భోపాల్: ఆరోగ్య కేంద్రంలో నర్సుగా పనిచేస్తున్న మహిళపై మైనర్‌తో సహా నలుగురు సాముహిక అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ ఘటన చత్తీస్‌గఢ్‌లోని మహేంద్రగఢ్ జిల్లాలో చోటు చేసుకుంది. నిందితులు భాధితురాలి పనిచేస్తున్న ఆరోగ్య కేంద్రంలో ఒంటరిగా ఉండటం గమనించి ఈ దారుణానికి తెగబడ్డారు.
శుక్రవారం సాయంత్రం మూడు గంటల సమయానికి ఈ ఆరోగ్య కేంద్రంలోకి చోరబడి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడటమే గాక హత్య చేసేందుకు కూడా యత్నించారు. దీంతో బాధితురాలి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగు చూసింది. ఈ మేరకు పోలీసులు 17 ఏళ్ల మైనర్‌తో సహా ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశామని, మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు వెల్లడించారు.
ఈ ఘటనతో ఆరోగ్య కార్యకర్తల బృందం మారుమూల ప్రాంతాల్లో విధుల నిర్వర్తించడంపై ఆందోళన వ్యక్తం చేయడమే గాక చత్తీస్‌గఢ్ ప్రభుత్వాన్ని తమకు భద్రత కావాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో జిల్లా ఆరోగ్య కేంద్రం ఛీఫ్ అధికారి ప్రతిమ సింగ్ మాట్లాడుతూ..తమకు భద్రత కావాలని, అలాగే ఈ నిందితులపై కఠిన చర్యలు తీసుకోకపోతే తాము విధులు నిర్వర్తించమని కరాఖండిగా చెప్పారు.
(చదవండి: విచారణ సమయంలో నిందితుడి ఆత్మహత్య)
Comments
Please login to add a commentAdd a comment