kidney racket case
-
కిడ్నీ రాకెట్ కేసులో సర్జన్ రాజశేఖర్ రిమాండ్
చైతన్యపురి: అలకానంద కిడ్నీ రాకెట్ కేసు(kidney racket case)లో మరొకరిని సరూర్‌నగర్ పోలీసులు అరెస్ట్ చేసి సోమవారం రిమాండ్‌కు తరలించిన ట్లు ఇన్స్పెక్టర్ సైదిరెడ్డి తెలిపారు. ఎలాంటి అనుమతులు లేకుండా కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ శస్త్ర చికిత్సలు చేసిన తమిళనాడుకు చెందిన పెరుమాళ్ల రాజశేఖర్(Surgeon Rajasekhar) (59)ను చెన్నై వెళ్లిన పోలీస్ బృందం అరెస్ట్ చేసి నగరానికి తీసుకొచ్చారు. కిడ్నీ రాకెట్ కేసులో 13వ నిందితుడుగా ఉన్న రాజశేఖర్ ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా మిలటరీ కాలనీకి చెందిన వ్యక్తి.తమిళనాడులోని సవిత మెడికల్ కళాశాలలో విధులు నిర్వహిస్తున్నా రు. అలకానంద ఆస్పత్రి అక్రమ కిడ్నీ రాకెట్ వ్యవహారంలో శస్త్ర చికిత్సలు చేసిన ప్రధాన సర్జన్. ఆయన సుమారు 12 కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు చేసినట్లు పోలీసులు గుర్తించారు. అంతేకాక ఇదే ముఠా ఆధ్వర్యంలో జనని, అరుణ ఆస్పత్రుల్లో కూడా మరో 30కి పైగా కిడ్నీ మార్పిడి చేసినట్లు తెలిసింది. -
హైదరాబాద్ కిడ్నీ రాకెట్ కేసులో కీలక వ్యక్తి అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: కిడ్నీ రాకెట్ కేసులో కీలక వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. చెన్నైలో డాక్టర్ రాజశేఖర్‌ను అదుపులోకి తీసుకున్నారు. కిడ్నీ రాకెట్లో కీలకంగా వ్యవహరించాడని రాజశేఖర్‌పై అభియోగం ఉంది. కిడ్నీ రాకెట్‌పై సరూర్ నగర్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. రాజశేఖర్‌ను పోలీసులు హైదరాబాద్‌కు తరలించారు.కాగా, అలకనందా ఆసుపత్రి యజమాని సుమన్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అలకనంద కిడ్నీ రాకెట్ కేసు విచారణను ప్రభుత్వం వేగవంతం చేసింది. ఇందులో భాగంగానే తాజాగా ఆసుపత్రి యజమాని సుమన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఉజ్బెకిస్థాన్ ఎంబీబీఎస్ సర్టిఫికెట్తో సుమన్ క్లీనిక్ అనుమతి పొందినట్టు పోలీసులు గుర్తించారు.అయితే, ఆసుపత్రిలో నెఫ్రాలజీ ట్రీట్మెంట్కు ఎలాంటి అనుమతి లేకపోవడం గమనార్హం. ఎంబీబీఎస్ సర్టిఫికెట్తో తొమ్మిది బెడ్స్‌కు క్లీనిక్‌కు అధికారులు అనుమతిచ్చారు. కానీ, అక్కడ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని సుమన్ నిర్వహిస్తున్నాడు. దీంతో, డీఎంహెచ్‌వో ఆసుపత్రిని సీజ్ చేశారు. ఇదిలా ఉండగా.. ఇప్పటి వరకు ఈ కేసులో ఎనిమిది మంది బ్రోకర్స్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డాక్టర్ పవన్, మద్యవర్తి ప్రదీప్‌ను అరెస్ట్ చేశారు. అలాగే, తమిళనాడుకు చెందిన నస్రీంభాను, ఫిర్ధోస్‌లను కిడ్నీ డోనర్లుగా గుర్తించారు. బెంగళూరుకు చెందిన రాజశేఖర్, బట్టు ప్రభకు కిడ్నీలు అమర్చిన వైద్యులు. ఈ క్రమంలో ఒక్కో ఆపరేషన్ 55లక్షల వసూలు చేశారు ఆసుపత్రి సిబ్బంది.మరోవైపు, కిడ్నీ రాకెట్ కేసును తెలంగాణ ప్రభుత్వం సీఐడీకి అప్పగించింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాలు జారీ చేశారు. ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలన్నారు. కేసు పూర్వపరాలను సమీక్షించిన మంత్రి.. తమిళనాడు, కేరళ, కర్ణాటక ప్రభుత్వాలకు సమాచారం ఇవ్వాలని సూచించారు. -
సీఐడీకి హైదరాబాద్ కిడ్నీ రాకెట్ కేసు..
సాక్షి, హైదరాబాద్: కిడ్నీ రాకెట్ కేసును తెలంగాణ ప్రభుత్వం సీఐడీకి అప్పగించింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాలు జారీ చేశారు. ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలన్నారు. కేసు పూర్వపరాలను సమీక్షించిన మంత్రి.. తమిళనాడు, కేరళ, కర్ణాటక ప్రభుత్వాలకు సమాచారం ఇవ్వాలని సూచించారు.హైదరాబాద్‌లోని అలకనంద ఆసుపత్రిలో జరిగిన కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ వ్యవహారంపై ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ శుక్రవారం తన నివాసంలో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. డాక్టర్ల కమిటీ ఇచ్చిన ప్రిలిమినరీ రిపోర్ట్‌ను మంత్రి పరిశీలించారు. అలకనంద హాస్పిటల్లో ట్రాన్స్‌ప్లాంటేషన్ సర్జరీలకు ఎటువంటి అనుమతి లేదని, నిబంధనలకు విరుద్ధంగా సర్జరీలు జరిగాయని అధికారులు మంత్రికి వివరించారు.మన రాష్ట్రంతో పాటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన వ్యక్తులకు ఈ అక్రమ వ్యవహారంతో సంబంధం ఉందన్నారు. అమాయకులు, అత్యంత నిరుపేదల ఆర్థిక దుస్థితిని ఆసరాగా తీసుకుని, వారిని మభ్యపెట్టి కిడ్నీల డొనేషన్‌కు ఒప్పిస్తున్నారన్నారు. అలకనంద హాస్పిటల్లో తమిళనాడుకు చెందిన ఇద్దరు మహిళల నుంచి కిడ్నీలు తీసుకుని, కర్ణాటకకు చెందిన వారికి అమర్చారని అధికారులు తెలిపారు. అలకనంద ఆసుపత్రిని సీజ్ చేశామని, ఆసుపత్రి ఓనర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారని మంత్రికి తెలిపారు. ఈ కేసులో లోతైన విచారణ చేయాల్సిన అవసరం ఉందన్నారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఇలాంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలను సహించేది లేదన్నారు. ఈ వ్యవహారాన్ని చాలా సీరియస్‌గా పరిగణిస్తున్నామని తెలిపారు. కేసుతో సంబంధం ఉన్నవాళ్లందరిని కఠినంగా శిక్షించాలని, ఇందుకు అవసరమైన అన్ని ఆధారాలను సేకరించాలన్నారు. పూర్తిస్థాయి విచారణ కోసం కేసును సీఐడీకి అప్పగించాలని ఆదేశించారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను వెంటనే విడుదల చేయాలని హెల్త్ సెక్రటరీకి మంత్రి సూచించారు.ఇదీ చదవండి: మీర్పేట్ హత్య కేసులో సంచలన విషయాలు.. రెండు ఎవిడెన్స్ లభ్యం?కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ వ్యవహారం గురించి సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. గతంలో ఇలాంటి కేసు కేరళలో నమోదైన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. గతంలో జరిగిన వ్యవహారాలకు, ప్రస్తుత కేసుకు ఏమైనా సంబంధం ఉందా? అనే దానిపై ఆరా తీయాలన్నారు. ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అక్రమాలలో ప్రైవేట్ అంబులెన్స్ డ్రైవర్ల పాత్ర ఉన్నట్టు గతంలో వచ్చిన ఆరోపణలను గుర్తు చేసిన మంత్రి, ఆ దిశగా కూడా ఎంక్వైరీ జరిపించాలని ఆదేశించారు.ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రిల్లో జరుగుతున్న శస్త్ర చికిత్సలపై నిఘా ఉంచాలన్నారు. గర్భిణుల వివరాలను నమోదు చేస్తున్నట్టుగానే, ఇతర సర్జరీలకు సంబంధించిన వివరాలను నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆసుపత్రులకు అనుమతులు ఇచ్చేటప్పుడు, రిజిస్ట్రేషన్ రెన్యువల్ చేసేటప్పుడు అన్ని వివరాలను పూర్తి స్థాయిలో పరిశీలించాలని సూచించారు. అనుమతుల జారీలో నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై కఠిన చర్యలు ఉంటాయని ఆదేశించారు. ప్రైవేట్ ఆసుపత్రిలో జరుగుతున్న ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్లపై ఆడిట్ నిర్వహించాలని గతంలో మంత్రి ఆదేశాలు జారీ చేశారు. -
హైదరాబాద్ కిడ్నీ రాకెట్ ఇష్యూపై ప్రభుత్వం సీరియస్
-
అలకనంద కిడ్నీ రాకెట్.. క్లీనిక్ పర్మిషన్తో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో కిడ్నీ రాకెట్ కుంభకోణంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. అలకనందా ఆసుపత్రి యజమాని సుమన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం, డీహెచ్ఎంవో ఆసుపత్రికి సీజ్ చేశారు. ఈ క్రమంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నలుగురు పేషంట్స్‌ను గాంధీ ఆసుపత్రికి తరలించారు.అలకనంద కిడ్నీ రాకెట్ కేసు విచారణను ప్రభుత్వం వేగవంతం చేసింది. ఇందులో భాగంగానే తాజాగా ఆసుపత్రి యజమాని సుమన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఉజ్బెకిస్థాన్ ఎంబీబీఎస్ సర్టిఫికెట్తో సుమన్ క్లీనిక్ అనుమతి పొందినట్టు పోలీసులు గుర్తించారు. అయితే, ఆసుపత్రిలో నెఫ్రాలజీ ట్రీట్మెంట్కు ఎలాంటి అనుమతి లేకపోవడం గమనార్హం. ఎంబీబీఎస్ సర్టిఫికెట్తో తొమ్మిది బెడ్స్‌కు క్లీనిక్‌కు అధికారులు అనుమతిచ్చారు. కానీ, అక్కడ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని సుమన్ నిర్వహిస్తున్నాడు. దీంతో, డీఎంహెచ్‌వో ఆసుపత్రిని సీజ్ చేశారు.ఇదిలా ఉండగా.. ఇప్పటి వరకు ఈ కేసులో ఎనిమిది మంది బ్రోకర్స్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డాక్టర్ పవన్, మద్యవర్తి ప్రదీప్‌ను అరస్ట్ చేశారు. అలాగే, తమిళనాడుకు చెందిన నస్రీంభాను, ఫిర్ధోస్‌లను కిడ్నీ డోనర్లుగా గుర్తించారు. బెంగళూరుకు చెందిన రాజశేఖర్, బట్టు ప్రభకు కిడ్నీలు అమర్చిన వైద్యులు. ఈ క్రమంలో ఒక్కో ఆపరేషన్ 55లక్షల వసూలు చేశారు ఆసుపత్రి సిబ్బంది.ఈ ఘటన తరువాత, రాష్ట్రవ్యాప్తంగా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఈ అంశంపై ప్రత్యేక సమావేశం నిర్వహించి, కిడ్నీ రాకెట్ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తును చేపట్టే ప్రక్రియలో ఉన్నారు. మరోవైపు.. సరూర్‌నగర్ అలకనంద హాస్పిటల్ కిడ్నీ రాకెట్ పై ప్రభుత్వం నిజానిర్దారణ కమిటీ వేసింది. ఈ కేసులో విచారణ వేగవంతం చేయడానికి ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కేసును సీఐడీకి బదిలీ చేసే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు మంత్రి దామోదర్ రాజనర్సింహ వెల్లడించారు. -
కిడ్నీ రాకెట్ ఘటనలో కొత్త మలుపు
-
కిడ్నీ మార్పిడి కేసు: విశాఖ ఎన్ఆర్ఐ ఆసుపత్రికి బిగ్గుస్తున్న ఉచ్చు
సాక్షి, విశాఖపట్నం: కిడ్నీ మార్పిడి కేసులో విశాఖ ఎన్ఆర్ఐ ఆసుపత్రికి ఉచ్చు బిగుస్తోంది. ఈ కేసులో కీలక పాత్ర పోషించిన ఎన్ఆర్ఐ ఆసుపత్రి.. కిడ్నీ మార్పిడి చేస్తామని పది లక్షలు దోచేసి.. మొహం చాటేసింది.కిడ్నీ రాకెట్ కేసులో సీపీ దూకుడుగా వ్యవహరించారు. డీసీపీ-1ఆధ్వర్యంలో 8 మంది సిబ్బందితో విచారణకు సీపీ శంఖబ్రత బాగ్చీ స్పెషల్ టీం వేశారు. నేటి నుంచి కిడ్నీ రాకెట్ కేసులో విచారణ జోరు అందుకుంది. నిందితులు అరెస్టు చేసేందుకు రంగం సిద్ధమైంది. -
తన కిడ్నీని అమ్మాలనుకుని, చివరకు..
హైదరాబాద్: కేరళ నెడుంబస్సేరి కిడ్నీ రాకెట్ మూలాలు నగరంలో బయటపడడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ కేసులో తవ్వేకొద్దీ వెలుగుచూస్తున్నాయి. ఈ వ్యవహారంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురి ప్రముఖుల ప్రమేయం ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు బెల్లంకొండ రాంప్రసాద్ అలియాస్ ప్రతాపన్(41) విచారణ సందర్భంగా కీలక వివరాలను వెల్లడించినట్లు తెలుస్తోంది. అలాగే ఈ ముఠా ఏర్పడిన తీరు కూడా పోలీసులను ఆశ్చర్యపరిచింది.ఎర్నాకుళం రూరల్ ఎస్పీ వైభవ్ సక్సేనా వెల్లడించిన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడలో రియల్టర్ అయిన రాంప్రసాద్.. తన కిడ్నీని అమ్మాలని ప్రయత్నించాడు. అయితే అతనికి ఉన్న అనారోగ్యంతో అది వీలుకాలేదు. ఈలోపు ఇరాన్లో కిడ్నీ రాకెట్ నడిపించే మధుతో రాంప్రసాద్‌కు పరిచయం ఏర్పడింది. అప్పటికే మరో నిందితుడు సబిత్ కూడా తన కిడ్నీని అమ్మేశాడు. కిడ్నీ రాకెట్ ద్వారా మధు సంపాదన తెలిసి వీళ్లకూ ఆశపుట్టింది. అలా.. మధు ద్వారా రాంప్రసాద్, సబిత్.. ఇంకొందరు కలిసి ముఠాగా ఏర్పడ్డారు. రాంప్రసాద్ ఈ గ్యాంగ్‌కు లీడర్‌గా వ్యవహరించాడు. ఇరాన్‌తో పాటు కువైట్, శ్రీలంక కేంద్రాలుగా ఈ గ్యాంగ్ కిడ్నీ రాకెట్ వ్యవహారాన్ని నడిపించినట్లు దర్యప్తులో వెల్లడైంది. ఇక.. ఈ ముఠా దాదాపు 40 మందికిపైగా యువకులను ఇరాన్ తీసుకెళ్లి కిడ్నీలు అమ్మినట్లు వెల్లడైంది. పేద కుటుంబాలను లక్ష్యంగా చేసుకుని.. యువకులకు గాలం వేసేది ఈ గ్యాంగ్. ఆధార్ కార్డు, ఇతర డాక్యుమెంట్లతో ఫేక్ పాస్‌పోర్టులు తయారు చేసి ఇరాన్‌కు తీసుకెళ్లేది. అక్కడ వాళ్లను అనుమానం రాకుండా ఉండేందుకు అపార్ట్మెంట్లలో ఉంచేవాళ్లు. ఆ తర్వాత ప్రైవేట్ ఆస్పత్రులకు తీసుకెళ్లి కిడ్నీలను సేకరించేవాళ్లు. కిడ్నీ దాతలను గుర్తించేందుకు హైదరాబాద్, విజయవాడలలో తనకు పలువురు సహకరించారని, అందులో వైద్య రంగానికి చెందిన వారితోపాటు పలువురు రాజకీయ నాయకులు కూడా ఉన్నట్లు, ఇందుకోసం వారికి కొంత కమీషన్ కూడా ముట్టజెప్పానని రాంప్రసాద్ పోలీసుల విచారణలో వెల్లడించినట్లు సమాచారం.ఇక.. ఈ కేసులో పోలీసులు సైతం ఆశ్చర్యపోయే విషయం ఒకటి ఉంది. కిడ్నీ మార్పిడి చేయాలంటే రక్తం గ్రూపు నిర్ధారణ దగ్గర నుంచి అనేక పరీక్షలు నిర్వహించి, ఫలానా దాత కిడ్నీ ఫలానా గ్రహీతకు సరిపోతుందని నిపుణులైన వైద్యులు నిర్ధారణ చేయాల్సి ఉంటుంది. రాంప్రసాద్ పంపిన వారందరి కిడ్నీలు ఇరాన్లో ఎదురుచూస్తున్న వారందరికీ సరిగ్గా సరిపోయాయి. గ్రహీతల వైద్య పరీక్షల వివరాలను రాంప్రసాద్ ముందుగానే తెప్పించుకునేవాడని, కిడ్నీలు ఇవ్వడానికి సిద్ధమైనవారికి ఇక్కడున్న ల్యాబొరేటరీల్లో వైద్య పరీక్షలు నిర్వహించి, వారిలో ఎవరిది ఎవరికి సరిపోతుందో ముందుగానే నిర్ధారణకు వచ్చేవాడని పోలీసులు భావిస్తున్నారు. రాంప్రసాద్ వెల్లడించిన వివరాల ప్రకారం.. మరిన్ని అరెస్టులు ఈ కేసులో జరిగేలా తప్పడం లేదు. ఈ కేసులో అంతకు ముందే త్రిస్సూర్‌కు చెందిన సబిత్ నాజర్, కళామస్సేరికి చెందిన సాజిత్ శ్యామ్‌రాజ్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. సబిత్‌ను విచారణ చేపట్టాకే ఈ కేసు దర్యాప్తు ముందుకు సాగింది. ప్రస్తుతానికి ఈ గ్యాంగ్‌కు సంబంధించి భారత్‌లోని ముఠా సభ్యులందరినీ అరెస్ట్ చేసినట్లు కేరళ పోలీసులు వెల్లడించారు. ఇక అరెస్ట్ కావాల్సింది ఇరాన్లో రాకెట్ నడిపించిన మధు మాత్రమే. -
Hyd: కిడ్నీ రాకెట్.. 20 కాదు 40 లక్షలు!!
హైదరాబాద్, సాక్షి: కేరళలో వెలుగు చూసిన కిడ్నీ రాకెట్ ఉదంతం వెనుక నగర మూలాలు ఉండడం కలకలం రేపుతోంది. కీలక సూత్రధారులు ఇక్కడివాళ్లే అని.. ఓ ప్రముఖ డాక్టర్ సూత్రధారిగా కేరళ పోలీసులు నిర్ధారించుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. హైదరాబాద్ నుంచి వయా కొచ్చి టూ ఇరాన్ కేంద్రంగా నడిచిన ఈ కిడ్నీ రాకెట్ వివరాల్లోకి వెళ్తే.. కేరళ కొచ్చిలో తాజాగా ఓ యువకుడు అనారోగ్యంతో మృతి చెందాడు. అయితే కిడ్నీ దానం పేరిట మోసం జరిగిందని, ఒక ముఠా తమ కొడుకును బలిగొందని అతని కుటుంబ సభ్యులకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ చేపట్టిన కొచ్చి పోలీసులు సబీత్ అనే యువకుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. సబీత్ ఇచ్చిన సమాచారం ఆధారంగా కిడ్నీ రాకెట్ ముఠా గుట్టును చేధించారు. పేద యువకులను ఈ ముఠా లక్ష్యంగా చేసుకుని ఈ కిడ్నీ రాకెట్ నడిపిస్తోంది. ఒక్కో కిడ్నీకి రూ.20 లక్షలు ఇస్తామని ఆశజూపి.. ఇరాన్‌కు తీసుకెళ్తోంది. అక్కడ కిడ్నీలు తీసుకుని.. తిరిగి ఇండియాకు తీసుకొస్తోంది. తీరా ఇక్కడికి వచ్చాక కేవలం రూ. 6 లక్షలే ఇవ్వడంతో బాధితులు కంగుతింటున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే.. చంపేస్తామని బెదిరిస్తున్నారు. ఈ క్రమంలోనే కిడ్నీ ఇచ్చిన ఓ యువకుడు చనిపోవడంతో ఈ ముఠా అరాచకాలు వెలుగు చూశాయి. హైదరాబాద్ నుంచే.. ఈ కిడ్నీ రాకెట్ కీలక సూత్రధారులు హైదరాబాద్‌కు చెందిన వ్యక్తులుగా కేరళ పోలీసులు గుర్తించారు. ఇప్పటికే 40 మందికిపైగా యువకుల నుంచి కిడ్నీలు ఈ ముఠా సేకరించినట్లు నిర్ధారించుకున్నారు. అంతేకాదు నగరానికి చెందిన ఓ ప్రముఖ డాక్టర్ ఈ రాకెట్‌కు ప్రధాన సూత్రధారిగా గుర్తించిన కేరళ పోలీసులు.. ఆ వైద్యుడితో పాటు అతనికి సహకరించిన మరో ఇద్దరు వ్యక్తుల కోసం వెతుకుతున్నారు.20 కాదు 40 లక్షలు!కొచ్చి కిడ్నీ రాకెట్ వ్యవహారంలో దర్యాప్తు లోతుల్లోకి వెళ్లే కొద్దీ.. విస్తుపోయే విషయాలు తెలుస్తున్నాయి. హైదరాబాద్ నుంచి యువకుల్ని కొచ్చి తరలించి.. అక్కడి నుంచి ఇరాన్‌కు తీసుకెళ్లి కిడ్నీలు సేకరిస్తున్నట్లు ధృవీకరణ అయ్యింది. ఆపరేషన్ తర్వాత 20 రోజులకు దాతలకు ఇండియాకు తిరిగి తీసుకొచ్చారు. ఇక ఈ వ్యవహారంలో సబీత్ గ్యాంగ్.. కొచ్చి గ్యాంగ్‌తో ఒక్కో కిడ్నీకి మొత్తం రూ.40 లక్షలకు డీల్ కుదుర్చుకుంటోంది. అందులో సబీత్ గ్యాంగ్ రూ.20 లక్షలు, కొచ్చి గ్యాంగ్ రూ.10 లక్షలు.. డోనర్‌కు రూ.10 లక్షలుగా పంచుకుంటున్నారు. అయితే.. దాతలకు ఇవ్వాల్సిన డబ్బు విషయంలోనూ సబీత్ గ్యాంగ్ మోసం చేస్తూ వచ్చినట్లు తేలింది. ఇక.. హైదరాబాద్‌లోనే మకాం వేసిన కేరళ పోలీసులు.. ఇరాన్ వెళ్లిన బాధితులు ఎవరన్నదానిపై దృష్టిసారించారు. -
విశాఖ కిడ్నీ రాకెట్ కేసులో దర్యాప్తు వేగవంతం...
-
కిడ్నీ రాకెట్ కేసులో ఆరుగురు అరెస్టు
దొండపర్తి (విశాఖ దక్షిణ): విశాఖలో సంచలనం సృష్టించిన కిడ్నీ రాకెట్ కేసును పోలీసులు ఛేదించారు. ఇందులో దళారులుగా వ్యవహరించిన ఆరుగురిని పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. అసలు సూత్రధారితో పాటు సర్జరీ చేసిన ఇద్దరు వైద్యుల కోసం ప్రత్యేక బృందాల ద్వారా గాలిస్తున్నట్లు విశాఖ పోలీస్ కమిషనర్ త్రివిక్రమ్ వర్మ తెలిపారు. విశాఖ పోలీస్ సమావేశ మందిరంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. 2019లో మహారాణిపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో కిడ్నీ రాకెట్ నడిపి ఏ4గా అరెస్టై.. 40 రోజుల పాటు విశాఖ జైలులో ఉన్న నార్ల వెంకటేష్ తాజా వ్యవహారంలోనూ అసలు సూత్రధారి అని వివరించారు. ఇతడే మొత్తం రాకెట్‌ను నడిపించాడని పేర్కొన్నారు. డబ్బు ఆశ చూపి.. మధురవాడ వాంబే కాలనీకి చెందిన జి.వినయ్ కుమార్ ఒక సప్లయిస్ షాప్‌లో వెహికల్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన ఆటోడ్రైవర్ శ్రీను అనే వ్యక్తికి ప్రమాదం జరిగితే వినయ్ కుమార్ పరామర్శించడానికి వెళ్లాడు. అక్కడ అతడికి కామరాజు, ఎలీనా అనే వ్యక్తులను శ్రీను, అతడి భార్య కొండమ్మ పరిచయం చేశారు. మాటల సందర్భంలో కిడ్నీ ఇస్తే రూ.8.5 లక్షలు ఇస్తామని వారు వినయ్‌కుమార్‌కు చెప్పారు. డబ్బుకు ఆశపడి వినయ్‌కుమార్ కిడ్నీ ఇచ్చేందుకు అంగీకరించాడు. దీంతో అతడిని ఒక ల్యాబ్‌కు తీసుకువెళ్లి వైద్య పరీక్షలు చేయించారు. ఈ విషయం వినయ్‌కుమార్ తల్లిదండ్రులకు తెలియడంతో వారు వారించడంతో అతడు భయపడి హైదరాబాద్‌లో ఉంటున్న తన మేనత్త ఇంటికి వెళ్లిపోయాడు. ఈ నేపథ్యంలో కామరాజు ఫోన్ చేసి కిడ్నీ ఇవ్వకపోతే వైద్య పరీక్షలకు అయిన ఖర్చు రూ.50 వేలు ఇవ్వాలని, లేనిపక్షంలో ఇంట్లో సామానులు బయట పడేస్తానని వినయ్ కుమార్‌ను బెదిరించాడు. దీంతో అతడు కిడ్నీ ఇవ్వడానికి అంగీకరించాడు. హైదరాబాద్ నుంచి వినయ్ విశాఖ రాగానే పెందుర్తిలో ఉన్న తిరుమల ఆస్పత్రికి తీసుకువెళ్లి అతడి కిడ్నీ తొలగించారు. అనంతరం ఒప్పందం ప్రకారం రూ.8.5 లక్షలు ఇవ్వకపోగా.. రూ.5 లక్షలు ఇస్తున్నట్లు వీడియో రికార్డింగ్ చేసి అందులో రూ.2.5 లక్షలు నిందితులు తీసుకున్నారు. మూడు నెలలుగా వారి మధ్య డబ్బుల కోసం వివాదం నడిచింది. కామరాజు గ్యాంగ్ డబ్బులు ఇవ్వకపోవడంతో వినయ్‌కుమార్ పీఎంపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చక్రం తిప్పిన వెంకటేష్ 2019లో కిడ్నీ రాకెట్ వ్యవహారం నడిపిన నార్ల వెంకటేష్‌ది కడప. ఈ వ్యవహారంలో అతడు అప్పట్లో జైలు పాలయ్యాడు. ఆ తర్వాత జైలు నుంచి విడుదలయ్యాక కూడా ఇదే దందా నడుపుతున్నాడు. వెంకటేష్‌కు ఎలీనా, కామరాజు గ్యాంగ్‌తో పరిచయం ఉండడంతో వారి ద్వారా వినయ్‌కుమార్‌కు డబ్బు ఎరవేశాడు. అతడి కిడ్నీ తొలగించేందుకు ఆస్పత్రిని గుర్తించే బాధ్యతను తన స్నేహితులు రమేష్, పవన్‌లకు అప్పగించాడు. దీంతో వీరిద్దరూ పెందుర్తిలో ఉన్న తిరుమల ఆస్పత్రి డాక్టర్ పరమేశ్వరరావును సంప్రదించారు. సర్జరీ ఆపరేషన్ థియేటర్, వార్డు ఇస్తే రూ.60 వేలు ఇస్తామని చెప్పారు. ఆ ఆస్పత్రి ఆధునికీకరణకు అప్పటికే ఆ డాక్టర్ రూ.2.5 కోట్లు ఖర్చు చేసి కొంత ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు. ఒక రోజుకు రూ.60 వేలు వస్తుందని భావించి సర్జరీ చేసుకునేందుకు అంగీకరించారు. అన్నీ సమకూరాక వెంకటేష్ సర్జరీ చేసేందుకు వైద్యుల కోసం ప్రయత్నించాడు. ముందు కేర్ ఆస్పత్రి వారితో మాట్లాడినప్పటికీ వారు అంగీకరించలేదు. అయితే అందులో ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్ కోఆర్డినేటర్‌గా పనిచేస్తున్న సాయితో వెంకటేష్‌కు పరిచయముంది. దీంతో సాయికి ఈ విషయం చెప్పడంతో తనకు తెలిసిన వైద్యులు ఉన్నారని.. వెంకటేష్‌కు ఇద్దరు డాక్టర్లను పరిచయం చేశాడు. ఆ వైద్యులిద్దరూ సర్జరీ చేయడానికి అంగీకరించారు. ఈ క్రమంలో గత ఏడాది డిసెంబర్లో వినయ్‌కుమార్‌కు, ఈ ఏడాది ఫిబ్రవరిలో వాసుపల్లి శ్రీనివాస్ అనే వ్యక్తికి తిరుమల ఆస్పత్రిలోనే కిడ్నీ తొలగించినట్లు పోలీసులు తమ విచారణలో తెలుసుకున్నారు. వినయ్‌కుమార్ కిడ్నీని మరో రాష్ట్రానికి చెందిన చౌహాన్ అనే వ్యక్తికి ట్రాన్స్‌ప్లాంట్ చేసినట్లు గుర్తించారు. వెంకటేష్‌తో పాటు సర్జరీ చేసిన వైద్యుల కోసం కూడా పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. ఈ కేసులో ఎలీనా, కామరాజు, మర్రి శ్రీను, అతడి భార్య కొండమ్మతో పాటు ల్యాబ్ టెక్నీషియన్ శేఖర్, తిరుమల ఆస్పత్రి డాక్టర్ పరమేశ్వరరావును అరెస్ట్ చేసినట్లు తెలిపారు. వీరిపై 307, 326, 420, 120బీ సెక్షన్లతో పాటు అవయవాల మార్పిడి చట్టం ప్రకారం కేసులు నమోదు చేశామన్నారు. ఇంకెవరైనా బాధితులు ఉంటే వారి నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. విశాఖ కేంద్రంగా కిడ్నీ రాకెట్ నడుస్తోందన్న వార్తల్లో ఎటువంటి వాస్తవం లేదని పోలీస్ కమిషనర్ త్రివిక్రమ్ వర్మ తేల్చిచెప్పారు. -
కిడ్నీ రాకెట్ కేసును ఛేదించిన పోలీసులు.. ముగ్గురు అరెస్ట్
సాక్షి, విశాఖపట్నం: కిడ్నీ రాకెట్ కేసును వైజాగ్ పోలీసులు ఛేదించారు. కిడ్నీ రాకెట్ కేసుకు సంబంధించి పోలీసులు.. ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఇక, ఈ ముఠా.. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాలను టార్గెట్ చేసిన విషయం తెలిసిందే. కాగా, కిడ్నీ రాకెట్లో ఆపరేషన్ చేసిన డాక్టర్లపై పోలీసులు దృష్టిసారించినట్టు తెలిపారు. ఈ కేసులో ఇంకా అరెస్టులు పెరిగే అవకాశముందని పోలీసులు స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా.. కిడ్నీ రాకెట్ వ్యవహారాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. దీనిపై సమగ్ర దర్యాప్తు చేయాలని వైద్య, ఆరోగ్య శాఖను ఆదేశించింది. ప్రభుత్వ ఆదేశాలతో జిల్లా అధికారులు ఈ ఉదంతంపై విచారణ వేగవంతం చేశారు. దీనిపై జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులతోపాటు పోలీసులు కూడా సమగ్ర దర్యాప్తు చేపట్టారు. కాగా, పెందుర్తిలో కిడ్నీ మార్పిడి చేసిన తిరుమల ఆస్పత్రిపై జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ, జీవన్‌దాన్ అధికారులు, పోలీసులు దాడులు నిర్వహించారు. డబ్బు ఆశ చూపించి గత ఏడాది డిసెంబర్ 16వ తేదీన మధురవాడ వాంబే కాలనీకి చెందిన జి.వినయ్‌కుమార్‌కు పెందుర్తి తిరుమల ఆస్పత్రిలో కిడ్నీ తీసుకున్న విషయం తెలిసిందే. ఒప్పందం ప్రకారం రూ.8.50 లక్షలు ఇవ్వకుండా కేవలం రూ.2.50 లక్షలు ఇవ్వడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఆస్పత్రి సీజ్.. తిరుమల ఆసుపత్రిలో వైద్య సేవలు, సౌకర్యాలపై అధికారులు కలెక్టర్ మల్లికార్జునకు అధికారులు ప్రాథమిక నివేదికను అందజేయగా.. ఆస్పత్రిని సీజ్ చేయాలని ఆదేశించారు. దీంతో డీఎంహెచ్‌వో జగదీశ్వరరావు, పెందుర్తి తహసీల్దార్ సమక్షంలో ఆస్పత్రిని సీజ్ చేశారు. మోసం, మానవ అవయవాల మార్పిడి చట్టం 1995, ఐపీసీ 18, 19తో పాటు 420 ఆర్/డబ్ల్యూ 120(బీ) కింద కేసు నమోదు చేశారు. ఇది కూడా చదవండి: ఎన్టీఆర్ అభిమానులను బాధపట్టేలా రజనీకాంత్ మాట్లాడారు -
విశాఖలో కిడ్నీ రాకెట్ కలకలం..
సాక్షి, విశాఖపట్నం: విశాఖలో కిడ్నీ రాకెట్ వ్యవహారం కలకలం సృష్టించింది. కిడ్నీ రాకెట్‌పై విశాఖ కలెక్టర్ విచారణకు ఆదేశించారు. తిరుమల ఆసుపత్రి రిజిస్ట్రేషన్, అనుమతులపై ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలో కిడ్నీ మార్పిడి యూనిట్ లేకుండా పరీక్షలు చేస్తున్నట్టు గుర్తించారు. ఇక, ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఇప్పటికే డాక్టర్ పరమేశ్వరరావును అదుపులోకి తీసుకున్నారు. వివరాల ప్రకారం.. పెందుర్తిలో తిరుమల ఆసుపత్రి కేంద్రంగా కిడ్నీ రాకెట్ దందా కొనసాగుతోంది. ఈ కేసులో బాధితుడి నుంచి కిడ్నీకి రూ.8.5లక్షలకు ఒప్పందం చేసుకోగా రూ.2.5లక్షలు చెల్లించారు. విషయం బయటకు రావడంతో ఆసుపత్రి మూసివేసి యాజమాన్యం పరారైంది. మధ్యవర్తులు శ్రీను, కామారాజు, ఎలినా కోసం పోలీసులు గాలిస్తున్నట్టు తెలిపారు. కిడ్నీ రాకెట్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. -
కిడ్ని రాకెట్ కేసులో శ్రద్ధ ఆస్పత్రి సీజ్
-
కిడ్నీ రాకెట్ గుట్టు వీడేనా..?
సాక్షి, విశాఖపట్నం: విశాఖలో సంచలనం రేకెత్తించిన కిడ్నీ రాకెట్లో మంగళవారం మరో పరిణామం చోటు చేసుకుంది. ఈ వ్యవహారంలో అరెస్టయిన శ్రద్ధ ఆస్పత్రి అడ్మినిస్ట్రేటర్/ మేనేజర్ (హెచ్ఆర్) జె.కె.వర్మను పోలీసులు రెండు రోజుల కస్టడీకి తీసుకున్నారు. ఈ కేసులో ఇప్పటికే వర్మతో పాటు శ్రద్ధ ఆస్పత్రి నెఫ్రాలజీ వైద్యుడు డాక్టర్ దొడ్డి ప్రభాకర్, బెంగళూరుకు చెందిన బ్రోకర్, ఆయుర్వేద వైద్యుడు మంజునాథ్‌లను కూడా పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆస్పత్రి ఎండీ ప్రదీప్, కిడ్నీ మార్పిడి జరిగిన రోగి బీఎస్ ప్రభాకర్, అతని సోదరుడు వెంకటేశ్‌లను అరెస్టు చేయాల్సి ఉంది. వైద్యుడు ప్రభాకర్‌తో సత్సంబంధాలుండడమే గాక, కిడ్నీ రాకెట్ వ్యవహారంలో లావాదేవీలు నిర్వహించడంలోనూ వర్మ కీలకంగా వ్యవహరించినట్టు పోలీసులు గుర్తించారు. వర్మ వెల్లడించే సమాచారమే కీలకం శ్రద్ధ ఆస్పత్రిలో ఏటా 10 నుంచి 12 మూత్రపిండాల మార్పిడి శస్త్రచికిత్సలు జరుగుతున్నట్టు లెక్క తేల్చారు. ఒక్కో కిడ్నీ మార్పిడికి రూ.60 నుంచి రూ.70 లక్షలు వసూలు చేస్తున్నారు. అంటే ఏడాదికి ఏడెనిమిది కోట్ల రూపాయల మేర కిడ్నీల వ్యాపారం సాగిస్తున్నారన్న మాట! కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌కు సంబంధించి అవసరమైన పత్రాలు తయారు చేయడం, బ్రోకర్లతో మంతనాలు సాగించడం, కిడ్నీ ఇచ్చిన వారికిచ్చే సొమ్ముపై బేరసారాలు, సొమ్ము చెల్లింపులు వంటివన్నీ వర్మే చూసుకుంటారని ఇప్పటికే పోలీసులు నిర్థారణకు వచ్చారు. వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకుని కేసును దర్యాప్తు చేస్తున్న మహారాణిపేట పోలీసు అధికారులు తొలుత జేకే వర్మను కస్టడీకి ఇవ్వాలని కోరారు. కోర్టు అనుమతించడంతో మంగళవారం కస్టడీలోకి తీసుకున్నారు. రెండు రోజుల పాటు వర్మను విచారించనున్నారు. దీంతో ఈ కేసులో వర్మ ఇచ్చే సమాచారమే కీలకం కానుంది. అయితే రెండు రోజుల కస్టడీలో వర్మ పోలీసులకు కిడ్నీ గుట్టు విప్పుతాడా? లేదా? అన్నది తేలాల్సి ఉంది. వర్మ ఇచ్చిన సమాచారం ఆధారంగా ఇంకెవరిని కస్టడీకి తీసుకోవాలన్న దానిపై పోలీసులు నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం. మరోవైపు శ్రద్ధ ఆస్పత్రి ఎండీ ప్రదీప్ పరారీలో ఉన్నారు. సాక్షి పత్రికలో కిడ్నీ రాకెట్ కథనం ప్రచురితమైనప్పటి నుంచీ ఆయన పత్తా లేకుండా పోయారు. మహారాణిపేట పోలీసులు ప్రదీప్ కోసం గాలిస్తున్నారు. రెండో రోజు కమిటీ కసరత్తు మరోపక్క కిడ్నీ రాకెట్ వ్యవహారంపై నియమించిన త్రిసభ్య కమిటీ సభ్యులు రెండో రోజు దర్యాప్తులో భాగంగా కసరత్తు కొనసాగించారు. శ్రద్ధ ఆస్పత్రితో పాటు కిడ్నీ/అవయవ మార్పిడి అనుమతులు పొందిన ఆస్పత్రుల నుంచి ఏ సమాచారం రాబట్టాలన్న దానిపై ప్రశ్నావళిని రూపొందించారు. అవయవ/కిడ్నీ దాతలు ఎవరు? తీసుకున్నదెవరు? జీవన్‌దాన్‌లో బ్రెయిన్ డెడ్ అయిన వారి నుంచి ఎన్ని చేశారు? ఎన్టీఆర్ వైద్యసేవలో ఎన్ని మార్పిడిలు చేశారు? ఇందుకు సంబంధిత అథారిటీ నుంచి అనుమతులు తీసుకున్నారా? లేదా? వంటి ప్రశ్నలను అందులో పొందుపరిచారు. బుధవారం వీరు శ్రద్ధ ఆస్పత్రిని సందర్శించి మరిన్ని రికార్డులను తనిఖీ చేస్తారు. ఈ కేసును విచారిస్తున్న పోలీసు అధికారులను కూడా కలిసి వీరికి అవసరమైన సమాచారాన్ని తీసుకోనున్నారు. -
కిడ్నీ రాకెట్ కేస్‌లో త్రిసభ్య కమిటీ దర్యాప్తు ముమ్మరం
-
త్రిసభ్య కమిటీ చేతిలో ప్రాథమిక ఆధారాలు
సాక్షి, విశాఖపట్నం : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కిడ్నీ రాకెట్ కేస్‌లో త్రిసభ్య కమిటీ దర్యాప్తు ముమ్మరం చేసింది. రెండు రోజుల నుంచి విశాఖలోని శ్రద్ధ ఆస్పత్రిలో త్రిసభ్య కమిటీ తనిఖీలు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో కమిటీ కేసుకు సంబంధించిన ప్రాథమిక ఆధారాలను సేకరించినట్లు సమాచారం. దాంతో ఈ కేసులో ఆస్పత్రి యాజమాన్యంతో పాటు మరో డాక్టర్ని అదుపులోకి తీసుకునే వీలున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. పరారీలో ఉన్న మరికొంతమంది కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఐదు పోలీసు బృందాలు ఈ కేసు విచారణలో పాల్గొన్నట్లు అధికారులు వెల్లడించారు. సంబంధిత వీడియో కోసం క్లిక్ చేయండి : కిడ్నీ రాకెట్ కేస్‌లో త్రిసభ్య కమిటీ దర్యాప్తు ముమ్మరం -
విశాఖ కిడ్నీ రాకెట్ కేసు త్రిసభ్య కమిటీ
-
శ్రద్ధ ఆస్పత్రిని సందర్శించిన త్రిసభ్య కమిటీ
సాక్షి, విశాఖపట్నం : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కిడ్నీ రాకెట్ కేస్ విచారణకు ప్రభుత్వం త్రిసభ్య కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. కేజీహెచ్ సూపరిండెంట్ డాక్టర్ అర్జున్, జిల్లా కో ఆర్డినేటర్ డాక్టర్ నాయక్, డీఎం అండ్ హెచ్ఓ డాక్టర్ తిరుపతి రావులు కమిటీ సభ్యులుగా నియమితులయ్యారు. ఈ క్రమంలో కమిటీ సభ్యులు సోమవారం శ్రద్ధ ఆస్పత్రిని సందర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తాజా కేసు విచారణ పూర్తయిన తర్వాత ఇతర కేసులు గురించి కూడా విచారిస్తామన్నారు. వారం రోజుల్లోగా ఈ కేసుకు సంబంధించి కలెక్టర్‌కు పూర్తి నివేదిక ఇస్తామని పేర్కొన్నారు. కిడ్నీ రాకెట్ కేస్ విచారణలో భాగంగా పోలీసులు శ్రద్ధ ఆస్పత్రిపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పోలీసులు ఆస్పత్రి యాజమాన్యాన్ని విచారిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో ఆస్పత్రి హెచ్ఆర్ వర్మను అదుపులోకి తీసుకున్న పోలీసులు పరారీలో ఉన్న ఆస్పత్రి ఎండీ కోసం గాలిస్తున్నారు. సంబంధిత వీడియో కోసం క్లిక్ చేయండి : విశాఖ కిడ్నీ రాకెట్ కేసు త్రిసభ్య కమిటీ -
కిడ్నీ రాకెట్ కేసులో పాత్రదారులు అరెస్ట్
-
అన్నీ ప్రశ్నలే
కిడ్నీ రాకెట్ కథ కంచికి చేరినట్టేనా ? కలుగులో ఉన్న సూత్రధారులను వదిలి పైకి కనిపిస్తున్న పాత్రధారులను నిందితులుగా చిత్రీకరించే ప్రయత్నం జరిగిందా ? అనుమతి పత్రాలపై గుడ్డిగా సంతకాలు చేసిన రెవెన్యూ అధికారులను ఒడ్డున పడేస్తున్నారా ? 20 రోజుల విచారణలో ఎక్కడా వీరి ప్రస్తావన లేకపోవడానికి ఇదే కారణమా ? కిడ్నీ రాకెట్ కేసులో గురువారం నిందితులను మీడియా ముందుకు తీసుకొచ్చాక..ఇలా అనేక ప్రశ్నలు వారి వెనకే పోలీసుల తీరును వెక్కిరిస్తూ కనిపించాయి. ఈ వ్యవహారంలో ఇంకా వెలుగుచూడని అక్రమాల చిట్టాలు సశేషంగానే మిగిలిపోయాయి. సాక్షి, గుంటూరు: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన కిడ్నీ రాకెట్ కేసులో దర్యాప్తు చేసిన పోలీసులు వాటి మూలాలను కనిపెట్టలేకపోయారు. కిడ్నీ దానం చేసిన వ్యక్తులతోపాటు, అందుకు సహకరించిన దళారులు, ల్యాబ్ టెక్నీషియన్ల చుట్టూనే దర్యాప్తు సాగించారు. కానీ రెవెన్యూ అధికారులు, పెద్దల పాత్రపై ఆధారాలు సేకరించడంలో విఫలమయ్యారు. బాధ్యత మీదంటే మీది.. పోలీసులు 20 రోజులపాటు దర్యాప్తు జరిపి నలుగురు నిందితులను అరెస్టు చేసి చేతులు దులుపుకున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రెవెన్యూ అధికారుల పాత్రపై ఆ శాఖ ఉన్నతాధికారులకు నివేదిక అందిస్తామంటూ పోలీసులు చెబుతున్నారు. పోలీసు దర్యాప్తులో రెవెన్యూ సిబ్బంది పాత్ర తేలితే వారే శిక్షిస్తారంటూ ఆ శాఖ ఉన్నతాధికారులు చెబుతుండటం గమనించదగ్గ విషయం. రెండు నెలలు ఎందుకు దాచారు ? గత ఏడాది నవంబరు 20వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తహసీల్దారు చెబుతున్నారు. అప్పటి నుంచి రెండు నెలల పాటు అటు రెవెన్యూ అధికారులు, ఇటు పోలీసు అధికారులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు. వ్యవహారం బయటకు రావడంతో రెవెన్యూ, పోలీసు అధికారులు హడావుడి చర్యలకు పూనుకున్నారు. అసలు ఈ రెండు నెలల కాలం పోలీసులు ఏమి చేసినట్లు ? ఎందుకు కేసు విషయాన్ని బయటకు చెప్పలేదు ? అప్పట్లో ఎవరెవరిని విచారణ చేశారు ? గుడ్డిగా అనుమతుల పత్రంపై సంతకం చేసినందుకు తహసీల్దార్‌ను ఎందుకు ప్రశ్నించ లేదు ? వీటన్నింటికీ సమాధానం లేదు. ముందుగా డీల్ కుదిరిందా ? దుర్గి మండలం చంద్రకుంట తండాకు చెందిన వెంకటేశ్వరనాయక్ ఆధార్ కార్డును మార్ఫింగ్ చేసి అందులో రావూరి రవి పేరు, అడ్రస్ పెట్టారు. ముందుగా రెవెన్యూ అధికారులతో బేరం మాట్లాడుకున్న తరువాత మాత్రమే ఈ వ్యవహారం నడిచిందనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో రావూరి రవి పేరుతో దరఖాస్తు చేసిన వెంకటేశ్వర నాయక్ పదేళ్లుగా నరసరావుపేట పట్టణంలోని ప్రకాష్‌నగర్‌లో నివాసం ఉంటున్నట్లు వీఆర్వో, తహసీల్దారు, ఆర్డీవోలు ధ్రువీకరించారు. ఓ పోలీసు అధికారి మధ్యవర్తిత్వమే కారణమా ? వీఆర్వోకు దగ్గరి బంధువు అయిన ఓ పోలీసు అధికారి మధ్యవర్తిత్వం వహించి అటు పోలీసులకు, ఇటు రెవెన్యూ అధికారులకు ఇబ్బంది లేకుండా దర్యాప్తు చేయించారని సమాచారం. అధికార పార్టీ నేతలతో బలమైన సంబంధాలు ఉన్న కొందరు రెవెన్యూ అధికారులు తమపై చర్యలు లేకుండా చూడాలంటూ వారిని ఆశ్రయించినట్లు తెలిసింది. కిడ్నీ మార్పిడి ఏ విధంగా అనుమతి ఇస్తారు ? అనుమతులు తీసుకున్న తరువాత అదే వ్యక్తి కిడ్నీ దానం చేస్తున్నాడా ? లేదా ? మనుషులను మార్చేస్తున్నారా ? అనే దానిపై అటు వైద్య అధికారులుగానీ, పోలీసు అధికారులు గానీ దృష్టి సారించలేదు. -
ముల్లును ముల్లుతోనే..!
* టిట్ ఫర్ టాట్ సూత్రంతో కిడ్నీ రాకెట్ సూత్రధారి అరెస్ట్ * ఆన్లైన్ కిడ్నీ వ్యాపారుల గుట్టు ఆన్లైన్లోనే సేకరణ * కొరియర్ పేరిట వెళ్లి అదుపులోకి తీసుకున్న నల్లగొండ పోలీసులు * మరో కీలక ఏజెంట్‌ది మధ్యప్రదేశ్ సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ముల్లును ముల్లుతోనే తీయాలనే ఆలోచన.. టిట్ ఫర్ టాట్ సూత్రాన్ని కలగలిపి అంతర్జాతీయ కిడ్నీ రాకెట్‌ను ఛేదించారు నల్లగొండ పోలీసులు. దేశవ్యాప్తంగా 12కు పైగా రాష్ట్రాలతో సంబంధం ఉన్న ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చిన 20 రోజుల్లోపే రాకెట్ కీలక సూత్రధారిని పట్టుకున్న వీరు నేర పరిశోధనలో తాము ఎవరికీ తీసిపోమని నిరూపించారు. ఏడేళ్లుగా ‘ఆన్లైన్ ఇంటర్నెట్’ను ఆయుధంగా చేసుకుని కిడ్నీ మాఫియాను తయారు చేసిన జాతీయస్థాయి కీలక ఏజెంట్ గుజరాత్‌కు చెందిన సురేశ్ ప్రజాపతిని పట్టుకునేందుకు అదే ఆన్‌లైన్‌ను వినియోగించారు. అతనికి సహకరిస్తున్న దిలీప్ ఉమేద్‌మాల్ చౌహాన్‌ను అహ్మదాబాద్‌లో పోలీసులు పట్టుకున్నారు. ‘పాయింట్ బ్లాంక్’ అరెస్ట్ విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఈ రాకెట్ సూత్రధారి సురేశ్ ప్రజాపతిని అహ్మదాబాద్‌లోని అతడి ఇంటికే నేరుగా వెళ్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాస్తవానికి కిడ్నీ రాకెట్లో నల్లగొండకు చెందిన కస్పరాజు సురేశ్ తదితరులు అరెస్టయిన విషయం అప్పుడే ప్రజాపతికి తెలిసిపోయింది. దీంతో అతను అన్ని జాగ్రత్తలూ తీసుకున్నాడు. తాను ఆన్లైన్లో పెట్టిన నంబర్‌ను ఉపయోగించడం మానేశాడు. అహ్మదాబాద్‌లోని తన ఆఫీసును మూసేశాడు. కొన్నాళ్లు గుట్టుచప్పుడు కాకుండా ఉందామనే ఆలోచనతో తన సహచరులను కూడా అలర్ట్ చేశాడు. నల్లగొండ పోలీసులు ఆన్లైన్ సాయంతోనే ప్రజాపతి దగ్గరకు వెళ్లగలిగారు. ప్రజాపతి ఉపయోగించే ఫేస్బుక్ అకౌంట్లోకి ఓ నంబర్ సాయంతో ప్రవేశించి అతని ఫ్రెండ్స్ లిస్టును ట్రాప్ చేశారు. ఆ తర్వాత ఆ ఫ్రెండ్స్ లిస్టులో నుంచి ప్రజాపతి స్నేహితులను ఎంచుకుని వారిని సంప్రదించి అతడి గురించి ఆరా తీశారు. పూర్తి సమాచారం రాబట్టాక అహ్మదాబాద్‌కు వెళ్లి అక్కడ వల వేశారు. ప్రజాపతి ఉన్న ఇల్లును కనుగొన్నారు. అతడు ఇంట్లోనే ఉన్నాడని నిర్ధారించుకున్న తర్వాత అతను ఉపయోగించే ఐసీఐసీఐ బ్యాంకు నుంచి ఓ కొరియర్ వచ్చిందంటూ వెళ్లి డోర్ కొట్టారు. డోర్ తీసిన వెంటనే కొరియర్ వచ్చిందన్న విషయం చెప్పి మంచినీళ్లు కావాలని అడిగి ఇంటి లోపలికి వెళ్లిపోయారు. ఇంట్లో సురేశ్ ప్రజాపతి కనిపించడంతో అతడేనని నిర్ధారించుకుని అదుపులోకి తీసుకున్నారు. ఇక, కిడ్నీ రాకెట్లో మరో కీలక ఏజెంట్ దిలీప్‌ను కూడా ఆన్లైనే పట్టించింది. అహ్మదాబాద్‌కు చెందిన ఓ వ్యక్తిని ఎరగా వేసి దిలీప్‌ను పట్టుకున్నారు. ఓ స్థానికుడి ద్వారా ఆన్లైన్లో ఉన్న అతడి నంబర్‌కు ఫోన్ చేయించి కిడ్నీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని, ఫలానా దగ్గరకు రావాలని సమాచారం అందించారు. దిలీప్ వెంటనే ఆ వ్యక్తి చెప్పిన దగ్గరకు రావడం, అనూహ్యంగా పోలీసులు దిలీప్‌ను అదుపులోకి తీసుకోవడం వెంటనే జరిగిపోయాయి. ప్రజాపతిపైనే ప్రతాపం ఇంటర్నెట్ సాయంతో కిడ్నీ రాకెట్ గుట్టును ఛేదించిన నల్లగొండ పోలీసులకు మరో సవాల్ ఎదురు నిలుస్తోంది. పోలీసు విచారణలో ప్రజాపతి ఇచ్చిన సమాచారం మేరకు మరో కీలక నిందితుడు ఈ కేసులో అరెస్టు కావాల్సి ఉంది. అతడు మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌కు చెందిన వ్యక్తి అని సమాచారం. ఇత ను ప్రజాపతిని మించిన ఘనుడని తెలుస్తోంది.ఈ రాకెట్లో మరో ముఖ్య వ్యక్తిది మహారాష్ట్రలోని ముంబై. ఇతడు సురేశ్ ప్రజాపతికి రైట్‌హ్యాండ్. దక్షిణ భారత దేశం నుంచి ఎవరు వచ్చినా.. శ్రీలంక తీసుకెళ్లి కిడ్నీలు మార్పించేది ఇతడేనని సమాచారం. వీరిద్దరినీ అరెస్టు చేస్తే మరో 100 మంది వరకు కిడ్నీ విక్రేతలు, గ్రహీతలు బయటకు వస్తారని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. -
కిడ్నీ రాకెట్ గుట్టురట్టు
-
కిడ్నీ రాకెట్ కేసులో విశాఖ సెవెన్ హిల్స్ ఎండీ అరెస్ట్!
విశాఖ : సంచలనం సృష్టించిన ఒడిశా కిడ్నీ రాకెట్ కేసులో ప్రధాన సూత్రధారి ప్రభాకర్ బాబును కటక్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రభాకర్ బాబు విశాఖలోని సెవెన్స్ హిల్స్ ప్రయివేట్ ఆస్పత్రిలో ఎండీగా విధులు నిర్వహిస్తున్నారు. గత నాలుగు రోజులుగా కటక్ పోలీసులు ప్రబాకర్ బాబును అరెస్ట్ చేసేందుకు యత్నిస్తున్నారు. అయితే అనారోగ్యంగా ఉందంటూ ఆయన కేజీహెచ్‌లో చేరారు. మరోవైపు ఈ కిడ్నీ రాకెట్ కేసులో ప్రభాకర్ బాబును పోలీసులు A1గా చేర్చారు. కటక్ పోలీసులు అతడిని ఒడిశాకు తరలించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.