godman Rampal
-
రాంపాల్ అరెస్ట్ ఖర్చు అక్షరాలా రూ.26 కోట్లు
హర్యానా: వివాదాస్పద బాబా రాంపాల్ అరెస్ట్‌కు హర్యానా రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించిన వ్యయం అక్షరాలా రూ. 26.61 కోట్లు. రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు శుక్రవారం పంజాబ్ హర్యానా హైకోర్టుకు ఓ నివేదిక సమర్పించింది. రాంపాల్ అరెస్ట్ నిమిత్తం హర్యానా రూ.15.43 కోట్లు, పంజాబ్ రూ.4.34 కోట్లు, ఛండీగఢ్ యంత్రాంగం రూ.2.29 కోట్లు, కేంద్రం రూ.3.55 కోట్లు ఖర్చు పెట్టాయి. వెరసి ఈ అరెస్ట్ ఆపరేషన్ కు .. రూ.26.61 కోట్లు ఖర్చు పెట్టడం గమనార్హం. కాగా రాంపాల్ అరెస్ట్ సందర్భంగా గాయపడినవారి వివరాలు సమర్పించాలని న్యాయస్థానం హర్యానా డీజీపీ ఎస్.ఎన్.వశిస్ట్ను ఆదేశించింది. రాంపాల్ ను అరెస్టు చేయడం కష్టమని, దీనికి చాలా ఖర్చవడంతో పాటు సామాన్య ప్రజలను కూడా ఇబ్బంది పెట్టాల్సి వస్తుందని పోలీసులు కోర్టుకు చెప్పారు. అయితే, ఎంత ఖర్చయినా అరెస్టు చేయాల్సిందేనని, ఆ ఖర్చంతటినీ రాంపాల్ నుంచే రాబట్టాలని కూడా కోర్టు పోలీసులకు తెలిపింది. దాంతో ఇప్పుడు మొత్తం రూ. 26.61 కోట్ల మొత్తాన్ని రాంపాల్ నుంచి వసూలు చేసే అవకాశం ఉంది. మరోవైపు హత్య కేసుకు సంబంధించి రాంపాల్‌ను పోలీసులు కట్టుదిట్టమైన భద్రత మధ్య కోర్టులో హాజరు పరిచారు. -
రాంపాల్ కు ఈనెల 28 వరకు జ్యుడీషియల్ కస్టడీ
చండీగఢ్: వివాదాస్పద స్వామి రాంపాల్ కు చండీగఢ్-హర్యానా హైకోర్టు నవంబర్ 28 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. గురువారం ఆయనను కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసుపై తదుపరి విచారణను ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన బెంచ్ ఈనెల 28కి వాయిదా వేసింది. రాంపాల్ అరెస్ట్ సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలపై పూర్తి వివరాలతో అఫిడవిట్ సమర్పించాలని హర్యానా డీజీపీని కోర్టు ఆదేశించింది. బర్వాలాలోని రాంపాల్ ఆశ్రమం వద్ద ఎంత నష్టం జరిగింది, ఎంతమంది గాయపడ్డారు, ఆశ్రమం నుంచి స్వాధీనం చేసుకున్న ఆయుధాలు, మందుగుండు సామాగ్రి ఆస్తినష్టంకు సంబంధించిన వివరాలు అఫిడవిట్ లో పొందుపర్చాలని సూచించింది. తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నడుమ రాంపాల్ ను హర్యానా పోలీసులు బుధవారం రాత్రి అరెస్ట్ చేశారు. -
'బయటకు వెళితే కాల్చేస్తారని భయపెట్టారు'
బర్వాలా: వివాదాస్పద ఆధ్యాత్మిక గురు స్వామి రాంపాల్ కు చెందిన ఆశ్రమం నుంచి ఇంకా భక్తులు బయటకు వస్తూనే ఉన్నారు. బర్వాలాలోని ఆయన ఆశ్రమంలో చాలా మంది ఉన్నారని పోలీసులు చెబుతున్నారు. లోపల ఉన్నవారంతా బయటకు రావాలని, ఎటువంటి భయం అవసరం లేదని విజ్ఞప్తి చేశారు. బయటకు వచ్చిన వారిని గమ్యస్థానాలకు చేర్చేందుకు పోలీసులు, ప్రభుత్వ సిబ్బంది సహకరిస్తున్నారు. స్వామి రాంపాల్ ప్రైవేటు సైన్యం, అనుచరులు ఆశ్రమంలో ఉన్నారని, వీరిని బయటకు రప్పించేందుకు పారా మిలటరీ బలగాలు ఆపరేషన్ కు సిద్ధమవుతున్నాయి. దీనికంటే ముందు ఆశ్రమంలో ఆయుధాలు ఏమైనా ఉన్నాయా అని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. లోపల ఉన్నవారిని రాంపాల్ ప్రైవేటు సైన్యం మభ్యపెడుతూ బయటకు రాకుండా చేస్తోంది. బయటకు వెళితే పోలీసులు అరెస్ట్ చేస్తారని తమతో చెప్పినట్టు ఆశ్రమం నుంచి వెలుపలికి వచ్చిన మధ్యప్రదేశ్ కు చెందిన మహిళ వెల్లడించింది. ఆశ్రమం నుంచి వెలుపలికి వెళితే పోలీసులు కాల్చేస్తారని రాంపాల్ ప్రైవేటు సైన్యం తమను భయపెట్టిందని ఉత్తరప్రదేశ్ కు చెందిన యువకులు తెలిపారు. -
నేను నిర్దోషిని, ఏ తప్పు చేయలేదు: రాంపాల్
చండీగఢ్ : తాను అమాయకుడినని.... ఏ తప్పు చేయలేదని వివాదాస్పద ఆధ్యాత్మిక స్వామి రాంపాల్ అన్నారు. తనపై వచ్చిన ఆరోపణలు నిరాధారమైనవని ఆయన మీడియాతో వాపోయారు. ఉద్రిక్తతల నడుమ నిన్న అరెస్ట్ చేసిన రాంపాల్‌ను పోలీసులు గురువారం హర్యానా హైకోర్టులో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ ఆయన పెట్టుకున్న పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. అంతేకాకుండా, 2006లో జరిగిన హత్య కేసులో రాంపాల్‌కు లభించిన బెయిల్‌ను కూడా కోర్టు రద్దు చేసింది. కోర్టు ధిక్కరణ కేసు విచారణను ఈ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేసింది. అత్యంత గందరగోళం నడుమ రాంపాల్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు... ఈ ఉదయం వైద్య పరీక్షల నిమిత్తం ఛండీఘర్లోని పంచకుల ఆసుపత్రికి తరలించారు. పరీక్షల అనంతరం రాంపాల్ పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. -
బాబా రాంపాల్‌కు వైద్య పరీక్షలు పూర్తి
-
బాబా రాంపాల్‌కు వైద్య పరీక్షలు పూర్తి
చండీగఢ్ : వివాదాస్పద ఆధ్యాత్మిక గురు స్వామి రాంపాల్‌కు గురువారం ఉదయం పంచకుల ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. పరీక్షల అనంతరం రాంపాల్ పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ఆయనను ఈరోజు మధ్యాహ్నం 2 గంటల సమయంలో పంజాబ్-హర్యానా హైకోర్టులో ప్రవేశపెట్టనున్నారు. కాగా ఉద్రిక్త, నాటకీయ పరిణామాల మధ్య ఎట్టకేలకు రాంపాల్ నిన్న రాత్రి పోలీసులు బల్వారాలో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. రాంపాల్‌తో పాటు ఆయన కుమారుడు పురుషోత్తం దాస్, ఆశ్రమ ప్రతినిధి రాజ్ కపూర్ సహా 70 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు రాంపాల్‌కు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నంత సేపు ఆస్పత్రి బయట పెద్ద ఎత్తున ఆయన భక్తులు గుమ్మిగూడారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కోర్టు ప్రాంగణం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు 2006లో జరిగిన హత్య కేసులో రాంపాల్ బెయిల్ పిటిషన్ ను న్యాయస్థానం కొట్టేసింది. -
నేడు కోర్టుకు స్వామి రాంపాల్
-
స్వామి రాంపాల్ అరెస్ట్
ఉద్రిక్తత నడుమ ఆశ్రమంలోనే అరెస్ట్ చేసిన పోలీసులు బుధవారం ఉదయం నుంచీ ఆశ్రమం వద్ద భద్రత బలగాలు ఆశ్రమంలో దాదాపు 15 వేలమంది అనుచరులు బర్వాలా/చండీగఢ్: ఉద్రిక్త, నాటకీయ పరిణామాల మధ్య ఎట్టకేలకు వివాదాస్పద ఆధ్యాత్మిక గురు స్వామి రాంపాల్(63)ను బుధవారం రాత్రి పోలీసులు బల్వారాలోని ఆయన ఆశ్రమంలో అరెస్ట్ చేశారు. అనంతరం ఆయనను వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. దీంతో దాదాపు రెండు వారాలుగా కొనసాగుతున్న ఉద్రిక్తతకు తెరపడినట్లైంది. గురువారం ఉదయం హిస్సార్ కోర్టులో, శుక్రవారం పంజాబ్, హర్యానా హైకోర్టులో ఆయనను హాజరు పరుస్తామని పానిపట్ జిల్లా ఎస్పీ సతీశ్ బాలన్ వెల్లడించారు. చాలా కఠినమైన ఆపరేషన్ అనంతరం రాంపాల్‌ను అదుపులోకి తీసుకున్నామని హర్యానా డీజీపీ ఎస్ఎన్ వశిష్ట్ తెలిపారు. వేలాది మంది వృద్ధులు, మహిళలు, చిన్నారులు ఆశ్రమంలో ఉన్నందున జాగ్రత్తగా వ్యవహరించాల్సి వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో ఐదుగురు ఎస్పీలు పాల్గొనడం విశేషం. 200 మందికి పైగా గాయాలపాలైన మంగళవారం నాటి ఘర్షణల అనంతరం.. బుధవారం ఉదయం నుంచీ ఆశ్రమం వద్ద పలు పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆశ్రమం చుట్టూ పోలీసులు, పారా మిలటరీ బలగాలు భారీగా మోహరించాయి. రాంపాల్ లొంగిపోవాలంటూ లౌడ్ స్పీకర్లలో పదేపదే ప్రకటించారు. ఆశ్రమంలో ఉన్నవారిలో దాదాపు 15 వేల మంది వెలుపలికి వచ్చారు. వారిని పోలీసులు క్షణ్ణంగా పరీక్షించారు. స్వామి రాంపాల్ ప్రైవేటు సైన్యం, అనుచరులు బలవంతంగా తమను లోపలే ఉంచారని బయటకు వచ్చినవారు తెలిపారు. ఆశ్రమం వద్ద మరింత హింస జరిగేందుకు అవకాశముందన్న ఐబీ హెచ్చరికల నేపథ్యంలో.. మరో 500 మంది పారా మిలటరీ బలగాలను కేంద్రం హర్యానాకు పంపించింది. ఆశ్రమంలోకి విద్యుత్, నీటి సరఫరాలను అధికారులు నిలిపేశారు. మరోవైపు, ఆశ్రమంలో చనిపోయిన నలుగురు మహిళల మృతదేహాలను ఆశ్రమ వర్గాలు పోలీసులకు అప్పగించాయి. అస్వస్థతతో ఉన్న ఒక చిన్నారి, మరో మహిళను కూడా అప్పగించాయి కానీ వారు అనంతరం ఆసుపత్రిలో మరణించారు. వీరి మృతదేహాలపై ఎలాంటి గాయాలు లేవని, ఈ మరణాలపై దర్యాప్తు జరుపుతున్నామని హర్యానా డీజీపీ ఎస్ఎన్ వశిష్ట్ తెలిపారు. ఆశ్రమం లోపల ఉన్నవారిలో హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌ల నుంచి వచ్చిన వృద్ధులు, మహిళలు, చిన్నారులు ఉన్నారన్నారు. రాంపాల్ కుమారుడు, ప్రధాన అనుచరుడు పురుషోత్తం దాస్, ఆశ్రమ ప్రతినిధి రాజ్ కపూర్ సహా 70 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా స్వామి రాంపాల్, రాజ్ కపూర్, పురుషోత్తం దాస్ సహా పలువురిపై దేశద్రోహం సహా వివిధ కేసులు నమోదు చేశారు. రాంపాల్‌పై ఇప్పటికే హత్య, హత్యాయత్నం, ఫోర్జరీ కేసులున్నాయి. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ బుధవారం సీఎం ఖట్టర్‌కు ఫోన్ చేసి రాంపాల్ అరెస్ట్ వ్యవహారంపై అసంతృప్తి వ్యక్తం చేశారని, త్వరగా దీనికి తెర దించాలని ఆదేశించారని తెలిసింది. మెర్సిడెజ్లు.. బీఎండబ్ల్యూలు..! హిస్సార్: 1951లో హర్యానాలోని సోనేపట్‌లో వ్యవసాయ కుటుంబంలో జన్మించిన రాంపాల్ సింగ్ జతిన్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా పూర్తి చేసి హర్యానా నీటిపారుదల శాఖలో జూనియర్ ఇంజనీర్‌గా చేరారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఆయనను 2000 సంవత్సరంలో విధుల్లోం చి తొలగించారు. తర్వాత ఆయనే సద్గురు రాంపాల్‌జీ మహారాజ్‌గా అవతారం ఎత్తారు. రాంపాల్ ప్రస్తుతం దాదాపు 100 కోట్ల ఆధ్యాత్మిక సామ్రాజ్యానికి అధిపతి అయ్యారు. హర్యానాలోని హిస్సార్ జిల్లాలో ఉన్న బల్వారాలో 12 ఎకరాల విశాల స్థలంలో ప్రధాన ఆశ్రమమనే ఆధునిక భవనంలో ఆయన నివాసం ఉంది. ఆయనకు ప్రైవేటు సైన్యంతోపాటు బీఎండబ్ల్యూ, మెర్సిడెజ్ కార్లు ఉన్నాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో ఆయనకు 25 లక్షల మందికిపైగా అనుచరులు, భక్తులున్నారు.