Health center
-
వైద్య లోకాన్ని దిగ్భ్రాంతికి గురి చేసేలా వింత శిశువు జననం..!
బెంగళూరు: వైద్య లోకాన్ని దిగ్భ్రాంతికి గురి చేసేలా వింత శిశువు జిల్లాలోని నంజనగూడు తాలూకాలోని హురా గ్రామంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో జన్మించింది. పుట్టిన శిశువును చూసి తల్లిదండ్రులు, వైద్యులు నోరెళ్లబెట్టారు. విచిత్రమైన కళ్లు, పెదవులు, ఒళ్లంతా బొగ్గులా నలుపు రంగుతో కూడి చూపరులకు వింత గొలిపింది. హురా గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వ్యాప్తిలోని ఒక గ్రామానికి చెందిన గర్భిణి నెలలు నిండి ప్రసవానికి చేరింది. కాన్పు కాగా శిశువు వింత ఆకారంతో జన్మించడం చూసి అవాక్కయ్యారు. శిశువు ఆరోగ్యం బాగా లేకపోవడంతో మైసూరులోని చెలువాంబ ఆస్పత్రిలో ఐసీయూలో చేర్పించారు.ఇది రెండోసారిఈ మహిళకు వింత శిశువు జన్మించడం ఇది రెండవసారి. కొన్నేళ్ల క్రితం ఇదే దంపతులకు ఇలాంటి రూపం కలిగిన శిశువు జన్మించింది. నాలుగైదు రోజుల తర్వాత మరణించింది. ఇప్పుడు పునరావృతమైంది. ఈ పరిణామం వైద్య లోకానికి సవాలు విసిరినట్లయింది. చాలా దగ్గరి బంధువుల మధ్య పెళ్లి జరగడం, లేదా ఆ దంపతులలో విపరీతమైన జన్యు సమస్యలు ఉండడం వల్ల ఇలా జరుగుతుందని వైద్యులు తెలిపారు. -
ఏపీలో వైద్య సేవలు అమోఘం
తాడేపల్లిరూరల్: ఏపీలోని డాక్టర్ వైఎస్సార్ అర్బన్ హెల్త్ సెంటర్లలో వైద్య సేవలు అమోఘంగా ఉన్నాయని నేషనల్ హెల్త్ రీసోర్స్ సెంటర్ నుంచి వచ్చిన బృంద సభ్యులు డాక్టర్ ఎస్.వినోద్‌కుమార్, మొహమ్మద్ షేక్‌లు కితాబిచ్చారు. గుంటూరు జిల్లా తాడేపల్లి పట్టణ పరిధిలోని ప్రకాష్‌నగర్ డ్రైవర్ కాలనీలో బుధవారం డాక్టర్ వైఎస్సార్ అర్బన్ హెల్త్ సెంటర్‌ను వారు సందర్శించారు. వైద్యశాల ఆధ్వర్యంలో అందిస్తున్న సేవలను వివరించేందుకు ఒక స్టాల్‌ను ఏర్పాటు చేశారు. ముందుగా గర్భిణులకు, చిన్నారులకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న పౌష్టికాహారాన్ని, పోషక విలువలను అడిగి తెలుసుకుని.. చాలా అమోఘంగా ఉందని ప్రశంసించారు. అనంతరం వైద్యశాలలో కుష్టు వ్యాధికి, ఇతర దీర్ఘకాలిక వ్యాధులకు అందిస్తున్న చికిత్సతో పాటు, రోగులకు ఇస్తున్న కౌన్సెలింగ్ సెంటర్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏపీలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అర్బన్ హెల్త్ సెంటర్లలో వైద్య సేవలు చాలా బాగున్నాయన్నారు. కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా అన్ని వసతులను ఏర్పాటు చేశారని కొనియాడారు. ప్రతి ఆస్పత్రిలో ఇన్‌పేషెంట్ సౌకర్యం కూడా కల్పించారని, అన్ని రకాల రక్త పరీక్షలు, ఇతర పరీక్షలు చేస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఉప ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ మన్మోహన్, తాడేపల్లి ప్రభుత్వ వైద్యులు డాక్టర్ కిరణ్‌కుమార్, డాక్టర్ వైఎస్సార్ అర్బన్ హెల్త్ సెంటర్ వైద్యుడు డాక్టర్ మానస తదితరులు పాల్గొన్నారు. -
24 గంటల్లో 31 కాన్పులు
జనగామ: జనగామ మాతాశిశు సంరక్షణ ఆరోగ్య కేంద్రం(ఎంసీహెచ్) ప్రసవాల్లో మరో రికార్డు సృష్టించింది. 24 గంటల వ్యవధిలో 31 కాన్పులు చేసి.. వైద్యులు సర్కారు దవాఖానా సత్తా చాటారు. సాధారణ ప్రసవాలు–17, ఆపరేషన్లు 14 కాగా... ఇందులో 12మంది మగపిల్లలు, 19 మంది ఆడపిల్లలు జన్మించారు. అందరూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సుగుణాకర్‌రాజు ఆధ్వర్యంలో అసిస్టెంటు ప్రొఫెసర్ డాక్టర్ స్రవంతి, డాక్టర్లు సౌమ్యారెడ్డి, సిరిసూర్య, సిబ్బంది సంగీత, విజయరాణి, సెలెస్టీనా ప్రసూతి కాన్పులు చేశారు. ఎంసీహెచ్ వైద్యుల అంకితభావంతో సర్కారు దవాఖానాలపై ప్రజలకు మరింత నమ్మకం పెరుగుతోందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ట్వీట్ చేశారు. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కూడా వీరిని అభినందిస్తూ, ప్రతి ఒక్కరూ సర్కారు దవాఖానాల సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. -
ఏపీలో గ్రామీణ పీహెచ్ సీల పనితీరు అద్భుతమని కేంద్రం వెల్లడి
-
అమ్మా ఎందుకు వదిలేశావ్..?
రాత్రి 8 గంటల సమయం. చుట్టూ చిమ్మచీకటి. మెల్లగా ముసురుకుంటున్న చలి గాలులు. నిశ్శబ్దమైన వాతావరణంలో వినిపించిన ఓ పసికందు రోదన కోష్ట గ్రామాన్ని ఉలిక్కిపడేలా చేసింది. తొమ్మిది నెలలు అమ్మ కడుపులో భద్రంగా ఉన్న బిడ్డ ఆ పేగు తెంచుకున్నాక.. బంధాలకు కూడా దూరమై ఇలా చీకటిలో నిస్సహాయంగా స్థానికుల కంట పడింది. జేఆర్‌పురం ఎస్ఐ జి.రాజేష్ తెలిపిన వివరాల మేరకు.. కోష్ట గ్రామంలోని ఒక కర్రల మోపుపై ఎవరో ఒక ఆడ పసికందును విడిచిపెట్టి వెళ్లిపోయారు. స్థానికులు పసిపాప ఏడుపులు విని పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఎస్ఐ రాజేష్ పాపను రణస్థలం సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఈ బిడ్డను ఎవరు ఇక్కడ వదిలి వెళ్లిపోయారో తెలియాల్సి ఉంది. పసికందు 1.5 కిలోల బరువు ఉందని, జన్మించి ఒక రోజు అయి ఉంటుందని భావిస్తున్నారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ రాజేష్ తెలిపారు. (చదవండి: సిక్కోలు గుండెల్లో ఆ గురుతులు పదిలం) -
ఘోరం: నర్సుపై సాముహిక అఘాయిత్యం
భోపాల్: ఆరోగ్య కేంద్రంలో నర్సుగా పనిచేస్తున్న మహిళపై మైనర్‌తో సహా నలుగురు సాముహిక అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ ఘటన చత్తీస్‌గఢ్‌లోని మహేంద్రగఢ్ జిల్లాలో చోటు చేసుకుంది. నిందితులు భాధితురాలి పనిచేస్తున్న ఆరోగ్య కేంద్రంలో ఒంటరిగా ఉండటం గమనించి ఈ దారుణానికి తెగబడ్డారు. శుక్రవారం సాయంత్రం మూడు గంటల సమయానికి ఈ ఆరోగ్య కేంద్రంలోకి చోరబడి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడటమే గాక హత్య చేసేందుకు కూడా యత్నించారు. దీంతో బాధితురాలి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగు చూసింది. ఈ మేరకు పోలీసులు 17 ఏళ్ల మైనర్‌తో సహా ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశామని, మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. ఈ ఘటనతో ఆరోగ్య కార్యకర్తల బృందం మారుమూల ప్రాంతాల్లో విధుల నిర్వర్తించడంపై ఆందోళన వ్యక్తం చేయడమే గాక చత్తీస్‌గఢ్ ప్రభుత్వాన్ని తమకు భద్రత కావాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో జిల్లా ఆరోగ్య కేంద్రం ఛీఫ్ అధికారి ప్రతిమ సింగ్ మాట్లాడుతూ..తమకు భద్రత కావాలని, అలాగే ఈ నిందితులపై కఠిన చర్యలు తీసుకోకపోతే తాము విధులు నిర్వర్తించమని కరాఖండిగా చెప్పారు. (చదవండి: విచారణ సమయంలో నిందితుడి ఆత్మహత్య) -
ఎందుకింత నిర్లక్ష్యం?
కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): ‘రోగులకు వైద్యం అందించడంలో ఎందుకింత నిర్లక్ష్యంగా ఉన్నారు. సమయానికి విధులకు ఎందుకు హాజరు కావడం లేదు. కరోనా లక్షణాలతో పేషెంట్ ఆస్పత్రికి వస్తే ఏం ట్రీట్మెంట్ చేస్తారు.. ’ అని కలెక్టర్ సిక్తాపట్నాయక్ కాల్వశ్రీరాంపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బందిని ప్రశ్నించారు. ఆరోగ్య కేంద్రాన్ని శుక్రవారం ఉదయం ఆకస్మికంగా తనిఖీ చేశారు. డాక్టర్లు, హెడ్ సిస్టర్లు, స్టాఫ్ నర్సులు, సిబ్బంది పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కరోనా పేషెంట్ వస్తే కనీసం మీరైనా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారని ప్రశ్నించారు. ఎవరూ సరిగా సమాధానం చెప్పకపోవడంతో మందలించారు. అసలు ఆసుపత్రిలో పీపీఈ సెట్లు, మాస్క్‌లు ఉన్నాయా అని ప్రశ్నించినా ఎవరూ నోరు మెదపలేదు. ఇంత నిర్లక్ష్యంగా ఎందుకు పనిచేస్తున్నారని కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమయపాలన పాటించని ఆస్పత్రి వైద్య సిబ్బందికి వెంటనే మమో జారీ చేయాలని డీఎంఅండ్‌హెచ్‌వోను ఫోన్లో ఆదేశించారు. ఈ సందర్భంగా ఎంపీపీ సంపత్ కలెక్టర్‌ను కలిసి ఆస్పత్రిలో వసుతుల కల్పనకు నిధులు మంజూరు చేయాలని కోరారు. కలెక్టర్ వెంట ఎంపీడీవో కిషన్‌నాయక్, హెచ్‌ఈవో సుధాకర్ ఉన్నారు. -
క్యాంటీన్‌పై కన్ను!
కరీంనగర్‌హెల్త్: కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మాతాశిశు ఆరోగ్యకేంద్రానికి వచ్చే రోగులకు మెరుగైన ఆహార పదార్థాలు అందించేందుకు క్యాంటీన్‌ను ఏర్పాటు చేయాలని అధికారులు ఆలోచిస్తున్నారు. రోగులతోపాటు వారి బంధువులకు నాణ్యమైన భోజనం, బ్రెడ్, పాలు సరసమైన ధరలకు అందించడమే క్యాంటీన్ ఉద్దేశం. అయితే ఈ క్యాంటీన్ నిర్వహణను టెండర్లు పిలవకుండానే అప్పగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అతి పెద్ద ఆస్పత్రి కావడంతో రోజుకు వేయి మంది వరకు వస్తుండడంతో అందరి కళ్లు ఈ క్యాంటీన్‌పైనే పడ్డాయి. తమ అనుయాయులకే ఇప్పించుకునేందుకు గళ్లీస్థాయి లీడర్ల నుంచి మంత్రిస్థాయి ప్రజాప్రతినిధుల వరకు జోరుగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. తామేమి తక్కువ తిన్నామా అన్నట్లు ఆస్పత్రిలోని వైద్యులు సైతం తమ వారికి క్యాంటీన్ దక్కేలా యత్నాలు సాగిస్తున్నట్లు ప్రచారంలో ఉంది. అయితే ఇప్పటి వరకు క్యాంటీన్ ఏర్పాటు చేయాలని మాత్రమే ఆస్పత్రి స్టాండింగ్ కమిటీ దృష్టికి అధికారులు తీసుకొచ్చారు. క్యాంటీన్ నిర్వహణను ఎలా అప్పగించాలనే దానిపై నిర్ణయం తీసుకోలేదు. అంతేకాకుండా ఆస్పత్రి పాతభవనంలో ఓ క్యాంటీన్ ఉండగా.. మరొకటి ఎందుకనే ప్రశ్న వస్తుంది. క్యాంటీన్ కోసం ఆస్పత్రిలో ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. లాభాల కోసమే.. మారుమూల ప్రాంతాల నుంచి వచ్చే పేదలకు నాణ్యమైన పదార్థాలు అందించేందుకు క్యాంటీన్‌ను ఏర్పాటు చేశారు. అయితే ఇదీ సేవ మాదిరిగానే చూడాలని వ్యాపార కోణంలో ఆలోచించవద్దని స్థానికులు కోరుతున్నారు. గత వారం నిర్వహించిన ఆస్పత్రి స్టాండింగ్ కమిటీ సమావేశంలో క్యాంటీన్ గురించి చర్చించకపోయినప్పటికీ.. పైరవీలు జోరందుకున్నట్లు చర్చ సాగుతోంది. వికలాంగులు, నిరుద్యోగ యువతకు ఇచ్చి నిర్వహణను మెరుగ్గా ఉండేలా చూడాలని స్థానికులు, రోగులు కోరుతున్నారు. క్యాంటీన్ లేక ఇబ్బందులు మాతాశిశు ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేసి ఏడాది గడిచిపోయింది. అప్పటి నుంచి క్యాంటీన్ లేక రోగులు, వారి బంధువులు ఇబ్బందులు పడుతున్నారు. కేంద్రంలో రాత్రి, పగలు తేడాలేకుండా గర్భిణులు, బాలింతలు నెలల శిశువులతో ఆస్పత్రిలో చేరుతుంటారు. ప్రస్తుతం ప్రతీ రోజు 20కి తగ్గకుండా ప్రసవాలు జరుగుతుండగా, 30 నుంచి 40 మంది వరకు బాలింతలు, శిశువులు వైద్యసేవల కోసం ఆస్పత్రిలో చేరుతుంటారు. అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన రోగులకు పాలు, టీ, కాఫీ, బ్రెడ్, బిస్కట్‌తోపాటు పండ్ల రసాలు అందించాల్సి ఉంటుంది. కప్పు పాల కోసం రోగుల బంధువులు చాలా దూరం వెళ్లి ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి వేళల్లో పాల కోసం బస్టాండ్‌కు వెళ్లి తెచ్చుకునే పరిస్థితి ఉంటుందని, అక్కడి నుంచి తెచ్చుకునే క్రమంలో పాలకు రూ.10, ఆటోచార్జీలు రూ.50 ఖర్చు అవుతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యాపారుల దోపిడీ పాలు, చాయ్, బ్రెడ్ వంటి పదార్థాల కోసం బయటికి వెళ్తే షాపుల నిర్వాహకులు దోపడీకి పాల్పడుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. నాణ్యతలేని ఆహార పదార్థాలు, పాలు అధిక ధరలకు విక్రయిస్తున్నారని రోగులు బంధువుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని క్యాంటీన్ నిర్వహణను లాభార్జనతో కాకుండా సేవాభావంతో చూసే వారికి అప్పగించాలని డిమాండస్థానికంగా ఉంది. -
హెచ్‌సీయూలో విద్యార్థుల దీక్ష భగ్నం
-
హెచ్‌సీయూలో విద్యార్థుల దీక్ష భగ్నం
హైదరాబాద్: సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థులు చేస్తున్న దీక్షలను శనివారం సాయంత్రం పోలీసులు భగ్నం చేశారు. దీక్ష విరమించడానికి విద్యార్థులు నిరాకరించడంతో యూనివర్సిటీలో కొద్దిసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులు విద్యార్థులను వర్సిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. దీక్షలో పాల్గొన్న ఇద్దరు విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. రమేష్ అనే విద్యార్ధి ఆరోగ్యం విషమించడంతో గచ్చిబౌలిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పీహెచ్డీ విద్యార్థి వేముల రోహిత్ ఆత్మహత్య అనంతరం గత నాలుగు రోజులుగా హెచ్‌సీయూలో ఏడుగురు విద్యార్థులు దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. -
ఇద్దరు విద్యార్థుల ఆరోగ్యం విషమం
-
ఆస్పత్రి ఎదుట పురిటి నొప్పులతో గర్భిణి యాతన
అల్లాదుర్గం: నిండు గర్భిణి ప్రసవం కోసం ఆరోగ్య కేంద్రానికి వచ్చింది. అక్కడున్న సిబ్బంది.. ఇంకా టైమ్ ఉండగానే వెళ్లిపోయారు. రాత్రి విధులకు రావాల్సిన సిబ్బంది ఎంతకీ రాలేదు. దీంతో పట్టించుకునే వారెవరూ లేక ఆరోగ్య కేంద్రం ఎదుట రోడ్డుపైనే ఆ గిరిజన మహిళ నరకయాతన అనుభవించింది. ఈ సంఘటన మెదక్ జిల్లా అల్లాదుర్గంలో బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. సీతానగర్ తండాకు చెందిన పడ్త్యా మంజుల బుధవారం సాయంత్రం ప్రసవం నిమిత్తం అల్లాదుర్గం ఆరోగ్య కేంద్రానికి వచ్చింది. అప్పటికి విధుల్లో ఉన్న సిబ్బంది ఇంకా సమయం ఉండగానే వెళ్లిపోయారు. నైట్ డ్యూటీకి ఎవరూ హాజరు కాలేదు. ఒకపక్క ఆరోగ్య కేంద్రంలో ఎవరూ పట్టించుకోకపోవడం, మరోపక్క నొప్పులు తీవ్రం కావడంతో మంజుల రోడ్డుపైనే అవస్థలు పడింది. చివరకు 108 వాహనంలో ఆమెను జోగిపేట ఆస్పత్రికి తరలించారు. -
ఆస్పత్రిలో కూలిన భారీ వృక్షం
సారవకోట (శ్రీకాకుళం) : శ్రీకాకుళం జిల్లా సారవకోట ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనంపై ఓ పెద్ద చెట్టు కూలిపడింది. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మంగళవారం ఉదయం ఆరోగ్య కేంద్రం భవనం పక్కనే ఉన్న చెట్టు కూలింది. అయితే ఆ సమయంలో ఆస్పత్రిలో ఎవరూ లేకపోవటంతో పెనుప్రమాదం తప్పింది. కాగా భవనంలోని వరండాలో ఉంచిన మోటారు సైకిల్ పూర్తిగా ధ్వంసమైంది.