Three member committee
-
ఏపీకి 21, తెలంగాణకు 92 టీఎంసీలు
సాక్షి, అమరావతి: ప్రస్తుత నీటి సంవత్సరంలో రెండు తెలుగు రాష్ట్రాలు వాడుకోగా మిగిలిన కోటా జలాల్లో ఆంధ్రప్రదేశ్‌కు 21, తెలంగాణకు 92 టీఎంసీలను కృష్ణా బోర్డు కేటాయించింది. శ్రీశైలం నీటి మట్టం అడుగంటినందున, నాగార్జున సాగర్ నుంచి రివర్స్ పంపింగ్ చేసిన జలాలను తాగు నీటి అవసరాలకు వాడుకోవాలని తెలంగాణకు సూచించింది. రబీలో సాగు నీరు, వర్షాకాలం ప్రారంభమయ్యే వరకు తాగు నీటి అవసరాలపై చర్చించేందుకు హైదరాబాద్‌లోని కృష్ణా బోర్డు కార్యాలయంలో గురువారం బోర్డు సభ్య కార్యదర్శి డీఎం రాయ్‌పురే అధ్యక్షతన త్రిసభ్య కమిటీ సమావేశమైంది. ఏపీ ఈఎన్సీ ప్రతినిధిగా కర్నూలు ప్రాజెక్టŠస్ సీఈ మురళీనాథ్‌రెడ్డి, తెలంగాణ ఈఎన్సీ మురళీధర్‌లు పాల్గొన్నారు. ప్రస్తుత నీటి సంవత్సరంలో కృష్ణాలో ఉన్న 953 టీఎంసీల్లో 629 టీఎంసీలు (66 శాతం) ఏపీకి, 324 టీఎంసీలు (34 శాతం) తెలంగాణకు దక్కుతాయని రాయ్‌పురే తేల్చారు. కృష్ణా జలాలు వృథాగా సముద్రంలో కలుస్తున్న సమయంలో రెండు రాష్ట్రాలు మళ్లించిన వరద జలాలను కోటా కింద లెక్కించకూడదంటూ ఏపీ సీఈ చేసిన ప్రతిపాదనపై తెలంగాణ ఈఎన్సీ అభ్యంతరం తెలిపారు. మళ్లించిన వరద జలాలను కోటా కింద లెక్కించాల్సిందేనని ఆయన చేసిన డిమాండ్‌కు రాయ్‌పురే అంగీకరించారు. మళ్లించిన వరద జలాలతో కలుపుకొని ఏపీ ఇప్పటిదాకా 608, తెలంగాణ 232 టీఎంసీలు వాడుకున్నట్లు బోర్డు తేల్చింది. శ్రీశైలం, నాగార్జునసాగర్‌లో ఉన్న 113 టీఎంసీల్లో ఏపీకి 21, తెలంగాణకు 92 టీఎంసీలను కేటాయించింది. అనుమతి లేని ప్రాజెక్టులు ఆపేయాలా? కృష్ణా బోర్డు గెజిట్ నోటిఫికేషన్ జారీ అయి ఆర్నెల్లు పూర్తయినందున, కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) నుంచి అనుమతి తెచ్చుకోని ప్రాజెక్టుల ద్వారా నీటి వినియోగాన్ని వచ్చే నీటి సంవత్సరం నుంచి ఆపేయాలని రాయ్‌పురే కోరారు. దీనిపై ఏపీ సీఈ మురళీనాథ్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. విభజన చట్టం 11వ షెడ్యూల్ ద్వారా ఏపీలోని హంద్రీ–నీవా, గాలేరు–నగరి, తెలుగుగంగ, వెలిగొండ, తెలంగాణలోని కల్వకుర్తి, నెట్టెంపాడు (సామర్థ్యం పెంచనివి) ప్రాజెక్టులను కేంద్రం ఆమోదించిందని, వాటికి మళ్లీ అనుమతి తెచ్చుకోవాల్సిన అవసరం లేదని స్పష్టంచేశారు. ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు చేసేదాకా గెజిట్ నోటిఫికేషన్‌ను అబయన్స్‌లో పెట్టాలని కేంద్ర జల్ శక్తి శాఖను కోరినట్లు తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ చెప్పారు. దీంతో ఈ అంశంపై బోర్డు సర్వ సభ్య సమావేశంలో చర్చిద్దామని రాయ్‌పురే చెప్పారు. మిగిలిన పది టీఎంసీలు ఏపీకి ఇవ్వండి నీటి సంవత్సరం ముగిసే మే 31 లోగా కోటా నీటిని వాడుకోవాలని, లేదంటే మిగిలిన నీటిపై రెండు రాష్ట్రాలకు హక్కు ఉంటుందని ఏపీ సీఈ మురళీనాథ్‌రెడ్డి స్పష్టం చేశారు. సాగు, తాగు నీటి అవసరాలకు 82 టీఎంసీలకు తెలంగాణ ప్రతిపాదన పంపినందున, ఆ రాష్ట్ర కోటాలో మిగిలిన 10 టీఎంసీలను తమకు కేటాయించాలని ఏపీ సీఈ కోరారు. దీనిపై తమ ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలంగాణ ఈఎన్సీ చెప్పారు. -
AP High Court: చట్టాలు చేయకుండా నిలువరించలేరు
సాక్షి, అమరావతి: చట్టాలు చేయకుండా ప్రభుత్వాన్ని నిలువరించలేరని, ఆ దిశగా కోర్టులు కూడా ఆదేశాలు ఇవ్వలేవని హైకోర్టు స్పష్టం చేసింది. మూడు రాజధానులపై చట్టం చేయకుండా ప్రభుత్వాన్ని నిలువరించాలంటూ పలువురు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఆ వాదనలపై స్పందించలేమని హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. మీ అందరి వాదనలు ప్రభుత్వాన్ని చట్టాలు చేయకుండా ముందే నిలువరించాలని కోరుతున్నట్లు ఉందని, అది ఎలా సాధ్యమని ప్రశ్నించింది. పాలన వికేంద్రీరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలను ఉపసంహరిస్తూ ప్రభుత్వం కొత్త చట్టం తీసుకొచ్చిన నేపథ్యంలో, ఈ వ్యవహారంపై ఇప్పటికే దాఖలైన వ్యాజ్యాల్లో మనుగడలో ఉన్న అభ్యర్థనలపై పిటిషనర్ల తరఫు న్యాయవాదుల వాదనలు ముగిశాయి. ప్రభుత్వం, సీఆర్డీఏ తదితరుల వాదనల నిమిత్తం విచారణను ఫిబ్రవరి 2కి ధర్మాసనం వాయిదా వేసింది. అప్పటి వరకు అమరావతిలో అభివృద్ధి కార్యకలాపాలకు గతంలో ఇచ్చిన యథాతథస్థితి (స్టేటస్కో) ఉత్తర్వులు అడ్డంకి కాదంటూ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను మరోసారి పొడిగించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, న్యాయమూర్తులు జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి, జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజుల త్రిసభ్య ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. చదవండి: (రాయలసీమ ప్రజలకు క్షమాపణలు: సోము వీర్రాజు) పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలను ఉపసంహరిస్తూ ప్రభుత్వం కొత్త చట్టాన్ని తెచ్చిన నేపథ్యంలో ఇప్పటికే దాఖలైన వ్యాజ్యాల్లో ఏ అభ్యర్థనలు మనుగడలో ఉంటాయి? ఏవి నిరర్థకమయ్యాయి తదితర వివరాలను పిటిషనర్ల తరఫు న్యాయవాదులు ధర్మాసనం ముందుంచారు. వాటి ఆధారంగా ధర్మాసనం విచారణను కొనసాగించింది. శుక్రవారం ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పిటిషనర్ల తరఫు న్యాయవాదుల వాదనలు విన్నది. మూడు రాజధానుల విషయంలో చట్టం చేసే అధికారం రాష్ట్రానికి లేదని, అలాంటప్పుడు ఉపసంహరణ అధికారమూ రాష్ట్రానికి ఉండదని వారు కోర్టుకు నివేదించారు. మళ్లీ చట్టాలు తీసుకొస్తామని ప్రభుత్వం చెబుతోందని, అలాంటి చట్టాలు తీసుకురాకుండా నియంత్రించాలని కోరారు. హైకోర్టులో విచారణను అడ్డుకునేందుకే ప్రభుత్వం కొత్త చట్టం తెచ్చిందన్నారు. ఇలా పలుమార్లు చేసిందని, ఓసారి ఏకంగా ప్రధాన న్యాయమూర్తి మీదనే ఫిర్యాదు చేసిందని పిటిషనర్ల తరఫు న్యాయవాదుల్లో ఒకరైన ఉన్నం మురళీ ధరరావు వాదించారు. దీనిపై ప్రభుత్వం తరఫున హాజరవుతున్న అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ తీవ్ర అభ్యంతరం తెలిపారు. కేసుతో సంబంధం లేనివి, పిటిషన్లలో ప్రస్తావించని విషయాలపై వాదనలు వినిపిస్తున్నారంటూ అభ్యం తరం వ్యక్తంచేశారు. అందరి వాదనలు విన్న ధర్మా సనం తదుపరి విచారణను వాయిదా వేసింది. -
Disha Encounter: ముగిసిన సజ్జనార్ విచారణ.. అడిగిన ప్రశ్నలివే..
హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘దిశ’హత్యాచార నిందితుల ఎన్కౌంటర్ అంశానికి సంబంధించి వరుసగా రెండో రోజు విచారణకు వీసీ సజ్జనార్ హాజరయ్యారు. అత్యాచార నిందితుల ఎన్కౌంటర్ జరిగినప్పుడు సజ్జనార్ సీపీగా పని చేసి చేశారు. దాంతో సజ్జనార్ విచారణకు హాజరుకావడం అనివార్యమైంది. సుప్రీంకోర్టు నియమించిన ముగ్గురు సభ్యులతో కూడిన జస్టిస్ వీఎస్ సిర్పుర్కర్ కమిషన్ విచారిస్తోంది. సజ్జనార్‌పై కమిషన్ ప్రశ్నల వర్షం కురిపిస్తుస్తోంది. సీన్ రీకన్స్ట్రక్షన్ సమాచారం మీకు ముందే ఉందా అని కమిషన్ ప్రశ్నించింది. డీసీపీ శంషాబాద్ చెబితే తనకు తెలిసిందని సజ్జనార్ సమాధాన ఇచ్చారు.సంఘటన జరిగిన తర్వాత నిందితులను పట్టుకున్న అంశాలను కమిషన్ లేవనెత్తింది. కమిషన్ అడిగిన ప్రశ్నకు సజ్జనార్ సమాధానాలు చెబుతున్నారు. దిశ కమిషన్ ముందు వీసీ సజ్జనార్ విచారణ ముగిసింది. చదవండి: సీజ్ చేసిన.. తుపాకులెలా వాడారు? కమిషన్: ఎన్కౌంటర్ జరిగిన విషయం మీకు ఏ సమయానికి తెలిసింది? సజ్జనార్: డిసెంబర్ 6 ఉదయం ఆరు గంటల 20 నిమిషాలకు తెలిసింది. కమిషన్: ఎన్ కౌంటర్‌పై ఎఫ్ఐర్ నమోదు ఎంక్వైరీ చేశారా ? సజ్జనార్: శంషాబాద్ డీసిపి కి ఎఫ్ ఐ ఆర్ చేయమని చెప్పాను. కమిషన్: ఎన్కౌంటర్ స్పాట్ కి ఏ టైం లో చేరుకున్నారు? సజ్జనార్: ఉదయం 8:30 గంటలకు స్పాట్ కు చేరుకున్నాను. కమిషన్: ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశంలో ఇంచార్జ్ ఆఫీసర్ ఎవరు? సజ్జనార్: షాద్‌నగర్ సీఐ శ్రీధర్ ఇంచార్జీ. కమిషన్: ఎన్కౌంటర్ స్పాట్‌కు రీచ్ అయ్యాక ఎవరెవరిని కలిశారు? సజ్జనార్:ఏసిపి సురేందర్‌ను కలిశాను. సజ్జనార్:పోస్టుమార్టం గురించి డీఎంఈకి సమాచారం అందించాను. కమిషన్: ఇంక్వెస్ట్‌ను ఎవరి సమక్షంలో చేశారు. సజ్జనార్:తెలంగాణలో ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ ముందు ఇంక్వెస్ట్ చేస్తారు. సజ్జనార్: పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ వర్సెస్ మహారాష్ట్ర కేస్ తీర్పు ప్రకారం ఇంక్వెస్ట్ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ ముందే జరగాలి. కమిషన్: ఇంక్వెస్ట్ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ ముందు చేయమని ఎవరు చెప్పారు? కమిషన్: ఎన్కౌంటర్ జరిగిన సమయంలో మీతో పాటు ఎంత మంది సీనియర్ అధికారులు ఉన్నారు? కమిషన్: సీన రీ కన్స్ట్రక్షన్ కి వెళ్లేటప్పుడు పోలీసులతో ఆయుధాలు ఉన్నాయా? కమిషన్: ఎంత మంది పోలీసులు వెపన్స్ క్యారీ చేశారు? ఎన్కౌంటర్ జరిగిన రోజు సజ్జనార్ మాట్లాడిన క్లిప్లింగ్‌ను రెండు భాషల్లో ప్లే చేశారు. సజ్జనార్: పోలీసుల నుండి నిందితులు వెపన్స్ లాక్కున్నారు. కమిషన్: వెపన్స్ ఎందుకు అన్‌లాక్ చేశారు? సజ్జనార్: వెపన్స్ అన్‌లాక్ చేయలేదు. కమిషన్: మీడియా సమావేశంలో వెపన్స్ అన్ లాక్ చేసినట్టు ఉంది? కమిషన్:ప్రెస్ మీట్ సమయానికి బాధితురాలి వస్తువులు రికవరీ కాకపోయినా ఎందుకు రికవరీ చేశామని చెప్పారు? కమిషన్:వెపన్స్ రికవరీ కాకుండా, పోస్ట్ మార్టం పూర్తి కాకుండా ప్రెస్ మీట్ ఎందుకు పెట్టారు? సజ్జనార్: డిసిపి శంషాబాద్ పెట్టమంటే ప్రెస్ మీట్ పెట్టాను. కమిషన్: ఘటన జరిగిన సమయంలో ఎన్ని గంటలు స్పాట్లో ఉన్నారు? సజ్జనార్: గంటన్నర గంటలపాటు ఉన్నాను. కమిషన్: 2008 వరంగల్ ఎన్కౌంటర్, 2016 నక్సలైట్ల ఎన్కౌంటర్, 2019 దిశ కేస్ కౌంటర్ లలో ఒకటే రకమైన విధానం కనిపిస్తుంది. మీ హయంలోనే ఇలా జరిగింది. సజ్జనార్: వరంగల్ ఎన్కౌంటర్ సమయంలో నేను ఎస్పీ గా ఉన్నాను, 2016 లో నేను లా అండ్ ఆర్డర్ లో లేను అని సమాధాన ఇచ్చారు. కమిషన్: మిమ్మల్ని ఎన్కౌంటర్ స్పెషలిస్ట్‌గా మీడియా అభివర్ణించింది. మీరు ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అని ఒప్పుకుంటారా? సజ్జనార్: నేను అంగీకరించను. కమిషన్: ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అంటే ఏమిటి? సజ్జనార్: నాకు తెలియదు. కమిషన్: మీరు ప్రతీది డీసీపీ చెప్తేనే తెలిసింది అంటున్నారు. డీసీపీపై నే ఆధార పడతారా? సజ్జనార్: గ్రౌండ్ లెవెల్ లో ఆఫీసర్ లకు. పూర్తి సమాచారం ఉంటుంది. వారికి నేను ఫ్రీ హ్యాండ్ ఇస్తాను. కమిషన్: దిశ అత్యాచారం జరిగిన రోజు ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో ఎందుకు నిర్లక్ష్యం వహించారు? సజ్జనార్: మిస్సింగ్ కంప్లైంట్ రాగానే బాధితురాలి కోసం వెతకడం లో కొంత సమయం డిలే అయ్యింది. కమిషన్: ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో నిర్లక్ష్యం వహించిన పోలీసులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు? సజ్జనార్: ఎఐఆర్ నమోదు చేయడంలో అలసత్వం వహించిన నలుగురు పోలీస్ సిబ్బంది పైన సస్పెన్షన్ విధించాం. కమిషన్: ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో విచారణ ముగియకముందే మీడియా సమావేశం ఎలా పెట్టారు. మీడియా సమావేశం ఏర్పాటు చేయడం వల్లే విచారణ సరిగా చేయలేకపోయాము అని సాక్షులు చెప్పారు. సజ్జనార్: ఎన్ కౌంటర్ స్పాట్‌కి 300 మీటర్ల దూరంలో విచారణకు ఆటంకం కలగకుండా వీడియో సమావేశం ఏర్పాటు చేశాం. కమిషన్: సమావేశం కోసం కుర్చీలు, టేబుల్లు తదితర సామగ్రిని అంత తక్కువ సమయం లో ఎక్కడి నుండి తెచ్చారు? సజ్జనార్: షాద్ నగర్ పోలీసులు సమగ్రి నీ తీసుకొచ్చారు. ఎక్కడి నుంచి సామాగ్రిని తీసుకొచ్చారో నాకు తెలియదు. ఆ ఘటన జరిగి రెండు సంవత్సరాలు అయ్యింది నాకు గుర్తు లేదు అని సజ్జనార్ సమాధానమిచ్చారు. దీంతో సజ్జనార్ విచారణ పూర్తయ్యింది. -
నేడు దిశ కమిషన్ ముందుకు సజ్జనార్
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘దిశ’హత్యాచార నిందితుల ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టు నియమించిన ముగ్గురు సభ్యులతో కూడిన జస్టిస్ వీఎస్ సిర్పుర్కర్ కమిషన్ విచారణ, రెండురోజుల విరామం తర్వాత సోమవారం పునఃప్రారంభం కానుంది. దిశ హత్యాచారం జరిగిన సమయంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌గా ఉన్న వీసీ సజ్జనార్‌ను తొలిసారిగా త్రిసభ్య కమిటీ విచారించనుంది. ప్రస్తుతం ఆర్టీసీ ఎండీగా ఉన్న సజ్జనార్‌కు కమిషన్ ఇప్పటికే సమన్లు జారీ చేసింది. ఆయన్ను సుదీర్ఘంగా మూడురోజుల పాటు విచారించే అవకాశమున్నట్లు తెలిసింది. సుమారు 30 ప్రశ్నలను సంధించనున్నట్లు సమాచారం. దిశ హత్యాచార నిందితులను సీన్–రీకన్‌స్ట్రక్షన్‌కు తీసుకెళ్లే సమయంలో హాజరైన రెండో సాక్షి. ఫరూక్నగర్ అదనపు రెవెన్యూ ఇన్స్పెక్టర్ అబ్దుల్ రహుఫ్ విచారణ సోమవారం ఉదయం ఉంటుంది. ఆ తర్వాత మధ్యాహ్నం సమయంలో సజ్జనార్ హాజరయ్యే అవకాశముందని ఇండిపెండెంట్ కౌన్సిల్ అడ్వకేట్ పీవీ కృష్ణమాచారి ‘సాక్షి’కి తెలిపారు. -
5న కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ భేటీ
సాక్షి, హైదరాబాద్: రెండు రాష్ట్రాల్లో రబీ సాగునీటి అవసరాలు, వేసవిలో తాగునీటి అవసరాలపై చర్చించి లభ్యత ఆధారంగా ఇరు రాష్ట్రాలకు నీటిని కేటాయించాలని కృష్ణా బోర్డు నిర్ణయించింది. ఈ మేరకు ఈ నెల 5వ తేదీన హైదరాబాద్‌లో బోర్డు సభ్య కార్యదర్శి డీఎం రాయ్‌పురే నేతృత్వంలో ఏపీ, తెలంగాణ ఈఎన్సీలు సి.నారాయణరెడ్డి, మురళీధర్ సభ్యులుగా ఏర్పాటైన త్రిసభ్య కమిటీ సమావేశం నిర్వహించనున్నట్లు ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలకు మంగళవారం కృష్ణా బోర్డు చైర్మన్ ఎ.పరమేశం లేఖ రాశారు. కృష్ణా నదికి ఈ ఏడాది భారీ ఎత్తున వరదలు రావడంతో ఇరు రాష్ట్రాలు అవసరమైన మేర నీటిని వినియోగించుకోవాలని ఇరు రాష్ట్రాలకు కృష్ణా బోర్డు సూచించింది. వరద ప్రవాహం తగ్గాక వాడుకున్న నీటి లెక్కలు తేల్చి, ఆ తర్వాత అవసరాలను బట్టి కేటాయిస్తామని పేర్కొంది. ప్రస్తుతం నీటి సంవత్సరం ప్రారంభంలోనే నీటి లెక్కలు తేల్చేందుకు బోర్డు సిద్ధమైంది. ఈ క్రమంలో ప్రస్తుత నీటి సంవత్సరంలో గత నెల 31 వరకు వినియోగించుకున్న నీటి లెక్కలు, వచ్చే మార్చి 31 వరకు సాగు, తాగునీటి అవసరాలు చెప్పాలని ఇటీవల రాష్ట్రాల ఈఎన్సీలను బోర్డు కోరింది. ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌లో నీటి లభ్యత, ఇరు రాష్ట్రాలు ఇప్పటిదాకా వినియోగించుకున్న నీరు ఆధారంగా మిగిలిన వాటా జలాలను కమిటీ కేటాయించనుంది. -
కిడ్నీ రాకెట్ కేస్‌లో త్రిసభ్య కమిటీ దర్యాప్తు ముమ్మరం
-
విశాఖ కిడ్నీ రాకెట్ కేసు త్రిసభ్య కమిటీ
-
శ్రద్ధ ఆస్పత్రిని సందర్శించిన త్రిసభ్య కమిటీ
సాక్షి, విశాఖపట్నం : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కిడ్నీ రాకెట్ కేస్ విచారణకు ప్రభుత్వం త్రిసభ్య కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. కేజీహెచ్ సూపరిండెంట్ డాక్టర్ అర్జున్, జిల్లా కో ఆర్డినేటర్ డాక్టర్ నాయక్, డీఎం అండ్ హెచ్ఓ డాక్టర్ తిరుపతి రావులు కమిటీ సభ్యులుగా నియమితులయ్యారు. ఈ క్రమంలో కమిటీ సభ్యులు సోమవారం శ్రద్ధ ఆస్పత్రిని సందర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తాజా కేసు విచారణ పూర్తయిన తర్వాత ఇతర కేసులు గురించి కూడా విచారిస్తామన్నారు. వారం రోజుల్లోగా ఈ కేసుకు సంబంధించి కలెక్టర్‌కు పూర్తి నివేదిక ఇస్తామని పేర్కొన్నారు. కిడ్నీ రాకెట్ కేస్ విచారణలో భాగంగా పోలీసులు శ్రద్ధ ఆస్పత్రిపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పోలీసులు ఆస్పత్రి యాజమాన్యాన్ని విచారిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో ఆస్పత్రి హెచ్ఆర్ వర్మను అదుపులోకి తీసుకున్న పోలీసులు పరారీలో ఉన్న ఆస్పత్రి ఎండీ కోసం గాలిస్తున్నారు. సంబంధిత వీడియో కోసం క్లిక్ చేయండి : విశాఖ కిడ్నీ రాకెట్ కేసు త్రిసభ్య కమిటీ -
ఇంటర్ ఫలితాల్లో కొన్ని తప్పులు దొర్లాయి..
సాక్షి, హైదరాబాద్ : ఇంటర్మీడియెట్ ఫలితాల్లో తప్పులు దొర్లాయని తెలంగాణ విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి అంగీకరించారు. ఇంటర్ ఫలితాల్లో తప్పిదాలపై ఏర్పాటైన త్రిసభ్య కమిటీ నివేదికను శనివారం ప్రభుత్వానికి సమర్పించిన సంగతి తెలిసిందే. ఆ నివేదికపై విద్యాశాఖ కార్యదర్శి జనార్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘ఇంటర్ బోర్డు తీసుకున్న నిర్ణయాలు బాగున్నా, వాటి అమలులో ఫెయిల్ అయ్యారు. ఫలితాలు వెల్లడి చేయడంలో కొన్ని తప్పులు జరిగాయి. రిజల్ట్స్ వచ్చిన రెండు, మూడు గంటల్లోనే తప్పు జరిగిందని బోర్డు దృష్టికి వచ్చింది. కోడింగ్ సరిగా జరగకపోవడం వల్లే విద్యార్థుల హాజరు విషయంలో పొరపాట్లు జరిగాయి. ఓఎమ్మార్ షీట్లలో బబ్లింగ్ చేసే సమయంలో కూడా కొన్ని మానవ తప్పిదాలు జరిగాయి. ఫలితాల ముందు డేటా అనాలసిస్ చేసి ఉంటే బాగుండేది. సర్వర్ సామర్థ్యం పెంచమని త్రిసభ్య కమిటీ సూచించింది. ఇక గ్లోబరినా ఏజెన్సీకి ఎలాంటి డబ్బులు చెల్లించలేదు. విద్యార్థుల ఆందోళనకు కారణమైనవారిపై చర్యలు తీసుకుంటాం. 531 మంది జాగ్రఫీ విద్యార్థుల మెమోలో ప్రాక్టికల్స్ మార్కులు కనిపించలేదు. చివరి నిమిషంలో సెంటర్ మార్పుల వల్ల కొన్ని తప్పులు జరిగాయి. ఉత్తీర్ణత శాతంలో తేడాలు లేవని కమిటీ గుర్తించింది. ఫెయిల్ అయిన విద్యార్థుల జవాబు పత్రాలను రీవాల్యుయేషన్ చేయాలని ప్రభుత్వానికి త్రిసభ్య కమిటీ సిఫార్సు చేసింది. సాఫ్ట్వేర్ లోపాలు ఉండటంతో కోడింగ్, డీ కోడింగ్ సమస్యలు వచ్చాయి. గతంలో కూడా ఇంటర్ ఫలితాల్లో తప్పిదాలు దొర్లాయి. వాటిని సరిచేసాం. ఈ తప్పులు ఊహించనవి కాదు. ప్రతి సంవత్సరంలాగే ఈసారి జరిగాయి. ఫెయిల్ అయని విద్యార్థులకు రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ సదుపాయం ఉచితంగా ఇస్తాం. విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా ఇకపై మానవ తప్పిదాలు లేకుండా చూసుకుంటాం. అందరి సందేహాలు తొలగించేందుకు కమిటీ తెలిపిన ఆరు సూచనలను అమలు చేస్తాం.’ అని తెలిపారు. -
నేడు కృష్ణా త్రిసభ్య కమిటీ భేటీ
సాక్షి, హైదరాబాద్: కృష్ణా బేసిన్‌లోని నాగా ర్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల్లో లభ్యతగా ఉన్న నీటి పంపకాలపై చర్చించేందుకు కృష్ణా నది బోర్డు త్రిసభ్య కమిటీ బుధ వారం భేటీ కానుంది. జలసౌధలో జరిగే ఈ భేటీకి బోర్డు సభ్య కార్యదర్శి సమీర్ ఛటర్జీతో పాటు ఇరు రాష్ట్రాల ఈఎన్సీలు మురళీధర్, వెంకటేశ్వర్రావు హాజరు కాను న్నారు. భేటీలో ప్రధానంగా సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల్లో లభ్యతగా ఉన్న జలాల పంపిణీ పై చర్చ జరగనుంది. సాగర్‌లో 502 అడుగులు, శ్రీశైలం లో 775 అడుగుల వరకు నీటిని ఇరు రాష్ట్రాలు తీసుకోవాల్సి ఉంది. ఈ మట్టాల వద్ద ప్రస్తుతం 2 నుంచి 3 టీఎంసీల నీరు మాత్రమే ఉండటం, ఆ నీరంతా ఏపీకే దక్కనుండటంతో తెలంగా ణ తన అవసరాల కోసం రెండు ప్రాజెక్టులో మరింత దిగువకు వెళ్లే అవకాశం ఇవ్వాలని కోరుతోంది. సాగర్‌లో 500 అడుగులు, శ్రీశైలంలో 765 అడుగుల మట్టం వరకు వెళ్లేందుకు అవకాశం ఇస్తే హైదరాబాద్, నల్లగొండ తాగునీటి అవసరాలు తీరుతా యని చెబుతోంది. నల్లగొండకు 2.25 టీఎంసీ, హైదరాబాద్‌కు 2 టీఎంసీలు ఇవ్వాలని ఇటీవలే విన్నవించింది. దీనిపైనా కమిటీ నిర్ణయం తీసుకోవాల్సిఉంది. దీంతో పాటే టెలీమెట్రీ పరికరాలపైనా చర్చ జరగనుంది. మొదటి విడతలో 18 పాయిం ట్లలో చాలా చోట్ల రాష్ట్రంలో పనులు పూర్త యినా ఏపీలో పూర్తవలేదు. రెండో విడతలో మరో 28 చోట్ల ఏర్పాటు చేయాల్సిఉన్నా, ఏపీ అభ్యంతరం వ్యక్తం చేసిన 17 పాయింట్లపైనా చర్చించనున్నారు. -
'జానీమూన్ నా కూతురు లాంటిది'
-
'జానీమూన్ నా కూతురు లాంటిది'
జిల్లా పరిషత్ చైర్పర్సన్ జానీమూన్, మంత్రి రావెల కిషోర్‌బాబు మధ్య సయోధ్య కుదిరింది. ఈ వివాదంపై చంద్రబాబు నియమించిన త్రిసభ్య కమిటీ ఎదుట జానీమూన్, రావెల ఇద్దరూ హాజరయ్యారు. అనంతరం ఇద్దరూ కలిసి మీడియాతో మాట్లాడారు. తమ ఇంటి మీదకు వచ్చిన రౌడీలు మంత్రికి తెలియకుండానే వచ్చారని, ఈ విషయంలో తానే తొందర పడ్డానని జానీమూన్ అన్నారు. తమ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారన్నారు. మైనారిటీలు తనకు అండగా నిలిచారని, వారందరికీ కృతజ్ఞతలని చెప్పారు. ఇక జడ్పీ చైర్పర్సన్ జానీమూన్ తనకు కూతురు లాంటిదని, తాను రాష్ట్ర, జాతీయ రాజకీయాల్లో బిజీగా ఉండటంతో స్థానిక రాజకీయాలను పట్టించుకోలేదని రావెల కిషోర్ బాబు చెప్పారు. వీటిపై తనకు అంతగా అవగాహన లేదని, నియోజకవర్గంలో పర్యటించకపోవడం వల్ల తమ మధ్య అంతరం ఏర్పడిందని అన్నారు. ఐదు నిమిషాలు కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలన్నీ పరిష్కారం అయ్యాయని తెలిపారు. తనకు తెలియకుండా కొన్ని జరిగి ఉండొచ్చని, అలాంటివి మళ్లీ జరగకుండా చూసుకుంటానని హామీ ఇచ్చారు. -
రావెల-జానీమూన్ వివాదంపై త్రిసభ్య కమిటీ
గుంటూరు: ఏపీ సాంఘిక, గిరిజన సంక్షేమశాఖ మంత్రి రావెల కిశోర్‌బాబు, గుంటూరు జిల్లా పరిషత్ చైర్పర్సన్ షేక్ జానీమూన్ల మధ్య చోటు చేసుకున్న వివాదంపై త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశారు. తనను రావెల హత్య చేయించేందుకు యత్నించారంటూ జానీ మూన్ ఆరోపించడంతో దానిపై ఏపీ ప్రభుత్వం స్పందించింది. ఈ మేరకు చినరాజప్ప, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, జీవీ ఆంజనేయులుతో కూడిన త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేస్తూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. దీనిలో భాగంగా ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలంటూ కళా వెంకట్రావును చంద్రబాబు ఆదేశించారు. సాంఘిక, గిరిజన సంక్షేమశాఖ మంత్రి రావెల కిశోర్‌బాబుతో తనకు ప్రాణహాని ఉందని గుంటూరు జిల్లా పరిషత్ చైర్పర్సన్ షేక్ జానీమూన్ భయాందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ప్రత్తిపాడు నియోజకవర్గంలో మంత్రి రావెల సహాయ నిరాకరణ ధోరణి అవలంబిస్తున్నారని, తాను చేసిన సిఫార్సులను బుట్టదాఖలు చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇదేమని అడిగితే.. మీ అంతు చూస్తాను అం టూ బెదిరించారని, తన మనుషులను ఇంటి కి పంపి బెదిరింపు చర్యలకు పాల్పడుతున్నా రంటూ విలేకరుల ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. -
వేల మంది కార్మికులు రోడ్డున పడ్డారు
-
విజయనగరంలో వైఎస్ఆర్ సీపీ త్రిసభ్య కమిటీ పర్యటన
విజయనగరం : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయనగరం జిల్లా విస్తృత స్థాయి సమావేశం గురువారమిక్కడ ప్రారంభమైంది. ప్రభుత్వ ప్రజా వ్యతి రేక విధానాలు ఎండగడుతూ, సర్కార్ మోసపూరిత తీరును ప్రజలకు వివరిస్తూ, వారికి చేదోడు వాదోడుగా ఉంటూ ...ఆ దిశగా శ్రేణులను మరింత సమాయత్తపరిచేందుకు పార్టీ త్రిసభ్య కమిటీ నేడు జిల్లాకు వచ్చింది. ఈ సందర్భంగా వైఎస్ఆర్ సీపీ త్రిసభ్య కమిటీ సభ్యులు విజయ సాయిరెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ప్రసాదరాజు...జిల్లా నేతలు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. పార్టీ భవిష్యత్ కార్యక్రమాలు... గ్రామస్థాయిలో పార్టీని పటిష్టం చేయటం, ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టడం వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఈ సమావేశానికి బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, వైఎస్ఆర్ సీపీ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు గౌతంరెడ్డి, ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున, మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు రోజా, విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు సలాంబాబు, వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు సుజయకృష్ణ రంగారావు, రాజన్నదొర, పుష్పశ్రీవాణి, నియోజకవర్గాల కన్వీనర్లు, కార్యకర్తలు హాజరయ్యారు. -
27 నుంచి వైఎస్సార్ సీపీ జిల్లాల వారీ సమీక్షలు
ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాల్లో ముగ్గురు సభ్యుల కమిటీ పర్యటనలు సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సంస్థాగత వ్యవహారాల పర్యవేక్షణకు నియమించిన ముగ్గురు సభ్యుల కమిటీ ఈ నెల 27వ తేదీ నుంచి తిరిగి జిల్లా పర్యటనలు చేపట్టనుంది. కమిటీ సభ్యులు వి.విజయసాయిరెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, సాగి దుర్గాప్రసాదరాజులు వరుసగా ఐదు రోజుల పాటు ఐదు జిల్లాల్లో పర్యటిస్తారని పార్టీ ఒక ప్రకటనలో తెలియజేసింది. పార్టీ జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, సంబంధిత జిల్లా ఇన్చార్జిలు, ఆయా జిల్లాలకు చెందిన పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు జిల్లాలో పార్టీ నేతలందరూ ఈ సమావేశాలకు హాజరవుతారు. గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్‌లతో పార్టీలో కీలకంగా పనిచేసే నేతలందరిని సమావేశాలకు ఆహ్వానిస్తారు. పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు రోజా, సేవాదళ్ విభాగం అధ్యక్షుడు చెవిరెడ్డి భాస్కరరెడ్డి, యువజన విభాగం అధ్యక్షుడు వంగవీటి రాధా, బీసీ సెల్ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాసు, రైతు విభాగం అధ్యక్షుడు నాగిరెడ్డి, కార్మిక విభాగం అధ్యక్షుడు గౌతంరెడ్డి, ఎస్సీ సెల్ విభాగం అధ్యక్షుడు మేరుగ నాగార్జున, న్యాయవిభాగం అధ్యక్షుడు పి.సుధాకర్‌రెడ్డి, ఎస్టీ విభాగం అధ్యక్షుడు బాలరాజు, విద్యార్థి విభాగం అధ్యక్షుడు సలాంబాబు, పార్టీ కార్యదర్శి చల్లా మధుసూదన్‌రెడ్డిలు ఈ సమావేశాలకు ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరవుతారు. పార్టీ విద్యార్థి విభాగాలకు నియామకాలు నెల్లూరు, చిత్తూరు, పశ్చిమగోదావరి జిల్లాలకు చెందిన పలువురు విద్యార్థులను పార్టీ రాష్ట్ర విద్యార్థి విభాగంలో నియమిస్తూ పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి సోమవారం నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎల్.డేవిడ్ (పశ్చిమగోదావరి), రాష్ట్ర కార్యదర్శులుగా ఎల్.రాజశేఖరరెడ్డి (చిత్తూరు), ఆవుల తులసీరాంయాదవ్ (నెల్లూరు), కె.కృష్ణస్వరూప్, డి.నవహర్ష (పశ్చిమగోదావరి)లను నియమించారు. రాష్ట్ర ఉప కార్యదర్శులు ఎస్.చక్రధర్ (చిత్తూరు), ఎస్.హాజీ, బి.శివశంకర్ గుప్తా (నెల్లూరు)లను.. కార్యవర్గ సభ్యులుగా ఇ.హేమంత్‌యాదవ్ (చిత్తూరు), జి.మహేష్‌రెడ్డి (నెల్లూరు) లను నియమించారు. -
29 నుంచి ఎన్నికలపై వైఎస్సార్సీపీ సమీక్షలు
13 జిల్లాలకు త్రిసభ్య కమిటీల ఏర్పాటు హైదరాబాద్: ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ నెల 29 నుంచి నాలుగు రోజులపాటు సమీక్షలు చేపట్టనుంది. సీమాంధ్రలోని 13 జిల్లా కేంద్రాల్లో ఈ సమీక్షలు విడివిడిగా జరుగుతాయి. సమీక్షా సమావేశాల నిర్వహణకు ఒక్కొక్క జిల్లాకు విడివిడిగా అనుభవజ్ఞులైన నేతలతో త్రిసభ్య కమిటీలను ఏర్పాటు చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో ఆయా జిల్లాల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు, ఓటములకు దారితీసిన పరిస్థితులపై ఈ సందర్భంగా లోతైన అధ్యయనం, విశ్లేషణ జరుగుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి. లోక్‌సభ, శాసనసభ నియోజకవర్గాల్లో పార్టీ తరపున పోటీ చేసిన అభ్యర్థులు, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రధానంగా ఈ సమీక్షా సమావేశాల్లో పాల్గొంటున్నారు. ఈ నెల 29వ తేదీన నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, వైఎస్సార్ కడప , 30న కృష్ణా, అనంతపురం, 31న కర్నూలు, విజయనగరం, శ్రీకాకుళం, జూన్ 1వ తేదీన తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, గుంటూరు, విశాఖపట్టణం జిల్లాల్లో సమీక్షలు జరుగుతాయి. ఈ మేరకు ఆయా జిల్లాలకు వర్తమానం పంపారు. -
భక్తుల ఆందోళనపై త్రిసభ్య కమిటీ:బాపిరాజు
వైకుంఠ ఏకాదశ పర్వదినం సందర్భంగా తిరుమలలో చోటు చేసుకున్న ఘటనపై పరిశీలించేందుకు త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు టీటీడీ ఛైర్మన్ కనుమూరి బాపిరాజు వెల్లడించారు. శుక్రవారం తిరుమలలో బాపిరాజు మీడియాతో మాట్లాడుతూ... తిరుమలలో దళారీ వ్యవస్థను రూపుమాపేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నట్లు తెలిపారు. అయితే వైకుంఠ ఏకాదశ సందర్భంగా వీఐపీ టికెట్ల జారీలో జరిగిన అవకతవకలపై కమిటీ వేసి విచారణ జరపాలని టీటీడీ పాలక మండలి సభ్యులు కన్నయ్య, శివప్రసాద్‌లు టీటీడీ చైర్మన్ కనుమూరి బాపిరాజును డిమాండ్ చేశారు. శ్రీవారి ప్రసాదం తయారీలో వినియోగించే నెయ్యి కొనుగోలు విధానంలో పారదర్శకత లేదని వారు ఆరోపించారు. ప్రసాదానికి అవసరమైన ముడి సరుకుల కొనుగోలు విషయంలో గతంలో టీటీడీ విధించిన నిబంధనలు మార్పు చేయాల్సిన అవశ్యకత ఉందని కన్నయ్య, శివప్రసాద్‌లు పేర్కొన్నారు.