తాను అమాయకుడినని.... ఏ తప్పు చేయలేదని వివాదాస్పద ఆధ్యాత్మిక స్వామి రాంపాల్ అన్నారు.
చండీగఢ్ : తాను అమాయకుడినని.... ఏ తప్పు చేయలేదని వివాదాస్పద ఆధ్యాత్మిక స్వామి రాంపాల్ అన్నారు. తనపై వచ్చిన ఆరోపణలు నిరాధారమైనవని ఆయన మీడియాతో వాపోయారు. ఉద్రిక్తతల నడుమ నిన్న అరెస్ట్ చేసిన రాంపాల్ను పోలీసులు గురువారం హర్యానా హైకోర్టులో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ ఆయన పెట్టుకున్న పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది.
అంతేకాకుండా, 2006లో జరిగిన హత్య కేసులో రాంపాల్‌కు లభించిన బెయిల్‌ను కూడా కోర్టు రద్దు చేసింది. కోర్టు ధిక్కరణ కేసు విచారణను ఈ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేసింది. అత్యంత గందరగోళం నడుమ రాంపాల్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు... ఈ ఉదయం వైద్య పరీక్షల నిమిత్తం ఛండీఘర్‌లోని పంచకుల ఆసుపత్రికి తరలించారు. పరీక్షల అనంతరం రాంపాల్ పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.