Punjab and Haryana High Court
-
డేరా బాబా నిర్దోషి.. 2002 నాటి కేసులో సంచలన తీర్పు
చంఢీగఢ్: గుర్మీత్ రాం రహీం సింగ్(డేరా బాబా)ను భారీ ఊరట లభించింది. 2002లో జరిగిన డేరా సచ్చా సౌదా మాజీ అధికారి రంజిత్ సింగ్ హత్య కేసులో పంజాబ్, హర్యానా హైకోర్టు డేరా బాబాను మంగళవారం నిర్దోషిగా ప్రకంటించింది. ఈ హత్యకేసులో డేరా బాబాతో పాటు.. జస్బీర్ సింగ్, సబ్దిల్ సింగ్, క్రిషన్ లాల్, అవతార్ సింగ్‌లకు సీబీఐ కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. అయితే సీబీఐ ప్రత్యేక న్యాయస్ధానం విధించిన శిక్షను డేరా బాబా హైకోర్టులో సవాల్ చేశారు. ఇవాళ హైకోర్టు ఇచ్చిన తీర్పుతో రంజిత్ సింగ్ హత్య కేసులో డేరా బాబా 21 ఏళ్ల సుదీర్ఘ కాలం తర్వాత నిర్దోషిగా తేలారు.హర్యానాలోని సిర్సాలో ఉన్న డేరా సచ్చా సౌదా ఆశ్రమం మాజీ అధికారి రంజిత్ సింగ్. ఆయన జూలై 10, 2002న హత్యకు గురయ్యారు. ఈ హత్యపై కురుక్షేత్రలోని తానేసర్ పోలీసు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 2003లో ఈ హత్యకేసును విచారణ దర్యాప్తు చేయాలని చంఢీగఢ్ హైకోర్టు సీబీఐ ఆదేశించింది. ఈ కేసులు డేరా బాబాతో పాటు మరో నలుగురిపై చార్జ్‌షీట్ దాఖలు చేసి విచారణ చేపట్టింది. అనంతరం డేరా బాబాతో మరో నలుగురికి సీబీఐ ప్రత్యేక కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. -
డేరా బాబాకు ఎదురు దెబ్బ
ఇద్దరు మహిళల అత్యాచార కేసులో దోషి అయిన డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు ఎదురుదెబ్బ తగిలింది. రామ్ రహీమ్‌కు తరచుగా పెరోల్ ఇవ్వటంపై హర్యానా హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఇక నుంచి హైకోర్టు నుంచి కచ్చితమైన అనుమతి లేకుండా రామ్ రహీమ్‌కు ఎటువంటి పేరొల్ మంజూరు చేయకూడదని హర్యానా ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. జనవరి 19న ఆయన పెరోల్ మంజూరు అయింది. ఇప్పటివరకు గడిచిన పది నెలల్లో ఇది ఏడోసారి కాగా, మొత్తంగా గడిచిన నాలుగేళ్లలో తొమ్మిదోసారి ఆయన పెరోల్ పొందారు. తాజాగా ఆయన మరోసారి తనకు పెరోల్ మంజూరు చేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన పంజాబ్, హర్యానా హైకోర్టు.. హర్యానా ప్రభుత్వం తీవ్ర అసహం వ్యక్తం చేసింది. గతంలో రమ్ రహీం వలే.. ఎంతమంది దోషులకు పెరోల్ ఇచ్చారో? ఎన్ని రోజులు ఇచ్చారో? ఎంత మందికి పెరోల్స్ ఆమోదం పొందాయో అనే పూర్తి వివరాలు తమకు సమర్పించాలని హైకోర్టు హర్యానా ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇప్పటికే రామ్ రహీం మూడు ముఖ్యమైన సందర్భాల్లో 91 రోజులు పెరోల్‌పై జైలు బయట వచ్చారు. 21 రోజులు నవంబర్‌లో, 30 రోజులో జూలైలో, 40 రోజులు గత జనవరిలో తన పుట్టిన రోజు సందర్భంగా పెరోల్ పొందారు. ఇక..తన ఆశ్రమంలోని ఇద్దరు మహిళలను అత్యాచారం చేసిన కేసులో రామ్ రహీంను 2017లో హర్యానాలోని పంచకుల ప్రత్యేక సీబీఐ కోర్టు దోషిగా తేల్చింది. అయినకు కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అయితే తనకు తరచు పెరోల్ జారీ చేయటంలో రాజకీయ కోణాలు ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా రాష్ట్రంలో నిర్వమించు పలు ఎన్నికలు. ఎందుకుంటే రామ్ రహీం అభిమానులు, భక్తులు ఎక్కువగా మాల్వా సామాజిక వర్గానికి ఉన్నారు. అయితే ఆ సామాజిక వర్గం ఓట్లు హర్యానాలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపుతాయి. ఈ సమాజిక వర్గానికి చెందిన ఓటర్లు మొత్తం 117 అసెంబ్లీ సీట్లలో 69 సీట్లలో ప్రాబల్యం కలిగిఉంటారు. ఈ నేపథ్యంలో రామ్ రహీంకు పెరోల్ వచ్చేలా చేసి.. తన అనుచరులు, భక్తులైన మాల్వా సామాజిక వర్గం ఓట్లు రాబట్టుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. 2022, ఫిబ్రవరిలో పంజాబ్ ఎన్నికల సయయంలో 21 రోజుల పెరోల్ పొందారు. అదే ఏడాది హర్యానా మున్సిపల్ ఎన్నికల వేళ జూన్‌లో కూడా 30 రోజుల పెరోల్ పొందారు. గత ఏడాది అక్టోబర్‌లో సైతం హర్యానాలోని అదమ్‌పూర్ నియోజకవర్గ ఉప ఎన్నిక జరిగినప్పుడు ఆయనకు 40 రోజులు పెరోల్ లభించింది. -
80వేల మంది పోలీసులు ఏం చేస్తున్నట్లు?
ఖలిస్తానీ-పాకిస్తాన్ ఏజెంట్ అమృత్‌పాల్ సింగ్ Amritpal Singh వ్యవహరంలో పంజాబ్-హర్యానాల హైకోర్టు.. పంజాబ్ ప్రభుత్వంపై మంగళవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. అమృత్‌పాల్‌ను అరెస్ట్ చేయడంలో విఫలం కావడంపై మండిపడ్డ కోర్టు.. చేపట్టిన ఆపరేషన్ తాలుకా నివేదికను సమర్పించాలని పంజాబ్ పోలీస్ శాఖను ఆదేశించింది. మీదగ్గర ఎనభై వేలమంది పోలీసులున్నారు. ఏం చేస్తున్నట్లు? అసలు అమృత్‌పాల్ సింగ్ ఎలా తప్పించుకున్నట్లు? అని పంజాబ్ సర్కార్‌పై ఆగ్రహం వెల్లగక్కింది. ఇది పూర్తిగా నిఘా వర్గాల ఫెయిల్యూర్ అంటూ వ్యాఖ్యానించింది కోర్టు. ఈ తరుణంలో.. అతన్ని అరెస్ట్ చేసేందుకు శనివారం నుంచి భారీ ఎత్తున్న చర్యలు మొదలుపెట్టినట్లు పోలీసులు కోర్టుకు వివరించారు. ఇప్పటిదాకా 120 మంది అమృత్‌పాల్ అనుచరుల్ని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. అంతకు ముందు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఈ పరిణామాలపై స్పందించారు. పంజాబ్ కోరుకునేది శాంతి, అభివృద్ధి మాత్రమే. రాష్ట్రంలో శాంతి భద్రతలకు భంగం కలిగించే ఎవరినీ ఊపేక్షించబోం. కఠినంగా అణచివేస్తామని ప్రకటించారు. ఖలీస్తానీ-పాకిస్తాన్ ఏజెంట్‌గా అమృత్‌పాల్ సింగ్ పంజాబ్ ప్రభుత్వం ఇదివరకే ప్రకటించింది. ‘వారిస్ పంజాబ్ దే’ సిక్కు గ్రూప్ చీఫ్‌గా.. అమృత్‌పాల్ సింగ్ పంజాబ్‌లో గత కొన్ని సంవత్సరాలుగా క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నాడు. వాస్తవానికి దానిని స్థాపించింది సందీప్ సింగ్ అలియాస్ దీప్ సింగ్ అనే పంజాబీ నటుడు కమ్ ఉద్యమకారుడు. పంజాబీల హక్కుల సాధన-పరిరక్షణ విషయంలో కేంద్రంతో కొట్లాడేందుకు ఈ గ్రూప్‌ను స్థాపించాడు. సందీప్ నుంచి వారసత్వంగా విభాగపు బాధ్యతలు తీసుకున్నాడు అమృత్‌పాల్ సింగ్. అయితే హక్కుల గ్రూప్‌ను కాస్త.. ఉగ్రవాదంపై మళ్లించినట్లు అమృత్‌పాల్ సింగ్‌పై అభియోగాలు నమోదు అయ్యాయి ఇప్పుడు. ఉదమ్యం ముసుగులో యువతను ఉగ్రవాదం వైపు మళ్లిస్తున్నట్లు నిఘా వర్గాలు కాస్త ఆలస్యంగా గుర్తించాయి. కిందటి నెలలో తన అనుచరులను ఉసిగొల్పి ఓ పోలీస్ స్టేషన్‌పై మారణాయుధాలతో దాడికి దిగి.. తన ప్రధాన అనుచరుడిని విడిపించుకున్నాడు. ఈ దాడిలో ఆరుగురు పోలీస్ సిబ్బంది గాయపడ్డారు. ఈ ఉదంతాన్ని తీవ్రంగా పరిగణనలోకి తీసుకున్న పంజాబ్‌లోని ఆప్ సర్కార్, కేంద్రంతో పాటు అసోం ప్రభుత్వ సాయంతో అమృత్‌పాల్ సింగ్‌ని, అతని ప్రధాన అనుచరుల్ని అరెస్ట్ చేసేందుకు రహస్య ప్రణాళికను అమలు చేసింది. ఈ మేరకు మార్చి 2వ తేదీన పంజాబ్ సీఎం భగవంత్ మాన్.. కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసి అమృత్‌పాల్ సింగ్ అరెస్ట్‌కు వ్యూహం అమలు చేసే విధానంపై చర్చించినట్లు తెలుస్తోంది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వర్గాలు ఏం చెబుతున్నాయంటే.. ఖలిస్తానీ-పాకిస్తాన్ ఏజెంట్ అయిన అమృత్‌పాల్ సింగ్ పక్కా ప్లాన్‌తోనే పంజాబ్‌లో వారిస్ పంజాబ్ దే గ్రూప్‌ను నడిపిస్తున్నట్లు నిర్ధారణ అయ్యింది. అనుచరుల పేరుతో బలగం తయారు చేసుకుని.. ఆత్మాహుతి దాడులకు ప్రణాళిక గీశాడు. ఈ మేరకు పాక్ నుంచి వచ్చిన అక్రమాయుధాలను.. డీ ఆడిక్షన్ కేంద్రాల్లో భద్రపరిచినట్లు కూడా తెలుస్తోంది. మరోవైపు అమృత్‌పాల్ సింగ్‌పై ఆయుధాల చట్టం కింద మరో కేసు నమోదు చేసి.. ఉగ్రకోణంలో దర్యాప్తు చేయాలనే ఆలోచనలో ఉంది కేంద్రం. ఈ కేసులో ఏ1గా అమృత్‌పాల్ సింగ్ పేరును చేర్చింది కూడా. ఇదిలా ఉంటే.. అమృత్‌పాల్ సింగ్ అనుచరుల అరెస్ట్ పేరిట.. పంజాబ్ గ్రూప్‌ల కీలకసభ్యులను.. ఉద్యమకారులను, అమాయకపు పంజాబీ యువతను అరెస్ట్ చేస్తున్నారని, రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీని తలపిస్తున్నారని, కుట్రను అంచనా వేయడంలో ఆప్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని.. రాజకీయ విమర్శలు చెలరేగుతున్నాయి. అయితే.. అలాంటిదేం జరగడం లేదని సీఎం మాన్ ఇవాళ వివరణ ఇచ్చుకున్నారు. ఇక.. విదేశాల్లోని పంజాబీ గ్రూప్‌లను.. ఖలిస్తానీ వ్యవహారాలకు దూరంగా ఉండాలని కేంద్రం విజ్ఞప్తి చేస్తోంది. అమృత్‌పాల్ సింగ్ కోసం నాలుగు రోజులుగా వేట కొనసాగుతున్న వేళ.. విదేశాల్లోని వివిధ భారత రాయబార కార్యాలయాలపై ఖలిస్తాన్ మద్దతుదారులు దాడులకు తెగపడుతున్నారు. ఈ తరుణంలో కేంద్ర విదేశాంగ శాఖ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇక అమృత్‌పాల్ సింగ్ పంజాబ్ దాటేసి పారిపోయి ఉంటాడన్న అనుమానాలతో అంతర్జాతీయ సరిహద్దులను సైతం అప్రమత్తం చేసింది కేంద్రం. సంబంధిత వార్త: పంజాబ్ వదిలి పారిపోయిన అమృత్‌పాల్ సింగ్? -
ముస్లిం అమ్మాయిలు 16 ఏళ్లకే పెళ్లి చేసుకోవచ్చు: హైకోర్టు తీర్పు
ముస్లిం అమ్మాయిల పెళ్లి విషయంలో పంజాబ్, హర్యానా హైకోర్టు సంచలన తీర్పును వెల్లడించింది. ముస్లిం అమ్మాయిలు 16 ఏళ్లకే పెళ్లి చేసుకోవచ్చని తెలిపింది. షరియా లా ప్రకారం.. ముస్లిం అమ్మాయి 16 ఏళ్లకు పెళ్లి చేసుకోవడం సరైనదేనని స్పష్టం చేసింది. వివరాల ప్రకారం.. రెండు వారాల క్రితం పెళ్లి చేసుకున్న ఈ జంట తమకు రక్షణ కల్పించాలంటూ కోర్టును ఆశ్రయించింది. ఈ జంట జూన్ 8వ తేదీన ఇస్లామిక్ పద్ధతుల ప్రకారం వివాహం చేసుకున్నారు. అనంతరం వారి పెళ్లిని నిరాకరిస్తూ.. కుటుంబ సభ్యులు బెదిరింపులకు గురి చేశారు. దీంతో వారు కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఒక ముస్లిం అమ్మాయికి 16 సంవత్సరాల వయస్సు, అబ్బాయికి 21 ఏళ్లు వచ్చినప్పుడు ఆమె ఇష్టానుసారం వివాహం చేసుకోవచ్చని హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పును వెల్లడించింది. ఈ సందర్భంగా కోర్టు తన తీర్పులో ఇస్లామిక్ చట్టాన్ని ఉదహరిస్తూ.. షరియా చట్టం ప్రకారం పురుషులు, మహిళలు 15 సంవత్సరాల వయస్సులో పెద్దలుగా పరిగణిస్తారని స్పష్టం చేసింది. వారిద్దరూ ఇష్ట ప్రకారమే పెళ్లి చేసుకున్న కారణంగా ప్రాథమిక హక్కులను తిరస్కరించలేమని హైకోర్టు తెలిపింది. ఈ క్రమంలో వారి వివాహానికి ఆమోదం తెలిపింది. A single-judge bench of the Punjab and Haryana High Court upheld a minor's marriage, ruling that Muslim girls can marry of their own free will at 16. Read more: #ITCard #Muslims #Punjab #Haryana #HighCourt #News #India (@sardakanu_law @mewatisanjoo) pic.twitter.com/JGQsPpdcD5 — IndiaToday (@IndiaToday) June 20, 2022 ఇది కూడా చదవండి: మోదీ జీ.. మీ దోస్త్‌ను అడిగి తెలుసుకోండి అంటూ అసదుద్దీన్ ఒవైసీ కౌంటర్ -
సహజీవనం కేసు: రాజస్థాన్ హైకోర్టు సంచలన తీర్పు!
పెళ్లైన మహిళ, మరో వ్యక్తితో కలిసి సహజీవనం చేయడం అక్రమమే అవుతుందని రాజస్థాన్ హైకోర్టు తాజాగా తేల్చి చెప్పింది. జస్టిస్ సతీష్ కుమార్ శర్మతో కూడిన ఏకధర్మాసనం తీర్పును వెలువరించింది. అలాగే పోలీసుల భద్రత కోరుతూ ఈ జంట దాఖలు చేసిన పిటిషన్‌ను తిరస్కరించింది. వారికి రక్షణ పొందే అర్హత లేదని న్యాయమూర్తి పేర్కొన్నారు. మహిళకు ఇంతకముందే పెళ్లై, ఇప్పటి వరకు విడాకులు తీసుకోని నేపథ్యంలో మరో వ్యక్తితో సహజీవనం చేయడం వివాహేతర సంబంధం కిందకు వస్తుందని పేర్కొన్నారు. అలాగే పోలీసుల రక్షణ కోరుతూ వేసిన పిటిషన్‌ను తిరస్కరించారు. డేటింగ్ చేస్తున్న వారికి పోలీసుల భద్రత కల్పించడం అంటే ఇలాంటి సంబంధాలకు పరోక్షంగా అనుమతి ఇవ్వడమే అవుతుందని వ్యాఖ్యానించారు. అయితే ఈ జంటపై ఎవరైనా దాడికి పాల్పడితే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని పిటిషనర్లను ఆదేశించారు. ఈ కేసు పూర్వాపరాలను పరిశీలిస్తే.. రాజస్థాన్‌లోని జున్జును జిల్లాకు చెందిన 30 ఏళ్ల మహిళ, 27 ఏళ్ల యువకుడు సహజీనం చేస్తున్నారు. అయితే మహిళకు ఇంతకుముందే చట్టబద్ధంగా మరో వ్యక్తితో వివాహం అయ్యింది. భర్త శారీరక వేధింపులకు పాల్పడుతున్న కారణంగా ఆమె తన నుంచి విడిగా ఉంటూ ఈ యువకుడితో జీవిస్తోంది. ఈ క్రమంలో భర్త, అత్తమామలు మహిళపై నిరంతరం బెదిరింపులకు పాల్పడుతున్నారు. దీంతో తమ జీవితాలకు ప్రమాదం ఉందని రక్షణ కల్పించాలని బాధిత జంట కోర్టును ఆశ్రయించింది. విచారణ సమయంలో.. మహిళ భర్త, అతని కుటుంబ సభ్యులు సైతం ఈ జంట మధ్య సంబంధాన్ని చట్ట విరుద్ధమని ఆరోపించారు. కాగా గత జూన్‌లో జస్టిస్ నవీన్ సిన్హా,జస్టిస్ అజయ్ రస్తోగిలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం సహజీవనం చేస్తున్న జంటకు రక్షణ కల్పించాలని పంజాబ్ పోలీసులను ఆదేశించింది. అంతకముందు వీరి పిటిషన్‌ను పంజాబ్-హర్యానా హైకోర్టు తిరస్కరించింది. -
మైనర్ బాలిక రెండో పెళ్లి.. రక్షణ కావాలంటూ కోర్టు మెట్లెక్కింది
చత్తీస్‌గఢ్: సాధారణంగానే మైనర్ల వివాహం చట్ట విరుద్ధం, పైగా చెల్లదు కూడా. అలాంటిది ఓ మైనర్ బాలిక వివాహం చేసుకోవడమే గాక రక్షణ కావాలంటూ పంజాబ్, హర్యానా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. వివరాల్లోకి వెళితే.. 16 ఏళ్ల బాలిక తల్లిదండ్రులకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నందున ఆమెకు వారి నుంచి ప్రాణహాని ఉందని.. రక్షణ కల్పించాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇక్కడ ఇంకో ట్విస్ట్ కూడా ఉంది. బాలిక ఇంకా మైనర్ కాగా తనకు ఇది రెండో వివాహమని పిటిషన్లో పేర్కోవడం గమనార్హం. అయితే బాలిక పిటిషన్‌ను స్వీకరించిన పంజాబ్, హర్యానా ఉమ్మడి హైకోర్టు విచారణ చేపట్టింది. విచారణలో జస్టిస్ సుధీర్ మిట్టల్ ధర్మాసనం ఈ అంశంపై కీలక వ్యాఖ్యలు చేసింది. ‘మైనార్టీ తీరకుండానే పెళ్లి చేసుకోవడం చట్ట విరుద్ధం. కాగా బాల్యవివాహాల నిషేధ చట్టం, 2006 లోని సెక్షన్ 12 కింద ఈ వివాహం చెల్లదు. ఇదీ గాక సదరు బాలిక తనకిది రెండో వివాహం అని పిటిషన్లో పేర్కొనడంపై విచారణ జరపాలని తెలుపుతూ తదుపరి విచారణ జూలై 23కు వాయిదా వేసింది. అప్పటి వరకు ఆ బాలికకు, వివాహం చేసుకున్న యువకుడికి ప్రభుత్వం రక్షణ కల్పించాలంటూ స్పష్టం చేసింది. బాలిక నివాసానికి సమీపంలోని నారి నికేతన్‌లో ఉంచి భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అదే క్రమంలో ప్రభుత్వం పిటిషనర్ల జీవితానికి, స్వేచ్ఛకు ఎటువంటి హాని జరగకుండా చూసుకోవాలి. ఇరువురి తల్లిదండ్రులు, బంధువులను పిలిపించి వారి సమక్షంలోనే సదరు బాలికకు కౌన్సెలింగ్ ఇప్పించాలి. కౌన్సెలింగ్ తర్వాత ఆమె తీసుకున్న నిర్ణయాన్ని నివేదిక రూపంలో జూలై 23 లేదా అంతకంటే ముందే హైకోర్టుకు అందజేయాలి' అని ధర్మాసనం తీర్పునిచ్చింది. మైనార్టీ తీరకుండానే రెండు సార్లు వివాహం చేసుకున్న సదరు బాలిక పిటిషన్‌పై హైకోర్టు తుది తీర్పుపై ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. చదవండి: గొడవతో మహానదిలో దూకిన దంపతులు.. అంతలోనే.. -
భర్తను చంపినా పెన్షన్ ఇవ్వాల్సిందే..
చండీగఢ్: ప్రభుత్వోద్యోగి అయిన భర్తను చంపిన భార్యకు పెన్షన్ ఇవ్వాల్సిందేనని పంజాబ్-హర్యానా హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. ప్రభుత్వోద్యోగి అయిన భర్తను చంపిందని తేలితే భార్యకు పెన్షన్ ఇచ్చేది లేదని హర్యానా ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో.. ప్రభుత్వ ఆదేశాలను తప్పుబడుతూ హైకోర్టు ఈ తీర్పునిచ్చింది. భర్తను భార్యే చంపిందని సాక్షాధారాలతో రుజువైనా, భార్యకు ఫ్యామిలీ పెన్షన్ ఇవ్వాల్సిందేనని కోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వ ఉద్యోగి చనిపోతే, వారి కుటుంబానికి ఆర్థిక సాయం అందించేందుకు ఫ్యామిలీ పెన్షన్‌ను ఇస్తారని, అలాంటిది ఎటువంటి ఆర్ధిక భరోసా లేని భార్యకు ఫ్యామిలీ పెన్షన్ ఇస్తే తప్పేంటని కోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. భార్య క్రిమినల్ కేసులో దోషిగా తేలినా ఫ్యామిలీ పెన్షన్ పొందేందుకు అర్హురాలేనని కోర్టు స్పష్టం చేసింది. భర్తను హత్య చేసిన కేసులో దోషిగా తేలిన బల్జీత్ కౌర్ అనే మహిళ వేసిన పిటిషన్ విచారణ సందర్భంగా కోర్టు ఈ సంచలన తీర్పును వెల్లడించింది. హర్యానా ప్రభుత్వ ఉద్యోగి అయిన తన భర్త 2008లో మరణించాడని ఆమె పిటిషన్లో పేర్కొంది. అయితే 2009లో ఆమె తన భర్తను హతమార్చిందని పోలీసులు ఆమెపై హత్యానేరం మోపగా, 2011లో ఆమె దోషిగా తేలింది. 2011 వరకూ హర్యానా ప్రభుత్వం ఆమెకు పెన్షన్ ఇచ్చినా.. ఆతర్వాత దోషిగా తేలడంతో ఆమె పెన్షన్‌ను నిలిపి వేసింది. తాజా విచారణలో హర్యానా ప్రభుత్వ ఆదేశాలను తప్పు పట్టిన కోర్టు.. బల్జీత్ కౌర్‌కు పూర్తి బకాయిలతో పాటు పెన్షన్ చెల్లించాలని సంబంధిత శాఖను ఆదేశించింది. కాగా, సీసీఎస్ రూల్స్, 1972 ప్రకారం భర్త చనిపోయిన తర్వాత భార్యకు ఫ్యామిలీ పెన్షన్‌ను ఇస్తారు. భర్త మరణాంతరం భార్య రెండో పెళ్లి చేసుకున్నా, ఆమె ఫ్యామిలీ పెన్షన్‌కు అర్హురాలే. -
వారి మధ్య పెళ్లి ఆమోదయోగ్యం కాదు:హైకోర్టు
చండీగఢ్: హిందూ వివాహ చట్టం ప్రకారం తోబుట్టుల మధ్య వివాహం చట్ట విరుద్దమని పంజాబ్ హర్యానా హైకోర్టు కోర్టు స్పష్టం చేసింది. పిటిషన్లో అమ్మాయి మేజర్ అని తెలిపినప్పటికీ ఇది న్యాయ సమ్మతం కాదని కేసును విచారించిన న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. పంజాబ్‌లోని లూథియానాకు చెందిన పిటిషనర్ తనపై నమోదు చేసిన ఐపీసీ సెక్షన్ 363 (కిడ్నాప్), 366 ఏ(మైనర్ అమ్మాయిని అనుమతి లేకుండా తీసుకెళ్లడం) వంటి సెక్షన్లు ఖన్నాసిటిలోని రెండవ ఠాణాలో నమోదయ్యాయని, వాటిపై ముందస్తు బెయిల్ మంజూర్ చేయాలని కోరుతూ కోర్టును ఆశ్రయించాడు. జీవిత రక్షణ,స్వేచ్ఛ కోసం పిటిషనర్‌తో కలిసి బాలిక క్రిమినల్ రిట్ పిటిషన్ దాఖలు చేసుకున్నట్లు అతని తరుపు న్యాయవాది అరవింద్ సింగ్ సాంగ్వాన్ కోర్టుకు నివేదించాడు. ఈ ముందస్తు బెయిల్‌ను ప్రభుత్వ తరుపు న్యాయవాది తీవ్రంగా వ్యతిరేకించారు. వారిద్దరూ సొంత అన్నదమ్ముల బిడ్డలు కావడంతో ఎఫ్ఐఆర్ నమోదు చేశారని అన్నారు. పిటిషన్ పరీశీలించిన న్యాయమూర్తి వారిద్దరూ కలిసి ఉంటున్నారని అంటున్నారు, కానీ నివేదికనూ చూస్తే తనకు కేవలం 17 సంవత్సరాల మాత్రమే ఉన్నాయని అన్నారు. బాలిక పుట్టిన తేదీ 2003 ఆగస్ట్ అని,సెప్టెంబర్ 3,2020 నాటికీ 17 సంవత్సరాల 14 రోజులని న్యాయమూర్తి అన్నారు. కేవలం మగ సోదరులని మాత్రమే వాళ్ల తల్లిదండ్రులు ప్రేమిస్తున్నారని, మైనర్ని వేధిస్తున్నారని బాలిక ఇచ్చిన నివేదికను సైతం పిటిషనర్ దీనికి జతపర్చాడు. అందుకోసం తనతో కలిసి జీవించాలని బాలిక నిర్ణయించుకుందని వాదించాడు. తన సొంత తల్లిదండ్రుల నుంచి ప్రాణానికి హాని ఉందన్నారు. తనను వేధించకుండా చూడాలని వేసిన పిటిషన్‌ని, కోర్టు సెప్టెంబర్ 7 న కొట్టివేసింది. ప్రభుత్వం ఇద్దరికి రక్షణ కల్పించాలని ఆదేశిందని న్యాయమూర్తి అన్నారు. ఏది ఏమైన చట్ట ఉల్లంఘన కోసం చట్టపరమైన చర్యల నుంచి రక్షించడానికి ఈ ఉత్తర్వూ ఇవ్వరాదని కోర్టు వ్యాఖ్యానించింది. పిటిషన్లో తాను బాలికకూ సోదరుడినవుతాననే విషయాన్ని వెల్లడించలేదని ,అందువల్ల 18 సంవత్సరాలు నిండిన తరువాత కూడా వారు చేసుకున్న పెళ్లి చట్ట సమ్మతం కాదని అంది." పిటిషనర్ హిందూ వివాహ చట్టం క్రింద నిషేధించబడిన 'సపిందా'లో (ఇద్దరు వ్యక్తుల మధ్య ఉమ్మడి పూర్వీకులు ఉంటే వారి మధ్య వివాహాన్ని నిషేధిస్తుంది) వస్తారని, ఒకరితో ఒకరు వివాహం చేసుకోలేరని అని ప్రభుత్వ న్యాయవాది" వాదనలతో కోర్టు ఏకీభవించింది., ఇది అనైతికం, సమాజంలో ఆమోద యోగ్యం కాదని పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. -
రాత్రికి రాత్రే... ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి బదిలీ
సాక్షి, న్యూ ఢిల్లీ : రెండు రోజులుగా ఈశాన్య ఢిల్లీలో జరుగుతున్న అల్లర్లకు సంబంధించిన పిటీషన్లపై అర్థరాత్రి విచారణ జరిపి, సత్వర ఆదేశాలు జారీ చేసిన ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్ మురళీధర్ బదిలీ అయ్యారు. ఆయనను పంజాబ్-హరియాణా హైకోర్టుకు బదిలీ చేస్తూ కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది. దీనికి సంబంధించిన గెజిట్‌పై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సంతకం చేశారు. తక్షణమే ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు. (చదవండి: నివురుగప్పిన నిప్పులా ఢిల్లీ) వాస్తవానికి మురళీధర్ బదిలీ గురించి కొంత కాలంగా చర్చ జరుగుతోంది. ఈ నెల 12వ తేదిన సుప్రీంకోర్టు కొలిజీయం ఆయన బదిలీకి ప్రతిపాదించింది. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా ఢిల్లీ హైకోర్టు బార్ అసోసియేషన్ అప్పటి నుండి ఆందోళన చేస్తోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ దాడులకు సంబంధించి దాఖలైన పిటిషన్‌పై ఆయన బుధవారం అర్థరాత్రి తన నివాసంలో విచారణ జరిపారు. ఈ సందర్భంగా ఆయన పోలీసుల తీరును తప్పబట్టారు. ఒక వర్గానికి చెందిన క్షతగాత్రులను సురక్షితంగా ఆసుపత్రికి తరలించడాన్ని అడ్డుకోవద్దని ఢిల్లీ పోలీసులను ఆదేశించారు. అవసరమైతే క్షతగాత్రుల తరలింపులో సహకరించాలని కూడా సూచించారు. ఢిల్లీ పోలీసులకు కొన్ని కీలక సూచలను సూచిస్తూ మూడు పేజీల తీర్పు పాఠాన్ని వినిపించారు. ఈ విచారణ చేపట్టి 24 గంటలు కూడా గడవక ముందే ఎస్ మురళీధర్ బదిలీ కావడం ప్రాధాన్యతను సంతరిచుకుంది. కాగా, పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తున్న, సమర్ధిస్తున్న వర్గాల మధ్య రెండు రోజులుగా జరుగుతున్న అల్లర్లలో బుధవారం నాటికి మృతుల సంఖ్య 27కి చేరింది. రెండు వందల మందికి పైగా గాయాలపాలయ్యారు. బుల్లెట్ గాయాలు, కత్తులు, ఇతర ప్రాణాంతక ఆయుధాల కారణంగా అయిన గాయాల కన్నా.. తరుముకొస్తున్న దుండగుల బారి నుంచి తప్పించుకోవడం కోసం ఇళ్ల పై అంతస్తుల నుంచి దూకడం వల్ల చోటు చేసుకున్న గాయాలే ఎక్కువగా కనిపిస్తున్నాయని క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్న వైద్యులు వెల్లడించారు. -
గ్యాంగ్ రేప్ కేసులో సంచలన తీర్పు
చత్తీస్‌గఢ్ : సామూహిక హత్యాచారం కేసులో పంజాబ్, హర్యానా హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. ఈ కేసులో నేరస్థులుగా నిర్ధారించిన ఏడుగురికి మరణశిక్షను ఖరారు చేయడంతోపాటు వారికి భారీ జరిమానాను కూడా విధించింది. రూ.50లక్షల నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది. ఇందుకు నేరస్థుల ఆస్తులను విక్రయించాలంటూ ఆదేశించడం విశేషం. ఈ మేరకు రోహతక్ డిప్యూటీ కమిషనర్‌కు కోర్టు కీలక ఆదేశాలిచ్చింది. జులై 4వ తేదీనాటికి నేరస్తుల ఆస్తులను గుర్తించి, విక్రయించాలని, అలాగే దీనికి సంబంధించిన సమాచారాన్ని కోర్టుకు అందించాలని కూడా స్పష్టం చేశారు. ఇందులో బాధితురాలి సోదరికి 25 లక్షల రూపాయలు, హర్యానా ప్రభుత్వానికి రూ.25 లక్షలు అందుతుందని తీర్పు నిచ్చింది. కాగా నేపాల్‌కు చెందిన మహిళపై అతిక్రూరంగా సామూహిక హత్యాచారానికి పాల్పడ్డారు. 2015, ఫిబ్రవరిలో రోహతక్‌లో ఈ ఉదంతం చోటు చేసుకుంది. మతి స్థిమితం లేని ఆమె , రోహతక్‌లోని సోదరి ఇంటికి వచ్చి కనిపించకుండా పోయింది. మూడు రోజుల అనంతరం దారుణ హింసకు గురైన స్థితిలో తీవ్ర గాయాలతో ఆమె మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. నిర్భయ తరహాలో గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారని తేల్చారు. ముఖ్యంగా ఆమె శరీర భాగాల్లో రాళ్లు, కర్రలను కనుగొన్నారు. ఈ ఉదంతంలో ఎనిమిది మందిపై కేసు నమోదు కాగా అదే ఏడాది డిసెంబరులో రోహతక్ సెషన్స్ జడ్జి అందరికీ మరణ శిక్ష విధించారు. వీరిలో ఒకరు మైనర్కూడా ఉన్నారు. తాజాగా ఈ తీర్పును సమర్ధించిన న్యాయమూర్తులు ఏబీ చౌదరి, సురేందర్ గుప్త ఆధ్వర్యంలోని పంజాబ్, హర్యానా హైకోర్టు బెంచ్ మైనర్‌ను మరణశిక్షనుంచి మినహాయించింది. -
వేధింపుల కేసు: బీజేపీ చీఫ్ కుమారుడికి బెయిల్
సాక్షి, చండీగఢ్: యువతిపై వేధింపుల కేసులో హర్యానా బీజేపీ అధ్యక్షుడు సుభాష్ బరాలా కుమారుడు వికాస్ బరాలాకు బెయిల్ మంజూరైంది. గతంలో కింది కోర్టులో నాలుగుసార్లు వికాస్ బెయిల్ పిటీషన్ కొట్టివేయగా, ఐదోప్రయత్నంగా పంజాబ్, హర్యానా రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టును ఆశ్రయించగా ఎట్టకేలకు బెయిల్ లభించింది. యువతి కారు అడ్డగింత, వేధింపులు, కిడ్నాప్ యత్నం కేసులో గతేడాది ఆగస్టు 9న వికాస్‌ను, అతడి స్నేహితుడు ఆశిష్ కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మంగళవారం నాడు బాధితురాలు వర్ణికా కుందును బరాలా కౌన్సిల్ దాదాపు ఐదు గంటలపాటు కొన్ని వందల ప్రశ్నలు అడిగారు. అనంతరం రెండు రోజులకు గురువారం నిందితుడు వికాస్ బరాలకు పంజాబ్, హర్యానాల ఉమ్మడి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. గతేడాది ఆగస్టు 4న చండీగఢ్‌లోని సెక్టార్ 8లో వర్ణికా కుందు తన కారులో వెళ్తుండగా మద్యం మత్తులో ఉన్న వికాస్ తన స్నేహితుడు ఆశిష్‌తో కలిసి తమ ఎస్యూవీ వాహనంతో 8 కిలోమీటర్లు ఫాలో అవుతూ వెంబడించి వేధించారు. పోలీస్ హెల్ప్‌లైన్‌కు కాల్ చేయగా వారు అక్కడికి చేరుకుంటుండగా వికాస్, ఆశిష్‌లు తమ వాహనంలో అక్కడి నుంచి పరారయ్యారు. కాగా, ఆ మరుసటిరోజు రాత్రి జరిగిన వేధింపులు, కిడ్నాప్ యత్నం ఘటనను ఫేస్బుక్లో పోస్ట్ చేయగా వైరల్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. నిందితులపై 354డీ తోపాటు మోటారు వెహికల్ యాక్ట్‌లోని ఐపీసీ 185 సెక్షన్ కింద కేసులు నమోదు చేసి విచారణ చేపట్టి నిందితులను అరెస్ట్ చేశారు. -
డేరా అక్రమాలపై రంగంలోకి ఈడీ
సాక్షి,చండీగర్: డేరా సచా సౌథాలో మనీ ల్యాండరింగ్‌కు సంబంధించిన ఆరోపణలపై విచారణ చేపట్టాలని బుధవారం పంజాబ్ అండ్ హర్యానా హైకోర్ట్ ఆదాయ పన్నుశాఖ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లను ఆదేశించింది. డేరా అధిపతి గుర్మీత్ రాం రహీం సింగ్, ఆయన ప్రధాన అనుచరులపై ఈ ఆరోపణలకు సంబంధించి విచారణ నిర్వహించాలని కోర్టు కేంద్ర దర్యాప్తు సంస్థలను కోరింది. డేరా సచా సౌథా ఆర్థిక లావాదేవీలపై లోతైన విచారణ అవసరమని సీనియర్ అడ్వకేట్ అనుపమ్ గుప్తా వాదనలపై హైకోర్టు బెంచ్ ఈ ఉత్తర్వులు జారీ చేసింది. డేరా ప్రాంగణాన్ని రెవెన్యూ రికార్డుల్లో ప్రత్యేక గ్రామంగా పేర్కొంటూ హర్యానా ప్రభుత్వం డేరాకు ఇచ్చిన మినహాయింపులపైనా విచారణ నిర్వహించాలని హైకోర్టు స్పష్టం చేసింది. డేరాలో అక్రమ కట్టడాలను క్రమబద్ధీకరిస్తూ గతంలో భూపీందర్ హుడా సర్కార్, ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం గుర్మీత్ సింగ్‌కు అనుకూలంగా వ్యవహరించాయని కోర్టు దృష్టికి ఫిర్యాదులు అందటంతో హైకోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. డేరా బాబాను అత్యాచార కేసులో దోషిగా నిర్ధారించిన అనంతరం చెలరేగిన హింసాకాండలో నష్టపోయిన బాధితులకు సహాయపడేందుకు కాంపెన్సేషన్ ట్రిబ్యునల్స్‌ను నెలకొల్పాలని పంజాబ్, హర్యానాలను హైకోర్టు ఆదేశించింది. -
ర్యాన్ స్కూల్ యజమానులకు చుక్కెదురు
గుర్గావ్ : దేశంలో సంచలనం సృష్టించిన గుర్గావ్ బాలుడి హత్య కేసులో పాఠశాల యాజమాన్యానికి చుక్కెదురైంది. తమను అరెస్టు చేయకుండా నిలుపుదల ఆదేశాలు ఇవ్వాలంటూ వేసిన పిటిషన్‌ను పంజాబ్ హర్యానా హైకోర్టు తిరస్కరించింది. అలాగే, దీనిపై వీలయినంత త్వరగా ప్రభుత్వ స్పందన తెలియజేయాలంటూ ప్రభుత్వానికి నోటీసులు పంపించింది. గుర్గావ్లోని ర్యాన్ ఇంటర్నేషనల్ స్కూల్లో రెండో తరగతి చదువుతున్న ప్రద్యుమన్ ఠాకూర్ అనే ఏడేళ్ల విద్యార్థిని బస్సు కండక్టర్ అతి దారుణంగా కత్తితో గొంతుకోసి హత్య చేసిన విషయం తెలిసిందే. స్కూల్ బాత్ రూంలోనే ఈ ఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించి పింటో, గ్రేస్ పింటో, ఫ్రాన్సిస్ పింటోలను బాధ్యులుగా చేరుస్తూ వారి అరెస్టుకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వారు తమను అరెస్టు చేయకుండా స్టే ఆర్డర్ ఇవ్వాలంటూ కోర్టును ఆశ్రయించగా వారికి చుక్కెదురైంది. తదుపరి విచారణ ఈ నెల(సెప్టెంబర్) 25న జరగనుంది. -
రాంపాల్ కు ఈనెల 28 వరకు జ్యుడీషియల్ కస్టడీ
చండీగఢ్: వివాదాస్పద స్వామి రాంపాల్ కు చండీగఢ్-హర్యానా హైకోర్టు నవంబర్ 28 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. గురువారం ఆయనను కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసుపై తదుపరి విచారణను ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన బెంచ్ ఈనెల 28కి వాయిదా వేసింది. రాంపాల్ అరెస్ట్ సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలపై పూర్తి వివరాలతో అఫిడవిట్ సమర్పించాలని హర్యానా డీజీపీని కోర్టు ఆదేశించింది. బర్వాలాలోని రాంపాల్ ఆశ్రమం వద్ద ఎంత నష్టం జరిగింది, ఎంతమంది గాయపడ్డారు, ఆశ్రమం నుంచి స్వాధీనం చేసుకున్న ఆయుధాలు, మందుగుండు సామాగ్రి ఆస్తినష్టంకు సంబంధించిన వివరాలు అఫిడవిట్ లో పొందుపర్చాలని సూచించింది. తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నడుమ రాంపాల్ ను హర్యానా పోలీసులు బుధవారం రాత్రి అరెస్ట్ చేశారు.