Janagama MCH Is Another Record - Sakshi
Sakshi News home page

24 గంటల్లో 31 కాన్పులు

Published Wed, Jul 26 2023 3:43 AM | Last Updated on Wed, Jul 26 2023 9:21 PM

Janagama MCH is another record - Sakshi

 జనగామ: జనగామ మాతాశిశు సంరక్షణ ఆరోగ్య కేంద్రం(ఎంసీహెచ్‌) ప్రసవాల్లో మరో రికార్డు సృష్టించింది. 24 గంటల వ్యవధిలో 31 కాన్పులు చేసి.. వైద్యులు సర్కారు దవాఖానా సత్తా చాటారు. సాధారణ ప్రసవాలు–17, ఆపరేషన్లు 14 కాగా... ఇందులో 12మంది మగపిల్లలు, 19 మంది ఆడపిల్లలు జన్మించారు. అందరూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ సుగుణాకర్‌రాజు ఆధ్వర్యంలో అసిస్టెంటు ప్రొఫెసర్‌ డాక్టర్‌ స్రవంతి, డాక్టర్లు సౌమ్యారెడ్డి, సిరిసూర్య, సిబ్బంది సంగీత, విజయరాణి, సెలెస్టీనా ప్రసూతి కాన్పులు చేశారు.

ఎంసీహెచ్‌ వైద్యుల అంకితభావంతో సర్కారు దవాఖానాలపై ప్రజలకు మరింత నమ్మకం పెరుగుతోందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ట్వీట్‌ చేశారు. రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కూడా వీరిని అభినందిస్తూ, ప్రతి ఒక్కరూ సర్కారు దవాఖానాల సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement