pregnent lady
-
‘యూట్యూబ్’ చూస్తూ భార్యకు కాన్పు
హోసూరు: పురిటి నొప్పులతో బాధపడుతున్న భార్యను ఆస్పత్రికి తీసుకెళ్లకుండా యూట్యూబ్‌లో వీడియో చూస్తూ ఓ భర్త కాన్పు చేశాడు. మగబిడ్డకు జన్మనిచి్చన ఆమె తీవ్ర రక్తస్రావమై మరణించింది. ఈ ఘటన తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా హనుమంతపురంలో జరిగింది. హనుమంతపురానికి చెందిన మాదే‹Ù(27)కు పోచ్చంపల్లి సమీపంలోని పులియంబట్టికి చెందిన వేడియప్పన్ కూతురు లోకనాయకి(27)తో రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరిద్దరూ అగ్రికల్చర్ కోర్సులో డిగ్రీ చేశారు. ఇంటి వద్ద పెరట్లో సేంద్రియ పద్ధతిలో పండించిన కూరగాయలనే తినేవారు. ఈ క్రమంలో లోకనాయకి గర్భం దాల్చగా.. ఇంటి వద్దే సహజసిద్ధంగా ప్రసవం చేయాలని వారిద్దరూ నిర్ణయించుకున్నారు. ఇందుకోసం మాదేష్ యూట్యూబ్‌లో వీడియోలు చూస్తుండేవాడు. మంగళవారం తెల్లవారుజామున లోకనాయకికి పురిటినొప్పులు ప్రారంభమయ్యాయి. ఆమెను మాదేష్ ఆస్పత్రికి తీసుకెళ్లకుండా.. ముందుగా నిర్ణయించుకున్న ప్రకారం యూట్యూబ్‌లో చూస్తూ కాన్పుకు సాయం చేశాడు. మగ బిడ్డకు జన్మనిచి్చన అనంతరం.. లోకనాయకి తీవ్ర రక్తస్రావంతో కోమాలోకి వెళ్లింది. ఆ తర్వాత ఆమెను స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లగా.. పరిశీలించిన డాక్టర్లు లోకనాయకి మరణించినట్లు తెలిపారు. -
మలక్ పెట్ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో దారుణం
-
ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో మమతా అనే బాలింత మృతి
-
మానవత్వం: మమతమ్మా... నీ మేలు మరువనమ్మా!
సమైక్య భావన స్ఫూర్తి గురించి చెప్పడానికి... పెద్ద పెద్ద సిద్ధాంతాలే అక్కర్లేదు. చిన్న సంఘటనలు చాలు! ఆరోజు ఏమైందంటే... థానే (ముంబై)లోని దివ రైల్వేస్టేషన్, ప్లాట్‌ఫామ్ నంబర్:1 ఎప్పటిలాగే ఆ ఉదయం రైలు బండ్ల శబ్దాలు, ప్రయాణికుల అరుపులు, కేకలతో ౖరైల్వేస్టేషన్ సందడిగా ఉంది. తిత్వాల ప్రాంతానికి చెందిన నజ్‌మింజహాన్ తన భర్త ఫసిముద్దీన్తో కలిసి ప్లాట్‌ఫామ్ పైకి వచ్చింది.ఆమె గర్భిణి. రొటీన్–చెకప్‌లో భాగంగా నాయర్ హాస్పిటల్ వెళ్లడానికి రైల్వేస్టేషన్‌కు వచ్చింది. కొద్దిసేపటి తరువాత... ఆమెకు పురిటినొప్పులు మొదలయ్యాయి. భర్త ఆందోళన పడుతున్నాడు. అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు గానీ ఏం చేయాలో ఎవరికీ పాలుపోవడంలేదు. ‘ఎవరో ఒకరు ఆమెను హాస్పిటల్‌కు తీసుకెళతారులే’ అని ఎవరికి వారు అనుకుంటున్నట్లుగా ఉంది పరిస్థితి. కొందరు మాత్రం రైల్వే అధికారులకు ఫోన్ చేశారు. హుటాహుటిన రైల్వే అధికారులతోపాటు అక్కడికి వచ్చింది ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ మమత దంగి. నొప్పులు ఎక్కువయ్యాయి. ప్లాట్‌ఫామ్‌పై ఉన్న మహిళా రైల్వే ఉద్యోగులు, మహిళా ప్రయాణికులతో మాట్లాడి వారిని నజ్‌మింజహాన్ దగ్గరకు తీసుకువచ్చింది మమత. అందుబాటులో ఉన్న వస్తువులతో మేక్‌షిఫ్ట్ క్లాత్ కర్టెన్ను తయారుచేసింది. అందరిలో ఉత్కంఠ! ఏమవుతుందో ఏమో!! ఎవరి ఇష్ట దైవాన్ని వారు ప్రార్థిస్తున్నారు. వారి ప్రార్థనలు ఫలించాయి. నజ్‌మింజహాన్ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది... ‘హమ్మయ్య’ అనుకున్నారు జనాలు. ‘ఆమె మీ ఇంటి అమ్మాయే అనుకోండి... ఒకసారి రండి.... ప్లీజ్... చేతులెత్తి దండం పెడతాను’ అనే మమత మాటలు ప్రయాణికులను కదిలించాయి. ఆ తరువాత...తల్లీబిడ్డలను దివలోని ఒక ప్రైవెట్ హాస్పిటల్లో చేర్పించారు. తల్లీబిడ్డలను హాస్పిటల్లో చేర్పించడానికి ప్రయాణికులు కొందరు తమ ప్రయాణాలు మానుకొని మరీ హాస్పిటల్‌కు వచ్చారు. ఇప్పుడు తల్లీబిడ్డలు ఇద్దరూ క్షేమంగా ఉన్నారు. ‘ఇలాంటి దృశ్యాలను సినిమాల్లో చూస్తుంటాం. నిజజీవితంలో చూడడం ఇదే మొదటిసారి. నిజానికి ఆరోజు నేను అర్జంటుగా వేరే చోటుకు వెళ్లాలి. ట్రైన్ వచ్చే సమయం అయింది. అయితే మమత మాటలు నన్ను కదిలించాయి. నా పని, ప్రయాణం గురించి పట్టించుకోకుండా ఆమెతోపాటు వెళ్లాను’ అంటుంది సహాయక కార్యక్రమంలో పాల్గొన్న గాయత్రి. సెంట్రల్ రైల్వే చీఫ్ పీఆర్వో శివాజీ సతారా మమత కృషిని ప్రత్యేకంగా ప్రశంసించారు. -
నేను గర్భవతిని.. మూర్ఛ వల్ల ఏమైనా సమస్యలు తలెత్తుతాయా?
Pregnant Ladies Epilepsy Health Tips In Telugu: నాకు ఫిట్స్ వస్తుంటాయి. ఇప్పుడు నేను గర్భవతిని. మూర్ఛ వల్ల నా ప్రెగ్నెన్సీలో ఏమైనా సమస్యలు తలెత్తుతాయా? పుట్టబోయే బిడ్డ ఆరోగ్యం మీదేమైనా ప్రభావం ఉండొచ్చా? – విరిజ, ఆదిలాబాద్ ఫిట్స్ (ఎపిలెప్సీ, మూర్ఛ) చాలామందికి ఉంటుంది. అది చాలావరకు ప్రెగ్నెన్సీలో ఇబ్బంది కలగచేయకపోవచ్చు. కానీ మందులు కచ్చితంగా వేసుకోనప్పుడు, డాక్టర్ పర్యవేక్షణలో నెలనెలా సరైన జాగ్రత్తలు తీసుకోనప్పుడు చాలామందికి ప్రెగ్నెన్సీలో రిస్క్ ఉండే అవకాశం ఉంది. ప్రెగ్నెన్సీ ప్లానింగ్‌కి మూడు నెలల ముందే గైనకాలజిస్ట్, న్యూరాలజిస్ట్‌ను కలిసి.. వాళ్లు సూచించిన మందులు వాడితే ప్రెగ్నెన్సీలో ఉండే రిస్క్‌ను తగ్గించవచ్చు. ఫిట్స్ ఉన్న కొంతమందిలో ప్రెగ్నెన్సీ సమయంలో ఎక్కువ సార్లు ఫిట్స్ వచ్చే ప్రమాదం ఉంది. గర్భం ధరించగానే అంతకుముందు వాడుతున్న ఫిట్స్ మందులను తగ్గించడం లేదా పూర్తిగా ఆపేయడమే దానికి కారణం. సాధారణంగా గర్భంతో ఉన్నప్పుడు నీరసం, సరైన నిద్రలేకపోవడం, ఒత్తిడి వల్ల ఫిట్స్ పెరుగుతాయి. ఫిట్స్ మందులు ఆపేస్తే పుట్టబోయే బిడ్డకూ రిస్క్ ఉంటుంది. ఈ ఫిట్స్ నియంత్రణలో లేకపోతే SUDEP (సడెన్ అన్ఎక్స్ప్లెయిన్డ్ డెత్ విత్ ఎపిలెప్సీ) అనే రిస్క్ పెరుగుతుంది. ఫిట్స్ ఉన్న తల్లులకు అవయవలోపాలతో బిడ్డ పుట్టే ప్రమాదం కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఈ రిస్క్ వాళ్లు తీసుకునే మందులు, వాటి మోతాదుపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా ఈ బిడ్డల్లో వెన్నుపూస, గుండె, మొహానికి సంబంధించిన సమస్యలను చూస్తాం. గర్భధారణ కంటే ముందు మూడు నెలలు ఫోలిక్ యాసిడ్ మాత్రలను తీసుకున్నవారిలో ఈ రిస్క్ చాలా తగ్గుతుంది. కొన్ని ఫిట్స్ మందులు ఉదాహరణకు సోడియమ్ వాల్‌ప్రోయేట్ వంటివాటిని గర్భంతో ఉన్నప్పుడు తీసుకోకూడదు. దీనివల్ల పుట్టబోయే బిడ్డకు ప్రమాదావకాశం ఎక్కువ. ఈ మాత్రలను తీసుకునేవారు ప్రెగ్నెన్సీని ప్లాన్ చేసుకోవాలనుకున్నప్పుడు న్యూరాలజిస్ట్‌ను కలిస్తే.. ఆ మాత్రలకు బదులు సురక్షితమైన మరోరకం మాత్రలను సూచిస్తారు. అయితే ఫిట్స్ మందులను హఠాత్తుగా ఎప్పుడూ ఆపకూడదు. మందులు వేసుకున్న దానికన్నా ఇలా హఠాత్తుగా ఆపినప్పుడే తల్లికి, బిడ్డకు ప్రమాదావకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకే వీటన్నిటి నేపథ్యంలో ఫిట్స్‌కి వాడే మందులు, వాటి మోతాదు గురించి గర్భధారణ కన్నా ముందే గైనకాలజిస్ట్, న్యూరాలజిస్ట్‌తో చర్చించడం మంచిది. ఫోలిక్‌యాసిడ్, ఫిట్స్‌ను నియంత్రణలో ఉంచాకే గర్భధారణకు ప్లాన్ చేసుకోవాలి. క్రమం తప్పకుండా చెకప్స్‌కి వెళుతూ.. మందులు సరిగ్గా వేసుకుంటే ఇటు తల్లికి, అటు పుట్టబోయే బిడ్డకూ రిస్క్ తక్కువగా ఉంటుంది. గర్భధారణ కంటే ముందు లేదా గర్భం ఉన్నట్టు నిర్ధారణ అయిన వెంటనే గైనకాలజిస్ట్, న్యూరాలజిస్ట్‌ను కలవాలి. ప్రెగ్నెన్సీలోనూ క్రమం తప్పకుండా ఫిట్స్‌కు మందులు వాడాలి. ఒత్తిడి, ఆందోళనలకు గురికాకూడదు. తగినంత విశ్రాంతి, నిద్ర ఉండేట్టు చూసుకోవాలి. మంచి ఆహారం తీసుకోవాలి. రోజూ కొంతసేపు వ్యాయామం చేయాలి. ఒకవేళ ప్రెగ్నెన్సీ సమయంలో ఫిట్స్ వస్తే.. వెంటనే ఆసుపత్రిలో జాయిన్ కావాలి. న్యూరాలజిస్ట్ పర్యవేక్షణలో మందులు, మోతాదులను అడ్జెస్ట్ చేస్తారు. ఫీటల్ మెడిసిన్ డిపార్ట్మెంట్కు చెందిన నిపుణులతో స్కానింగ్ చేయించుకోవాలి. సాధారణ గర్భవతుల్లాగే మీరూ నార్మల్ డెలివరీకి ప్లాన్ చేసుకోవచ్చు. కాన్పు సమయంలో, ఆ తరువాత ఫిట్స్ వచ్చే అవకాశం పెరుగుతుంది కాబట్టి మిమ్మల్ని చాలా జాగ్రత్తగా పర్యవేక్షిస్తారు. నొప్పి తెలియకుండా ప్రసవం అయ్యే పెయిన్ రిలీఫ్ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. దీనికి సంబంధించి మత్తమందు డాక్టర్ (ఎనస్తటిస్ట్) పర్యవేక్షణలో కౌన్సెలింగ్ ఇస్తారు. ఇది తీసుకోవచ్చు. కాన్పు తరువాత.. బిడ్డకు మీ పాలు పట్టొచ్చు. మీకు తగినంత నిద్ర, విశ్రాంతి ఉండాలి. సపోర్ట్‌గా కుటుంబ సభ్యులు ఉంటే మంచిది. పళ్లు, మంచినీళ్లు ఎక్కువగా తీసుకుంటూ డీహైడ్రేషన్ కాకుండా చూసుకోవాలి. అలాగే బిడ్డ సంరక్షణ విషయంలో మీ మీద ఒత్తిడి పడకుండా కుటుంబ సభ్యుల సహాయం తీసుకోవాలి. బిడ్డకు పాలిచ్చేప్పుడు మీరు నేల మీద కూర్చోవడం, బిడ్డకు నేల మీదే పక్కవేసి.. దాని మీద పడుకోబెట్టే బట్టలు మార్చడం వంటివి చేయాలి. ఎందుకంటే హఠాత్తుగా మీకు ఫిట్స్ వచ్చినా బిడ్డకు ఇబ్బంది లేకుండా .. ప్రమాదవశాత్తు కిందపడకుండా ఉంటుంది. ఇక తరువాత కాన్పు విషయానికి వస్తే.. తగినంత సమయం తీసుకుంటేనే మంచిది. దానికోసం వాడాల్సిన గర్భనిరోధక పద్ధతుల గురించి డాక్టర్‌ను సంప్రదించాలి. ఫిట్స్ మందులు కొనసాగించాలి. ప్రసవం అయ్యాక రెండు వారాలకు మీ న్యూరాలజిస్ట్‌ను సంప్రదించాలి. బిడ్డకు తల్లి పాలు మాత్రమే ఇవ్వాలి. -డా. భావన కాసు గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్ హైదరాబాద్ -
కాబోయే అమ్మకు ఎంత కష్టమో.. !
శృంగవరపుకోట రూరల్: ఎస్.కోట మండలం దారపర్తి పంచాయతీ పరిధిలోని గిరిశిఖర గ్రామం కురిడికి చెందిన ఎం.పెంటమ్మ అనే గర్భిణికి మంగళవారం ఉదయం పురిటినొప్పులు వచ్చాయి. స్థానిక మహిళలు సుఖప్రసవానికి ప్రయత్నించారు. సాధ్యం కాకపోవడంతో డోలీలో 20 కిలోమీటర్లు మోసుకొచ్చి దబ్బగుంటకు చేర్చారు. అక్కడి నుంచి ఆటోలో ఎస్.కోట ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు ప్రాథమిక వైద్యం అందించి విజయనగరం ఘోషాస్పత్రికి రిఫర్ చేశారు. కురిడి గిరిశిఖర గ్రామం కావడం, సరైన దారి సదుపాయం లేకపోవడంతో అత్యవసర వేళ కష్టాలు తప్పడంలేదని గిరిజనులు వాపోతున్నారు. గిరిశిఖర గిరిజన గ్రామాలకు త్వరితగతిన బీటీ రోడ్డు సౌక ర్యం కల్పించాలని గిరిజన పెద్దలు జె.గౌరీషు, ఆర్.శివ, సన్యాసిరావు, మాజీ సర్పంచ్ మాదల బుచ్చయ్య కోరారు. -
ప్రేమవివాహం.. భార్య గర్భవతి అని కూడా చూడకుండా..
చెన్నై: తమిళనాడులో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. ఎన్నో ఆశలతో తన మనస్సుకి నచ్చిన వ్యక్తితో యువతి ప్రేమ వివాహం చేసుకుంది. ఈ క్రమంలో భర్త, అత్తింటి వారు అదనపు కట్నం తేవాలని వేధింపులకు పాల్పడ్డారు. దీంతో ఆ యువతి .. ఆత్మహత్యకు పాల్పడింది. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాలు.. మధురై జిల్లాలో 19 ఏళ్ల పండిశ్వరి అనే యువతి, తంగరాజ్ అనే వ్యక్తిని ఏడాది క్రితం ప్రేమ వివాహం చేసుకుంది. ఈ క్రమంలో...పండిశ్వరి గర్భం దాల్చింది. గత కొన్ని రోజులుగా భర్త , అత్తింటివారు అదనపు కట్నం కోసం వేధించసాగారు. ప్రతిరోజు ఆమెను మానసికంగా, చిత్రహింసలకు గురిచేశారు. భర్త వేధింపులకు తట్టుకోలేక పండిశ్వరి తన తండ్రి వెల్లైస్వామికి విషయాన్ని తెలిపింది. దీంతో యువతి తండ్రి భర్తకు సర్దుబాటు చెప్పడానికి ఆమె ఇంటికి చేరుకున్నాడు. కాగా, యువతి తీవ్రమైన మనస్తాపంతో గత శనివారం (ఆగస్టు7)న కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో ఆమెను వెంటనే స్థానిక రాజాజీ ఆసుపత్రికి తరలించారు. ఆమెను అత్యవసర విభాగంలో ఉంచి చికిత్స అందించారు. అయితే, ఆమె శరీరం వైద్యానికి స్పందించట్లేదని డాక్టర్లు తెలిపారు. దీంతో ఆమె గత సోమవారం అర్దరాత్రి మృతి చెందింది. కాగా, బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు అల్లుడు, అతని కుటుంబ సభ్యులపై కేసును నమోదుచేశారు. కాగా, నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నట్లు మధురై పోలీసులు తెలిపారు. -
రెండు రోజులుగా వెతుకుతున్నా.. ఎందుకిలా చేశావు తల్లీ..!
లావేరు: మండలంలోని కేశవరాయునిపాలెం గ్రామానికి చెందిన బోనేల రాజేశ్వరి(29) అనే గర్భి ణి తన రెండేళ్ల కుమార్తెతో కలిసి నేలబావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదానికి కారణం భర్త, అత్తమామల వేధింపులేనని మృతురాలి సోద రుడు గన్నెయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మృతురాలి సోదరుడు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లావేరు మండలం కేశవరాయునిపాలెం గ్రామానికి చెందిన బోనేల కోటేశ్వరరావుతో పొందూరు మండలం బురిడికంచరాం గ్రామానికి చెందిన రాజేశ్వరికి మూడేళ్ల కిందట వివాహమైంది. రాజేశ్వరి చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోవడంతో మేన మామలు గండి ఆనంద్, మహేష్‌లు పెంచి పెద్దచేశారు. వివాహ సమయంలో కొంత కట్నకానుకలు ఇచ్చారు. కొద్ది రోజులు బాగానే ఉన్నా తర్వాత కోటేశ్వరరావు నిత్యం మద్యం సేవించి వచ్చి రాజేశ్వరిని హింసించేవాడు. అత్తమామలు శ్రీనివాసులమ్మ, రాములు సైతం అదనపు కట్నం తీసుకురావాలని వేధించేవారు. ఈ విషయాన్ని రాజేశ్వరి పలుమార్లు మేనమామలకు, సోదరుడు గన్నెయ్యకు తెలియజేసింది. ఈ క్రమంలోనే ఈ నెల 23న భర్త, అత్తమామ లు అదనపు కట్నం తేవాలని మరోసారి వేధించడంతో రాజేశ్వరి తన రెండేళ్లు కుమార్తె భువనను తీసుకొ ని లావేరు మండలం చినమురపాక సమీపంలోని వ్యవసాయ పొలాల్లో ఉన్న నేలబావిలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. శుక్రవారం మధ్యాహ్నం చినమురపాకకు చెందిన కొందరు నేలబావి వద్దకు వెళ్లగా బావిలో మహిళ, పాప మృతదేహాలు తేలడంతో లావేరు పోలీసులకు సమాచారం అందించారు. మృతుల వివరాలు తెలియడంతో వెంటనే స్టేషన్ ఇన్చార్జి ఎస్ఐ రాజేష్, పోలీసులు, చినమురపాక, కేశవరాయునిపాలెం వీఆర్వోలు డి.స్వామినాయు డు, ఎం.రమేష్‌లు బావి వద్దకు వచ్చి మృతదేహాల ను బయటకు తీయించారు. పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. మృతురా లి సోదరుడు గన్నెయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రాజేశ్వరి కేశవరాయునిపాలెంలో వలంటీరుగా సేవలందించింది. రెండు రోజులుగా వెతుకుతున్నా.. రాజేశ్వరి కేశవరాయునిపాలెం నుంచి ఈ నెల 23న వెళ్లిపోయిన విషయాన్ని గ్రామస్తులు ఆమె సోదరు డు గన్నెయ్య, మేనమామలకు ఫోన్ ద్వారా తెలియ జేశారు. అప్పటి నుంచి వారు శ్రీకాకుళం, విశాఖపట్నం, ఆమదాలవలసతో పాటు పలు ప్రాంతాల్లో వెతుకుతున్నారు. పాపతో కలిసి రాజేశ్వరి ఆత్మహ త్య చేసుకుందన్న సమాచారం తెలియజేయడంతో సోదరుడు, మేనమామలు కన్నీరుమున్నీరుగా విల పించారు. ఇద్దరి మృతికి కారణమైన భర్త, అత్తమామలను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. చదవండి: ఐటీడీఏ మాజీ పీవో సూర్యనారాయణ అరెస్టు -
7 నెలల 7 రోజులు.. ఒకే కాన్పులో 10 మంది జననం!
ప్రిటోరియా: తనకు ఒకే కాన్పులో 10 మంది పిల్లలు( డెక్యూప్లెట్స్) జన్మించినట్లు దక్షిణాఫ్రికాకు చెందిన గొసియామీ థామర సిట్‌హోల్ (37) అనే మహిళ ప్రకటించింది. ప్రిటోరియా నగరంలో సోమవారం రాత్రి తన భార్యకు సిజేరియన్ (సి–సెక్షన్) ద్వారా ప్రసవం జరిగిందని, ఏడుగురు మగ శిశువులు, ముగ్గురు ఆడ శిశువులు జన్మించారని ఆమె భర్త టెబోగో సోటెట్సీ చెప్పారు. తనకు చాలా ఆనందంగా ఉందని, ప్రస్తుతం ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేనంటూ భావోద్వేగానికి గురయ్యారు. తన భార్య గర్భం దాల్చి 7 నెలల 7 రోజులయ్యిందని, నెలలు నిండకుండానే 10 మందికి జన్మనిచ్చిందని తెలిపాడు. అయితే, ఒకే కాన్పులో 10 జన్మించారని దంపతులు చెబుతున్న విషయాన్ని వైద్యులు ఇంకా ధ్రువీకరించలేదు. ఒకవేళ ధ్రువీకరిస్తే.. ఒకే కాన్పులో ఇంతమంది పిల్లలు పుట్టడం ప్రపంచంలో ఇదే మొదటిసారి అవుతుంది. గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కడం ఖాయం. సిట్‌హోల్ గతంలో కవలలకు జన్మనిచ్చింది. రెండోసారి సహజ గర్భం దాల్చానని సిట్గోల్ గతంలో వెల్లడించింది. కృత్రిమ గర్భధారణ కోసం చేసే ట్రీట్మెంట్ల వల్లే ఇలా ఎక్కువ మంది శిశుశులు జన్మిస్తారని వైద్య నిపుణులు చెబుతున్నారు. గర్భం దాల్చే అవకాశాలను పెంచడానికి ఫలదీకరణ చెందిన అండాలను ఎక్కువ మొత్తంలో మహిళల గర్భాశయంలో ప్రవేశపెడుతుంటారని, అవి సక్రమంగా పెరిగి, ఎక్కువ మంది శిశువులు జన్మిస్తారని అంటున్నారు. ప్రసవం కంటే ముందు కూడా ఆమె మీడియాతో మాట్లాడింది. తన గర్భంలో ఆరుగురు శిశువులు ఉన్నట్లు వైద్యులు చెప్పారని, తర్వాత స్కానింగ్ చేయిస్తే 8 మంది ఉన్నట్లు తేలిందని వివరించింది. ప్రసవంలో ఆ సంఖ్య 10కి చేరింది. ఈ పిల్లల ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందన్నది ఇంకా తెలియరాలేదు. చదవండి: 24 వేల ఏళ్ల తర్వాత బతికొచ్చాయి! -
Gandhi Hospital: కరోనా విధుల్లో కాబోయే అమ్మలు
గాంధీఆస్పత్రి: కడుపులో పెరుగుతున్న శిశువులను మోస్తూ వృత్తిధర్మాన్ని నిర్వర్తిస్తున్నారు. బాధితులకు మేమున్నామనే భరోసా కల్పిస్తున్నారు. పేగుబంధం.. పడకపై ఉన్న ప్రాణం రెండూ తమకు ముఖ్యమేనంటున్నారు కరోనా విధులు నిర్వహిస్తున్న కాబోయే అమ్మలు. కోవిడ్ నోడల్ కేంద్రమైన సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో పలువురు గర్భిణులు రెండు ప్రాణాలను పణంగా పెట్టి నర్సింగ్ విధులు నిర్వహిస్తూ నైటింగేల్ వారసులుగా నిరూపించుకుంటున్నారు. గర్భంతో ఉండి కరోనా డ్యూటీ చేస్తున్నావా? అని ముక్కున వేలేసుకున్న ఇరుగుపొరుగువారి మాటలు పట్టించుకోకుండా, కుటుంబ సభ్యులు, సన్నిహితులు వారిస్తున్నా లెక్కచేయలేదు. కడుపులో పెరుగుతున్న శిశువుకు ఎటువంటి హాని కలగకుండా.. తాము ఒత్తిడికి గురికాకుండా అన్ని జాగ్రత్తలు పాటిస్తూ బాధ్యతలు సమపాళ్లలో నిర్వహిస్తూ శభాష్ అనిపించుకుంటున్నారు. గాంధీఆస్పత్రిలో నర్సింగ్ విధులు నిర్వహిస్తున్న వారిలో పదిమంది గర్భిణులు ఉన్నారు. నాలుగు నుంచి ఎనిమిది నెలలు నిండినవారు కరోనాను లెక్క చేయకుండా విధులు నిర్వహించడం విశేషం. గర్భిణులైన నర్సింగ్ సిస్టర్స్ అశ్వినీ, రాణి, అనిత, అఖిల, గంగా, కవిత, సరోజ, రవళిలు అందిస్తున్న సేవలను గాంధీ సూపరింటెండెంట్ రాజారావు, నర్సింగ్ సూపరింటెండెంట్ మంగమ్మల అభినందనలు అందుకుంటున్నారు. ఈ సందర్భంగా వారు ఏమంటున్నారంటే.. తగిన జాగ్రత్తలు తీసుకున్నా.. వృత్తిధర్మాన్ని గౌరవించి భర్త నందకిషోర్, కుటుంబ సభ్యులు సహకరించారు. గాంధీ గైనకాలజీ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్నాను. కడుపులో పెరుగుతున్న శిశువు ఆరోగ్య విషయమై ఆందోళన ఉన్నప్పటికీ కరోనా విధుల నిర్వహణలో తగిన జాగ్రత్తలు తీసుకున్నాను. డ్యూటీలో చేరిన నాడు చేసిన ప్రమాణానికి కట్టుబడి ఉన్నాను. కరోనా పాజిటివ్ వచ్చిన సమయంలో తీవ్ర మానసిక ఆందోళనకు గురయ్యా. కొన్ని రోజుల్లోనే నెగెటివ్ రావడం, కడుపులో పెరుగుతున్న శిశువు ఆరోగ్యంగా ఉన్నట్లు తెలుసుకుని, తిరిగి విధుల్లో చేరాను. –అశ్వినీ సేవలు అందించేందుకే.. ఇప్పుడు నాకు ఏడో నెల. గాంధీఆస్పత్రిలో కాంట్రాక్టు పద్ధతిపై నర్సింగ్ విధులు నిర్వహిస్తున్నాను. ఫస్ట్ ప్రెగ్నెన్సీ కావడంతో కోవిడ్ నోడల్ సెంటరైన గాంధీఆస్పత్రిలో డ్యూ టీ చేసేందుకు కుటుంబసభ్యులు అంగీకరించలేదు. సేవలు అందించేందుకే ఈ వృత్తిని ఎంచుకున్నానని అందరినీ ఒప్పించాను. నెలల నిండేంత వరకు డ్యూటీకి హాజరవుతాను. శిశువు ఆరోగ్యంపై ఆందోళన ఉన్నప్పటికీ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాను. భర్త సాయిబాబా, కుటుంబసభ్యుల ప్రోత్సాహం మరువలేనిది. – రాణి మా శ్రమను గుర్తిస్తే చాలు.. కడుపులో పెరుగుతున్న శిశువుతో పాటు రెండు ప్రాణాలకు తెగించి అందిస్తున్న సేవలను గుర్తించి ప్రోత్సహిస్తే సహచరులు కూడా రెట్టించిన ఉత్సాహంతో విధులు నిర్వహిస్తారు. కరోనాను జయించి బాధితులు డిశ్చార్జి అవుతున్న క్షణాలు మరిచిపోలేనివి. నేను విధులు నిర్వహించే వార్డులో గర్భిణీ బాధితులు ఉన్నారు. నేను కూడా ప్రెగ్నెన్సీతో మీతోపాటే వార్డులో ఉన్నాను అంటూ ధైర్యం చెప్పడంతో వారంతా త్వరితగతిన కోలుకోవడం ఓ గొప్ప అనుభవం. పీపీఈ కిట్ వేసుకుని విధులు నిర్వహించాలంటే ఓర్పు, సహనంతోపాటు మానసికబలం ఎంతో అవసరం. – అనిత చదవండి: హైదరాబాద్‌లోని పిల్లల్లో ఇవి తక్కువగా ఉన్నాయి -
విషాదం: ప్రసవానికి వచ్చి కరోనాకు బలి
గూడూరు: కాన్పు కోసం తల్లిగారింటికి వచ్చిన ఓ యువతి కరోనా బారిన పడి మృతిచెందింది. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం దామరవంచలో శనివారం ఈ ఘటన జరిగింది. వివరాలిలా ఉన్నాయి.. ధరావత్ కొమ్మాలు, కాళీ దంపతులకు కూతురు సరిత (23)కు ఏడాది క్రితం ఖానాపురం మండలం ధర్మారావుపేటకు చెందిన యువకుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. మొదటి కాన్పు కోసం 20 రోజుల క్రితం సరితను ఇంటికి తీసుకొచ్చారు. ఈ క్రమంలో కొమ్మాలు, కాళీ దంపతులకు కరోనా సోకింది. కొడుకు దివాకర్‌తోపాటు కూతురు సరితకూ వైరస్ సోకింది. దీంతో వారంతా మహబూబాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. వైద్యుల సూచన మేరకు సరితను హన్మకొండ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అక్కడ ఓ పాపకు జన్మనిచ్చింది. 3 రోజుల క్రితం ఆ పాప, శనివారం సరిత మృతిచెందారు. చదవండి: ప్రేయసితో సెల్ఫీ వీడియో: చనిపోతున్నా.. చివరిసారి చూసిపో.. -
మౌనిక ఊపిరి వదిలేసింది.. కట్టుకున్నోడూ దగ్గరకు రాలేదు
సాక్షి, వర్ధన్నపేట: తమ కలల పంటను చూసుకోవాలని ఆ గర్భిణి కలలుకన్నది. ఇంతలోనే కరోనా ఆమెపై పంజా విసిరింది. మహమ్మారిపై ధైర్యంగా పోరాడి బిడ్డకు జన్మనిచ్చినా.. పుట్టిన బిడ్డను చూసుకునేలోపే మృత్యుఒడికి చేరుకుంది. వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేట మండలం కట్య్రాలకు చెందిన చెంగల శ్రీనివాస్–సరిత దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఝాన్సీ, మౌనిక (21). గత ఏడాది చిన్న కుమార్తె మౌనికను వరంగల్ అర్బన్ జిల్లా ఐనవోలు మండలం నందనం గ్రామానికి చెందిన పాముల సురేందర్‌కు ఇచ్చి వివాహం చేశారు. మౌనిక ఇటీవలే ప్రసవం కోసం పుట్టింటికి వచ్చింది. ఈనెల 8న మౌనికకు జ్వరం రావడంతో రెండు రోజులు స్థానిక వైద్యులు ఇచ్చిన మందులు వాడగా జ్వరం తగ్గింది. తిరిగి రెండు రోజులకే మళ్లీ జ్వరం రావడంతో కోవిడ్ పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఇంట్లోనే ఉండి చికిత్స పొందింది. ఈ క్రమంలో ఈనెల 22న మౌనికకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడగా వర్ధన్నపేట ప్రభుత్వ ఆస్పత్రికి, అక్కడి నుంచి వరంగల్‌లోని సీకేఎం ఆస్పత్రికి, ఆపై 23న వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ కరోనా పరీక్షలు చేయిస్తే నెగెటివ్ వచ్చింది. దీంతో 24వ తేదీన తిరిగి సీకేఎం ఆస్పత్రికి తీసుకెళ్లడంతో వైద్యులు శస్త్రచికిత్స ద్వారా ప్రసవం చేశారు. అదే రోజు రాత్రి మళ్లీ మౌనిక ఆరోగ్యం క్షీణించడంతో ఎంజీఎం ఆస్పత్రికి తీసుకెళ్లాలన్న వైద్యుల సూచనలతో అంబులెన్సులో తరలించారు. ఎంజీఎంలో వైద్యులు ఆక్సిజన్ ఫ్లో మీటర్ లేదని, కొనుగోలు చేసి తీసుకురావాలని చెప్పారు. మౌనిక తండ్రి ఆ ప్రయత్నాల్లో ఉండగానే శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది ఏర్పడి ఆ తల్లి ఊపిరి వదిలేసింది. కట్టుకున్నోడూ దగ్గరకు రాలేదు ఓ పక్క మౌనిక మృతదేహం.. మరో పక్క ఆమెకు పుట్టిన ఆడ శిశువును ఎత్తుకుని మౌనిక తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మౌనికకు కరోనా పరీక్షల్లో నెగెటివ్‌గా వచ్చినా బంధువులెవరూ దగ్గరకు రాలేదు. మౌనిక భర్తకు సమాచారం ఇచ్చినా ఆయన సైతం మృతదేహాన్ని చూసేందుకు సుముఖత చూపలేదు. దీంతో మంగళవారం ఉదయం ఆమె తండ్రి శ్రీనివాస్ స్వగ్రామం కట్య్రాలకు తీసుకెళ్లి మౌనిక అంత్యక్రియలు పూర్తిచేశారు. -
ఎమ్మెల్సీ కవిత చొరవ: నిండు గర్భిణికి అండగా నిలిచి..
సాక్షి, హైదరాబాద్: రక్తస్రావంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ నిండు గర్భిణికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అండగా నిలిచారు. సకాలంలో సాయం అందడంతో ఆ గర్భిణి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. మహబూబ్‌నగర్ జిల్లా కోస్గికి చెందిన జ్యోతిబాయి 9 నెలల గర్భిణి. ఆమె భర్త క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. వైద్యులు సూచించిన తేదీకంటే ముందే జ్యోతిబాయికి పురుటి నొప్పులు రావడంతో అత్యవసరంగా శస్త్ర చికిత్స చేయాల్సి వచ్చింది. దీంతో ఆదివారం మెహిదీపట్నంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. ఆపరేషన్ ఆర్థికంగా భారం కావడంతో జ్యోతిబాయి బంధువులు సామాజిక మాధ్యమ వేదిక ట్విట్టర్‌ను ఆశ్రయించారు. కొందరు దాతలు స్పందించినా అవసరమైన డబ్బులు సమకూరకపోగా, కాలయాపనతో జ్యోతిబాయి ఆరోగ్య పరిస్థితి మరింత విషమించింది. ఈ విషయం ఎమ్మెల్సీ కవిత దృష్టికి రావడంతో ఆమె తక్షణం స్పందించారు. కవిత చొరవతో క్లిష్టమైన ఆపరేషన్ పూర్తి కాగా, సోమవారం జ్యోతిబాయి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. తల్లీ బిడ్డ క్షేమంగా ఉన్న విషయాన్ని తెలియచేస్తూ ట్విట్టర్ ద్వారా కవిత హర్షం వెలిబుచ్చారు. కవిత సాయంతో చలించిపోయిన జ్యోతిబాయి భర్త, మరిది ఇకపై గర్భిణులను తమ క్యాబ్ ద్వారా ఆసుపత్రులకు ఉచితంగా తీసుకెళ్తామని ప్రకటించారు. Praying for well being and good health of both the mother and the child. God bless !! https://t.co/KcH0XarAgk — Kavitha Kalvakuntla (@RaoKavitha) May 24, 2021 చదవండి: ట్విట్టర్లో స్పందించి.. సాయం అందించి! -
కొంప ముంచిన వైద్యురాలి నిర్లక్ష్యం..
సాక్షి, మిర్యాలగూడ అర్బన్: వైద్యురాలి నిర్లక్ష్యం కారణంగానే అబార్షన్ అయ్యిందని ఆరోపిస్తూ గర్భిణి బంధువులు ఆందోళన చేపట్టారు. ఈ ఘటన మిర్యాలగూడ పట్టణంలో శనివారం చోటు చేసుకుంది. వివరాలు.. వేములపల్లి మండల కేంద్రానికి చెందిన బచ్చలకూరి శ్రీకాంత్ తన భార్య విజయకు వివాహం అయిన 10 ఏళ్లకు కాన్పు అందడంతో అప్పటినుంచి పట్టణంలోని చర్చిరోడ్డులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారు. కాగా, శనివారం ఉదయం విజయకు కడుపులో నొప్పిగా ఉండటంతో ఆస్పత్రికి తీసుకురాగా పరీక్షించిన వైద్యురాలు ఇంజక్షన్ ఇచ్చింది. అనంతరం విజయ ఇంటికి వెళ్లింది. కొద్ది సేపటి తర్వాత తిరిగి నొప్పి ఎక్కువ కావడంతో వెంటనే ఆస్పత్రికి తీసుకొచ్చారు. డాక్టర్ పరీక్షించేందుకు చాంబర్లోకి తీసుకెళ్లగానే ఒక్కసారిగా నొప్పి ఎక్కువై ప్రసవం అయ్యింది. మగశిశువు జన్మించి చనిపోయాడు. దీంతో తీవ్ర రక్త స్రావం అయిన విజయకు చికిత్స అందించారు. కాగా వైద్యురాలి నిర్లక్ష్యం కారణంగానే తమకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ రోగి వైద్యురాలితో వాగ్వాదానికి దిగారు. విషయం తెలుసుకున్న వన్ టౌన్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భద్రత ఏర్పాటు చేశారు. అనంతరం ఇరువర్గాలు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకున్నారు. -
నడిరోడ్డుపై ప్రసవించిన మహిళ..
జవహర్‌నగర్: ప్రభుత్వం సకల సౌకర్యాలు కల్పిస్తూ ఎన్ని రకాల ఆధునిక వైద్య సేవలను అందుబాటులోకి తీసుకువస్తున్నప్పటికీ నేటికీ పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందని పరిస్థితే ఉంది. హైదరాబాద్ నగరానికి కూతవేటు దూరంలోగల జవహర్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఓ పేద గర్భిణి రోడ్డుపైనే బిడ్డను ప్రసవించింది. తీవ్ర ప్రసవ వేదనను అనుభవిస్తూ శిశువుకు జన్మనిచ్చినప్పటికీ కనీసం తల్లి నుంచి శిశువును వేరు చేసేందుకు పేగును కత్తిరించేవారు లేకపోవడంతో ఈ లోకంలోకి అడుగుపెట్టిన ఆ ప్రాణం కొద్ది నిమిషాల్లోనే తుదిశ్వాస విడిచింది. ఈ విషాదకరమైన జవహర్‌నగర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రి పక్కనే జరగడం మరింత విషాదకరం. రోడ్డుపై స్పృహతప్పి పడిపోయి..ప్రసవం మేడ్చల్‌కు చెందిన లక్ష్మి 8 నెలల గర్భిణి. కొంత కాలంగా ఆమె కాలి గాయంతో బాధపడుతోంది. తీవ్రమైన నొప్పితో ఆమె చికిత్స కోసం సోమ వారం ఉదయం 11.30 గంటలకు జవహర్‌నగర్ అర్బన్ హెల్త్ సెంటర్‌కు చేరుకుంది. ఆసుపత్రి ఆవరణలో ఉన్న బెంచ్‌పై కూర్చొని ఉండగా కాలి గాయం నుంచి చీము కారుతుండటాన్ని ఫార్మసిస్ట్ గమనించింది. ఇదే అంశాన్ని స్టాఫ్ నర్సు సుశీలకు వివరించింది. గాయానికి డ్రెసింగ్ చేయాల్సిందిగా కోరడంతో హోలీ సెలవు నేపథ్యంలో డ్రెసింగ్ చే యడం కుదరదని, మంగళవారం ఉదయం వస్తే చేస్తామని చెప్పి, నొప్పి నుంచి ఉపశమనం కోసం పెయిన్ కిల్లర్ మందులు ఇచ్చి పంపారు. దీంతో లక్ష్మి మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఆసుపత్రి నుంచి బయటికి వెళ్లింది. కాగా, నీరసంతో ఉ న్న ఆమె ఆసుపత్రి సమీపంలోని రోడ్డుపై స్పృహ తప్పి పడిపోయింది. ఈ క్రమంలో మధ్యాహ్నం 2 గంటల సమయంలో రోడ్డుపైనే మగబిడ్డకు జన్మనివ్వడాన్ని స్థానికులు గమనించి వెంటనే పోలీసులకు, 108కు సమాచారం ఇచ్చారు. వైద్య సిబ్బంది అక్కడికి చేరుకుని పేగును కత్తిరించి తల్లి నుంచి బిడ్డను వేరు చేశారు. అప్పటికే శిశువు చనిపోయి ఉన్నట్లు గుర్తించారు. స్పృహతప్పి పోయిన ఆ బాలింతను మెరుగైన వైద్యం కోసం గాంధీకి తరలించగా, అత్యవసర విభాగంలో అడ్మిట్ చేసుకుని వైద్యసేవలు అందిస్తున్నారు. గర్భవతి అని చెప్పలేదు: సుశీల స్టాఫ్ నర్సు, జవహర్‌నగర్ అర్బన్ హెల్త్ సెంటర్ లక్ష్మి తను కాలి నొప్పితో బాధపడుతున్నట్లు చె ప్పింది. గాయానికి డ్రెస్సింగ్ చేయాలని కోరింది. మంగళవారం రావాల్సిందిగా సూచించాను. అయి తే తను గర్భిణి అనే విషయాన్ని చెప్పలేదు. -
5 నెలల గర్భవతి... 10 కి.మీ. పరుగు... 62 నిమిషాల్లో...
బెంగళూరు: మహిళా‘శక్తి’ అంటే ఇదేనేమో! పురుషులు ఏ కొంచెం ఎక్కువ శ్రమించినా బాగా అలసిపోయాం... ఇక విశ్రాంతి కావాల్సిందే అంటారు. కానీ మహిళ మాత్రం ఓ బిడ్డను మోస్తున్నా ఇంటి పని చేస్తుంది. ఆఫీస్‌కెళ్లి డ్యూటీ చేస్తుంది. అంతేగానీ... నెలతప్పిన నాటి నుంచి ప్రసవించే దాకా రెస్ట్ తీసుకుంటానని భీష్మించుకోదు కదా! ఇదే జరిగితే మన పొద్దు గడవడం కాదు... ప్రపంచమే నడవకుండా ‘లాక్డౌన్’ అయ్యేది. ఇక విషయానికొస్తే... ఓ మహిళ మరో అడుగు ముందుకేసింది. స్ఫూర్తిగొలిపే పరుగు పెట్టింది. ఐదు నెలల గర్భవతి అయిన ఆమె 10కే (10 కిలోమీటర్లు) పరుగును 62 నిమిషాల్లో పూర్తి చేసింది. ఆ ధీర వనిత బెంగళూరుకు చెందిన 35 ఏళ్ల అంకిత గౌర్. వృత్తిరీత్యా ఇంజినీర్ అయిన అంకిత గత తొమ్మిదేళ్లుగా ఇలాంటి పరుగు పోటీల్లో పాల్గొంటూనే ఉంది. ఇక టీసీఎస్ 10కే రన్లో 2013 సంవత్సరం నుంచి క్రమం తప్పకుండా పోటీ పడుతూనే ఉంది. ఇందులో విశేషం లేదు. కానీ ఇప్పుడామె 5 నెలల గర్భవతి. మరో మూణ్నాలుగు నెలల్లో అంకిత తల్లి కానుంది. అయినా సరే తనకిష్టమైన పరుగు కోసం తన గైనకాలజిస్టును సంప్రదించి మరీ పోటీపడింది. దీనిపై అంకిత మాట్లాడుతూ ‘గడిచిన తొమ్మిదేళ్లుగా ఈ ‘పరుగు’ పెడుతూనే ఉన్నాను. నిత్యం నేను తీసుకునే శ్వాసలాగే నా జీవితంలో నేను పెట్టే పరుగు ఓ భాగం’ అని వివరించింది. ప్రతిరోజూ తను రన్నింగ్ చేస్తూనే ఉంటానని చెప్పిన ఆమె ఐదు అంతర్జాతీయ మారథాన్లలోనూ పాల్గొన్నట్లు పేర్కొంది. బెర్లిన్‌లో మూడుసార్లు, బోస్టన్, న్యూయార్క్ మారథాన్లలో ఒక్కోసారి పోటీపడినట్లు తెలిపింది. గతంలో టీసీఎస్ 10కేలోనూ పతకాలు గెలిచానని వివరించింది. -
12 గంటలు ప్రసవ వేదన
వేమనపల్లి (బెల్లంపల్లి): ఓ నిండు గర్భిణి 12 గంటల పాటు ప్రసవ వేదన అనుభవించింది. ఆసుపత్రికి వెళ్లేందుకు దారి లేక.. ఉధృతంగా ప్రవహిస్తున్న వాగును దాటలేక ఆ మహిళ నరకయాతన పడింది. చివరకు జోరు వానలో వాగు వద్దే ప్రసవించింది. బుధవారం మంచిర్యాల జిల్లా వేమనపల్లిలో ఈ సంఘటన చోటు చేసుకుంది. వేమనపల్లి మండలం ముల్కలపేటకు చెం దిన కోండ్ర లక్ష్మికి మంగళవారం రాత్రి 8 గంటలకు పురిటినొప్పులు ప్రారంభం కావడంతో కుటుంబసభ్యులు అదే గ్రామంలోని ఆరోగ్య ఉపకేంద్రానికి తీసుకెళ్లారు. అక్కడ సిబ్బంది ఎవరూ అందుబాటులో లేకపోవడంతో పొరుగున ఉన్న చెన్నూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేందుకు సిద్ధమయ్యారు. అయితే వరద కారణంగా అప్పటికే బద్దెల్లివాగుపై నిర్మించిన వంతెన తెగిపోయింది. మరోమార్గం మీదుగా వెళ్లాలన్నా ప్రాణహిత నది ఉధృతంగా ప్రవహిస్తోంది. అయినా సాహసం చేసి అదే రాత్రి ఆటోలో బద్దెల్లివాగును దాటేందుకు ప్రయత్నించా రు. కుండపోతగా కురుస్తున్న వర్షంతో వాగు ప్రమాదకరంగా మారింది. దీంతో చే సేదిలేక ఆమెను ఇంటికి తీసుకెళ్లారు. ఆమె వేదన చూడలేక కోటపల్లి మండలం వెంచపల్లి మీదుగా వెళ్లేందుకు ప్రయత్నించారు. కానీ.. ప్రాణహిత నది కూడా ఉప్పొంగడంతో మళ్లీ ఇంటికి చేరారు. ఇలా రాత్రంతా ఆమె నొప్పులతోనే అల్లాడింది. వాగు వద్దే ప్రసవం బుధవారం ఉదయం లక్ష్మిని మళ్లీ ఆటోలో ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు బద్దెల్లి వాగువద్దకు వచ్చారు. లక్ష్మిని ఆమె భర్త మహేశ్ మిత్రుల సహాయంతో అతికష్టం మీద వాగు దాటించారు. అప్పటికే సమయం మించిపోవడంతో వాగుదాటిన కొద్దిసేపటికే లక్ష్మి జోరు వర్షంలోనే వాగు ఒడ్డున మగబిడ్డకు జన్మనిచ్చింది. తర్వాత వాగు వద్దకు 108 అంబులెన్స్ రాగా.. బాలింతకు, బిడ్డకు వైద్యం అందించి ఇద్దరినీ చెన్నూరుకు తరలించారు. కలెక్టర్ ఆదేశించినా.. మూడు రోజుల క్రితం కలెక్టర్ భారతిహోళీకేరి బద్దెల్లివాగు వద్దకు వచ్చారు. రాకపోకల సదుపాయం లేని ముల్కలపేట గ్రామంలో గర్భిణులు ఉంటే సంబంధిత అధికారులు తమకు సమాచారం ఇవ్వాలని సూచించారు. వర్షాలు అధికంగా ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని, గర్భిణులను వాగు దాటించి కాన్పు అయ్యేలా చూడాలని మండల అధికారులను హెచ్చరించారు. కానీ.. లక్ష్మి 12 గంటలపాటు ప్రసవవేదనతో అల్లాడినా ఏ ఒక్క అధికారి కూడా కనీసం అటువైపు రాలేదని విమర్శలు వస్తున్నాయి. -
దొరకని నాగ సింధూరెడ్డి ఆచూకీ
సాక్షి, ఉండవెల్లి (అలంపూర్): కలుగొట్ల వాగులో శనివారం తెల్లవారుజామున గల్లంతైన గర్భిణి నాగసింధూరెడ్డి (28) ఆచూకీ దొరకలేదు. ఆదివారం ఎస్పీ రంజన్‌రతన్‌కుమార్ అక్కడికి చేరుకొని వాగు శివారు ప్రాంతాల్లో గాలింపు చర్యలను పరిశీలించారు. వాగులో అడ్డుగా ఉన్న ముళ్లపొదలు.. కలుగొట్ల, పుల్లూరు పరిసరాల్లో వెతకసాగారు. గల్లంతైన ప్రాంతం నుంచి తుంగభద్ర నది 500మీటర్ల దూరం ఉండడంతో నది తీర ప్రాంతాలకు పోలీసులు చేరుకుని గాలింపు చర్యలు చేపట్టినట్లు సీఐ వెంకట్రామయ్య తెలిపారు. యువతి కుటుంబసభ్యులు అక్కడికి చేరుకున్నారు. సాయంత్రం వరకు ఆచూకీ తెలియకపోవడంతో కన్నీరు మున్నీరయ్యారు. పోలీసులతోపాటు సర్పంచ్ హుర్రున్నిసా, తేజ ఆధ్వర్యంలో ఆయా గ్రామాల ప్రజలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఎస్పీ ఆదేశాలనుసారం సోమవారం లైఫ్ బోట్లను తీసుకొచ్చి గాలింపు చేయనున్నట్లు సీఐ పేర్కొన్నారు. నదీ తీరంలో గాలింపు చర్యలను పరిశీలిస్తున్న ఎస్పీ రంజన్‌రతన్, అధికారులు హైదరాబాద్ వెళ్తుండగా.. ఘటన కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన భార్యభర్తలు నాగసింధూరెడ్డి, శివశంకర్‌రెడ్డితోపాటు వారి స్నేహితుడు జిలానీబాషా కలిసి బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు కారులో బయల్దేరారు. కలుగొట్ల వాగులో వీరు ప్రయాణిస్తున్న కారు కొట్టుకుపోయింది. మిగతా ఇద్దరు బయటపడగా.. సదరు మహిళ గల్లంతైన విషయం తెలిసిందే. -
బలవంతంగా కడుపు కోసి తీసిన బిడ్డ మృతి
వాషింగ్టన్ : రెండు నెలల క్రితం చికాగోకి చెందిన ఒక మహిళ, ఆమె కూతురు కలిసి 19 సంవత్సరాల గర్భవతిని హత్యచేసి కడుపు కోసి బిడ్డను బయటకు తీసిన దారుణం గురించి తెలిసిందే. బలవంతంగా బిడ్డను బయటకు తీయడంతో ఆ చిన్నారి ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది పడింది. దాంతో ఆ శిశువును ఆస్పత్రిలో చేర్పించారు. అయితే ఆ బిడ్డ చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. అసలేం జరిగిందంటే.. మాల్రేన్ ఒహోవా లోపేజ్(19) అనే గర్భవతికి చికాగోకి చెందిన క్లారిస ఫిగురోవా(46),ఆమె కుమార్తె డేసిరీ(24) ఫేస్బుక్ ద్వారా పరిచయమయ్యారు. పిల్లలకు సంబంధించిన వస్తువులు తమ వద్ద లభిస్తాయని ఒహోవాను ఆకర్షించి తమ ఇంటికి రప్పించారు. వచ్చిన అనంతరం ఒహోవా గొంతు నులిమి చంపి ఆమె కడుపు కోసి బిడ్డను బలవంతంగా బయటకు తీశారు. ఏప్రిల్ 23న ఈ ఘటన జరిగింది. తల్లి గర్భం నుంచి బయటకు తీసిన ఆ చిన్నారి ఊపిరి తీసుకోలేదు. దాంతో ఫిగురోవా ఆ శిశువును తన బిడ్డ అని ఆసుపత్రిలో చేర్పించింది. నెలల నిండకముందే.. బలవంతంగా శిశువును బయటకు తీయడంతో.. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదుర్కొన్నది. చివరకు బ్రైయిన్ డెడ్ అయ్యి ఆ శిశువు మరణించినట్లు శుక్రవారం సాయంత్రం వైద్యులు తెలిపారు. మరోవైపు ఒహోవా కుటుంబ సభ్యులు ఆమె కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో భాగంగా ఒహోవా ఫేస్బుక్ ఖాతాను పరిశీలించిన పోలీసులకు.. ఫిగురోవా మీద అనుమానం వచ్చింది. ఆమె ఇంటికి వెళ్లి సోదా చేయగా అక్కడ ఒహోవా మృత దేహం కనిపించింది. బిడ్డ కోసం తానే తన కూతురు, ఆమె బాయ్ ఫ్రెండ్‌తో కలిసి ఈ హత్య చేసినట్లు ఫిగురోవా ఒప్పుకోవడంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. -
వైద్యం అందక గర్భిణి మృతి
మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ క్రైం : సరైన వైద్యం అందకటో నిండు గర్భిణి మృతిచెందింది. ఈ సంఘటన మంగళవారం రాత్రి నాగర్‌కర్నూల్‌లో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. మండలంలోని తూడుకుర్తి గ్రామానికి చెందిన బండి స్వప్న(26)కు అచ్చంపేట మండలం తోడేళ్లగడ్డకు చెందిన తిరుపతయ్యతో నాలుగేళ్ల కిందట వివాహమైంది. ప్రస్తుతం స్వప్న గర్భిణి కావడంతో కొంతకాలంగా బిజినేపల్లిలోని గురుకుల పాఠశాలలో ఏఎన్ఎంగా విధులు నిర్వర్తిస్తూ తన తల్లిగారింట్లోనే ఉండేది. తాను గర్భం దాల్చినప్పటి నుంచి నాగర్‌కర్నూల్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స చేయించుకునేది. మంగళవారం సాయంత్రం పురిటి నొప్పులతో ఆస్పత్రికి రాగా పరిస్థితి విషమించిందని ఆస్పత్రి వైద్యులు తెలిపి మహబూబ్‌నగర్ ఎస్వీఎస్ ఆస్పత్రికి రెఫర్ చేశారు. అక్కడికి వెళ్లిన స్వప్న చికిత్స పొందుతూ మృతిచెందింది. నాగర్‌కర్నూల్ ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యులు సమయానికి వైద్యం అందించకపోవడం వల్లే పరిస్థితి విషమించిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. -
నిండు గర్భిణి ఆత్మహత్య
తెనాలి రూరల్ : స్వల్ప విషయంపై గర్భిణి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గుంటూరు జిల్లా తెనాలిలోని వైకుంఠపురం వెనుక ఉన్న పోతురాజు కాలనీలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. కాలనీకి చెందిన బత్తుల సుబ్రహ్మణ్యంకు సమీప బంధువు చాముండేశ్వరి (19)తో ఏడాది కిందట వివాహమైంది. ప్రస్తుతం ఆమె ఏడు నెలల గర్భిణి. మందులు సరిగా వేసుకోకపోవడంతో భర్త భార్యను మందలించి వెళ్లాడు. దీంతో మనస్థాపానికి గురైన ఆమె ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఘటనాస్థలాన్ని వన్ టౌన్ సీఐ బి. శ్రీనివాసరావు, ఎస్ఐ కె. వెంకటేశ్వరరావు పరిశీలించారు. మృతురాలి కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
డెంగీతో గర్భిణి మృతి
తుళ్ళూరు: డెంగీ లక్షణాలతో గర్భిణి మృతి చెందిన ఘటన మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో ఆదివారం చోటు చేసుకుంది. మండల కేంద్రమైన తుళ్ళూరులో గత 20 రోజుల్లో డెంగీ లక్షణాలతో ఇద్దరు మృత్యువాత పడ్డారు. గర్భిణి కంతేటి కవిత(19) వారం రోజులుగా జ్వరంతో బాధపడుతోంది. స్థానికంగా వైద్యం చేయించినా ఫలితం లేకపోవడంతో మంగళగిరిలోని ఓ పెద్దాస్పత్రికి తీసుకెళ్లారు.అక్కడి వైద్యులు పరీక్షలు చేసి డెంగీ లక్షణాలున్నాయని చెప్పారు. చికిత్స చేసినా ఫలితం లేక ఆదివారం కవిత మృతిచెందింది. ప్రకాశం జిల్లాకు చెందిన కవిత ఐదు నెలల కిందట తుళ్లూరుకు చెందిన రాజేష్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. ఇదే కాలనీకి చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థిని జెట్టి బిందు 20 రోజుల కిందట డెంగీతో మృతి చెందిన విషయం తెలిసిందే. -
శవంతో నర్సింగ్‌హోమ్ ఎదుట ధర్నా
నల్గొండ(సూర్యాపేట): వైద్యుల నిర్లక్ష్యం వల్లే నిండు గర్భిణీ ప్రాణాలు పోగొట్టుకుందని విజయలక్ష్మీ నర్సింగ్ హోమ్ ఎదుట మృతురాలి బంధువులు ఆందోళనకు దిగారు. వివరాలు..పెనుపహాడ్ మండలం దోసపాడు గ్రామానికి చెందిన కవిత(25) ఐదు రోజుల క్రితం సూర్యాపేటలోని విజయలక్ష్మీ నర్సింగ్ హోమ్‌లో డెలివరీ కోసం చేరారు. ఆస్పత్రి వైద్యులు డెలివరీ చేస్తుండగా పరిస్థితి సీరియస్‌గా ఉండటంతో హైదరాబాద్ తరలించారు. చికిత్సపొందుతూ కవిత ఆదివారం మరణించింది. కవిత మృతికి ఆస్పత్రి వైద్యులే కారణమని భావించి శవంతో నర్సింగ్ హోమ్ ఎదుట ఆందోళనకు దిగారు. పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. -
స్వైన్‌ఫ్లూతో గర్భిణి మృతి
సాక్షి,హైదరాబాద్: స్వైన్‌ఫ్లూ ఉధృతి కొనసాగుతూనే ఉంది. తాజాగా నల్లగొండ జిల్లాకు చెందిన గర్భిణి పర్విన్(32) శనివారం రాత్రి హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో మృతి చెందా రు. తీవ్ర జ్వరంతో ఈ నెల ఐదో తేదీన ఆమె ఆస్పత్రిలో చేరారు. కాగా, తెలంగాణ రాష్ట్రంలో జనవరి నుంచి ఇప్పటి వరకు 2,302 నమూనాలు పరీక్షించగా, వీటిలో ఇప్పటివరకు 768 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. గాంధీలో ప్రస్తుతం 33 మంది పాజిటివ్, 44 మంది అనుమానితులు చికిత్స పొందుతున్నారు. ఫీవర్‌లో 9 పాజిటివ్, 20 మంది అనుమానితులు చికిత్స చేయించుకుంటున్నారు. వివిధ ఆస్పత్రుల్లో మరో పది మంది పాజిటివ్ బాధితులు చికిత్స పొందుతున్నారు.