mother dead
-
‘యూట్యూబ్’ చూస్తూ భార్యకు కాన్పు
హోసూరు: పురిటి నొప్పులతో బాధపడుతున్న భార్యను ఆస్పత్రికి తీసుకెళ్లకుండా యూట్యూబ్‌లో వీడియో చూస్తూ ఓ భర్త కాన్పు చేశాడు. మగబిడ్డకు జన్మనిచి్చన ఆమె తీవ్ర రక్తస్రావమై మరణించింది. ఈ ఘటన తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా హనుమంతపురంలో జరిగింది. హనుమంతపురానికి చెందిన మాదే‹Ù(27)కు పోచ్చంపల్లి సమీపంలోని పులియంబట్టికి చెందిన వేడియప్పన్ కూతురు లోకనాయకి(27)తో రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరిద్దరూ అగ్రికల్చర్ కోర్సులో డిగ్రీ చేశారు. ఇంటి వద్ద పెరట్లో సేంద్రియ పద్ధతిలో పండించిన కూరగాయలనే తినేవారు. ఈ క్రమంలో లోకనాయకి గర్భం దాల్చగా.. ఇంటి వద్దే సహజసిద్ధంగా ప్రసవం చేయాలని వారిద్దరూ నిర్ణయించుకున్నారు. ఇందుకోసం మాదేష్ యూట్యూబ్‌లో వీడియోలు చూస్తుండేవాడు. మంగళవారం తెల్లవారుజామున లోకనాయకికి పురిటినొప్పులు ప్రారంభమయ్యాయి. ఆమెను మాదేష్ ఆస్పత్రికి తీసుకెళ్లకుండా.. ముందుగా నిర్ణయించుకున్న ప్రకారం యూట్యూబ్‌లో చూస్తూ కాన్పుకు సాయం చేశాడు. మగ బిడ్డకు జన్మనిచి్చన అనంతరం.. లోకనాయకి తీవ్ర రక్తస్రావంతో కోమాలోకి వెళ్లింది. ఆ తర్వాత ఆమెను స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లగా.. పరిశీలించిన డాక్టర్లు లోకనాయకి మరణించినట్లు తెలిపారు. -
అమ్మా లే అమ్మా.. రోడ్డు ప్రమాదంలో తల్లి మృతి
పెద్దవంగర: లాలించి జోల పాడి నిద్రపుచ్చే తల్లిని శాశ్వత నిద్ర ఆవహించిందని తెలియక అమ్మా లే అమ్మా.. పాలు ఇవ్వమ్మా.. అంటూ తల్లి మృతదేహంపై పాల కోసం ఓ పసికందు ఆరాట పడిన విషాద ఘటన ఇది. ఈ హృదయ విదారక ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. పెద్దవంగర మండలం కొరిపల్లి గ్రామానికి చెందిన తేలుకుంట్ల స్వరూప (24), నరేష్‌లకు ఇద్దరు పిల్లలు మూడేళ్ల ఆకాంక్ష, పదినెలల ఆధ్య. నరేష్ ఇటీవల సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం కేంద్రంలో ఓ ప్లాట్‌ను కొనుగోలు చేశాడు. శుక్రవారం రిజిస్టేషన్ చేయించుకుని స్వగ్రామం కొరిపల్లికి ద్విచక్రవాహనంపై కుటుంబంతో సహా తిరిగి వస్తున్న క్రమంలో రాత్రి తిర్మలగిరి మండల పరిధిలోని తొండ గ్రామ శివారులో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో వెనుకనుంచి లారీ ఢీకొట్టడంతో స్వరూప అక్కడికక్కడే మృతి చెందింది. చిన్నారులకు గాయాలు కావడంతో హైదరాబాద్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. పది నెలల ఆద్య తల్లి స్వరూప మరణించిన విషయం తెలియక పాలకోసం అల్లాడిపోయింది. చనిపోయిన తల్లి రొమ్ము మీద పడి పాల కోసం ఆరాటపడటం చూసిన వారు కంటతడి పెట్టారు. ఇది కూడా చదవండి: కొడుకు శవాన్ని చేతుల్తో మోశా.. -
ఆస్తి కోసం కొడుకు రాక్షసత్వం.. భార్యను పుట్టింటికి పంపించి..
Son Killed Mother in Sangareddy: నవమాసాలు మోసిన కన్న తల్లినే పొట్టన పెట్టుకున్నాడొక కసాయి కొడుకు. ఈ దారుణం సంగారెడ్డి జిల్లాలోని వట్పల్లి మండలం పోతులబోగుడా గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. ఎస్ఐ దశరథ్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మొండి మల్లమ్మ (55) పేరునున్న నాలుగెకరాల భూమిని తన పేరున రాయాలని, బంగారు ఆభరణాలు కూడా ఇవ్వాలని కుమారుడు మురళి తాగివచ్చి రోజూ గొడవ పడేవాడు. తల్లిని ఎలాగైనా చంపి బంగారు ఆభరణాలు తీసుకోవాలని పథకం రచించాడు. ఈ క్రమంలో మురళి తన భార్యను ఆమె తల్లి ఇంటికి పంపించాడు. బుధవారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో తల్లి గొంతు నులిమి హతమార్చాడు. తర్వాత ఏమీ తెలియనట్టు చుట్టు పక్కల వారికి తల్లి అనారోగ్యంతో మరణించిందని నమ్మబలికాడు. గ్రామస్తులకు అనుమానం రావడంతో పోలీసులకు సమాచారం అందించారు. జోగిపేట సీఐ శ్రీనివాస్, స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని హత్య జరిగిన తీరును పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జోగిపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతురాలి అల్లుడు జనార్దన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. -
గుండెల్ని పిండే ఘటన: అమ్మా లే అమ్మ.. అమ్మా లే అమ్మ!
భువనేశ్వర్/బొలంగీరు: తల్లి ఒడి ప్రతి బిడ్డకు అమోఘం. ప్రాణం లేకున్నా తల్లి ఒడిని వీడేందుకు ఇష్టపడని ఓ చిన్నారి ఏకంగా 2 రోజుల పాటు తల్లి శవంతో కలిసి జీవించడం హృదయాన్ని కలచివేస్తోంది. బొలంగీరు సగరపడా శివాలయం దగ్గర ఈ హృదయ విదారక సంఘటన సోమవారం వెలుగుచూసింది. ఇళ్లల్లో పాచి పనులు చేసుకుని తన మూడేళ్ల పాపని పోషించుకుంటున్న కున్ని నాయక్ కొన్నిరోజుల క్రితం అనారోగ్యంతో మంచానపడింది. సరిగ్గా రెండు రోజుల క్రితం ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఆమె చనిపోయింది. ఈ విషయం ఎరుగని ఆ పసిబిడ్డ తల్లి పడుకునే ఉందనుకుని మృతదేహంతో నిద్రాహారాలు మానేసి 2 రోజులు గడిపింది. మూడో రోజు నాటికి తన అమ్మ నోటి నుంచి పురుగులు బయటకు రావడంతో కంగారుపడిన ఆ పసిబిడ్డ ఇరుగుపొరుగు వారికి ఈ విషయం తెలియజేసింది. దీంతో తన తల్లి చనిపోయిన వాస్తవం బయటపడింది. ఇది తెలుసుకుని కన్నీరుమున్నీరవుతున్న ఆ పసికందు అమ్మా లే అమ్మ.. అమ్మా లే అమ్మ.. నాకు అమ్మ కావాలి.. అని ఆ బాలిక ఏడుపు విన్నవారి గుండె బరువెక్కింది. చిన్న బిడ్డకు ఎంత పెద్దకష్టం వచ్చిందని, ఈ పసిపాప ఆలనా పాలనా ఎవరు చూసుకుంటారని తల్లడిల్లుతున్నారు. చదవండి: (దేవుడా ఎంతపని చేశావయ్యా.. పెళ్లై నెలైనా కాలేదు.. ఇంతలోనే) వివరాలిలా ఉన్నాయి.. భర్త మరణించిన తర్వాత పుట్టినింటి వారు, మెట్టినింటి వారు నిరాకరించడంతో కున్ని నాయక్ బతుకు వీధిన పడింది. చేత చిన్నారి పసి పాపను పట్టుకుని బొలంగీరు సగరపడా ప్రాంతంలోని శివాలయం దగ్గర ఒకేఒక్క గది ఉన్న ఇంట్లో అద్దెకు చేరింది. ఆ ఇంటా ఈ ఇంటా పాచి పనులు చేసుకుని ఇరుగుపొరుగు వారి ఆదరణతో జీవితం సాగనంపింది. ఇలా ఏడాదిన్నర గడిచేసరికి కున్ని తరచూ అనారోగ్యం బారినపడేది. ఎప్పటిలాగే ఒంట్లో బాగోలేకపోవడంతో కున్ని నాయక్ నిద్రపోయింది. అలా నిద్రలోనే ఉంటుండగా ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఆమె ప్రాణాలు విడిచింది. ఇది తెలియని ఆ పసి బిడ్డ ఇరుగుపొరుగు వారు అమ్మ ఏదని అడిగితే ఒంట్లో బాగోలేక అమ్మ నిద్ర పోతుందని చెప్పేది. ఉదయం తన తల్లి నోటి నుంచి పురుగులు వస్తున్న విషయం బయటకు రావడంతో తన తల్లి చనిపోయినట్లు తెలుసుకుని ఆ పసి హృదయం రోదించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి మృతదేహం తరలించారు. చదవండి: (భర్త, కుమార్తెను వదిలి ప్రియుడితో వెళ్లిపోయి.. ఆది పరాశక్తి అవతారంలో..) -
చినజీయర్ స్వామిని పరామర్శించిన సీఎం జగన్
సాక్షి, అమరావతి: శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్ స్వామిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదివారం ఫోన్ చేసి పరామర్శించారు. శనివారం చినజీయర్ స్వామి మాతృమూర్తి మంగతాయారు(85) అస్తమించారు. సీఎం వైఎస్ జగన్ స్వయంగా చినజీయర్ స్వామికి ఫోన్ చేసి ఆయన తల్లి మంగతాయారు మృతిపై సంతాపం వ్యక్తం చేస్తూ.. తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. (చినజీయర్‌స్వామికి మాతృ వియోగం) -
పాపం పసివాళ్లు
కళ్లు తెరవకుండానే ఓ పసికందు మృతిచెందగా, పుట్టిన పది రోజులకే మరో శిశువు తల్లిని కోల్పోయింది. ఈ రెండు సంఘటనలు రాజన్న సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల్లో బుధవారం జరిగాయి. ఎల్లారెడ్డిపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఓ మగ బిడ్డ పురిట్లోనే మృతిచెందింది. కోరుట్ల పట్టణంలోని అల్లమయ్యగుట్ట చింతలవాడకు చెందిన గొడిసెల అనిత(26) పాపకు జన్మనిచ్చిన పది రోజులకు అనారోగ్యంతో కన్నుమూసింది. కోరుట్ల: బాలింతగా ఉన్న ఆ తల్లి.. పండంటి బిడ్డకు జన్మనిచ్చి అనారోగ్యానికి గురైంది.. చికిత్సకు డబ్బుల్లేని పేదరికంలో ఉండి దాతల సాయం ఆర్థించగా స్పందించేలోపు భర్త చేతుల్లో పసికందును ఉంచి కన్నుమూసింది. కోరుట్ల పట్టణంలోని అల్లమయ్యగుట్ట చింతలవాడలో గొడిసెల సతీశ్–అనిత(26) దంపతుల దీనగాథ ఇదీ. గొడిసెల సతీశ్ కొంత కాలంగా పట్టణంలోని వెటర్నరీ కళాశాలలో కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. తనకు వచ్చే అరకొర జీతంతో కుటుంబం గడుపుతున్న క్రమంలో అనిత గర్భం దాల్చింది. పేదరికంలో ఉన్న సతీశ్ కోరుట్ల ప్రభుత్వాసుపత్రిలో పరీక్షలు చేయించి మందులు వాడాడు. 15 రోజుల క్రితం నెలలు నిండిన క్రమంలో అనితను ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా థైరాయిడ్ సమస్య ఉందని వైద్యులు గుర్తించారు. ప్రసవ సమయంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించడంతో జగిత్యాల ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. పది రోజుల క్రితం అనిత పాపకు జన్మనిచ్చింది. ఆ వెంటనే తీవ్ర అనారోగ్యానికి గురైంది. వైద్యులు చికిత్స కోసం హైద్రాబాద్ వెళ్లాలని సూచించారు. వెంటాడిన పేదరికం.. కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేస్తున్న సతీశ్ పేదరికం కారణంగా బాలింతగా ఉన్న అనితను కరీంనగర్‌లోని ప్రతిమ ఆస్పత్రిలో చేర్పించాడు. అక్కడ చికిత్స చేయించడానికి రోజుకు కనీసం రూ.10 నుంచి రూ.15వేలు ఖర్చు చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో తన వద్ద ఉన్న డబ్బులు అయిపోవడంతో దాతల సాయం ఆర్థించారు. స్పందించేలోపు.. బాలింతగా ఉన్న అనిత థైరాయిడ్ సమస్యతో ప్రాణాపాయ స్థితిలో ఉండటాన్ని గుర్తించిన స్థానిక సీపీఐ నాయకులు చెన్న విశ్వనాథం, యువజన సంఘాల నాయకులు వాసాల గణేశ్ ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. దాతల ఆర్థికసాయంతో డబ్బులు సమకూర్చి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అనితకు అందించే ప్రయత్నం చేస్తున్నారు. అనితకు సుమారు రూ.25 వేలు అందించేందుకు ముందుకు వచ్చారు. ఇంతలోనే పరిస్థితి విషమించి బుధవారం ఉదయం ఆసుపత్రిలో మృతి చెందింది. పది రోజుల పసికందుతో సతీశ్ దయనీయస్థితిలో భార్య అనిత అంత్యక్రియలు జరిపించిన తీరు అందరినీ కదిలించింది. కళ్లు తెరవకుండానే.. ఎల్లారెడ్డిపేట ఆరోగ్య కేంద్రంలో శిశువు మృతి ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): తొమ్మిది నెలలు తల్లికడుపులో క్షేమంగా పెరిగిన బాబు లోకం చూడకుండానే కన్నుమూశాడు. పండంటి మగ బిడ్డకు జన్మనివ్వగా ఆ బాబు డాక్టర్ల నిర్లక్ష్యంతో కడుపులోనే మృతి చెందాడు. బాధితుల కథనం ప్రకారం.. వీర్నపల్లి మండలం వన్‌పల్లి గ్రామానికి చెందిన గడ్డం పూజిత పురిటినొప్పులతో ఎల్లారెడ్డిపేటలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చేరింది. ఉదయం 8.30 గంటలకు పూజితను ఆస్పత్రికి తీసుకురాగా వైద్యాధికారి సత్యజిత్‌రే పరీక్షించి కాన్పు కోసం ఆడ్మిట్ చేశారు. పూజితకు కాన్పు చేయాలని స్టాఫ్‌నర్సు గీత, ఏఎన్ఎం మంజుల, ఆశ వర్కర్ జమునకు సూచించారు. ఉదయం నుంచి పురిటి నొప్పులు వస్తున్నా కాన్పు చేయకుండా సాయంత్రం వరకు నీరిక్షించారు. బంధువుల ఒత్తిడితో పూజితకు చిన్న ఆపరేషన్ చేసి సాయంత్రం కాన్పు చేశారు. అయితే అప్పటికే కడుపులోని బిడ్డ మరణించింది. ఉదయం ఆస్పత్రికి తీసుకురాగా సాయంత్రం వరకు వైద్యం చేయకుండా నిర్లక్ష్యం చేయడంతో కడుపులో బాబు మరణించాడని పూజిత కుటుంబ సభ్యులు గడ్డం నాగవ్వ, మల్యాల రాజవ్వ ఆరోపించారు. వైద్యుడిపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న అఖిల పక్ష నాయకులు వర్ధవెల్లి స్వామి, లక్ష్మణ్ ఆస్పత్రికి వెళ్లి సంఘటనపై డాక్టర్‌ను నిలదీశారు. పసికందు మృతిపై విచారణ జరిపి బాధ్యులపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై వైద్యాధికారి సత్యజిత్రేను వివరణ కోరగా సాధారణ కాన్పు చేయాలని సాయంత్రం వరకు వేచి ఉంచామన్నారు. ఇందులో వైద్యసిబ్బంది నిర్లక్ష్యం ఏమీ లేదని తెలిపారు. ఉమ్మినీరు లేకనే బాబు మృతిచెందాడని చెప్పారు. -
అమ్మా..నన్నొదిలి వెళ్లిపోయావా..
పెద్దపల్లి, జ్యోతినగర్(రామగుండం) : అమ్మా..నన్ను విడిచి పోయావా..నేను ఎలా బతకాలి..నాన్న ఎటు పోయాడో తెలియదు. నాకు అన్నీ నీవై పెంచావు..ఇప్పుడు అనాథను చేసి నన్ను వదిలి వెళ్లిపోతున్నావా అమ్మా... అని తల్లి లక్ష్మీ(37) మృతదేహం వద్ద రోదిస్తున్న లావణ్యను చూసి కాలనీవాసులు కన్నీరుకార్చారు. ఈ విషాదకర సంఘటన జ్యోతినగర్‌లో చోటు చేసుకుంది.æ ఎన్టీపీసీ రామగుండం సుభాష్‌నగర్‌కు చెందిన అక్కపాక లక్ష్మీ–మల్లయ్య దంపతులు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న క్రమంలో లావణ్య జన్మించింది. లక్ష్మీ భర్త మల్లయ్య ఏడేళ్లక్రితం ఇంటి నుంచి వెళ్లిపోయాడు. నేటికి ఆచూకీ లేదు. భర్త ఇంటి నుంచి వెళ్లిపోయినా లక్ష్మీ(37) కూలీ పనులు చేసుకుంటూ కూతురు లావణ్యను అల్లారుముద్దుగా పెంచుకుంటోంది. లావణ్య జెడ్పీ హైస్కూల్లో 9వ తరగతి చదువుతోంది. కూలీ పనులు చేసుకుంటున్న లక్ష్మీ అనారోగ్యం పాలైంది. సమయానికి సరైన వైద్యచికిత్స అందకపోవడంతో కామెర్లు సోకి సోమవారం తెల్లవారు జామున మృతి చెందింది. లక్ష్మీ కూతురు లావణ్య రోదనలు మిన్నంటాయి. లావణ్యను ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు. -
పాపం.. పసివాళ్లు!
నడింపల్లె(రైల్వేకోడూరు రూరల్): ఏడాది క్రితం తండ్రి మృతి చెందాడు.. రెండు రోజుల క్రితం తల్లి మృతి చెందింది. దీంతో అమ్మానాన్నలను కోల్పోయిన ఐదుగురు ఆడ పిల్లలు అనాథలుగా మిగిలారు. ఈ విషాదకర సంఘటన రైల్వేకోడూరు మండలం నడింపల్లెలో చోటు చేసుకుంది. రైల్వేకోడూరు మండలం చియ్యవరం పంచాయతీ నడింపల్లెకు చెందిన రజక వృత్తి చేసుకునే మడితపు శివయ్య(35)కు తన మేనత్త కూతురైన బుజ్జమ్మ(31)తో వివాహమైంది. కొడుకు కావాలనుకున్న శివయ్య ఐదుగురు ఆడపిల్లలు సంతానం కలిగినా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించలేదు. ఈ నేపథ్యంలో కూలి పనులు కరువై, కుటుంబ పోషణ భారమై ఏడాది క్రితం విష ద్రావణం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. భర్త మరణాన్ని తట్టుకోలేక, పిల్లలను పోషించుకునే స్థోమత లేక బుజ్జమ్మ గతంలో మూడుసార్లు ఆత్మహత్యకు యత్నించింది. చివరగా ఈ నెల 3వ తేదీన విష ద్రావణం తాగింది. విషయం తెలుసుకున్న బంధువులు తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం మృతి చెందింది. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని సోమవారం సాయంత్రం నడింపల్లెకు తీసుకొచ్చారు. గతంలో ఆమె భర్తను ఖననం చేసిన ప్రదేశంలోనే మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. అనాథలుగా మారిన పిల్లలు ఆలనా.. పాలనా చూడాల్సిన తండ్రి అర్థంతరంగా కన్ను మూశాడు. తల్లి కూడా తండ్రి చెంతకే చేరింది. దీంతో వారి ఐదుగురుఉ సంతానం అనాథలుగా మారారు. దీంతో మృతురాలి మామ వెంకట సుబ్బయ్య తాను అండగా ఉంటానని తెలిపారు. వీరి మొదటి కుమార్తె శిరీషా(11), రెండవ కుమార్తె ప్రసన్న (9) ముక్కావారిపల్లెలోని కస్తూర్బా పాఠశాలలో చదువుకుంటున్నారు. మూడవ కుమార్తె మల్లీశ్వరి(8) చిత్తూరు జిల్లా ఏర్పేడులో ఉన్న పెద్దమ్మ వద్ద ఉంటూ చదువుకుంటోంది. నాల్గవ కుమార్తె నందిని(7)స్థానిక పాఠశాలలో రెండవ తరగతి చదవుతుండగా, నాలుగేళ్ల వయస్సు ఉన్న లిజిత స్థానిక అంగన్వాడీ పాఠశాలకు వెళుతోంది. అమ్మా.. లేయ్ తల్లి మరణించిన విషయం తెలియని మృతురాలి చిన్నకూతురు మృతదేహం వద్దకు వెళ్లి.. అమ్మా.. లేయ్ అమ్మా.. ఇంటికి పోదాం.. అంటుంటే ఈ దృశ్యాన్ని చూసిన వారు చలించి పోయారు. పాపం.. చిన్న పిల్లలు.. దేవుడా.. వీరేం పాపం చేశారని.. ఇంత అన్యాయం చేశావంటూ ప్రతి ఒక్కరూ కంట తడిపెట్టారు. స్పందించిన ఐసీడీఎస్ పీడీ తల్లి మరణంతో పిల్లలు అనాథలుగా మారారన్న విషయం తెలుసుకున్న ఐసీడీఎస్ పీడీ రాఘవరావు స్పందించి ఏసీడీపీఓ లూక్‌ను పంపించి వివరాలు తెలుసుకున్నారు. వారికి అండగా ఉంటామని తెలిపారు. స్థానిక ఎంపీటీసీ రవికుమార్, జెడ్పీటీసీ సభ్యురాలు మారెళ్ల రాజేశ్వరిలు మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. -
పాపం.. పసివాళ్లు!
నడింపల్లె (రైల్వేకోడూరు రూరల్): ఏడాది క్రితం తండ్రి మృతి చెందాడు.. రెండు రోజుల క్రితం తల్లి మృతి చెందింది. దీంతో అమ్మానాన్నలను కోల్పోయిన ఐదుగురు ఆడ పిల్లలు అనాథలుగా మిగిలారు. ఈ విషాదకర సంఘటన రైల్వేకోడూరు మండలం నడింపల్లెలో చోటు చేసుకుంది. రైల్వేకోడూరు మండలం చియ్యవరం పంచాయతీ నడింపల్లెకు చెందిన రజక వృత్తి చేసుకునే మడితపు శివయ్య(35)కు తన మేనత్త కూతురైన బుజ్జమ్మ(31)తో వివాహమైంది. కొడుకు కావాలనుకున్న శివయ్య ఐదుగురు ఆడపిల్లలు సంతానం కలిగినా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించలేదు. ఈ నేపథ్యంలో కూలి పనులు కరువై, కుటుంబ పోషణ భారమై ఏడాది క్రితం విష ద్రావణం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. భర్త మరణాన్ని తట్టుకోలేక, పిల్లలను పోషించుకునే స్థోమత లేక బుజ్జమ్మ గతంలో మూడుసార్లు ఆత్మహత్యకు యత్నించింది. చివరగా ఈ నెల 3వ తేదీన విష ద్రావణం తాగింది. విషయం తెలుసుకున్న బంధువులు తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం మృతి చెందింది. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని సోమవారం సాయంత్రం నడింపల్లెకు తీసుకొచ్చారు. గతంలో ఆమె భర్తను ఖననం చేసిన ప్రదేశంలోనే మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. అనాథలుగా మారిన పిల్లలు ఆలనా.. పాలనా చూడాల్సిన తండ్రి అర్థంతరంగా కన్ను మూశాడు. తల్లి కూడా తండ్రి చెంతకే చేరింది. దీంతో వారి ఐదుగురుఉ సంతానం అనాథలుగా మారారు. దీంతో మృతురాలి మామ వెంకట సుబ్బయ్య తాను అండగా ఉంటానని తెలిపారు. వీరి మొదటి కుమార్తె శిరీషా(11), రెండవ కుమార్తె ప్రసన్న (9) ముక్కావారిపల్లెలోని కస్తూర్బా పాఠశాలలో చదువుకుంటున్నారు. మూడవ కుమార్తె మల్లీశ్వరి(8) చిత్తూరు జిల్లా ఏర్పేడులో ఉన్న పెద్దమ్మ వద్ద ఉంటూ చదువుకుంటోంది. నాల్గవ కుమార్తె నందిని(7)స్థానిక పాఠశాలలో రెండవ తరగతి చదవుతుండగా, నాలుగేళ్ల వయస్సు ఉన్న లిజిత స్థానిక అంగన్వాడీ పాఠశాలకు వెళుతోంది. అమ్మా.. లేయ్ తల్లి మరణించిన విషయం తెలియని మృతురాలి చిన్న కూతురు మృతదేహం వద్దకు వెళ్లి.. అమ్మా.. లేయ్ అమ్మా.. ఇంటికి పోదాం.. అంటుంటే ఈ దృశ్యాన్ని చూసిన వారు చలించి పోయారు. పాపం.. చిన్న పిల్లలు.. దేవుడా.. వీరేం పాపం చేశారని.. ఇంత అన్యాయం చేశావంటూ ప్రతి ఒక్కరూ కంట తడిపెట్టారు. స్పందించిన ఐసీడీఎస్ పీడీ తల్లి మరణంతో పిల్లలు అనాథలుగా మారారన్న విషయం తెలుసుకున్న ఐసీడీఎస్ పీడీ రాఘవరావు స్పందించి ఏసీడీపీఓ లూక్‌ను పంపించి వివరాలు తెలుసుకున్నారు. వారికి అండగా ఉంటామని తెలిపారు. స్థానిక ఎంపీటీసీ రవికుమార్, జెడ్పీటీసీ సభ్యురాలు మారెళ్ల రాజేశ్వరిలు మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. -
కన్నకొడుకును కడసారి చూసుకోలేదు..
మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు నిజామోద్దీన్ తల్లి మృతి కోరుట్ల : చివరిక్షణంలోనైనా చిన్నకొడుకు తన చెంతకు చేరతాడని ఆశపడ్డ ఆ తల్లి ఆశలు ఆవిరయ్యాయి. ‘కొడుకా... వనం వీడి జనంలోకి రా..’ అంటూ ఆ మాతృమూర్తి పడ్డ ఆరాటం మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు నిజాముద్దీన్‌ను కరిగించలేకపోయింది. ఏ క్షణంలోనైనా కొడుకు తనను చూసేందుకు వస్తాడని ఆశపడ్డ ఆ తల్లి చివరికి తుదిశ్వాస విడిచింది. 30 ఏళ్ల క్రితం అజ్ఞాతంలోకి వెళ్లి ప్రస్తుతం మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు నిజాముద్దీన్ తల్లి రాజుబీ(88) బుధవారం అనారోగ్యంతో కన్నుమూసింది. కోరుట్ల రవీంద్రరోడ్ ఏరియాలో నివాసముంటే ఫక్రుద్దీన్–రాజుబీ దంపతులకు ఎనిమిది మంది సంతానం. వీరిలో ఐదుగురు మగపిల్లలు, ముగ్గురు ఆడపిల్లలు. మగవాళ్లలో అందరికీ కంటే చిన్నవాడైన నిజాముద్దీన్‌పై తల్లి రాజుబీకి అంతులేని ప్రేమ. 30 ఏళ్ల క్రితం 1980–83 సమయంలో కోరుట్లలో డిగ్రీ చదువుతున్న సమయంలో నిజాముద్దీన్ రాడికల్ స్టూడెంట్ యూనియన్ నాయకుడిగా కొనసాగాడు. 1985లో పీపుల్స్‌వార్‌లో అజ్ఞాత సభ్యుడిగా చేరారు. ఆ తర్వాత పీపుల్స్‌వార్ టెక్ ఇన్చార్జిగా కొనసాగారు. పలు కీలక కేడర్లలో పనిచేసిన నిజాముద్దీన్ ప్రస్తుతం కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్నట్లు పోలీసు వర్గాల సమాచారం. అజ్ఞాతంలోకి వెళ్లిన నాటి నుంచి తన తల్లిదండ్రులను ఏనాడు కలుసుకోకపోవడం గమనార్హం. ఏడాదికోసారి పోలీసులు వచ్చి నిజాముద్దీన్‌ను జనజీవన స్రవంతిలో కలవాలని కోరాలని చెప్పినప్పుడల్లా కొడుకు కోసం రాజుబీ కన్నీరుమున్నీరుగా విలపించేది. ఎప్పటికైనా కొడుకు తన వద్దకు చేరతాడని ఆశపడేది. మూడేళ్ల క్రితం తండ్రి ఫక్రుద్దీన్ చనిపోయిన సమయంలోనూ నిజాముద్దీన్ జాడ తెలియరాలేదు. ప్రస్తుతం తల్లి రాజుబీ చనిపోవడంతో మరోసారి ఈ ప్రాంతవాసులు నిజాముద్దీన్ ఎక్కడున్నాడో అని చర్చించుకుంటున్నారు. -
ప్రాణం తీసిన ఆస్తి తగాదా!
-
ఆస్తి కోసం యాసిడ్ తాగమన్న కొడుకు
హైదరాబాద్ : ఆస్తి కోసం కన్న తల్లిదండ్రుల్నే ఆత్మహత్య చేసుకోవాలని వేధింపులకు గురి చేశాడో కొడుకు. ఈ దారుణ ఘటన ఓల్డ్ అల్వాల్ పరిధిలో చోటుచేసుకుంది. స్థానికంగా నివాసం ఉంటున్న రామ్మూరి్, లక్ష్మీభాయిలను గత కొంతకాలంగా కుమారుడు దేవానంద్ ఆస్తి కోసం వేధించటం ప్రారంభించారు. అది కాస్త శ్రుతిమించి యాసిడ్ తాగాలంటూ తల్లిదండ్రులపై ఒత్తిడి తెచ్చాడు. దాంతో కుమారుడి వేధింపులు తట్టుకోలేని వారు ఈరోజు ఉదయం యాసిడ్ తాగారు. ఈ ఘటనలో తల్లి లక్ష్మీభాయి మృతి చెందగా, తండ్రి రాంమూర్తి పరిస్థితి విషమంగా ఉంది. అతడు ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. నిందితుడు దేవానంద్ పరారీలో ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
కుటుంబం ఆత్మహత్యాయత్నం, తల్లి మృతి
కరీంనగర్ : కరీంనగర్ జిల్లాలో ఓ కుటుంబం ఆత్మాహత్యాయత్నానికి పాల్పడింది. గోదావరి ఖని మండలం జనగామ పోతన కాలనీలో ఇద్దరు కుమారులు సహా ఓ తల్లి పురుగుల మందు తాగింది. ఈ ఘటనలో తల్లి మృతి చెందగా, ఇద్దరు కుమారుల పరిస్థితి విషమంగా ఉంది. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా కుటుంబ కలహాల కారణంగానే గృహిణి ఈ ఘటనకు పాల్పడినట్లు సమాచారం. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.