భారత్లో ప్రతి గంటకు ఐదుగురు తల్లుల మరణాలు
భారత్లో ప్రతి గంటకు దాదాపు ఐదుగురు తల్లులు చనిపోతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్వో) వెల్లడించింది. శిశువులకు జన్మినిచ్చే క్రమంలో, ఆ తర్వాత ఎక్కువ రక్తస్రావం జరగడం జరగడం వల్లే ఈ తల్లుల మరణాలు పెరిగిపోతున్నాయని డబ్ల్యూహెచ్వో అభిప్రాయపడింది. చాలా దేశాలలో ఈ సమస్య ఉన్నా, అధిక రక్త హీనత, అధిక రక్తస్రావం కారణంగా బిడ్డకు జన్మినిస్తున్న భారతీయ తల్లుల మరణాలు అధికంగా సంభవిస్తున్నాయి.
ప్రతీ ఏడాది భారత్ లో 45,000 మంది తల్లులు చిన్నారులకు జన్మనివ్వడం, తదిదర సంబంధిత కారణాతో కన్నుమూస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న బాలింత మరణాలలో అత్యధికంగా భారత్ లోనే 17 మరణాలు సంభవిస్తున్నాయని డబ్ల్యూహెచ్వో అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డెలివరీ సమయంలో తల్లులు కేవలం 24 గంటల వ్యవధిలోనే 500 నుంచి 1000మి.లీ రక్తస్రావం జరగడంతో అధిక మరణాలు సంభవిస్తున్నాయని, తగిన చర్యలు తీసుకుంటే మరణాలు చాలా మేరకు తగ్గించవచ్చునని డబ్ల్యూహెచ్వో వివరించింది.