
సాక్షి, విశాఖపట్నం : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కిడ్నీ రాకెట్ కేస్ విచారణకు ప్రభుత్వం త్రిసభ్య కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. కేజీహెచ్ సూపరిండెంట్ డాక్టర్ అర్జున్, జిల్లా కో ఆర్డినేటర్ డాక్టర్ నాయక్, డీఎం అండ్ హెచ్‌ఓ డాక్టర్ తిరుపతి రావులు కమిటీ సభ్యులుగా నియమితులయ్యారు. ఈ క్రమంలో కమిటీ సభ్యులు సోమవారం శ్రద్ధ ఆస్పత్రిని సందర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తాజా కేసు విచారణ పూర్తయిన తర్వాత ఇతర కేసులు గురించి కూడా విచారిస్తామన్నారు. వారం రోజుల్లోగా ఈ కేసుకు సంబంధించి కలెక్టర్‌కు పూర్తి నివేదిక ఇస్తామని పేర్కొన్నారు.
కిడ్నీ రాకెట్ కేస్ విచారణలో భాగంగా పోలీసులు శ్రద్ధ ఆస్పత్రిపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పోలీసులు ఆస్పత్రి యాజమాన్యాన్ని విచారిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో ఆస్పత్రి హెచ్‌ఆర్ వర్మను అదుపులోకి తీసుకున్న పోలీసులు పరారీలో ఉన్న ఆస్పత్రి ఎండీ కోసం గాలిస్తున్నారు.
సంబంధిత వీడియో కోసం క్లిక్ చేయండి :
విశాఖ కిడ్నీ రాకెట్ కేసు త్రిసభ్య కమిటీ
Comments
Please login to add a commentAdd a comment