ఆస్తి కోసం కన్న తల్లిదండ్రుల్నే ఆత్మహత్య చేసుకోవాలని వేధింపులకు గురి చేశాడో కొడుకు. ఈ దారుణ ఘటన ఓల్డ్ అల్వాల్ పరిధిలో చోటుచేసుకుంది.
హైదరాబాద్ : ఆస్తి కోసం కన్న తల్లిదండ్రుల్నే ఆత్మహత్య చేసుకోవాలని వేధింపులకు గురి చేశాడో కొడుకు. ఈ దారుణ ఘటన ఓల్డ్ అల్వాల్ పరిధిలో చోటుచేసుకుంది. స్థానికంగా నివాసం ఉంటున్న రామ్మూరి్, లక్ష్మీభాయిలను గత కొంతకాలంగా కుమారుడు దేవానంద్ ఆస్తి కోసం వేధించటం ప్రారంభించారు. అది కాస్త శ్రుతిమించి యాసిడ్ తాగాలంటూ తల్లిదండ్రులపై ఒత్తిడి తెచ్చాడు. దాంతో కుమారుడి వేధింపులు తట్టుకోలేని వారు ఈరోజు ఉదయం యాసిడ్ తాగారు. ఈ ఘటనలో తల్లి లక్ష్మీభాయి మృతి చెందగా, తండ్రి రాంమూర్తి పరిస్థితి విషమంగా ఉంది. అతడు ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. నిందితుడు దేవానంద్ పరారీలో ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.