
సాక్షి, చెన్నై: తెలుగువారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో సినీ నటి కస్తూరికి ఈనెల 29 వరకు రిమాండ్ విధిస్తూ చెన్నై ఎగ్మూర్ కోర్టు ఆదివారం ఆదేశాలిచ్చింది. దాంతో ఆమెను చెన్నై శివారులోని పుళల్ కేంద్ర కారాగారానికి తరలించారు. తెలుగు వారిని, మహిళలను కించపరిలా అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కస్తూరిపై తమిళనాడులో ఆరు కేసులు నమోదయ్యాయి.
దాంతో కొద్ది రోజులుగా అజ్ఞాతంలో ఉన్న ఆమెను హైదరాబాద్‌లో శనివారం రాత్రి అరెస్టు చేశారు. అక్కడి నుంచి ఆదివారం ఉదయాన్నే చెన్నై తీసుకొచ్చారు. చింతాద్రిపేట పోలీసుస్టేషన్‌లో విచారణ అనంతరం ఎగ్మూర్ కోర్టు న్యాయమూర్తి రఘుపతి రాజ ముందు హాజరు పరిచారు. రిమాండ్ విధించడంతో భద్రత నడుమ కారాగారానికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment