపడి ఉన్న ఇద్దరు వ్యక్తులను పరీక్షించి ‘వారు చనిపోయారు సార్’ అన్నారు ఎస్సైతో. శవాలను ఆసుపత్రికి తరలించారు. ఇంటి దగ్గర విచారణ కష్టంగా అనిపించడంతో ముందుగా ఆ ఇంట్లో వాళ్లను అక్కణ్ణుంచి తీసుకెళ్లి పంచాయితీ హాల్లో కూర్చోబెట్టారు. ఊళ్లో నలుగరు పెద్దవాళ్లను అక్కడ ఉంచి, మిగతావారిని ఎవరిళ్లకు వాళ్లు వెళ్లిపోవాలని హెచ్చరించారు. పోలీసుల ప్రతాపానికి జyì సిన జనం పలచబడ్డారు. కానీ, కాసేపటికి పంచాయితీ హాల్ వద్దకూ జనం మెల్లగా పోగవుతున్నారు. పంచాయితీ హాల్‌కి వచ్చిన ఎస్సై ...‘ఏం జరిగింది?’ అడిగాడు ఆ ఇంటి పెద్దావిడను. ఆమె పేరు సుభద్రమ్మ (పేరు మార్చాం). వయసు అరవై పైనే ఉంటుంది.‘ఏముంది సార్! ఆస్తుల గొడవ! ఈళ్ల పనే ఇది’ అన్నాడు అక్కడే ఉన్న ఓ గ్రామస్తుడు.అతని వైపు కోపంగా చూసిన ఎస్సై అతన్ని బయటకు పంపించాడు.ఆమె ఏడుస్తూనే ‘సార్.. నేను చంపలేదు! ఊరి నుంచి మా తమ్ముడొచ్చాడు. మా ఆయనా మా తమ్ముడూ మాట్లాడుకుంట చాలా సేపు కూసున్నరు. ఇద్దర్నీ భోజనానికి రమ్మన్నాను. అప్పుడే వద్దని మా ఆయన మందుబాటిల్ తెచ్చి కూర్చున్నాడు. ఇద్దరూ మందు తాగారు. అరగంటసేపు బాగానే ఉన్నారయ్యా. తర్వాత ఏమైందో ఏమో! నురగలు కక్కుకంటూ నేలమీద పడిపోయారు. చూస్తుండగానే శవాలయ్యారు’ గట్టి గట్టిగా ఏడుస్తూనే ఉంది ఆమె. సుభద్రమ్మ కొడుకు ప్రతాప్ వైపు చూశాడు ఎస్సై. అతను హడలిపోయాడు.‘సార్! నేను టౌన్‌కు పోయి ఇందాకనే ఇంటికి వచ్చాను. అమ్మ ఏడుపు విని పరిగెత్తుకువచ్చాను. చూస్తే ఇద్దరూ పడిపోయున్నారు’ అన్నాడు ప్రతాప్.విషయం అంతా పోలీసులు నోట్ చేసుకుంటున్నారు. సుభద్రమ్మ భర్త పేరు వెంకటయ్య. డెభ్బై ఏళ్లుంటాయి. ప్రతాప్‌కి పెళ్లయి ఇద్దరు పిల్లలు కూడా! తండ్రికి కొడుక్కి నాలుగేళ్లుగా ఆస్తి విషయమై పడటం లేదు. ఉన్న నాలుగెకరాల భూమిలో తన వాటా తనకు పంచమంటాడు కొడుకు. అది నా కష్టార్జితం. సెంటు భూమి కూడా ఇవ్వ అంటాడు తండ్రి. ఒక్కింటి వాళ్లయినా ఇంటికి మధ్యలో గోడ కట్టుకొని ఎవరి వంట వాళ్లు వండుకుంటున్నారు. సుభద్రమ్మ కూడా ఆ భూమిని కొడుకు పేర రాసిమ్మని గొడవ పెడుతోంది. కానీ, వెంకటయ్య వినిపించుకోవట్లేదు. ‘అది నేను సంపాదించిన భూమి. ఎవరూ లేనో ళ్లకైనా ఇస్తా కానీ, వీడికి (ప్రతాప్) ఇవ్వ. ఈ ఇంట్లో నుంచి కూడా వెళ్లిపొమ్మను’ అని గొడవ పెట్టుకుంటున్నాడు. ‘ఉన్నది ఒక్కడే కొడుకు కదా! వాడికి కాకపోతే ఎవరికిస్తవ్! ఇచ్చేయరాదు’ అని నచ్చజెప్పారు ఊళ్లో కొంతమంది. అయినా వెంకటయ్య వినిపించుకోలేదు. తన పేరన ఆస్తి రాసివ్వడం లేదని కన్నతండ్రినే చంపేశాడు ప్రతాప్, అతని తల్లి సుభద్రమ్మ అని ఊళ్లో వాళ్లు కోపంతో ఊగిపోతున్నారు. ఇలాంటోళ్లను చంపేయక ఇంకా ఎందుకు సార్ ఈ మాటలు అంటున్నారు బయట నుంచి. ‘మాకేం పాపం తెలియదు సార్! ఊళ్లో వాళ్లు చెప్పేది నిజమే అయ్యుంటే నా తమ్ముడిని ఎందుకు చంపుకుంటాను...’ తమ్ముడి కోసం ఏడుస్తూనే చెప్పింది సుభద్రమ్మ. ‘ప్రతాప్ ఊళ్లో కూడా లేడు. వీళ్లు గిల గిల కొట్టుకుంటున్నప్పుడే అరిచాను మా ప్రతాప్‌ని పిలుస్తూ. నా ఏడుపు విని వాడు పరిగెత్తుకొచ్చాడు. అప్పటికే ఏం చేయాలో కాలూ చేయి ఆడలేదు. చూస్తుండగానే తన్నుకులాడటం ఆగిపోయింది సార్!’ చెప్పిన విషయమే మళ్ళీ మళ్లీ చెబుతోంది సుభద్రమ్మ. పోలీసులు ఆలోచనలో పడ్డారు. సుభద్రమ్మ చెప్పిందాన్నిబట్టి చూస్తే వాళ్లు అంతకుముందు మందు తాగారు. ఆ మందు సీసాను స్వాధీనం చేసుకుని పరీక్షించారు. ప్రాబ్లమ్ ఏమీ లేదని నిపుణులు చెప్పారు. పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చేవరకు టైమ్ పడుతుంది. ‘ఊళ్లో వాళ్లు చెప్పినట్టు వీళ్లే చంపారా? అలా అయితే, ఈమె తమ్ముణ్ణి కూడా ఎందుకు చంపుకుంటుంది?’ ఆలోచనలో పడ్డారు పోలీసులు.‘ఇంకా ఏంటి సార్ ఆలోచిస్తారు. ఈ ముసల్దే చంపేసి ఈ నాటకం ఆడుతోంది. నాలుగు తగిలిస్తే నిజం కక్కుతుంది’ అన్నాడు ఊరి పెద్ద. ‘అవునవును’ అన్నారు మిగతా వాళ్లు. భర్త, తమ్ముడు పోయిన దుఃఖం నుంచి సుభద్రమ్మలో భయం గూడు కట్టుకుంది తననేం చేస్తారో అని. పోలీసులు మళ్ళీ విచారణ మొదలుపెట్టారు. ‘సుభద్రమ్మా! మందు ఎక్కడి నుంచి తెచ్చాడు మీ ఆయన?’ అడిగారు పోలీసులు. ‘ఇంట్లనే ఓ బాటిల్ ఉందయ్యా! అదే తాగారు. ఆ... అది సరిపోలేదని మా కొడుకు ఇంటికి వెళ్లి ఇంకో బాటిల్ తెచ్చాడయ్యా’ గుర్తుకు తెచ్చుకుంటూ చెప్పింది సుభద్రమ్మ!పోలీసులు ముఖముఖాలు చూసుకున్నారు. ‘నీ కొడుకు, కోడలు టౌన్కెళ్లారుగా! ఇంటికి తాళం వేసి ఉంటే ఇతనెలా వెళ్లాడు’ గద్దించాడు ఎస్సై.‘నిజమే సార్! వాళ్లు ఎక్కడికైనా వెళితే తాళం చేతులు మా ఇంట్లనే కొయ్యకు తగిలించి వెళతారు. అది మా ఆయనకు తెలుసు. తాళం తీసే వెళ్లి తెచ్చుకున్నాడు..’సుభద్రమ్మ బలంగా చెబుతుండగా ఎస్సై ప్రతాప్ వైపు చూశాడు. అయోమయంగా చూశాడు ప్రతాప్ ఏమీ అర్థంకానట్టు. ‘వాళ్లిద్దరూ పడున్న చోట ఒకటే ఖాళీ బాటిల్ పడి ఉంది. రెండో బాటిల్ ఏమైంది?’ సుభద్రమ్మను అడిగాడు ఎస్సై‘మందు చేదుగా ఉందని తాగిన మా తమ్ముడు అన్నడు సర్! నీకు మందెక్కువై ఆ మాట అంటున్నావ్రా అని మా ఆయనా ఆ మందు తాగాడు! నిజమేన్రోయ్ ఈ మందు మహా చేదుగా ఉంది... దిక్కుమాలినోడు చేదు మందు తెచ్చిపెట్టిండు అని ప్రతాప్‌ను తిట్టుకొని దాన్ని బయటకు విసిరేశాడు’ అంది.ఎస్సై ఆలోచిస్తూనే తన సిబ్బందిని పురమాయించాడు. ఆ బాటిల్‌ను వెతకమని. పోలీసులు ఆ ఇంటి పరిసరాలను అణువణువూ గాలించారు.గుమ్మానికి ఎడమవైపున ప్రతాప్ ఇంటి ముందు కరివేపాకు చెట్టు పొదల్లో ఓ వైన్ బాటిల్ దొరికింది. దానిని వాసన చూసిన పోలీసుల కనుబొమ్మలు ముడిపడ్డాయి. అది పురుగుల మందు వాసన వస్తోంది. ‘క్లూ దొరికింది. ఈ మందుబాటిలే వాళ్లని చంపింది. అయితే, ఈ వైన్ బాటిల్లోకి పురుగుల మందు ఎలా వచ్చింది? ఎవరు కలిపారు? తేలాలి.’ ‘ఏంటిది?’ అడిగాడు ఎస్సై ప్రతాప్‌కి దగ్గరగా చూపుతూ. ప్రతాప్ ఆ మందుబాటిల్ను, దాని వాసన చూడగానే ‘సార్! ఒక్క నిమిషం. ఒక్కసారి ఇంట్లకెళ్లి చూసొస్తా. నాతో రండి’ అన్నాడు.అతనితో పాటు పోలీసు సిబ్బంది పంచాయతీ హాల్ నుంచి బయటకొచ్చారు. ప్రతాప్ ఇంట్లోకి వెళ్లి తన గదిలోని షెల్ఫ్‌లో ఓ మూలకు వెతుకుతున్నాడు. ‘దేనికోసం వెతుకుతున్నావ్’ గద్ధించాడు ఎస్సై.‘వారం క్రితం పొలానికి మందు కొట్టాలని మా నాయన్ని డబ్బులడిగిన. నా భూమిలో పొలం వేసుడే కాకుండా నన్నే డబ్బులు అడుగతావ్రా.. పురుగు పడితే పట్టనీయ్, నాశనం కానీయ్.. అన్నడు.మందెయ్యకపోతే పంట చేతికి రాదు. మా పొలం పక్కన ఉన్న రాములయ్యను అడిగితే ఒకటే డబ్బా ఉందని తన పొలానికి కొట్టాలని చెప్పాడు. పైసలొచ్చినంక ఇస్త.. సగం మందు ఇవ్వమని అడిగా. రాములయ్య సరే అని ఆ రోజు సాయంకాలం ఇంటికే తీసుకొచ్చాడు మందు డబ్బా! మందు పోయడానికి సీసా కోసం వెతికితే ఖాళీ వైన్‌బాటిల్ కనిపించింది. సగం పురుగుల మందు వైన్ బాటిల్లో పోసి, ఈ మూలన ఎవరికంటా పడకుండా జాగ్త్రతగా పెట్టా. మా ఆవిడ పిల్లలతో కలిసి పుట్టింటికి బయల్దేరితే వాళ్లను ఆ ఊళ్లో దిగబెట్టడానికి నేనూ వెళ్లా. ఊర్నొంచి వచ్చినంక పొలానికి మందు కొడదాంలే అనుకున్న. మా అత్తగారి ఇంటి నుంచి టౌన్లో పనుంటే చూసుకుని ఇంటికి వచ్చేసరికి రెండ్రోజులయ్యింది. ఇప్పుడే చూశాను సార్! ఆ బాటిల్ లేదు. మా నాయిన నా దగ్గర మందుబాటిల్ ఉందని వెతికి ఉంటాడు. ఇది దొరికింది. తీసుకెళ్లాడు!’ ఏడుస్తున్నాడు ప్రతాప్. నిజం తేలడంతో ఊరివాళ్లు శాంతించారు. లేకుంటే వారి ఆవేశం వల్ల మరో రెండు ప్రాణాలు బలి అయ్యేవి. చేయని తప్పుకు శిక్షను అనుభవించాల్సి వస్తుందేమో అని భయపడిన వాళ్లకు పోలీసులు నిజ నిర్ధారణ చేసి నేరస్తులు కాదని ఊరటనిచ్చారు. – నిర్మలారెడ్డి -
ఆర్బీఐ మూడు రోజుల పాలసీ సమీక్ష ప్రారంభం
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) మూడు రోజుల సమావేశం సోమవారం ప్రారంభమైంది. 2018–19లో ఇది మూడవ ద్వైమాసిక సమావేశం. గవర్నర్ ఉర్జిత్ పటేల్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల ఈ కమిటీ బుధవారం (ఆగస్టు 1) తన కీలక నిర్ణయాలను ప్రకటించనుంది. ఈ సందర్భంగా బ్యాంకులకు తానిచ్చే రుణ రేటు– రెపోపై (ప్రస్తుతం 6.25 శాతం) ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. ద్రవ్యోల్బణం దాదాపు 5 శాతం వద్ద ఉండటం, అంతర్జాతీయంగా చమురు ధరల తీవ్రత వంటి పరిస్థితులు రెపోపై నిర్ణయానికి ప్రధాన ప్రాతిపదక కానున్నాయి. ద్రవ్యోల్బణంపై ఆందోళన నేపథ్యంలో జూన్ 7 పాలసీ సమావేశం సందర్భంగా రెపోరేటును ఆర్బీఐ పావుశాతం పెంచింది. 2014 జనవరిలో రెపో రేటును పావు శాతం పెంచిన ఆర్బీఐ మళ్లీ ఈ ఏడాది జూన్ 7నే కీలక పాలసీ రేటును పెంచింది. ఈ కాలంలో పలుమార్లు రెపోను తగ్గిస్తూ వచ్చింది. కాకపోతే, గత 2017 ఆగస్టు నుంచి పాలసీ రేట్లను యథాతథంగానే కొనసాగిస్తోంది. -
ఎక్కడుంది మానవత్వం?
► ఆస్తి పంచివ్వలేదని తండ్రిపై దాడి ► సోషల్ మీడియాలో వీడియో బాగలకోటె: అనుబంధాలన్నీ ఆర్థిక బంధాలే అవుతున్నాయి. కుటుంబ సభ్యుల మధ్య కనికరం, ఆప్యాయత భూతద్దం పెట్టినా కనిపించడం లేదు. డబ్బు, ఆస్తులు ఇవ్వకపోతే కన్నవారిని సైతం చావబాదుతున్నారు. కన్న తండ్రి ఆస్తిని పంచడం లేదని ఇద్దరు కొడుకులు తండ్రిని తీవ్రంగా కొట్టి లాక్కెళ్లడంతో తీవ్ర గాయాలపాలైన ఘటన రెండు రోజుల క్రితం బాగలకోటె జిల్లాలో చోటు చేసుకుంది. తండ్రిని కొడుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బాదామి తాలూకాలో ఉన్న నింగాపుర గ్రామంలో శేకçప్ప మనగొళికి 24 ఎకరాల పొలముంది. దానిని పంచివ్వాలని కుమారులు కనకప్ప, యల్లప్ప చాలాకాలం నుంచి గొడవ పడుతున్నారు. కానీ శేకప్ప ఆస్తి పంచి ఇవ్వడానికి ఒప్పుకోక పోవడంతో ఆగ్రహానికి గురైన ఇద్దరు కుమారులు కలిసి సోమవారం తండ్రిని కాళ్ళు చేతులు కట్టి వేసి తీవ్రంగా కొట్టడం జరిగింది. అతన్ని కొంతదూరం ఈడ్చుకుంటు వెళ్లారు. ఈ సంఘటనను ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అది అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. విషయం తెలుసుకున్న గుళదెగుడ్డ పోలీసులు కేసు నమోదు చేసుకుని కసాయి కొడుకులను అరెస్ట్ చేశారు. -
నల్లధన చట్ట నిబంధనలు విడుదల
-
ప్రాణం తీసిన ఆస్తి తగాదా!
-
ఆస్తి కోసం యాసిడ్ తాగమన్న కొడుకు
హైదరాబాద్ : ఆస్తి కోసం కన్న తల్లిదండ్రుల్నే ఆత్మహత్య చేసుకోవాలని వేధింపులకు గురి చేశాడో కొడుకు. ఈ దారుణ ఘటన ఓల్డ్ అల్వాల్ పరిధిలో చోటుచేసుకుంది. స్థానికంగా నివాసం ఉంటున్న రామ్మూరి్, లక్ష్మీభాయిలను గత కొంతకాలంగా కుమారుడు దేవానంద్ ఆస్తి కోసం వేధించటం ప్రారంభించారు. అది కాస్త శ్రుతిమించి యాసిడ్ తాగాలంటూ తల్లిదండ్రులపై ఒత్తిడి తెచ్చాడు. దాంతో కుమారుడి వేధింపులు తట్టుకోలేని వారు ఈరోజు ఉదయం యాసిడ్ తాగారు. ఈ ఘటనలో తల్లి లక్ష్మీభాయి మృతి చెందగా, తండ్రి రాంమూర్తి పరిస్థితి విషమంగా ఉంది. అతడు ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. నిందితుడు దేవానంద్ పరారీలో ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.