హోసూరు: పురిటి నొప్పులతో బాధపడుతున్న భార్యను ఆస్పత్రికి తీసుకెళ్లకుండా యూట్యూబ్‌లో వీడియో చూస్తూ ఓ భర్త కాన్పు చేశాడు. మగబిడ్డకు జన్మనిచి్చన ఆమె తీవ్ర రక్తస్రావమై మరణించింది. ఈ ఘటన తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా హనుమంతపురంలో జరిగింది. హనుమంతపురానికి చెందిన మాదే‹Ù(27)కు పోచ్చంపల్లి సమీపంలోని పులియంబట్టికి చెందిన వేడియప్పన్ కూతురు లోకనాయకి(27)తో రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరిద్దరూ అగ్రికల్చర్ కోర్సులో డిగ్రీ చేశారు.
ఇంటి వద్ద పెరట్లో సేంద్రియ పద్ధతిలో పండించిన కూరగాయలనే తినేవారు. ఈ క్రమంలో లోకనాయకి గర్భం దాల్చగా.. ఇంటి వద్దే సహజసిద్ధంగా ప్రసవం చేయాలని వారిద్దరూ నిర్ణయించుకున్నారు. ఇందుకోసం మాదేష్ యూట్యూబ్‌లో వీడియోలు చూస్తుండేవాడు. మంగళవారం తెల్లవారుజామున లోకనాయకికి పురిటినొప్పులు ప్రారంభమయ్యాయి. ఆమెను మాదేష్ ఆస్పత్రికి తీసుకెళ్లకుండా.. ముందుగా నిర్ణయించుకున్న ప్రకారం యూట్యూబ్‌లో చూస్తూ కాన్పుకు సాయం చేశాడు. మగ బిడ్డకు జన్మనిచి్చన అనంతరం.. లోకనాయకి తీవ్ర రక్తస్రావంతో కోమాలోకి వెళ్లింది. ఆ తర్వాత ఆమెను స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లగా.. పరిశీలించిన డాక్టర్లు లోకనాయకి మరణించినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment