
చైతన్యపురి: అలకానంద కిడ్నీ రాకెట్ కేసు(kidney racket case)లో మరొకరిని సరూర్‌నగర్ పోలీసులు అరెస్ట్ చేసి సోమవారం రిమాండ్‌కు తరలించిన ట్లు ఇన్‌స్పెక్టర్ సైదిరెడ్డి తెలిపారు. ఎలాంటి అనుమతులు లేకుండా కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ శస్త్ర చికిత్సలు చేసిన తమిళనాడుకు చెందిన పెరుమాళ్ల రాజశేఖర్(Surgeon Rajasekhar) (59)ను చెన్నై వెళ్లిన పోలీస్ బృందం అరెస్ట్ చేసి నగరానికి తీసుకొచ్చారు. కిడ్నీ రాకెట్ కేసులో 13వ నిందితుడుగా ఉన్న రాజశేఖర్ ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా మిలటరీ కాలనీకి చెందిన వ్యక్తి.
తమిళనాడులోని సవిత మెడికల్ కళాశాలలో విధులు నిర్వహిస్తున్నా రు. అలకానంద ఆస్పత్రి అక్రమ కిడ్నీ రాకెట్ వ్యవహారంలో శస్త్ర చికిత్సలు చేసిన ప్రధాన సర్జన్. ఆయన సుమారు 12 కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు చేసినట్లు పోలీసులు గుర్తించారు. అంతేకాక ఇదే ముఠా ఆధ్వర్యంలో జనని, అరుణ ఆస్పత్రుల్లో కూడా మరో 30కి పైగా కిడ్నీ మార్పిడి చేసినట్లు తెలిసింది.