క్యాబ్‌లో ప్రసవం... | Woman gives birth to baby boy in Ola cab. | Sakshi
Sakshi News home page

క్యాబ్‌లో ప్రసవం

Oct 6 2017 4:41 AM | Updated on Oct 6 2017 4:41 AM

Woman gives birth to baby boy in Ola cab.

పుణే: ఆసుపత్రికి వెళ్తుండగా ఓ మహిళ క్యాబ్‌లోనే ప్రసవించి మగ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఆమె ఆనందాన్ని రెట్టింపు చేసే వార్తను ఆ క్యాబ్‌ యాజమాన్యం ఓలా చెప్పింది. తన బిడ్డతో పాటు ఆమె తమ క్యాబ్‌లలో ఐదేళ్లపాటు ఉచితంగా ప్రయాణించొచ్చని ప్రకటించింది. పుణేకు చెందిన 21 ఏళ్ల ఈశ్వరిసింగ్‌ విశ్వకర్మకు అక్టోబర్‌ 2న పురిటినొప్పులు ప్రారంభమవడంతో ఆమె భర్త ఓలా క్యాబ్‌ను బుక్‌ చేశారు.

సోదరుడు, తల్లి ఆమె వెంట క్యాబ్‌లో ఉండగా వారి వెనకే ఈశ్వరిసింగ్‌ భర్త బైక్‌పై వెళ్లారు. ఐదు కిలోమీటర్లు ప్రయాణించిన తరువాత క్యాబ్‌లోనే ఈశ్వరిసింగ్‌ బిడ్డకు జన్మనిచ్చింది.  ఆసుపత్రికి వచ్చిన తరువాత వైద్యులు బిడ్డ బొడ్డతాడును తొలగించి ఆసుపత్రిలో చేర్చుకున్నారు. తల్లీబిడ్డలు గురువారం డిశ్చార్జి అయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement