gang rape case
-
బిల్కిస్ బానో కేసు.. రేపు సుప్రీం తీర్పు
న్యూఢిల్లీ: 2002 గుజరాత్ అల్లర్ల సమయంలో బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారం, ఆమె కుటుంబంలోని ఏడుగురి దారుణహత్య ఘటనల్లో దోషులకు శిక్ష తగ్గింపును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై తీర్పును సుప్రీంకోర్టు సోమవారం వెలువరించనుంది. జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌ల ధర్మాసనం పిటిషన్లపై 11 రోజులపాటు వాదనలను వింది. తీర్పును రిజర్వులో ఉంచుతున్నట్లు గత ఏడాది అక్టోబర్ 12న ప్రకటించింది. అక్టోబర్ 16వ తేదీ కల్లా శిక్ష తగ్గింపు నిర్ణయానికి సంబంధించిన ఫైళ్లను తమ ముందు ఉంచాలని కేంద్రం, గుజరాత్ ప్రభుత్వాలను ఆదేశించింది. బిల్కిస్ బానో కేసులో మొత్తం 11 మంది దోషులకు శిక్షను తగ్గించి, 2022 ఆగస్ట్ 15న గుజరాత్ ప్రభుత్వం విడుదల చేసిన విషయం తెలిసిందే. -
ఢిల్లీ: ఆ మృగోన్మాదులకు మరణశిక్ష ఖరారు
ఆమె అతన్ని నమ్మింది. అన్నా అని ఆప్యాయంగా పిలిచి.. ఇంటికి పిలిచి మరీ భోజనం పెట్టేది. కానీ, అతడిలోని ఉన్మాదం బయటపడింది. మరో ఇద్దరితో కలిసి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అక్కడితో ఆగలేదు. ఆమెను అత్యంత కిరాతకంగా హతమార్చాడు. ఆపై ఆమె ఇద్దరు బిడ్డలను(7, 6 ఏళ్ల వయసు) వదల్లేదు. ఘోరమైన ఈ కేసులో చివరకు ఆ మానవ మృగాలకు న్యాయస్థానం మరణశిక్ష ఖరారు చేసింది. దేశ రాజధానిలో సంచలనం సృష్టించిన ఖ్యాలా ట్రిపుల్ మర్డర్(వివాహిత హత్యాచారం) కేసులో ముగురు నిందితులకు మరణశిక్ష పడింది. మంగళవారం తీస్ హజారీ కోర్టు ఈ మేరకు తీర్పు ఇచ్చింది. 2015లో మొహమ్మద్ అక్రమ్, షాహిద్, రఫత్ అలీ అనే ముగ్గురు.. తమకు పరిచయం ఉన్న వివాహితపై హత్యాచారానికి(గ్యాంగ్ రేప్, మర్డర్) పాల్పడడంతో పాటు ఆమె పిల్లలిద్దరిని అత్యంత దారుణంగా హతమార్చారు. ఆపై ఇంట్లోని డబ్బు, నగదుతో పరారయ్యారు. అదే ఏడాదిలో నిందితులను పోలీసులు అరెస్ట్ చేసినప్పటికీ.. కోర్టు విచారణ మాత్రం ఎనిమిదేళ్లపాటు సాగింది. సుదీర్ఘ దర్యాప్తు కొనసాగిన అనంతరం ఈ కేసులో పక్కా ఆధారాల్ని పోలీసులు కోర్టులో సమర్పించడంతో స్పెషల్ ఫాస్ట్ ట్రాక్ న్యాయమూర్తి అంచల్ మంగళవారం శిక్ష ఖరారు చేశారు. జడ్జి వ్యాఖ్యలు.. తీర్పు చదివే సమయంలో జడ్జి.. ‘‘ఆమె భర్త పని మీద ఊరు వెళ్తున్నాడని నిందితులకు తెలుసు. ఉద్దేశపూర్వకంగానే ఆమె ఇంట్లోకి చొరబడ్డారు. నిందితుల కుట్ర ఈ కేసులో స్పష్టంగా తెలుస్తోంది. ఆమె బిడ్డలను కూడా చంపి.. అత్యంత పైశాచికంగా ప్రవర్తించారు ఈ ముగ్గురు. అన్నింటికి మంచి ప్రధాన నిందితుడు అక్రమ్‌పై ఆమె పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేశాడు. అన్నా అనే పిలుపునకు కళంకం తెచ్చాడు అంటూ మరణశిక్ష విధిస్తున్నట్లు తీర్పు ఇచ్చారు. పక్కా స్కెచ్ వేసి.. 2015లో ఢిల్లీ రఘువీర్ నగర్‌లోని బాధిత కుటుంబం ఉంటోంది. అదే కాలనీలో ఉండే మొహమ్మద్ అక్రమ్ ఆ కుటుంబంతో చనువుగా ఉంటూ వచ్చేవాడు. సదరు వివాహిత అతన్ని అన్నగా పిలుస్తూ.. ఇంటికి పిలిచి భోజనం పెట్టేది. ఈ క్రమంలో పని మీద జైపూర్ వెళ్లి తిరిగొచ్చిన భర్తకు.. ఇంట్లో భార్య, ఇద్దరు పిల్లలు అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉండడం కనిపించింది. భార్య మెడకు దుపట్టా, కూతురి మెడకు కర్చీఫ్‌తో ఉరేసి ఉంది. ఇంట్లో దోపిడీ జరిగినట్లు స్పష్టంగా ఆనవాళ్లు కనిపించాయి. దీంతో ఆయన పోలీసులను ఆశ్రయించాడు. 2015, సెప్టెంబర్ 21వ తేదీన ఈ ఘటన జరిగింది. పోస్ట్‌మార్టం నివేదికలో ఆమె అత్యాచారానికి గురైనట్లు తేలడంతో పాటు పదునైన ఆయుధంతో ఆమెను హతమార్చినట్లు తేలింది. ఈ కేసులో దర్యాప్తులోతుకి వెళ్లిన పోలీసులకు అక్రమ్‌పైనే అనుమానాలు మళ్లాయి. అదే ఏడాది అక్టోబర్‌లో షాహిద్, అక్రమ్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. వీళ్లిచ్చిన సమాచారంతో.. రఫత్(అప్పుడు మైనర్‌గా ఉన్నాడు)అనే మరో నిందితుడ్ని అరెస్ట్ చేసి జువైనల్ హోంకు తరలించారు. ప్రత్యక్ష సాక్షుల కథనం, నిందితుల ఫోన్‌కాల్స్ రికార్డయిన సమయం.. ప్రాంతం.. ఇలా అన్నింటిని పోలీసులు పరిశీలించారు. సుదీర్ఘ దర్యాప్తు తర్వాత.. 2023, ఆగష్టు 22న ఈ ముగ్గురిని దోషులుగా నిర్ధారించింది న్యాయస్థానం. -
అనంత కోడిపల్లిలో గ్యాంగ్ రేప్ జరిగిందని చెబుతున్న మహిళ గురించి ఆమె బంధువుల మాటల్లో..
-
కోడిపల్లి ఘటనపై అనుమానాలున్నాయ్: అనంత ఎస్పీ
సాక్షి, అనంతపురం: కళ్యాణదుర్గం మండలం కోడిపల్లిలో గ్యాంగ్ రేప్ జరిగిందని, దళిత మహిళపై వైకాపా నాయకుల దాష్టీకమంటూ ఈనాడు, ఆంధ్రజ్యోతి కథనాలు వండివార్చాయి. దీంతో ఎల్లో మీడియా కథనాలపై జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు స్పష్టత ఇచ్చారు. కోడిపల్లి ఘటనపై మంగళవారం మీడియా సమావేశం నిర్వహించిన ఆయన.. గ్యాంగ్‌రేప్‌పై అనుమానాలున్నాయని తెలిపారు. ‘‘కళ్యాణదుర్గం మండలం కోడిపల్లి ఘటనపై అనేక అనుమానాలు ఉన్నాయి. కోడిపల్లిలో గ్యాంగ్ రేప్ జరిగిన ఆనవాళ్లు లేవు. ఈ ఘటనతో వైఎస్సార్ సీపీ నేతలకు సంబంధం లేదు. కొందరు కావాలనే బాధితులను తప్పు దారి పట్టించి.. లబ్ది పొందే ప్రయత్నం చేస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. తప్పుడు ఆరోపణలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం’’ అని ఎస్పీ తెలిపారు. ఫోన్లో వీడియోలు లేవు ఏడాది క్రితం తనపై గ్యాంగ్ రేప్ జరిగిందని ఓ మహిళ ఫిర్యాదు చేసింది. అత్యాచార సమయంలో విడియోలు తీశారని బాధితురాలు చెబుతోంది. ఆమె ఫోన్ లో ఎలాంటి విడియోలు లేవు. పైగా బాధిత మహిళ ఓ వ్యక్తితో ఉండగా.. గదికి తలుపులు వేసి కోడిపల్లి గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మహిళ ప్రవర్తనపై గ్రామస్తుల నుంచి అనేక ఫిర్యాదులు ఉన్నాయి అని ఎస్పీ వెల్లడించారు. అన్ని కోణాల్లో దర్యాప్తు బాధిత మహిళ ఈనెల 10వ తేదీన ఒక రకంగా.. 14 తేదీన మరోలా ఫిర్యాదు చేసింది. కోడిపల్లికి మహిళ ఫిర్యాదు మేరకు అట్రాసిటీ కేసు నమోదు చేశాం. కోడిపల్లి ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం. అసత్య ప్రచారాలను నమ్మొద్దు అని ప్రజలకు ఎస్పీ తెలియజేశారు. -
హత్రాస్ సామూహిక అత్యాచారం కేసు.. యూపీ కోర్టు కీలక తీర్పు
లక్నో: ఉత్తర్‌ప్రదేశ్ హత్రాస్‌లో 2020లో దళిత యువతిపై సామూహిక అత్యాచారం, హత్య కేసుకు సంబంధించి యూపీ కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో నలుగురు నిందితుల్లో ముగ్గురు.. రవి, రాము, లవ్‌కుష్‌ను నిర్దోషులుగా విడుదల చేసింది. ప్రధాన నిందితుడు సందీప్ ఠాకూర్‌ను దోషిగా తేల్చినప్పటికీ అతనిపై అత్యాచారం, హత్య అభియోగాలు లేకుండా బాధితురాలిని తీవ్రంగా గాయపరిచినట్లు మాత్రమే న్యాయస్థానం పేర్కొంది. హత్రాస్ సామూహిక అత్యాచార ఘటన 2020లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. పొలంలో తల్లి, సోదురుడితో ఉన్న దళిత యువతిని అదేగ్రామంలో ఉన్నతకులానికి చెందిన వ్యక్తులు బలవంతంగా లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడినట్లు బాధితురాలు వాంగ్మూలంలో పేర్కొంది. ఆ ఘటనలో యువతిని తీవ్రంగా హింసించారు నిందితులు. దీంతో ఆమెకు చాలా చోట్ల ఫ్రాక్చర్లు అయ్యాయి. అనంతరం కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించగా 15 రోజుల పాటు మృత్యువుతో పోరాడి యువతి మరణించింది. అయితే పోలీసులు కుటుంబసభ్యులను ఇంట్లోనే బంధించి రాత్రికిరాత్రే ఆమె అంత్యక్రియలు నిర్వహించడంతో సీఎం యోగి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ కేసులో పోలీసులు కూడా నిందితులకు అనుకూలంగా వ్యవహరించారని ఆరోపణలున్నాయి. బాధితురాలు వాంగ్మూలం ఇచ్చేవరకు వారు నిందితులపై అత్యాచార అభియోగాలు మోపలేదు. చదవండి: హోం మంత్రి ఎస్కార్ట్ వాహనం ఢీకోని వ్యక్తి మృతి ..కానీ కాన్వాయ్.. -
స్నేహితుడి పీకపై కత్తి.. మృగవాంఛ తీర్చుకున్నారు
కాంచీపురం: బ్రిటిష్ కాలంనాటి చట్టాలు.. త్వరగతిన శిక్షలు పడకపోవడం దేశంలో నేరాలు పెరిగిపోవడానికి కారణం అవుతున్నాయని మేధావులు మొత్తుకుంటున్నారు. అయినా చట్టాల సవరణలో జాప్యం కొనసాగుతూ వస్తోంది. ప్రత్యేకించి మహిళలపై నేరాల విషయంలో మృగాల చేష్టలకు అడ్డుకట్ట పడలేకపోతోంది. తాజాగా.. తమిళనాడు కాంచీపురం ఘోరం జరిగింది. స్నేహితుడి ఎదుటే ఓ అమ్మాయిపై గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు కొందరు దుండగులు. గురువారం సాయంత్రం బెంగళూరు-పుదుచ్చేరి హైవేలో ఈ ఘటన చోటు చేసుకుంది. సాయంత్రం ఏడు గంటల సమయంలో.. తన స్నేహితుడితో ఓ ప్రైవేట్ స్కూల్ జాగా వద్ద యువతి మాట్లాడుతూ ఉంది. ఆ సమయంలో అక్కడికి వచ్చిన ఐదుగురు వాళ్లను చుట్టుముట్టారు. స్నేహితుడి పీకపై కత్తి పెట్టి.. చెప్పిన మాట వినకపోతే చంపి పాతేసి వెళ్లిపోతామని ఇద్దరిని బెదిరించారు. ఆపై ఒకరి తర్వాత మరొకరు యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆపై మద్యం సేవించేందుకు వాళ్లు పక్కకు వెళ్లగానే.. స్నేహితురాలితో బైక్ మీద తప్పించుకున్నాడు ఆ యువకుడు. బంధువుల సాయంతో యువతిని ఆస్పత్రిలో చేర్పించి.. పోలీసులను ఆశ్రయించాడు. చీకటి ఉండడంతో నిందితులను గుర్తించలేనని చెప్పిన బాధితురాలు.. వాళ్లలో ఒకడిని మరొకడు విమల్ అని పిలిచాడని పోలీసులకు వాంగ్మూలం ఇచ్చింది. ఆ స్టేట్మెంట్ ఆధారంగా.. ఘటన స్థలానికి ఆనుకుని ఉండే విపాడు గ్రామానికి చెందిన విమల్‌ను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో ప్రశ్నించారు పోలీసులు. దీంతో నిందితుడు మద్యం మత్తులో నేరానికి పాల్పడినట్లు ఒప్పుకున్నాడు. అతని ద్వారా మిగతా నలుగురు నిందితులను ట్రేస్ చేసి అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టగా.. ఆపై జ్యూడీషియల్ కస్టడీకి తరలించారు. -
Crime: ఆ అమ్మాయిలు నన్ను గ్యాంగ్‌రేప్ చేశారు!
క్రైమ్: దేశవ్యాప్తంగా వరుసగా దారుణ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. నిత్యం ఏదో ఒక నేరం జరిగిన తీరు.. సంఘంలోని పరిస్థితులపై తీవ్రస్థాయి చర్చకు దారి తీస్తోంది. ఈ క్రమంలో పంజాబ్‌లో జరిగిన ఓ వివాహితుడి గ్యాంగ్ రేప్ ఘటన పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. పంజాబ్‌లోని జలంధర్‌కు చెందిన ఓ వ్యక్తి.. తనను నలుగురు అమ్మాయిలు గ్యాంగ్ రేప్ చేశారంటూ మీడియాకు ఎక్కాడు. కారులో వచ్చిన నలుగురు అమ్మాయిలు.. తనపై మత్తు మందు చల్లి సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి ఘాతుకానికి పాల్పడ్డారని వాపోయాడతను. వాళ్లంతా పెద్దింటి అమ్మాయిల్లాగా ఉన్నారని, ఇంగ్లీష్‌తో పాటు పంజాబీలో మాట్లాడారని చెప్పాడతను. తనను అపస్మారక స్థితికి తీసుకెళ్లి మరీ అఘాయిత్యానికి పాల్పడ్డారని వాపోయాడు. ఈ వ్యవహారం తీవ్ర చర్చకు దారి తీయడంతో.. పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. బాధితుడి కథనం ప్రకారం.. సదరు వ్యక్తి కూలీ పనులు చేసుకుంటున్నాడు. సోమవారం పని ముగిశాక కపుర్తలా రోడ్లో ఇంటికి వెళ్లేందుకు బస్సు కోసం ఎదురు చూస్తున్నాడు. ఆ సమయంలో తెల్ల కారు ఒకటి వచ్చి ఆగింది. అడ్రస్ చెప్పమంటూ ఓ చీటి చూపించారు కారులో ఉన్న అమ్మాయిలు. వెంటనే అతని కళ్లలో ఏదో కెమికల్ చల్లగా.. అతను స్పృహ కోల్పోయాడు. ఆపై కారులో అతని కాళ్లు చేతులు కట్టేసి.. కళ్లకు గంతలు కట్టి తీసుకెళ్లారు. ఆపై అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి ప్రతిఘటించేందుకు వీళ్లు లేకుండా అతనికి ఏవో ఇంజెక్షన్లు ఇచ్చి.. బలవంతంగా మందు తాగించారు. ఆపై ఆ నలుగురు అమ్మాయిలు ఆ వ్యక్తిపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఘాతుకం తర్వాత అర్ధరాత్రి సమయంలో తిరిగి అతన్ని రోడ్డుపై పడేసి వెళ్లిపోయారు. ఎలాగోలా ఇంటికి చేరుకున్న అతను.. భార్యకు జరిగిన విషయం చెప్పాడు. భార్యాబిడ్డలు ఉండడంతో పరువు పోతుందనే భయంతో అతను పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. అయితే భార్య బలవంతం మేరకు స్థానిక మీడియా ముందుకు వచ్చి తన గోడును వెల్లబోసుకున్నాడు. ఈ కథనాలు సంచలనం సృష్టించడంతో పంజాబ్ పోలీసు నిఘా విభాగం సుమోటోగా కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు ప్రారంభించింది. ఇదీ చదవండి: ప్రతి 11 నిమిషాలకు.. ఒక యువతి బలి! -
ఇదెక్కడి న్యాయం.. బతకాలని లేదు!
పదేళ్ల కిందటినాటి కేసులో అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై.. యావత్ దేశం రగిలిపోతోంది. కళ్లలో యాసిడ్‌పోసి.. జనానాంగాల్లో సీసాలు జొప్పించి అతికిరాతంగా హత్య చేశారామెను. అలాంటి కేసులో మరణ శిక్ష పడ్డ ఖైదీలను నిర్దోషులుగా ప్రకటించింది సుప్రీం కోర్టు. ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లలిత్ ఆఖరిరోజు ఇచ్చిన తీర్పుల్లో ఇది ఒకటి కావడం గమనార్హం. 2012 చావ్లా గ్యాంగ్ రేప్ అండ్ మర్డర్ కేసులో నేరారోపణలను ప్రాసిక్యూషన్ వారు నిరూపించని కారణంగానే.. మరణ శిక్ష పడ్డ ఆ ముగ్గురు ఖైదీలను విడుదల చేస్తున్నట్లు చీఫ్ జస్టిస్ లలిత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం సోమవారం తీర్పు ఇచ్చింది. వారిని దోషులుగా నిర్ధారించే సమయంలో దిగువ న్యాయస్థానం సైతం పారదర్శకత లేకుండా వ్యవహరించిందని బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద వాళ్లను నిర్దోషులుగా ప్రకటించినట్లు వెల్లడించింది. ఏడేళ్లుగా సుప్రీం కోర్టులో ఈ కేసు విచారణ కొనసాగగా.. తీర్పుపై బాధితురాలి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. తీర్పు తమకు దిగ్భ్రాంతి కలిగించిందని ఓ జాతీయ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ‘‘ఇది మాకు పెద్ద ఎదురు దెబ్బ. న్యాయం జరుగుతుందనే ఇక్కడికి(సుప్రీం కోర్టు) వచ్చాం. న్యాయవ్యవస్థ మీద నమ్మకమే మమ్మల్ని ఇక్కడికి రప్పించింది. కానీ, అది నెరవేరలేదు. చట్టం ఇలాగే ఉంటే.. ఇంక న్యాయవ్యవస్థ మీద నమ్మకం ఎవరికి ఉంటుంది?.. న్యాయం జరగకపోవడం వల్లే కదా ఇంకా ఇలాంటి నేరాలు పెరిగిపోతాయ్. మా బిడ్డకు న్యాయం జరుతుందని వచ్చాం. కానీ, మా గుండెలు బద్ధలయ్యాయి. ఇదేనా న్యాయమంటే?. పదకొండేళ్లపాటు పోరాడిన మాకు దక్కిన తీర్పు ఇదా? పోరాటంలో మేం ఓడినట్లేనా? అసలు మాకు బతకాలనే లేదు. కానీ, ఇన్నాళ్లు ఒపిక పట్టిన మేం.. వెనక్కి వెళ్లాలని అనుకోవడం లేదు. కచ్చితంగా పోరాడతాం.. ముందుకెళ్తాం అని పేర్కొన్నారు. ఇక కోర్టు తీర్పు కాపీని అందుకున్నాకే.. రివ్యూ పిటిషన్‌కు వెళ్తామని బాధితుల తరపు న్యాయవాది పేర్కొన్నారు. కోర్టు తీర్పు మాకు ఆశ్చర్యం కలిగింది. ఏడేళ్ల తర్వాత.. అదీ నేను గట్టిగా అడిగిన తర్వాతే కోర్టు విచారణ ముందుకు కదిలింది. వారంలోపే.. అదీ సీజేఐ ఆఖరి రోజున ఇలాంటి తీర్పు వచ్చింది. ఈ కేసులో వెనక్కి వెళ్లం.. తీర్పుపై పునసమీక్షకు వెళ్తాం అని ఆమె పేర్కొన్నారు. అంతకు ముందు సీజేఐ నేతృత్వంలోని.. ముగ్గురు సభ్యులతో కూడిన ధర్మాసనం ముగ్గురిని నిర్దోషులుగా ప్రకటించింది. హేతుకమైన సందేహం లేకుండా అభియోగాలను రుజువు చేయడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని చీఫ్ జస్టిస్ యుయు లలిత్ నేతృత్వంలోని సుప్రీం కోర్టు బెంచ్ అభిప్రాయపడింది. అంతేకాదు.. కోర్టు విచారణ సమయంలోనూ లోపాలు స్పష్టంగా గమనించామని, 49 సాక్ష్యుల్లో పది మందిని విచారించలేదని ధర్మాసనం తెలిపింది. అంతేకాదు.. న్యాయస్థానాలు చట్టపరిధిలో ఉండాలే తప్ప.. బయటి నుంచి వచ్చే నైతిక ఒత్తిళ్లకు తలొగ్గకూడదనే అభిప్రాయం వెలుబుచ్చింది. ఢిల్లీ పోలీసుల కథనం ప్రకారం.. గురుగావ్‌లో పని చేసే 19 ఏళ్ల యువతిని.. 2012 ఫిబ్రవరి 9వ తేదీన తనతో శారీరక సంబంధానికి ఒప్పుకోలేదన్న కారణంతో ముగ్గురు నిందితుల్లో ఒకడైన వ్యక్తి.. ఎత్తుకెళ్లి మూడు రోజులపాటు చిత్రహింసలకు గురి చేశాడు. ఆపై మృగచేష్టలతో సామూహికంగా హత్యాచారానికి పాల్పడ్డారు. మూడు రోజుల తర్వాత శవాన్ని హర్యానా శివారులో పడేసి వెళ్లిపోయారు. కుళ్లిపోయిన స్థితిలో దొరికిన ఆమె మృతదేహానికి శవపరీక్ష నిర్వహించి.. షాకింగ్‌కు గురి చేసే విషయాలు బయటపెట్టారు వైద్యులు. ఆపై నిందితులు ముగ్గురిని అరెస్ట్ చేయగా.. 2014లో ఢిల్లీ కోర్టు, ఆపై హైకోర్టు కూడా ఈ మానవ మృగాలకు సంఘంలో తిరిగే హక్కు లేదంటూ మరణ శిక్ష విధించాయి. చివరికి.. అత్యున్నత న్యాయస్థానం తీర్పుతో ఆ ముగ్గురు నిర్దోషులుగా బయటకు రాబోతున్నారు!. సంబంధిత వార్త: భావోద్వేగాలకు.. సెంటిమెంట్లకు చోటు లేదిక్కడ! -
సంచలన తీర్పు.. గ్యాంగ్ రేప్లో మరణ శిక్ష ఖైదీలకు విముక్తి
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన చావ్లా రేప్ కేసులో.. ఇవాళ సుప్రీం కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. మరణ శిక్ష పడ్డ ముగ్గురు ఖైదీలను నిర్దోషులుగా ప్రకటిస్తూ తీర్పు వెల్లడించింది. పదేళ్ల కింద జరిగిన ఈ దారుణ ఘటనలో.. తీర్పు సమయంలో బాధితురాలి తండ్రి చేతులు జోడించి ధర్మాసనం ముందు నిల్చున్నారు. అయితే.. సెంటిమెంట్లకు ఇక్కడ తావు ఉండదంటూ సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు వెల్లడించింది. ముగ్గురు దోషులను సుప్రీం కోర్టు ఇవాళ నిర్దోషులుగా ప్రకటించింది. తీర్పు సమయంలో కోర్టు హాల్లో ఉద్వేగపూరిత వాతావరణం నెలకొంది. చీఫ్ జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్, జస్టిస్ రవీంద్ర భట్, జస్టిస్ బేలా ఎం త్రివేదిలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ తీర్పు వెల్లడించింది. అంతకు ముందు శిక్షను తగ్గించాలంటూ దోషుల తరపు న్యాయవాదులు కోర్టును అభ్యర్థించారు. వాళ్ల వయసు, కుటుంబ నేపథ్యాలు, గత చరిత్రలను పరిగణనలోకి తీసుకోవాలని కోర్టును కోరారు. ఇక.. ఢిల్లీ పోలీసుల తరపున వాదనలు వినిపించిన అదనపు సోలిసిటర్ జనరల్ ఐశ్వర్య భటి.. ఈ గాయం బాధితురాలిది మాత్రమే కాదని.. సమాజానిదని వాదించారు. కేవలం హత్యాచారమే చేయకుండా.. ఆమె శరీరాన్ని ఛిద్రం చేసి వాళ్లు పెద్ద తప్పు చేశారని ఆమె వాదనల్లో పేర్కొన్నారు. ఇరువైపు వాదనలు విన్న ధర్మాసనం.. కీలక తీర్పు ఇచ్చింది. ఆ సమయంలో బాధితురాలి తండ్రి చేతులు జోడించి నిల్చోగా.. బాధితురాలి తండ్రి బాధను తాను అర్థం చేసుకోగలనని తెలిపారు సీజేఐ లలిత్. అయితే.. వాస్తవాలు, సాక్ష్యాలు-ఆధారాల ఆధారంగా తీర్పు ఉంటుందని, సెంటిమెంట్లను పరిగణనలోకి తీసుకుంటే కేసు తప్పదారి పట్టే అవకాశం ఉందని స్పష్టం చేస్తూ.. ఆ ముగ్గురిని నిర్దోషులుగా ప్రకటించారు. 2012 Chhawla rape case: Supreme Court acquits three men who were awarded the death penalty by a Delhi court after being held guilty of raping and killing a 19-year-old woman in Delhi's Chhawla area in 2012 pic.twitter.com/CsbjUhROn3 — ANI (@ANI) November 7, 2022 2012 ఫిబ్రవరిలో ఈ దారుణం చోటు చేసుకుంది. ఫిబ్రవరి 9వ తేదీన ఢిల్లీ కుతుబ్ విహార్ వద్ద గురుగావ్ ఆఫీస్ నుంచి ఇంటికి వస్తున్న సమయంలో కారులో వచ్చిన దుండగులు ఆమెను ఎత్తుకెళ్లారు. మూడు రోజుల తర్వాత.. హర్యానా రేవారి జిల్లా రోధాయి గ్రామ శివారులో సదరు యువతి మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో లభ్యం కావడం కలకలం రేపింది. కారులోని పనిముట్లు, కుండపెంకులతో ఆమె జననాంగాలను ఛిద్రం చేసి ఘోరంగా హింసించి చంపారు దుండగులు. ఈ కిరాతకం దేశవ్యాప్త చర్చకు దారి తీసింది. ఈ క్రమంలో బాధితురాలిపై సామూహిక అత్యాచారం జరిగిందని గుర్తించిన పోలీసులు.. కేసు నమోదు చేసుకుని నిందితులను అరెస్ట్ చేశారు. ఢిల్లీ కోర్టు 2014 ఫిబ్రవరిలో ఈ ముగ్గురికి పేర్కొంటూ మరణ శిక్షను ఖరారు చేసింది. అదే ఏడాది ఆగష్టు 26న ఢిల్లీ హైకోర్టు మరణ శిక్షను సమర్థిస్తూ తీర్పు వెల్లడించింది. మానవ మృగాలుగా దోషులను పేర్కొంటూ సమాజంలో తిరిగే హక్కును వీళ్లు కోల్పోయారంటూ ఆ సమయంలో హైకోర్టు న్యాయమూర్తి వ్యాఖ్యలు చేశారు. -
ఘోరం: నర్సుపై సాముహిక అఘాయిత్యం
భోపాల్: ఆరోగ్య కేంద్రంలో నర్సుగా పనిచేస్తున్న మహిళపై మైనర్‌తో సహా నలుగురు సాముహిక అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ ఘటన చత్తీస్‌గఢ్‌లోని మహేంద్రగఢ్ జిల్లాలో చోటు చేసుకుంది. నిందితులు భాధితురాలి పనిచేస్తున్న ఆరోగ్య కేంద్రంలో ఒంటరిగా ఉండటం గమనించి ఈ దారుణానికి తెగబడ్డారు. శుక్రవారం సాయంత్రం మూడు గంటల సమయానికి ఈ ఆరోగ్య కేంద్రంలోకి చోరబడి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడటమే గాక హత్య చేసేందుకు కూడా యత్నించారు. దీంతో బాధితురాలి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగు చూసింది. ఈ మేరకు పోలీసులు 17 ఏళ్ల మైనర్‌తో సహా ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశామని, మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. ఈ ఘటనతో ఆరోగ్య కార్యకర్తల బృందం మారుమూల ప్రాంతాల్లో విధుల నిర్వర్తించడంపై ఆందోళన వ్యక్తం చేయడమే గాక చత్తీస్‌గఢ్ ప్రభుత్వాన్ని తమకు భద్రత కావాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో జిల్లా ఆరోగ్య కేంద్రం ఛీఫ్ అధికారి ప్రతిమ సింగ్ మాట్లాడుతూ..తమకు భద్రత కావాలని, అలాగే ఈ నిందితులపై కఠిన చర్యలు తీసుకోకపోతే తాము విధులు నిర్వర్తించమని కరాఖండిగా చెప్పారు. (చదవండి: విచారణ సమయంలో నిందితుడి ఆత్మహత్య) -
స్నేహితుడిని బెదిరించి సాఫ్ట్వేర్ ఇంజినీర్‌పై గ్యాంగ్ రేప్
రాంచి: దేశంలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. ఎన్ని కఠిన చట్టాలు వచ్చినా మానవ మృగాల చేతిలో అమాయకులు బలిపోతున్నారు. స్నేహితుడితో వెళ్లిన ఓ 26 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజినీర్‌పై దాడి చేసి 10 మంది గుర్తుతెలియని దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఝార్ఖండ్‌లోని ఛాయ్‌బాసా ప్రాంతంలో ఈ దారుణం చోటు చేసుకుంది. బాధితురాలు ట్రైబల్ కమ్యూనిటీకి చెందినదిగా పోలీసులు తెలిపారు. ఆమెను సదర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితురాలి వాంగ్మూలం నమోదు చేశారు పోలీసులు. ఆమె చెప్పిన వివరాల ప్రకారం ఈ దారుణం అక్టోబర్ 20న జరిగింది. తన స్నేహితుడితో కలిసి సాయంత్రం 6 గంటలకు టెక్రాహటు ఎయిర్‌స్ట్రిప్‌కు బైక్‌పై వెళ్లింది. రోడ్డు పక్కన నిలబడి స్నేహితుడితో మాట్లాడుతోంది. అప్పుడే వారి వద్దకు 8-10 మంది దుండగులు వచ్చి దాడి చేశారు. ఆమెతో ఉన్న వ్యక్తిని బెదిరించి యువతిని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని.. ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఏర్పాటు చేశారు పోలీసులు. ఆసుపత్రి వద్ద భారీగా భద్రత ఏర్పాటు చేశారు. ఛాయ్‌బాసా ముఫాసిల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని టెక్రాహటూ ప్రాంతంలో ఈ దారుణం జరిగినట్లు చెప్పారు. సమాచారం అందుకున్న సబద్ సబ్ డివిజనల్ పోలీస్ అధికారి దిలీప్ ఖల్కో, ముఫాసిల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ పవన్ పతాక్లు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. స్థానికంగా ఉండే కొంత మంది యువతను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని చెప్పారు. ఇదీ చదవండి: వీడియో: భారీగా ఊగిపోయిన విమానం.. ప్రయాణికుల ముక్కులు, మూతులు పగిలాయ్! -
మరో ‘నిర్భయ’ కాదు.. అంతా ఉత్తుత్తి డ్రామా!
మరో నిర్భయ ఉదంతంగా.. సంచలనం సృష్టించిన ఘజియాబాద్ గ్యాంగ్ రేప్ కేసు ఉత్తదేనని పోలీసులు తేల్చారు. ఢిల్లీ ఉమెన్స్ కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్ ట్వీట్‌తో ఈ కేసు చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. అయితే.. 36 ఏళ్ల సదరు మహిళ ఉద్దేశపూర్వకంగానే సామూహిక అత్యాచార నాటకం ఆడినట్లు పోలీసులు ప్రకటించారు. ఉత్తర ప్రదేశ్-ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో రెండు రోజుల కిందట వెలుగు చూసిన ఉదంతం.. దేశవ్యాప్త చర్చకు దారి తీసింది. మహిళను అపహరించిన ఐదుగురు.. అత్యాచారం చేసి శారీరకంగా హింసించారనే ఉదంతం ప్రకంపనలు పుట్టించింది. కాళ్లు చేతులు కట్టేసి.. జననాంగాల్లో ఇనుపరాడ్లు పెట్టి ఓ గోనె సంచిలో కుక్కేసి ఢిల్లీ-ఘజియాబాద్ రూట్లోని ఆశ్రమ్ రోడ్డు దగ్గర పడేశారని, నిస్సహాయ స్థితిలో పడి ఉన్న ఆమెను గుర్తించి బుధవారం ఓ ఆస్పత్రిలో చేర్పించారనే విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు కూడా. అయితే.. పోలీసుల అదుపులో నిందితులు అయితే ఆమెతో వాళ్లకు ఆస్తి తగాదాలు ఉండడంతో.. ఈ కేసును ఆ కోణంలోనే విచారణ చేపట్టారు. ఈలోపు ఆమెకు పరీక్షలు నిర్వహించిన ఢిల్లీ జీటీబీ ఆస్పత్రి ఆమెకు అంతర్గతంగా ఎలాంటి గాయాలు కాలేదని తేల్చి చెప్పింది. దీంతో పోలీసులకు అనుమానాలు మొదలయ్యాయి. పైగా ఆమె ఆచూకీ లభ్యమైన తర్వాత రెండు ప్రభుత్వాసుపత్రులకు తీసుకెళ్లగా.. వైద్య పరీక్షలకు ఆమె నిరాకరించడంతో ఆ అనుమానాలు మరింత బలపడ్డాయి. బాధితురాలిగా చెప్పుకుంటున్న యువతి.. నాటకం ఆడిందని చెప్తున్న పోలీసులు చివరికి ఆమె మొబైల్ సిగ్నల్‌ను ట్రేస్ చేసి.. అసలు విషయాన్ని తేల్చేశారు పోలీసులు. స్నేహితురాలి బర్త్ డే పార్టీ ముగించుకుని ఇంటికి వస్తున్న తరుణంలో.. కారులో వచ్చిన నిందితులు తనను అపహరించుకు పోయి అఘాయిత్యానికి పాల్పడ్డారనేది ఆమె ఫిర్యాదు. అయితే.. ఆ సమయంలో ఆమెతో పాటు ఉన్న ఓ స్నేహితుడు.. అదే స్పాట్లో ఫోన్ స్విచ్చాఫ్ చేశాడు. దీంతో.. అతన్ని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించగా అసలు విషయం వెలుగు చూసింది. అంతేకాదు.. బాధితురాలిగా చెప్పుకుంటున్న మహిళ నుంచి ఆ స్నేహితుడికి పేటీఎం ద్వారా డబ్బు ట్రాన్స్ఫర్ అయ్యిందని, ఈ వ్యవహారాన్ని అత్యాచారం కోణంలో ప్రచారం చేయించేందుకే అతనికి ఆమె డబ్బు ఇచ్చిందని పోలీసులు నిర్ధారించుకున్నారు. दिल्ली की लड़की से 5 लोगों ने किया गैंगरेप. उसके प्राइवेट पार्ट्स में रोड घुसा दी. लहूलुहान लड़की को बोरे में बांध कर सड़क पर फेंक दिया.@GhaziabadPolice के SSP को @DCWDelhi चेयरपर्सन @SwatiJaiHind ने दिया नोटिस दिया. वहशी दरिंदों के खिलाफ एक्शन हो @SandhyaTimes4u @NBTDilli pic.twitter.com/CMq4N1PMHc — सूरज सिंह/Suraj Singh 🇮🇳 (@SurajSolanki) October 19, 2022 ఆ ఐదుగురితో ఆస్తి తగాదాలు ఉండడంతోనే ఆమె అలా నాటకం ఆడిందని యూపీ రీజినల్ పోలీస్ చీఫ్ ప్రవీణ్ కుమార్ ప్రకటించారు. తనపై రెండు రోజులు సామూహిక అత్యాచారం జరిగిందని చెప్తున్న టైంలో.. ఆమె తన స్నేహితులతో రిసార్ట్‌లో గడిపిందట. ఆ తర్వాత వాళ్ల సహకారంతోనే గ్యాంగ్ రేప్ డ్రామా ఆడిందని పోలీసులు దర్యాప్తులో తేల్చేశారు. పోలీసుల ప్రకటనపై బాధితురాలి నుంచిగానీ.. మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్ నుంచిగానీ ఎటువంటి స్పందన రాలేదింకా. ఇదీ చదవండి: 3 నెలల కిందటే ప్రేమ పెళ్లి.. అఘాయిత్యానికి పాల్పడ్డ జంట -
‘నిర్భయ’ను మించిన దారుణం.. మహిళను కిడ్నాప్ చేసి రెండ్రోజులుగా..!
గాజియాబాద్: బస్సు కోసం బస్టాండ్‌లో వేచి చూస్తున్న ఓ మహిళ(40)ను కిడ్నాప్ చేసిన ఐదుగురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆపై ఇనుప రాడ్డుతో చిత్రహింసలకు గురిచేశారు. రెండు రోజుల తర్వాత రోడ్డు పక్కన పడేసి వెళ్లారు. ప్రస్తుతం ఆ మహిళ ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతోంది. ఈ దారుణ సంఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని గాజియాబాద్‌లో జరిగింది. గ్యాంగ్ రేప్‌కు పాల్పడిన దుండగులు బాధితురాలికి తెలిసినవారే కావటం గమనార్హం. నలుగురిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇనుప రాడ్ ఇంకా మహిళ మర్మాంగాల్లోనే ఉందని, ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందంటూ ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ శ్వాతి మాలివాల్ ట్వీట్ చేశారు. ఏం జరిగింది? పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గాజియాబాద్‌లో బంధువుల ఇంటిలో బర్త్‌డే పార్టీకి హాజరై ఢిల్లీకి తిరుగు ప్రయాణమైంది బాధితురాలు. ఆమె సోదరుడు బస్టాండ్‌లో దింపి వెళ్లాడు. బస్సు కోసం వేచి చూస్తుండగా.. ఐదుగురు కారులో అక్కడికి వచ్చి బలవంతంగా ఆమెను తీసుకెళ్లారు. గుర్తు తెలియని ప్రాంతానికి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలికి, నిందితులకు మధ్య ఆస్తి విషయంలో తగాదాలు ఉన్నాయని, ప్రస్తుతం ఆ అంశం కోర్టులో ఉందని గాజియాబాద్ ఎస్పీ నిపున్ అగర్వాల్ తెలిపారు. ఢిల్లీకి వెళ్లే ఆశ్రమ్ రోడ్డులో ఓ మహిళ రక్తపు మడుగులో పడి ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే బాధితురాలిని జీటీబీ ఆసుపత్రికి తరలించారు. ఫిర్యాదు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలింపు చేపట్టారు. గాజియాబాద్ ఘటనపై పూర్తి వివరాలు అందించాలని ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ శ్వాతి మలివాల్ ఎస్పీని కోరారు. ‘ ప్రైవేటు భాగాల్లో ఇనుప రాడ్డుతో మహిళ రక్తపు మడుగులో ప్రాణాలతో పోరాడుతూ కనిపించింది. ఆమె పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. గాజియాబాద్ నుంచి ఢిల్లీకి వస్తున్న క్రమంలో కారులో బలవంతంగా తీసుకెళ్లారు. రెండు రోజుల పాటు ఆమెపై ఐదుగురు అత్యాచారం చేశారు. ప్రైవేటు భాగాల్లో ఇనుప రాడ్డును చొప్పించారు. రోడ్డు పక్కన పడిపోయి ఉన్న సమయంలోనూ ఇనుప రాడ్డు అలాగే ఉంది. ఆసుపత్రిలో ప్రాణాల కోసం పోరాడుతోంది. గాజియాబాద్ ఎస్ఎస్పీకి నోటీసులు పంపించాం’అని ట్వీట్ చేశారు శ్వాతి. ఇదీ చదవండి: స్పా, సెలూన్ల ముసుగులో అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం -
స్కూల్ టాయిలెట్లోకి లాక్కెళ్లి విద్యార్థినిపై గ్యాంగ్ రేప్
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మరో అమానుష ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. కేంద్రీయ విద్యాలయంలో జూనియర్‌పై ఇద్దరు సీనియర్లు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. పాఠశాల వాష్ రూమ్‌లోకి 11 ఏళ్ల బాలికను తీసుకెళ్లి గ్యాంగ్ రేప్‌కు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని వెల్లడించారు. మరోవైపు.. ఈ విషయంపై దర్యాప్తు చేపట్టాలని కేంద్రీయ విద్యాలయ సంఘటన్ ప్రాంతీయ కార్యాలయం సైతం అధికారులను ఆదేశించింది. ఈ ఏడాది జులైలోనే చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డారు ఇద్దరు సీనియర్లు. సీనియర్ల దుశ్చర్య ఢిల్లీ మహిళా కమిషన్ ద్వారా వెలుగులోకి వచ్చింది. మహిళా కమిషన్ ప్రోత్సాహంతో బాధిత కుటుంబం గత మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన మహిళా కమిషన్ పోలీసులు, పాఠశాల ప్రిన్సిపాల్‌కి నోటీసులు జారీ చేసింది. ఈ విషయాన్ని పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదని స్కూల్ యాజమాన్యాన్ని ప్రశ్నించింది. ‘ఢిల్లీ స్కూల్లో 11 ఏళ్ల విద్యార్థినిపై గ్యాంగ్ రేప్ చాలా తీవ్రమైన కేసు గురించి తెలిసింది. ఈ విషయాన్ని స్కూల్ టీచర్ దాచి పెట్టే ప్రయత్నం చేసినట్లు బాధితురాలు తెలిపింది. దేశ రాజధానిలో పిల్లలకు స్కూల్స్ కూడా సురక్షితం కాకపోవటం దురదృష్టకరం. నిందితులను కఠినంగా శిక్షించాలి. బాధితురాలు క్లాస్ రూమ్‌లోకి వెళ్లే క్రమంలో ఇద్దరు ఇంటర్ విద్యార్థులు అడ్డుకున్నారు. టాయిలెట్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయాన్ని టీచర్‌కు తెలపగా.. దాచిపెట్టే ప్రయత్నం చేశారు. ’ అని మహిళా కమిషన్ ఛైర్పర్సన్ వెల్లడించారు. ఇదీ చదవండి: మెక్సికోలో కాల్పుల మోత.. మేయర్ సహా 18 మంది మృతి -
అంతా 12 ఏళ్ల లోపువారే.. స్నేహితుడిపైనే దారుణంగా..!
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ మహా నగరంలో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. సీలాంపుర్ ప్రాంతంలో ముగ్గురు బాలురు తన స్నేహితుడిపై లైంగిక దాడికి పాల్పడ్డారు. తీవ్ర గాయాలైన బాధిత 10 ఏళ్ల బాలుడు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. వివరాలు వెల్లడించేందుకు తొలుత కుటుంబ సభ్యులు నిరాకరించగా.. పోలీసుల కౌన్సిలింగ్‌తో జరిగిన దారుణాన్ని వివరించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సెప్టెంబర్ 18న బాధిత బాలుడిపై ముగ్గురు మైనర్ స్నేహితులు లైంగికంగా వేధించారు. దాడి జరిగిన మూడు రోజులకు బాలుడు తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. వారి దాడిలో తీవ్రంగా గాయపడిన బాలుడిని ఎల్ఎన్జేపీ ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో ఆసుపత్రి వర్గాలు పోలీసులకు సమాచారం అందించాయి. ఆసుపత్రికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించేందుకు ప్రయత్నించినా బాలుడి కుటుంబ సభ్యులు నిరాకరించారు. కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత జరిగిన విషయాన్ని తల్లి వివరించింది. అపస్మారక స్థితిలోకి వెళ్లిన బాధితుడు కొన్ని రోజులు చికిత్సకు స్పందించినా.. శనివారం ఉదయం ప్రాణాలు కోల్పోయాడు. ఈ కేసులో ఇద్దరు జువైనల్స్‌ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అయితే, తల్లిదండ్రుల హామీతో వారిని విడుదల చేయాలని జువైనల్ జస్టిస్ బోర్డు ఆదేశించింది. మరో బాలుడిని శనివారం అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. పోక్సో, ఐపీసీ సెక్షన్ 377,34 ల ప్రకారం కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. దాడి చేసిన మైనర్లు సైతం 10-12 ఏళ్ల వారేనని వెల్లడించారు. ఇదీ చదవండి: వైద్యులు బతకడన్నారు.. ఇప్పుడు 18వ బర్త్‌డే చేసుకుంటున్నాడు! -
జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసులో కీలక మలుపు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సంచలనంగా మారిన జూబ్లీహిల్స్ అమ్నీషియా పబ్ గ్యాంగ్ రేప్ కేసు మరో కీలక మలుపు తిరిగింది. నలుగురు నిందితులను మేజర్లుగా పరిగణిస్తూ జువైనల్ కోర్టు తీర్పు వెలువరించింది. ఐతే.. ఎమ్మెల్యే కొడుకును మాత్రం జువైనల్‌గా పరిగణించాలని పేర్కొంది. మొత్తం ఆరుగురు నిందితుల్లో ఐదుగురు మైనర్లుగా పేర్కొంటూ కేసు నమోదు కాగా.. జువైనల్ కోర్టు తీర్పు కీలకంగా మారనుంది. ఇదీ కేసు.. జూబ్లీహిల్స్ అమ్నీషియా పబ్‌లో మే 28 ఓ బాలికను ట్రాప్ చేసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు ఆరుగురు నిందితులు. అందులో ఒకరు మేజరు కాగా.. ఐదుగురు మైనర్లుగా పోలీసులు తేల్చారు. బాలికను రోడ్డు నెంబర్ 44లో ఉన్న ఖాళీ ప్రదేశంలో గ్యాంగ్ రేప్ చేసి.. ఆ తర్వాత సాయంత్రం మళ్లీ పబ్ దగ్గర వదిలిపెట్టారు. ఈ ఘటన జరిగిన మూడు రోజుల తర్వాత విషయం వెలుగులోకి వచ్చింది. మెడపై గాయాలను చూసి తల్లిదండ్రులకు అనుమానం వచ్చి పోలీసులను ఆశ్రయించారు. మే 31న పోక్సో యాక్ట్ ప్రకారం.. జూబ్లీహిల్స్ పీఎస్‌లో కేసు నమోదు చేశారు. ఇదీ చదవండి: ప్లాన్ ప్రకారమే జూబ్లీహిల్స్ గ్యాంగ్‌రేప్ ఘటన.. మైనర్లు ఉన్నందున పేర్లు కుదరదన్న సీపీ -
దారుణం.. మైనర్‌ను వివస్త్రను చేసి సామూహిక అత్యాచారం
లక్నో: ఉత్తర్‌ప్రదేశ్‌లో మరో దారుణం వెలుగుచూసింది. 15 ఏళ్ల బాలికను వివస్త్రను చేసి సామూహిక అత్యాచారనికి పాల్పడ్డారు నలుగురు కిరాతకులు. మొరాదాబాద్ జిల్లాలో సెప్టెంబర్ 1న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలిక పక్క గ్రామంలో తిరనాళ్లకు వెళ్లినప్పుడు స్థానిక యువకులు ఆమెపై కన్నేసి ఈ క్రూర చర్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఘటన అనంతరం బాలిక నగ్నంగా తన స్వగ్రామానికి వెళ్తుండగా.. కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. బాధితురాలి అంకుల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నలుగురు నిందితుల్లో ఇప్పటివరకు ఒక్కరిని మాత్రమే అరెస్టు చేశారు. అయితే సెప్టెంబర్ 7న తమకు ఫిర్యాదు అందిందని పోలీసుల చెప్పారు. బాధితురాలి తల్లిదండ్రులను అడిగితే తమ కూతురికి జరిగిన విషయం చెప్పలేదని పేర్కొన్నారు. అయినా తాము దర్యాప్తు చేపట్టి నిందితుల్లో ఒకరిని అరెస్టు చేశామన్నారు. విచారణ కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేశారు. చదవండి: హోటల్ రూమ్‌లో లవర్‌తో భర్త రాసలీలలు.. భార్య ఎంట్రీతో సీన్ రివర్స్! -
కుంతీపుత్రుడు: 27 ఏళ్ల తర్వాత కన్నతల్లిని చేరుకుని..
తన తప్పు లేకుండా జన్మించిన బిడ్డను నీట వదిలేసింది ఆనాటి కుంతీ. కామాంధుడి దాహార్తికి పుట్టిన బిడ్డను విధివశాత్తూ వదిలించుకుంది ఈనాటి కుంతీ. కానీ, ఆనాటి కర్ణుడిలా ఈ అభివన కర్ణుడు ఊరుకోలేదు. 27 ఏళ్ల తర్వాత తన తల్లి ఆచూకీ వెతుక్కుంటూ వెళ్లాడు. ఆ తర్వాత ఏం చేశాడో ఈ వాస్తవ గాథ చదివితే తెలుస్తుంది. సుమారు 27 ఏళ్ల కిందట.. ఉత్తర ప్రదేశ్ బరేలీలో ఘోరం జరిగింది. తన సోదరి ఇంట్లో ఉంటున్న మైనర్‌ను.. బలవంతంగా ఎత్తుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు అన్నదమ్ములు. అది ఒక్కసారి కాదు.. పలుమార్లు. నిందితులిద్దరూ ఆమె కుటుంబానికి పరిచయస్తులే. పైగా బయటకు విషయం చెబితే చంపుతామని బెదిరించారు కూడా. ఈలోగా ఆ మైనర్ గర్భం దాల్చడం.. ప్రాణంమీదకు రావడంతో ఆమె బిడ్డను కనడం జరిగిపోయాయి. దత్తత మీద ఆమె కుటుంబం బిడ్డను వదిలించుకుని.. రాంపూర్‌కు వలస వెళ్లింది. అప్పుడామె వయసు 12 ఏళ్లు. కొన్నేళ్లకు ఆమెకు వివాహం కాగా.. ఆమె అత్యాచారానికి గురైందన్న విషయం తెలిసి పదేళ్ల తర్వాత ఆ భర్త ఆమెకు విడాకులు ఇచ్చాడు. దీంతో.. ఆ మానని గాయంతో అలా ఒంటరిగానే మిగిలిపోయింది. ► కాలం గిర్రున తిరిగింది. ఆ దత్తపుత్రుడికి తాను ఉన్నచోటు తనది కాదని తెలిసింది. తన కన్నతల్లి కోసం వెతుకులాట ప్రారంభించాడు. 2021 మొదట్లో.. ఎట్టకేలకు ఆ బిడ్డ తన తల్లిని కలుసుకున్నాడు. తన తండ్రి ఎవరో చెప్పాలని నిలదీశాడు. ఆమె తెలిసీతెలియని వయసులో తనకు జరిగిన అన్యాయం గురించి కొడుకు వద్ద ఏకరువు పెట్టుకుంది. దీంతో రగిలిపోయిన ఆ కొడుకు.. పోరాటానికి ఆమెను సిద్ధం చేశాడు. షాహ్‌జహాన్‌పూర్ పీఎస్‌కు వెళ్లి 1994లో తన తల్లిపై జరిగిన అఘాయిత్యం గురించి ఫిర్యాదు చేశాడు. మూడు దశాబ్డాల కిందటి ఘటన కావడంతో పోలీసులు షాక్ తిన్నారు. ఫిర్యాదు తీసుకోవడానికి తటపటాయించారు. అయితే.. కోర్టు జోక్యంతో ఎట్టకేలకు కేసు నమోదు అయ్యింది. ► 2021, మార్చ్ 4వ తేదీన ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది. ఈ లోపు బాధితురాలి న్యాయం చేసేందుకు ప్రత్యేక బృందం ఈ కేసు విచారణ చేపట్టింది. చాలా ఏళ్ల కిందటి కేసు కావడం.. నిందితుల పేర్లూ పూర్తిగా తెలియకపోవడంతో దర్యాప్తునకు ఆటంకంగా మారింది. పైగా వాళ్లు ఎక్కడున్నారో కూడా తెలియదు. కానీ, చిన్నవయసులోనే ఆ తల్లి అనుభవించిన క్షోభను పోలీసులు అర్థం చేసుకున్నారు. ఎస్సై ధర్మేంద్ర కుమార్ గుప్తా దగ్గరుండి విచారణ చేశారు. నిందితులు ఇద్దరూ అదే నగరంలో హద్దాఫ్ ప్రాంతంలో ఉంటున్నారని గుర్తించారు. ► అయితే విచారణ కోసం వెళ్లిన పోలీసులకు ఎదురుదెబ్బ తగిలింది. బాధితురాలెవరో తమకు తెలియదని ఆ అన్నదమ్ములు బుకాయించారు. దీంతో కోర్టు ఆదేశాలతో డీఎన్ఏ పరీక్షలు నిర్వహించారు. జులై 2021న శాంపిల్స్‌ను ల్యాబ్‌లకు పంపించారు. కానీ, ఫలితం రావడానికి ‘9 నెలల’ టైం పట్టింది. అందులో మొహమ్మద్ రాజీ ఆ బిడ్డకు తండ్రిగా తేలాడు. దీంతో పోలీసులు అరెస్ట్ వారెంట్‌తో నిందితుల ఇళ్లకు వెళ్లారు. అయితే.. ► అప్పటికే తమ బండారం బయటపడుతుందని భావించి.. నిందితులిద్దరూ పరారయ్యారు. పోలీసులు ఊరుకుంటారా?.. బృందాలను ఏర్పాటు చేయించి వాళ్లిద్దరి కోసం గాలింపు చేపట్టారు. సర్వేయిలెన్స్ టీం ఈ కేసులో కీలకంగా వ్యవహరించింది. ఎట్టకేలకు రాజీని హైదరాబాద్‌లో కనిపెట్టి.. మంగళవారం నాడు అరెస్ట్ చేసింది. అసలు ఆ ఉదంతం మళ్లీ తన ముందుకు వస్తుందని తాను ఊహించలేదని నిందితుడు చెప్తున్నాడు. మరో నిందితుడు ఒడిశాలో ఉన్నట్లు భావిస్తున్న పోలీసులు.. అక్కడికి బృందాలను పంపారు. తల్లిని వెతుక్కుంటూ వెళ్లడమే కాదు.. ఆమెకు జరిగినదానికి ఆలస్యమైనా న్యాయం జరిగింది. A case that will increase respect for @Uppolice Accused was hiding in Hyderabad since his DNA sample was taken.. UP: Born out of rape, son finds mother after 27 years, helps nab accused https://t.co/qm2lRK4eeG pic.twitter.com/wuD8zbSLNr — Kanwardeep singh (@KanwardeepsTOI) August 4, 2022 -
జూబ్లీ హిల్స్ కేసులో కీలక వీడియో లభ్యం..!!
-
Jubilee Hills Pub Case: జూబ్లీ హిల్స్ కేసు సీన్ ను రీ-కన్ స్ట్రక్షన్ చేస్తున్న పోలీసులు
-
కీచక పర్వం: కట్నం తేలేదని బంధువులతో కలిసి..
అడిగినంత కట్నం ఇవ్వలేదని ఓ భర్త దారుణానికి పాల్పడ్డాడు. భార్యపై బంధువులతో కలిసి సామూహిక అత్యాచారానికి తెగపడ్డాడు. అంతటితో ఆగకుండా ఆ మృగచేష్టలను వీడియో తీసి.. యూట్యూబ్‌లో అప్లోడ్ చేస్తానంటూ బెదిరింపులకు దిగాడు. రాజస్థాన్ భరత్‌పూర్‌లో ఘోరం జరిగింది. అడిగినంత కట్నం తేలేదని ఓ భర్త కిరాతకానికి పాల్పడ్డాడు. లక్షన్నర రూపాయల వరకట్నం పెళ్లైన నాటి నుంచి వేధింపులు ఎదుర్కొంటోంది ఆమె. పేదింటి కుటుంబం కావడంతో కట్నం ఇవ్వలేకపోయింది. ఈ క్రమంలో ఆమెపై లైంగిక దాడికి తెగబడింది అత్తింటి కుటుంబం. తన బంధువులతో కలిసి భర్త ఆమెను సామూహిక అత్యాచారం చేశాడు. ఆ సమయంలో లైంగిక దాడిని వీడియో కూడా తీశాడు. కట్నం డబ్బు తేకుంటే ఆ వీడియో ద్వారా డబ్బు సంపాదించుకుంటానని ఆమెను బెదిరించాడట. ఈ మేరకు భరత్పూర్ కమాన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదు అయ్యింది. ‘‘నీ కుటుంబ సభ్యులు ఎలాగూ కట్నం ఇవ్వలేరూ. కనీసం ఇప్పుడు నీ వీడియోను యూట్యూబ్‌లో అప్లోడ్ చేసైనా ఆ డబ్బు సంపాదించుకుంటా’’ అని ఆ మానవ మృగం బెదిరింపులకు దిగింది. దీంతో తల్లిదండ్రుల సాయంతో పోలీసులను ఆశ్రయించిందామె. నిందితుల్లో ఇద్దరికీ పెళ్లిళ్ల మీద పెళ్లిళ్లు అయ్యానని, మరొకరు ఆమెను ఐదురోజుల కిందట భర్త పిలుస్తున్నాడని చెప్పి కమాన్ ప్రాంతానికి తీసుకొచ్చి గదిలో బంధించి అత్యాచారానికి పాల్పడ్డాడని బాధితురాలు చెప్తోంది. అంతేకాదు పారిపోయి ఇంటికి వచ్చాక కూడా వదలకుండా నిందితులంతా ఆమెపై ఘోరానికి తెబడ్డారట. పరారీలో ఉన్న కీచకుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. వీడియోను ఎక్కడైనా అప్లోడ్ చేశారా? ఎవరెవరికి పంపారనే వివరాలను సేకరిస్తున్నారు పోలీసులు. చదవండి: ప్రియుడితో పెళ్లికి అడ్డొస్తున్నాడని తండ్రి హత్య.. ఆపై -
దాష్టీకం తర్వాత ఆమెను చంపేయాలనుకున్నారట!
Kasturba Nagar Gang-Rape Charge Sheet Details: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కస్తూర్బానగర్ సామూహిక అత్యాచార కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఓ యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడి.. ఆపై బూట్ల దండతో ఆమెను ఊరేగించిన ఫొటోలు, వీడియోలు ఇంటర్నెట్లో ప్రకంపనలు పుట్టించాయి ఈ జనవరిలో. ఈ కేసులో పోలీసులు సోమవారం ఛార్జ్‌షీట్ నమోదు చేశారు. బాధితురాలిని చంపేయాలన్న ఉద్దేశంతోనే నిందితులు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఏడాది జనవరి 26వ తేదీన దేశ రాజధానిలో ఈ ఘోరం జరిగింది. కొందరు దుండగులు 20 ఏళ్ల బాధితురాలిని బలవంతంగా ఎత్తుకెళ్లి, ఓ గదిలో బంధించి ఆడవాళ్ల సమక్షంలోనే సామూహిక అత్యాచారానికి పాల్పడి ఆపై ఊరేగించారు. జుట్టు కత్తిరించి, ముఖానికి మసి పూసి కస్తూర్బా వీధుల వెంట ఆమె మెడలో చెప్పులు, బూట్ల దండలు వేసి కొట్టుకుంటూ నడిపించారు. పోలీసుల ఎంట్రీతో.. వాళ్లంతా ఆమెను వదిలేసి పరారయ్యారు. కాగా, ఈ ఘటనపై దేశవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో చర్చ జరగ్గా.. ఢిల్లీ ప్రభుత్వం అత్యున్నత దర్యాప్తునకు ఆదేశించింది. ప్రతీకారంగానే.. బాధితురాలిపై ప్రతీకారం తీర్చుకునేందుకే ఈ ఘోరానికి పాల్పడినట్లు పోలీసులు ఛార్జ్‌షీట్‌లో పొందుపర్చారు. బాధితురాలు, నిందితుల కుటుంబానికి చెందిన ఓ కుర్రాడు స్నేహితులు. అయితే.. కిందటి ఏడాది నవంబర్‌లో ఆ కుర్రాడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అందుకు ఆమే కారణమని ఆరోపించింది కుర్రాడి కుటుంబం. ఆమె వల్లే తప్పతాగి.. రైల్వే ట్రాక్ మీద ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆ కుటుంబం అంటోంది. ఈ క్రమంలోనే ఆమెకు గుణపాఠం చెప్పాలన్న ఉద్దేశంతో.. ప్రతీకారంతో ఈ హేయనీయమైన చేష్టలకు పాల్పడింది. ఛార్జ్‌షీట్ వివరాలు.. మొత్తం 762 పేజీల ఛార్జ్‌షీట్ నమోదు అయ్యింది ఈ కేసులో. ఈ ఘాతుకం తర్వాత ఆమెను చంపేయాలన్న ఉద్దేశంతో నిందితులు ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. 21 మంది పేర్లను ఛార్జీ షీట్లో పొందుపర్చగా.. 12 మంది మహిళలు, నలుగురు మగవాళ్లు, ఐదుగురు మైనర్ల పేర్లను చేర్చారు. నేరపూరిత కుట్ర, సామూహిక అత్యాచారం, హత్య చేయాలనే ప్రయత్నం, దోపిడీ, కిడ్నాప్ తదితర నేరాల కింద కేసు నమోదు చేశారు. అంతేకాదు.. తన ఆటోలో ఆమెను కిడ్నాప్ చేయడానికి సహకరించిన డ్రైవర్ దర్శన్ సింగ్ పేరును సైతం పోలీసులు చేర్చారు. సాక్షులుగా ప్రజలతో పాటు పోలీసుల పేర్లను, డాక్టర్లను సైతం చేర్చారు. మొత్తం 26 వీడియోలు, 12 సోషల్ మీడియా నుంచి.. 14 వీడియోలను నిందితుల మొబైళ్ల నుంచి స్వాధీనం చేసుకున్నారు. యాభై మంది పోలీసులు ఈ కేసు దర్యాప్తులో భాగం అయ్యారు. మరోవైపు బాధితురాలి సోదరికి సైతం ఆ కుటుంబం నుంచి లైంగిక వేధింపులు ఎదురుకాగా.. ఆమె ఇంటికి పోలీసులు భద్రత కల్పించారు. 10 లక్షల సాయం.. ఇదిలా ఉండగా.. బాధితురాలిగా ఆర్థిక సాయంగా పది లక్షల రూపాయలు ప్రకటించారు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. అంతేకాదు.. ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో ఆమె తరపున వాదనలు వినిపించేందుకు ప్రభుత్వమే ఓ లాయర్ని నియమిస్తుందని మంగళవారం ఆయన ఒక ప్రకటన చేశారు. -
ఆరు గంటలపాటు పోలీసులను పరుగులు పెట్టించింది.. అంతా ఫేక్!
నాగ్‌ఫూర్: బాయ్ ఫ్రెండ్‌ను పెళ్లాడటానికి 19 యేళ్ల యువతి సామూహిక అత్యాచారానికి గురయ్యానంటూ కట్టుకథ అల్లి పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేసినట్లు మంగళవారం నాగ్‌పూర్ అధికారులు మీడియాకు తెలిపారు. సదరు యువతి సోమవారం ఉదయం 11 గంటలకు కలమ్నా పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేయడంతో నాగ్‌పూర్ పోలీస్ కమీషనర్ అమితేష్ కుమార్‌తో సహా, ఇతర సీనియర్ అధికారులతో కూడిన సుమారు వెయ్యి మంది భద్రతా సిబ్బందిఈ కేసును విచారించినట్లు తెలిపారు. విచారణలో భాగంగా సిటీలోని 250కు పైగా సీసీ కెమెరాలను పరిశీలించిన తర్వాత ఇదంతా కట్టుకథని పోలీసధికారులు ధృవీకరించారు. ఐతే ఇదంతా ఎందుకు చేసిందో ఖచ్చితమైన కారణం తెలియచేయలేదని పోలీసులు తెలిపారు. కాగా ఆమె ఇచ్చిన పిర్యాదులో నాగ్‌పూర్ చిఖ్కలిలో నిర్మానుష్య ప్రదేశంలో ఇద్దరు వ్యక్తులు గ్యాంగ్ రేప్ చేసినట్లు తెల్పింది. ఉదయం మ్యూజిక్ క్లాస్‌కు వెళ్తుండగా మార్గం మధ్యలో వైట్ కలర్ వ్యాన్‌లో వచ్చిన ఇద్దరు వ్యక్తులు రోడ్డు డైరెక్షన్లడిగే నెపంతో మాట్లాడుతూ, వ్యాన్‌లోకి బలవంతంగా లాగి, ముఖాన్ని గుడ్డతో కప్పారని తెల్పింది. అనంతరం నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారం చేసినట్లు పిర్యాదులో పేర్కొంది. ఎఫ్ఐఆర్ రిజిస్ట్రర్ చేసిన తర్వాత పోలీస్ కమీషనర్ అమితేష్ కుమార్, అడీషనల్ సీపీ సునీల్ ఫులారీ, ఇతర సీనియర్ అధికారులు సీతాబుల్దీ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. కమీషనర్ కుమార్ దాదాపుగా వెయ్యి మంది పోలీసులతో 40 స్పెషల్ టీమ్‌లను ఏర్పాటుచేసి, సిటీలోని వ్యాన్లను, సీసీటీవీలను పరిశీలిండానికి, యువతి స్నేహితులను ప్రశ్నించడానికి హుటాహుటీన పంపారు. యువతిని మెడికల్ పరీక్షల నిమిత్తం మేయో హాస్పిటల్‌కు తరలించారు. ఈ ఉదంతంపై పోలీసధికారులు ప్రశ్నించగా తన బాయ్‌ఫ్రెండ్‌ను వివాహమడటానికి చేశానని చెప్పినట్లు తెల్పింది. ఆరు గంటలపాటు సీసీటీవీ ఫుటేజీల పరిశీలన, దాదాపు 50 మందిని విచారించిన తర్వాత అనుమానం వచ్చిన పోలీసులు యువతిని ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది. తన బాయ్ ఫ్రెండ్‌ను వివాహం చేసుకోవడానికే ఈ నాటకమంతాడినట్లు పోలీసుల ఎదుట అంగీకరించింది. చదవండి: జంక్ సామ్రాజ్యం ‘సోటిగంజ్’.. చోర్ మాల్తో 30 ఏళ్ల దందా.. కోట్లకు కోట్లు వెనకేశారు -
గ్యాంగ్ రేప్ నిందితుల కోసం ముమ్మర గాలింపు
మేడికొండూరు: గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం పాలడుగు రోడ్డులో బుధవారం రాత్రి జరిగిన గ్యాంగ్ రేప్ ఘటనపై పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న దంపతులను అటకాయించి.. భర్తను చెట్టుకు కట్టేసి అతని కళ్లెదుటే భార్యపై సామూహిక లైంగిక దాడికి పాల్పడిన నిందితుల కోసం పోలీస్ ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. సత్తెనపల్లి, మేడికొండూరు, గుంటూరు ప్రాంతాల్లో సోదాలు చేస్తున్నారు. మేడికొండూరు పోలీసులు పాతనేరస్తులెవరినీ విడిచిపెట్టకుండా విచారణ చేస్తున్నారు. పాలడుగు అడ్డరోడ్డు ప్రాంతంలో కొత్తగా నిర్మిస్తున్న కోల్డ్‌స్టోరేజీలో పని చేసున్న 70 మంది కార్మికులను ఇప్పటికే విచారణ చేశారు. పలు నేరాల్లో నిందితులుగా ఉన్న వారిని పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చి ప్రశ్నిస్తున్నారు. పోలీసుల అదుపులో ఉన్న 8 మందిని మూడు రోజులుగా విచారణ చేస్తున్నారు. వారి నుంచి ఎటువంటి సమాచారం లభ్యం కాలేదని తెలుస్తోంది. ఘటనా స్థలంలో కొత్తగా తిరుగుతున్న అనుమానితులనూ గుర్తించి వారి నుంచి వివరాలు సేకరిస్తున్నారు. ఏ చిన్న అనుమానం వచ్చినా ఎవరినీ విడిచి పెట్టకుండా దర్యాప్తు సాగిస్తున్నట్టు పోలీసులు చెబుతున్నారు. ఆ మార్గంలోని సీసీ ఫుటేజ్‌లను నిశితంగా పరిశీలిస్తున్నట్టు వెల్లడించారు. -
వారికి సంబంధం లేదు!
పంజగుట్ట: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అత్యాచారం కేసు మరో మలుపు తిరిగింది. తనపై 139 మంది అత్యాచారం చేశారంటూ కేసు పెట్టిన బాధితురాలే తనను బెదిరించి ఆ కేసులు పెట్టించారని, 139 మందిలో చాలామందికి ఈ కేసుతో సంబంధం లేదని పేర్కొంది. అంతేకాకుండా తనను ఓ ప్రముఖ టీవీ యాంకర్, ఓ సినీ హీరో కూడా అత్యాచారం చేశారని గతంలో చెప్పిన ఆమె.. వారికి ఈ కేసుతో సంబంధం లేదని స్పష్టంచేసింది. సోమవారం హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆమె విలేకరులతో మాట్లాడింది. రాజారెడ్డి అలియాస్ డాలర్‌భాయ్.. తన కుటుంబ సభ్యులను చంపుతానని బెదిరించడంతో పాటు అత్యాచారం చేసి ఈ కేసుతో సంబంధం లేని వారి పేర్లు రాయించాడని చెప్పింది. వారిని బ్లాక్మెయిల్ చేసేందుకు యత్నించాడని, అతడిపై కూడా త్వరలో పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు బాధితురాలు పేర్కొంది. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణమాదిగ మాట్లాడుతూ.. కర్ణునికి కవచకుండలం ఎంత ముఖ్యమో.. ఎస్సీ, ఎస్టీలకు అట్రాసిటీ యాక్ట్ అంతే ముఖ్యమన్నారు. అయితే కొన్ని సందర్భాల్లో ఆ కేసులు దుర్వినియోగం కావడం బాధాకరమన్నారు. ఓ గిరిజన బాలికపై 139 మంది అత్యాచారం చేశారనగానే తాను స్పందించకపోవడం పట్ల పలువురు విమర్శలు కూడా చేశారని, బాధితురాలి నుంచి పూర్తి వివరాలు సేకరించడం కోసమే ఈ జాప్యం జరిగిందని తెలిపారు. ఆమెను విచారించగా, 139 మందిలో దాదాపు 30 శాతం మంది పదేళ్లలో అత్యాచారం చేశారని, మరికొందరు మానసికంగా వేధించారని చెప్పినట్టు వివరించారు. టీవీ, సినీ రంగానికి చెందిన వారికి కేసుతో సంబంధం లేదని, మాజీ ఎంపీ పీఏ మానసికంగా వేధించినట్లు మాత్రమే తెలుసుకున్నామన్నారు. అసలు బాధితురాలు ఇలా కావడానికి ముఖ్య కారణం విద్యార్థి సంఘం నాయకుడని.. అతన్ని, ఆశ్రయం కల్పించినట్లు నటించి మోసం చేసిన డాలర్ భాయ్‌ని వెంటనే అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే ఈ కేసును సీబీఐతో విచారణ చేయించాలని కోరారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, మహిళాసంఘాల నాయకులు సంధ్య, సజయ, విమలక్క, తెలంగాణ ప్రదేశ్ ఎరుకల సంఘం అధ్యక్షుడు కుమార్ పాల్గొన్నారు. -
ప్రాథమిక ఆధారాల తర్వాతే నోటీసులు
సాక్షి, హైదరాబాద్: సంచలనం సృష్టించిన ‘పంజాగుట్ట అత్యాచార కేసు’లో దర్యాప్తు నకు ప్రత్యేక అధికారి నియమితులయ్యారు. ఈ కేసు నగర నేర పరిశోధన విభాగానికి బదిలీ కావడంతో ఉన్నతాధికారులు ప్రత్యేక దర్యాప్తు కోసం సీసీఎస్ మహిళా ఠాణా ఏసీపీ శ్రీదేవికి బాధ్యతలు అప్పగించారు. ఈమె శనివారం బాధితురాలితో మాట్లా డారు. తన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఘటనలకు సంబంధించిన పూర్తి వివరాలు సోమవారం వెల్లడిస్తానంటూ బాధితురాలు చెప్పినట్లు తెలిసింది. తనపై 11 ఏళ్ళుగా 143 మంది అత్యాచారానికి ఒడిగట్టారంటూ బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్న విషయం తెలిసిందే. ఆరోపణలు ఎదుర్కొం టున్న వారికి సంబంధించి ప్రాథమిక ఆధారాలు సేకరించిన తర్వాతే వారిపై తదుపరి చర్యలు చేపట్టాలని దర్యాప్తు అధికారులు నిర్ణయించారు. మరోపక్క బాధితురాలితో ఫిర్యాదు చేయించిన గాడ్ పవర్ ఫౌండేషన్‌కు చెందిన రాజా శ్రీకర్ అలియాస్ డాలర్ భాయ్ వ్యవహారమూ ఈ కేసులో కీలకంగా మారింది. 4నెలల కిందట స్వచ్ఛంద సంస్థగా దీన్ని రిజిస్టర్ చేయించిన అతడు సోమాజిగూడ కేంద్రంగా నిర్వహి స్తున్నాడు. ఈ కేసు నమోదైన తర్వాత యువతి ఫిర్యాదులోని అంశాల ఆధారంగా జాబితాలోని నిందితులకు కొన్ని ఫోన్ కాల్స్ వెళ్ళాయి. వారిని ఇతడు బెదిరించినట్లు కేసులు సైతం నమోదయ్యాయి. దీంతో ఈ కేసులో డాలర్ భాయ్ పాత్రపై పోలీసులకు కొన్ని ఆధారాలు లభించాయి. బాధితు రాలు ఫిర్యాదు చేసేందుకు, పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేసేందుకు సహకరి స్తున్నట్లు నటిస్తూ తన స్వలాభం చూసుకు న్నాడా? అనే కోణంలో పోలీసులు అనుమా నిస్తున్నారు. ఈ నేపథ్యంలో అతడి ఆచూకీ కోసం ప్రయత్నించగా లభించలేదు. దీంతో డాలర్ భాయ్ నిర్వహిస్తున్న స్వచ్ఛంద సంస్థ కార్యాలయంలో సోదాలు నిర్వహిం చారు. అక్కడ పోలీసులకు కొందరు యువతుల సర్టిఫికెట్లు, బయోడేటాలు లభించాయి. దీంతో ఇతడి వ్యవహారంపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతానికి ఆ సంస్థ కార్యాలయాన్ని పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు. సర్టిఫికెట్లు, బయోడేటాల్లోని వివరాల ఆధారంగా యువతుల్ని గుర్తించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వారి ఆచూకీ లభించిన తర్వాత మాట్లాడితేనే డాలర్ భాయ్‌కి సంబంధిం చిన మరిన్ని కోణాలు బయటపడతాయని అధికారులు భావిస్తున్నారు. ఇదే కార్యాల యంలో కొన్ని ఆడియో, వీడియో టేపుల్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇవి కూడా బ్లాక్‌మెయిలింగ్‌కు సంబంధించినవే అని అనుమానిస్తున్నారు. కాగా, డాలర్ భాయ్‌పై అతని భార్య గతంలోనే సీసీఎస్ మహిళా ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదయ్యి చార్జిషీటు కూడా దాఖలైంది. ఇప్పుడు ఆ కేసు స్థితిగతుల్నీ అధికారులు ఆరా తీస్తున్నారు. -
కలగాచ్లో తీవ్ర ఉద్రిక్తత
-
గ్యాంగ్ రేప్ కేసులో ఎమ్మెల్యేకి క్లీన్ చిట్
సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ భదోహి అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ త్రిపాఠితో పాటు పలువురు తనని గ్యాంగ్ రేప్ చేశారంటూ ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మహిళ ఫిర్యాదుతో ఎఫ్ఐఆర్ నమోదు చేసుకున్న పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా 2016లో తొలిసారి త్రిపాఠి తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని, ఆపై తనని పెళ్లి చేసుకుంటానని నమ్మించాడని పేర్కొంది. 2017 అసెంబ్లీ ఎన్నికల ముందు ఓ హోటల్ రూమ్ తనని ఉంచాడని, అదే సమయంలో కొంతమంది నిందితులు తనపై పలుమార్లు గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారని కోర్టుకు తెలిపింది. విచారణ చేపట్టిన జిల్లా మేజిస్ట్రేట్ ప్రధాన న్యాయమూర్తి బాధితురాలి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తరువాత కేసు దర్యాప్తు చేయాలని సూపరిటెండెంట్ రామ్ బదన్ సింగ్ తో పాటు గులాఫ్షా మహిళా పోలీస్ స్టేషన్ ఇంఛార్జ్ తో సహా ఇద్దరు సభ్యుల బృందానికి కేసును అప్పగిస్తూ తీర్పిచ్చింది. న్యాయస్థానం ఉత్తర్వులతో స్టేట్మెంట్ రికార్డ్ చేసిన పోలీస్ ఉన్నతాధికారులు..వైద్య పరీక్షలు చేయించుకునేందుకు ఆమె ఒప్పుకోవడం లేదని ఎస్పీ తెలిపారు. ఎటువంటి ఆధారాలు లేనందున ఎమ్మెల్యే త్రిపాఠికి క్లీన్ చిట్ ఇచ్చినట్లు తెలిపిన ఎస్పీ.. గ్యాంగ్ రేప్ కేసులో ఎమ్మెల్యే మేనల్లుడు సందీప్ తివారీ, మరో బంధువు నితేష్ లపై ఎఫ్ ఐఆర్ నమోదు చేసినట్లు చెప్పారు. కాగా తాను గర్భం దాల్చడంతో అబార్షన్ చేయించుకోవాలని ఎమ్మెల్యే త్రిపాఠి తనపై ఒత్తిడి తెచ్చినట్టుగా ఆమె ఫిర్యాదులో వెల్లడించినట్లు ఎస్పీ రామ్ బదన్ సింగ్ వెల్లడించారు. -
కాకినాడలో యువతిపై గ్యాంగ్ రేప్
కాకినాడ క్రైం: కాకినాడ రాగంపేటకు చెందిన 19 ఏళ్ల యువతిపై నలుగురు యువకులు గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారంటూ యువతి తల్లిదండ్రులు సోమవారం రాత్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాకినాడ రాగంపేటకు చెందిన యువతిపై అదే ప్రాంతానికి చెందిన దలాయి శ్యామ్‌కుమార్, బొబ్బిలి పృథ్వి, ఎన్.సాయికుమార్, ఈ సాయి అనే యువకులు గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారని ఫిర్యాదు చేయడంతో త్రీటౌన్ ఇన్చార్జి సీఐ రామ్మోహన్‌రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. ప్రస్తుతం నలుగురు ముద్దాయిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. -
సంచలన కేసులో రానున్న తీర్పు : భారీ భద్రత
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కథువా హత్యాచారం కేసులో తుది తీర్పు నేడు (సోమవారం, జూన్ 10) వెలువడనుంది. పంజాబ్‌లోని పఠాన్‌కోట్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్ కోర్టులో విచారణ ముగిసిన నేపథ్యంలో న్యాయమూర్తులు తీర్పును వెలువరించనున్నారు. దీంతో పఠాన్‌కోట్‌లో భద్రతను కట్టుదిట్టం చేశారు. భారీగా పోలీసులను మోహరించారు. ఎలాంటి అంవాఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందు జాగ్రత్తగా గట్టి చర్యలు చేపట్టారు. కాగా జమ్ముకశ్మీర్‌లోని కథువాలో ఎనిమిదేళ్ల బాలికను అత్యంత దారుణంగా ఆలయంలోనే హత్యాచారం చేశారు. బాలికకు మత్తు పదార్థాలు ఇచ్చి, సామూహిక అత్యాచారం, హత్య చేసిన ఈ ఘటన దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. అత్యంత పాశవికమైన ఈ ఘటన పట్ల నిరసనలు హోరెత్తాయి. అయితే ఈ కేసు విచారణకు జమ్మూకశ్మీర్‌లో పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో సుప్రీంకోర్టు పఠాన్‌కోట్ కోర్టుకు బదిలీ చేసింది. ఈ కేసులో ఎనిమిదిమంది నిందితులు ఉండగా..వారిలో ఏడుగురిపై ఛార్జ్‌షీట్ దాఖలైంది. నిందితులకు ఉరి శిక్ష విధించాలన్న డిమాండ్ కూడా ఊపందుకున్న సంగతి తెలిసిందే. Punjab: Security heightened outside Pathankot court ahead of verdict in Kathua rape-murder case pic.twitter.com/XaCdsSMnKd — ANI (@ANI) June 10, 2019 -
సామూహిక లైంగిక దాడి : దోషులుగా తేలిన ఆరుగురు
రాంచీ : జార్ఖండ్‌లోని ఖుంటి జిల్లా కొచాంగ్లో గత ఏడాది ఓ స్వచ్ఛంద సంస్థకు చెందిన ఐదుగురు యువతులపై సామూహిక లైంగిక దాడికి పాల్పడిన కేసులో ఆరుగురు నిందితులను సివిల్ కోర్టు దోషులుగా నిర్ధారించింది. ఫాదర్ అల్ఫాన్సోతో పాటు మరో ఐదుగురిని దోషులుగా కోర్టు నిర్ధారించిందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ సుశీల్ జైస్వాల్ తెలిపారు. సామూహిక లైంగిక దాడి కేసులో అల్ఫాన్సో ప్రధాన కుట్రదారుడుగా కోర్టు గుర్తించిందని వెల్లడించారు. గత ఏడాది జూన్ 19న ఖుంటి జిల్లాలోని ఓ గ్రామంలో వీధి నాటకం ప్రదర్శిస్తున్న ఓ ఎన్జీవోకు చెందిన ఐదుగురు యువతులను అపహరించిన దుండగులు వారిని తుపాకీతో బెదిరించి లైంగిక దాడికి పాల్పడిన ఘటన దుమారం రేపిన సంగతి తెలిసిందే. జాతీయ మహిళా కమిషన్ ఈ కేసును తీవ్రంగా పరిగణించడంతో జూన్ 23న జార్ఖండ్ పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. -
గ్యాంగ్ రేప్ కేసులో సంచలన తీర్పు
చత్తీస్‌గఢ్ : సామూహిక హత్యాచారం కేసులో పంజాబ్, హర్యానా హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. ఈ కేసులో నేరస్థులుగా నిర్ధారించిన ఏడుగురికి మరణశిక్షను ఖరారు చేయడంతోపాటు వారికి భారీ జరిమానాను కూడా విధించింది. రూ.50లక్షల నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది. ఇందుకు నేరస్థుల ఆస్తులను విక్రయించాలంటూ ఆదేశించడం విశేషం. ఈ మేరకు రోహతక్ డిప్యూటీ కమిషనర్‌కు కోర్టు కీలక ఆదేశాలిచ్చింది. జులై 4వ తేదీనాటికి నేరస్తుల ఆస్తులను గుర్తించి, విక్రయించాలని, అలాగే దీనికి సంబంధించిన సమాచారాన్ని కోర్టుకు అందించాలని కూడా స్పష్టం చేశారు. ఇందులో బాధితురాలి సోదరికి 25 లక్షల రూపాయలు, హర్యానా ప్రభుత్వానికి రూ.25 లక్షలు అందుతుందని తీర్పు నిచ్చింది. కాగా నేపాల్‌కు చెందిన మహిళపై అతిక్రూరంగా సామూహిక హత్యాచారానికి పాల్పడ్డారు. 2015, ఫిబ్రవరిలో రోహతక్‌లో ఈ ఉదంతం చోటు చేసుకుంది. మతి స్థిమితం లేని ఆమె , రోహతక్‌లోని సోదరి ఇంటికి వచ్చి కనిపించకుండా పోయింది. మూడు రోజుల అనంతరం దారుణ హింసకు గురైన స్థితిలో తీవ్ర గాయాలతో ఆమె మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. నిర్భయ తరహాలో గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారని తేల్చారు. ముఖ్యంగా ఆమె శరీర భాగాల్లో రాళ్లు, కర్రలను కనుగొన్నారు. ఈ ఉదంతంలో ఎనిమిది మందిపై కేసు నమోదు కాగా అదే ఏడాది డిసెంబరులో రోహతక్ సెషన్స్ జడ్జి అందరికీ మరణ శిక్ష విధించారు. వీరిలో ఒకరు మైనర్కూడా ఉన్నారు. తాజాగా ఈ తీర్పును సమర్ధించిన న్యాయమూర్తులు ఏబీ చౌదరి, సురేందర్ గుప్త ఆధ్వర్యంలోని పంజాబ్, హర్యానా హైకోర్టు బెంచ్ మైనర్‌ను మరణశిక్షనుంచి మినహాయించింది. -
నడిరోడ్డుపై మహిళల సిగపట్లు
భువనేశ్వర్: ఒడిశాలో బీజేపీ కార్యకర్తలు, పోలీసుల మధ్య సోమవారం తోపులాట చోటుచేసుకుంది. ఇరువర్గాలు బాహాబాహికి దిగడం కెమెరాకు చిక్కింది. బీజేపీ మహిళా కార్యకర్త, మహిళా పోలీసు పరస్పరం తోసుకోవడం, ముష్టిఘాతాలతో విరుచుకుపడటం వీడియోలో రికార్డైంది. 2011-12 పిప్లీ గ్యాంగ్‌రేప్, హత్య కేసు దర్యాప్తును తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపిస్తూ బీజేపీ మహిళా కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నినదించారు. వీరిని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. పూరి జిల్లా పిప్లీ ప్రాంతంలో 2011, నవంబర్ 28న పంతొమ్మిదేళ్ల యువతి సామూహిక అత్యాచారానికి గురైంది. కటక్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 2012, జూన్ 21న బాధితురాలు చనిపోయింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు ప్రశాంత్ ప్రధాన్‌తో పాటు అతడి తమ్ముడు సుశాంత్‌లను గతేడాది డిసెంబర్లో మొదటి అదనపు సెషన్స్ కోర్టు విడుదల చేసింది. ప్రాసిక్యూషన్ సరైన సాక్ష్యాధారాలు సమర్పించకపోవడం వల్లే నిందితులు బయటపడ్డారు. నిందితులను కాపాడేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలతో ప్రజాగ్రహం వెల్లువెత్తడంతో అప్పటి వ్యవసాయ శాఖ మంత్రి ప్రదీప్ మహారథి తన పదవికి 2012లో రాజీనామా చేశారు. మళ్లీ 2014లో ఆయన మంత్రి పదవిని దక్కించుకున్నారు. #WATCH: Scuffle breaks out between the police and BJP Women Wing workers in Bhubaneswar during a protest over Pipili gang rape-and-murder case. #Odisha pic.twitter.com/1uDq3PfhWH — ANI (@ANI) January 21, 2019 -
చెన్నై లైంగిక దాడి కేసు : ఘోరమైన విషయాలు
సాక్షి ప్రతినిధి, చెన్నై: చెన్నై ఐనవరం బాలికపై లైంగిక దాడులకు సంబంధించి క్రమేణా అనేక ఘోరమైన విషయాలు వెలుగుచూస్తున్నాయి. బాలికపై మొదటిగా లైంగిక దాడికి పాల్పడిన రవికుమార్ (66).. శస్త్రచికిత్స సమయంలో వైద్యులు వాడే అనస్తీషియా (మత్తు ఇంజెక్షన్)ను ప్రయోగించినట్లు అంగీకరించాడు. దీంతో బాలికపై లైంగిక దాడికి పాల్పడిన వారికి మత్తు ఇంజెక్షన్, మాదక ద్రవ్యాలు సరఫరా చేసిన ఫార్మసీ దుకాణ యజమానులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని రహస్య ప్రదేశంలోకి తీసుకెళ్లి విచారిస్తున్నారు. ఐనవరం, పెరంబూరు ప్రాంతాల్లోని మూడు ఫార్మసీల నుంచి వాటిని కొనుగోలు చేసినట్లు నిందితులు ఇచ్చిన సమాచారంతో వారిని పట్టుకున్నారు. రెగ్యులర్ ఖాతాదారులు కావడంతో అలవాటుగా ఇచ్చేశామని, వాటిని లైంగికదాడికి వినియోగిస్తారని తాము అనుకోలేదని ఫార్మసీ యజమానులు పోలీసుల వద్ద వాపోయినట్లు సమాచారం. శస్త్రచికిత్స సమయంలో రోగికి ఇచ్చే అనస్తీషియా ఇంజెక్షన్‌ను నిందితుడు రవికుమార్ కొనుగోలు చేసినట్లు తేలింది. నిందితులు పొడిచిన ఇంజెక్షన్ల వల్లనే బాలిక శరీరమంతా దద్దుర్లు ఏర్పడినట్లు తెలుసుకున్నారు. తగిన అర్హతకలిగిన వైద్యుడు జారీచేసిన ప్రిస్కిప్షన్ లేకుండా ప్రమాదకరమైన వస్తువులను అమ్మిన నేరానికి వారి లైసెన్సులు రద్దుచేసే అవకాశం ఉంది. బాధిత బాలికకు వైద్యపరీక్షల నిమిత్తం ఆరుగురితో కూడిన వైద్యుల బృందం ఏర్పాటైంది. మానసిక చికిత్స నిపుణుడు, కౌన్సెలింగ్ నిపుణుడు, బాలల వైద్య నిపుణుడు తదితరులు ఈ బృందంలో ఉన్నారు. కుటుంబ సభ్యులే సెక్యూరిటీ గార్డులు చెన్నై ఐనవరంలోని బాలికపై లైంగికదాడి సంఘటనతో ప్రయివేటు సెక్యూరిటీ గార్డులపైనే ప్రజల్లో నమ్మకం పోయింది. దీంతో సదరు అపార్టుమెంటు అసోసియేషన్ వారు 300 మంది కుటుంబాలతో గురువారం సమావేశమయ్యారు. తమ అపార్టుమెంటును తామే రక్షించుకోవాలని నిర్ణయించుకున్నారు. చురుకుగా ఉండే పదిమంది ఆడవారికి తాత్కాలికంగా సెక్యూరిటీ బాధ్యతలను అప్పగించారు. నమ్మకమైన సెక్యూరీటీ గార్డుల సంస్థ దొరికేవరకు ఈ మహిళలతోపాటు కొందరు మగవారు కూడా అపార్టుమెంటు రక్షణ బాధ్యతలు చేపట్టాలని నిర్ణయించారు. మూడు షిఫ్టుల్లో వారంతా పనిచేసేలా నిర్ణయించారు. వచ్చిపోయే వారిపై పలు ఆంక్షలు విధించారు. అనుమతిలేనిదే ఎవరినీ లోనికి పంపడం లేదు. -
ఇంక ఎవరిని నమ్మాలి!
మానవ మృగాలు.. దాదాపు పాతిక మంది. 11 ఏళ్ల దివ్యాంగురాలైన బాలికపై బాలికపై దాష్టీకానికి పాల్పడిన ఘటన దేశం మొత్తాన్ని నివ్వెరపోయేలా చేసింది. ఏడు నెలలుగా తమ ముందే నవ్వుతూ తిరుగుతున్న కామ పిశాచాలు.. ఆ చిన్నారిని చిదిమేశారన్న ఘోర వాస్తవాన్ని అపార్ట్‌మెంట్‌వాసులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆ భయం వారిని ఇప్పట్లో వీడిపోయేలా లేదు.. సాక్షి, చెన్నై: మొత్తం ఎనిమిది బ్లాకులు. ప్రతీ బ్లాక్ ఎంట్రెన్స్ వద్ద ఒక్కో మహిళ.. చేతిలో కర్రతో కనిపిస్తున్న దృశ్యం. అలాగని వాళ్లు సెక్యూరిటీ గార్డులు కాదు. ఎవరినీ నమ్మలేని స్థితిలోని ఉన్న అపార్ట్మెంట్ మహిళలంతా కూడగలుపుకుని.. ఇలా రోజుకు కొందరు గార్డు విధులను నిర్వహిస్తున్నారు. కొత్తగా ఎవరైనా కనిపించినా.. చివరికి పనివాళ్లనైనా సరే... క్షుణ్ణంగా పరిశీలించి లోపలికి అనుమతిస్తున్నారు.. వారి కదలికలపై నిఘా వేస్తున్నారు. అయనావరంలోని సన్నీవేల్ అపార్ట్మెంట్లో ప్రస్తుతం కనిపిస్తున్న పరిస్థితి ఇది. (డ్రగ్స్ ప్యాకెట్లు.. కండోమ్‌లు) ఎవరిని నమ్మాలి...? ‘నిత్యం నవ్వుతూ, సెల్యూట్ చేస్తూ అమ్మ అని పిలిచే అతనిలో.. అంతటి రాక్షసుడు ఉన్నాడన్న విషయం నాకు వెన్నులో వణుకు పుట్టిస్తోంది. మాకు ఏదో ఒకనాడు ముప్పు ఉండేదేమో!. కళ్ల ముందు ఇంత ఘోరం జరిగాక ఇంకా భయం పెరిగిపోయింది. ఇంతకాలం బయటి నుంచి ప్రమాదం ముంచుకొస్తుందేమోనని భయపడేవాళ్లం. కానీ, అదే ప్రమాదంతో ఉన్నామన్నది ఇప్పుడు తేటతెల్లమైంది’ అని ఓ గృహిణి చెబుతోంది. ‘అపార్ట్మెంట్లో సీసీ ఫుటేజీలు సరిగ్గా పని చేయటం లేదు. ఇప్పుడు వాటిని రిపేర్ చేయించాం. మరికొన్ని చోట్ల కూడా ఏర్పాటు చేయించాం. 24/7 వాటిని పర్యవేక్షించేందుకు సిబ్బందిని కూడా నియమించుకున్నాం. ఒంటరిగా ఉన్న సమయంలో జాగ్రత్తగా ఉండాలని, స్విమ్మింగ్ పూల్, జిమ్‌లకు వెళ్లే సమయంలో జాగ్రత్తగా ఉండాలని అందరికీ మేం సూచిస్తున్నాం’ అని ఓ యువతి వ్యాఖ్యానించింది. దాదాపు పాతిక మంది (వృద్ధులు, మధ్య వయస్కులు) కలిసి ఏడు నెలలపాటు చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడిన ఘటన వారిని వణికించింది. అందుకే ఎవరినీ నమ్మలేకపోతున్నారు. (ఎంత ఘోరం) సీడబ్ల్యూసీకి చిన్నారి... అయనవరం రేప్ కేసులో కేసులో దాఖలైన పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు.. బాలికను సీడబ్ల్యూసీకి తరలించకపోవటంపై ఆగ్రహం వెల్లగక్కింది. తక్షణమే సీడబ్ల్యూ ముందు ఆమెను హాజరుపరచాలని పోలీసులను కోర్టు ఆదేశించింది. మానసిక నిపుణులతో కౌన్సిలింగ్ ఇప్పించిన తర్వాత చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించే అవకాశం ఉంది. ఇక సైకాలజిస్టులు మాత్రం తల్లిదండ్రుల తీరును తప్పుబడుతున్నారు. ‘బాలికతో వారి బంధం సరిగ్గా ఉంటే.. వాళ్లు ఆమె కోసం కనీసం సమయం కేటాయించి ఉంటే ఈ ఘోర కలికి ఎప్పుడో అడ్డుకట్ట పడి ఉండేది. ఆమెలో ప్రవర్తననైనా వాళ్లు గమనించాల్సి ఉండేది. ఇది ముమ్మాటికీ వాళ్ల తప్పు కూడా’ అని సీనియర్ సైకాలజిస్టు ఒకరు చెబుతున్నారు. విస్తూపోయే రీతిలో... 66 ఏళ్ల లిఫ్ట్ ఆపరేటర్‌తోపాటు మరో 25 మంది విస్తూపోయే రీతిలో అతికిరాతకంగా బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. అపార్ట్మెంట్లో సీసీ ఫుటేజీలు సర్వేలెన్స్ లేని ప్రదేశాలకు తీసుకెళ్లి.. డ్రగ్స్ ఇచ్చి సామూహికంగా అత్యాచారానికి పాల్పడ్డారు. ఆపై వీడియోలు తీసి చంపేస్తామని బెదిరించి ఏడు నెలలుగా దాష్టీకానికి పాల్పడుతూ వస్తున్నారు. లిఫ్ట్ ఆపరేటర్‌తోపాటు ఫ్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు, మరికొందరు యువకులు ఈ రాక్షస క్రీడలో నిందితులు. వీరిలో 18 మంది నిందితులను కటకటాల వెనక్కునెట్టారు. మరో 6 మంది కోసం గాలిస్తున్నారు. నిందితులను న్యాయవాదులు కోర్టులో చితకబాదటం తెలిసిందే. -
రేప్ ఎలా చేశారో చెప్పు...
మైనర్ బాలికపై జరిగిన అకృత్యాన్ని రాజకీయం చేద్దామనుకున్న నేతలు అడ్డంగా బుక్కైపోయారు. బిహార్‌లో సంచలనం సృష్టించిన గయ తల్లికూతుళ్ల సామూహిక అత్యాచారం కేసులో కొందరు వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. రేప్ ఎలా జరిగిందో? చెప్పాలంటూ బాధితురాలిని ఇబ్బందులకు గురి చేయటంతో వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పట్నా: గయ జిల్లా సోనిదిహ్ గ్రామం సమీపంలో బుధవార రాత్రి ఓ వైద్యుడ్ని చితకబాది చెట్టుకు కట్టేసి, తుపాకీతో బెదిరించి అతని భార్య(35), కూతుళ్ల(15) 20 మంది గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. ఆపై రంగంలోకి దిగిన పోలీసులు గ్రామస్తుల సాయంతో మరుసటి రోజు ఉదయం(గురువారం) కల్లా నిందితులందరినీ అరెస్ట్ చేశారు. ఈ ఘటన బిహార్‌తోపాటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ కేసులో బాధితురాలైన మైనర్ బాలికను శుక్రవారం వైద్య పరీక్షల నిమిత్తం తీసుకెళ్లారు. ఆ సమయంలో పోలీసుల వాహనాన్ని అడ్డుకున్న కొందరు ఆమెను బలవంతంగా కిందకి దించి పరామర్శించారు. ‘నీపై రేప్ ఎలా జరిగింది?.. ఎంత మంది అఘాయిత్యానికి పాల్పడ్డారు. మీ అమ్మ ఆ సమయంలో ఏం చేస్తోంది?... అంటూ ఇలా ప్రశ్నలు గుప్పించారు. అంతటితో ఆగకుండా ఆ బాలిక ఇష్టం లేకుండానే సెల్ఫీలు, వీడియోలు తీసుకున్నారు. అడొచ్చిన పోలీస్ సిబ్బందిని నెట్టేసి మరీ అత్యుత్సాహం ప్రదర్శించారు. ఆర్జేడీ నేతలపై కేసులు.. తొలుత ఆ వీడియోలు, ఫోటోలు ఆర్జేడీ నేతల ట్విటర్ అకౌంట్లలో, పార్టీ అధికారిక పేజీల్లో చక్కర్లు కొట్టాయి. ఆపై స్థానిక మీడియా ఛానెళ్లలో కూడా హల్ చల్ చేయటంతో పోలీసులు ఆర్జేడీ నేతలపై కేసు నమోదు చేశారు. ఆర్జేడీ జాతీయ కార్యదర్శి మెహతా, బెలగంజ్ ఎమ్మెల్యే సురేంద్ర ప్రసాద్ యాదవ్, మహిళా విభాగం ప్రెసిడెంట్ అభ్‌లతా, జిల్లా అధ్యక్షుడు ముర్షిద్ అలమ్, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు సరస్వతి దేవీ.. తదితరుల పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చారు. పోలీసుల విధులకు విఘాతం కలిగించారన్న అభియోగాలను కూడా వారిపై నమోదు చేసినట్లు డీఐజీ ప్రకటించారు. తేజస్వి గుస్సా... అయితే ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే తమ పార్టీ నేతలపై కేసులు నమోదు చేయించిందని ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్ చెబుతున్నారు. ఘటనపై నిజనిర్దారణ కమిటీ నియమించినట్లు, దానికి స్వయంగా తానే నేతృత్వం వహిస్తున్నట్లు తేజస్వి తెలిపారు. ఆరోపణలు రుజువైతే అందరిపై చర్యలుంటాయని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు మెహతా కూడా తమపై వస్తున్న ఆరోపణలను ఖండించారు. ‘అత్యాచారం జరిగిన 24 గంటల్లోపు బాధితులకు వైద్య పరీక్షలకు పంపాలి. కానీ, ఆలస్యంగా పోలీసులు ఆమెను తీసుకెళ్లటంతో అనుమానం వచ్చి అడ్డుకున్నాం. ఆమెతో మాట్లాడుతున్న సమయంలో మీడియా అక్కడికి వచ్చింది. అందుకే బాధితురాలు మాపై అసహనం ప్రదర్శించింది. అంతేతప్ప మేమేం ఆమెను ఇబ్బంది పెట్టలేదు’ అని మెహతా మీడియాకు తెలిపారు. బాధితురాలి మాట్లలో.. నేను బతిమాలుతున్న నన్ను బలవంతంగా వాహనం నుంచి దించేశారు. నన్ను ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేశారు. చాలా ఇబ్బందిగా అనిపించింది. అరిచేశా... ఆ మృగాళ్లకు ఉరి శిక్ష పడేదాక నా ముఖం ప్రపంచానికి చూపించకూడదనుకున్నా. కానీ, నేతల అత్యుత్సాహం నా ఉనికిని ప్రపంచానికి తెలియజేసింది. -
దారుణం: తల్లీకూతుళ్లపై గ్యాంగ్ రేప్
మానవ మృగాళ్లు మరోసారి రెచ్చిపోయాయి. ఓ వ్యక్తిని చితకబాది.. చెట్టుకు కట్టేసి... అతని కళ్లేదుటే భార్య, కూతుళ్లను అతిదారుణంగా చెరబట్టాయి. బిహార్‌లో సంచలనం సృష్టించిన గ్యాంగ్ రేప్ కేసు వివరాల్లోకి వెళ్తే... పట్న: గురౌరు బజార్లో క్లినిక్ నిర్వహిస్తున్న వైద్యుడు.. బుధవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో క్లినిక్ మూసేసి, భార్య, కూతురితో మోటర్ బైక్‌పై ఇంటికి బయలుదేరారు. ఆ సమయంలో రఫిగంజ్-గయ రోడ్డులో ఓ నిర్మానుష్య ప్రాంతం వద్ద హఠాత్తుగా 20 మంది వారిని చుట్టు మూగారు. మహిళ, ఆమె కూతురిని వేధించటం ప్రారంభించారు. ప్రతిఘటించబోయిన ఆ వైద్యుడ్ని చితకబాది చెట్టుకు కట్టేశారు. తుపాకీతో భయపెట్టి ఆ బాలిక(15), మహిళ(35)పై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అటుగా వెళ్తున్న గ్రామస్థుల సాయంతో బాధితులు.. కొంచ్ పోలీస్ స్టేషన్‌కు చేరి ఫిర్యాదు చేశారు. గంటల వ్యవధిలో అరెస్ట్... బాధితుల నుంచి ఫిర్యాదు స్వీకరించిన కొంచ్ పోలీసులు కేసు నమోదు చేయటంలో జాప్యం చేశారు. దీంతో మీడియా ద్వారా విషయం తెలుసుకున్న సెంట్రల్ జోన్ ఐజీ నయ్యర్ హసనైన్ ఖాన్ స్వయంగా కేసును పర్యవేక్షించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారిని సస్పెండ్ చేశారు. కేసు నమోదైన గంటల వ్యవధిల్లోనే నిందితులందరినీ అరెస్ట్ చేయగలిగారు. అర్ధరాత్రే 11 మందిని.. మిగిలిన వారిని ఉదయం అదుపులోకి తీసుకున్నారు. నిందితులు ఊరు దాటకుండా నిలువరించటంలో సోనిదిహ్ గ్రామస్థులు సైతం పోలీసులకు సాయపడటం విశేషం. గ్రామ సరిహద్దుల్లో బారికేడ్లు అడ్డుపెట్టి, రాత్రంతా నిందితుల కోసం ఇంటింటికి తిరిగి గాలింపు చేపట్టగా.. చివరకు నిందితులందరినీ అరెస్ట్ చేయగలిగారు. ఇక ఈ కేసు దర్యాప్తులో ఆ బృందం చేసిన మరికొన్ని చర్యలు వెలుగు చూశాయి. స్థానికంగా వెళ్తున్న కొందరు మహిళలను కూడా వేధించారని, ఇద్దరు యువకుల దగ్గర ఫోన్లు, డబ్బు లాక్కున్నట్లు తేలింది. రాజకీయ విమర్శలు... తల్లీకూతుళ్లపై గ్యాంగ్ రేప్ ఘటన బిహార్‌ను కుదిపేసింది. గురువారం ఉదయం ఆర్జేడీ నేత, మాజీ మంత్రి తేజస్వి యాదవ్ బిహార్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ‘బీజేపీతో కలిసిపోయాక సీఎం నితీశ్ కుమార్ ప్రభుత్వం.. శాంతిభద్రతలను పట్టించుకోవటం పూర్తిగా మానేసిందని, మహిళలపై వరుసగా అఘాయిత్యాలు జరుగుతున్న ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదని’ తేజస్వి విమర్శించారు. -
మైనర్ గ్యాంగ్‌రేప్ కేసులో అనూహ్య మలుపు
లక్నో, ఉత్తరప్రదేశ్: ఘాజీపూర్ మైనర్ బాలిక కిడ్నాప్, ఆత్యాచారం కేసులో విస్తుపోయే నిజాలు బయటకొస్తున్నాయి. ఈ దారుణానికి పాల్పడింది మైనర్ అని చెప్పడంతో తొలుత అతడిని జువెనైల్ (బాల నేరస్తుడు) అని నమ్మించే యత్నం జరిగింది. కానీ వైద్య పరీక్షల్లో వాస్తవం వెలుగుచూసింది. అతడు బాల నేరస్తుడు కాదని, నిందితుడి వయసు 20 ఏళ్లుగా వైద్యులు నిర్ధారించారు. దీంతో కేసు అనూహ్య మలుపు తిరగనుంది. పోలీసుల కథనం ప్రకారం.. యూపీలోని ఘాజీపూర్‌లో గత నెల (ఏప్రిల్) 21న స్థానిక మార్కెట్‌కు వెళ్తున్న 11 ఏళ్ల బాలికను ఓ యువకుడు కిడ్నాప్ చేసి, మదర్సాలో బంధించాడు. ఆ చిన్నారిపై డ్రగ్స్ ఇచ్చి కొందరు వ్యక్తులు పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డారు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజీ ఆధారంగా ఓ యువకుడు ఆమెను ఆటోలో తీసుకెళ్లటం గుర్తించారు. అతని ఫోన్ కాల్ ఆధారంగా మదర్సాపై మెరుపుదాడి చేశారు. ఆ సమయంలో మదర్సాలో ఉన్న యువకుడు, మౌల్వీని అదుపులోకి తీసుకున్నారు. మైనర్ అని చెప్పడంతో యువకుడిని జువెనైల్ హోమ్‌కు తరలించారు. బాలిక అత్యాచారానికి గురైనట్లు గుర్తించిన పోలీసులు.. చిన్నారి నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. నిందితులలో మౌల్వీ ఉండటంతో ఒక్కసారిగా మతం రంగు పులుముకుంది. కొందరు హిందువులు మౌల్వీ ఇంటిపై దాడులు చేస్తామని బెదిరించినట్లు అతడి భార్య గతంలో మీడియాకు తెలిపారు. ఓవైపు మతం రంగుతో పాటు మరోవైపు బాల నేరస్తుడు కావడం కేసు క్లిష్టంగా మారింది. కానీ తాజాగా వైద్య పరీక్షల్లో యువకుడి ఎముకల బలాన్ని చెక్ చేయగా, 20 ఏళ్ల యువకుడిగా గుర్తించడంతో కేసు అనూహ్య మలుపు తిరగనుంది. ఆ నిందితుడిని జువెనైల్ హోం నుంచి జైలుకు తరలించాలని అధికారులు భావిస్తున్నారు. -
అది అత్యాచారం కాదు.. తీర్పుపై ఆగ్రహం
మాడ్రిడ్: సంచలనం రేపిన ప్యాంప్లోనా గ్యాంగ్ రేప్ కేసులో స్పెయిన్ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు దుమారం రేపుతోంది. ఆమె ఇష్టపూర్వకంగానే శృంగారంలో పాల్గొందని పేర్కొంటూ కోర్టు నిందితులను నిర్దోషులుగా ప్రకటించింది. అయితే యువతిపై వేధింపులకు పాల్పడ్డారన్న నిర్ధారణకు వచ్చిన న్యాయమూర్తి.. నిందితులకు 9 ఏళ్ల జైలు శిక్షను విధించారు. స్పెయిన్ వ్యాప్తంగా తీవ్ర నిరసనలకు కారణమైన ఈ కేసులో లోతుల్లోకి వెళ్తే... రెండేళ్ల క్రితం ప్యాంప్లోనాలో బుల్ ఫైటింగ్ క్రీడల సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఒంటరిగా వెళ్తున్న 18 ఏళ్ల యువతిపై ఐదుగురు యువకులు(అంతా 20 ఏళ్లలోపు వాళ్లే) కారులోకి లాగి అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఆ ఘటనంతా వాట్సాప్‌లో వీడియోలుగా తీసి వైరల్ చేశారు. వీడియోల్లో ఆ యువకులు తాము డ్రగ్స్ ఇచ్చి యువతులపై ఇలా అత్యాచారానికి పాల్పడతామంటూ పేర్కొన్నారు. యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ మరుసటి రోజే నిందితులను అరెస్ట్ చేశారు. ‘వోల్ఫ్ ప్యాక్(తోడేళ్ల మంద)’ కేసుగా రెండేళ్లపాటు స్పెయిన్‌లో ఈ కేసు చర్చనీయాంశంగా మారింది. జడ్జి అనూహ్య వ్యాఖ్యలు... విచారణ పూర్తికావటంతో గత గురువారం జడ్జి ఈ కేసులో తీర్పు వెలువరించారు. ఆ సమయంలో జడ్జి అనూహ్య వ్యాఖ్యలు చేశారు. ‘ఘటన జరిగిన సమయంలో వీడియోలను సాక్ష్యంగా చేసుకుని తీర్పు ఇస్తున్నాం. ఆ సమయంలో యువతి ఎలాంటి ప్రతిఘటన చెయ్యకుండా కళ్లు మూసుకుని ఉంది. అంటే ఇష్టపూర్వకంగానే ఆమె శృంగారంలో పాల్గొనట్లు తెలుస్తోంది. స్పెయిన్ క్రిమినల్ చట్టాలను అనుసరించి అత్యాచారం జరిగిన సమయంలో మహిళపై క్రూరమైన చేష్టలు జరగాలి. కానీ, ఈ కేసులో మహిళ సురక్షితంగానే ఉంది. అందుకే ఇది అత్యాచారంగా పరిగణించటం లేదు. వారిని నిర్దోషులుగా ప్రకటిస్తున్నాం. కానీ, ఆ యువకులు వైరల్ చేసిన వీడియోల ఆధారంగా ఆమెపై వేధింపులకు పాల్పడినట్లు నిర్ధారణ అయ్యింది. అందుకే వారికి 9 ఏళ్ల శిక్ష విధిస్తున్నాం’ అని న్యాయమూర్తి ప్రకటించారు. కట్టలు తెంచుకున్న ఆగ్రహం... ఈ తీర్పుపై స్పెయిన్ భగ్గుమంది. దేశవ్యాప్తంగా నిరసనలు మొదలయ్యాయి. శనివారం సుమారు 35,000 మంది మహిళలు పాంపలోనాలో భారీ ర్యాలీ చేపట్టారు. ఆమెపై జరిగింది వేధింపులు కాదని.. అది ముమ్మాటికీ అత్యాచారమేనని మహిళలంతా ముక్తకంఠంతో నినదించారు. రేప్ జరిగిందని నిరూపించుకోవాలంటే బాధితురాలు చావాలా?. నిందితులకు మరణ శిక్షలు విధించాల్సిందే అని డిమాండ్ చేస్తున్నారు. మాడ్రిడ్‌తోపాటు మరికొన్ని నగరాల్లో కూడా మహిళా సంఘాలు ఆందోళన చేపట్టాయి. బాధితురాలికి న్యాయం చేయాలని.. జడ్జి రాజీనామాను కోరుతూ వారంతా నిరసనలు కొనసాగించారు. స్పెయిన్ న్యాయశాఖ మంత్రి రఫెల్ కటాలా కూడా కేసు విచారణలో జడ్జి తీరును తప్పుబట్టారు. మరోవైపు న్యాయవాదుల సంఘం జడ్జికి మద్ధతుగా నిలుస్తోంది. చట్టం తన పని తాను చేసుకుపోయిందని.. చట్టంలో సవరణలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనంటూ న్యాయశాఖ మంత్రికి చురకలు అంటించింది. తీర్పు నేపథ్యంలో క్యూఎంటాలో(నీ కథ చెప్పు...) పేరిట ఓ యాష్ ట్యాగ్ కొన్ని రోజులుగా చక్కర్లు కొడుతోంది. -
గ్యాంగ్‌రేప్ కేసులో కలెక్టర్, ఎస్పీలకు నోటీసులు
జయపురం : కొరాపుట్ జిల్లా కుందులి సమీప అడవిలో ఓ బాలిక సామూహిక గ్యాంగ్‌రేప్‌కు గురైందన్న ఆరోపణల కేసులో ఈ నెల 24 వ తేదీన తమ ముందు హాజరు కావాల్సిందిగా కొరాపుట్ కలెక్టర్, ఎస్పీలకు జాతీయ ఎస్సీ కమిషన్ నోటీసులు పంపింది. ఇద్దరు అధికారులు తమతమ వాదనలు వ్యక్తిగతంగా వినిపించేందుకు అవసరౖయెన డాక్యుమెంట్స్‌తో ఢిల్లీలో తమ కార్యాలయానికి రావాలని నోటీసుల్లో పేర్కొన్నట్లు సమాచారం. సొరిసిగుడ గ్రామం ప్రభుత్వ సంక్షేమ పాఠశాలలో 9 వ తరగతి చదువుతున్న ముసిగుడ గ్రామానికి చెందిన 14 యేళ్ల బాలిక గత ఏడాది అక్టోబర్ 10వ తేదీన కుందులి గ్రామంలో ఫొటోలు తీయించుకుని గ్రామానికి వెళ్తున్న సమయంలో జవాన్ దుస్తులు ధరించిన సాయుధులైన నలుగురు వ్యక్తులు ఆమెను ఎత్తుకు పోయి సమీప అడవిలో గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారని ఆరోపణ. ఆ సంఘటన జరిగిన మూడు నెలల తరవాత ఆమె అబద్ధం చెబుతోందని అసలు లైంగికదాడి జరగలేదని మెడికల్ రిపోర్టులు వెల్లడిస్తునాయని అధికారులు స్పష్టం చేశారు. కొరాపుట్ ఎస్పీ విలేకరుల సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. బాధితురాలు జనవరిలో ఆత్మహత్య చేసుకుని మరణించింది. బాధితురాలి బంధువులకూ ఆహ్వానం రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టించిన ఈ సంఘటనపై బాధితురాలి బంధువులు, కొరాపుట్ కాంగ్రెÜస్ ఎంఎల్ఏ కృష్ణ చంద్ర సాగరియలు జాతీయ ఎస్సీ కమిషన్‌ను ఆశ్రయించారు. వారి ఫిర్యాదును కమిషన్ పరిగణలోనికి తీసుకుని కొరాపుట్ కలెక్టర్ కె.సుదర్శన చక్రవర్తి, ఎస్పీ డా.కనేశ్వర విశాల్ సింగ్‌లకు నోటీసులు పంపుతూ ఈ నెల 24 వ తేదీన ఆ కేసులపై విచారణ జరపనున్నట్లు ఢిల్లీలోని తమ కార్యాలయానికి ఆ రోజున వ్యక్తిగతంగా హాజరు కావాలని నోటీసుల్లో స్పష్టం చేసింది. ఎస్సీ కమిషన్ అధ్యక్షుడు ప్రొఫెసర్ రామశంకర్ కటేరియ, కమిటీ సభ్యుడు జోగేంద్ర పాశ్వాన్లు కుందులి బాధితురాలి కేసు విచారణ ప్రారంభించి వాదనలను వింటారని సమచారం. ఆనాటికి ఫిర్యాదు దారులు కూడా రావాలని కమిషన్ సూచించినట్లు సమాచారం. -
సంచలన గ్యాంగ్ రేప్ కేసు.. ఘోర తప్పిదం
భోపాల్ : దేశవ్యాప్తంగా సంచలనం రేపిన భోపాల్ యువతి అత్యాచార కేసులో ఘోర తప్పిదం జరిగింది. యువతి ఇష్టపూర్వకంగానే నిందితులతో శృంగారంలో పాల్గొంది అంటూ మెడికల్ రిపోర్టు రావటం కలకలం రేపింది. దీంతో హడావుడిగా రంగంలోకి దిగిన అధికారులు అది పొరపాటున జరిగిందంటూ వివరణ ఇచ్చారు. సుల్తానియా మహిళా ఆస్పత్రి సూపరిండెంట్ డాక్టర్ కరణ్ పీప్రె ఘటనపై మీడియాతో స్పందించారు. ‘‘ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించిన సిబ్బంది కొత్త వాళ్లు కావటంతో ఈ తప్పు దొర్లింది. తప్పును సరి చేసే కొత్త నివేదికను విడుదల చేశాం’’ అని పీప్రె తెలిపారు. ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామని.. సున్నితమైన కేసుల్లో సీనియర్ మహిళ వైద్యురాలి పర్యవేక్షణ తప్పనిసరి చేసినట్లు ఆయన చెప్పారు. నివేదిక తయారీలో ఏవైనా ఒత్తిడులు వస్తున్నాయా? అన్న ప్రశ్నకు... వైద్య విభాగంలో ఎలాంటి ఒత్తిళ్లు పని చేయవని ఆయన సమాధానమిచ్చారు. కాగా, గత వారం సివిల్స్ ఎగ్జామ్ కోసం కోచింగ్‌కు వెళ్లి తిరిగి వస్తున్న 19 ఏళ్ల యువతి లాక్కెల్లి కొందరు వ్యక్తులు హబీబ్‌గంజ్ ప్రాంతంలో అత్యంత పాశవికంగా అత్యాచారం చేశారు. ఈ ఘటనపై పోలీసులు వ్యవహరించిన తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తగా.. సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ జోక్యంతో ఆ సిబ్బందిపై వేటు పడింది. అరెస్టయిన నలుగురు నిందితులపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు అయ్యింది. ఇక బాధితురాలికి నగరంలోని సుల్తానియా మహిళా ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించగా.. తప్పుడు ప్రాథమిక నివేదిక సమర్పించి ఈసారి వైద్యాధికారులు విమర్శలపాలయ్యారు. ఇది కూడా చదవండి... నగరం నడిబొడ్డున మృగాళ్ల పాశవికం -
ఆ మంత్రి పోలీసుల ఎదుట లొంగిపోవాలి
లక్నో: గ్యాంగ్ రేప్ కేసులో నిందితుడిగా ఉన్న ఉత్తరప్రదేశ్ మంత్రి గాయత్రి ప్రజాపతిని మంత్రివర్గం నుంచి తొలగించకపోవడంపై వస్తున్న విమర్శలకు అధికార సమాజ్‌వాదీ పార్టీ స్పందించింది. ప్రజాపతి వెంటనే మంత్రి పదవికి రాజీనామా చేసి, పోలీసులు ఎదుట లొంగిపోవాలని ఎస్పీ నేత అబు అజ్మీ సూచించారు. ప్రజాపతిని కాపాడేందుకు సమాజ్‌వాదీ పార్టీ ప్రయత్నించడం లేదని స్పష్టం చేశారు. గ్యాంగ్ రేప్ కేసులో అరెస్ట్ కాకుండా తప్పించుకునేందుకు ప్రజాపతి అజ్ఞాతంలోకి వెళ్లిన సంగతి తెలిసిందే. ఆయనపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. దీనిపై స్టే విధించాలని ప్రజాపతి కోరాగా సుప్రీం కోర్టు నిరాకరించింది. పోలీసులు ఆయనను అరెస్ట్ చేసేందుకు గాలిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన్ను మంత్రివర్గంలో కొనసాగించడంపై యూపీ గవర్నర్ తప్పుపట్టారు. యూపీ తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాపతి ఎస్పీ తరఫున పోటీచేశారు. -
యూపీలో మరో నాయకుడిపై గ్యాంగ్ రేప్ కేసు
అయోధ్య: గ్యాంగ్ రేప్ కేసులో పరారీలో ఉన్న ఉత్తరప్రదేశ్ మంత్రి గాయత్రి ప్రజాపతి కోసం పోలీసులు గాలిస్తుండగా.. తాజాగా అదే రాష్ట్రంలో బీఎస్పీ నాయకుడిపై ఇలాంటి కేసే నమోదైంది. అయోధ్యలో బీఎస్పీ తరఫున పోటీచేసిన బజ్మీ సిద్ధిఖీ, ఆయన అనుచరులు ఆరుగురు ఓ మహిళపై సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న సిద్ధిఖీ, మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు. కాగా రాజకీయ కుట్రతో తనపై తప్పుడు కేసు పెట్టారని సిద్ధిఖీ ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలో బీఎస్పీ గాలి వీస్తోందని, అయోధ్యలో తాను విజయం సాధిస్తానని, ప్రత్యర్థి పార్టీలు తనపై కుట్ర చేశాయని చెప్పారు. శనివారం రాత్రి సిద్ధిఖీ, ఆయన అనుచరులు ఫైజాబాద్‌లో తన ఇంట్లోకి బలవంతంగా వచ్చి దారుణానికి పాల్పడినట్టు బాధితురాలు ఫిర్యాదు చేసింది. తనను, తన కుటుంబ సభ్యులను చితకబాదారని ఆరోపించింది. మూడు నెలల క్రితం కూడా సిద్ధిఖీ తనపై అఘాయిత్యానికి పాల్పడ్డాడని, స్థానిక పోలీసులు సహకారంతో ఆయన కేసు నుంచి తప్పించుకున్నాడని బాధితురాలు చెప్పింది. ఫైజాబాద్, లక్నోలలో సిద్ధిఖీపై పలు క్రిమినల్ కేసులు ఉన్నాయని పోలీసులు చెప్పారు. -
క్లూతో కొట్టారు.. నేరస్తులను పట్టారు!
న్యూఢిల్లీ: నేరస్తుల పేర్లు తెలియవు. ఎక్కడుంటారో, ఏంచేస్తుంటారో తెలియదు, ఎలాంటి ఆధారాలు లేవు. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో పోలీసులైతే ఏం చేస్తారు ? సాక్ష్యాధారాలు లేవని కేసును ముసేస్తారు. కానీ ఢిల్లీ పోలీసులు అలా అనుకోలేదు. అత్యాచారానికి గురైన బాధితురాలు ఇచ్చిన చిన్న క్లూతో నేరస్తులను పట్టుకున్నారు. ఈ ఘటన దేశ రాజధానిలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళితే, నిరాశ్రయురాలైన ఓ అమ్మాయి(15) ఢిల్లీ మెట్రో మయూర్ విహార్ ఫేజ్-1 స్టేషన్ ప్రాతంలో ఉంటోంది. ఈ క్రమంలో అదే ప్రాంతానికి చెందిన ఐదుగురు మైనర్లు డిసెంబరు 29న ఆమెపై ఆత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలికి జనవరి 3న సృహ వచ్చింది. దుండగుల గురించి ఆమె ఏమీ చెప్పలేకపోయింది. కేవలం ఆ ఐదుగురిలో మింటూ అనే పేరు మాత్రమే ఆమెకు గుర్తుంది. పోలీసులు వెంటనే ఐదు బృందాలను ఏర్పాటు చేశారు. నేరస్తులను పట్టుకునే మార్గాలేమీ లేకపోవడంతో కేవలం పేరు ఆధారంగా పరిసర ప్రాంతాల్లో ఇంటింటికి గాలింపు చేపట్టారు. చివరికి రెండు డజన్ల మింటూలు దొరికారు. కానీ ఇంతలోనే పోలీసులకు మరో షాక్ తగిలింది. పట్టుకున్న 24 మందిలో మింటూ లేడని ఫొటోలను పరిశీలించిన బాధితురాలు పోలీసులకు తేల్చిచెప్పింది. ఇంకొకరైతే కేసును ఇక్కడ వదిలేసేవారే. కానీ ఢిల్లీ పోలీసులు వదల్లేదు. చివరికి గాలింపు జరుపుతున్న ఏరియాలోనే ఆరుగురితో కూడిన చైన్‌స్నాచర్ల బృందం వాళ్ల కంటపడింది. తమదైన శైలిలో వారిని విచారించగా.. తానే మింటూనంటూ ఓ మైన్‌ర్ ఒప్పుకున్నాడు. పోలీసులు అతణ్ణి అరెస్టు చేసి పోస్కో చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందుతుల్లో ముగ్గురు ఇంకా పరారీలో ఉన్నారు. -
సీబీఐ చేతికి రేప్ కేసు విచారణ
ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్ జిల్లాలో అత్యంత దారుణంగా జరిగిన గ్యాంగ్‌రేప్ కేసు విచారణ బాధ్యతలను సీబీఐ తీసుకుంది. కారులో వెళ్తున్న తల్లీకూతుళ్లను బయటకు లాగి వారిని దోచుకుని ఆపై సామూహిక అత్యాచారం చేసిన ఘటన యావద్దేశాన్ని కుదిపేసింది. అలహాబాద్ హైకోర్టు ఆదేశాల మేరకు ఆ కేసు విచారణను సీబీఐ తీసుకుంది. ఈ విషయాన్ని సీబీఐ అధికార ప్రతినిధి దేవ్ప్రీత్ సింగ్ నిర్ధారించారు. దీనిపై ఐపీసీ సెక్షన్లు 395, 397, 376డి, 342లతో పాటు పోస్కో చట్టం కింద కూడా సీబీఐ కేసు నమోదు చేసింది. 91వ నెంబరు జాతీయ రహదారిపై బులంద్ షహర్ జిల్లాలో జూలై 29న ఈ దారుణం జరిగింది. నోయిడాకు చెందిన ఆరుగురు సభ్యుల కుటుంబం కారులో వెళ్తుండగా.. కొంతమంది దుండగులు వారిని ఆపి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ఆ కుటుంబానికి చెందిన ఓ వ్యక్తి మరణించడంతో వారిని పలకరించేందుకు షాజహాన్‌పూర్ వెళ్తున్నారు. తాము ఫిర్యాదుచేసినా పోలీసులు సరిగా పట్టించుకోలేదని బాధితులు ఆరోపించారు. చివరకు కేసు దర్యాప్తు కూడా సక్రమంగా సాగకపోవడంతో.. చివరకు హైకోర్టు సూచనల మేరకు సీబీఐ రంగప్రవేశం చేసింది. -
గ్యాంగ్ రేప్ కేసులో ప్రధాననిందితుడు అరెస్ట్..
లక్నోః దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బులంద్ షహర్ గ్యాంగ్ రేప్ కేసులో మరో ముగ్గురు నిందితుల్ని పోలీసులు సోమవారం రాత్రి అరెస్టు చేశారు. అరెస్టు చేసిన ముగ్గురిలో ప్రధాన నిందితుడు సలీం బవారియా కూడా ఉన్నట్లు ఉత్తరప్రదేశ్ డీజీపీ జావేద్ అహ్మద్ తెలిపారు. గతవారం ఎన్ హెచ్ 91 సమీపంలో జరిగిన భయంకరమైన గ్యాంగ్ రేప్ ఘటన అనంతరం తప్పించుకున్న బవారియా సహా ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. జూలై 29న ఉత్తరప్రదేశ్ నోయిడా నుంచి షాజహాన్‌పూర్ కు కారులో వెడుతున్న కుటుంబాన్ని అడ్డగించి, వాహనంనుంచీ తల్లీకూతుళ్ళను బలవంతంగా బయటకు లాగి, మైనర్ బాలిక సహా తల్లిపై నిందితులు అత్యాచారానికి పాల్పడ్డ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళన రేపింది. ఈ ఘటనతో ఉత్తరప్రదేశ్ లో లా అండ్ ఆర్డర్ పరిస్థితిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. అనంతరం ఘటనను ఖండించిన ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ బాధితులకు ఒక్కోరికీ మూడు లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం ప్రకటించారు. అయితే ఈ కేసును సుమోటోగా స్వీకరించిన అలహాబాద్ హైకోర్టు.. ప్రభుత్వం కేసును సీబీఐ కి ఎందుకు అప్పగించడంలేదంటూ ప్రశ్నించింది. ఛీఫ్ జస్టిస్ డిబి భోసలే, జస్టిస్ యశ్వంత్ వర్మలతో కూడిన డివిజన్ బెంచ్.. నేరస్థుల గత చరిత్ర, సామాజిక నేపథ్యం, రాజకీయ అనుబంధాలకు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు ప్రయత్నించింది. ఇంతటి ఘోరం జరిగినా ప్రభుత్వం ఇంకా పాఠాలు నేర్చుకోవడం లేదని, గ్యాంగ్ రేప్ అనంతరం కూడా ఉత్తరప్రదేశ్ లో హెల్ప్ లైన్ పనిచేయకపోవడం విచారకరమని కోర్టు విమర్శించింది. మరోవైపు హైకోర్టు లక్నో బెంచ్ కూడా పిల్ ను సీబీఐ దర్యాప్తు కోసం అప్పగించేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వారంలోగా తగిన సమాధానం ఇవ్వాలని కోరింది. 'వుయ్ ది పీపుల్ ' ఎన్జీవో సంస్థ జనరల్ సెక్రెటరీ ప్రిన్స్ లెనిన్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారించిన డివిజన్ బెంచ్ న్యాయమూర్తులు అమరేశ్వర్ ప్రతాప్ సాహి, విజయలక్ష్మి ఈ ఆదేశాలను జారీ చేశారు. అనంతరం కేసు తదుపరి విచారణను ఆగస్టు 22వ తేదీకి వాయిదా వేశారు. -
అత్యాచార కేసు నిందితుడు రాకేశ్ మేజరే?
ఓటు వేసినట్లు ఆధారాలు సేకరించిన పోలీసులు శంకరపట్నం: కరీంనగర్ జిల్లా వీణవంక మండలం చల్లూరు యువతిపై సామూహిక అత్యాచార కేసులో నిందితుడు ముద్దం రాకేశ్ మేజర్ అనే కీలక ఆధారాలు పోలీసులు సేకరించినట్లు సమాచారం. వీణవంక పోలీసులు ఏర్పాటు చేసిన పోలీస్ కానిస్టేబుల్ ఉచిత శిక్షణకు శంకరపట్నం మండలం ఆముదాలపల్లెకు చెందిన గొట్టె శ్రీనివాస్, కల్వల గ్రామానికి చెందిన ముద్దం అంజి, ముద్దం రాకేశ్ వెళ్తున్నారు. ఫిబ్రవరి 10న సామూహిక అత్యాచారానికి పాల్పడ్డ సంఘటనలో పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందించలేదన్న ఆరోపణతో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ సంఘటనలో అంజి ఉరఫ్ అంజన్న, రాకేశ్ మైనర్లని పోలీసు అధికారులు జువైనల్ హోంకు తరలించారు. బాధిత యువతి జాతీయ ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదు చేయడంతో శని వారం పోలీసులు రాకేశ్ వయసు నిర్ధారణపై ఓటరు జాబితా పరిశీలించారు. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు వేసినట్లు ప్రచారం కావడంతో కేశవపట్నం పోలీసులు కీలక ఆధారాలు సేకరించినట్లు సమాచారం. ఇప్పటికే ఫోరెన్సిక్ వైద్య పరీక్షల్లో ముద్దం అంజి మేజర్ అని నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాకేశ్‌కు 23 ఏళ్లు ఉన్నాయనే కీలక ఆధారాలు సేకరించిన పోలీసులు వివరాలను ఉన్నతాధికారులకు అందించినట్లు తెలిసింది. -
దౌలాకువా గ్యాంగ్‌రేప్ కేసు దోషులకు 20న శిక్ష ఖరారు
సాక్షి, న్యూఢిల్లీ: దౌలాకువా గ్యాంగ్‌రేప్ కేసులో దోషులుగా గుర్తించిన ఐదుగురికి విధించే శిక్షను ద్వారకా న్యాయస్థానం సోమవారం ప్రకటించనుంది. దోషులకు విధించే శిక్షపై వాదోపవాదనలు శుక్రవారం పూర్తయ్యాయి. అత్యాచారానికి పాల్పడిన షంషద్ అలియాస్ ఖట్కూన్, ఉస్మాన్ అలియాస్ కాలే, సాహిద్ అలియాస్ చోటాబిల్లీ, ఇక్బాల్ అలియాస్ బడా బిల్లీ, కమ్రుద్దీన్‌లను న్యాయస్థానం దోషులుగా ప్రకటించిన సంగతి విదితమే. వారికి ఖరారుచేసే శిక్షలపై శుక్రవారం న్యాయస్థానంలో వాదోపవాదాలు జరిగాయి. అసలేం జరిగిందంటే... 2010 నవంబర్ 24 నాటి రాత్రి కాల్ సెంటర్‌కు చెందిన ఇద్దరు ఉద్యోగినులు తాము నివసించే కాలనీ గేటు వద్ద వాహనం దిగి ఇంటికి వెళుతున్నారు. అదే సమయంలో ఓ వాహనంలో అక్కడికి వచ్చిన ఐదుగురు బాధితురాలిని అపహరించి మంగోల్‌పురి ప్రాంతానికి తీసుకెళ్లి అదే వాహనంలో సామూహిక అత్యాచారం చేశారు. ఆ తరువాత వారు ఆమెను మంగోల్‌పురిలోని రోడ్డుపై వదిలేసి పారిపోయారు. మరోవైపు సహోద్యోగిని కొందరు అపహరించుకునిపోయారని బాధితురాలి స్నేహితురాలు పోలీస్ కంట్రోల్‌రూంకు ఫోన్‌చేసింది. దీంతో అప్రమత్తమై రంగంలోకి దిగిన పోలీసులు బాధితురాలి జాడను కనుగొని ఆస్పత్రికి తరలించారు. సరిగ్గా ఏడురోజుల తర్వాత నిందితులందరినీ హర్యానాలోని మేవాత్ ప్రాంతంలో అరెస్టు చేశారు. తాము అమాయకులమని, అన్యాయంగా తమను ఈ కేసులో ఇరికించారని నిందితులు కోర్టులో వాదించారు. కాగా పోలీసులు నిర్వహించిన ఐడెంటిఫికేషన్ పరేడ్‌లో బాధితురాలు.. షంషద్, ఉస్మాన్‌లను గుర్తించింది. కమరుద్దీన్, షహీద్, ఇక్బాల్‌లు మాత్రం ఈ పరేడ్‌లో పాల్గొనడానికి నిరాకరించారు. నిందితులు నేరాన్ని అంగీకరించారని పోలీసులు తమ అభియోగపత్రంలో పేర్కొన్న సంగతి విదితమే. -
'అభయ' దోషులకు 20 ఏళ్ల జైలు
-
'అభయ' దోషులకు 20 ఏళ్ల జైలు
హైదరాబాద్: సాఫ్ట్వేర్ ఇంజినీర్ అభయ (22) కిడ్నాప్, గ్యాంగ్‌రేప్ కేసులో ఎల్బీనగర్ కోర్టు బుధవారం సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో దోషులుగా తేలిన నెమ్మడి వెంకటేశ్వర్లు, వెడిచెర్ల సతీష్‌లకు 20 ఏళ్ల చొప్పున జైలు శిక్ష విధించింది. చెరో వెయ్యి రూపాయల జరిమానా విధించింది. కేవలం 209 రోజుల్లో అభయ కేసు దర్యాప్తు, విచారణ పూర్తై తీర్పు రావడం విశేషం. బాధితురాలి పక్షాన పబ్లిక్ ప్రాసిక్యూటర్ నాగరాజు, నిందితుల తరపున ఇద్దరు న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. అరెస్టైనప్పటి నుంచి నేటి వరకు కూడా నిందితులు చర్లపల్లి జైలులోనే ఉన్నారు. ఆరోజు ఏమైంది... బెంగళూరుకు చెందిన అభయ (22- పేరు మార్చడం జరిగింది) గౌలిదొడ్డిలోని మహిళా హాస్టల్లో ఉంటూ హైటెక్‌సిటీలోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఇంజినీర్‌గా పని చేస్తోంది. అక్టోబర్ 18న సాయంత్రం 5.30కి విధులు ముగించుకున్న ఆమె ఇనార్బిట్ షాపింగ్‌మాల్‌కు వెళ్లింది. రాత్రి 7.30కి షాపింగ్ మాల్ నుంచి బయటికి వచ్చి హాస్టల్‌కు వెళ్లేందుకు బస్సు కోసం ఎదురు చూస్తుండగా... ఆమె ఎదుట కారు (ఏపీ09టీవీఏ2762) ఆగింది. డ్రైవర్ సీట్లో వరంగల్ జిల్లాకు చెందిన వెడిచెర్ల సతీష్ (30), పక్క సీట్లో నల్లగొండ జిల్లా పెన్‌పహాడ్‌కు చెందిన అతని స్నేహితుడు నెమ్మడి వెంకటేశ్వర్లు (28) ఉన్నారు. హాస్టల్ వద్ద డ్రాప్ చేస్తామని అభయను నమ్మించి కిడ్నాప్ చేశారు. లింగంపల్లి వైపు కారును పోనిచ్చారు. బిర్లా ఓపెన్ మైండ్ స్కూల్ దాటాక టేకు చెట్ల పొదల్లోకి కారును తీసుకెళ్లి గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు. బాధితురాలు కేసు పెట్టేందుకు మొదట సుముఖత వ్యక్తం చేయలేదు. దీంతో అదనపు డీసీపీ జానకీ షర్మిల కౌన్సెలింగ్ చేయడంతో బాధితురాలు ధైర్యంగా కేసు పెట్టేందుకు ముందుకు వచ్చింది. -
అభయ కేసులో రేపే తీర్పు
సాక్షి, సిటీబ్యూరో: సాఫ్ట్వేర్ ఇంజినీర్ అభయ (22) కిడ్నాప్, గ్యాంగ్‌రేప్ కేసులో ఎల్బీనగర్ కోర్టు రేపు తీర్పు వెలువరించనుంది. కేవలం 209 రోజుల్లో దర్యాప్తు, విచారణ పూర్తైతీర్పు రానుండటంతో బాధితులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. నిందితులకు శిక్షలు పడేలా అత్యంత కీలకంగా భావించే 21 మంది సాక్షులను మాదాపూర్ పోలీసులు ఈ కేసులో చేర్చారు. అలాగే ఘటన జరిగిన సమయంలో ఇన్నార్బిట్మాల్, బిర్లా మైండ్‌స్పేస్ స్కూల్లోని సీసీ కెమెరా ఫుటేజ్‌లు, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నివేదికలు బాధితురాలికి బాసటగా నిలిచాయి. ఈ కేసులో రాష్ట్రంలోనే తొలిసారిగా అమెరికాలో ఉన్న సాక్షిని జడ్జి నాగార్జున వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించడం గమనార్హం. బాధితురాలి పక్షాన పబ్లిక్ ప్రాసిక్యూటర్ నాగరాజు, నిందితుల తరపున ఇద్దరు న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. బాధితురాలికి అనుకూలంగానే సాక్ష్యాలు ఉన్నాయాని, నిందితులకు జీవిత ఖైదు పడే అవకాశాలున్నాయని పోలీసు అధికారులు భావిస్తున్నారు. అరెస్టైనప్పటి నుంచి నేటి వరకు కూడా నిందితులు చర్లపల్లి జైలులోనే ఉన్నారు. ఇదిలా ఉండగా, ఈ కేసు తీర్పును స్వయంగా వినేందుకు సైబ రాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ బుధవారం ఎల్బీనగర్ కోర్టుకు హాజరుకానున్నారు. ఆరోజు ఏమైంది... బెంగళూరుకు చెందిన అభయ (22- పేరు మార్చడం జరిగింది) గౌలిదొడ్డిలోని మహిళా హాస్టల్లో ఉంటూ హైటెక్‌సిటీలోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఇంజినీర్‌గా పని చేస్తోంది. అక్టోబర్ 18న సాయంత్రం 5.30కి విధులు ముగించుకున్న ఆమె ఇనార్బిట్ షాపింగ్‌మాల్‌కు వెళ్లింది. రాత్రి 7.30కి షాపింగ్ మాల్ నుంచి బయటికి వచ్చి హాస్టల్‌కు వెళ్లేందుకు బస్సు కోసం ఎదురు చూస్తుండగా... ఆమె ఎదుట కారు (ఏపీ09టీవీఏ2762) ఆగింది. డ్రైవర్ సీట్లో వరంగల్ జిల్లాకు చెందిన వెడిచెర్ల సతీష్ (30), పక్క సీట్లో నల్లగొండ జిల్లా పెన్‌పహాడ్‌కు చెందిన అతని స్నేహితుడు నెమ్మడి వెంకటేశ్వర్లు (28) ఉన్నారు. హాస్టల్ వద్ద డ్రాప్ చేస్తామని అభయను నమ్మించి కిడ్నాప్ చేశారు. లింగంపల్లి వైపు కారును పోనిచ్చారు. బిర్లా ఓపెన్ మైండ్ స్కూల్ దాటాక టేక్చెట్ల పొదల్లోకి కారును తీసుకెళ్లి గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు. బాధితురాలు కేసు పెట్టేందుకు మొదట సుముఖత వ్యక్తం చేయలేదు. దీంతో అదనపు డీసీపీ జానకీ షర్మిల కౌన్సెలింగ్ చేయడంతో బాధితురాలు ధైర్యంగా కేసు పెట్టేందుకు ముందుకు వచ్చింది. పునరావృతం కాకుండా... ఈ ఘటనతో సైబరాబాద్ పోలీసులు ఉలిక్కిపడ్డారు. ఇలాంటిది ఘటన పునరావృతం కాకుండా ఉండేందుకు మహిళా సాఫ్ట్వేర్ ఉద్యోగులకు ఐదంచెల భద్రతా వ్యవస్థను రూ.6 కోట్ల వ్యయంతో రూపొందించారు. మహిళల కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేశారు. ఐటీ కారిడార్ పోలిసింగ్ వ్యవస్థను రూపొందించారు. ఫలితంగా నేటి వరకు అభయ ఘటన వంటిది జరగలేదు. కాగా, ఈ కేసును ఛాలెంజ్‌గా తీసుకున్న సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ దర్యాప్తును పక్కా ప్రణాళికతో త్వరగా పూర్తి చేయించారు. -
గ్యాంగ్‌రేప్ కేసులో 30 ఏళ్ల జైలుశిక్ష
న్యూఢిల్లీ: ఓ మహిళను అక్రమంగా తొమ్మిది నెలల పాటు నిర్బంధించడంతో పాటు ఆమెపై తన ఇద్దరు సహచరులతో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడిన వ్యక్తికి నగర కోర్టు 30 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన శివను గ్యాంగ్‌రేప్, రేప్, అక్రమ నిర్బంధం, బెదిరింపులకు పాల్పడటం వంటి నేరాల కింద దోషిగా ఖరారు చేస్తున్నట్లు కోర్టు ప్రకటించింది. అత్యాచారం, అక్రమ నిర్బంధం, బెదిరింపుల నేరాలకుగాను తొలుత పదేళ్ల జైలు శిక్ష అనుభవించాలని, సామూహిక అత్యాచారానికి పాల్పడినందుకు గాను 20 ఏళ్ల కారాగారశిక్ష ప్రారంభమవుతుందని కోర్టు పేర్కొంది. నిందితుడు శివ తరచుగా బాధితురాలిని కొట్టేవాడని, చంపుతానని బెదిరించేవాడని ప్రాసిక్యూషన్ పేర్కొంది. కాగా ఆమెపై నేరం జరిగిందనడానికి సాక్ష్యాధారాలు లభించలేదని అదనపు సెష న్స్ జడ్జీ వీరేందర్ భట్ పేర్కొన్నారు. అలాగే తనను కిడ్నాప్ చేశారన్న బాధితురాలి వాదనను కూడా కోర్టు కొట్టివేసింది. 30 ఏళ్ల మహిళను అందరూ చూస్తుండగా ఓ రైలు నుంచి అపహరించడం సాధ్యం కాదన్నారు. శివకు కోర్టు రూ.50వేల జరిమానా కూడా విధించింది. బాధితురాలిని శివ గత ఏడాది మార్చి 22 నుంచి నిర్బంధించినట్లు ప్రాసిక్యూషన్ నిరూపించింది. -
బెంగాల్లో మరో దారుణం!
సంపాదకీయం: నిర్భయ చట్టంలాంటి కఠినమైన చట్టం తెచ్చాం గనుక ఇక మన బాధ్యత తీరిందని పాలకులు భావిస్తున్న దాఖలాలు కనిపిస్తుండగా మహిళలపై అత్యాచారాలు మాత్రం యథాతథంగా సాగిపోతున్నాయి. నిర్భయ ఉదంతం జరిగినప్పుడు ఉద్యమాలు వెల్లువెత్తిన దేశ రాజధానిలోనే అవి ఆగలేదు. ఇక ఇతరచోట్ల అంతకన్నా మెరుగైన పరిస్థితి ఉంటుందని భావించడం అత్యాశే అవుతుంది. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని బీర్భూమ్ జిల్లా సుబల్పూర్లో ఆదివాసీ యువతిపై అక్కడి తెగ పంచాయతీ ఆదేశం మేరకు జరిగిందని చెబుతున్న సామూహిక అత్యాచారం ఈ పరంపరలో అత్యంత భయానకమైనది. ఒంటరిగా ఉన్న యువతిపైనో, నిస్సహాయ స్థితిలో ఉన్న మరొకరిపైనో జరిగే నేరాలను అదుపు చేయడం ఒక ఎత్తయితే... ఇలా కుల పంచాయతీలు, తెగ పంచాయతీలు కొనసాగి స్తున్న దుశ్శాసనపర్వాలు మరో ఎత్తు. హర్యానాలోనూ, యూపీలోనూ ఖాప్ పంచాయతీల వంటివి మహిళలపైనా, బాలికలపైనా తరచు చేసే తీర్మానాలు, తీసుకునే చర్యలు మధ్యయుగాల జాడలను తలపిస్తుంటే... ఇప్పుడు పశ్చిమబెంగాల్ ఘటన వాటికేమాత్రం తీసిపోకుండా ఉన్నది. బెంగాల్ ఘటన అనేకవిధాల ఆందోళనకరమైనది. ఎందుకంటే, ఎంతో నాగరికమని మనమంతా అనుకునే వెలుపలి సమాజంతో పోలిస్తే ఆదివాసీల్లో ప్రజాస్వామిక వాతావరణం హెచ్చు. స్త్రీ, పురుష వివక్ష కూడా తక్కువ. పైగా, ఈ ఘటన చోటుచేసుకున్న బీర్భూమ్ ఆదినుంచీ వామపక్ష ఉద్యమాల ప్రభావానికి లోనైన ప్రాంతం. ఇలాంటిచోట ఇంతటి దుర్మార్గం చోటుచేసుకోవడమంటే బయటి సమాజంలోని తెగుళ్లు దానికి కూడా సోకుతున్నాయని అర్ధం. బాధితురాలిపైనే నిందలు వేసే సంస్కృతి కూడా పెరిగింది. స్థానిక మహిళలు కొందరిని ప్రశ్నించిన ప్పుడు ఆ యువతి ప్రవర్తన సరైనది కాదని వారు చెప్పారట! అంటే ఆదివాసీ ప్రాంతాల్లో కూడా ‘నాగరికత’ బాగానే వేళ్లూనుకుంటున్నదన్న మాట! ఇంతకూ ఆ యువతి చేసిన నేరమేమిటి? 20 ఏళ్ల వయసులోనే ఆమె ఢిల్లీ వెళ్లి కూలి పనిచేసి డబ్బులు సంపాదించింది. స్థానికంగా రోజుకు రూ. 180 వస్తుండగా ఆమె రోజుకు రూ. 450 సంపాదించింది. ఇంటికి డబ్బులు పంపి ఉన్నంతలో పక్కా ఇల్లు కట్టుకుంది. చిన్న టీవీ, మ్యూజిక్ సిస్టం కొనుక్కుంది. వీటన్నిటివల్లా వచ్చిన స్వతంత్ర వ్యక్తిత్వం కూడా ఆమెకు ఉన్నది. ఈ కారణాలన్నీ తెగలోని కొందరిలో అసూయకు, ఆగ్రహానికి దారితీశాయని అంటు న్నారు. ఫలితంగా ఆమెకు మరొకరితో సంబంధం అంటగట్టి, అందుకు శిక్షగా జరిమానా విధించి, చివరకు ఈ దారుణానికి ప్రేరేపించారని స్థానికులు చెబుతున్నారు. 13మంది యువకులు సాగించిన ఈ దౌష్ట్యంలో ఆమె తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నది. ఆదివాసీ సమాజంలో ఈ తెగల పంచాయతీలు ఇప్పటివి కాదు. బ్రిటిష్ పాలనకు ముందునుంచీ అవి సమాంతరంగా కొనసాగుతున్నాయి. ఈ పంచాయతీల ప్రాబల్యం ఆదివాసీల్లో బలంగానే ఉన్నా అవి జరిమానాలు విధించడం, సాంఘిక బిహ ష్కరణవంటి తీర్పులివ్వడం తప్ప ఇలాంటి దారుణానికి ఎప్పుడూ పాల్పడలేదని అంటారు. పరస్పరం దాడులు చేసుకునే, బురదజల్లుకునే రాజకీయాలు ఆదివాసీ సమాజంలోకి ప్రవేశించాక ఆ రాజకీయాలను ఆశ్రయించుకుని ఉండే నేరాలు కూడా అక్కడికి వ్యాప్తి చెందుతున్నాయి. సుబల్పూర్ ఉదంతంలో తెగ పంచాయతీ సభ్యుల్లో కొందరు తృణమూల్ కాంగ్రెస్ సభ్యులు కూడా ఉన్నారని కాంగ్రెస్, సీసీఎం ఆరోపిస్తున్నాయి. ఆమధ్య జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అది ఏకగ్రీవంగా తృణమూల్‌కే దక్కిందన్నది వాస్తవం. స్థానికంగా తెగ పంచాయతీ ఇలా చేస్తుంటే గ్రామ పంచాయతీ అధ్యక్షుడైనా, ఇతర సభ్యులైనా ఎలాంటి చర్యలు తీసుకున్నారన్న ప్రశ్న తలెత్తుతోంది. పల్లెసీమల్లో స్వపరిపాలన వేళ్లూనుకుని అక్కడ ప్రజాస్వామిక భావనలు పెరిగితే అది దేశ సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడుతుందని అనుకుంటారు. కానీ, గ్రామాల్లో అందుకు విరుద్ధమైన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఆ సంస్థలు సమస్యలను పరిష్కరించడం అటుంచి, ఆ వైపరీత్యాలను మౌనంగా చూస్తూ ఊరుకోవడమో, అందులో భాగంకావడమో జరుగుతున్నది. కాంగ్రెస్, సీపీఎంలు ఆరోపిస్తున్నట్టు ఘటన వెనక తృణమూల్ సభ్యులు ఉన్నారో, లేదో ఇంకా తేలవలసి ఉన్నా ఆ రాష్ట్రంలో ఇటీవలికాలంలో మహిళలపై అత్యాచార ఘటనలు పెరిగాయన్నది మాత్రం వాస్తవం. గత రెండేళ్లలో రాష్ట్రం మహిళలపై నేరాల విషయంలో అగ్రస్థానంలో ఉన్నదని జాతీయ క్రైం రికార్డ్స్ బ్యూరో వెల్లడిస్తున్నది. అత్యాచారం ఘటన చోటుచేసుకున్నప్పుడు పోలీసులు వ్యవహరిస్తున్న తీరు కూడా సరిగాలేదు. బాధితురాలినే దోషిగా చూపే ప్రయత్నాలు ఒకటికి రెండు సందర్బాల్లో చోటుచేసుకున్నాయి. రెండేళ్లక్రితం కోల్‌కతా నగరంలో సామూహిక అత్యాచారం జరిగినప్పుడు ఇదంతా అబద్ధమని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కొట్టిపారేశాక మిగిలినవాటికి కూడా అదే గతి పట్టించడానికి అక్కడి పోలీసులు వెనకాడలేదు. ప్రస్తుత ఘటనలో నిందితులందరినీ అరెస్టుచేసినా, అత్యాచారం కేసుల్లో అనుసరించాల్సిన విధానాలకు తిలోదకాలిచ్చారు. కఠిన చట్టాలు అందుబాటులోకొచ్చినా వాటిని సక్రమంగా వినియోగించడంలో విఫలమైతే నిందితుల్లో భరోసా పెరుగుతుంది. దానివల్ల మరిన్ని నేరాలు చోటుచేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఈ తరహా అనాగరిక ప్రవృత్తిని అరికట్టడానికి అవసరమైన చైతన్యాన్ని తీసుకురావాల్సిన ప్రభుత్వాలు ఆ పని చేయడంలేదు సరికదా...తమ నిర్లిప్త ధోరణితోనో, తప్పుడు వైఖరితోనో అలాంటి నేరాలకు పరోక్షంగా కారణమవుతున్నాయి. దీన్ని సరిచేసుకోవలసిన అవసరం ఉన్నదని బీర్భూమ్ ఘటన తెలియజెబుతోంది. -
రేప్ చేసి.. కళ్లు పీకి.. టెంపోలోంచి విసిరేసి..
అసోంలో నలుగురు కీచకుల దుర్మార్గం ఆసుపత్రిలో చేర్చిన పోలీసులు.. మహిళ మృతి ఆగ్రహించిన స్థానికులు.. జాతీయ రహదారి దిగ్బంధం లఖ్మీపూర్: ఓ మహిళపై నలుగురు కీచకులు వాహనంలో సామూహిక అత్యాచారం చేశారు.. ఆపై ఆమె కళ్లు పీకేశారు.. తర్వాత వాహనంలోనుంచి బయటకు విసిరేశారు.. ఢిల్లీలో ‘నిర్భయ’ ఘటనకంటే దారుణంగా ఉన్న ఈ దుర్ఘటన అసోంలోని లఖ్మీపూర్ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. బోగీనది ప్రాంతానికి చెందిన ఓ మహిళ తన ఏడేళ్ల బాబును స్కూలు నుంచి తీసుకురావడానికి.. షేరింగ్ టెంపో వాహనం ఎక్కింది. అందులోని నలుగురు వ్యక్తులు ఆమెపై ఒకరి తర్వాత ఒకరుగా అత్యాచారం చేశారు. తర్వాత ఆమె కళ్లు పీకేశారు. ఆపై తలపైన, మెడపైన తీవ్రం గా గాయపరిచారు. ఓ ప్రాంతంలో ఆమెను కిందికి విసిరేశారు. బోగీనది పోలీస్ స్టేషన్‌కు 50 మీటర్ల దూరంలోనే ఈ సంఘటన జరిగిందని, ఎవరో టెంపో వాహనంలో నుంచి ఆమెను విసిరేయడం తాము చూశామని స్థానికులు చెబుతున్నారు. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. వెంటనే ఆమెను గౌహతి మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. ఆదివారం ఆసుపత్రిలో ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఈ దుర్ఘటన అటు స్థానికుల్లోను, ఇటు మహిళా సంఘాల్లోనూ ఆగ్రహం తెప్పించింది. నిందితులను వెంటనే పట్టుకొని అరెస్టు చేసి మహిళకు న్యాయం చేయాలంటూ సోమవారం వారంతా 52వ నంబరు జాతీయ రహదారిని దిగ్బంధించారు. పోలీసుల హామీతో రెండు గంటల తర్వాత విరమించారు. -
ఫొటో జర్నలిస్ట్ గ్యాంగ్‌రేప్ కేసులోవారంలో అభియోగపత్రం
ముంబై: నిర్భయ ఘటన తర్వాత మహిళల భద్రతను మరోసారి ప్రశ్నార్థకం చేసిన ఫొటో జర్నలిస్టుపై సామూహిక అత్యాచారం కేసు దర్యాప్తును ముంబై పోలీసులు వేగవంతం చేశారు. ఈ కేసులో నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐదుగురిపై రెండుమూడు రోజుల్లో అభియోగపత్రం దాఖలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ విషయమై క్రైం బ్రాంచి అధికారి ఒకరు మాట్లాడుతూ... అభియోగపత్రాన్ని ఇప్పటికే సిద్ధం చేశాం. ప్రస్తుతం తుదిమెరుగులు దిద్దే పనులు జరుగుతున్నాయి. ఒకట్రెండు రోజుల్లో కోర్టుకు సమర్పిస్తాం. బహుశా మంగళవారం కోర్టుకు అందజేసే అవకాశముంది. కేసు దర్యాప్తు చివరిదశలో లభించిన మరికొన్ని ఆధారాలతో అనుబంధ అభియోగపత్రాన్ని దాఖలు చేస్తాం. చార్జిషీట్లో ఎటువంటి లోపాలు లేకుండా రాష్ట్ర న్యాయవిభాగం కూడా అవసరమైన సహాయాన్ని అందజేస్తుంద’న్నారు. -
కీచక మైనర్‌కు మూడేళ్ల జైలు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘నిర్భయ’ దారుణ సామూహిక అత్యాచారం కేసు నిందితుల్లో ఒకరికి శిక్ష పడింది. గత డిసెంబర్లో ఢిల్లీలో జరిగిన ఈ ఘటనలో మైనర్ యువకుడి(బస్సు క్లీనర్)పై మోపిన అత్యాచారం, హత్య అభియోగాలను ధ్రువీకరించిన జువెనైల్ జస్టిస్ బోర్డు (జేజేబీ) శిక్ష ఖరారు చేసింది. బాల నేరస్తుల చట్టం కింద విధించే మూడేళ్ల గరిష్ట శిక్షకే పరిమితమై శనివారం తీర్పు వెలువరించింది. విచారణలో భాగంగా ఇప్పటికే 8 నెలల పాటు కస్టడీలో ఉన్నందున ఈ కాలాన్ని శిక్షాకాలం నుంచి మినహాయించనున్నారు. నేరానికి పాల్పడిన సమయంలో ఈ నిందితుడు 18 ఏళ్ల మెజారిటీ వయసుకు కేవలం ఆరు నెలలు మాత్రమే తక్కువగా ఉన్నా డు. ఈ కారణంగానే బాల నేరస్తులను విచారించే జేజేబీ ఇతని కేసు విచారించింది. బోర్డు తీర్పుతో తీవ్ర ఆవేదనకు గురైన నిర్భయ సోదరుడు బాల నేరస్తుడిపై దాడికి ప్రయత్నించినట్లు సమాచారం. తీర్పుకు వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తాయి. గత డిసెంబర్ 16 నాటి రాత్రి ఢిల్లీలో కదులుతున్న బస్సులో ఆరుగురు వ్యక్తులు అతి దారుణంగా నిర్భయపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె స్నేహితుడిపైనా (ఈ యావత్ ఉదంతానికి ఇతనొక్కడే ప్రత్యక్ష సాక్షి) దాడి చేశారు. తీవ్రగాయాలతో సింగపూర్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ డిసెంబర్ 29న నిర్భయ మరణించింది. ఈ కేసులో నలుగురు నిందితులు ముఖేశ్, పవన్ గుప్తా, వినయ్‌శర్మ, అక్షయ్ ఠాకూర్లను సాకేత్‌లోని ఫాస్ట్ ట్రాక్ కోర్టు విచారిస్తోంది. మరో నిందితుడు రాంసింగ్ (బస్సు డ్రైవర్) తీహార్ జైల్లోని తన సెల్లో గత మార్చి 11న విగతజీవుడై కన్పించాడు. మైనర్ నిందితుడి విచారణను చేపట్టిన ప్రిన్సిపల్ మేజిస్ట్రేట్ గీతాంజలి గోయల్ నేతృత్వంలోని జేజేబీ బాల నేరస్తుడిని మూడేళ్లపాటు ప్రత్యేక ప్రొబేషన్ హోమ్‌లో ఉంచాలని పేర్కొంటూ ఎట్టకేలకు శనివారం తీర్పునిచ్చింది. 60 పేజీల తీర్పులోని వివరాలను బయటకు వెల్లడించరాదంటూ.. నిందితులతో పాటు కోర్టుకు హాజరైనవారిని, పోలీసులను, డిఫెన్స్ న్యాయవాదిని, నిర్భయ కుటుంబసభ్యులను ఆదేశించిన బోర్డు తలుపులు మూసిన గదిలో తీర్పు ప్రకటించింది. మరణశిక్ష విధించాలి: నిర్భయ తండ్రి బాల నేరస్థుడు కేవలం మూడేళ్ల శిక్షతో బయటపడటంపై నిర్భయ తల్లిదండ్రులు అసంతృప్తి వ్యక్తం చేశారు. అతనికి మరణశిక్ష విధించాలని బాధితురాలి తండ్రి డిమాండ్ చేశారు. తీర్పుపై తాము అప్పీల్ చేస్తామన్నారు. ఆమె తల్లి సైతం తీర్పుపై తన అసంతృప్తిని దాచుకోలేకపోయారు. కోర్టు నుంచి బయటకు రాగానే విలపిం చడం ప్రారంభించిన ఆమె తీర్పు గురించి మాట్లాడా రు. ఇది మైనర్ అయితే దారుణ నేరానికి పాల్పడినప్పటికీ తప్పించుకోవచ్చనే తప్పుడు సంకేతాన్నిస్తుందన్నారు. కాగా, మూడేళ్ల శిక్షను తేలికపాటి సామాన్యమైన శిక్షగా బీజేపీ నేత సుష్మాస్వరాజ్ ట్విట్టర్లో అభివర్ణించారు. -
ఇంత తక్కువ శిక్షా !
న్యూఢిల్లీ: ఫిజియోథెరపీ విద్యార్థిని ‘నిర్భయ’పై డిసెంబర్ 16న సామూహిక అత్యాచారం చేసిన వారిలో ఒకడైన మైనర్ యువకుడికి కేవలం మూడేళ్ల శిక్ష విధించడంపై ఆమె కుటుంబ సభ్యులు అసంతృప్తి ప్రకటించారు. ‘బాలల న్యాయస్థానం (జేజేబీ) అతడికి యావజ్జీవ శిక్ష విధిస్తుందని అనుకున్నాం. ప్రత్యేక వసతిగృహంలో మూడేళ్లు శిక్ష అనుభవించాలంటూ వెలువడ్డ తీర్పు మాకు నిరాశ కలిగించింది. ఇంత దారుణానికి ఒడిగట్టిన వ్యక్తి మూడేళ్ల తరువాత స్వేచ్ఛాజీవిగా మారిపోతాడు. ఈ తీర్పు నేరగాళ్లను ప్రోత్సహించేలా ఉంది. ఇలాంటి చట్టాలను మార్చాలి. ఈ నిర్ణయాన్ని మేం హైకోర్టులో సవాల్ చేస్తాం’ అని మృతురాలి తండ్రి అన్నారు. నిర్భయ తల్లి కూడా దాదాపు ఇలాంటి అభిప్రాయాలనే వ్యక్తపరిచారు. అత్యాచారం సమయంలో 17.5 ఏళ్ల వయసున్న నిందితుడికి ప్రస్తుతం 18 ఏళ్లు నిండాయి. ఇతడు ప్రత్యేక వసతిగృహంలో మూడేళ్లపాటు శిక్ష అనుభవించాలంటూ జేజేబీ న్యాయమూర్తి గీతాంజలి గోయల్ శనివారం తీర్పు ప్రకటించారు. డిసెంబర్ 16 రాత్రి నిందితులు మైనర్ యువకుడితోపాటు రామ్‌సింగ్, వినయ్, అక్షయ్, పవన్‌గుప్తా, ముకేశ్ ఆమెపై సామూహికంగా అత్యాచారం చేశారు. తీవ్రగాయాలపాలైన బాధితురాలు చికిత్స పొందుతూ అదే నెల 30న సింగపూర్ ఆస్పత్రిలో మరణించింది. ఈ కేసులో కీలక నిందితుడైన రామ్‌సింగ్ మార్చి 11న తీహార్‌జైల్లో ఆత్మహత్య చేసుకోవడం తెలిసిందే. ఈ దాడిలో నిర్భయ స్నేహితుడికి తీవ్రగాయాలయ్యాయి. ఈ దారుణాన్ని నిరసిస్తూ దేశవిదేశాల్లో నిరసనలు వెల్లువెత్తాయి.