
భద్రాచలంఅర్బన్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ సతీమణి మాధవి.. ప్రసవం కోసం మంగళవారం రాత్రి భద్రాచలం ప్రభుత్వాస్పత్రిలో చేరారు. రాత్రి 12 గంటల సమయానికి ఆమెను కుటుంబసభ్యులు దవాఖానాకు తీసుకెళ్లారు.
వైద్య సిబ్బంది వివిధ పరీక్షలు నిర్వహించారు. ప్రభుత్వాస్పత్రుల్లో ఇటీవల వైద్యసేవలు మెరుగవగా.. ప్రజల్లో మరింత నమ్మకం కలిగించేందుకు కలెక్టర్ తన సతీమణిని చేర్పించారని కుటుంబసభ్యులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment