సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో కిడ్నీ రాకెట్ కుంభకోణంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. అలకనందా ఆసుపత్రి యజమాని సుమన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం, డీహెచ్‌ఎంవో ఆసుపత్రికి సీజ్ చేశారు. ఈ క్రమంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నలుగురు పేషంట్స్‌ను గాంధీ ఆసుపత్రికి తరలించారు.
అలకనంద కిడ్నీ రాకెట్ కేసు విచారణను ప్రభుత్వం వేగవంతం చేసింది. ఇందులో భాగంగానే తాజాగా ఆసుపత్రి యజమాని సుమన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఉజ్బెకిస్థాన్ ఎంబీబీఎస్ సర్టిఫికెట్‌తో సుమన్ క్లీనిక్ అనుమతి పొందినట్టు పోలీసులు గుర్తించారు. అయితే, ఆసుపత్రిలో నెఫ్రాలజీ ట్రీట్‌మెంట్‌కు ఎలాంటి అనుమతి లేకపోవడం గమనార్హం. ఎంబీబీఎస్ సర్టిఫికెట్‌తో తొమ్మిది బెడ్స్‌కు క్లీనిక్‌కు అధికారులు అనుమతిచ్చారు. కానీ, అక్కడ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని సుమన్ నిర్వహిస్తున్నాడు. దీంతో, డీఎంహెచ్‌వో ఆసుపత్రిని సీజ్ చేశారు.
ఇదిలా ఉండగా.. ఇప్పటి వరకు ఈ కేసులో ఎనిమిది మంది బ్రోకర్స్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డాక్టర్ పవన్, మద్యవర్తి ప్రదీప్‌ను అరస్ట్ చేశారు. అలాగే, తమిళనాడుకు చెందిన నస్రీంభాను, ఫిర్ధోస్‌లను కిడ్నీ డోనర్లుగా గుర్తించారు. బెంగళూరుకు చెందిన రాజశేఖర్, బట్టు ప్రభకు కిడ్నీలు అమర్చిన వైద్యులు. ఈ క్రమంలో ఒక్కో ఆపరేషన్ 55లక్షల వసూలు చేశారు ఆసుపత్రి సిబ్బంది.
ఈ ఘటన తరువాత, రాష్ట్రవ్యాప్తంగా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఈ అంశంపై ప్రత్యేక సమావేశం నిర్వహించి, కిడ్నీ రాకెట్ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తును చేపట్టే ప్రక్రియలో ఉన్నారు. మరోవైపు.. సరూర్‌నగర్ అలకనంద హాస్పిటల్ కిడ్నీ రాకెట్ పై ప్రభుత్వం నిజానిర్దారణ కమిటీ వేసింది. ఈ కేసులో విచారణ వేగవంతం చేయడానికి ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కేసును సీఐడీకి బదిలీ చేసే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు మంత్రి దామోదర్ రాజనర్సింహ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment