గ్యాంగ్‌ రేప్‌ కేసులో సంచలన తీర్పు | Gang Rape Punjab and Haryana High Court Sensational  Verdict | Sakshi
Sakshi News home page

గ్యాంగ్‌ రేప్‌ కేసులో సంచలన తీర్పు

Published Wed, Mar 20 2019 2:05 PM | Last Updated on Wed, Mar 20 2019 2:18 PM

Gang Rape Punjab and Haryana High Court Sensational  Verdict - Sakshi

చత్తీస్‌గఢ్‌ ‌: సామూహిక హత్యాచారం కేసులో పంజాబ్‌, హర్యానా  హైకోర్టు సంచలన తీర్పును  వెలువరించింది. ఈ కేసులో నేరస్థులుగా నిర్ధారించిన ఏడుగురికి మరణశిక్షను  ఖరారు చేయడంతోపాటు  వారికి భారీ జరిమానాను కూడా విధించింది. రూ.50లక్షల నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది. ఇందుకు నేరస్థుల ఆస్తులను విక్రయించాలంటూ ఆదేశించడం విశేషం.

ఈ మేరకు రోహతక్‌ డిప్యూటీ కమిషనర్‌కు  కోర్టు కీలక ఆదేశాలిచ్చింది. జులై 4వ తేదీనాటికి నేరస్తుల ఆస్తులను గుర్తించి, విక్రయించాలని, అలాగే దీనికి సంబంధించిన సమాచారాన్ని కోర్టుకు అందించాలని కూడా స్పష్టం చేశారు. ఇందులో బాధితురాలి సోదరికి 25 లక్షల రూపాయలు, హర్యానా ప్రభుత్వానికి  రూ.25 లక్షలు  అందుతుందని తీర్పు నిచ్చింది. 

కాగా నేపాల్‌కు చెందిన మహిళపై అతిక్రూరంగా సామూహిక హత్యాచారానికి పాల్పడ్డారు. 2015, ఫిబ్రవరిలో  రోహతక్‌లో ఈ ఉదంతం చోటు చేసుకుంది. మతి స్థిమితం లేని ఆమె , రోహతక్‌లోని సోదరి ఇంటికి వచ్చి కనిపించకుండా పోయింది. మూడు రోజుల అనంతరం దారుణ హింసకు గురైన స్థితిలో తీవ్ర గాయాలతో ఆమె మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. నిర్భయ తరహాలో గ్యాంగ్‌ రేప్‌కు పాల్పడ్డారని తేల్చారు. ముఖ్యంగా ఆమె శరీర భాగాల్లో రాళ్లు, కర్రలను కనుగొన్నారు. ఈ ఉదంతంలో ఎనిమిది మందిపై కేసు నమోదు కాగా అదే ఏడాది డిసెంబరులో రోహతక్‌ సెషన్స్‌ జడ్జి అందరికీ మరణ శిక్ష విధించారు. వీరిలో ఒకరు మైనర్‌కూడా ఉన్నారు. తాజాగా ఈ తీర్పును సమర్ధించిన న్యాయమూర్తులు  ఏబీ చౌదరి, సురేందర్‌ గుప్త  ఆధ్వర్యంలోని  పంజాబ్‌, హర్యానా  హైకోర్టు బెంచ్‌ మైనర్‌ను మరణశిక్షనుంచి మినహాయించింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement