
మదురై: సంతానం పొందేందుకు వీలుగా యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న ఓ ఖైదీకి మద్రాస్ హైకోర్టు రెండు వారాల సెలవు ఇచ్చింది. తిరునల్వేలి జిల్లా కేంద్ర కారాగారంలో ఉన్న 40 ఏళ్ల సిద్ధిక్ అలీకి ఈ అవకాశమిచ్చింది. ఆయన భార్య దాఖలుచేసిన హెబియస్‌కార్పస్ పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం అలీకి రెండు వారాల సెలవు మంజూరు చేస్తూ ఆదేశాలిచ్చింది.
అవసరమైతే సెలవును మరో రెండు వారాలు పొడిగించే విషయాన్ని పరిశీలిస్తామని తెలిపింది. ఖైదీలు తమ జీవిత భాగస్వాములను కలుసుకునే అంశాన్ని పరిశీలించేందుకు ప్రభుత్వం ఒక కమిటీని నియమించేందుకు ఇదే తగిన సమయమని బెంచ్ అభిప్రాయపడింది. ఈ సౌకర్యం చాలా దేశాల్లో అమల్లో ఉందని గుర్తుచేసింది. జీవిత భాగస్వాములను కలుసుకోవడం ఖైదీల కనీస హక్కని కేంద్రం ఆమోదించిన ఓ తీర్మానాన్ని ప్రస్తావించింది.
Comments
Please login to add a commentAdd a comment