త్రిసభ్య కమిటీ చేతిలో ప్రాథమిక ఆధారాలు | Visakha Kidney Racket Case Primary Evidences With Three Members Committe | Sakshi
Sakshi News home page

యాజమాన్యం, డాక్టర్‌ చుట్టూ బిగుస్తోన్న ఉచ్చు

Published Tue, May 14 2019 12:37 PM | Last Updated on Tue, May 14 2019 4:11 PM

Visakha Kidney Racket Case Primary Evidences With Three Members Committe - Sakshi

సాక్షి, విశాఖపట్నం : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కిడ్నీ రాకెట్‌ కేస్‌లో త్రిసభ్య కమిటీ దర్యాప్తు ముమ్మరం చేసింది. రెండు రోజుల నుంచి విశాఖలోని శ్రద్ధ ఆస్పత్రిలో త్రిసభ్య కమిటీ తనిఖీలు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో కమిటీ కేసుకు సంబంధించిన ప్రాథమిక ఆధారాలను సేకరించినట్లు సమాచారం. దాంతో ఈ కేసులో ఆస్పత్రి యాజమాన్యంతో పాటు మరో డాక్టర్‌ని అదుపులోకి తీసుకునే వీలున్నట్లు తెలుస్తోంది.

ఈ కేసులో ఇప్పటికే ముగ్గురిని అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. పరారీలో ఉన్న మరికొంతమంది కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఐదు పోలీసు బృందాలు ఈ కేసు విచారణలో పాల్గొన్నట్లు అధికారులు వెల్లడించారు.

సంబంధిత వీడియో కోసం క్లిక్ చేయండి : 
కిడ్నీ రాకెట్‌ కేస్‌లో త్రిసభ్య కమిటీ దర్యాప్తు ముమ్మరం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement