childbirth
-
ఐవీఎఫ్ హార్మోన్ల బదులు అబార్షన్ బిళ్లలిచ్చారు!
న్యూయార్క్: వైద్యపరమైన నిర్లక్ష్యానికి పరాకాష్ట ఈ ఉదంతం. అమెరికాలోని లాస్ ఏంజెలెస్‌లో సంతానం కోసం ఐవీఎఫ్ పద్ధతిని ఆశ్రయించిన తమికా థామస్ అనే మహిళకు మెడికల్ షాపు ఐవీఎఫ్ హార్మోన్ల బదులు పొరపాటున అబార్షన్ మాత్రలు ఇచి్చంది. ఏకంగా ఇద్దరు గర్భస్థ శిశువుల మరణానికి కారణమైంది! పుట్టబోయే బిడ్డలను పొట్టన పెట్టుకున్నారంటూ మెడికల్ షాప్‌పై ఆమె స్టేట్ బోర్డ్ ఆఫ్ ఫార్మసీకి ఫిర్యాదు చేసింది. ప్రిస్క్రిప్షన్‌లోని డాక్టర్ చేతిరాత అర్థం కాకపోవడం ఈ దారుణ పొరపాటుకు దారి తీసినట్టు విచారణలో తేలింది. ‘షాపు సిబ్బంది తప్పు మీద తప్పు చేశారు. ఆ రాతను తమకు తోచినట్టుగా అర్థం చేసుకుని ఈ నిర్వాకానికి పాల్పడ్డారు. పైగా తాము ఏం మందులు ఇస్తున్నదీ, వాటివల్ల ఏం జరుగుతుందన్నది విధిగా చెప్పాల్సి ఉండగా ఆ పని కూడా చేయలేదు’అని బోర్డు తేలి్చంది. మెడికల్ షాప్‌కు పది వేల డాలర్ల జరిమానా విధించింది. కానీ దీనివల్ల పుట్టక ముందే కన్ను మూసిన తమ బిడ్డలు తిరిగొస్తారా అంటూ థామస్ దంపతులు విలపిస్తున్నారు. వారికి నలుగురు సంతానం. పెద్ద కుటుంబం కావాలనే కోరికతో మళ్లీ పిల్లలను కనాలని నిర్ణయించుకుని ఐవీఎఫ్ పద్ధతిని ఆశ్రయించారు. -
‘యూట్యూబ్’ చూస్తూ భార్యకు కాన్పు
హోసూరు: పురిటి నొప్పులతో బాధపడుతున్న భార్యను ఆస్పత్రికి తీసుకెళ్లకుండా యూట్యూబ్‌లో వీడియో చూస్తూ ఓ భర్త కాన్పు చేశాడు. మగబిడ్డకు జన్మనిచి్చన ఆమె తీవ్ర రక్తస్రావమై మరణించింది. ఈ ఘటన తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా హనుమంతపురంలో జరిగింది. హనుమంతపురానికి చెందిన మాదే‹Ù(27)కు పోచ్చంపల్లి సమీపంలోని పులియంబట్టికి చెందిన వేడియప్పన్ కూతురు లోకనాయకి(27)తో రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరిద్దరూ అగ్రికల్చర్ కోర్సులో డిగ్రీ చేశారు. ఇంటి వద్ద పెరట్లో సేంద్రియ పద్ధతిలో పండించిన కూరగాయలనే తినేవారు. ఈ క్రమంలో లోకనాయకి గర్భం దాల్చగా.. ఇంటి వద్దే సహజసిద్ధంగా ప్రసవం చేయాలని వారిద్దరూ నిర్ణయించుకున్నారు. ఇందుకోసం మాదేష్ యూట్యూబ్‌లో వీడియోలు చూస్తుండేవాడు. మంగళవారం తెల్లవారుజామున లోకనాయకికి పురిటినొప్పులు ప్రారంభమయ్యాయి. ఆమెను మాదేష్ ఆస్పత్రికి తీసుకెళ్లకుండా.. ముందుగా నిర్ణయించుకున్న ప్రకారం యూట్యూబ్‌లో చూస్తూ కాన్పుకు సాయం చేశాడు. మగ బిడ్డకు జన్మనిచి్చన అనంతరం.. లోకనాయకి తీవ్ర రక్తస్రావంతో కోమాలోకి వెళ్లింది. ఆ తర్వాత ఆమెను స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లగా.. పరిశీలించిన డాక్టర్లు లోకనాయకి మరణించినట్లు తెలిపారు. -
ఆడుతూ, పాడుతూ ‘అమ్మ’
వీఏవీ రంగాచార్యులు, సాక్షి సెంట్రల్ డెస్క్ : మాతృత్వంలోని కమ్మదనం గురించి ‘అమ్మ’కు తెలిసినంతగా మరెవ్వరికీ తెలియదు. అయితే బిడ్డకు జన్మనిచ్చి తల్లి అవ్వడం అనేది ఆ ‘అమ్మ’కు పునర్జన్మేనని చెప్పవచ్చు. అంటే ఓ మహిళ గర్భం దాల్చి.. తొమ్మిది నెలలపాటు శిశువును మోయడం ఒక ఎత్తు అయితే, ఆ బిడ్డను బాహ్య ప్రపంచంలోకి తీసుకురావడం మరోఎత్తు. ఈ క్రమంలో ఆ చివరి రోజు ఆ మహిళ పడే కష్టం, బాధ వర్ణణాతీతం. ఈ బాధ భరించలేక చాలా మంది సిజేరియన్ (ఆపరేషన్ చేసి బిడ్డను బయటకు తీయడం) చేయించుకోవడానికే మొగ్గు చూపుతుంటారు. ప్రైవేట్ ఆస్పత్రులు కూడా ఎక్కువ ఫీజు వస్తుందని మారు మాట్లాడకుండా ఇదే విధానాన్ని కొనసాగిస్తున్నాయి. ఇది సరికాదని, ఇతరత్రా ఎలాంటి సమస్యలు లేకపోతే నార్మల్ డెలివరీ చేయడానికే ప్రాధాన్యత ఇవ్వాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) గట్టిగా చెబుతోంది. దీంతో చాలా వరకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో, పీహెచ్‌సీల్లో నార్మల్ డెలివరీకే అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. రిస్క్ తీసుకోవడానికి ప్రైవేట్ ఆస్పత్రులు సిద్ధంగా లేనందున అనవసర సిజేరియన్లు కొనసాగుతూనే ఉన్నాయి. వీటికి అడ్డుకట్ట వేసేందుకు వైద్య ఆరోగ్య శాఖ కసరత్తు చేస్తూనే ఉంది. ఎపిడ్యూరల్ విధానం ఒక వరం అభివృద్ధి చెందిన దేశాల్లో, మన దేశంలో ఎగువ మధ్య తరగతి, ధనికులు ఇప్పుడిప్పుడే ఈ విధానం ద్వారా సుఖ ప్రసవం అయ్యేలా దృష్టి సారిస్తున్నారు. ఎపిడ్యూరల్ అంటే ఇదొక రకమైన అనస్థీషియా. మామూలుగా శరీరంలో ఒక భాగానికి నొప్పి తెలియకుండా ఉండేందుకు స్పైన్ (వెన్ను)కు మత్తు మందు ఇచ్చినప్పుడు ఆ భాగం నుంచి మెదడుకు నొప్పి సంకేతాలు వెళ్లవు. అదే సమయంలో మెదడు నుంచి మోటార్ సిగ్నల్స్ రావు. అప్పుడు ఆ భాగానికి సంబంధించి కండరాలు వదులవుతాయి. సిజేరియన్ కోసమైతే ఇలా చేయాలి. నొప్పి తెలియకుండా నార్మల్ డెలివరీ చేయాలంటే ఇందులో ఒకదాన్ని ఆపి, మరొకదాన్ని పని చేయించాలి. వైద్యులతో ముందే చర్చించాలి కార్పొరేట్, ప్రైవేట్ ఆస్పత్రులకు ప్రసవం కోసం వచ్చే వారిలో చాలా మంది నొప్పి తట్టుకోలేక సిజేరియన్ చేసేయండని అడుగుతున్నారని, ఇలాంటి సమయంలో ఎపిడ్యూరల్ విధానం పాటించాలని డబ్ల్యూహెచ్‌వో సూచిస్తోంది. ఈ విధానానికి నిపుణుడైన అనెస్థీషియాలజిస్ట్ మాత్రమే అదనంగా అవసరం. అందువల్ల దాదాపు సిజేరియన్‌కు అయ్చే ఖర్చే అవుతుంది. ఇప్పటికే ఈ విధానం గురించి తెలిసిన వారు చాలా కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్యులతో ముందుగానే చర్చించి తగిన శ్రద్ధ తీసుకుంటున్నారు. వారి సూచనల మేరకు నిత్యం వ్యాయామం చేస్తూ ఆడుతూ, పాడుతూ గడుపుతున్నారు. పురుటి నొప్పులు మొదలవుతాయనడానికి ముందుగానే ఆస్పత్రిలో చేరుతున్నారు. వీరికి యాక్టివ్ లేబర్ కంటే (తీవ్రమైన నొప్పులు) ముందు నుంచే పెలి్వక్ (కండరాలు వదులయ్యేలా) ఎక్సర్సైజ్లు చేయిస్తారు. ఆ సమయంలో వేడి నీళ్లలో తడిపిన టవల్ ద్వారా ఒత్తిడి తేవడం, కొన్ని ఎక్సర్సైజ్ల ద్వారా సుఖ ప్రసవం అయ్యేలా చూస్తారు. ఇటీవల సినీ నటుడు రామ్‌చరణ్ సతీమణి ఉపాసన ఈ విధానంలోనే బిడ్డకు జన్మనివ్వడం గమనార్హం. కొన్ని ఆస్పత్రుల్లో ఐవీ అనాల్జీషియా, ఎంటొనాక్స్ (మాస్క్ ద్వారా గ్యాస్ ఇవ్వడం) తదితర పద్దతుల్లో కూడా నొప్పి లేకుండా ప్రసవాలు చేస్తున్నప్పటికీ ఎపిడ్యూరల్ మాత్రమే ఎక్కువగా ప్రాచుర్యంలో ఉంది. సిజేరియన్ కంటే ఇదే మేలు కాబట్టి, దీని గురించి అందరికీ తెలియాలని డబ్ల్యూహెచ్‌వో కోరుకుంటోంది. స్పైన్ పై భాగంలోనే మత్తు స్పైన్లోపలికి కాకుండా పై భాగంలో ఉన్న పొరలోకి మత్తు మందును తక్కువ మోతాదులో ఇంజెక్ట్ చేస్తారు. ఇలా చేస్తే అనాల్జీషియా (నొప్పి లేకపోవడం) మాత్రమే పని చేస్తుంది. అంటే మెదడుకు ఆ భాగం నుంచి నొప్పి సంకేతాలు వెళ్లనందున నొప్పి తెలియదు. మెదడు నుంచి యథావిధిగా మోటార్ సిగ్నల్స్ వస్తూనే ఉంటాయి. అందువల్ల ఆ భాగంలో కండరాలు యథావిధిగా పని చేస్తాయి. దీంతో గర్భసంచి చుట్టూ ఒత్తిడి పెరిగి, కొద్ది కొద్దిగా బేబీ బయటకు వస్తుంది. ఇందుకోసం సర్జరీలకు వాడేంత డోస్ కాకుండా తక్కువ డోసులో మత్తు మందు వాడతారు. అన్ని అనెస్థీషియాల్లాగే దీనికీ కొంత సైడ్ ఎఫెక్ట్ ఉన్నప్పటికీ సిజేరియన్ చేయాల్సిన పరిస్థితి రాదు. మామూలుగా కంటే ఓ గంట సమయం ఎక్కువ పడుతుంది. మంచి బెనిఫిట్ ఉంటుంది ఎపిడ్యూరల్ వల్ల మంచి ఫలితం ఉంటుంది. పెయిన్‌ను బాగా తగ్గించవచ్చు. బెనిఫిట్ చాలా బావుంటుంది. చాలా దేశాల్లో ఇప్పుడు ఇదే విధానం కొనసాగుతోంది. పూర్వపు రోజుల్లో ఈ విధానం పట్ల మన దేశంలో కొంత అపోహ ఉండేది. ఇప్పుడు విజ్ఞానం, సాంకేతిక పరిజ్ఞానం పెరగడం వల్ల ఆ అపోహలు తొలగిపోయాయి. లేబర్‌లో మూడు దశలు ఉంటాయి. రెండవ దశ నుంచి ఇది స్టార్ట్ చేయాలి. కొంచెం బీపీ తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అంతకు మించి పెద్ద సమస్యలు ఉత్పన్నం కావు. కాకపోతే తొమ్మిదవ నెల నుంచే గర్భిణిని ఇందుకు సమాయత్తం చేయాల్సి ఉంటుంది. ఈ విధానంపై కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలో పరిశోధన కొనసాగుతోంది. ఇందుకు సంబంధించి పీజీ అనెస్థీసియా విద్యార్థులు పలు పేపర్లు కూడా ప్రెజెంట్ చేశారు. యువతులకు మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ఖర్చు కూడా తక్కువే. ప్రస్తుతం కార్పొరేట్ ఆస్పత్రుల్లో అందుబాటులో ఉంది. గర్భిణికి అవగాహన ఉండి కోరితేనే చేస్తున్నారు. – ఎస్.మాణిక్యరావు, గైనకాలజీ హెచ్ఓడి, కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రి -
గర్భిణిపై కూలిన ఇంటిపైకప్పు
మెదక్ మున్సిపాలిటీ: తొలి కాన్పు కోసం పుట్టింటికి వచ్చిన గర్భిణిపై ఇల్లు కూలిన ఘటనలో కడుపులోని గర్భస్థ శిశువు మృతి చెందగా.. ఆమె పరిస్థితి విషమంగా ఉంది. ఈ విషాదఘటన మెదక్‌లోని మిలట్రీ కాలనీలో చోటుచేసుకుంది. స్థానికుడైన మహ్మద్ సర్వర్ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. రెండో కూతురు యాస్మిన్ సుల్తానా ఇటీవల కాన్పు కోసం పుట్టింటికి వచ్చింది. 15 రోజుల్లో ఆమెకు ప్రసవం చేయాల్సి ఉంది. బుధవారం అర్ధరాత్రి ఇంట్లో నిద్రిస్తున్న తరుణంలో భారీ వర్షాలకు తడిసిన ఇంటి గోడ పైకప్పు ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో యాస్మిన్ తీవ్రంగా గాయ పడటంతో వెంటనే మెదక్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు ఆమె కడుపులో గర్భస్థ శిశువు మృతి చెందినట్లు గుర్తించి తొలగించారు. యాస్మిన్‌ను హైదరా బాద్‌కు రిఫర్ చేశారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగానే ఉన్నట్లు వైద్యులు చెప్పారు. కాగా, ఇదే ఘటనలో తీవ్రంగా గాయపడిన యాస్మిన్ తల్లి చాంద్ సుల్తానా మెదక్‌లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. యాస్మిన్ సుల్తానా కుటుంబాన్ని మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు గురువా రం పరామర్శించి రూ.లక్ష సాయం అందించారు. -
24 గంటల్లో 31 కాన్పులు
జనగామ: జనగామ మాతాశిశు సంరక్షణ ఆరోగ్య కేంద్రం(ఎంసీహెచ్) ప్రసవాల్లో మరో రికార్డు సృష్టించింది. 24 గంటల వ్యవధిలో 31 కాన్పులు చేసి.. వైద్యులు సర్కారు దవాఖానా సత్తా చాటారు. సాధారణ ప్రసవాలు–17, ఆపరేషన్లు 14 కాగా... ఇందులో 12మంది మగపిల్లలు, 19 మంది ఆడపిల్లలు జన్మించారు. అందరూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సుగుణాకర్‌రాజు ఆధ్వర్యంలో అసిస్టెంటు ప్రొఫెసర్ డాక్టర్ స్రవంతి, డాక్టర్లు సౌమ్యారెడ్డి, సిరిసూర్య, సిబ్బంది సంగీత, విజయరాణి, సెలెస్టీనా ప్రసూతి కాన్పులు చేశారు. ఎంసీహెచ్ వైద్యుల అంకితభావంతో సర్కారు దవాఖానాలపై ప్రజలకు మరింత నమ్మకం పెరుగుతోందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ట్వీట్ చేశారు. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కూడా వీరిని అభినందిస్తూ, ప్రతి ఒక్కరూ సర్కారు దవాఖానాల సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. -
ఒక్క ప్రసవం చేస్తే ఒట్టు... రెండు పీహెచ్‌సీలు ఉన్నా జరగని కాన్పులు
బషీరాబాద్: కర్ణాటక సరిహద్దులోని బషీరాబాద్ మండలంలో రెండు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నా ప్రసవాలు మాత్రం చేయడం లేదు. తాండూరు జిల్లా ఆస్పత్రికి 25కి.మీ. దూరంలో మండలం ఉండడంతో ఇక్కడి ప్రజలకు వైద్య సేవలు చేరువ చేయాలనే సంకల్పంతో బషీరాబాద్, నవల్గా గ్రామాల్లో పీహెచ్‌సీలను ఏర్పాటు చేశారు. బషీరాబాద్‌లో 24 గంటల వైద్య సేవలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఇక్కడి సిబ్బంది ఉదయం10కి వచ్చి సాయంత్రం 5గంటలకు ఇళ్లకు వెళ్లి పోతున్నారు. రాత్రి వేళ గర్భిణులు వచ్చినా, యాక్సిడెంట్ కేసులు, పాము కాటు కేసు బాధితులను తాండూరు జిల్లా ఆస్పత్రికి రెఫర్ చేస్తున్నారు. ఇన్ పేషెంట్లు వస్తే సాయంత్రం వరకు వైద్యం చేసి రాత్రికి ఇంటికి పంపుతున్నారు. లేబర్ రూమ్ సరిగ్గా లేకపోవడంతో మూడు నెలలుగా ప్రసవాలు నిలిచిపోయాయి. కొంతమంది గర్భిణులు తాండూరు పీహెచ్సీలో, మరికొందరు ప్రైవేటు ఆస్పత్రుల్లో పురుడు పోసుకుంటున్నారు. నవల్గ్గాలో మరీ దారుణం నవల్గ్గా పీహెచ్సీలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఈ పీహెచ్సీ పరిధిలో మూడు గ్రామాలు ఉండగా ఒక్క కాన్పు కూడా జరగలేదు. అడపాదడపా వచ్చే రోగులకు ఓపీ చూసి సాయంత్రం కాగానే ఇంటి ముఖం పడుతున్నారు. దీంతో ప్రజలకు వైద్యం అందని ద్రాక్షగా మారింది. ఏదైన ప్రమాదం జరిగితే తాండూరు వెళుతున్నారు కానీ, పీహెచ్‌సీకి రావడం లేదని ఆస్పత్రి వర్గాలే చెబుతున్నాయి. బషీరాబాద్ మెడికల్ అధికారిగా పనిచేస్తున్న వైద్యుడు గోపాల్ ఇక్కడ ఇన్చార్జ్ బాధ్యతలు చూస్తున్నాడు. స్కానింగ్‌కు ప్రైవేటు సెంటర్లకు మండలంలోని రెండు పీహెచ్‌సీల్లో అల్ట్రా సౌండ్ స్కానింగ్ మిషన్లు లేకపోవడంతో గర్భిణులు తాండూరులోని ప్రైవేటు ఆస్పత్రులకు వెళుతున్నారు. జిల్లా ఆస్పత్రిలోనూ ఒకే కేంద్రం ఉండడంతో అక్కడ స్కానింగ్‌కు సమయం పడుతోంది. దీంతో గర్భిణులు బయట కేంద్రాల బాట పడుతున్నారు. పీహెచ్‌సీల్లో స్కానింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు. అత్యవసర వైద్యం అందడం లేదు బషీరాబాద్ పీహెచ్సీలో 24 గంటలు వైద్య సేవలు అందించాల్సి ఉంది. అయితే ఇక్కడి సిబ్బంది ఆరేడు గంటలు మాత్రమే విధుల్లో ఉంటున్నారు. అత్యవసర వైద్యం అందడం లేదు. ప్రసవాల కోసం వచ్చినా, ప్రమాదాలు జరిగినా తాండూరు జిల్లా ఆస్పత్రికి రెఫర్ చేస్తున్నారు. రాత్రి వేళ ప్రైవేటు ఆస్పత్రులే దిక్కవుతున్నాయి. గతంలో పాము కాటుకు గురైన యువకుడు ఆస్పత్రికి వస్తే ఇంజక్షన్ ఇచ్చేవారు లేక ప్రైవేటు ఆస్పత్రిలో చేరి మృతి చెందాడు. – లక్ష్మణ్, యువజన సంఘం నాయకుడు, బషీరాబాద్ -
అమ్మా.. నాన్నకు ఏమైంది? ఎప్పుడు వస్తాడు?.. కంటతడి పెట్టించే ఘటన
ఆలమూరు/అంబాజీపేట(కోనసీమ జిల్లా): వచ్చేవారం అతని భార్యకు వైద్యులు ప్రసవ తేదీని ఇచ్చారు. ఆ కుటుంబంలో మరొకరు చేరుతారన్న ఆనందం అట్టే కాలం నిలువలేదు. రోడ్డు ప్రమాదం అతనిని పొట్టన పెట్టుకోవడంతో ఒక్కసారిగా విషాదం అలముకొంది. ఆలమూరు మండల పరిధిలోని చొప్పెల్ల లాకుల సమీపంలో జాతీయ రహదారిపై గురువారం జరిగిన ప్రమాదంలో అంబాజీపేట మండలం చిరుతపూడి గ్రామానికి చెందిన యలమంచిలి నాగరాజు (45) మృతి చెందినట్లు ఎస్సై ఎస్.శివప్రసాద్ తెలిపారు. రాజమహేంద్రవరం వైపు నుంచి రావులపాలెం ద్విచక్ర వాహనంపై వస్తున్న నాగరాజును చొప్పెల్ల లాకుల సమీపంలో రావులపాలెం నుంచి రాజమహేంద్రవరం వైపు వస్తున్న ఐసర్ వ్యాన్ ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఉపాధి కోసం కువైట్ వెళ్లి తిరిగి వచ్చి రాజమహేంద్రవరంలోని హోటల్లో కుక్‌గా పనిచేస్తున్న నాగరాజు తన తల్లిని చూసేందుకు సొంత ఊరికి వస్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. సమాచారం తెలుసుకున్న నాగరాజు భార్య శాకర్య కుమారి, ఐదేళ్ల కుమార్తె విషీక ఘటనా స్థలానికి చేరుకొన్నారు. ఐదేళ్ల కుమార్తె విషీక అమ్మా.. నాన్నకు ఏమైంది? ఎప్పుడు వస్తాడు? మనం ఇంటికి ఎప్పుడు వెళ్తామని అమాయకంగా అడుగుతున్న తీరు ఘటనా స్థలంలో ఉన్న ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టించింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతదేహాన్ని రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. చదవండి: 30 ఏళ్లకే గుండెపోటు.. కారణాలేంటి?.. ఇలా చేయకపోతే డేంజర్లో పడినట్టే! -
బిడ్డల్ని కనే సమయాన్ని వాయిదా వేయనక్కర్లేదు! ప్రసవం తర్వాత కూడా..
స్త్రీలు తమ జీవితంలో మాతృత్వాన్ని వరంగా భావిస్తుంటారు. అయితే, మారుతున్న సమాజం, జీవన పరిస్థితులు వీటితో పాటు విభిన్న రంగాలలో.. వివిధ వృత్తులలో రాణిస్తున్న మహిళలు పనుల దృష్ట్యానో, స్థిరపడలేదనో.. బిడ్డలను కనే సమయాన్ని వాయిదా వేస్తూ ఉంటారు. కొన్నిస్లారు వృత్తికి – అందానికి ముడిపెట్టే సందర్భాలూ తలెత్తుతుంటాయి. ఇలాంటప్పుడు వైద్యపరంగా వస్తున్న అవకాశాలను అందిపుచ్చుకుంటూ కొత్త వివాదాలకు దారులు తీస్తుంటారు. సమస్యలు తెచ్చుకుంటూ ఉంటారు. వీటిలో మంచీ చెడులు ఎలా ఉన్నా ప్రసవం తర్వాత స్త్రీ శారీరక స్థితిని తిరిగి తమ స్వాధీనంలోకి తెచ్చుకోగలిగే పరిస్థితుల పట్ల అవగాహన కలిగి ఉండటం మంచిది అంటున్నారు నిపుణులు. ఇటీవల సినీనటి నయనతార సరోగసి విధానం ద్వారా ఇద్దరు బిడ్డలకు తల్లి అయ్యిందనే వార్త వైరల్ అవుతోంది. అందం ప్రధానాంశంగా ఈ వార్త చర్చనీయాంశం అయ్యింది. పిల్లలు పుట్టిన తర్వాత శరీరంలో మార్పులు చోటు చేసుకోవడం సహజంగా జరుగుతుంటుంది. అయితే, వాటి గురించి అంతగా ఆందోళన అవసరం లేదని గ్లామర్ ఫీల్డ్‌లో ఉండి తల్లి అయినవారు తమ జీవనశైలి గురించి ఎప్పటికప్పుడు మనకు తెలియజేస్తుంటారు. ఇందులో భాగంగా ఇటీవల సినీనటి కాజల్ అగర్వాల్ బిడ్డను కన్నాక తన శరీరంలో వచ్చిన మార్పులు, వాటిని అనుకూలంగా మార్చుకునే పద్ధతుల మీద రిలీజ్ చేసిన నోట్ కూడా వైరల్ అవుతోంది. ఇలాంటప్పుడు కుటుంబ, సామాజిక, ఆరోగ్యకరమైన జీవనశైలికి స్వయంగా తీసుకోదగిన నిర్ణయాల్లో అవగాహన ప్రధాన అంశం అవుతుంది.. ♦ నాలుగు నెలల నుంచి.. మాతృత్వపు ఆనందాన్ని పొందుతూనే వృత్తిపరంగా తనను తాను మలుచుకుంటున్న కాజల్ అగర్వాల్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్న స్వీయఅనుభవాలలో ‘మాతృత్వం అంటే కెరీర్‌కు ముగింపు కాదు. కెరీర్ గురించి ఆలోచిస్తున్నామంటే బిడ్డను నిర్లక్ష్యం చేయడం కాదు. ఒకటి కావాలంటే ఒకటి కోల్పోతాం అనే భావన కానీ, గిల్టీగా ఫీలవ్వాల్సిన అవసరమే లేదు. ప్రసవం తర్వాత వర్క్‌లోకి వెళ్లడానికి కొంత సమయం పట్టచ్చు. కానీ, మన ప్రాధాన్యతలను సెట్ చేసుకుంటే ప్రతీది సరిగ్గా, సులభంగా చేయచ్చు. నేను ప్రసవం అయ్యాక నాలుగు నెలల నుంచి తిరిగి పని చేయడం మొదలుపెట్టాను. ముందు నా శరీరం ఎలా ఉండేదో.. తర్వాత ఎలా ఉంటుందో అనే ఆలోచన నాకు లేదు. బిడ్డ పుట్టడం అనుభూతిని నేను పొందగలిగాను. శారీరక శ్రమ ద్వారా నా బాడీని నేను కాపాడుకోగలనన్న నమ్మకం నాకుంది. అందుకు జిమ్‌కు వెళుతున్నాను. గుర్రపు స్వారీ మునుపటి కన్నా కష్టంగా ఉన్నట్టు మొదట్లో అనిపించింది. మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ కూడా అలాగే అనిపించింది. నా శక్తిస్థాయిలను తిరిగి పొందడానికి చేసే ప్రక్రియ మునుపటి కన్నా కొంత కష్టమైనదే. కానీ, తిరిగి నైపుణ్యాల సాధనను ఒక హాబీగా కొనసాగించేందుకు ప్రయత్నించాను. ఇప్పుడు ఈ ప్రక్రియ నాకు ఎంతో ఆనందాన్నిస్తుంది’ అని రాసిన ఈ నోట్ ఎంతో మంది తల్లులకు స్ఫూర్తినిస్తుంది. ♦ రెండు నెలల నుంచి .. ఇరవై ఏళ్లుగా హెల్త్ అండ్ ఫిట్నెస్ మోటివేటర్‌గా ఉన్న అనుప్రసాద్ ఈ విషయం గురించి ప్రస్తావిస్తూ– ‘నార్మల్ డెలివరీ అయినవాళ్లు రెండు నెలల నుంచీ, సిజేరియన్ అయితే ఆరు నెలల నుంచి జిమ్‌లో వ్యాయామాలు చేయచ్చు. ముందుగా వారి వివరాలను జిమ్ ట్రైనర్‌కి చెప్పి, తగిన వ్యాయామాలు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఇరవై ఏళ్లుగా ఈ రంగంలో ఉన్నాను, ఎంతో మంది మహిళలకు ఫిట్‌నెస్‌లో శిక్షణ ఇచ్చాను. బాడీఫిట్నెస్కు కృషి చేసేవారిలో అమ్మాయిలే కాదు, అమ్మలూ ఉన్నారు. ప్రసవం తర్వాత కొన్నాళ్ల పాటు పిల్లల పనులు, ఇంటి పనులతో తీరికలేదని.. వ్యాయామం అనే ఆలోచన చేయరు. దీంతో పాటు వీరు తీసుకునే ఆహారం సరైనదిగా ఉండకపోవడంతో శరీరంలో మరిన్ని మార్పులు వస్తాయి. అందుకే, చాలా మందిలో ‘పిల్లలు పుట్టాక శరీరం లావు అవుతుంది లేదంటే, షేప్ ఉండదు..’ అనుకుంటారు. కానీ, నిజానికి తగినంత శారీరక శ్రమ లేకపోవడం వల్లే ఇలా జరుగుతుంది’ అని వివరించారు. ♦ ఆరు వారాల నుంచి.. ప్రసవం తర్వాత తల్లులకు చెప్పే జాగ్రత్తలలో వ్యాయామం తప్పనిసరిగా ఉంటుందంటున్నారు గైనకాలజిస్ట్ డాక్టర్ శిరీష. ‘ప్రీ ప్రెగెన్సీలో ఉన్న ప్రతి సిస్టమ్ ప్రసవం తర్వాత ఆరు వారాల సమయంలో సాధారణ స్థితికి వచ్చేస్తుంది. ఈ సమయంలో ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా జాగ్రత్తపడమని చెబుతాం. అలాగే, కొద్ది రోజులు బరువులు ఎత్తకుండా సాధారణ పనులు చేసుకోవచ్చు. మంచి ప్రొటీన్స్ ఉన్న పోషకాహారం తీసుకోవాలి. సిజేరియన్ అయితే గాయం మానడానికి జాగ్రత్తలు తీసుకోవాలి. దీంతో పాటు ఇంటి వద్ద చేయదగిన వ్యాయామాల గురించి వివరిస్తాం’ అని తెలిపారు. అందం మాతృత్వానికి ఎప్పుడూ కొలమానం కాదు. జీవన విధానంలో వచ్చే ఆనందాలను పొందుతూనే, ఎంచుకున్న రంగంలో విజయశిఖరాలను అంతే హుందాగా పొందవచ్చు. అపోహలకు దూరం ప్రసవం తర్వాత మూడు నెలల నుంచి వ్యాయామాలు తప్పనిసరిగా చేయాలి. పోస్ట్ నేటెల్ ఎక్సర్సైజులు అని ఉంటాయి. ఈ వ్యాయామం వల్ల చర్మం, కండరాలు తిరిగి వాటి సాధారణ స్థితికి వచ్చేస్తాయి. తల్లిపాలు ఇవ్వడం వల్ల అందం పోతుందని కూడా చాలా అపోహలు ఉన్నాయి. ఎక్కువ సేపు ఫీడింగ్ ఇవ్వకుండా ఉన్నా సమస్యలు తలెత్తుతాయి. ప్రతి రెండు గంటలకు ఒకసారి బిడ్డకు తల్లిపాలు ఇవ్వాలి. మన జీవన శైలి సరిగ్గా ఉంటే శరీరాకృతిలో పెద్ద మార్పులు రావు. – డాక్టర్ శిరీషారెడ్డి, గైనకాలజిస్ట్ తగినంత సాధన జిమ్‌లో వ్యాయామాలు చేయాలనుకున్నవారు ముందు డాక్టర్ సలహా తీసుకోవాలి. వారి ఇతరత్రా ఆరోగ్య సమస్యలను బట్టి నెమ్మదిగా వ్యాయామాలు మొదలుపెట్టవచ్చు. ఒకేసారి వర్కౌట్స్ కాకుండా లైట్‌వెయిట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ నుంచి రోజూ కొద్దిగా టైమ్‌ను పెంచుకుంటూ శరీరానికి వ్యాయామం అలవాటు చేస్తూ ప్రాక్టీస్ చేయాలి. దీంతో వారి పూర్వపు శరీరాకృతి వచ్చేస్తుంది. వాకింగ్ వంటి ఫిజికల్ యాక్టివిటీ రోజూ గంట సేపు చేసినా మంచి ప్రయోజనం ఉంటుంది. దీంతో పాటు నూనె, చక్కెర, జంక్ పదార్థాలు కాకుండా మంచి ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు చేసుకుంటే ఆరోగ్యంగానూ, యాక్టివ్‌గానూ ఉంటారు. – అనుప్రసాద్, హెల్త్ అండ్ ఫిట్నెస్ మోటివేటర్ – నిర్మలారెడ్డి -
ప్రసవాలన్నీ ఆస్పత్రుల్లోనే..
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల ఫలితంగా ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగింది. మహిళ గర్భం దాల్చిన నాటి నుంచి పండంటి బిడ్డకు జన్మనిచ్చి ఇంటికి చేరుకునే వరకూ అనేక విధాలుగా ప్రభుత్వం అండగా నిలుస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూన్ నెలాఖరు వరకూ రాష్ట్రంలో 1,51,419 ప్రసవాలు జరగ్గా ఇందులో ఏకంగా 99.99 శాతం అంటే 1,51,405 ప్రసవాలు ఆస్పత్రుల్లోనే చేశారు. కేవలం 0.01 శాతం మాత్రమే ఆస్పత్రుల బయట జరిగాయి. వీటిని కూడా అధిగమించి వందకు వంద శాతం ప్రసవాలు ఆస్పత్రుల్లోనే జరిగేలా వైద్యశాఖ చర్యలు తీసుకుంటోంది. ఇక రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాలుండగా కాకినాడ (99.98), అల్లూరి సీతారామరాజు (99.82), శ్రీ సత్యసాయి (99.78), చిత్తూరు (99.98) మినహా మిగిలిన 22 జిల్లాల్లో వందకు వంద శాతం ప్రసవాలు ఆస్పత్రుల్లోనే జరిగాయి. 46.19 శాతం ప్రభుత్వాస్పత్రుల్లో.. ఒకప్పుడు మొత్తం ప్రసవాల్లో 30–35 శాతం ప్రసవాలు ప్రభుత్వాస్పత్రుల్లో ఉండేవి. అయితే, వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వాస్పత్రుల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచింది. దీంతోపాటు అవసరమైన వైద్యులు, వైద్య సిబ్బంది పోస్టుల భర్తీ చేపట్టింది. ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవం జరిగితే కలిగే ప్రయోజనాలపై ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. దీంతో ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూన్ నెలాఖరు వరకూ జరిగిన ప్రసవాల్లో 46.19 శాతం అంటే 69,932 ప్రసవాలు ప్రభుత్వాస్పత్రుల్లోనే జరిగాయి. అత్యధికంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో వంద శాతం ప్రసవాలు ప్రభుత్వాస్పత్రుల్లోనే చేపట్టారు. పార్వతీపురం మన్యంలో 85.11 శాతం, అనకాపల్లిలో 75.12 శాతం ప్రసవాలు ప్రభుత్వాస్పత్రుల్లోనే నిర్వహించారు. మెరుగైన వైద్య సేవలే లక్ష్యం ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవాల సంఖ్యను మరింత పెంచేందుకు కృషిచేస్తున్నాం. పీహెచ్‌సీల్లో ప్రసూతి సేవలపై ప్రత్యేక దృష్టి సారించాం. ఇప్పటికే అసలు ప్రసవాలే చేయని పీహెచ్‌సీలను గుర్తించాం. వాటిలో ప్రసవాలు చేసేలా చర్యలు చేపట్టాం. నాడు–నేడు కార్యక్రమంలో భాగంగా పీహెచ్‌సీల్లో లేబర్ వార్డులు, ఆపరేషన్ థియేటర్లు అభివృద్ధి చేస్తున్నాం. ఇప్పటికే పలు ఆస్పత్రుల్లో పనులు పూర్తయ్యాయి. మిగిలిన వాటిల్లో పనులు నడుస్తున్నాయి. – జె.నివాస్, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ -
సురక్షితంగా.. సౌకర్యవంతంగా...
గత నెల ఒకటో తేదీన విజయవాడ రైల్వేస్టేషన్లో ఎస్.కె.అమీనాకు పురిటినొప్పులు వచ్చాయి. దీంతో కుటుంబ సభ్యులు 108కు ఫోన్ చేశారు. ఆ కొద్దిసేపటికి 108 అంబులెన్స్ రైల్వేస్టేషన్‌కు చేరుకుంది. విజయవాడ పాత జీజీహెచ్‌కు అమీనాను తరలించింది. వైద్యులు అమీనాకు ప్రసవం చేశారు. కొద్ది రోజుల విశ్రాంతి అనంతరం 11వ తేదీ ఆస్పత్రి నుంచి అమీనాను డిశ్చార్జి చేశారు. అమీనాది వైఎస్సార్ జిల్లా కడప నగరం యానాది కాలనీ. ఈ క్రమంలో ఇంటికి వెళ్లాలంటే 400 కి.మీ మేర ప్రయాణించాల్సిన పరిస్థితి. ప్రైవేట్ ట్యాక్సీ అద్దెకు తీసుకుని వెళ్లాలంటే సుమారు రూ.10వేల మేర వెచ్చించాల్సి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో అమీనాకు ‘డాక్టర్ వైఎస్సార్ తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్’ వాహనం అండగా నిలిచింది. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా వాహనంలో బాలింత అమీనా ఆమె బిడ్డను వైద్యశాఖ క్షేమంగా ఇంటికి తరలించింది. సాక్షి, అమరావతి: ఏపీలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవించిన మహిళలకు తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ సేవల రూపంలో అండగా నిలుస్తోంది. ప్రజారోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వ హయాంలో కునారిల్లిన 108, 104 సేవలకు ఊపిరిలూదినట్టుగానే తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ సేవలను మెరుగు పరిచింది. ఈ ఏడాది ఏప్రిల్ నెల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 500 కొత్త వాహనాలతో ‘డాక్టర్ వైఎస్సార్ తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్’ సేవలను విస్తరించింది. దీంతో గతంతో పోలిస్తే ప్రస్తుతం ఎక్కువ మందికి లబ్ధి చేకూరుతోంది. రోజుకు 700 మంది.. రాష్ట్రవ్యాప్తంగా వెయ్యికి పైగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏడాదికి 3 లక్షల మేర ప్రసవాలు చేస్తుంటారు. ఏప్రిల్‌కు ముందు కేవలం 279 వాహనాలే అందుబాటులో ఉండేవి. డిశ్చార్జ్ సమయంలో బాలింతలకు వాహనాలు అందుబాటులో ఉండేవి కాదు. దీంతో సొంత డబ్బు ఖర్చు పెట్టి బస్సు, ఆటోలు, ట్యాక్సీల్లో ఇళ్లకు వెళ్లేవారు. ఏప్రిల్ నుంచి 500 వాహనాలతో సేవలను విస్తరించారు. ప్రస్తుతం రోజుకు సగటున 700 మంది బాలింతలను తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలు ఆస్పత్రుల నుంచి ఇళ్లకు వెళుతున్నారు. ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 68,252 మంది బాలింతలు ఈ సేవలను వినియోగించుకున్నారు. తల్లులు, బిడ్డల రక్షణ, భద్రతకు భరోసా కల్పిస్తూ అన్ని వాహనాలకు జీపీఎస్ ట్రాకింగ్ సౌకర్యం ఉంటోంది. ఫిర్యాదుల స్వీకారం.. తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ సేవలను సమర్థవంతంగా అమలు చేయడం కోసం క్షేత్ర స్థాయిలో తలెత్తే సమస్యలు, ఇబ్బందులపై ఫిర్యాదులను వైద్య శాఖ స్వీకరిస్తోంది. టోల్ ఫ్రీ నెంబర్ 104 ద్వారా ఫిర్యాదులను స్వీకరిస్తున్నారు. గత నెల నుంచి ఫిర్యాదుల స్వీకారం ప్రారంభించగా..ఇప్పటికి 18 ఫిర్యాదులు నమోదయ్యాయి. వీటిని సకాలంలో వైద్య శాఖ పరిష్కరించింది. కాగా.. మహిళ గర్భం దాల్చిన నాటి నుంచి పండంటి బిడ్డకు జన్మనిచ్చి ఆస్పత్రి నుంచి ఇంటికి చేరుకునేంత వరకూ అనేక విధాలుగా ప్రభుత్వం అండగా నిలుస్తోంది. ప్రసవానంతరం డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య ఆసరా కింద తల్లికి విశ్రాంతి సమయానికి రూ.5వేల చొప్పున ఆర్థిక సాయం చెల్లిస్తున్నారు. తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ సేవల్లో వచ్చిన మార్పులు ఇలా ఏప్రిల్‌కు ముందు వరకు.. ► 279 వాహనాలు ► ఇరుకైన మారుతీ ఓమినీ వాహనం ► ఏసీ సౌకర్యం ఉండదు ► ట్రిప్‌కు ఇద్దరు బాలింతల తరలింపు ఏప్రిల్ నెల నుంచి.. ► 500 వాహనాలు ► విశాలమైన మారుతీ ఈకో వాహనం ► ఏసీ సౌకర్యం ఉంటుంది ► ట్రిప్‌కు ఒక బాలింత మాత్రమే తరలింపు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా తొమ్మిదో తేదీ కేజీహెచ్‌లో ప్రసవించాను.ఆస్పత్రి నుంచి మా గ్రామం 200 కి.మీ దూరం. తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌లో రూపాయి ఖర్చు లేకుండా ఇంటికి చేర్చారు. – సి.గంగోత్రి, గుమ్మలక్ష్మిపురం, విజయనగరం జిల్లా -
కడుపుకోతల్లో కరీంనగర్ టాప్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 60.7శాతం ప్రసవాలు సిజేరియన్ పద్ధతిలో జరుగుతున్నాయని తెలంగాణ జనాభా, ఆరోగ్య నివేదిక వెల్లడించింది. కౌన్సిల్ ఫర్ సోషల్ డెవలప్మెంట్ ప్రచురించిన ఈ రిపోర్టును గణాంకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు సోమవారం విడుదల చేశారు. నివేదిక ప్రకారం... సిజేరియన్ ప్రసవాలు కుమ్రం భీం జిల్లాలో అత్యంత తక్కువగా 27.2% జరుగుతున్నాయి. అత్యంత అధికంగా కరీంనగర్ జిల్లాలో 82.4% జరుగుతున్నాయి. ఇక ప్రైవేట్ ఆసుపత్రు ల్లో 81.5% ప్రసవాలు సిజేరియన్ పద్ధతిలో జరుగుతుండగా, అందులో అత్యధికంగా కరీంనగర్ జిల్లా లో 92.8% జరుగుతున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరిగే ప్రసవాల్లో మొత్తం 44.5% మాత్రమే సిజేరియన్‌లుండగా, అత్యధికంగా జనగాంజిల్లాలో 73% సిజేరియన్ ప్రసవాలు అవుతున్నాయి. నివేదికలోని ముఖ్యాంశాలు... ►15 ఏళ్ల లోపు జనాభా అధికంగా మహబూబ్‌నగర్ జిల్లాలో ఉంది. అక్కడి జనాభాలో 27.8% మంది ఆ వయస్సులోపు వారే. ఆ వయస్సువారి తెలంగాణ సరాసరి జనాభా 22.5%. ►రాష్ట్రంలో వెయ్యి మంది పురుషులకు 1,049 మంది స్త్రీలు ఉన్నారు. అత్యధికంగా జగిత్యాల జిల్లాలో 1,219 మంది ఉండగా, హైదరాబాద్‌లో అత్యంత తక్కువగా 959 మంది ఉన్నారు. ►తెలంగాణలో 95.8 శాతం మంది ఇళ్లల్లో అయోడైజ్డ్ ఉప్పు వాడుతున్నారు. అత్యధికంగా కరీంనగర్ జిల్లాలో 99.1శాతం మంది వాడుతున్నారు. ►రాష్ట్రంలో 60.8శాతం కుటుంబాలకు ఆరోగ్య బీమా ఉంది. అత్యధికంగా వరంగల్ రూరల్ జిల్లాలో 72శాతం మందికి ఉంది. ►రాష్ట్రంలో 15–19ఏళ్ల వయస్సులో తల్లులైనవారు, గర్భిణీలుగా ఉన్నవారు 5.8% ఉండగా, వీరిలో అత్యంత తక్కువగా సిద్దిపేట జిల్లాలో ఒక శాతం ఉన్నారు. అత్యంత ఎక్కువగా జోగులాంబ గద్వాల జిల్లాలో 15.9శాతం ఉన్నారు. ►రాష్ట్రంలోఆసుపత్రుల్లో ప్రసవాలు సరాసరి 97% ఉండగా, వరంగల్ రూరల్ జిల్లాలో వంద శాతం ప్రసవాలు ఆసుపత్రుల్లో జరుగుతున్నాయి. ►రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు 49.7% జరుగుతుండగా, ఇందులో ఆదిలాబాద్ జిల్లాలో అత్యధికంగా 66.8శాతం ఉన్నాయి. ►రాష్ట్రంలో 15ఏళ్లు పైబడినవారిలో తీవ్రమైన షుగర్ వ్యాధితో మందులు వాడుతున్న పురు షులు 18.1శాతం ఉన్నారు. అత్యధికంగా హైదరాబాద్‌లో 26.8 శాతం మంది ఉన్నారు. కాగా, మహిళల్లో 15 ఏళ్లు పైబడిన వారిలో 14.7శాతం ఉండగా, హైదరాబాద్‌లో 21.2శాతం ఉన్నారు. -
మగువా.. గొప్పదమ్మా నీ తెగువ!
కైకలూరు: కరోనా బారినపడిన నిండు గర్భిణికి 108 సిబ్బంది ఆ అంబులెన్స్‌లోనే ప్రసవం చేయించారు. వివరాల్లోకి వెళితే.. కైకలూరుకు చెందిన గర్భిణి కె.శ్రావణి ప్రసవ నొప్పులతో కైకలూరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కి శనివారం వచ్చింది. వైద్యులు పరీక్షలు చేయగా.. ఆమెకు కరోనా సోకినట్టు తేలింది. దీంతో ఆమెను మెరుగైన వైద్యం కోసం మచిలీపట్నం తీసుకువెళ్లాలని వైద్యులు చెప్పారు. దీంతో శ్రావణిని తీసుకుని 108 వాహనంలో ఈఎంటీ రజనీదేవి పీపీఈ కిట్ ధరించి, పైలట్ బోయిన రావుతో కలసి మచిలీపట్నం బయలుదేరారు. కొద్దిదూరం వెళ్లిన తర్వాత శ్రావణికి నొప్పులు ఎక్కువయ్యాయి. దీంతో రజనీదేవి తెగువతో చాకచక్యంగా సుఖ ప్రసవం అయ్యేవిధంగా చేశారు. ఆమె ఆడ శిశువుకు జన్మనివ్వగా.. తల్లీబిడ్డలను మచిలీపట్నం ఆస్పత్రికి తరలించారు. ఎంతో ధైర్యంతో విధులు నిర్వర్తించిన ఈఎంటీని 108 వాహన జిల్లా అధికారి సురేష్‌కుమార్, డివిజనల్ అధికారి ప్రశాంత్ అభినందించారు. -
ప్రసవం కోసం ప్రభుత్వాస్పత్రిలో చేరిన కలెక్టర్ భార్య
భద్రాచలంఅర్బన్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ సతీమణి మాధవి.. ప్రసవం కోసం మంగళవారం రాత్రి భద్రాచలం ప్రభుత్వాస్పత్రిలో చేరారు. రాత్రి 12 గంటల సమయానికి ఆమెను కుటుంబసభ్యులు దవాఖానాకు తీసుకెళ్లారు. వైద్య సిబ్బంది వివిధ పరీక్షలు నిర్వహించారు. ప్రభుత్వాస్పత్రుల్లో ఇటీవల వైద్యసేవలు మెరుగవగా.. ప్రజల్లో మరింత నమ్మకం కలిగించేందుకు కలెక్టర్ తన సతీమణిని చేర్పించారని కుటుంబసభ్యులు తెలిపారు. -
మీ కోసం పుస్తకం రాశాను
తారలు గర్భం దాల్చే విషయంలో చాలా వొత్తిడి ఉంటుంది. కెరీర్‌కు వచ్చే బ్రేక్ వల్లా శరీరంలో వచ్చే మార్పు వల్లా ఆ వొత్తిడి వారికి యాతన అవుతుంది. కరీనా కపూర్ ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది. నటిగా టాప్ లెవల్లో ఉన్న సమయంలో గర్భధారణ, ప్రసవం... ఇవి తన మీద చూపే వొత్తిడి ఇతర ఏ రంగంలో ఉన్న స్త్రీలకు కూడా కలగవచ్చని ఆమెకు అనిపించింది. అసలు గర్భధారణ నుంచి ప్రసవం వరకూ వుండే సవాలక్ష సందేహాలకు తాను పొందిన జవాబులు అందరికీ చెప్పాలని ఆమెకు అనిపించింది. ‘ప్రెగ్నెన్సీ బైబిల్’ పుస్తకం రాసి ఆమె విడుదల చేసింది. కాబోయే తల్లులకు ఇది కచ్చితంగా ఉపయుక్తమే. 2018లో భారతదేశంలో హైయెస్ట్ సెల్లింగ్ ఫిమేల్ ఆథర్ ఎవరో తెలుసా? ఊహించండి. నటి ట్వింకిల్ ఖన్నా. ఆమె రాసిన ‘పైజామాస్ ఆర్ ఫర్గివింగ్’ పుస్తకం రికార్డ్ స్థాయిలో అమ్ముడుపోయింది. ఆమె సినీ నటి అనో, అక్షయ్ కుమార్ భార్య అనో ఆ పుస్తకం అమ్ముడుపోలేదు. దానిలో ఉన్న సరదా విషయాలు, వాటిని రాసిన ట్వింకిల్ ఖన్నా శిల్పం ఆ పుస్తకానికి పేరు తెచ్చాయి. బాలీవుడ్లో పుస్తక రచనను ఒక ప్రవృత్తిగా పెట్టుకున్న నటి ట్వింకిల్. ‘మిసెస్ ఫన్నీబోన్’, ’ది లెజెండ్ ఆఫ్ లక్ష్మీ ప్రసాద్’ ఆమె ఇతర పుస్తకాలు. నటి శిల్పా శెట్టి రాసిన ‘ది గ్రేట్ ఇండియన్ డైట్’ పుస్తకం కూడా హిట్ అయ్యింది. ‘ఆషికీ’ సినిమాలో నటించి ఆ తర్వాత ప్రమాదం బారిన పడి అదృశ్యమయ్యి తిరిగి చాలా ఏళ్ల తర్వాత జనం ముందుకు వచ్చిన అనూ అగర్వాల్ రాసిన ‘అన్యూజ్వల్’ పుస్తకం పాఠకులు పెద్ద ఎత్తున కొన్నారు. నటి ప్రియాంక చోప్రా తన రచనలను, వ్యాసాలను ‘అన్ఫినిష్డ్’ పేరుతో పుస్తకంగా తెచ్చింది. ఇలా బాలీవుడ్ లోని మహిళా సెలబ్రిటీలు తాము నటనలోనే కాదు కలం పట్టి రాయడంలోనూ ప్రతిభ ఉన్నవాళ్లం అని నిరూపించారు. అదే వరుసలో ఇప్పుడు కరీనా కపూర్ కూడా చేరింది. ఆమె గతంలో ‘ది స్టైల్ డైరీ ఆఫ్ బాలీవుడ్ డైరీ’ అనే పుస్తకం తెచ్చింది. అందులో స్త్రీలకు అలంకరణ కిటుకులు తన అనుభవాల నుంచి చెప్పింది. ఇప్పుడు ఆరోగ్య రహస్యాలు చెప్పేందుకు కొత్త పుస్తకంతో వచ్చింది. దాని పేరే ‘ప్రెగ్నెన్సీ బైబిల్’. వేడి వేడి పుస్తకం కొన్నిరోజుల క్రితం కరీనా కపూర్ తన చేతిలో ఒక ఆల్ట్రాసౌండ్ రిపోర్ట్ పట్టుకుని ఒక ఫోటో పోస్ట్ చేసింది. ‘ఒక పని మీద ఉన్నా. అయితే మీరు ఊహించేదే కాదు. విశేషాల కోసం ఎదురు చూడండి’ అని ఆ పోస్ట్‌లో క్యాప్షన్ రాసింది. అది చాలా వైరల్ అయ్యి బోలెడన్ని ఊహాగానాలు వచ్చాయి. దాని కొనసాగింపుగా తాజా పోస్ట్ వచ్చింది. అందులో కరీనా ఒక బేకింగ్ ట్రే నుంచి తన తాజా పుస్తకాన్ని బయటకు తీసి ‘వేడి వేడిగా ఇప్పుడే బయటకు వచ్చింది’ అని చూపించింది. ‘ఇది నా మూడోబిడ్డ. ఇన్నాళ్లూ దీని పనిలోనే ఉన్నా’ పుస్తకాన్ని తేవడం కూడా బిడ్డను కనడంతో సమానం అని వ్యాఖ్యానించింది. అందుకే ఆమె తన మునపటి పోస్ట్‌లో ఆల్ట్రాసౌండ్ స్కాన్ చూపింది. గర్భిణుల సర్వస్వం గర్భధారణ గురించి, గర్భం సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, ప్రసవం గురించి గతంలో అనేక పుస్తకాలు వచ్చాయి. అవి ఎక్కువ భాగం వైద్యనిపుణులు రాసినవి. అయితే ఇప్పుడు కరీనా రాసిన పుస్తకం ‘ప్రెగ్నెన్సీ బైబిల్’ కొంత భిన్నమైనది. ఒక ప్రసిద్ధ నటి తన సహజమైన సందేహాలకు తెలుసుకున్న సమాధానాలను, పాటించిన జాగ్రత్తలను, అందులో ఎప్పటికప్పుడు ఎదురైన సమస్యలను తన దృష్టికోణం నుంచి చెప్పడమే ఈ పుస్తకం ప్రత్యేకత. అంతే కాదు ఉద్యోగం/కెరీర్లో ఏదైనా సాధించాం లేదా సాధిస్తున్నాం అనుకునే స్త్రీలు గర్భధారణ సమయంలో ఆ పని విరామం వల్ల ఎటువంటి వొత్తిడికి, భావాలకు లోనవుతారో కూడా ఈ పుస్తకంలో తన అనుభవాల నుంచి ఆమె తెలియచేసింది. ఇద్దరు పిల్లల తల్లిగా ఆమె అనుభవం అనేక విషయాలను తెలిపే అవకాశం ఉంది. ఆమె ఈ పుస్తకాన్ని తన జ్ఞానంగా కాక గైనకాలజిస్ట్‌ల సాయంతో చేశానని వారి పేర్లు కూడా ప్రస్తావించింది. ఈ పుస్తకాన్ని ఎఫ్.ఓ.జి.ఎస్.ఐ (ఫెడరేషన్ ఆఫ్ ఆబ్స్టెట్రిక్ అండ్ గైనకాలజికల్ సొసైటీస్ ఆఫ్ ఇండియా) కూడా ఆమోదించడంతో ఇందులో ఉన్నది అథెంటిక్ సమాచారం అని చెప్పవచ్చు. మంచి చెడ్డా ‘నా తోటి హీరోయిన్లు పనిలో దూసుకుపోతుంటే నేను మంచం మీద నుంచి దిగలేని స్థితిలో ఉన్నాను. గర్భధారణ సమయంలో కొన్ని మంచి అనుభూతులు కలుగుతాయి. కొన్ని చెడు చిరాకులు రేగుతాయి. ఎన్నో సందేహాలు ఉంటాయి. మానసికంగా భౌతికంగా నేను ఎదుర్కొన్న సమస్యలకు పొందిన సమాధానాలను వ్యక్తిగత దృష్టికోణం నుంచి నేను తెలియచేశాను’ అని కరీనా తెలియచేసింది. ‘దీని ఆలోచన నుంచి పుస్తకం బయటకు రావడం వరకూ కూడా ఒక జననం లాంటిదే. అందుకే ఇది నా మూడో బిడ్డ’ అని ఆమె అంది. ఉమ్మడి కుటుంబాలు లేకపోవటం, ఇంటి పెద్దలు కలవడానికి వీలైన కుటుంబ జీవనం లేకపోవడం, బిజీ లైఫ్... ఇవన్నీ ఇప్పుడు గూగుల్ ద్వారానో పుస్తకాల ద్వారానో సందేహాలు తీర్చుకునే స్థితికి తీసుకెళ్లాయి. ఆ విధంగా చూసినప్పుడు కాబోయే తల్లుల కోసం ఈ పుస్తకం రాసి ఇక్కడ కూడా కరీనా హిట్ కొట్టినట్టే లెక్క. ఉద్యోగం/కెరీర్లో ఏదైనా సాధించాం లేదా సాధిస్తున్నాం అనుకునే స్త్రీలు గర్భధారణ సమయంలో ఆ పని విరామం వల్ల ఎటువంటి వొత్తిడికి, భావాలకు లోనవుతారో కూడా ఈ పుస్తకంలో తన అనుభవాల నుంచి ఆమె తెలియచేసింది. ఇద్దరు పిల్లల తల్లిగా ఆమె అనుభవం అనేక విషయాలను తెలిపే అవకాశం ఉంది. – సాక్షి ఫ్యామిలీ -
కాన్పుల వేల్పు.. మదురై తొలి మహిళా డాక్టర్ పద్మావతి
వేల మందికి ఆరోగ్యవంతమైన పుట్టినరోజులను ప్రసాదించిన మదురై కార్పొరేషన్ తొలి మహిళా డాక్టర్ పద్మావతి నేడు తన నూరవ యేటను పూర్తి చేసుకుంటున్నారు. ఆడపిల్లేంటి, మెడిసిన్ చదవడమేంటి అనే ఆ కాలపు అభ్యంతరాలను ఎదుర్కొని, ప్రభుత్వ డాక్టర్ అయి, ప్రసూతి మరణాలను తగ్గించడానికి గర్భిణుల ఇళ్లకే డాక్టర్లు వెళ్లి డెలివరీ చేసే వ్యవస్థను ఏర్పాటు చేశారు పద్మావతి. మెడికల్ ఆఫీసర్ గా కూడా మహిళల ఆరోగ్యం కోసం వైద్యచికిత్సల వ్యవస్థలో ఇంకా అనేక విప్లవాత్మకమైన మార్పులు తెచ్చిన ఈ ఆబ్స్టెట్రీషియన్ వృత్తిగత, వ్యక్తిగత జీవిత విశేషాలివి. గత ఎనిమిదేళ్లుగా కీళ్లవాతం, గత ఏడాదిన్నరగా కరోనా వైరస్ డాక్టర్ పద్మావతిని అడుగు తీసి అడుగు వేయకుండా చేస్తున్నాయి కానీ.. నూరేళ్లన్నది ఆమెను ఏమాత్రం నిరుత్సాహ పరిచే వయసు కాదు. ఏప్రిల్ 27న ఆమె 100వ పుట్టిన రోజును జరిపేందుకు ఇంటిల్లిపాదీ ఏర్పాట్లు మొదలుపెట్టారు. అయితే అది కేవలం ఆ ఇంటి వేడుక మాత్రమే కాదు. మదురై కార్పోరేషన్‌లోని ప్రతి ఇంటికి సంతోషాన్నిచ్చే సందర్భం. డాక్టర్ పద్మావతి ఆబ్స్టెట్రీషియన్. నార్మల్ డెలివరీలు చేయడంలో నిపుణురాలు. మదురై తొలి మహిళా డాక్టర్! తమిళనాడులోని మదురై 1950 లో మున్సిపాలిటీ అయింది. 1971లో కార్పోరేషన్ అయింది. 1949లో ఆమె మదురైలోని ‘గవర్నమెంట్ ఎర్స్కైన్ హాస్పిటల్’లో హౌస్ సర్జన్‌గా చేరారు. మద్రాస్ మెడికల్ కాలేజ్‌లో ఎంబీబీఎస్ పూర్తి చేసీ చేయగానే అక్కడ ఉద్యోగం వచ్చేసింది. అయితే పద్మావతి ఏనాడూ అదొక ఉద్యోగంలా చేయలేదు. యజ్ఞంలా నిర్వహించారు. సుఖ సాధారణ ప్రసవాలు, మాతాశిశు ఆరోగ్యమే ఆ యజ్ఞఫలాలు. ఆమె చేరేటప్పటికే అక్కడ ఆమె తండ్రి సీనియర్ సివిల్ సర్జన్. ఆయన ఎంత గొప్ప వైద్యుడైనా గానీ, కూతుర్ని మెడిసిన్ చదివించడమే గొప్పతనంగా ఆనాడు ఆయన గుర్తింపు పొందారు! పద్మావతి ఆస్టిన్ కారును తనే డ్రైవ్ చేసుకుంటూ ఆసుపత్రికి రావడం కూడా అప్పట్లో పెద్ద విశేషం అయింది. తండ్రి ఎంత స్వేచ్ఛ ఇచ్చాడో కదా అన్నారంతా. పెద్ద కుమారుడు గురుసుందర్ పెళ్లిలో పద్మావతి (కుడి చివర) యూఎస్‌లో కొందరు, చెన్నైలో కొందరుగా ఉన్న ముగ్గురు కొడుకులు, కూతురు, వాళ్ల జీవిత భాగస్వాములు, ఎనిమిది మంది మనవలు, నలుగురు మునిమనవలు పద్మావతి నూరవ పుట్టిన రోజు వేడుకలు చేయాలని ఉత్సాహ పడుతున్నారు. అయితే అందుకు ఆమె ఒప్పకోవడం లేదు.‘‘ఒక కేట్ కట్ చేయించి ఆ వీడియోను అందరికీ పంపిస్తే సరిపోతుంది’’ అని నిరంతరం తననే కనిపెట్టుకుని ఉండే పెద్ద కొడుకు డాక్టర్ గురుసుందర్కు ఆమె ఇప్పటికే ఆదేశాలు ఇచ్చేశారు. కరోనా గురించే ఆమె ఆందోళన. 1921 ఏప్రిల్ ఇరవై ఏడున ఆమె పుట్టగానే ఆమె తండ్రి డాక్టర్ ఆర్. సుందరరాజన్ ఆమెను కారణ జన్మురాలు అనేశారు! తొలి బిడ్డ ఆమె. ఆపై అప్పటికప్పుడు చిన్న పాట కూడా రాశారు. ఆ పాటలో ఆమె పేరు ముని ప్రేమ. పద్మావతి తల్లి మునియమ్మాళ్ పేరు మీద ముని అని ముద్దుగా పిలుచుకున్నారు.‘‘పెరిగి పెద్దయి స్త్రీల ఆరోగ్యానికి సంరక్షకురాలివి కావాలి’’ అని దీవించారు. ఆయన దీవెనలు ఫలించాయి. వేల పురుళ్లు పోశారు పద్మావతి. ఆసుపత్రికి రాలేని గర్భిణులు ఉంటే వారి కోసం ఆసుపత్రి సిబ్బందినే వారి ఇళ్లకు పంపించారు. ప్రభుత్వ డాక్టర్ అయి ఉండి కూడా కాన్పు చేయడానికి తనకై తను ఇళ్లకు వెళ్లిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. 1900 లలో మహిళలు ఎలా ఉండేవారో తెలిసే కూతుర్ని డాక్టర్ని చేశారు పద్మావతి తండ్రి. బాధ పడనన్నా పడతాం కానీ, మగ డాక్టరుకు మాత్రం చెప్పుకోము అన్నట్లుండేవారు. అప్పటికి ఆయన మదురైలో పేరున్న ‘లైసెన్స్›్డ మెడికల్ ప్రాక్టీషనర్’. తొమ్మిది మంది సంతానంలో పద్మావతితో పాటు ఐదుగురు ఆడపిల్లల్నీ ఆయన డాక్టర్లను చేశారు. మిగతా పిల్లల్లో ఇద్దరు మగపిల్లలు కూడా వైద్య వృత్తినే ఎంచుకున్నారు. ∙∙ పద్మావతి ఇంట్లో పెద్ద పిల్ల. ఆమె స్కూలుకు వెళుతున్నప్పుడు చూడాలి.. ‘‘మన ఇంటా ఒంటా ఉందా.. ఆడపిల్ల చదువుకోవడం’’ అని బంధువులంతా ముక్కుమీద వేలేసుకున్నారు. ఆమె పుస్తకాల సంచిని భుజంపై నుంచి లాగేసి విసిరికొట్టేసేవారు. తండ్రి వెంటనే ఆమెకు కొత్త పుస్తకాల సెట్ కొని తెచ్చేవారు. ఆయనొక్కరే పద్మావతికి మద్దతు. అలాగే పదిహేనేళ్లు దాటితే ఆడపిల్లలకు పెళ్లి చేసేయాలనే సంప్రదాయం బలంగా ఉండేది. దాన్ని కూడా కూతుర్ని వైద్యురాలిని చేయడం కోసం పక్కన పెట్టేశారాయన. ముదురైలోని అమెరికన్ కాలేజ్ లో ఇంటర్లో చేర్చారు! తర్వాత మెడిసిన్. గవర్నమెంట్ డాక్టర్ అయిన కొన్నాళ్లకే మదురైలోని ‘మున్సిపల్ మెటర్నిటీ హోమ్స్’ అన్నిటికీ పద్మావతి సూరింటిండెంట్ అయ్యారు. ప్రసవాలు సురక్షితంగా జరగడమూ మొదలైంది. ‘‘ఆమె చేతుల్లో పడితే చాలు’’ అనేంతగా మదురై అంతటా ఆమె పేరు తెలిసింది. 1969 లో ఆమె ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో పోలెండ్‌లో జరిగిన గర్భిణి, శిశు ఆరోగ్య వైద్య శిక్షణా సదస్సులకు హాజరయ్యారు. ఆ శిక్షణకు భారతదేశం నుంచి ఎంపికైన ముగ్గురు డాక్టర్లలో పద్మావతి ఒకరు. ఆమె సూచనలపై భారత ప్రభుత్వం కూడా ఆ తర్వాత కొన్ని మాతా శిశు సంరక్షణ విధానాలను అమలు పరిచింది. పద్మావతి పెళ్లి ఆమె 30వ యేట జరిగింది. భర్త రామస్వామి స్కూల్ హెడ్మాస్టర్. కొన్నాళ్లకే భర్త సహకారంతో మదురై పెరుమాళ్ కోయిల్ వీధిలో పది పడకల ఆసుపత్రి నిర్మించుకున్నారు. అదే వారి నివాసం కూడా. పద్మాలయ హెల్త్ క్లినిక్ అని ఆ వైద్య నివాసానికి పేరు పెట్టుకున్నారు. సిజేరియన్ సరంజామా లేని ప్రసూతి ఆసుపత్రి మదురై మొత్తంలో అదొక్కటే! కొడుకు, కూతురు చేత కూడా ఆమె ఒక ఆసుపత్రి పెట్టించారు. కొడుకు జనరల్ సర్జన్. కోడలు గైనకాలజిస్ట్. ‘‘మా అత్తగారు తన 90 వ యేట వరకూ కూడా నన్ను గైడ్ చేస్తూ వచ్చారు’’ అని కోడలు సుందరి చెబుతుంటారు. అంత ఉత్సాహం, అంత శక్తి ఆమెలో ఉండేవని. కోడలిగా ఆమె ఆ ఇంట్లోకి అడుగు పెట్టినప్పుడే చెప్పారట పద్మావతి.. ‘ఆడమనిషి యజమానిగా ఉండే ఇంట్లో ఆరోగ్యం ఉంటుంది’ అని. ఈ నూరేళ్ల వయసులోనూ పద్మావతి ఉదయాన్నే లేస్తారు. పూజ చేస్తారు. భక్తి గీతాలు పాడతారు. వార్తా పత్రికలు చదువుతారు. టీవీ చూస్తారు. ఫిజియో థెరపీ చేస్తారు. వేళకు భోంచేస్తారు. కరోనా వెళ్లిపోతే, వీల్ ఛెయిర్లో కాస్త బయటి తిరగాలని ఆమె ఆశపడుతున్నారు. -
పెరిగిపోతున్న కవలల సంఖ్య
సంతానం కోసం ఎంతో మంది దంపతులు ఎదురు చూస్తుంటారు. ఒకరు పుడితే ఓకే.. అదే ఒకేసారి ఇద్దరు పుడితే.. వారికి ఆ సంబరమే వేరు. మొదటిసారే అయినా, ఇప్పటికే పిల్లలున్నా.. మళ్లీ కవలలు పుడితే అదో ఆనందం, ఆశ్చర్యం.. మరి ఇలా ఏటా ప్రపంచవ్యాప్తంగా జన్మిస్తున్న కవల పిల్లల సంఖ్య పెరిగిపోతోందని తెలుసా? ఒకరిద్దరు కాదు ప్రపంచవ్యాప్తంగా ఏటా 16 లక్షల మంది కవలలు పుడుతున్నారు. ఇది మరింతగా పెరుగుతోంది. ముఖ్యంగా ఆఫ్రికా, ఆసియా ఖండాల్లో కవలల బర్త్ రేటు ఎక్కువగా ఉంటోంది. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. ప్రస్తుతం ఆఫ్రికాలో కవలల సంఖ్య ఎక్కువగా ఉంటున్నా.. భవిష్యత్తులో ప్రపంచవ్యాప్తంగా కవలల పుట్టుకలో భారత్, చైనాలే టాప్కు చేరే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 165 దేశాల్లో 1980–1985 మధ్య, 2010–2015 మధ్య పుట్టిన కవలలకు సంబంధించి డేటాను ఆక్స్ఫర్డ్ శాస్త్రవేత్తలు సేకరించి విశ్లేషించారు. మొత్తం ప్రసవాల్లో పుట్టిన కవలల శాతాన్ని.. అప్పటికి, ఇప్పటికి పోల్చి చూశారు. ఏయే ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉందన్నది లెక్కించి ఒక నివేదికను రూపొందించారు. ఉత్తర అమెరికా, ఆసియాలోనే ఎక్కువ ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా కవలలు జన్మిస్తున్న శాతం పెరిగినట్టు శాస్త్రవేత్తలు తేల్చారు. అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఈ రేటు ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు. 1980 దశకంతో పోలిస్తే ప్రధానంగా ఉత్తర అమెరికా (అమెరికా, కెనడా, మెక్సికో తదితర దేశాలు)లో ఏకంగా 71 శాతం పెరిగిందని, యూరప్‌లో 60 శాతం, ఆసియా ప్రాంతంలో 32 శాతం పెరిగిందని తెలిపారు. ఒక్క దక్షిణ అమెరికా ఖండంలో మాత్రమే కవలల బర్త్‌రేటు తగ్గిందని వెల్లడించారు. కవలల సంఖ్యాపరంగా చూస్తే.. ఆఫ్రికా, ఆసియా ఖండాల్లో ఎక్కువ మంది జని్మస్తున్నారు. అంతేకాదు సహజంగా పుడుతున్న కవలలు ఈ రెండు ఖండాల్లోనే ఎక్కువ. సాధారణంగా రెండు రకాలుగా కవలలు పుడుతుంటారు. మహిళల్లో అండం ఫలదీకరణ చెందాక రెండుగా విడిపోయి వేర్వేరు శిశువులుగా ఎదగడం ఒక రకమైతే.. ఒకేసారి రెండు అండాలు విడుదలై (డైజైగోటిక్), ఫలదీకరణ ద్వారా కవలలు పుట్టడం రెండో రకం. ఆఫ్రికా మహిళల్లో జన్యుపరంగా డైజోగోటిక్ పరిస్థితి ఉంటుందని, ఆసియా ఖండంలోని కొన్ని దేశాల్లోనూ ఈ పరిస్థితి ఉందని ఈ పరిశోధనలో భాగమైన ఆక్స్ఫర్డ్ వర్సిటీ ప్రొఫెసర్ క్రిస్టియన్ మోండెన్ తెలిపారు. ఇక యూరప్, ఉత్తర అమెరికా, మరికొన్ని చోట్ల ఐవీఎఫ్, హార్మోన్ చికిత్స, ఇతర కృత్రిమ గర్భధారణ పద్ధతుల ద్వారా ఎక్కువగా కవలలు పుడుతున్నారు. వైద్యం, పోషణ లేక మరణాలు పేద, మధ్య ఆదాయ దేశాల్లో కవలలు ఎక్కువగా జన్మిస్తున్నా చిన్నతనంలోనే చనిపోతున్నారని ఆక్స్ఫర్డ్ ప్రొఫెసర్ జెరోన్ స్మిత్ చెప్పారు. ఆఫ్రికాలో పుడుతున్న కవలల్లో చాలా వరకు ఇద్దరిలో ఎవరో ఒకరు మరణిస్తున్నారని.. తల్లికి పోషకాహారం లేక చిన్నారులు సరిగా ఎదకపోవడం, పుట్టిన తర్వాత కూడా సరైన పోషణ, వైద్యం అందకపోవడం దీనికి కారణమని పేర్కొన్నారు. ఇలా ఆఫ్రికాలో పుడుతున్న కవలల్లో ఏటా రెండు లక్షల మంది చనిపోతున్నారని తెలిపారు. కవలలు పుట్టడానికి కారణాలివీ.. కృత్రిమ గర్భధారణ (ఐవీఎఫ్) వినియోగం పెరిగిపోవడం కవలలు పెరగడానికి కారణాల్లో ఒకటి. పిల్లలు లేని దంపతులు ఐవీఎఫ్ చేయించుకునేప్పుడే కవలల కోసం ప్రయతి్నస్తున్నారు. మరోవైపు ఈ విధానంలో ఫెయిల్యూర్ రేటు సగం దాకా ఉండటంతో.. డాక్టర్లు ఎక్కువ పిండాలను ఫలదీకరణం చెందించి మహిళల గర్భంలో ప్రవేశపెడుతున్నారు. మహిళలు ఆలస్యంగా పిల్లల్ని కనడం కవలల పుట్టుకలో మరో కారణం. ఉద్యోగాలు, కెరీర్‌కు ప్రాధాన్యం ఇస్తున్న దంపతులు లేటు వయసులో పెళ్లి చేసుకోవడం, ఇంకా లేటుగా పిల్లల్ని కనడం జరుగుతోంది. 35, 40 ఏళ్ల వయసు దాటిన మహిళల్లో కవలలు పుట్టే అవకాశం ఎక్కువగా ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు. ► 30% -1980వ దశకంతో పోలిస్తే పెరిగిన కవలల పుట్టుక శాతం ► 16 లక్షలు ప్రపంచవ్యాప్తంగా ఏటా జన్మిస్తున్న కవల పిల్లల సంఖ్య ► 42లో ఒకరు సగటు ప్రసవాల్లో కవల పిల్లలు జన్మించే అవకాశం ► 80% ప్రపంచంలోని కవలల డెలివరీల్లో ఆఫ్రికా, ఆసియాలో జన్మిస్తున్నవారి శాతం -
ఏటా ప్రసవం.. అమ్మకు శాపం
వాళ్లకి ఆడ పిల్లలంటే చిన్నచూపు. మగబిడ్డ కోసం ఎంతమంది ఆడపిల్లల్ని అయినా కనేలా ఒత్తిడి చేస్తుంటారు. తొమ్మిది కాన్పుల వరకు మగబిడ్డ కోసం చూడటం.. అప్పటికీ పుట్టకపోతే మరో పెళ్లికి సిద్ధమవడం మగవారికి సర్వసాధారణం. ప్రసవం కోసం గర్భిణుల్ని ఆస్పత్రి గడప తొక్కనివ్వవు వారి కట్టుబాట్లు. గత్యంతరం లేక ఇంట్లోనే ప్రసవాలతో మాతా, శిశు మరణాల సంఖ్య పెరుగుతోంది. ఎటు చూసినా వెనుకబాటు తనం.. నిరక్షరాస్యత.. అధిక సంతానం.. అవగాహనా రాహిత్యం.. మూఢ నమ్మకాలు వెరసి ఆ పల్లెల బతుకు చిత్రాన్ని దయనీయంగా మార్చింది. దీనివల్ల ఎన్నెన్నో కుటుంబాలు పేదరికంలో కొట్టుమిట్టాడున్నాయి. బుక్కెడు బువ్వ కోసం వలస బాట పడుతున్నాయి. ఆరు జిల్లాల సాగు, తాగునీటి అవసరాల తీర్చే జల వనరుల రాజధాని.. శ్రీశైలం, మంత్రాలయం, అహోబిలం, మహానంది, యాగంటి లాంటి పుణ్య క్షేత్రాలు గల ఆధ్యాత్మిక భూమి కర్నూలు పల్లెల్లో ఇలాంటి దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. కౌతాళం మండలం హల్వి గ్రామానికి చెందిన ఈమె పేరు లలితమ్మ (వృత్తంలో). ముత్తన్న అనే వ్యక్తిని వివాహమాడింది. ఈమెకు 8 మంది ఆడపిల్లలు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ ఎందుకు చేయించుకోలేదని ప్రశ్నించగా.. ‘మగబిడ్డ కోసమయ్యా!’ అని బదులిచ్చింది. మద్యానికి బానిసైన ముత్తన్న అనారోగ్యంతో మరణించడంతో కుటుంబ భారం లలితమ్మపైనే పడింది. అంతమంది పిల్లల్ని కంటే కుటుంబాన్ని పోషించడం కష్టం కాదా అని అడిగితే.. ‘ఏమో అయ్యా! సెప్పేవారెవరూ లేకపోతిరి. మాకు సదువు రాదు. అంతే!’ అంది. ఇదే మండలంలోని మరిలి గ్రామానికి చెందిన మరియమ్మకు ఏడుగురు ఆడ పిల్లలు. జమ్మాలదిన్నెకు చెందిన హైమవతికి నలుగురు ఆడ బిడ్డలు కాగా.. ఆమె ప్రస్తుతం 7 నెలల గర్భిణి. అదే గ్రామంలోని శ్రీదేవికి ఐదుగురు ఆడబిడ్డలు, ముచ్చుగిరికి చెందిన మంగమ్మకు ఏకంగా 10 మంది సంతానం. వారిలో 9 మంది ఆడబిడ్డలే. ఏ గ్రామానికి వెళ్లినా ఇలాంటి కుటుంబాలు భారీగానే ఉన్నాయి. సాక్షి ప్రతినిధి/కర్నూలు : తొలి కాన్పునకు పుట్టింటికి తీసుకెళ్లడం సార్వసాధారణం. కానీ.. కోసిగి, మంత్రాలయం, కౌతాళం, పెద్దకడుబూరు మండలాలతో పాటు సమీపంలోని చాలా గ్రామాల్లో మహిళలు తొలి కాన్పు, బిడ్డ జననం పుట్టింట్లోనే జరగాలి. ఆస్పత్రికి వెళ్లకూడదనే నిబంధన పెట్టుకున్నారు. దీంతో గర్భిణులకు వైద్య పరీక్షలు ఉండవు. కడుపులో బిడ్డ ఆరోగ్యంగా ఉందా.. లేదా, గర్భిణి ఆరోగ్య పరిస్థితి ఏమిటనేవి పట్టించుకోరు. దీంతో బలహీనంగా, అనారోగ్య సమస్యలతో పుట్టే పిల్లలు కూడా ఎక్కువే. కాన్పు సమయంలో ఆస్పత్రికి వెళ్లకపోవడంతో ఇబ్బందిపడిన మహిళలు ఎందరో ఉన్నారు. ఇదేంటని ఆరా తీస్తే ‘ఆస్పత్రికి వెళితే ఆపరేషన్ చేస్తారు. ఒకసారి ఆపరేషన్ అయితే సాధారణ కాన్పు జరగదు. పైగా ఒక బిడ్డకు మాత్రమే అవకాశం ఉంటుంది. తొలి ఇద్దరు ఆడపిల్లలైతే మళ్లీ కాన్పునకు అవకాశం ఉండదు. అందుకే ఆస్పత్రికి వెళ్లకుండా ఇంట్లోనే కాన్పు చేసుకుంటాం’ అని చెబుతున్నారు. దీన్నిబట్టే ఇక్కడి ప్రజలు ఎంత అమాయకంగా, అనాగరికంగా అవగతం చేసుకోవచ్చు. వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు ఇక్కడి ప్రజలను కలిసి.. వారికి ఆస్పత్రి, చికిత్స, ఆరోగ్యంపై అవగాహన కల్పించి.. ఆస్పత్రులకు రప్పించడంలో ఘోరంగా విఫలమవుతున్నారు. నిరక్షరాస్యతలో మొదటి స్థానం మంత్రాలయం నియోజకవర్గంలోని కోసిగి మండలం నిరక్షరాస్యతలో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో, దేశంలో మూడో స్థానంలో ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం కర్నూలు జిల్లాలో నిరక్షరాస్యతలో మొదటి 10 స్థానాల్లో ఉన్న మండలాలివీ.. సుగ్గికెళితే కొంచెం ఎక్కువ బిడ్డల చదువు విషయమై కొందరి తల్లులను అడగ్గా.. ‘ఆడబిడ్డకు సదువెందుకయ్యా. కూలికి పోతే నూట యాభై వస్తాది. సుగ్గికి పోతే ఇంగా ఎక్కువొత్తాది!’ అన్నారు. ఈ ప్రాంతం నుంచి ఎక్కువ మంది బెంగళూరు వలస (సుగ్గి) పోతున్నారు. అక్కడ ఇళ్లు, వీధుల్లో స్వీపర్లుగా.. భవన నిర్మాణ కూలీలుగా.. వృద్ధులైతే ఇళ్లు, దుకాణాల వద్ద వాచ్మన్లుగా పని చేస్తున్నారు. కొందరు మహిళలు వేరుశనగ, శనగ గుగ్గిళ్లను రైళ్లలో విక్రయిస్తున్నారు. కొందరు పిల్లలు భిక్షాటన కూడా చేస్తున్నారు. రాత్రి 8 గంటలకు కోసిగి రైల్వే స్టేషన్లో ఇలాంటి వారు కనీసం 600 మంది రైలు దిగుతుంటారు. ఆస్పత్రికి పోదామంటే డబ్బుల్లేవు నాకు నలుగురు బిడ్డలు. 3, 4వ సంతానమైన షర్మిల (7), దివ్య (5)మూగవారు. ఆస్పత్రికి తీసుకెళ్దామంటే డబ్బుల్లేవు. ఏం సేస్తాం. మా బతుకులు ఇంతే. మమ్మల్ని పట్టించుకునేటోళ్లు లేరు. అందుకే ఇలా ఉండిపోయినాం. – ప్రమీల, జమ్మాలదిన్నె, కోసిగి మండలం చెల్లి కోసం బడికెళ్ల లేదు ఊయల ఊపుతున్న ఈ చిన్నారి పేరు దీపిక. తలారి రామంజనేయులు, లక్ష్మీదేవి ఈమె తల్లిదండ్రులు. వీరికి నలుగురు ఆడపిల్లలు. దీపిక పెద్దమ్మాయి. మధ్యాహ్యం 12.50 గంటలకు ఇంటివద్ద ఇలా కన్పించింది. ‘బడికి వెళ్లలేదా తల్లీ’ అని అడిగితే.. ‘సెల్లిని సూసుండేందుకు ఇంటికాడే ఉంటన్నా’ అని సమాధానమిచ్చింది. తల్లిదండ్రులు కూలి పనికి వెళ్తే.. చిన్న పిల్లలను చూసుకునేందుకు పెద్ద పిల్లలు బడి వదిలేసి ఇంటి వద్దే ఉంటారు. ఇలా దీపిక మాత్రమే కాదు.. చాలా మంది పిల్లలు బడికి వెళ్లకుండా చెల్లెళ్ల ఆలనా పాలన కోసం అక్షరాలకు దూరంగా భవిష్యత్‌ను బుగ్గిపాలు చేసుకుంటున్నారు. రైళ్లలోనూ ఇబ్బందులే నాకు ఇద్దరు కొడుకులు, ఇద్దరు ఆడ బిడ్డలు. రెండెకరాల సేనుంది. వానల్లేక, పంటలు పండక శానా ఇబ్బంది పడుతున్నాం. కూలికి పోదామన్నా పని ఉండదు. రైళ్లలో పండ్లు అమ్ముకుంటాం. రైలులో శానా ఇబ్బంది. పరిమిషన్ లేదని టీసీలు దించేస్తారు. కిందమీద పడతా బతుకుతాండాం. – రాగమ్మ, కోసిగి తిండిలేక.. ఎదుగదల లేక పెండ్లయిన ఏడాదికే భర్త శీను ఇడిసిపెట్టి పోయినాడు. ఇల్లు లేదు. పొలం లేదు. బెంగళూరుకు సుగ్గి పోతాం. బిడ్డను చూసుకునేటోళ్లు లేక నాతోపాటు తీసుకుపోతా. దీంతో పాపకు సదువు పోయినాది. 11 ఏళ్ల బిడ్డయినా తిండిలేక ఎదుగుదల ఆగిపోయినాది. – భీమక్క, కర్నూలు పశ్చిమ ప్రాంతం చదువుకోవాలని ఉంది..కానీ నేను ఒకటో తరగతి సదివినా. ఓ చెల్లెలు, తమ్ముడు ఉన్నారు. అమ్మవాళ్లు సుగ్గికి పోతే బువ్వ ఒండేటోళ్లుండరు. అందుకే నేనూ వాళ్లతో సుగ్గికి పోతా. బడికి పోవాలి, మందితో సదువుకోవాలని ఉంటాది కానీ.. ఆ అవకాశం లేదు. – లక్ష్మి, దేవకోసిగి, కోసిగి మండలం నేనూ షాకయ్యాను నేను ఇక్కడ బాధ్యతలు చేపట్టాక వైఎస్సార్ బడిబాట కోసం రిపోర్ట్ రప్పించుకుని చూస్తే నిరక్షరాస్యత ఎక్కువగా ఉందనే విషయం అర్థమైంది. ఆ ప్రాంతాల్లో ఉన్న పేదరికం, వలసలు, మూఢ నమ్మకాలు, మగబిడ్డ కోసం వరుస కాన్పులు చూసి షాక్ అయ్యాను. మంత్రాలయం నియోజకవర్గమే కాదు హాలహర్వి, హోళగంద, చిప్పగిరితో పాటు చాలా మండలాల్లో ఈ సమస్యలు ఉన్నాయి. దీన్ని అధిగమించేందుకు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. ఈ ప్రాంతంలో చిన్న, మధ్య తరహా పరిశ్రమలు నెలకొల్పి పేదరికాన్ని నిర్మూలించాలనుకున్నాం. అందుకే ఎస్‌హెచ్‌జీ గ్రూపులకు రూ.20 లక్షల నుంచి రూ.కోటి వరకూ రుణాలిచ్చి కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేయించాలని నిర్ణయం తీసుకున్నాం. – వీరపాండియన్, కలెక్టర్, కర్నూలు -
పురిటి పాట్లు
నార్నూర్(ఆసిఫాబాద్): ఆస్పత్రికి వెళ్లేందుకు సరైన రోడ్డు లేక ఓ గర్భిణి పురిటి నొప్పులతో ప్రసవ వేదన అనుభవించింది. ఆదిలాబాద్ జిల్లా గాదిగూడ మండలం డాబా–బి గ్రామపంచాయతీ పరిధిలోని పావునూర్ లొద్దిగూడ గ్రామానికి చెందిన సిడాం జంగుబాయికి బుధవారం ఉదయం పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. ఆమెను ఝరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లడానికి సరైన రోడ్డు లేక కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఏమి చేయాలో అర్థం కాక పావునూర్ గ్రామ యువకుడి సాయంతో ఏఎన్ఎం శ్రీదేవికి ఫోన్లో సమాచారం అందించారు. వర్షాకాలంలో గ్రామానికి కనీసం ద్విచక్ర వాహనం వెళ్లలేని పరిస్థితి. అయినా ఏఎన్ఎం శ్రీదేవి డాబా–బీ నుంచి పావునూర్ లొద్దిగూడకు దాదాపు 12 కిలో మీటర్లు కాలినడకన గ్రామానికి చేరుకున్నారు. పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణికి ఏఎన్ఎం ఇంట్లోనే పురుడు పోశారు. ఆడపిల్లకు జన్మనిచ్చిన తర్వాత మహిళకు రక్తస్రావం బాగా జరగడంతో మెరుగైన వైద్యం కోసం ఝరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించడానికి నానా తంటాలు పడ్డారు. లొద్దిగూడ నుంచి 12కి.మీ. దూరంలో ఉన్న డాబా వరకు ఎడ్లబండిపై తీసుకొచ్చి..అక్కడి నుంచి 108లో ఝరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. పావునూర్ లొద్దిగూడలో మొత్తం 30 కొలాం గిరిజన కుటుంబాలు నివాసం ఉంటున్నప్పటికీ గ్రామానికి కనీసం రోడ్డు మార్గం లేదు. రోడ్డు కోసం గత పదేళ్లుగా పాలకులు, అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. -
సంతానం పొందేందుకు సెలవు
మదురై: సంతానం పొందేందుకు వీలుగా యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న ఓ ఖైదీకి మద్రాస్ హైకోర్టు రెండు వారాల సెలవు ఇచ్చింది. తిరునల్వేలి జిల్లా కేంద్ర కారాగారంలో ఉన్న 40 ఏళ్ల సిద్ధిక్ అలీకి ఈ అవకాశమిచ్చింది. ఆయన భార్య దాఖలుచేసిన హెబియస్‌కార్పస్ పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం అలీకి రెండు వారాల సెలవు మంజూరు చేస్తూ ఆదేశాలిచ్చింది. అవసరమైతే సెలవును మరో రెండు వారాలు పొడిగించే విషయాన్ని పరిశీలిస్తామని తెలిపింది. ఖైదీలు తమ జీవిత భాగస్వాములను కలుసుకునే అంశాన్ని పరిశీలించేందుకు ప్రభుత్వం ఒక కమిటీని నియమించేందుకు ఇదే తగిన సమయమని బెంచ్ అభిప్రాయపడింది. ఈ సౌకర్యం చాలా దేశాల్లో అమల్లో ఉందని గుర్తుచేసింది. జీవిత భాగస్వాములను కలుసుకోవడం ఖైదీల కనీస హక్కని కేంద్రం ఆమోదించిన ఓ తీర్మానాన్ని ప్రస్తావించింది. -
క్యాబ్‌లో ప్రసవం...
పుణే: ఆసుపత్రికి వెళ్తుండగా ఓ మహిళ క్యాబ్‌లోనే ప్రసవించి మగ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఆమె ఆనందాన్ని రెట్టింపు చేసే వార్తను ఆ క్యాబ్ యాజమాన్యం ఓలా చెప్పింది. తన బిడ్డతో పాటు ఆమె తమ క్యాబ్‌లలో ఐదేళ్లపాటు ఉచితంగా ప్రయాణించొచ్చని ప్రకటించింది. పుణేకు చెందిన 21 ఏళ్ల ఈశ్వరిసింగ్ విశ్వకర్మకు అక్టోబర్ 2న పురిటినొప్పులు ప్రారంభమవడంతో ఆమె భర్త ఓలా క్యాబ్‌ను బుక్ చేశారు. సోదరుడు, తల్లి ఆమె వెంట క్యాబ్‌లో ఉండగా వారి వెనకే ఈశ్వరిసింగ్ భర్త బైక్‌పై వెళ్లారు. ఐదు కిలోమీటర్లు ప్రయాణించిన తరువాత క్యాబ్‌లోనే ఈశ్వరిసింగ్ బిడ్డకు జన్మనిచ్చింది. ఆసుపత్రికి వచ్చిన తరువాత వైద్యులు బిడ్డ బొడ్డతాడును తొలగించి ఆసుపత్రిలో చేర్చుకున్నారు. తల్లీబిడ్డలు గురువారం డిశ్చార్జి అయ్యారు. -
మహిళ కడుపులో బ్యాండేజ్
ప్రభుత్వ డాక్టర్లు, నర్సుకు అరెస్టు వారెంట్ టీ.నగర్: ప్రసవం చేసే సమయంలో మహిళ కడుపులో బ్యాండేజ్‌తో కుట్లు వేసిన ప్రభుత్వ డాక్టర్లు, నర్సుకు కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది. దిండివనం తిరువళ్లువర్ నగర్‌కు చెందిన చోళయప్పన్ (48) కీళమావిళంగైలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. ఇతని భార్య ధరణి (39). ఈమెను గత 26 మే 2004లో ప్రసవం కోసం పుదుచ్చేరి ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ ఆమెకు 7 జూన్ 2004లో శస్త్ర చికిత్సను చేయగా మగబిడ్డ జన్మించింది. ఆ సమయంలో ఆమెకు కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్స చేశారు. అనంతరం 15 జూన్ 2004న ధరణి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అయితే ఆమె 30–06–2004 వరకు తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతూ వచ్చారు. దీంతో ఆమెను మళ్లీ పుదుచ్చేరి ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ ఆమెకు చికిత్సలు అందించి 13 జులై 2004లో డిశ్చార్జ్ చేశారు. అయితే ఇంటికి వచ్చిన ధరణికి ఆపరేషన్ చేసిన స్థలం నుంచి రక్తస్రావం జరుగుతూ వచ్చింది. ఆ తరువాత దిండివనం, విల్లుపురం, చెన్నై ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్సలు పొందారు. 23 సెప్టెంబర్ 2004న చెన్నై ప్రైవేటు ఆసుపత్రిలో స్కాన్ చేయగా కడుపులో బ్యాండేజ్ ఉన్నట్లు తెలిసింది. దీంతో చోళయప్పన్ పుదుచ్చేరి ప్రభుత్వ ఆసుపత్రిలో ఫిర్యాదు చేశారు. ధరణికి చికిత్సలు అందించిన డాక్టర్లు విజయభాను, జయంతి, నర్సు ఉమలపై పుదుచ్చేరి సెషన్స్ కోర్టులో కేసు దాఖలు చేశారు. ఈ కేసు 13 ఏళ్లుగా విచారణ జరుగుతూ వచ్చింది. అయితే ఇద్దరు డాక్టర్లు, నర్సు విచారణకు కోర్టులో హాజరు కాలేదు. దీంతో మెజిస్ట్రేట్ దయాళన్ డాక్టర్లు, నర్సుకు నాన్‌బెయిలబుల్ అరెస్టు వారెంట్ శనివారం జారీ చేశారు. -
పుట్టింటికి పంపేందుకు వెరైటీ కండీషన్..!
రాంఛీ: జార్ఖండ్ తల్లిదండ్రులు తమ కుమార్తెలను రెండు రాష్ట్రాలకు తప్ప ఇతర ప్రాంతాల వాళ్లకు ఇచ్చి వివాహం చేస్తామంటున్నారు. రాజస్థాన్, హర్యానా రాష్ట్రాల అబ్బాయిలకు తమ అమ్మాయిలతో వివాహం చేస్తే.. తొలిచూరు కాన్పు అయ్యేంతవరకు పుట్టింటికి పంపించడం లేదట. దీనికి కారణం వింటే ఆశ్చర్యపోతారు. కాన్పు తర్వాత పుట్టింటికి వెళ్లిన మహిళలు కచ్చితంగా తిరిగి అత్తవారింటికి వస్తారని ఓ తాజా నివేదికలో వెల్లడైంది. పిల్లలు పుట్టకముందే భార్యను పుట్టింటికి పంపినట్లయితే, అత్తగారితో, ఆ ఇంట్లోని భర్త సోదరితో ఏదైనా గొడవ ఉంటే తిరిగి తమ ఇంటి గడప తొక్కరని హర్యానా, రాజస్థాన్ వాసుల్లో అపనమ్మకం ఏర్పడింది. గతంలో కొంత మంది వివాహితలు గర్భవతి అవ్వకముందే పుట్టింటికి వెళ్లడం, అత్తింట్లో సమస్యలను భరించలేక తిరిగి రాకపోవడంతో ఆ రెండు రాష్ట్రాల వాళ్లు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారని సమాచారం. ఎలాగైనా తన వివాహాన్ని ఆపాలని ఓ మైనర్ బాలిక ఎన్జీఓ ప్రతినిధికి కాల్ చేసి, తన సమస్యలను వివరించింది. తనకు తెలిసిన ఓ యువతిని రాజస్థాన్ యువకుడు వివాహం చేసుకున్నాడని, అయితే ఆమె గర్భవతి అయ్యేంత వరకు పుట్టింటికి పంపించడం లేదని తెలిపింది. దీంతో ఆ ఎన్జీఓ చేసిన సర్వేలో ఈ వివరాలు వెలుగుచూశాయి. జార్ఖండ్ ఈస్ట్ సింగ్భమ్ జిల్లా బాలికల సంక్షేమ సంఘం చైర్ పర్సన్ ప్రభా జైశ్వాల్ ఈ విషయంపై స్పందిస్తూ.. గతంలో తన దృష్టికి ఇలాంటి ఫిర్యాదులు వచ్చాయని, రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఈ సమస్య ఉందని చెప్పారు. ఆర్థిక సమస్యలతో తొందరపడి మైనర్లుగా ఉన్నప్పుడే పెళ్లి చేస్తున్నారని ఆ తర్వాత వారి కష్టాలు చూసి పేరెంట్స్ విచారిస్తున్నారని ఆమె వివరించారు. -
వరంగల్ ప్రసూతి ఆస్పత్రిలో ప్రసవ కష్టాలు
-
భారత్‌లో ప్రతి గంటకు ఐదుగురు తల్లుల మరణాలు
భారత్‌లో ప్రతి గంటకు దాదాపు ఐదుగురు తల్లులు చనిపోతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) వెల్లడించింది. శిశువులకు జన్మినిచ్చే క్రమంలో, ఆ తర్వాత ఎక్కువ రక్తస్రావం జరగడం జరగడం వల్లే ఈ తల్లుల మరణాలు పెరిగిపోతున్నాయని డబ్ల్యూహెచ్‌వో అభిప్రాయపడింది. చాలా దేశాలలో ఈ సమస్య ఉన్నా, అధిక రక్త హీనత, అధిక రక్తస్రావం కారణంగా బిడ్డకు జన్మినిస్తున్న భారతీయ తల్లుల మరణాలు అధికంగా సంభవిస్తున్నాయి. ప్రతీ ఏడాది భారత్ లో 45,000 మంది తల్లులు చిన్నారులకు జన్మనివ్వడం, తదిదర సంబంధిత కారణాతో కన్నుమూస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న బాలింత మరణాలలో అత్యధికంగా భారత్ లోనే 17 మరణాలు సంభవిస్తున్నాయని డబ్ల్యూహెచ్‌వో అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డెలివరీ సమయంలో తల్లులు కేవలం 24 గంటల వ్యవధిలోనే 500 నుంచి 1000మి.లీ రక్తస్రావం జరగడంతో అధిక మరణాలు సంభవిస్తున్నాయని, తగిన చర్యలు తీసుకుంటే మరణాలు చాలా మేరకు తగ్గించవచ్చునని డబ్ల్యూహెచ్‌వో వివరించింది. -
అబ్బుర పరుస్తున్న'బర్త్ ఫొటోగ్రఫీ'
జీవితంలో కొన్ని విలువైన క్షణాలను ఫోటోల రూపంలో దాచుకోవడం మామూలే. అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీతో పాటు ఫొటోగ్రఫీ రంగం కూడా అనేక కొత్త పుంతలు తొక్కింది. ఈ నేపథ్యంలో విభిన్నరకాల ఫొటోలు ప్రాచుర్యంలోకి వచ్చాయి. వీటిలో చెప్పుకోదగ్గది బర్త్ ఫొటోగ్రఫీ. మిగతావాటితో పోలిస్తే ఇది ప్రత్యేకమైనదనే చెప్పాలి. భూ ప్రపంచంలో జీవి పుట్టుకను మించిన అందమైనది మరేదీ లేదన్న లిండ్సే స్ట్రాడ్నర్ మాటలు అక్షర సత్యాలు. బర్త్ ఫొటోగ్రాఫర్స్ ఇంటర్నేషనల్ అసోసియేషన్ (IAPBP) ప్రచురించిన కొన్ని ఫొటోలు చూస్తే ఇదే నిజమనిపిస్తుంది. 2016 సంవత్సరానికి నిర్వహించిన బర్త్ ఫొటోగ్రఫీ విజేతలను సంస్థ ఇటీవల ప్రకటించింది. ఈ ఫొటోలను సంస్థ వ్యవస్థాపకుడు లిండ్సే వెలువరించారు. ఈ రంగంలో ప్రావీణ్యం కలిగిన ఫొటోగ్రాఫర్లు తీసిన అద్భుతమైన షాట్లు పలువురిని ఆకట్టుకున్నాయి. ఒక కొత్త జీవి ప్రపంచంలోకి అడుగుపెట్టే క్షణాలను అపురూపంగా చిత్రించిన తీరు పలువురిని విస్మయపర్చింది. భావోద్వేగంతో కూడిన ఆ ఆనంద క్షణాలను పదిలంగా ఒడిసిపట్టుకున్న తీరు అద్భుతంగా నిలిచింది. ఈ కళలో ఆర్టిస్టుల నైపుణ్యాన్ని అభినందించి తీరాల్సిందే. ఆ ఫొటోలలో కొన్ని మీ కోసం... -
భార్య శవంతో బస్సు ప్రయాణం