![రాంపాల్ కు ఈనెల 28 వరకు జ్యుడీషియల్ కస్టడీ](/styles/webp/s3/article_images/2017/09/2/61416332664_625x300_2.jpg.webp?itok=Cv9e604t)
రాంపాల్ కు ఈనెల 28 వరకు జ్యుడీషియల్ కస్టడీ
చండీగఢ్: వివాదాస్పద స్వామి రాంపాల్ కు చండీగఢ్-హర్యానా హైకోర్టు నవంబర్ 28 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. గురువారం ఆయనను కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసుపై తదుపరి విచారణను ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన బెంచ్ ఈనెల 28కి వాయిదా వేసింది.
రాంపాల్ అరెస్ట్ సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలపై పూర్తి వివరాలతో అఫిడవిట్ సమర్పించాలని హర్యానా డీజీపీని కోర్టు ఆదేశించింది. బర్వాలాలోని రాంపాల్ ఆశ్రమం వద్ద ఎంత నష్టం జరిగింది, ఎంతమంది గాయపడ్డారు, ఆశ్రమం నుంచి స్వాధీనం చేసుకున్న ఆయుధాలు, మందుగుండు సామాగ్రి ఆస్తినష్టంకు సంబంధించిన వివరాలు అఫిడవిట్ లో పొందుపర్చాలని సూచించింది. తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నడుమ రాంపాల్ ను హర్యానా పోలీసులు బుధవారం రాత్రి అరెస్ట్ చేశారు.