సాక్షి, విశాఖపట్నం: విశాఖలో కిడ్నీ రాకెట్ వ్యవహారం కలకలం సృష్టించింది. కిడ్నీ రాకెట్‌పై విశాఖ కలెక్టర్ విచారణకు ఆదేశించారు. తిరుమల ఆసుపత్రి రిజిస్ట్రేషన్, అనుమతులపై ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలో కిడ్నీ మార్పిడి యూనిట్ లేకుండా పరీక్షలు చేస్తున్నట్టు గుర్తించారు. ఇక, ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఇప్పటికే డాక్టర్ పరమేశ్వరరావును అదుపులోకి తీసుకున్నారు.
వివరాల ప్రకారం.. పెందుర్తిలో తిరుమల ఆసుపత్రి కేంద్రంగా కిడ్నీ రాకెట్ దందా కొనసాగుతోంది. ఈ కేసులో బాధితుడి నుంచి కిడ్నీకి రూ.8.5లక్షలకు ఒప్పందం చేసుకోగా రూ.2.5లక్షలు చెల్లించారు. విషయం బయటకు రావడంతో ఆసుపత్రి మూసివేసి యాజమాన్యం పరారైంది. మధ్యవర్తులు శ్రీను, కామారాజు, ఎలినా కోసం పోలీసులు గాలిస్తున్నట్టు తెలిపారు. కిడ్నీ రాకెట్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment