remanded
-
మెజార్టీ నిందితులకు భూముల్లేవు
వికారాబాద్: తమ వద్ద పక్కా సాక్ష్యాధారాలు ఉన్నందునే లగచర్ల ఘటనలో పట్నం నరేందర్‌రెడ్డిని ఏ–1గా చేర్చి అరెస్టు చేశామని ఐజీ సత్యనారాయణ చెప్పారు. బుధవారం కలెక్టర్ ప్రతీక్ జైన్‌తో భేటీ అయిన ఆయన, ఆ తర్వాత ఎస్పీ నారాయణతో కలిసి మీడియాతో మాట్లాడారు. లగచర్ల ఘటనకు సంబంధించి నరేందర్‌రెడ్డితో పాటు మరో 20 మంది నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని తెలిపారు. కోర్టులో హాజరుపర్చిన సమయంలో జరిగిన వాదనల సందర్భంగా సాంకేతిక ఆధారాలతో పాటు ఇతర ప్రాథమిక ఆధారాలు సమరి్పంచామని వెల్లడించారు. కలెక్టర్‌తో పాటు అధికారులపై జరిగిన దాడిపై అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నామని చెప్పారు. ముందుగా 57 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నామని, ప్రశ్నించిన తర్వాత ఘటనతో సంబంధం లేని 40 మందిని విడుదల చేశామని చెప్పారు. దాడిలో పాల్గొన్నవారిలో 42 మందిని గుర్తించామని, అయితే ఇందులో 19 మంది ఏ సంబంధం లేకుండానే దాడిలో పాల్గొన్నారని వెల్లడించారు. మెజార్టీ నిందితులకు అక్కడ భూములు లేవని, ముందస్తు కుట్రలో భాగంగానే ఈ ఘటన జరిగినట్టుగా ఆధారాలున్నాయని ఐజీ చెప్పారు. మిగిలిన నిందితుల కోసం నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నామన్నారు. తొలుత ఏ–1గా సురేశ్ ఉండగా దర్యాప్తు తర్వాత లభ్యమైన సాక్ష్యాధారాలతో నరేందర్‌రెడ్డిని ఏ–1గా చేర్చామని వివరించారు. దాడిలో సురేష్, మహేశ్, దేవదాస్, గోపాల్‌నాయక్, విఠల్, రాజు, విజయ్ ప్రధాన భూమిక పోషించారన్నారు. ఈ కేసులో ఇంకా చాలామందిని గుర్తించాల్సి ఉందన్నారు. గతంలో సురేష్ పై కేసులున్నాయని, రేప్ కేస్ ఉంటే మేనేజ్ చేసినట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. తదుపరి దర్యాప్తులో అన్ని విషయాలను గుర్తిస్తామని పేర్కొన్నారు. రిమాండ్‌కు తరలించింది వీరినే..ఏ1 పట్నం నరేందర్‌రెడ్డి, ఏ 21 బోగమోని మహేశ్, ఏ 22 బ్యాగరి విశాల్, ఏ 24 నీరటి సాయిలు, ఏ 27 నీరటి రమేశ్ (వీరిని బుధవారం అరె స్టు చేశారు), ఏ 3 ఎ.శివకుమార్, ఏ 11 మైలారం విష్ణువర్ధన్‌రెడ్డి, ఏ 14 హీర్యానాయక్, ఏ 15 పతీవత్ శ్రీను, ఏ 16 పతీవత్ ప్రవీణ్, ఏ 17 పతీవత్ వినోద్, ఏ 18 రాథోడ్ వినోద్, ఏ 19 జర్పాల హీర్యానాయక్, ఏ 20 బాస్యానాయక్, ఏ 23 బ్యా గరి యాదయ్య, ఏ 25 దోరేమోని రమేష్, ఏ 26 కావ లి రాఘవేందర్, ఏ 28 లక్ష్మయ్య, ఏ29 నీలి రవి, ఏ 30 శ్రీశైలం, ఏ 31 బాలకిష్టయ్య (వీరిని మంగళవారం రాత్రి అరెస్టు చేశారు). -
Phone tapping Case: రాధాకిషన్‌రావుకు జ్యుడీషియల్ రిమాండ్
సాక్షి, హైదరాబాద్: టాస్క్‌ఫోర్స్ మాజీ ఓఎస్డీ పి.రాధాకిషన్‌రావు శుక్రవారం కొంపల్లిలోని న్యాయమూర్తి ఇంటి వద్ద హాజరుపరచగా, 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో ఆయన్ను చంచల్‌గూడ జైలుకు తరలించారు. పోలీసులు గురువారం ఉదయం రాధాకిషన్ రావును అదుపులోకి తీసుకున్న విషయం తెలి సిందే. అప్పటి నుంచి రాత్రి వరకు ఆయన్ను బంజారాహిల్స్ ఠాణాలో సిట్ అధికారులు వివిధ కోణాల్లో ప్రశ్నించారు. అదనపు ఎస్పీలు నాయిని భుజంగరావు, మేకల తిరుపతన్నలను శుక్రవారం ఉదయం వీరిని చంచల్‌గూడ జైలు నుంచి కస్టడీలోకి తీసుకున్న పంజగుట్ట పోలీ సులు వైద్యపరీక్షల అనంతరం బంజారాహిల్స్ ఠాణాకు తరలించారు. అప్పటి నుంచి సాయంత్రం వరకు పోలీసులు ఈ ముగ్గురినీ కలిపి, విడివిడిగా విచారించారు. రాష్ట్ర స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) కేంద్రంగా సాగిన ఫోన్ ట్యాపింగ్‌తో పాటు అక్రమ వసూళ్ల కోణంలోనూ ప్రశ్నించారు. ఆపై రాధాకిషన్ రావును గాంధీ ఆస్పత్రికి తరలించిన పోలీసులు వైద్య పరీక్షల అనంతరం కొంపల్లికి తీసుకు వెళ్లారు. తదుపరి విచారణ నిమిత్తం రాధాకిషన్ రావును పోలీసు కస్టడీలోకి తీసుకోవాలని సిట్ నిర్ణయించింది. దీనికోసం అనుమతి కోరుతూ శనివారం నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేయనుంది. ప్రభాకర్‌రావుతో లింకులు, వసూళ్ల కోణంలో... సిట్ అధికారులు రాధాకిషన్‌రావుతో పాటు భుజంగరావు, తిరుపతన్నలను ప్రధానంగా రెండు కోణాల్లో ప్రశ్నించారు. ఎస్ఐబీ మాజీ చీఫ్ టి.ప్రభాకర్‌రావుతో వీరికి ఉన్న సంబంధాలు, ఆయన ఆదేశాల మేరకు చేసిన ఫోన్ ట్యాపింగ్‌పై ఎక్కువగా దృష్టి పెట్టారు. డీఎస్పీ దుగ్యాల ప్రణీత్‌రావు నేతృత్వంలోని బృందం సహాయంతో వీరు ప్రతిపక్ష నేతలు, కీలక వ్యక్తులతో పాటు వ్యాపారుల ఫోన్లూ ట్యాప్ చేసి వ్యక్తిగత విషయాలు తెలుసుకున్నారు. ఈ రకమైన ఆదేశాలు ఎవరు ఇచ్చారు? గుర్తించిన వివరా లను తొలుత ఆ వ్యక్తులకు చెప్పేవారా? అనే కోణాల్లో సిట్ ప్రశ్నించింది. వీరి వేధింపుల నేపథ్యంలో ఓ పార్టీకి వివిధ రూపాల్లో విరా ళాలు ఇవ్వడంతో పాటు ప్రభాకర్‌రావు, రాధా కిషన్‌రావు తదితరులకు కప్పం కట్టిన వాళ్లల్లో బడా బిల్డర్లు, జ్యువెలరీ దుకాణాల యజమా నులు, రియల్టర్లతో పాటు హవాలా వ్యాపా రులూ ఉన్నట్టు సిట్ అనుమానిస్తోంది. ఈ ముగ్గురినీ ప్రశ్నించిన సిట్ అధికారులు దీనికి సంబంధించి కీలక సమాచారం సేకరించారని తెలిసింది. రాచకొండ ఐటీ సెల్ ఇన్స్పెక్టర్ భూపతి గట్టుమల్లును శుక్రవారం తెల్లవారు జామున విడిచిపెట్టారు. దాదాపు ఆరుగంటల పాటు రాధాకిషన్‌రావుతో కలిపి గట్టుమల్లును ప్రశ్నించిన సిట్ ఆయన నుంచి వాంగ్మూలం నమోదు చేసింది. ఎస్ఐబీ, టాస్క్‌ఫోర్స్‌ల్లో పనిచేసిన అనేక మంది అధికారులు, సిబ్బందినీ సిట్ విచారిస్తూ వారి నుంచి వాంగ్మూలాలు సేకరిస్తోంది. ఇప్పటి వరకు 47మంది నుంచి స్టేట్మెంట్స్ రికార్డు చేశారని సమాచారం. ఏసీబీ కేసుకు రంగం సిద్ధం రాధాకిషన్‌రావు, నాయిని భుజంగరావు, మేక ల తిరుపతన్నలు అక్రమ ఆస్తులు కూడబెట్టా రని పోలీసులు అనుమానిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే కొన్ని ప్రాథమిక ఆధారా లు సేకరించారు. ఈ అంశాలను క్రోడీకరిస్తూ అవినీతి నిరోధక శాఖకు సమాచారమివ్వాలని సిట్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ వివరాలు అందిన తర్వాత ఏసీబీ అధికారులు ఆదాయా నికి మించిన ఆస్తుల కేసు నమోదు చేయనున్న ట్లు సమాచారం. మరోపక్క అక్ర మ ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులుగా ఉండి, అరెస్టు అయిన అధికారుల పూర్వాపరాల ను ఉన్నతా ధికారులు పరిశీలిస్తున్నారు.వీరు గతంలో ఎక్క డెక్కడ పనిచేశారు? ఆయాచోట్ల వీరిపై ఉన్న వివాదాలు ఏంటి? కేసులు ఉన్నా యా? అని ఆరా తీస్తున్నారు. తిరుపతన్నపై పెద్దగా వివా దాల్లేనప్పటికీ.. భుజంగ రావు సర్వీసు మొత్తం అక్రమ దందాలతోనే సాగిందని అధికారులు గుర్తించినట్టు తెలుస్తో ంది. రాధాకిషన్‌రావు ఉప్ప ల్ ఏసీపీగా ఉండగా 2013లో చోటు చేసుకున్న యాంజాల్ శ్రీధర్‌రెడ్డి అలియాస్ ఉప్పల్ వైఎస్సార్ ఆత్మహత్య కేసును అధికా రులు తవ్వుతున్నారు. అప్పటి రామంతాపూర్ కార్పొరేటర్ పరమేశ్వర్‌రెడ్డితోపాటు రాధా కిషన్‌రావు వేధింపులతోనే ఉప్పల్ వైఎస్సార్ ఆత్మహత్య చేసుకున్నట్లు కేసు నమోదైంది. 2007లో జరి గిన పరమేశ్వర్‌రెడ్డి సోదరుడు జగదీశ్వర్‌రెడ్డి హత్య కేసులో ఉప్పల్ వైఎస్సార్ నిందితుడు. ఇతడు మరికొందరితో కలిసి పరమేశ్వర్‌రెడ్డికి హత్యకు కుట్ర పన్నిన ఆరోప ణలపై ఉప్పల్ వైఎస్సార్ తదితరులను పోలీ సులు 2013 జూన్‌లో అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించి రాధా కిషన్ రావు రూ.10 లక్షల లంచం డిమాండ్ చేసి వేధించడంతోనే ఉప్పల్ వైఎస్సార్ ఆత్మహత్య చేసుకున్నట్టు అభియో గాలు నమోదయ్యాయి. ఈ కేసు ఇప్పటికీ ట్రయల్ పూర్తి కాకపోవడానికి కార ణాలను ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. నగదు రవాణా చేసినట్టూ అంగీకరించారు.. పంజగుట్ట ఠాణాలో నమోదైన ఈ కేసు దర్యాప్తులో భాగంగా టాస్‌్కఫోర్స్ మాజీ ఓఎస్డీ పి.రాధాకిషన్‌రావును బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు పిలిచి విచారించాం. ఆయన తాను చేసిన నేరాలను అంగీకరించారు. చట్టవిరుద్ధంగా, తమ అధికారాలను దుర్వినియోగం చేస్తూ ప్రైవేట్ వ్యక్తుల ప్రొఫైల్స్‌ను అభివృద్ధి చేయడం, కుట్రపూరితంగా అనధికారికంగా ఆ వ్యక్తులపై నిఘా ఉంచడం చేసినట్టు బయటపెట్టారు. రాజకీయంగా పక్షపాతంతో వ్యవహరించడంతోపాటు ఎన్నికల మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులో ఉన్న సమయంలో తాము అక్రమంగా డబ్బు రవాణా చేయడానికి అధికారిక వనరులను వినియోగించామని అంగీకరించారు. ఇతర నిందితులతో కుమ్మక్కై ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం మరియు సాక్ష్యాలను తారుమారు చేయడం వంటి కార్యకలాపాలకు పాల్పడినట్టు ఒప్పుకున్నారు. – ఎస్ఎం.విజయ్‌కుమార్, వెస్ట్‌జోన్ డీసీపీ -
జూబ్లీహిల్స్ బాలిక అత్యాచారం కేసు.. కీలక ఆధారం లభ్యం
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ బాలిక అత్యాచారం కేసులో నిందితులకు కోర్టు రిమాండ్ విధించింది. ఇప్పటివరకు ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల్లో ఇద్దరు మైనర్లు, ఒక మేజర్ కాగా.. ఇద్దరు మైనర్లను జువైనల్ హోమ్‌కు తరలించారు. నిందితుడు మాలిక్‌కు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్‌ను కోర్టు విధించింది. బాలికపై అత్యాచారం జరిగిన ఇన్నోవా కారు ఆచూకీ లభ్యమైంది. క్లూస్ టీమ్‌తో ఆధారాలు సేకరించే పనిలో పోలీసులు ఉన్నారు. చదవండి: అమ్నీషియా పబ్ కేసు: కారులో ఉంది ఎమ్మెల్యే కొడుకే! ఈ కేసులో ఓ విద్యాసంస్థ పేరుతో ఈవెంట్ కోసం పబ్‌ను బుక్ చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. మే 28న మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 5 వరకు పబ్‌లో పార్టీ జరిగినట్లు సమాచారం. పబ్‌లో పార్టీ కోసం రూ.2లక్షలు చెల్లించినట్లు తెలిసింది. 150 మంది విద్యార్థుల కోసం నిర్వాహకులు బుక్ చేశారు. పబ్‌లో ప్లస్ టూ విద్యార్థుల ఫేర్వెల్ పార్టీ జరిగినట్లు పోలీసులు గుర్తించారు. -
AP: స్కిల్ డెవలప్మెంట్ కేసులో ముగ్గురు నిందితులకు రిమాండ్
సాక్షి, విజయవాడ: స్కిల్ డెవలప్మెంట్ కేసులో ముగ్గురు నిందితులకు ఏసీబీ కోర్టు రెండు వారాలు రిమాండ్ విధించింది. నిందితులు సౌమ్యాద్రి, ముఖేష్, వికాస్‌లను కోవిడ్ పరీక్షల కోసం మచిలీపట్నం తరలించారు. అనంతరం విజయవాడ జిల్లా జైలుకు తరలించనున్నారు. చదవండి: దోపిడీలో స్కిల్.. బాబు గ్యాంగ్ హల్'షెల్' తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో జరిగిన కుంభకోణంపై సీఐడీ అధికారులు రెండో రోజూ దర్యాప్తు కొనసాగించారు. హైదరాబాద్‌తో పాటు పూణే, ముంబై, ఢిల్లీలోని షెల్ కంపెనీల రికార్డులను పరిశీలించి కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. ఈ కేసులో అప్పటి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ, సీఈవోగా వ్యవహరించిన గంటా సుబ్బారావు, డైరెక్టర్ కె.లక్ష్మీనారాయణలతో పాటు 26 మందిపై సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సంగతి తెలిసిందే. మరిన్ని కీలక ఆధారాలను సేకరించడం కోసం సీఐడీ దర్యాప్తును మరింత ముమ్మరం చేసింది. -
అగ్రిగోల్డ్ కేసు: నిందితులకు రిమాండ్
సాక్షి, హైదరాబాద్: అగ్రిగోల్డ్ కేసులోనిందితులకు ఈడీ కోర్టు 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. నిందితులను అధికారులు ఈడీ కోర్టులో మంగళవారం హాజరుపర్చారు. అనంతరం ఈ కేసులో నిందితులైన అవ్వాస్ వెంకట రామారావు, శేషు నారాయణ, వరప్రసాద్‌లను చంచల్‌గూడ జైలుకు తరలించారు. (చదవండి: రూ.4,109 కోట్ల అగ్రిగోల్డ్ ఆస్తుల జప్తు) కాగా.. ఏపీ, తెలంగాణ, కర్నాటకలో నమోదైన కేసుల ఆధారంగా ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ (ఈడీ) దర్యాప్తు ముమ్మరం చేస్తోంది. అగ్రిగోల్డ్ సుమారు 32 లక్షల మందిని రూ.6380 కోట్ల మోసానికి పాల్పడినట్టు ఈడీ అధికారులు పేర్కొన్నారు. రూ.942 కోట్ల డిపాజిటర్ల సొమ్మును ఇతర వ్యాపారాలకు అగ్రిగోల్డ్ మళ్లించినట్లు ఈడీ గుర్తించింది. గతంలో జరిపిన సోదాల్లో రూ.22 లక్షల నగదు, పలు కీలక డాక్యుమెంట్లను ఈడీ స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. (చదవండి: అగ్రి గోల్డ్ బాధితులకు తీపి కబురు) -
జేసీ ట్రావెల్స్ కేసు.. కీలక విషయాలు
సాక్షి, అనంతపురం: జేసీ ట్రావెల్స్ ఫోర్జరీ డాక్యుమెంట్ల కేసులో జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన తనయుడు జేసీ అస్మిత్ రెడ్డిలకు ఈ నెల 26 వరకు కోర్టు రిమాండ్ విధించింది. కస్టడీ గడువు ముగియడంతో శనివారం పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు. అనంతరం వారిని కడప జైలుకు తరలించారు. ఆదివారం వన్‌టౌన్‌లో సీఐ ప్రతాప్‌రెడ్డి దాదాపుగా 40 వాహనాలకు సంబంధిన రిజిస్ట్రేషన్లపై లోతుగా విచారణ చేపట్టారు.(జేసీ ట్రావెల్స్ అక్రమాల పుట్ట) పోలీసు కస్టడీలో తండ్రీకొడుకులు కీలక విషయాలు వెల్లడించినట్లు అనంతపురం డీఎస్పీ వీరరాఘవరెడ్డి పేర్కొన్నారు. బీఎస్-3 వాహనాలను ఎలా బీఎస్-4 గా మార్చి నాగాలాండ్ లో రిజిస్ట్రేషన్ చేయించారో ప్రశ్నించామని తెలిపారు. ఫోర్జరీ పత్రాలతో అక్రమంగా ఎలా రిజిస్ట్రేషన్ చేయించారు? నకిలీ పోలీసు క్లియరెన్స్ సర్టిఫికెట్లు ఎలా తయారు చేసి చలామణి చేశారన్న దానిపై చాలా వివరాలు రాబట్టామన్నారు. అన్ని ఆధారాలను కోర్టుకు సమర్పిస్తామని డీఎస్పీ తెలిపారు. (ఫోర్జరీ జేసీ.. వాహనాల కొనుగోల్‌మాల్) -
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణకు రిమాండ్
సాక్షి, గుంతకల్లు: రైల్ రోకో కేసులో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణకు వారం రోజుల రిమాండ్ విధిస్తూ గుంతకల్లు రైల్వేకోర్టు స్పెషల్ జ్యుడిషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ టి.వెంకటేశ్వర్లు తీర్పు చెప్పారు. రైతాంగ సమస్యలపై కేంద్రం మీద ఒత్తిడి తేవడానికి 2008 జూలై 7న అనంతపురం రైల్వేస్టేషన్లో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, కాటమయ్య, జాఫర్లు రైల్ రోకో చేశారు. ఈ ఘటనపై ఆర్పీఎఫ్ పోలీసులు రైల్వే యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేశారు. గుంతకల్లు రైల్వే కోర్టు స్పెషల్ జ్యుడిషియల్ ఫస్ట్‌క్లాస్ కోర్టులో తొమ్మిదేళ్ల పాటు విచారణ కొనసాగగా..2017లో కాటమయ్య, జాఫర్‌ల పేర్లను న్యాయస్థానం కొట్టివేసింది. కేసు వాదనలు జరుగుతున్న సమయంలో రామకృష్ణ కోర్టుకు సక్రమంగా హాజరు కాకపోవడంతో న్యాయమూర్తి 2017 జూన్ 15న నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. దాన్ని కూడా రామకృష్ణ తీసుకోలేదు. ఈ క్రమంలో బుధవారం రైల్వేకోర్టులో రామకృష్ణ హాజరయ్యారు. ఆయన నిర్లక్ష్య వైఖరికి వారం రోజుల పాటు రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. రామకృష్ణను అనంతపురం సబ్ జైలుకు తరలించారు. -
బాలికను వేధించిన వ్యక్తి రిమాండ్
మిరుదొడ్డి(దుబ్బాక) : మైనర్ బాలికను పెళ్లిపేరుతో వేధింపులకు గురి చేసిన వ్యక్తిని రిమాండ్‌కు తరలించినట్లు మిరుదొడ్డి ఎస్ఐ విజయ్ భాస్కర్ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ..మండల కేంద్రం మిరుదొడ్డిలో మన్నె శేఖర్(28) అనే వివాహితుడు అదే గ్రామానికి చెందిన మైనర్ బాలికను పెళ్లి చేసుకుంటానని కొంత కాలంగా వేధిస్తున్నాడు. బాలిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి శేఖర్‌ను రిమాండ్‌కు తరలించినట్లు ఎస్ఐ చెప్పారు. -
అంతర్ జిల్లా నేరస్తుడి అరెస్టు∙
అమలాపురం రూరల్: ముఖానికి ముసుగులతో ఓ ఇంట్లోకి చొరబడి... డ్రైవర్‌ను కత్తులతో బెదిరించి, నిర్బంధించి దోపిడీకి విఫలయత్నం చేసిన కేసులో నెల్లూరు జిల్లా బోగోలు మండలం తాళ్లూరు గ్రామానికి చెందిన 24 ఏళ్ల అంతర్ జిల్లాల నేరస్తుడు జొన్నలగడ్డ శ్రీనాథ్‌ను అమలాపురం రూరల్ సీఐ జి.దేవకుమార్ అరెస్ట్ చేశారు. స్థానిక రూరల్ పోలీసు సర్కిల్ కార్యాలయంలో అరెస్ట్ చేసిన నిందితుడు శ్రీనాథ్‌ను మంగళవారం విలేకర్ల ముందు ప్రవేశపెట్టారు. కేసు వివరాలను ఆయన వివరించారు. అమలాపురం రూరల్ మండలం బండార్లంక గ్రామంలో పేరి శంకరరావు ఇంట్లోకి గత మార్చి ఎనిమిదో తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత ఐదుగురు వ్యక్తులు ముఖాలకు ముసుగులు, చేతులకు గ్లౌజ్‌లు ధరించి మారణాయుధాలతో తలుపులు పగులగొట్టి ప్రవేశించారు. ఇంటి హాలులో నిద్రిస్తున్న డ్రైవర్ పీక నొక్కి...నిర్బంధించి ఇంట్లో ఎక్కడ బంగారు నగలు, డబ్బులు దాచారో చెప్పు అంటూ కత్తులు చూపి బెదిరించారు. ఇంతలో కంగారు పడ్డ డ్రైవర్ కేకలు వేయడంతో ఐదుగురు ముసుగు దొంగలు అక్కడి నుంచి పరారయ్యారు. ప్రస్తుతం అరెస్ట్ చేసిన శ్రీనాథ్ ఐదుగురు ముఠాలో ఒకడని సీఐ చెప్పారు. మిగిలిన నలుగురు సభ్యుల్లో ఒకడైన స్వగ్రామం అంబాజీపేట మండలం కె.పెదపూడి గ్రామం. శ్రీనాథ్ తమ ముఠాలోని సహచరుడైన కె.పెదపూడికి చెందిన వెంకటపతిరాజు అనే నానిని కలిసేందుకు సోమవారం ఆ గ్రామం వెళ్లాడు. అయితే నానితో పాటు మిగిలిన సహచరులైన, అంతర్ జిల్లాల చోరీ కేసుల్లో నేరస్తులైన కృష్ణంరాజు అనే రాజేష్, నడింపల్లి సుబ్బరాజు అనే మహేష్‌లను భారీ చోరీ కేసుల్లో రాజోలు పోలీసులు అరెస్ట్ చేశారని తెలుసుకున్నాడు. అక్కడి నుంచి తిరుగుముఖం పట్టి కె.పెదపూడి గ్రామంలోని రావులమ్మ అమ్మవారి గుడి వద్ద ఉన్న జొన్నలగడ్డ శ్రీనాథ్‌ను రూరల్ సీఐ దేవకుమార్ ముందస్తు సమాచారంతో మాటు వేసి తన సిబ్బంది, మధ్యవర్తుల సమక్షంలో పట్టుకున్నారు. ఈ కేసులో ఐదో నిందితుడైన నెల్లూరు జిల్లాకు చెందిన మారుబోయిన మాల్యాద్రి గురించి పోలీసు బృందాలు గాలిస్తున్నాయని సీఐ చెప్పారు. ఈ ఐదుగురు నిందితులు పలు జిల్లాల్లో చోరీలు చేయడం ప్రవృత్తి. వీరు పలు చోరీ కేసుల్లో అరెస్ట్ అయి సబ్ జైళ్లలో రిమాండు అనుభవిస్తున్నప్పుడు ఏర్పడిన స్నేహంతోనే కోనసీమలో పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడుతున్నారు. ఐదుగురిలో ముగ్గురిని రాజోలు పోలీసులు, ఒకడిని అమలాపురం రూరల్ పోలీసులు అరెస్ట్ చేయడంతో దాదాపు ఈ దొంగల ముఠాను నిరోధించినట్టయ్యింది. మిగిలిన ఐదో నిందితుడి కోసం నెల్లూరు జిల్లాకు పోలీసు బృందాలను పంపించారు. శ్రీనాథ్‌ను అరెస్ట్ చేయడంలో సహకరించిన అల్లవరం, అమలాపురం తాలూకా ఎస్సైలు ప్రశాంత్‌కుమార్, గజేంద్రకుమార్, క్రైం పార్టీ హెడ్ కానిస్టేబుల్ అయితాబత్తుల బాలకృష్ణ, కానిస్టేబుల్ లంకాడి శ్రీనులను సీఐ దేవకుమార్ అభినందించారు. -
కి‘లేడీ’ రిమాండ్
సిరిసిల్లక్రైం: ప్రయాణికుల నుంచి డబ్బులు, నగదు చోరీచేసిన మహిళను సిరిసిల్ల సీసీఎస్ పోలీసులు మంగళవారం రిమాండ్ చేశారు. ఏఎస్పీ రవీంద ర్ తెలిపిన ప్రకారం.. కృష్ణాజిల్లా ఆత్రేయపురంకు చెందిన తాటపట్టి నర్సమ్మ తన సోదరుడితో కలిసి సిరిసిల్ల, వేములవాడ బస్టాండుకు వచ్చిన ప్రయాణికుల నుంచి వస్తువులు, ఆభరణాలు, నగదు చోరీ చేసింది. ఏడేళ్లకాలంలో వీరు రూ. 1.78 లక్షలు, 15తులాల బంగారం అపహరించారు. డబ్బులను అవసరాలకు ఖర్చు చేశారు. బంగారాన్ని వేములవాడలోని వారుంటున్న ప్రదేశంలో భద్రంగా ఉంచారు. వాటిని అమ్ముకునేందుకు మంగళవారం స్వగ్రామం బయల్దేరారు. పక్కా సమాచారంతో సిరిసిల్ల పాత బస్టాండ్‌లో పోలీసులు అరెస్టు చేశారు. సమావేశంలో సీసీఎస్ సీఐ బన్సీలాల్ ఉన్నారు. -
మహిళను దూషించిన కేసులో హోంగార్డ్ రిమాండ్
రఘునాథపల్లి : తాగిన మైకంలో ఓ మహిళను దూషించిన ఘటనలో హోంగార్డ్‌పై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై రంజిత్‌రావు బుధవారం తెలిపారు. మండలంలోని మేకలగట్టు శివారు ఆంధ్రతండాకు చెందిన గుగులోతు సరోజకు అదే తండాకు చెందిన హోంగార్డ్ గుగులోతు బాలాజీ మధ్య కొనాళ్లుగా వివాదం కొనసాగుతోంది. బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో జాతీయ ఉపాధి హామీ పథకం శ్రమశక్తి సంఘాలతో నిర్వహించిన సమావేశంలో సరోజన పాల్గొంది. తాగిన మైకంలో ఉన్న బాలాజీ మండల పరిషత్ కార్యాలయం సమావేశ మందిరం వద్దకు వచ్చి ఫీల్డ్అసిస్టెంట్ శంకర్‌తో సరోజనను సమావేశానికి ఎందుకు తీసుకొచ్చావని వాగ్వాదానికి దిగాడు. అంతేగాక ఏపీఓ ప్రేమయ్యతో దురుసుగా ప్రవర్తించాడు. సరోజన భర్త పేరు తన పేరుగా ఎందుకు నమోదు చేసుకుందని రభస చేశాడు. అంతేగాక ఆమెను దుర్భాషలాడుతుండగా అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు బాలాజీని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై పేర్కొన్నారు. -
తండ్రిని హతమార్చిన తనయులకు రిమాండ్
రంగారెడ్డి: తాగి వచ్చి కుటుంబాన్ని వేధిస్తున్నాడని కన్న తండ్రిని గొంతు నులిమి హత్య చేసిన ఇద్దరు కొడుకులను పోలీసులు గురువారం రిమాండ్‌కు పంపారు. మహబూబ్‌నగర్‌లోని గోల్‌మజీద్ ప్రాంతానికి చెందిన ఎండీ.ఫయీమ్(55) ఐదేళ్ల కిందట కుటుబంతో కలిసి గండి గూడకు వలస వచ్చాడు. గ్రామ సమీపంలోని నందుగౌడ్‌కు చెందిన వ్యవసాయ క్షేత్రంలో పని చేసుకుంటూ భార్య, ఇద్దరు కొడుకులు, కూతురుతో కలిసి ఇక్కడే ఉంటున్నాడు. ఫయీం తరచూ తాగి వచ్చి కుటుంబాన్ని వేదిస్తుండేవాడు. ఆగస్టు 9న రాత్రి 8 గంటల సమయంలో తాగి వచ్చిన అతను ఇంట్లో గొడవ పడ్డాడు. దీంతో అతని కొడుకులు ఎండీ.అహ్మద్(25), ఎండీ.అల్తాఫ్(22) కలిసి తండ్రి గొంతును చున్నీతో గట్టిగా బిగించి చంపేశారు. అనంతరం మృతదేహాన్ని గోనే సంచిలో చుట్టి సమీపంలో ఉన్న గ్రాండ్ విల్లే వెంచరులోని గోల్ బావిలో పడేశారు. ఈ నెల 8న ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటనపై పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారించారు. గురువారం అహ్మద్, అల్తాఫ్‌ను రిమాండ్‌కు పంపారు. -
ఎమ్మెల్యే సండ్ర వీరయ్యకు 14 రోజుల రిమాండ్
-
అల్లుడే సూత్రధారి..!
వీడిన హత్యకేసు మిస్టరీ * కుటుంబ తగాదాలే కారణం * బంధువును పురమాయించి మట్టుబెట్టించిన వైనం * నిందితుల అరెస్ట్, రిమాండ్ నకిరేకల్: నకిరేకల్ మండలం కడపర్తి గ్రామంలో ఈ నెల 8వ తేదీన చోటుచేసుకున్న వెల్లెంల భిక్షమయ్య (60) హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. కుటుంబ తగాదాల నేపథ్యంలో అల్లుడే సూత్రధారిగా వ్యవహరించి మామను హత్య చేయించాడని పోలీసుల విచారణలో తేలింది. బుధవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో సీఐ శ్రీనివాసరావు నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. కారణాలు, హత్య జరి గిన తీరుతెన్నును వివరించారు. కడపర్తి గ్రామానికి చెందిన వెల్లెంల భిక్షమయ్యకు కుమారుడు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కుమారుడు గతంలోనే చనిపోయాడు. పెద్దకూతురు రజితను 2006లో తిప్పర్తి మండలం చిన్న సూరారం గ్రా మానికి చెందిన సువాల శ్రీనయ్యకు ఇచ్చి వివాహం జరిపించాడు. అయితే కొద్ది రోజులకే వారి ని ఇళ్లరికం తీసుకువచ్చాడు. తదనంతరం జరి గిన పరిణామాల నేపథ్యంలో శ్రీనయ్య భార్య ను వేధిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేశా రు. దీంతో అప్పటి నుంచి వారి మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. శ్రీనయ్యపై పెట్టిన వరకట్నం కేసులు కోర్టులో ఇప్పటికీ సాగుతున్నాయి. శ్రీన య్య ప్రస్తుతం జైళ్లోనే ఉన్నాడు. జైళ్లో నుంచే హత్యకు పన్నాగం..! తనను కటకటాల పాల్జేసిన మామ భిక్షమయ్యపై అల్లుడు శ్రీనయ్య కక్ష పెంచుకున్నాడు. అతడిని ఎలాగైనా మట్టుబెట్టాలని జైళ్లో నుంచే హత్యకు పన్నాగం పన్నాడు. ఇందుకు తన సమీ ప బంధువైన నల్లగొండ మండలం అక్కలయిగూడేనికి చెందిన మేడిపల్లి వెంకన్నను ఎంచుకున్నాడు. భిక్షమయ్యను హత్య చేయాలని పురమాయించాడు. ఇందుకు వెంకన్న, తన స్నేహితులైన కనగల్ మండలం జీ.చెన్నారం గ్రామానికి చెందిన ఆంజనేయులు, నల్లగొండలోని బొట్టుగూడకు చెందిన పర్వేజ్‌ను ఆశ్రయించా డు. ముగ్గురు కలిసి ఈ నెల 8వ తేదీన పల్సర్‌బైక్‌పై వచ్చి వ్యవసాయ క్షేత్రంలో నిద్రపోతున్న భిక్షమయ్యను కర్రలతో మోది హత్య చేశారు. బైక్‌నంబర్ ఆధారంగా.. భిక్షమయ్యను హత్య చేసిన నిందితులు పల్సర్‌బైక్‌పై పారిపోతుండగా కడపర్తి గ్రామస్తులు గమనించారు. ఆ వాహనం నంబర్‌ను పోలీసులకు తెలపగా దాని ఆధారంగా నిందితులను గుర్తించినట్టు సీఐ వివరించారు. ముగ్గురు నిందితులను వారి స్వగ్రామాల్లోనే అరెస్ట్ చేసినట్టు తెలిపారు. వారిని కోర్టులో హాజరుపర్చనున్నట్టు తెలిపారు. సమావేశంలో ఎస్ఐ ప్రసాదరావు, ఇతర సిబ్బంది ఉన్నారు. -
మాజీ సీఎంపై దాడి కేసులో మావోయిస్టుకు రిమాండ్
నెల్లూరు: మాజీ సీఎం నేదురుమల్లి జనార్థన్‌రెడ్డి కాన్వాయిపై దాడి కేసులో మావోయిస్టు నేత దీపక్ అలియాస్ వెంకటేశ్వరరావుకు మేజిస్ట్రేట్ ఆదివారం రిమాండ్ విధించారు. దీంతో దీపక్‌ను నెల్లూరు పోలీసులు స్థానిక సెంట్రల్ జైలుకు తరలించారు. ఓ కేసులో నిందితుడిగా కోల్కత్తా జైల్లో ఉన్న దీపక్‌ను పీటీ వారెంట్‌పై పోలీసులు నెల్లూరు తీసుకువచ్చారు. జిల్లాలోని కోట మేజిస్ట్రేట్ ముందు దీపక్‌ను ఈ రోజు పోలీసులు హాజరుపరిచారు. దీంతో అతడికి రిమాండ్ విధించారు. 2007 సెప్టెంబర్ మాసంలో శ్రీ వెంకటేశ్వర యూనివర్శిటీ అందజేసే డాక్టరేట్ అందుకునేందుకు నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి, ఆయన భార్య అప్పటి మంత్రి ఎన్.రాజ్యలక్ష్మి తమ కాన్వాయిలో వెళ్తున్నారు. ఆ సమయంలో వాకాడు సమీపంలో ఆయన క్వాన్వాయిని మావోయిస్టులు పేల్చివేశారు. ఆ పేలుడులో కారు డ్రైవర్‌తోపాటు మరో ఇద్దరు మరణించిన సంగతి తెలిసిందే.